విజయవాడ: YSR అవార్డుల ప్రదానోత్సవం | CM YS Jagan Mohan Reddy To Present YSR Awards 2023 In Vijayawada | YSR Achievement Awards-2023 Live Updates - Sakshi
Sakshi News home page

విజయవాడ: YSR అవార్డుల ప్రదానోత్సవం

Published Wed, Nov 1 2023 8:46 AM | Last Updated on Wed, Nov 1 2023 5:48 PM

CM YS Jagan Present YSR Awards In Vijayawada - Sakshi

Updates:

► వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం వైభవంగా జరిగింది.
► గవర్నర్‌, సీఎం జగన్‌ చేతుల మీదుగా వివిధ రంగాలకు 27 మంది ఒక్కొక్కరిగా అవార్డులు స్వీకరించారు.

► దేశంలోనే మొదటిసారిగా రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు అభినందనీయం: గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌
► నవరత్నాల ద్వారా బడుగు బలహీన వర్గాలకు సాయం అందుతోంది.
► అయిదు డిప్యూటీ సీఎం పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇచ్చారు
► ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పదువులు ఇచ్చి న్యాయం చేశారు.
►ప్రస్తుత ప్రభుత్వం సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తోంది.
►నామినేటెడ్‌ పదవులు, పోస్టుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించారు
► స్వచ్ఛ సర్వేక్షన్‌లో ఏపీ 7వ స్థానంలో నిలిచింది. 
►వికేంద్రీకరణతో ప్రజలకు పరిపానను మరింత చేరువ చేసింది. 
►అన్ని ప్రధాన రంగాల్లో రాష్ట్రం అభివృద్ధిలో మందుకు సాగుతోంది.

► రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు: సీఎం జగన్‌
►మూడేళ్లుగా అవార్డులు అందించే సాంప్రదాయం కొనసాగుతోంది.
►ఈ ఏడాది 27 మందికి వైఎస్సార్‌ అవార్డులు అందజేస్తున్నాం
►వైఎస్సార్‌ హమాంలో వ్యవసాయం, విద్యా, వైద్య రంగాల్లో విశేష అభివృద్ధి జరిగింది.

►7 రంగాల్లో విశిష్ట సేవలందించిన 27 మంది వ్యక్తులు, సంస్థలకు పురస్కారాలు
►23 వైఎస్సార్‌ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డులు
►4 వైఎస్సార్‌ అచీవ్‌మెంట్‌ అవార్డులు ప్రదానం
►అవార్డులు అందజేయనున్న గవర్నర్‌ అబ్దుల్‌నజీర్‌, సీఎం జగన్‌

సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వరుసగా మూడో ఏడాది ‘వైఎస్సార్’ అవార్డులు అందజేయనుంది. నేడు(నవంబర్‌1) ఏపీ అవతరణ దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగే అవార్డుల ప్రదానోత్సవానికి గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ముఖ్య అతిథిగా, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక అతిథిగా హాజరుకానున్నారు.

ఉదయం 11 గంటలకు ఏ- కన్వెన్షన్ హాల్‌లో వైఎస్సార్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నారు. వైఎస్సార్ అవార్డుల్లో 23 లైఫ్‌టైం ఎచీవ్‌మెంట్‌, 4 ఎచీవ్‌మెంట్‌ అవార్డులు అందజేయనున్నారు. వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన 27 మంది వ్యక్తులు, సంస్థలకు ఈ పురస్కారాలు లభించనున్నాయి. ఆయా రంగాల్లో ఎంపికైన వారికి ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అవార్డుల ప్రదానోత్సవం చేయనున్నారు.

2023లో వైఎస్సార్‌ లైఫ్‌టైం ఎచీవ్‌మెంట్, ఎచీవ్‌మెంట్‌ అవార్డులకు ఎంపికయిన వారి జాబితా:

వ్యవసాయం:
1)పంగి వినీత– (ఎచీవ్‌మెంట్‌ అవార్డు)
2వై.వి.మల్లారెడ్డి– అనంతపురం

ఆర్ట్‌ అండ్‌ కల్చర్‌:
1) యడ్ల గోపాలరావు-రంగస్థల కళాకారుడు-శ్రీకాకుళం
2) తలిసెట్టి మోహన్‌– కలంకారీ–  తిరుపతి
3) కోట సచ్చిదానంద శాస్త్రి– హరికథ– బాపట్ల
4) కోన సన్యాసి– తప్పెటగుళ్ళు– శ్రీకాకుళం జిల్లా
5) ఉప్పాడ హ్యాండ్‌ లూమ్‌ వీవర్స్‌ కోఆపరేటివ్‌ సొసైటీ– కాకినాడ
6) ఎస్‌.వి.రామారావు– చిత్రకారుడు– కృష్ణా 
7)బాల సరస్వతి– నేపథ్య గాయని– నెల్లూరు 
8)తల్లావఝుల శివాజీ– చిత్రకారుడు, రచయిత, పాత్రికేయుడు– ప్రకాశం
9)చింగిచెర్ల కృష్ణారెడ్డి– జానపద కళలు– అనంతపురం
10)కలీసాహెబీ మహబూబ్‌– షేక్‌ మహబూబ్‌ సుబానీ దంపతులకు– నాదస్వరం– ప్రకాశం

తెలుగు భాష– సాహిత్యం:
1) ప్రొఫెసర్‌ బేతవోలు రామబ్రహ్మం– పశ్చిమ గోదావరి
2) ఖదీర్‌ బాబు– నెల్లూరు– (ఎచీవ్‌మెంట్‌ అవార్డు)
3) మహెజబీన్‌– నెల్లూరు (ఎచీవ్‌మెంట్‌ అవార్డు)
4) నామిని సుబ్రహ్మణ్యం నాయుడు– చిత్తూరు
5) అట్టాడ అప్పలనాయుడు– శ్రీకాకుళం

క్రీడలు:
1) పుల్లెల గోపీచంద్‌– గుంటూరు
2) కరణం మల్లీశ్వరి– శ్రీకాకుళం

వైద్యం:
1)  ఇండ్ల రామ సుబ్బారెడ్డి–మానసిక వైద్యం– ఎన్టీఆర్‌ 
2) ఈసీ వినయ్‌కుమార్‌రెడ్డి–ఈఎన్‌టీ– కాక్లియర్‌ ఇంప్లాంట్స్‌– వైయస్సార్‌ 

మీడియా:
1) గోవిందరాజు చక్రధర్‌– కృష్ణా
2)  హెచ్చార్కే– కర్నూలు

సమాజ సేవ:
1)బెజవాడ విల్సన్‌– ఎన్టీఆర్‌
2) శ్యాం మోహన్‌– అంబేద్కర్‌ కోనసీమ– (ఎచీవ్‌మెంట్‌)
3) నిర్మల హృదయ్‌ భవన్‌– ఎన్టీఆర్‌
4)జి. సమరం– ఎన్టీఆర్‌ 

👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement