వైఎస్సార్‌ అచీవ్‌మెంట్‌ అవార్డుల ప్రకటన.. పురస్కార గ్రహీతలు వీరే.. | Ysr Lifetime Achievement Awards 2023 List Announced | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ అచీవ్‌మెంట్‌ అవార్డుల ప్రకటన.. పురస్కార గ్రహీతలు వీరే..

Published Thu, Oct 19 2023 3:29 PM | Last Updated on Thu, Oct 19 2023 3:52 PM

Ysr Lifetime Achievement Awards 2023 List Announced - Sakshi

సాక్షి, అమరావతి: దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి పేరు మీద అందిస్తున్న వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్, వైఎస్సార్ అచీవ్ మెంట్ అవార్డు గ్రహీతల జాబితాను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించింది. ఏపీ ప్రభుత్వ కమ్యూనికేషన్స్ అడ్వైజర్ జీవీడి. కృష్ణమోహన్,  ఇతర అవార్డు కమిటీ సభ్యులతో కలిసి అవార్డుకు ఎంపికైన వారి జాబితాను వెల్లడించారు.

సామాన్యుల్లో అసామాన్యులకు, పలు రంగాల్లో సమాజానికి విశిష్ట సేవలందించి తమదైన ముద్రవేసిన వారికి ఈ అవార్డుల్ని అందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా నవంబర్ 1వ తేదీన అవార్డు గ్రహీతలకు ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు. ఈ అవార్డుల్ని అందించడం ఇది వరుసగా మూడో ఏడాది.

2023లో వైఎస్సార్‌ లైఫ్‌టైం ఎచీవ్‌మెంట్, ఎచీవ్‌మెంట్‌ అవార్డులకు ఎంపికయిన వారి జాబితా:

వ్యవసాయం:
1)పంగి వినీత– (ఎచీవ్‌మెంట్‌ అవార్డు)
2వై.వి.మల్లారెడ్డి– అనంతపురం

ఆర్ట్‌ అండ్‌ కల్చర్‌:
1) యడ్ల గోపాలరావు-రంగస్థల కళాకారుడు-శ్రీకాకుళం
2) తలిసెట్టి మోహన్‌– కలంకారీ–  తిరుపతి
3) కోట సచ్చిదానంద శాస్త్రి– హరికథ– బాపట్ల
4) కోన సన్యాసి– తప్పెటగుళ్ళు– శ్రీకాకుళం జిల్లా
5) ఉప్పాడ హ్యాండ్‌ లూమ్‌ వీవర్స్‌ కోఆపరేటివ్‌ సొసైటీ– కాకినాడ
6) ఎస్‌.వి.రామారావు– చిత్రకారుడు– కృష్ణా 
7)బాల సరస్వతి– నేపథ్య గాయని– నెల్లూరు 
8)తల్లావఝుల శివాజీ– చిత్రకారుడు, రచయిత, పాత్రికేయుడు– ప్రకాశం
9)చింగిచెర్ల కృష్ణారెడ్డి– జానపద కళలు– అనంతపురం
10)కలీసాహెబీ మహబూబ్‌– షేక్‌ మహబూబ్‌ సుబానీ దంపతులకు– నాదస్వరం– ప్రకాశం

తెలుగు భాష– సాహిత్యం:
1) ప్రొఫెసర్‌ బేతవోలు రామబ్రహ్మం– పశ్చిమ గోదావరి
2) ఖదీర్‌ బాబు– నెల్లూరు– (ఎచీవ్‌మెంట్‌ అవార్డు)
3) మహెజబీన్‌– నెల్లూరు (ఎచీవ్‌మెంట్‌ అవార్డు)
4) నామిని సుబ్రహ్మణ్యం నాయుడు– చిత్తూరు
5) అట్టాడ అప్పలనాయుడు– శ్రీకాకుళం

క్రీడలు:
1) పుల్లెల గోపీచంద్‌– గుంటూరు
2) కరణం మల్లీశ్వరి– శ్రీకాకుళం

వైద్యం:
1)  ఇండ్ల రామ సుబ్బారెడ్డి–మానసిక వైద్యం– ఎన్టీఆర్‌ 
2) ఈసీ వినయ్‌కుమార్‌రెడ్డి–ఈఎన్‌టీ– కాక్లియర్‌ ఇంప్లాంట్స్‌– వైయస్సార్‌ 

మీడియా:
1) గోవిందరాజు చక్రధర్‌– కృష్ణా
2)  హెచ్చార్కే– కర్నూలు

సమాజ సేవ:
1)బెజవాడ విల్సన్‌– ఎన్టీఆర్‌
2) శ్యాం మోహన్‌– అంబేద్కర్‌ కోనసీమ– (ఎచీవ్‌మెంట్‌)
3) నిర్మల హృదయ్‌ భవన్‌– ఎన్టీఆర్‌
4)జి. సమరం– ఎన్టీఆర్‌

చదవండి: రామోజీ వ్యాపారాల వెనక ఏం జరుగుతోంది?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement