సాక్షి, అమరావతి: వైఎస్సార్ లైఫ్ టైమ్, వైఎస్సార్ అచీవ్‌మెంట్ 2023 పురస్కారాలకు దరఖాస్తుల గడువు ఈ నెల 31తో ముగియనున్నట్లు ఐ అండ్ పీఆర్ కమిషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి శుక్రవారం తెలిపారు. కేంద్ర ప్రభుత్వ అత్యున్నత పురస్కారాల తరహాలోనే ప్రజా సేవలో విశిష్ట సేవలను అందించి ప్రతిభ కనబరిచిన వ్యక్తులు, సంస్థలను రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ లైఫ్ టైమ్, వైఎస్సార్ అచీవ్‌మెంట్ అవార్డులతో సత్కరిస్తుందని చెప్పారు.
దరఖాస్తుదారులు తమ విజయాలు, సేవలపై ఒక పేజీకి మించకుండా సమాచారాన్ని ఇవ్వడంతో పాటు ఫోన్ నంబర్, ఈ–మెయిల్, చిరునామాలను పొందుపరచాలన్నారు. దరఖాస్తులను సంబంధిత విభాగాలతో పాటు, secy& political@ ap.gov. in మెయిల్‌కు పంపాలన్నారు.
ప్రజా సేవలో విశిష్ట సేవలతోపాటు కళలు, సామాజిక సేవ, పబ్లిక్ అఫైర్స్, సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ, మెడిసిన్, లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్, సివిల్ సర్వీస్, స్పోర్ట్స్, తదితర రంగాల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించిన వ్యక్తులు, గ్రామాల్లో, మురికివాడల్లో పనిచేస్తూ సరైన గుర్తింపు పొందని రాష్ట్రానికి చెందిన వ్యక్తుల్లో పొలిటికల్ ఎన్జీవోలు, స్వచ్ఛంద సేవా సంస్థలు, చరిత్రలో పేరొందిన సంస్థలు, సంఘాలు దరఖాస్తుకు అర్హులని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment