హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శనివారానికి వాయిదా పడ్డాయి. శుక్రవారం శీతాకాల అసెంబ్లీ సమావేశాల తొలిరోజున మిషన్ కాకతీయతో పాటు పెద్ద నోట్ల రద్దు తదనంతర పరిణామాలపై చర్చ జరిగింది. కేంద్రం పెద్ద నోట్లను రద్దు చేయడాన్ని స్వాగతిస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అన్నారు. పెద్ద నోట్ల రద్దు తదనంతర పరిణామాలపై చర్చించారు. నోట్ల రద్దు విషయం కేంద్ర ప్రభుత్వ పరిధిలోనిదని, అసెంబ్లీలో కేంద్రాన్ని, ప్రధానిని విమర్శించడం సరికాదని కేసీఆర్ పేర్కొన్నారు. ప్రజల ఇబ్బందుల గురించి చర్చిస్తే కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని, సామాన్యులు ఇబ్బందులు పడుతున్న మాట నిజమేనని కేసీఆర్ చెప్పారు.
అసెంబ్లీలో ప్రతిపక్ష నేత జానారెడ్డి మాట్లాడుతూ.. నగదు అందుబాటులో లేక పెళ్లిళ్లు ఆగిపోయానని చెప్పారు. కొత్త కరెన్సీని తీసుకురావడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. పెద్ద నోట్ల రద్దు తదనంతర పరిణామాలపై అసెంబ్లీలో జరిగిన చర్చలో జానారెడ్డి మాట్లాడుతూ.. నగదు అందుబాటులో లేక పెళ్లిళ్లు ఆగిపోయానని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం చిన్న నోట్లను ఎక్కువగా ముద్రించిన తర్వాత పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకుని ఉంటే బాగుండేదని, అనాలోచితంగా నిర్ణయం తీసుకుందని తప్పుపట్టారు. నగదు రహిత లావాదేవీల కోసం ప్రజలకు శిక్షణ ఇవ్వాలని జానారెడ్డి కోరారు. లక్ష్యసాధనకు తాము కూడా సహకరిస్తామని చెప్పారు.
తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా
Published Fri, Dec 16 2016 3:47 PM | Last Updated on Mon, Sep 4 2017 10:53 PM
Advertisement