tomarrow
-
రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ వేడుకలు
సాక్షి, అమరావతి: రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ వేడుకలు జరగనున్నాయి. ఉదయం 10:15 గంటలకు క్యాంప్ ఆఫీస్‌లో జరిగే అవతరణ వేడుకల్లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొననున్నారు. పోలీసుల గౌరవ వందనం అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. తెలుగుతల్లి, అమరజీవి పొట్టి శ్రీరాములకు నివాళులర్పించనున్నారు. రేపు (బుధవారం) వైఎస్ఆర్ ఎచీవ్మెంట్ అవార్డుల ప్రదానం జరగనుంది. అవార్డల ప్రదాన కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం జగన్ పాల్గొననున్నారు. ఏ కన్వెన్షన్ సెంటర్లో వైఎస్ఆర్ ఎచీమ్మెంట్ లైఫ్‌టైం ఎచీవ్మెంట్ అవార్డులను గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రదానం చేయనున్నారు. ఇదీ చదవండి: చికిత్స తర్వాత చంద్రబాబు జైలుకెళ్లాల్సిందే: సజ్జల -
తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శనివారానికి వాయిదా పడ్డాయి. శుక్రవారం శీతాకాల అసెంబ్లీ సమావేశాల తొలిరోజున మిషన్ కాకతీయతో పాటు పెద్ద నోట్ల రద్దు తదనంతర పరిణామాలపై చర్చ జరిగింది. కేంద్రం పెద్ద నోట్లను రద్దు చేయడాన్ని స్వాగతిస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అన్నారు. పెద్ద నోట్ల రద్దు తదనంతర పరిణామాలపై చర్చించారు. నోట్ల రద్దు విషయం కేంద్ర ప్రభుత్వ పరిధిలోనిదని, అసెంబ్లీలో కేంద్రాన్ని, ప్రధానిని విమర్శించడం సరికాదని కేసీఆర్ పేర్కొన్నారు. ప్రజల ఇబ్బందుల గురించి చర్చిస్తే కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని, సామాన్యులు ఇబ్బందులు పడుతున్న మాట నిజమేనని కేసీఆర్ చెప్పారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత జానారెడ్డి మాట్లాడుతూ.. నగదు అందుబాటులో లేక పెళ్లిళ్లు ఆగిపోయానని చెప్పారు. కొత్త కరెన్సీని తీసుకురావడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. పెద్ద నోట్ల రద్దు తదనంతర పరిణామాలపై అసెంబ్లీలో జరిగిన చర్చలో జానారెడ్డి మాట్లాడుతూ.. నగదు అందుబాటులో లేక పెళ్లిళ్లు ఆగిపోయానని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం చిన్న నోట్లను ఎక్కువగా ముద్రించిన తర్వాత పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకుని ఉంటే బాగుండేదని, అనాలోచితంగా నిర్ణయం తీసుకుందని తప్పుపట్టారు. నగదు రహిత లావాదేవీల కోసం ప్రజలకు శిక్షణ ఇవ్వాలని జానారెడ్డి కోరారు. లక్ష్యసాధనకు తాము కూడా సహకరిస్తామని చెప్పారు. -
రేపటి నుంచి రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలు
13జిల్లాల నుంచి 300మంది క్రీడాకారుల రాక పోటీల నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు నెల్లూరు(బృందావనం) : నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో అక్టోబరు ఒకటి నుంచి మూడో తేదీ వరకు రాష్ట్రస్థాయి పురుషుల, స్త్రీల ఖోఖో పోటీలు జరుగుతాయని జిల్లా ఖోఖో అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్ జిలానీబాష, గురుప్రసాద్ తెలిపారు. స్టేడియంలోని ఖోఖో క్రీడాప్రాంగణంలో గురువారం రాత్రి ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వివరాలను తెలిపారు. పోటీలకు రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి 13 పురుషుల జట్లకు సంబంధించి 156 మంది, 13 మహిళల జట్లుకు సంబంధించి 156 మంది క్రీడాకారులు, వీరితో పాటు 50 మంది అధికారులు, 100 మంది పీఈటీలు, సిబ్బంది రానున్నారన్నారు. క్రీడాకారిణులకు స్థానిక డీకేడబ్ల్యూ ప్రభుత్వ కళాశాలలో, పురుషులకు కొండాయపాలెంరోడ్డులోని సెయింట్ ఇన్ఫాంట్æజీసస్ స్కూల్ ప్రాంగణంలో బస ఏర్పాటుచేశామన్నారు. మూడురోజులు జరిగే పోటీలకు హాజరయ్యే క్రీడాకారులకు భోజన, వసతి సదుపాయాలను ప్రముఖ కాంట్రాక్టర్, జిల్లా ఖోఖో సంఘం చీఫ్‌ప్యాట్రన్ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డికి చెందిన వీపీఆర్ ట్రస్ట్, హైదరాబాద్‌కు చెందిన వాటర్ ప్యూరిఫైర్ సంస్థ శ్రేష్ట సంస్థ సహకారంతో కల్పిస్తున్నామన్నారు. పోటీల్లో ప్రతిభచూపిన క్రీడాకారులతో రాష్ట్ర పురుషుల, మహిళల జట్లును ఎంపికచేస్తామన్నారు. ఎంపికైన క్రీడాకారులతో రాష్ట్ర జట్లు అక్టోబరు చివరివారంలో నాగపూర్‌లో జరిగే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటాయన్నారు. ఫ్లడ్‌లైట్ల వెలుగులో పోటీలు జరుగుతాయన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కోశాధికారి పసుపులేటి రామమూర్తి, జిల్లా పీఈటీ అసోసియేషన్ కార్యదర్శి సనత్‌కుమార్, పాల్గొన్నారు. -
రేపు తిరంగా యాత్ర
హన్మకొండ : అవస్యు ఆధ్వర్యంలో ఈనెల 16వ తేదీన హన్మకొండలో తిరంగాయాత్రను నిర్వహించనున్నట్లు అవస్యు వ్యవస్థాపకుడు జె.సుర్జీత్, సహ వ్యవస్థాపకురాలు కె.వసుధ తెలిపారు. హన్మకొండలోని ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. తిరంగా యాత్ర శుక్రవారం ఉదయం 9 గంటలకు హన్మకొండలోని వేయి స్తంభాల ఆలయం నుంచి కలెక్టరేట్ వరకు కొనసాగుతోందని చెప్పారు. భారత దేశానికి బ్రిటిష్ దాస్య శృంఖలాల నుంచి విముక్తి జరిగి 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం వస్తే, తెలంగాణ ప్రాంతానికి నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి జరిగి 1948 సెప్టెంబర్ 17వ తేదీన స్వాతంత్య్రం వచ్చిందన్నారు. నాటి పోరాటయోధులను గుర్తుకు తెచ్చుకుని రాబోయే తరానికి తెలియజేసేందుకే తిరంగా యాత్ర నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ర్యాలీని నెహ్రూ యువ సంఘట¯ŒS ఉపాధ్యక్షుడు పేరాల చంద్రశేఖర్‌రావు ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభిస్తారని తెలిపారు. -
రేపటి నుంచి సిరిసిల్ల వస్త్రం కొనుగోళ్లు
కోటి మీటర్ల వస్త్రానికి 18 లక్షలే ఉత్పత్తి టెస్కో వీసీఎండీ శైలజారామయ్యర్ సిరిసిల్ల : కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో ఉత్పత్తి అవుతున్న వస్త్రం నాణ్యత బాగుందని, ఆర్వీఎంకు వస్త్రం కొనుగోళ్లను శుక్రవారం నుంచి ప్రారంభిస్తామని రాష్ట్ర టెస్కో వైస్‌చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శైలజా రామయ్యర్ అన్నారు. బుధవారం ఆమె సిరిసిల్లలోని మ్యాక్స్ సొసైటీల నిర్వాహకులతో స్థానిక నేత బజారులో సమావేశమయ్యారు. రాష్ట్రంలోని పాఠశాలల విద్యార్థులకు యూనిఫామ్స్ అందించేందుకు అవసరమైన వస్త్రాన్ని సిరిసిల్లలోని మ్యాక్స్ సొసైటీల ద్వారా కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ అవకాశాన్ని కార్మికులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. మెుత్తం కోటి మీటర్ల వస్త్రం అవసరం ఉండగా.. ఇప్పటివరకు 18 లక్షల మీటర్ల వస్త్రాన్ని మాత్రమే ఉత్పత్తి చేశారని తెలిపారు. ఇలా చేస్తే విద్యాసంవత్సరం ముగిసినా పిల్లలకు యూనిఫామ్స్ అందివ్వలేమన్నారు. సకాలంలో వస్త్రాన్ని అందించేందుకు వస్త్రోత్పత్తి వేగాన్ని పెంచాలని, మగ్గాల సంఖ్యను పెంచి, కొత్త సభ్యులను చేర్చుకోవాలని సూచించారు. సొసైటీల్లో పనిచేస్తున్న కార్మికులు, రోజువారీ ఉత్పత్తి వివరాలను రికార్డుల్లో నమోదు చేయాలని, రికార్డులు లేకుండా వస్త్రం కొనుగోలు చేయలేమని ఆమె స్పష్టం చేశారు. కొనుగోలు చేసిన వస్త్రానికి పది రోజుల్లో డబ్బులు చెల్లిస్తామని చేనేత, జౌళిశాఖ డైరెక్టర్ ప్రీతిమీనా తెలిపారు. స్థానిక వెంకంపేటలోని మరమగ్గాల్లో వస్త్రోత్పత్తి తీరును తనిఖీ చేశారు. మంచె శ్రీనివాస్ అనే వ్యాపారి వద్ద నిల్వ ఉన్న ఐదు లక్షల మీటర్ల వస్త్రాన్ని పరిశీలించారు. వారివెంట ఆర్డీడీలు పూర్ణచందర్రావు, రాంగోపాల్, రమణమూర్తి, ఏడీ వెంకటేశం, మ్యాక్స్ సొసైటీ ప్రతినిధులు వేముల దామోదర్, గుంటుక కోటేశ్వర్, జిందం దేవదాస్, అంకారపు రవి, చిమ్మని ప్రకాశ్, వేముల వెంకటనర్సు, గౌడ శ్రీనివాస్ ఉన్నారు. -
తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశం శనివారానికి వాయిదా పడింది. శుక్రవారం సమావేశం ప్రారంభం కాగానే ఇటీవల మరణించిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి మృతికి అసెంబ్లీ సంతాపం ప్రకటించింది. రాంరెడ్డి వెంకటరెడ్డి మృతిపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ప్రతిపక్ష నేత జానారెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుంచే రాంరెడ్డి వెంకటరెడ్డి రాజకీయాలపై ఆసక్తిచూపారని అన్నారు. అనంతరం సమావేశాన్ని రేపటికి వాయిదా వేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు.