YSR achievement Award
-
తప్పెటగుళ్లు కళాకారుడు కోన సన్యాసిగారికి వైఎస్ఆర్ జీవిత సాఫల్య పురస్కారం
-
నేడు వైఎస్సార్ అవార్డుల ప్రదానోత్సవం
-
రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ వేడుకలు
సాక్షి, అమరావతి: రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ వేడుకలు జరగనున్నాయి. ఉదయం 10:15 గంటలకు క్యాంప్ ఆఫీస్‌లో జరిగే అవతరణ వేడుకల్లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొననున్నారు. పోలీసుల గౌరవ వందనం అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. తెలుగుతల్లి, అమరజీవి పొట్టి శ్రీరాములకు నివాళులర్పించనున్నారు. రేపు (బుధవారం) వైఎస్ఆర్ ఎచీవ్మెంట్ అవార్డుల ప్రదానం జరగనుంది. అవార్డల ప్రదాన కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం జగన్ పాల్గొననున్నారు. ఏ కన్వెన్షన్ సెంటర్లో వైఎస్ఆర్ ఎచీమ్మెంట్ లైఫ్‌టైం ఎచీవ్మెంట్ అవార్డులను గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రదానం చేయనున్నారు. ఇదీ చదవండి: చికిత్స తర్వాత చంద్రబాబు జైలుకెళ్లాల్సిందే: సజ్జల -
వైఎస్సార్ అచీవ్మెంట్ అవార్డుల ప్రకటన.. పురస్కార గ్రహీతలు వీరే..
సాక్షి, అమరావతి: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు మీద అందిస్తున్న వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్, వైఎస్సార్ అచీవ్ మెంట్ అవార్డు గ్రహీతల జాబితాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఏపీ ప్రభుత్వ కమ్యూనికేషన్స్ అడ్వైజర్ జీవీడి. కృష్ణమోహన్, ఇతర అవార్డు కమిటీ సభ్యులతో కలిసి అవార్డుకు ఎంపికైన వారి జాబితాను వెల్లడించారు. సామాన్యుల్లో అసామాన్యులకు, పలు రంగాల్లో సమాజానికి విశిష్ట సేవలందించి తమదైన ముద్రవేసిన వారికి ఈ అవార్డుల్ని అందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా నవంబర్ 1వ తేదీన అవార్డు గ్రహీతలకు ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు. ఈ అవార్డుల్ని అందించడం ఇది వరుసగా మూడో ఏడాది. 2023లో వైఎస్సార్ లైఫ్‌టైం ఎచీవ్మెంట్, ఎచీవ్మెంట్ అవార్డులకు ఎంపికయిన వారి జాబితా: వ్యవసాయం: 1)పంగి వినీత– (ఎచీవ్మెంట్ అవార్డు) 2వై.వి.మల్లారెడ్డి– అనంతపురం ఆర్ట్ అండ్ కల్చర్: 1) యడ్ల గోపాలరావు-రంగస్థల కళాకారుడు-శ్రీకాకుళం 2) తలిసెట్టి మోహన్– కలంకారీ– తిరుపతి 3) కోట సచ్చిదానంద శాస్త్రి– హరికథ– బాపట్ల 4) కోన సన్యాసి– తప్పెటగుళ్ళు– శ్రీకాకుళం జిల్లా 5) ఉప్పాడ హ్యాండ్ లూమ్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ– కాకినాడ 6) ఎస్.వి.రామారావు– చిత్రకారుడు– కృష్ణా 7)బాల సరస్వతి– నేపథ్య గాయని– నెల్లూరు 8)తల్లావఝుల శివాజీ– చిత్రకారుడు, రచయిత, పాత్రికేయుడు– ప్రకాశం 9)చింగిచెర్ల కృష్ణారెడ్డి– జానపద కళలు– అనంతపురం 10)కలీసాహెబీ మహబూబ్– షేక్ మహబూబ్ సుబానీ దంపతులకు– నాదస్వరం– ప్రకాశం తెలుగు భాష– సాహిత్యం: 1) ప్రొఫెసర్ బేతవోలు రామబ్రహ్మం– పశ్చిమ గోదావరి 2) ఖదీర్ బాబు– నెల్లూరు– (ఎచీవ్మెంట్ అవార్డు) 3) మహెజబీన్– నెల్లూరు (ఎచీవ్మెంట్ అవార్డు) 4) నామిని సుబ్రహ్మణ్యం నాయుడు– చిత్తూరు 5) అట్టాడ అప్పలనాయుడు– శ్రీకాకుళం క్రీడలు: 1) పుల్లెల గోపీచంద్– గుంటూరు 2) కరణం మల్లీశ్వరి– శ్రీకాకుళం వైద్యం: 1) ఇండ్ల రామ సుబ్బారెడ్డి–మానసిక వైద్యం– ఎన్టీఆర్ 2) ఈసీ వినయ్‌కుమార్‌రెడ్డి–ఈఎన్టీ– కాక్లియర్ ఇంప్లాంట్స్– వైయస్సార్ మీడియా: 1) గోవిందరాజు చక్రధర్– కృష్ణా 2) హెచ్చార్కే– కర్నూలు సమాజ సేవ: 1)బెజవాడ విల్సన్– ఎన్టీఆర్ 2) శ్యాం మోహన్– అంబేద్కర్ కోనసీమ– (ఎచీవ్మెంట్) 3) నిర్మల హృదయ్ భవన్– ఎన్టీఆర్ 4)జి. సమరం– ఎన్టీఆర్ చదవండి: రామోజీ వ్యాపారాల వెనక ఏం జరుగుతోంది? -
రేపు వైఎస్సార్ అవార్డు గ్రహీతల జాబితా ప్రకటన
సాక్షి, విజయవాడ: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు మీద అందిస్తున్న వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్, వైఎస్సార్ అచీవ్ మెంట్ అవార్డు గ్రహీతల జాబితా 19వ తేదీన ప్రకటించనున్నారు. ఈ విషయాన్ని సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సామాన్యుల్లో అసామాన్యులకు, పలు రంగాల్లో సమాజానికి విశిష్ట సేవలందించి తమదైన ముద్రవేసిన వారికి ఈ అవార్డుల్ని అందిస్తున్నారు. కమ్యూనికేషన్స్ అడ్వైజర్ జీవీడి. కృష్ణమోహన్, ఇతర అవార్డు కమిటీ సభ్యులతో కలిసి అవార్డుకు ఎంపికైన వారి జాబితాను రేపు(గురువారం) సాయంత్రం ప్రకటిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా నవంబర్ 1వ తేదీన అవార్డు గ్రహీతలకు ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు. ఈ అవార్డుల్ని అందించడం ఇది వరుసగా మూడో ఏడాది. వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు క్రింద గ్రహీతలకు రూ.10 లక్షల నగదు పురస్కారంతో పాటు వైఎస్సార్ కాంస్య ప్రతిమ, జ్ఞాపిక, ప్రశంసాపత్రం అందజేస్తారు. వైఎస్సార్ అచీవ్ మెంట్ అవార్డు క్రింద రూ.5 లక్షల నగదు పురస్కారంతో పాటు జ్ఞాపిక, ప్రశంసాపత్రం అందజేస్తారు. -
31 వరకు వైఎస్సార్ అవార్డులకు దరఖాస్తుల స్వీకరణ
సాక్షి, అమరావతి: వైఎస్సార్ లైఫ్ టైమ్, వైఎస్సార్ అచీవ్మెంట్ 2023 పురస్కారాలకు దరఖాస్తుల గడువు ఈ నెల 31తో ముగియనున్నట్లు ఐ అండ్ పీఆర్ కమిషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి శుక్రవారం తెలిపారు. కేంద్ర ప్రభుత్వ అత్యున్నత పురస్కారాల తరహాలోనే ప్రజా సేవలో విశిష్ట సేవలను అందించి ప్రతిభ కనబరిచిన వ్యక్తులు, సంస్థలను రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ లైఫ్ టైమ్, వైఎస్సార్ అచీవ్మెంట్ అవార్డులతో సత్కరిస్తుందని చెప్పారు. దరఖాస్తుదారులు తమ విజయాలు, సేవలపై ఒక పేజీకి మించకుండా సమాచారాన్ని ఇవ్వడంతో పాటు ఫోన్ నంబర్, ఈ–మెయిల్, చిరునామాలను పొందుపరచాలన్నారు. దరఖాస్తులను సంబంధిత విభాగాలతో పాటు, secy& political@ ap.gov. in మెయిల్‌కు పంపాలన్నారు. ప్రజా సేవలో విశిష్ట సేవలతోపాటు కళలు, సామాజిక సేవ, పబ్లిక్ అఫైర్స్, సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ, మెడిసిన్, లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్, సివిల్ సర్వీస్, స్పోర్ట్స్, తదితర రంగాల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించిన వ్యక్తులు, గ్రామాల్లో, మురికివాడల్లో పనిచేస్తూ సరైన గుర్తింపు పొందని రాష్ట్రానికి చెందిన వ్యక్తుల్లో పొలిటికల్ ఎన్జీవోలు, స్వచ్ఛంద సేవా సంస్థలు, చరిత్రలో పేరొందిన సంస్థలు, సంఘాలు దరఖాస్తుకు అర్హులని వివరించారు. -
YSR Awards 2022: మహోన్నత గౌరవం
దశాబ్దాలుగా మన సంస్కృతి, సాంప్రదాయాలకు వారధులుగా నిలుస్తున్న వారిని ఈ అవార్డులతో సత్కరిస్తున్నాం. సమాజం కోసం శ్రమించిన మానవతామూర్తులు, మహనీయులను రాష్ట్ర అత్యున్నత అవార్డులతో సత్కరించుకోవడం సంతోషంగా ఉంది. సామాన్యుల్లోని అసామాన్యులకు, మానవతామూర్తుల సేవలకు వందనంగా ‘వైఎస్సార్’ అవార్డులు నిలుస్తాయి. అత్యంత ప్రతిష్టాత్మకమైన వైఎస్సార్ అవార్డులు అందుకుంటున్న ప్రతి ఒక్కరికీ హృదయ పూర్వకంగా అభినందనలు. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: సమాజంలో మానవత్వపు పరిమళాలు, ఎల్లలు దాటిన కీర్తి పతాకాలు పురస్కారాల పండుగలో పులకించాయి. నిలువెత్తు వ్యక్తిత్వం, మహోన్నత కీర్తి శిఖరం ‘వైఎస్సార్’ పురస్కారాలతో సగౌరవంగా సత్కరించి ప్రభుత్వం తన వినమ్రత చాటుకుంది. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన మానవతామూర్తులు, విశిష్ట వ్యక్తులను వరుసగా రెండో ఏడాది రాష్ట్ర అత్యున్నత పురస్కారం ‘‘వైఎస్సార్’’ అవార్డులతో ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. వ్యక్తులుగా, సంస్థలుగా సమాజంలో గొప్ప పనులు చేస్తున్న ప్రతి ఒక్కరినీ గౌరవించేలా రాష్ట్ర ప్రభుత్వం ఈ అవార్డులను నెలకొల్పింది. వైఎస్సార్ జీవిత సాఫల్య, వైఎస్సార్ సాఫల్య పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని మంగళవారం విజయవాడలో నిర్వహించారు. తొలుత అమరజీవి పొట్టి శ్రీరాములు, దివంగత వైఎస్సార్ విగ్రహాలకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, సీఎం వైఎస్ జగన్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం 2022 సంవత్సరానికి గానూ వ్యవసాయం, కళలు–సంస్కృతి, సాహిత్యం, మహిళా – శిశు సాధికారత, విద్య, జర్నలిజం, వైద్యం, పరిశ్రమల రంగాల్లో విశేష కృషి చేసిన వ్యక్తులు, సంస్థలకు మొత్తం 30 అవార్డులను గవర్నర్, ముఖ్యమంత్రి ప్రదానం చేశారు. వీటిల్లో 20 వైఎస్సార్ జీవిత సాఫల్య, 10 వైఎస్సార్ సాఫల్య పురస్కారాలున్నాయి. ఈ కార్యక్రమానికి ఆత్మీయ అతిథిగా వైఎస్ విజయమ్మ హాజరయ్యారు. వైఎస్సార్ అవార్డులను నెలకొల్పడం వెనుక ప్రభుత్వ ఉద్దేశం, అవార్డు గ్రహీతల గొప్పతనాన్ని వివరించారు. వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్, వైఎస్సార్ అచీవ్మెంట్ అవార్డులు అందుకున్న వారితో గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, సీఎం మాతృమూర్తి వైఎస్ విజయమ్మ పురస్కారం సాధించిన ‘దిశ’ వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారికి వైఎస్సార్ అవార్డులను ప్రదానం చేశారు. వ్యవసాయంలో 5, కళలు– సంస్కృతిలో 5, సాహిత్యంలో 3, మహిళా, శిశు సాధికారతలో 3, విద్యలో 4, జర్నలిజంలో 4, వైద్యంలో 5 అవార్డులు, పరిశ్రమల విభాగంలో ఒక అవార్డును అందజేశారు. వైఎస్సార్ జీవిత సాఫల్య అవార్డు కింద రూ.10 లక్షల నగదు, వైఎస్సార్ సాఫల్య అవార్డు కింద రూ.5 లక్షల నగదుతో పాటు వైఎస్సార్ కాంస్య విగ్రహం, జ్ఞాపిక, ప్రశంసా పత్రాలతో సత్కరించారు. కళలు, సంస్కృతి రంగంలో కళాతపస్వి కె.విశ్వనాథ్ తరఫున వైఎస్సార్ జీవిత సాఫల్య పురస్కారాన్ని ఆయన తనయుడు కాశీనాథుని నాగేంద్రనాథ్ అందుకోగా వైద్య రంగంలో ప్రతాప్ సి.రెడ్డి తరఫున వైఎస్సార్ జీవిత సాఫల్య పురస్కారాన్ని ఆయన కుమార్తె సంగీతారెడ్డి స్వీకరించారు. వ్యవసాయంలో వైఎస్సార్ సాఫల్య పురస్కారాన్ని కట్టమంచి బాలకృష్ణారెడ్డి తరఫున ఆయన కుటుంబ సభ్యులు అందుకున్నారు. ముఖ్యమంత్రి మానస పుత్రిక ‘దిశ’ ద్వారా మహిళా రక్షణకు కృషి చేసిన ఐదుగురు పోలీసులకు ఉమ్మడిగా అవార్డులను బహూకరించారు. హాజరైన మంత్రులు, ప్రజా ప్రతినిధులు కార్యక్రమంలో శాసనమండలి డిప్యూటీ చైర్పర్సన్ జకియా ఖానమ్, హోంమంత్రి తానేటి వనిత, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్కే రోజా, తెలుగు, సంస్కృత అకాడమీ చైర్పర్సన్ నందమూరి లక్ష్మీ పార్వతి, జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి, ప్రభుత్వ కార్యక్రమాల కన్వీనర్ తలశిల రఘురాం, ప్రభుత్వ సలహాదారు (కమ్యూనికేషన్స్), వైఎస్సార్ అవార్డుల కమిటీ కన్వీనర్ జీవీడీ కృష్ణ మోహన్, మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ, ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ, సాధారణ పరిపాలన (రాజకీయ) కార్యదర్శి రేవు ముత్యాలరాజు, డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి, ఐ అండ్ పీఆర్ కమిషనర్ విజయ్‌కుమార్‌రెడ్డి, పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. మన కీర్తికి సత్కారం: సీఎం జగన్ దశాబ్దాలుగా మన సంస్కృతి, సాంప్రదాయాలకు వారధులుగా నిలుస్తున్న వారిని ఈ అవార్డులతో సత్కరిస్తున్నాం. సమాజం కోసం శ్రమించిన మానవతామూర్తులు, మహనీయులను రాష్ట్ర అత్యున్నత అవార్డులతో సత్కరించుకోవడం సంతోషంగా ఉంది. సామాన్యుల్లోని అసామాన్యులకు, మానవతామూర్తుల సేవలకు వందనంగా ‘వైఎస్సార్’ అవార్డులు నిలుస్తాయి. తమ శ్రమ, స్వేదంతో రాష్ట్ర చరిత్రను గొప్పగా లిఖిస్తున్న రైతన్నలను ఎక్కడా లేనివిధంగా ప్రతిష్టాత్మక ‘వైఎస్సార్’ అవార్డులతో ప్రభుత్వం సత్కరిస్తోంది. మహిళా రక్షణకు నిరంతరం పాటుపడే రక్షణ సారథులను, వెనుకబాటు, అణచివేత, పెత్తందారీ పోకడలపై ఎలుగెత్తిన సామాజిక ఉద్యమకారులను సవినయంగా గౌరవించుకుంటున్నాం. భిన్న కలాలు, గళాలు, పాత్రికేయులు, మన గడ్డపై పుట్టి వైద్య ఆరోగ్య రంగంలో ప్రపంచ కీర్తి గడించిన మహామహులు, అంతర్జాతీయంగా పేరొందిన మన పారిశ్రామిక దిగ్గజాలకు అవార్డులను అందజేస్తున్నాం. వైఎస్సార్ ఆచరించిన విధానాల స్ఫూర్తితో.. వ్యక్తులుగా, సంస్థలుగా సమాజంలో గొప్ప పనులు చేస్తున్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం తోడుగా నిలుస్తుంది. అందుకు సంకేతంగానే ఏటా నాన్న (దివంగత వైఎస్సార్) పేరుతో ఈ అవార్డులను అందజేస్తున్నాం. ముఖ్యమంత్రిగా ఉన్న 5.3 ఏళ్ల స్వల్ప కాలంలోనే వైఎస్సార్ ఆచరించి చూపిన రైతు, మహిళా, నిరుపేద పక్షపాత విధానాలు, సామాజిక, ప్రాంతీయ న్యాయం, వైద్య రంగంలో తెచ్చిన విప్లవాత్మక మార్పులు, మనదైన తెలుగుతనం, మన కళలు, సాంప్రదాయాలు, శ్రమ, పరిశ్రమకు నిదర్శనంగా ఈ అవార్డులు ప్రదానం చేస్తున్నాం. ఈ రోజు అత్యంత ప్రతిష్టాత్మకమైన వైఎస్సార్ అవార్డులు అందుకుంటున్న ప్రతి ఒక్కరికీ హృదయ పూర్వకంగా అభినందనలు తెలియచేస్తున్నా. మహోన్నత వ్యక్తి వైఎస్సార్: గవర్నర్ సామాజిక సేవా స్ఫూర్తితో వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వారిని రాష్ట్ర ప్రభుత్వం ‘వైఎస్సార్’ అవార్డులతో సత్కరించడం సంతోషంగా ఉందని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి గొప్ప ప్రజానాయకుడని కొనియాడారు. పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలు, వారి సమస్యలను దగ్గరగా చూసి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే పలు ప్రజా సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో తెచ్చిన విప్లవాత్మక మార్పులతో ప్రజల గుండెల్లో వైఎస్సార్ చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. అంతటి మహోన్నత వ్యక్తి వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేలా అవార్డులతో గౌరవించడం సముచితంగా ఉందన్నారు. రాష్ట్రం గొప్ప కళలు, సంస్కృతి, ఆధ్యాత్మికతకు నిలయంగా వెలుగొందుతోందన్నారు. ఎందరో మహనీయుల త్యాగఫలాలతో ఏర్పడిన రాష్ట్రంలో సామాజిక స్పృహతో నిరంతరం సేవలందిస్తూ మన ఖ్యాతిని చాటిన వారిని అవార్డులకు ఎంపిక చేయడం మంచి సాంప్రదాయానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. వైఎస్సార్ బాటలోనే ఆయన తనయుడు సీఎం జగన్ రాష్ట్రాన్ని దేశంలోనే అభివృద్ధికి చిరునామాగా నిలిపేందుకు కృషి చేస్తున్నారని ప్రశంసించారు. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి రంగాలవారీగా అవార్డులు ప్రదానం ఇలా.. వ్యవసాయం (అందరికీ వైఎస్సార్ అఛీవ్మెంట్ అవార్డులు 1) ఆదివాసీ క్యాష్యూనట్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ – సోడెం ముక్కయ్య – బుట్టాయగూడెం, ఏలూరు జిల్లా 2) కుశలవ కోకోనట్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీ – ఎ.గోపాలకృష్ణ, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా 3) అన్నమయ్య మ్యూచువల్లీ ఎయిడెడ్ కో–ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ – జయబ్బనాయుడు, తలుపల గ్రామం, పీలేరు మండలం, అన్నమయ్య జిల్లా 4) అమృతఫల ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ, –కె.ఎల్.ఎన్.మౌక్తిక, సబ్బవరం, అనకాపల్లి జిల్లా 5) కట్టమంచి బాలకృష్ణారెడ్డి, కట్టమంచి గ్రామం, చిత్తూరు జిల్లా కళలు–సంస్కృతి 1) కళాతపస్వి కె.విశ్వనాథ్, సినీ దర్శకుడు (లైఫ్ టైం) 2) ఆర్.నారాయణమూర్తి, సినీ నటుడు, దర్శకుడు (లైఫ్ టైం) 3) సుప్రసిద్ధ రంగస్థల కళాకారుడు నాయుడు గోపీ (అచీవ్మెంట్) 4) పెడన కలంకారీ నేతన్న పిచుక శ్రీనివాస్ (అచీవ్మెంట్) 5) దేశవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన ఉదయగిరి ఉడెన్ కట్లరీ– షేక్ గౌసియా బేగం (అచీవ్మెంట్) సాహిత్య సేవ (అందరికీ లైఫ్ టైం అవార్డులు 1) విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ (మనోహర్ నాయుడు అవార్డు అందుకున్నారు) 2) ఎమెస్కో పబ్లిషింగ్ హౌస్ – సంస్థ సీఈవో విజయకుమార్ అవార్డును అందుకున్నారు 3) రాయలసీమ ప్రసిద్ధ రచయిత డాక్టర్ శాంతి నారాయణ మహిళా సాధికారత–రక్షణ 1) ప్రజ్వల ఫౌండేషన్– సునీతా కృష్ణ్ణణ్ (లైఫ్ టైం) 2) శిరీషా రిహేబిలిటేషన్ సెంటర్, ఉయ్యూరు – ఎం.సోమేశ్వరరావు అవార్డును అందుకున్నారు (లైఫ్ టైం) 3) దిశ పోలీసింగ్– రవాడ జయంతి, ఎస్వీవీ లక్ష్మీనారాయణ, రాయుడు సుబ్రహ్మణ్యం, హజరత్తయ్య, పి.శ్రీనివాసులు (ఉమ్మడిగా వైఎస్సార్ అచీవ్మెంట్ అవార్డు) విద్యా రంగం 1) మదనపల్లి – రిషీ వ్యాలీ విద్యా సంస్థ – అనంత జ్యోతి అవార్డును అందుకున్నారు (లైఫ్ టైం) 2) కావలి– జవహర్ భారతి విద్యా సంస్థ– వినయ్‌కుమార్‌రెడ్డి అవార్డును అందుకున్నారు (లైఫ్ టైం) 3) వ్యక్తిత్వ వికాస నిపుణుడు బి.వి.పట్టాభిరాం (లైఫ్ టైం) 4) బ్యాంకింగ్ రంగంలో వేలాది మందికి దారి చూపిన నంద్యాలకు చెందిన దస్తగిరిరెడ్డి (అచీవ్మెంట్) జర్నలిజం (అందరికీ లైఫ్‌టైం అచీవ్మెంట్ 1) భండారు శ్రీనివాసరావు 2) సతీష్ చందర్ 3) మంగు రాజగోపాల్ 4) ఎంఈవీ ప్రసాదరెడ్డి వైద్య రంగం (అందరికీ లైఫ్ టైం అచీవ్మెంట్ 1) డాక్టర్ బి.నాగేశ్వరరెడ్డి, ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ 2) డాక్టర్ వరప్రసాదరెడ్డి, శాంతా బయోటెక్ (హెపటైటిస్–బి వ్యాక్సిన్) 3) భారత్ బయోటెక్ డాక్టర్ కృష్ణా ఎల్లా, సుచిత్ర ఎల్లా (కోవ్యాగ్జిన్) (కృష్ణా ఎల్లా అవార్డు అందుకున్నారు) 4) అపోలో హాస్పిటల్స్ వ్యవస్థాపకుడు, చైర్మన్ ప్రతాప్ సి.రెడ్డి (ఆయన తరఫున కుమార్తె సంగీతా అవార్డు అందుకున్నారు) 5) ఎల్.వి.ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్– గుళ్లపల్లి నాగేశ్వరరావు పారిశ్రామిక రంగం అంతర్జాతీయ పారిశ్రామిక వేత్త గ్రంథి మల్లికార్జునరావు (లైఫ్ టైం) -
హస్తకళా వైభవం.. చెక్క కళ భళా!
ఉదయగిరి(పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా): రాచరిక సామ్రాజ్య కేంద్రంగా విరాజిల్లిన ఉదయగిరిలో ఇప్పుడు ఆ ప్రాభవ వైభవం కనిపించకపోయినా హస్తకళా వైభవానికి కొదువ లేదు. చెక్కపై చెక్కిన కళాత్మక వస్తువులు తయారు చేస్తున్న ఆరు దశాబ్దాల చరిత్ర ఉంది. ఉదయగిరి దిలావర్‌భాయి వీధిలోని హస్తకళల అభివృద్ధి కేంద్రంగా తయారయ్యే వస్తువులకు ఖండాంతర ఖ్యాతి ఉంది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత హస్తకళ రంగ అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తోంది. 150 కుటుంబాలకు జీవనోపాధి చెక్క నగిషీ వస్తువుల తయారీ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక తోడ్పాటునందిస్తుండడంతో ప్రస్తుతం 150 కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నాయి. వందేళ్లకు పూర్వం ఒకట్రెండు కుటుంబాలు ఈ కళారంగాన్ని నమ్ముకుని జీవనాన్ని సాగించాయి. ఉదయగిరి హస్తకళల కేంద్రంతో తయారయ్యే వివిధ రకాల వస్తువులకు ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా మంచి గుర్తింపు పొందింది. 2020 ఫిబ్రవరిలో ఢిల్లీలో జరిగిన చేతివృత్తుల ఎగ్జిబిషన్లో ఉదయగిరి కళాకారులు ఏర్పాటు చేసిన స్టాల్‌ను ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాటు పలువురు ప్రముఖులు సందర్శించి అబ్బురపడి ప్రశంసలు అందించారు. కళకు ప్రాణం పోసిన అబ్దుల్‌బషీర్ తమ పూర్వీకుల నుంచి నేర్చుకున్న షేక్ అబ్దుల్‌బషీర్ తన 24వ ఏట ఈ వృత్తిలోకి ప్రవేశించి వివిధ రకాల వస్తువులను తయారు చేయం ప్రారంభించారు. దీనిపై ఇతరులు పెద్దగా ఎవరూ ఆసక్తి చూపకపోవడంతో తన ఇద్దరు కుమార్తెలు గౌసియాబేగం, ఫాయిదాలకు నేర్పించారు. 2003లో 15 మంది సభ్యులు సంఘంగా ఏర్పడి చైతన్యజ్యోతి వెల్ఫేర్ సొసైటీ ద్వారా ఉడెన్ కట్టరీ ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించారు. దీనికి హ్యాండ్‌క్రాఫ్ట్స్ మినిస్టరీ ఆఫ్ టెక్స్టైల్స్ ఆర్థిక సాయం అందించారు. ప్రశంసల జల్లులు ఈ కళకు ఊపిరిపోసిన అబ్దుల్బషీర్కు లేపాక్షి, హస్తకళల అభివృద్ధి సంస్థ హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రశంసా పత్రంతో పాటు బహుమతులు అందజేశారు. ఆయన కూతురు షేక్ గౌసియాబేగంకు కూడా ఇదే సంస్థ ఆమె ప్రతిభను గుర్తించి వివిధ బహుమతులు అందించారు. తాజాగా కేంద్రం నిర్వాహకురాలు షేక్ గౌసియాబేగంకు రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ అచీవ్మెంట్ అవార్డు లభించింది. మైనార్టీ కార్పొరేషన్ ద్వారా నూతన భవనం నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.20 లక్షల నిధులు మంజూరు చేసింది. 200 రకాలు పైగా వస్తువుల తయారీ ఉదయగిరి దుర్గం, కొండ ప్రాంతాల్లో లభించే లద్ది, బిల్లనద్ది, కలువ, బిక్కి, దేవదారు తదితర అటవీ కర్రను ఉపయోగించి ఈ వస్తువులు తయారు చేస్తారు. ఈ కొయ్య ద్వారా స్పూన్లు, ఫోర్కులు, అట్లకర్ర, గరిటెలు, డైనింగ్ టేబుల్స్, ఫొటో ఫ్రేమ్స్, పిల్లలు ఆడుకునే వివిధ రకాల వస్తువులు, వివిధ వస్తువులు నిల్వ చేసుకునేందుకు ఉపయోగించే ట్రేలు, చిన్న గిన్నెలు, ప్లేట్లు, దువ్వెనలు తదితర 200 రకాల వస్తువులు తయారు చేస్తున్నారు. ఈ వృత్తిలో ముస్లిం మహిళలే అత్యధికంగా ఉండడంతో ప్రస్తుతం ఉన్న కేంద్రం ప్రాంగణంలోనే కొత్త భవనం ఏర్పాటు చేసి ఆధునిక మెషిన్లు సమకూర్చాలి. తద్వారా ఎక్కువ మంది ఈ వృత్తిలోకి ప్రవేశించి తమ ఆదాయం పెంచుకునే వీలుంటుంది. – షేక్ గౌసియా బేగం -
ఆదివాసీ రైతు.. అభివృద్ధి పథంలో సాగుతూ..
బుట్టాయగూడెం(ఏలూరు జిల్లా): పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజన రైతులు ఎటువంటి రసాయనాలను వినియోగించకుండా ఆరోగ్యవంతమైన పంటలు పండించేలా కృషి చేస్తున్న ఆదివాసీ జీడిమామిడి రైతు ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్ సీఈఓ సోడెం ముక్కయ్యను వైఎస్సార్ అచీవ్మెంట్ పురస్కారం వరించింది. గిట్టుబాటు ధరతో పాటు నేరుగా పంటలను విక్రయించుకునేలా రైతులకు తోడ్పాటునందించేలా గురుగుమిల్లిలో 2019లో నాబార్డు సహకారంతో ఆయన ఆదివాసీ జీడిమామిడి రైతు ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్‌ను ఏర్పాటుచేశారు. అలాగే ఉద్యానశాఖ ఆధ్వర్యంలో ప్రపంచ బ్యాంక్ సహకారంతో ఆదివాసీ జీడిమామిడి ప్రాసెసింగ్ యూనిట్‌ను నెలకొల్పారు. ఆయా సంస్థల ద్వారా ఏటా లక్షలాది రూపాయల అమ్మకాలు చేస్తున్నారు. దీంతోపాటు 200 ఎకరాల్లో జీడిమామిడి పంటలను ప్రోత్సహించడంతోపాటు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తల ద్వారా రైతులు పంటలు పండించేలా ముక్క య్య కృషి చేస్తున్నారు. ప్రస్తుతం వీరి సంస్థలో 714 మందికి పైగా రైతులు పనిచేస్తున్నారు. వ్యవసా యాభివృద్ధి లక్ష్యంగా ఆయన పనిచేస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది గురుగుమిల్లి వంటి మారుమూల గ్రామంలో పనిచేస్తున్న నేను వైఎస్సార్ సాఫల్య పురస్కారానికి ఎంపిక కావడం చాలా ఆనందంగా ఉంది. ఈ గుర్తింపుతో మరింత బాధ్యత పెరిగింది. గిరిజన ప్రాంతంలో వ్యవసాయాభివృద్ధికి మరింత కృషి చేస్తా. – సోడెం ముక్కయ్య -
వైఎస్సార్ అవార్డులకు దరఖాస్తుల స్వీకరణ
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న ‘వైఎస్సార్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్, వైఎస్సార్ అచీవ్మెంట్–2022’ అత్యున్నత పురస్కారాల కోసం వివిధ రంగాలు, విభాగాల్లో విశిష్ట సేవలు అందించిన వ్యక్తులు లేదా సంస్థల నుంచి ఈ నెల 30 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అర్హత కలిగిన వ్యక్తులు, సంస్థలను ఎంపిక చేయడానికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి అధ్యక్షతన ఏర్పాటుచేసిన హైపవర్ స్క్రీనింగ్ కమిటీ శుక్రవారం విజయవాడలో సమావేశమైంది. ఈ కమిటీలో సభ్యులుగా ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్, ప్రభుత్వ సలహాదారు (కమ్యూనికేషన్స్) జీవీడి కృష్ణమోహన్, సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీలు రేవు ముత్యాలరాజు, అనూరాధ రాజారత్నం, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్, పౌర సరఫరాల శాఖ స్పెషల్ సెక్రటరీ, కమిషనర్ హెచ్.అరుణ్‌కుమార్, సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ తుమ్మా విజయ్‌కుమార్‌రెడ్డి, సాధారణ పరిపాలన శాఖ ఉప కార్యదర్శి బాలసుబ్రహ్మణ్యంరెడ్డి ఉన్నారు. ఈ సందర్భంగా విజయ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ వివిధ రంగాలలో అసాధారణ నైపుణ్యాలు, ప్రతిభా పాటవాలు కలిగి సమాజాన్ని విశేషంగా ప్రభావితం చేసిన వ్యక్తులకు, సంస్థలకు అవార్డులు ఇవ్వనున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత భారతరత్న, పద్మశ్రీ తదితర పురస్కారాల తరహాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పురస్కారాలను అందిస్తోందన్నారు. అవార్డు ఎంపిక కోసం విద్య, వైద్య, వ్యవసాయ, మహిళాభ్యు దయం, సామాజిక న్యాయం, దేశ–విదేశాల్లో గుర్తింపు పొందిన సామాజిక, సాహిత్య, సాంస్కృతిక తదితర రంగాల్లో రాణిస్తున్న వ్యక్తులు, సంస్థల నుంచి∙దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని, వారి బయోడేటాను secy&political@ap.gov.in కు మెయిల్ చేయాలని తెలిపారు. గతేడాది 59 మందిని సత్కరించినట్లు గుర్తుచేశారు. ఇక వైఎస్సార్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ కింద రూ.10 లక్షల నగదు, వైఎస్సార్ కాంస్య విగ్రహం, జ్ఞాపిక, ప్రశంసాపత్రం ఇస్తారన్నారు. వైఎస్సార్ అచీవ్మెంట్ అవార్డు కింద రూ.5 లక్షల నగదు, జ్ఞాపిక, ప్రశంసాపత్రాన్ని అందిస్తారని తెలిపారు.