
సాక్షి, అమరావతి: రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ వేడుకలు జరగనున్నాయి. ఉదయం 10:15 గంటలకు క్యాంప్ ఆఫీస్‌లో జరిగే అవతరణ వేడుకల్లో సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పాల్గొననున్నారు. పోలీసుల గౌరవ వందనం అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. తెలుగుతల్లి, అమరజీవి పొట్టి శ్రీరాములకు నివాళులర్పించనున్నారు.
రేపు (బుధవారం) వైఎస్‌ఆర్ ఎచీవ్‌మెంట్ అవార్డుల ప్రదానం జరగనుంది. అవార్డల ప్రదాన కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం జగన్ పాల్గొననున్నారు. ఏ కన్వెన్షన్ సెంటర్‌లో వైఎస్ఆర్ ఎచీమ్‌మెంట్ లైఫ్‌టైం ఎచీవ్‌మెంట్ అవార్డులను గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రదానం చేయనున్నారు.
ఇదీ చదవండి: చికిత్స తర్వాత చంద్రబాబు జైలుకెళ్లాల్సిందే: సజ్జల