YSR Awards
-
వైఎస్సార్ అవార్డుల ప్రదానోత్సవం
-
YSR అవార్డ్స్ 2023 విజువల్స్
-
YSR Achievement Awards 2023: విజయవాడ: వైఎస్సార్ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)
-
సిక్కోల్ సింగం..కరణం మల్లేశ్వరి గారికి వైఎస్ఆర్ సాఫల్య పురస్కారం
-
రచయిత నామిని సుబ్రహ్మణ్యం నాయుడు గారికి వైఎస్ఆర్ సాఫల్య పురస్కారం
-
శ్రీ షేక్ మెహబూన్ సుభాని, శ్రీమతి కలీషా బీ గారికి వైఎస్ఆర్ సాఫల్య పురస్కారం
-
శ్రీ కోట సచిదానందా శాస్త్రి గారికి వైఎస్ఆర్ సాఫల్య పురస్కారం
-
కలంకారీ కళాకారుడు తలిశెట్టి మోహన్ గారికి వైఎస్ఆర్ సాఫల్య పురస్కారం
-
పద్మశ్రీ యడ్ల గోపాలరావు గారికి వైఎస్ఆర్ సాఫల్య పురస్కారం
-
రైతన్న DR YV మల్లారెడ్డి గారికి వైఎస్ఆర్ సాఫల్య పురస్కారం
-
రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు: సీఎం జగన్
-
ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్న గిరిజన మహిళకు పురస్కారం
-
సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ
-
వైఎస్సార్ అవార్డుల ప్రదానోత్సవం ..అవార్డులు ఇవ్వడం చాలా గొప్ప విషయం
-
విజయవాడ: YSR అవార్డుల ప్రదానోత్సవం
Updates: ► వైఎస్సార్ అవార్డుల ప్రదానోత్సవం వైభవంగా జరిగింది. ► గవర్నర్, సీఎం జగన్ చేతుల మీదుగా వివిధ రంగాలకు 27 మంది ఒక్కొక్కరిగా అవార్డులు స్వీకరించారు. ► దేశంలోనే మొదటిసారిగా రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు అభినందనీయం: గవర్నర్ అబ్దుల్ నజీర్ ► నవరత్నాల ద్వారా బడుగు బలహీన వర్గాలకు సాయం అందుతోంది. ► అయిదు డిప్యూటీ సీఎం పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇచ్చారు ► ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పదువులు ఇచ్చి న్యాయం చేశారు. ►ప్రస్తుత ప్రభుత్వం సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తోంది. ►నామినేటెడ్ పదవులు, పోస్టుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించారు ► స్వచ్ఛ సర్వేక్షన్లో ఏపీ 7వ స్థానంలో నిలిచింది. ►వికేంద్రీకరణతో ప్రజలకు పరిపానను మరింత చేరువ చేసింది. ►అన్ని ప్రధాన రంగాల్లో రాష్ట్రం అభివృద్ధిలో మందుకు సాగుతోంది. ► రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు: సీఎం జగన్ ►మూడేళ్లుగా అవార్డులు అందించే సాంప్రదాయం కొనసాగుతోంది. ►ఈ ఏడాది 27 మందికి వైఎస్సార్ అవార్డులు అందజేస్తున్నాం ►వైఎస్సార్ హమాంలో వ్యవసాయం, విద్యా, వైద్య రంగాల్లో విశేష అభివృద్ధి జరిగింది. ►7 రంగాల్లో విశిష్ట సేవలందించిన 27 మంది వ్యక్తులు, సంస్థలకు పురస్కారాలు ►23 వైఎస్సార్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డులు ►4 వైఎస్సార్ అచీవ్మెంట్ అవార్డులు ప్రదానం ►అవార్డులు అందజేయనున్న గవర్నర్ అబ్దుల్‌నజీర్, సీఎం జగన్ సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరుసగా మూడో ఏడాది ‘వైఎస్సార్’ అవార్డులు అందజేయనుంది. నేడు(నవంబర్1) ఏపీ అవతరణ దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్లో జరిగే అవార్డుల ప్రదానోత్సవానికి గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక అతిథిగా హాజరుకానున్నారు. ఉదయం 11 గంటలకు ఏ- కన్వెన్షన్ హాల్లో వైఎస్సార్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నారు. వైఎస్సార్ అవార్డుల్లో 23 లైఫ్‌టైం ఎచీవ్మెంట్, 4 ఎచీవ్మెంట్ అవార్డులు అందజేయనున్నారు. వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన 27 మంది వ్యక్తులు, సంస్థలకు ఈ పురస్కారాలు లభించనున్నాయి. ఆయా రంగాల్లో ఎంపికైన వారికి ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అవార్డుల ప్రదానోత్సవం చేయనున్నారు. 2023లో వైఎస్సార్ లైఫ్‌టైం ఎచీవ్మెంట్, ఎచీవ్మెంట్ అవార్డులకు ఎంపికయిన వారి జాబితా: వ్యవసాయం: 1)పంగి వినీత– (ఎచీవ్మెంట్ అవార్డు) 2వై.వి.మల్లారెడ్డి– అనంతపురం ఆర్ట్ అండ్ కల్చర్: 1) యడ్ల గోపాలరావు-రంగస్థల కళాకారుడు-శ్రీకాకుళం 2) తలిసెట్టి మోహన్– కలంకారీ– తిరుపతి 3) కోట సచ్చిదానంద శాస్త్రి– హరికథ– బాపట్ల 4) కోన సన్యాసి– తప్పెటగుళ్ళు– శ్రీకాకుళం జిల్లా 5) ఉప్పాడ హ్యాండ్ లూమ్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ– కాకినాడ 6) ఎస్.వి.రామారావు– చిత్రకారుడు– కృష్ణా 7)బాల సరస్వతి– నేపథ్య గాయని– నెల్లూరు 8)తల్లావఝుల శివాజీ– చిత్రకారుడు, రచయిత, పాత్రికేయుడు– ప్రకాశం 9)చింగిచెర్ల కృష్ణారెడ్డి– జానపద కళలు– అనంతపురం 10)కలీసాహెబీ మహబూబ్– షేక్ మహబూబ్ సుబానీ దంపతులకు– నాదస్వరం– ప్రకాశం తెలుగు భాష– సాహిత్యం: 1) ప్రొఫెసర్ బేతవోలు రామబ్రహ్మం– పశ్చిమ గోదావరి 2) ఖదీర్ బాబు– నెల్లూరు– (ఎచీవ్మెంట్ అవార్డు) 3) మహెజబీన్– నెల్లూరు (ఎచీవ్మెంట్ అవార్డు) 4) నామిని సుబ్రహ్మణ్యం నాయుడు– చిత్తూరు 5) అట్టాడ అప్పలనాయుడు– శ్రీకాకుళం క్రీడలు: 1) పుల్లెల గోపీచంద్– గుంటూరు 2) కరణం మల్లీశ్వరి– శ్రీకాకుళం వైద్యం: 1) ఇండ్ల రామ సుబ్బారెడ్డి–మానసిక వైద్యం– ఎన్టీఆర్ 2) ఈసీ వినయ్‌కుమార్‌రెడ్డి–ఈఎన్టీ– కాక్లియర్ ఇంప్లాంట్స్– వైయస్సార్ మీడియా: 1) గోవిందరాజు చక్రధర్– కృష్ణా 2) హెచ్చార్కే– కర్నూలు సమాజ సేవ: 1)బెజవాడ విల్సన్– ఎన్టీఆర్ 2) శ్యాం మోహన్– అంబేద్కర్ కోనసీమ– (ఎచీవ్మెంట్) 3) నిర్మల హృదయ్ భవన్– ఎన్టీఆర్ 4)జి. సమరం– ఎన్టీఆర్ 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
వరుసగా మూడో ఏడాదీ వైఎస్సార్ అవార్డులు
సాక్షి, అమరావతి : ఎంతో ప్రతిష్టాత్మకమైన ‘వైఎస్సార్ పురస్కారాల’ను రాష్ట్ర ప్రభుత్వం వరుసగా మూడో ఏడాదీ ప్రకటించింది. వివిధ రంగాల్లో లబ్ధప్రతిష్ఠులైన 27 మంది వ్యక్తులు, సంస్థలను అవార్డులతో సత్కరించనుంది. వ్యవసాయం, కళలు–సంస్కృతి, తెలుగు భాషా–సాహిత్యం, క్రీడలు, వైద్యం, మీడియా, సమాజ సేవ వంటి విభాగాల్లో 23 వైఎస్సార్ జీవిత సాఫల్య, నాలుగు వైఎస్సార్ సాఫల్య పురస్కారాలను అందించనుంది. రాష్ట్ర సచివాలయంలో బుధవారం ప్రభుత్వ సలహాదారు (కమ్యునికేషన్స్) జీవీడీ కృష్ణమోహన్ మీడియాకు ఈ అవార్డు గ్రహీతల వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉన్నత సంకల్పంతో దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా సామాన్యుల్లోని అసామాన్యులను గుర్తించి ‘వైఎస్సార్’ అవార్డులను అందజేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వానికి వచి్చన ప్రతిపాదనలను ప్రత్యేక కమిటీ వివిధ దశల్లో క్షుణ్ణంగా పరిశీలించి ఎంతో పారదర్శకంగా అవార్డులకు ఎంపిక చేసిందన్నారు. సమాజంపై తమదైన ముద్రవేసిన వారిని సముచితంగా గౌరవించేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆమోదంతో అవార్డులను ప్రకటిస్తున్నట్లు ఆయన వివరించారు. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నవంబర్ 1న ఈ అవార్డులను ప్రదానం చేస్తామన్నారు. వైఎస్సార్ పురస్కార ఎంపికల కమిటీలో తనతోపాటు ప్రభుత్వ సలహాదారులు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, దేవులపల్లి అమర్ (జాతీయ మీడియా), సీఎం రాజకీయ కార్యదర్శి ముత్యాలరాజు, సమాచార, పౌరసంబంధాల శాఖ కమిషనర్ తుమ్మా విజయ్‌కుమార్‌రెడ్డితో పాటు వివిధ శాఖలకు చెందిన ముఖ్యకార్యదర్శులు సభ్యులుగా ఉన్నారన్నారు. ఇక వైఎస్సార్ జీవిత సాఫల్యం కింద రూ.10 లక్షలు, వైఎస్సార్ సాఫల్యం కింద రూ.5 లక్షల నగదు ప్రోత్సాహకంతో పాటు జ్ఞాపిక, ప్రశంసా పత్రాలను అందజేస్తామని జీవీడీ చెప్పారు. -
వైఎస్సార్ అవార్డులు..
-
Shanti Narayana: ‘అనంత’ సాంస్కృతిక సేనాని
జీవితాన్ని వెతుక్కునే దశ నుంచి జీవిత సాఫల్య పురస్కారం అందుకునే దశకు శాంతి నారాయణ ఎదగడం నల్లేరు మీద బండి నడకలా సాగలేదు. ‘నీ కొడుక్కి చదు వెందుకు, కూలికి పంపించు’ అనిపించుకున్న దశ నుంచి ఎంఏ, పీహెచ్డీ చేసే దశకు శాంతి నారాయణ ప్రయాణం సునాయాసంగా జరగలేదు. సాంఘిక వివక్ష, ఆర్థిక అసమా నతలను అనుభవించే దశ నుంచి, వాటిని నిర్మూలించాలనే రచనలు చేసే దశకు ఆయన చేరడం చిన్నపని కాదు. అదొక సంఘర్షణ. అదొక సమరం. బాల్యంలో తగిలిన గాయాలను స్వయంకృషితో, సహృదయుల చేయూతతో మాన్పుకుంటూ, మాన్పుకుంటూ గాయాలు లేని సమాజ నిర్మాణం లక్ష్యంగా సాహిత్య సృష్టి చేస్తున్న రచయిత డాక్టర్ శాంతి నారాయణ. డెబ్భై అయిదేళ్ళ వయసుగల (1946) శాంతి నారాయణకు 50 ఏళ్ళ సాహిత్య జీవితం (1972–2022) ఉంది. ఆయన కవి, కథా రచయిత, నవలా రచయిత, ఫీచర్ రచయిత. జీవితాన్ని వెతు క్కుంటూ, 50 ఏళ్ళలో అనేక సామాజిక, సాహిత్య కార్యకలాపాల్లో నిమగ్నమౌతూ, యాభై ఏళ్ళలో అసంఖ్యాక రచనలు చేసిన నిబద్ధత, నిమగ్నత గల రచయిత. శాంతి నారాయణ జీవితం మూడు ముఖాలుగా సాగుతున్నది. 1. వ్యక్తిగత జీవితం. 2. సామాజిక జీవితం. 3. సాహిత్య జీవితం. శాంతి నారాయణ వ్యక్తిగత జీవితంలో కుల వ్యతిరేకి. లౌకిక వాది. భౌతికవాది. తాను కులాంతర వివాహం చేసుకోవడమేగాక, తన సంతానానికీ కులాం తర వివాహాలు చేశారు. ఈ విషయంలో ఆయన చాలామంది మహా మహులను వెనక్కి నెట్టేశారు. రచయితగా శాంతినారాయణ గత అయిదు దశాబ్దాలలో 16 పుస్తకాలు ప్రచురించారు. ఆయన అవధాని కాబోయి ఆధునిక రచయిత కావడం గుర్తించదగిన విశేషం. 1972లో ‘రక్తపు ముద్ద పిలిచింది’ అనే కథా సంపుటి ప్రచురణతో ఆయన సాహిత్య జీవితం మొదలై, 2022లో ‘ముడి’, ‘సాధన’ అనే రెండు నవలల ప్రచురణ దాకా వచ్చింది. ఈ మధ్యలో ‘నడిరేయి నగరం’(1978), ‘కొత్త అక్షరాలమై’ (2017) అనే కావ్యాలూ; ‘రస్తా’ (1976), ‘పల్లేరు ముళ్ళు’ (1998), ‘నమ్ముకున్న రాజ్యం ’(2004), ‘కొండచిలువ’ (2016), ‘బతుకుబంతి’ (2017) కథల సంపుటాలు; ‘మాధురి’ (1980), ‘పెన్నేటి మలుపులు’ (2001) వంటి నాలుగు నవలలు; ‘నాలుగు అస్తిత్వాలు–నాలుగు నవలికలు’ అనే గ్రంథం; ‘నాగల కట్ట సుద్దులు’ అనే ఫీచర్ రచన రెండు సంపుటాలు ప్రచురించారు. శాంతి నారాయణ అనంతపురం జిల్లా సామాజిక రంగంలో క్రియాశీలక పాత్ర నిర్వహించారు. 1989కి ముందు రాయదుర్గంలో పనిచేస్తున్నప్పుడు అనేక సాహిత్య కార్యక్రమాలు నిర్వహించారు. అనంతపురంకు బదిలీ అయ్యాక 1989–2002 మధ్య ‘జిల్లా రచయితల సంఘం’ ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షుడిగా ఆయన అనేక విలువైన కార్యక్రమాలు నిర్వహించారు. ఏళ్ళతరబడి నిద్రా వస్థలో ఉండిపోయిన జిల్లా రచయితల సంఘాన్ని పునరుజ్జీవింప జేయడంలో శాంతినారాయణ చురుకైన పాత్ర నిర్వహించారు. తెలుగు నవల వచ్చి 116 ఏళ్ళ చరిత్ర పూర్తయిన సందర్భంగా జరిగిన సదస్సు చరిత్రాత్మకమైనది. 2002–2004 మధ్య అనంతపురం జిల్లాను కరువు అతలాకుతలం చేసినప్పుడు అనంతపురం జిల్లా రచయితలు, కళాకారులు, మేధావులు చేసిన కరువు అధ్యయన యాత్ర, రైతు ఆత్మవిశ్వాస యాత్రల్లో శాంతి నారాయణ భాగస్వామి అయ్యారు. ఆ సమయంలో అనంతపురం జిల్లా రచయితల సంఘం తరఫున ‘వొరుపు’ అనే కవిత్వ సంకలనాన్నీ, ‘ఇనుప గజ్జెల తల్లి’ అనే కథల సంకలనాన్నీ సంపా దకత్వం వహించి ప్రచురించారు. అలాగే అనంతపురం జిల్లాలో దళితుల మీద దాడులు జరిగినప్పుడు దళిత సంఘీభావం సమితి ఆధ్వర్యంలో జరిగిన పాదయాత్రలలో ఆయన పాల్గొన్నారు. తాను రచనలు చేయడమే కాకుండా, ‘విమలా శాంతి సామాజిక సాహిత్య సేవా సమితి’ స్థాపించి 2006 నుండి, 17 ఏళ్ళుగా, కవులు, కథా రచయితలకు పురస్కారాలిస్తున్నారు. ఇవాళ ప్రసిద్దిగాంచిన రచయితలుగా పేరు పొందిన వాళ్ళలో చాలామంది ఆయన పురస్కారాలు తీసుకున్నవారే. అంతేగాక, విమలా శాంతి జీవిత సాఫల్య పురస్కారం స్థాపించి మొదటిసారిగా, 2021లో వైఎస్సార్ జీవిత సాఫల్య పురస్కారం అందుకున్న ఆచార్య కేతు విశ్వనాథరెడ్డికి ఇచ్చారు. ఇది శాంతి నారాయణ బహుముఖీన జీవితం. (క్లిక్ చేయండి: తెలుగు తెరకు... ఆయన గోరింటాకు!) - రాచపాళెం చంద్రశేఖరరెడ్డి వ్యాసకర్త ప్రముఖ సాహితీ విమర్శకులు (నవంబర్ 1న డాక్టర్ శాంతి నారాయణకు‘వైఎస్సార్ జీవన సాఫల్య పురస్కార’ప్రదానం) -
శాంతినారాయణకు ‘వైఎస్సార్ లైఫ్‌టైం’ అవార్డు
అనంతపురం కల్చరల్: రాష్ట్ర ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును అనంతపురానికి చెందిన ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ శాంతినారాయణ దక్కించుకున్నారు. ఈ మేరకు వైఎస్సార్ అవార్డు కమిటీ సభ్యులు శుక్రవారం వివరాలు వెల్లడించారు. ఈ పురస్కారాన్ని నవంబర్ ఒకటో తేదీన ప్రదానం చేస్తారు. రూ.10 లక్షల నగదుతో పాటు వైఎస్సార్ కాంస్య విగ్రహంతో గౌరవించనున్నారు. బలమైన గొంతుక ఆయన సొంతం డాక్టర్ శాంతినారాయణ అనంతపురం యాసకు, కరువు కథకు ప్రత్యేక గుర్తింపు తెచ్చారు. ఈయన ఐదు దశాబ్దాలుగా సాహితీసేవలో తరిస్తున్నారు. తొలిరోజుల నుంచే ధార్మికుడు, మేధావి, అసలు సిసలైన సృజనశీలిగా కవిత్వాన్ని, గద్యాన్ని ఏకకాలంలో సమర్థవంతంగా నడిపించారు. సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని తన కలంతో ఎదిరిస్తూ బాధితులకు అండగా నిలిచారు. ఒకే వ్యక్తి ఏకకాలంలో భిన్న ఇతివృత్తాల్ని ఎంచుకుని రచనలు చేయడం తెలుగు సాహిత్య రంగంలో అరుదనే చెప్పాలి. నవలా రచనలో కూడా వైవిధ్యం కనబరిచారు. జీవిత దృక్పథం, రచనల నేపథ్యం, ప్రపంచీకరణ పోకడలు, ప్రాంతీయ అస్తిత్వ ఉద్యమాలు, సమాజంలోని అసమానతల గురించి, ఆది నుంచి ‘అనంత’కు జరుగుతున్న అన్యాయాలు, ప్రభావం చూపిన కథా సాహిత్యం, ఇక్కడ పురుడుపోసుకున్న ఉద్యమాల గురించి తన రచనలతో అందరినీ కదిలించారు. శింగనమల మండలం సి.బండమీదపల్లిలో నిరుపేద కుటుంబంలో జని్మంచిన శాంతినారాయణ తెలుగు అధ్యాపకునిగా పనిచేస్తూనే రచనా వ్యాసంగం కొనసాగించారు. ఎటువంటి అభిప్రాయాన్నైనా నిక్కచ్చిగా, నిర్భయంగా బలమైన గొంతుకతో వినిపించగల్గిన ఆయన ఇనుప గజ్జెల తల్లి, పెన్నేటి మలుపులు, పల్లేరు ముళ్లు, నమ్ముకున్న రాజ్యం, కల్లమయిపాయే, ఉక్కుపాద వంటి ప్రసిద్ధ కథలు రాశారు. ముఖ్యంగా ఆయన రాసిన ‘నాగులకట్ట సుద్దులు’ నవల తెలుగు సాహిత్యంలోనే సంచలనంగా నిలిచింది. ఇటీవలే ఆయన పంచసప్తతి కార్యక్రమం అనంతపురం వేదికగా జరిగింది. తెలుగు అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీపార్వతితో పాటు రెండు తెలుగు రాష్ట్రాల ప్రఖ్యాత రచయితలు, కవులు శాంతినారాయణ సాహితీ కృషిని అభినందించారు. పలువురి హర్షం ప్రతిష్టాత్మక వ్యక్తులకందించే వైఎస్సార్ అచీవ్మెంట్ అవార్డుకు శాంతినారాయణ ఎంపిక కావడంపై కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతలు డాక్టర్ రాచపాలెం చంద్రశేఖరరెడ్డి, బండి నారాయణస్వామి, జిరసం అధ్యక్షుడు శ్రీహరిమూర్తి, డాక్టర్ ఉమర్ అలీషా సాహితీ సమితి అధ్యక్షుడు రియాజుద్దీన్ అహ్మద్, సీనియర్ కథా రచయిత వెంకటేష్ తదితరులు వేర్వేరు ప్రకటనలో హర్షం ప్రకటించారు. విమలాశాంతి పురస్కారాల పేరిట ఎంతోమంది యువ రచయితలకందించి ప్రోత్సహిస్తున్న శాంతినారాయణను ప్రభుత్వం ప్రతిష్టాత్మక అవార్డుతో సమున్నతంగా గౌరవించడం అభినందనీయమని పేర్కొన్నారు. (చదవండి: ఐదు నెలల ఉత్కంఠకు తెర! ఆ అమ్మను నేనే..) -
వైఎస్సార్ అవార్డులకు దరఖాస్తుల స్వీకరణ
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న ‘వైఎస్సార్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్, వైఎస్సార్ అచీవ్మెంట్–2022’ అత్యున్నత పురస్కారాల కోసం వివిధ రంగాలు, విభాగాల్లో విశిష్ట సేవలు అందించిన వ్యక్తులు లేదా సంస్థల నుంచి ఈ నెల 30 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అర్హత కలిగిన వ్యక్తులు, సంస్థలను ఎంపిక చేయడానికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి అధ్యక్షతన ఏర్పాటుచేసిన హైపవర్ స్క్రీనింగ్ కమిటీ శుక్రవారం విజయవాడలో సమావేశమైంది. ఈ కమిటీలో సభ్యులుగా ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్, ప్రభుత్వ సలహాదారు (కమ్యూనికేషన్స్) జీవీడి కృష్ణమోహన్, సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీలు రేవు ముత్యాలరాజు, అనూరాధ రాజారత్నం, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్, పౌర సరఫరాల శాఖ స్పెషల్ సెక్రటరీ, కమిషనర్ హెచ్.అరుణ్‌కుమార్, సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ తుమ్మా విజయ్‌కుమార్‌రెడ్డి, సాధారణ పరిపాలన శాఖ ఉప కార్యదర్శి బాలసుబ్రహ్మణ్యంరెడ్డి ఉన్నారు. ఈ సందర్భంగా విజయ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ వివిధ రంగాలలో అసాధారణ నైపుణ్యాలు, ప్రతిభా పాటవాలు కలిగి సమాజాన్ని విశేషంగా ప్రభావితం చేసిన వ్యక్తులకు, సంస్థలకు అవార్డులు ఇవ్వనున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత భారతరత్న, పద్మశ్రీ తదితర పురస్కారాల తరహాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పురస్కారాలను అందిస్తోందన్నారు. అవార్డు ఎంపిక కోసం విద్య, వైద్య, వ్యవసాయ, మహిళాభ్యు దయం, సామాజిక న్యాయం, దేశ–విదేశాల్లో గుర్తింపు పొందిన సామాజిక, సాహిత్య, సాంస్కృతిక తదితర రంగాల్లో రాణిస్తున్న వ్యక్తులు, సంస్థల నుంచి∙దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని, వారి బయోడేటాను secy&political@ap.gov.in కు మెయిల్ చేయాలని తెలిపారు. గతేడాది 59 మందిని సత్కరించినట్లు గుర్తుచేశారు. ఇక వైఎస్సార్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ కింద రూ.10 లక్షల నగదు, వైఎస్సార్ కాంస్య విగ్రహం, జ్ఞాపిక, ప్రశంసాపత్రం ఇస్తారన్నారు. వైఎస్సార్ అచీవ్మెంట్ అవార్డు కింద రూ.5 లక్షల నగదు, జ్ఞాపిక, ప్రశంసాపత్రాన్ని అందిస్తారని తెలిపారు.