న్యూనల్లకుంట పరిధిలోని బాయమ్మ గల్లీ ఆర్చి వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న విజయ్ కుమార్ రెడ్డి అనే పాతనేరస్తుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 3.6 తులాల బంగారు, 12.7 తులాల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. గతంలో ఇతను 15 కేసుల్లో నేరస్తుడిగా ఉన్నాడు. ఈయన స్వస్థలం మహబూబ్‌నగర్ జిల్లా కాగా..ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లి మండలం దుర్గానగర్‌లో ఉంటున్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
నల్లకుంటలో పాతనేరస్తుడి అరెస్ట్
Published Tue, Apr 19 2016 1:04 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement