Awards Distribution
-
ప్రతి దాడీ బలోపేతం చేస్తుంది
జైపూర్: అదానీ గ్రూప్‌పై ఇటీవల అమెరికాలో దాఖలైన అభియోగాలపై సంస్థ చైర్మన్ గౌతమ్ అదానీ తొలిసారి బహిరంగంగా స్పందించారు. చట్టాలు, నిబంధనల అమలుకు తమ గ్రూప్ ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. ఇలాంటి ప్రతి దాడీ తమను మరింత బలోపేతమే చేస్తుందన్నారు. ఆయన శనివారం ఇక్కడ 51వ జెమ్స్, జువెల్లరీ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘‘నిబంధనల అమలుకు సంబంధించి ఇటీవలే అమెరికా నుంచి కొన్ని ఆరోపణలు ఎదుర్కొన్నాం. ఇలాంటి సవాళ్లను ఎదుర్కోవడం మాకిది మొదటిసారేమీ కాదు. ప్రతి దాడీ మమ్మల్ని మరింత బలోపేతమే చేస్తుంది’’ అని పేర్కొన్నారు. ‘‘ఈ అంశానికి సంబంధించి మీడియాలో మాపై పుంఖానుపుంఖాలుగా వివక్ష, విద్వేషపూరిత కథనాలు వచ్చాయి. ఇంతా చేస్తే మా సంస్థకు సంబంధించిన వారెవరిపైనా అమెరికాలో ఎఫ్‌సీపీఏ చట్టాలను ఉల్లంఘించినట్టు గానీ, న్యాయ ప్రక్రియను అడ్డుకోజూసినట్టు గానీ ఒక్క అభియోగమూ నమోదు కాలేదు’’ అని అదానీ గుర్తు చేశారు. నియంత్రణ సంస్థల నియమ నిబంధనలన్నింటికీ కట్టుబడి ఉండటంలో తమ సంస్థ ప్రపంచ స్థాయి ప్రమాణాలు పాటిస్తుందన్నారు. ‘‘నేటి సమాజంలో వాస్తవాల కంటే పుకార్లే వేగంగా వ్యాపిస్తాయి. ఇన్నేళ్లలో అదానీ గ్రూప్ పెను సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎన్నో రంగాల్లో మార్గదర్శకంగా నిలిచినందుకు మేం చెల్లించిన మూల్యమది. ఆ సవాళ్లే మమ్మల్ని తీర్చిదిద్దాయి. వాటన్నింటినీ ఎప్పటికప్పుడు అధిగమిస్తూనే వస్తున్నాం. సవాళ్లను తట్టుకుని నిలుస్తూ కొత్త దారి వెదుక్కుంటూ ధైర్యంగా సాగడమే మాకు తెలుసు’’ అని అదానీ చెప్పుకొచ్చారు. హిండెన్‌బర్గ్‌పై చట్టపరంగా చర్యలు తమ గ్రూప్‌పై గతేడాది హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణలను కూడా అదానీ తోసిపుచ్చారు. ఆ సంస్థపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పునరుద్ఘాటించారు. ‘‘మాపై హిండెన్‌బర్గ్ చేసింది ఆరోపణలు నిజానికి మా ఆర్థిక స్థిరత్వాన్ని దెబ్బ తీయడంతో పాటు సంస్థను రాజకీయ వివాదంలోకి కూడా లాగేందుకు చేసిన భారీ కుట్ర. ఆ ఆరోపణలను ఒక వర్గం మీడియా తమ స్వార్థ ప్రయోజనాల కోసం విపరీతంగా ప్రచారం చేసింది. అంతటి సంక్షోభంలో కూడా మేం విలువలతో ఎక్కడా రాజీ పడలేదు. అదే ఏడాది సంస్థను ఆర్థికంగా సమున్నత శిఖరాలకు చేర్చి తలెత్తుకు నిలిచాం. మేం ఎలాంటి అవకతవకలకూ పాల్పడలేదని చివరికి సుప్రీంకోర్టే తేల్చింది’’ అని చెప్పారు. -
YSR Achievement Awards 2023: విజయవాడ: వైఎస్సార్ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)
-
విజయవాడ: YSR అవార్డుల ప్రదానోత్సవం
Updates: ► వైఎస్సార్ అవార్డుల ప్రదానోత్సవం వైభవంగా జరిగింది. ► గవర్నర్, సీఎం జగన్ చేతుల మీదుగా వివిధ రంగాలకు 27 మంది ఒక్కొక్కరిగా అవార్డులు స్వీకరించారు. ► దేశంలోనే మొదటిసారిగా రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు అభినందనీయం: గవర్నర్ అబ్దుల్ నజీర్ ► నవరత్నాల ద్వారా బడుగు బలహీన వర్గాలకు సాయం అందుతోంది. ► అయిదు డిప్యూటీ సీఎం పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇచ్చారు ► ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పదువులు ఇచ్చి న్యాయం చేశారు. ►ప్రస్తుత ప్రభుత్వం సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తోంది. ►నామినేటెడ్ పదవులు, పోస్టుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించారు ► స్వచ్ఛ సర్వేక్షన్లో ఏపీ 7వ స్థానంలో నిలిచింది. ►వికేంద్రీకరణతో ప్రజలకు పరిపానను మరింత చేరువ చేసింది. ►అన్ని ప్రధాన రంగాల్లో రాష్ట్రం అభివృద్ధిలో మందుకు సాగుతోంది. ► రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు: సీఎం జగన్ ►మూడేళ్లుగా అవార్డులు అందించే సాంప్రదాయం కొనసాగుతోంది. ►ఈ ఏడాది 27 మందికి వైఎస్సార్ అవార్డులు అందజేస్తున్నాం ►వైఎస్సార్ హమాంలో వ్యవసాయం, విద్యా, వైద్య రంగాల్లో విశేష అభివృద్ధి జరిగింది. ►7 రంగాల్లో విశిష్ట సేవలందించిన 27 మంది వ్యక్తులు, సంస్థలకు పురస్కారాలు ►23 వైఎస్సార్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డులు ►4 వైఎస్సార్ అచీవ్మెంట్ అవార్డులు ప్రదానం ►అవార్డులు అందజేయనున్న గవర్నర్ అబ్దుల్‌నజీర్, సీఎం జగన్ సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరుసగా మూడో ఏడాది ‘వైఎస్సార్’ అవార్డులు అందజేయనుంది. నేడు(నవంబర్1) ఏపీ అవతరణ దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్లో జరిగే అవార్డుల ప్రదానోత్సవానికి గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక అతిథిగా హాజరుకానున్నారు. ఉదయం 11 గంటలకు ఏ- కన్వెన్షన్ హాల్లో వైఎస్సార్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నారు. వైఎస్సార్ అవార్డుల్లో 23 లైఫ్‌టైం ఎచీవ్మెంట్, 4 ఎచీవ్మెంట్ అవార్డులు అందజేయనున్నారు. వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన 27 మంది వ్యక్తులు, సంస్థలకు ఈ పురస్కారాలు లభించనున్నాయి. ఆయా రంగాల్లో ఎంపికైన వారికి ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అవార్డుల ప్రదానోత్సవం చేయనున్నారు. 2023లో వైఎస్సార్ లైఫ్‌టైం ఎచీవ్మెంట్, ఎచీవ్మెంట్ అవార్డులకు ఎంపికయిన వారి జాబితా: వ్యవసాయం: 1)పంగి వినీత– (ఎచీవ్మెంట్ అవార్డు) 2వై.వి.మల్లారెడ్డి– అనంతపురం ఆర్ట్ అండ్ కల్చర్: 1) యడ్ల గోపాలరావు-రంగస్థల కళాకారుడు-శ్రీకాకుళం 2) తలిసెట్టి మోహన్– కలంకారీ– తిరుపతి 3) కోట సచ్చిదానంద శాస్త్రి– హరికథ– బాపట్ల 4) కోన సన్యాసి– తప్పెటగుళ్ళు– శ్రీకాకుళం జిల్లా 5) ఉప్పాడ హ్యాండ్ లూమ్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ– కాకినాడ 6) ఎస్.వి.రామారావు– చిత్రకారుడు– కృష్ణా 7)బాల సరస్వతి– నేపథ్య గాయని– నెల్లూరు 8)తల్లావఝుల శివాజీ– చిత్రకారుడు, రచయిత, పాత్రికేయుడు– ప్రకాశం 9)చింగిచెర్ల కృష్ణారెడ్డి– జానపద కళలు– అనంతపురం 10)కలీసాహెబీ మహబూబ్– షేక్ మహబూబ్ సుబానీ దంపతులకు– నాదస్వరం– ప్రకాశం తెలుగు భాష– సాహిత్యం: 1) ప్రొఫెసర్ బేతవోలు రామబ్రహ్మం– పశ్చిమ గోదావరి 2) ఖదీర్ బాబు– నెల్లూరు– (ఎచీవ్మెంట్ అవార్డు) 3) మహెజబీన్– నెల్లూరు (ఎచీవ్మెంట్ అవార్డు) 4) నామిని సుబ్రహ్మణ్యం నాయుడు– చిత్తూరు 5) అట్టాడ అప్పలనాయుడు– శ్రీకాకుళం క్రీడలు: 1) పుల్లెల గోపీచంద్– గుంటూరు 2) కరణం మల్లీశ్వరి– శ్రీకాకుళం వైద్యం: 1) ఇండ్ల రామ సుబ్బారెడ్డి–మానసిక వైద్యం– ఎన్టీఆర్ 2) ఈసీ వినయ్‌కుమార్‌రెడ్డి–ఈఎన్టీ– కాక్లియర్ ఇంప్లాంట్స్– వైయస్సార్ మీడియా: 1) గోవిందరాజు చక్రధర్– కృష్ణా 2) హెచ్చార్కే– కర్నూలు సమాజ సేవ: 1)బెజవాడ విల్సన్– ఎన్టీఆర్ 2) శ్యాం మోహన్– అంబేద్కర్ కోనసీమ– (ఎచీవ్మెంట్) 3) నిర్మల హృదయ్ భవన్– ఎన్టీఆర్ 4)జి. సమరం– ఎన్టీఆర్ 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
వెండితెర, బుల్లితెర తారలకు అవార్డులు..
చెన్నై సినిమా: డితెర, బుల్లితెర తారల అవార్డుల వేడుక ఆదివారం చెన్నైలోని స్థానిక వడపళనిలోని శిఖరం హాల్లో జరిగింది. మహా ఆర్ట్స్ డా. అనురాధ జయరాం, యునైటెడ్ ఆర్టిస్ట్ ఆఫ్ ఇండియా కలైమామని డాక్టర్ నెల్లై సుందరరాజన్ సంయుక్తంగా నిర్వహించారు. ఈ వేడుకకు చెన్నై హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి ఎస్కే కృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నటుడు గుహన్ చక్రవర్తి, వయ్యాపురి, బుల్లితెర నటుడు పాండికమల్, విఘ్నేష్, శ్యామ్, సాయి శక్తి, నటి హన్సాదీపన్, స్మాలిన్ మోనిక, నిరంజన్, మిస్ తమిళనాడు శాంత సౌర్భన్, హరితకు అవార్డులు అందజేశారు. చదవండి:👇 చిత్రపరిశ్రమలో విషాదం.. ప్రముఖ దర్శకుడు కన్నుమూత మిస్ ఇండియా కిరీటం.. 21 ఏళ్ల అందం సొంతం హీరో విశాల్‌కు మరోసారి గాయాలు.. షూటింగ్ నిలిపివేత.. బాధాకరమైన పెళ్లిళ్లకు మీరే కారణం.. సమంత కామెంట్స్ వైరల్ వేశ్య పాత్రలో యాంకర్ అనసూయ..! -
Cannes Film Festival 2022: అట్టహాసంగా ముగిసిన కాన్స్ వేడుకలు
ఫ్రాన్స్‌లో మొదలైన 75వ కాన్స్ చలన చిత్రోత్సవాలు ఆట్టహాసంగా ముగిశాయి. ఈ నెల 17న కాన్స్ చలన చిత్రోత్సవాలు మొదలైన సంగతి తెలిసిందే. ఫీచర్ ఫిల్మ్, షార్ట్ ఫిల్మ్, డాక్యుమెంటరీ విభాగాల్లో దాదాపు 21 అవార్డులు అందజేశారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ‘పామ్ డీ ఆర్’ అవార్డును స్వీడెన్ ఫిల్మ్‌మేకర్ రూబెన్ ఓస్ట్లండ్ దక్కించుకున్నారు. ఆయన దర్శకత్వం వహించిన ‘ట్రయాంగిల్ ఆఫ్ సాడ్‌నెస్’కు ‘పామ్ డీఆర్’ అవార్డు లభించింది. రూబెన్స్ తెరకెక్కించిన ఫిల్మ్‌కు ఈ అవార్డు రావడం ఇది రెండోసారి. 2017లో ‘ది స్వైర్’ చిత్రానికిగాను కాన్స్ చలన చిత్రోత్సవాల్లో ఈ అవార్డు అందుకున్నారాయన. విలాసవంతమైన విహారయాత్రకు ఆహ్వానించబడ్డ ఇద్దరు ఫ్యాషన్ మోడల్ సెలబ్రిటీల నేపథ్యంలో ‘ట్రయాంగిల్ ఆఫ్ సాడ్‌నెస్’ సాగుతుంది. ‘కాన్స్’ చలన చిత్రోత్సవంలో రెండో గొప్ప అవార్డుగా భావించే గ్రాండ్ ప్రైజ్‌ను రెండు సినిమాలు పంచుకున్నాయి. క్లైరే డెనిస్ దర్శకత్వంలో వచ్చిన ‘స్టార్స్ ఎట్ నైట్’, లుకాస్ థోన్స్ దర్శకత్వంలోని ‘క్లోజ్’ చిత్రాలు గ్రాండ్ ప్రైజ్‌ను పంచుకున్నాయి. జ్యూరీ ప్రైౖజ్ విషయంలోనూ ఇలానే జరిగింది. ‘ఈవో’(జెర్జిస్కో లిమౌస్కీ దర్శకుడు), ‘ది ఎయిట్ మౌంటెన్స్’ (ఫెలిక్స్ వాన్స్ – చార్లెట్ దర్శకులు) చిత్రాలకు జ్యూరీ అవార్డు దక్కింది. ‘బ్రోకర్’కి సాంగ్– కాంగ్ హూ ఉత్తమ నటుడిగా, ‘హోలీ స్పైడర్ ’ చిత్రానికి ఇరానీ యాక్ట్రస్ జార్ అమిర్ ఇబ్రహీమి ఉత్తమ నటిగా అవార్డులు అందుకున్నారు. ‘డెసిషన్స్ టు లీవ్’ చిత్రాని పార్క్ చాన్స్ హూక్ ఉత్తమ దర్శకుడి అవార్డును అందుకున్నారు. ఇండియా డాక్యుమెంటరీ ‘ఆల్ దట్ బ్రీత్స్’ కి అవార్డు 75వ కాన్స్ చలన చిత్రోత్సవాలకు భారతదేశం తరఫున ఎంపికైన ‘ఆల్ దట్ బ్రీత్స్’ డాక్యుమెంటరీకి ‘ది గోల్డెన్స్ ఐ’ అవార్డు దక్కింది. షౌనక్ సేన్స్ దర్శకత్వం వహించారు. ఢిల్లీకి చెందిన మహ్మద్ సౌద్, నదీమ్ షెహజాద్ అనే ఇద్దరు బ్రదర్స్ గాయపడ్డ పక్షులను ఎలా సంరక్షించేవారు? బ్లాక్కైట్స్ బర్డ్స్ సంరక్షణ కోసం వీరు ఏం చేశారు? అనే అంశాలతో ‘ఆల్ దట్ బ్రీత్స్’ డాక్యుమెంటరీ ఉంటుంది. ఈ ఏడాది అమెరికాలో జరిగిన ‘సన్డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్’లో కూడా ‘ఆల్ దట్ బ్రీత్స్’కి వరల్డ్ సినిమా గ్రాండ్ జ్యూరీ ప్రైజ్ లభించింది. కాగా కాన్స్ చలన చిత్రోత్సవాల స్పెషల్ జ్యూరీ విభాగంలో ‘మేరిముపోల్ 2’ (మాంటస్ దర్శకుడు) డాక్యుమెంటరీకి అవార్డు లభించింది. రష్యా, ఉక్రెయిన్స్ మధ్య యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది మార్చిలో డాక్యుమెంటరీ షూటింగ్ నిమిత్తం మేరియుపోల్ వెళ్లారు లిథువేనియన్స్ దర్శకుడు మాంటస్. ఏప్రిల్‌లో రష్యా బలగాల దాడుల్లో ఖైదు కాబడిన మాంటస్ ఆ తర్వాత చనిపోయారనే వార్తలు ఉన్నాయి. పాకిస్తాన్ ఫిల్మ్ ‘జాయ్‌లాండ్’ కి ‘అన్ సర్టెన్ రిగార్డ్ కేటగిరీ’ విభాగంలో జ్యూరీ ప్రైజ్ లభించింది. కాగా 75వ చలన చిత్రోత్సవాల్లో జ్యూరీ మెంబర్ దీపికా పదుకొనెతో పాటు మరికొంతమంది తారల రెడ్ కార్పెట్ వాక్స్ హైలైట్‌గా నిలిచాయి. -
ఎగుమతుల వృద్ధే లక్ష్యంగా ‘వాణిజ్య ఉత్సవం-2021
-
వాణిజ్య ఉత్సవం-2021: ఎగుమతి దారులకు ప్రోత్సహాలు
-
వాణిజ్య ఉత్సవం-2021: అవార్డులు ప్రదానం చేసిన సీఎం జగన్
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాణిజ్య ఎగుమతులను రెట్టింపు చేయడమే లక్ష్యంగా మంగళవారం ఏర్పాటు చేసిన ‘వాణిజ్య ఉత్సవం-2021’ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి, ఎగుమతుల శాతం వృద్ధి చెందడంలో ప్రముఖ పాత్ర పోషించిన పలువురు వ్యాపారవేత్తలకు ఇండస్ట్రి చాంపియన్, ఎక్స్పోర్ట్ చాంపియన్ పేరిట ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అవార్డులు ప్రదానం చేశారు. ఇండస్ట్రి చాంపియన్ అవార్డ్.... పద్మశ్రీ బీవీఆర్ మోహన్‌రెడ్డి(ఎగ్జిక్యూటివ్ చైర్మన్, సియాంట్ ), కాప్ డాంగ్లి (చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, కియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్) అనిల్ చలమశెట్టి (మేనేజింగ్ డైరెక్టర్, గ్రీన్ కో ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్) అవినాశ్ చాంద్రయ్,(చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, అదాని కృష్ణపట్నం పోర్టు), జీజే రావు(డైరెక్టర్, అదాని కృష్ణపట్నం పోర్టు) ఈశాన్ రెడ్డి ఆళ్ల (ప్రమోటెడ్ డైరెక్టర్, రాంకీ గ్రూప్) సీవీ రాజులు(వైస్ ప్రెసిడెంట్, ఎన్ఏసీఎల్ ఇండస్ట్రీస్) కే మదన్‌మోహనరెడ్డి (ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, అరబిందో ఫార్మ లిమిటెడ్) ఎక్స్పోర్ట్ చాంపియన్ అవార్డు... సి. శర్వానంద్ (చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, బ్రాండిక్స్ ఇండియా అపెరల్ ప్రైవేట్ లిమిటెడ్) లీ ఈ సీ (జనరల్ మూనేజర్, అపాచి ఫుట్‌వేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్) బీవీ కృష్ణారావు (మేనేజింగ్ డైరెక్టర్, పట్టాభి అగ్రో ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్) వంక రాజకుమారి(మేనేజింగ్ డైరెక్టర్, ఇండియన్ హెయిర్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్) పాండవ ప్రసాద్ (జనరల్ మేనేజర్, ఎస్ఎన్ఎస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్) సింగలూరి శారదా దేవి (పార్టనర్, ఆర్వీ కాప్) (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
వెలవెలబోయిన వేడుక
78వ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ వేడుక వర్చ్యువల్‌గా జరిగింది. కోవిడ్ నియమ నిబంధనలకు అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంతో తారల సందడి లేక ఈసారి వేడుక కాస్తంత వెలవెలబోయింది. న్యూయార్క్, లాస్ ఏంజిల్స్ లొకేషన్స్ నుంచి టీనా ఫే, అమీ పోహ్లెర్ ఈ వర్చ్యువల్ షోకు హోస్ట్‌లుగా వ్యవహరించారు. గోల్డెన్ గ్లోబ్ నామినేషన్స్‌ను ఈ ఏడాది ఫిబ్రవరి 3న ప్రకటించారు. టీవీ, సినిమా రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచినవారికి ఈ అవార్డులను అందించడం జరగుతుంది. నెట్‌ఫ్లిక్స్‌లో వివాదాస్పదమైన ‘ది క్రౌన్ ’ షో నాలుగు విభాగాల్లో అవార్డులను సొంతం చేసుకుంది. గోల్డెన్ గ్లోబ్ బెస్ట్ మోషన్ పిక్చర్‌గా ‘నోమాడ్ ల్యాండ్’ చిత్రం నిలిచింది. బెస్ట్ మ్యూజికల్ మూవీగా ‘బోరాట్ సబ్ సీక్వెంట్ మూవీ ఫిలిమ్’ నిలిచింది. బెస్ట్ టెలివిజన్ డ్రామా సిరీస్‌గా ‘ది క్రౌన్ ’ నిలిచింది. ‘మా రైనీస్ బ్లాక్ బాటమ్’లోని నటనకు గాను చాద్విక్ బోస్‌మెన్ కు బెస్ట్ యాక్టర్ అవార్డు దక్కింది. ‘ది యునైటెడ్ స్టేట్స్ వర్సెస్ బిల్లీ హాలీడే’లో నటించిన ఆండ్రా డే ఉత్తమ నటిగా నిలిచారు. ఉత్తమ విదేశీ చిత్రంగా ‘మినారీ’ నిలిచింది. ‘నోమాడ్ ల్యాండ్’ను డైరెక్ట్ చేసిన క్లోవ్ జావో ఉత్తమ డైరెక్టర్‌గా నిలిచారు. -
బెస్ట్ సిటీ ఇండోర్
న్యూఢిల్లీ: దేశంలోని అత్యంత పరిశుభ్రమైన నగరంగా వరుసగా నాలుగో ఏడాది మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ ఎంపికైంది. ఆ తర్వాతి స్థానాల్లో సూరత్, నవీముంబై నిలిచాయి. అలాగే, ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్‌సభ నియోజకవర్గం వారణాసి ‘ఉత్తమ గంగా పట్టణం’గా మొదటి స్థానంలో నిలిచింది. 100కుపైగా పట్టణ స్థానిక సంస్థలున్న కేటగిరీలో ఛత్తీస్‌గఢ్ అత్యంత పరిశుభ్రమైన రాష్ట్రంగా నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ఉన్నాయి . రాజధానిలో గురువారం జరిగిన ఒక కార్యక్రమంలో స్వచ్ఛ్ సర్వేక్షణ్ పురస్కారాలు–2020 వివరాలను కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రి హర్దీప్సింగ్ పూరి వెల్లడించారు. దేశ రాజధానిలోని ఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ (రాజ్‌పథ్, ప్రముఖులుండే ల్యుటెన్స్ ప్రాంతం) పరిశుభ్రమైన రాజధాని నగరంగా ఎంపికయింది. ఈ సర్వేలో దేశవ్యాప్తంగా ఉన్న 4,242 నగరాలు, 62 కంటోన్మెంట్ బోర్డులు, 97 గంగాతీర నగరాలతోపాటు, 1.87 కోట్ల మంది పౌరుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. విజేతలకు ప్రధాని అభినందనలు స్వచ్ఛ్ సర్వేక్షణ్ సర్వేలో మొదటి స్థానాల్లో నిలిచిన వారికి ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో మిగతా నగరాలు కూడా మెరుగైన పరిశుభ్రత కోసం కృషి చేయాలని కోరారు. దీంతో కోట్లాది మందికి లాభం కలుగుతుందని ట్విట్టర్లో పేర్కొన్నారు. అత్యంత పరిశుభ్రమైన నగరాలు (లక్షకు పైగా జనాభా కలిగినవి) 1. ఇండోర్ 2. సూరత్ 3. నవీముంబై 4. విజయవాడ 5. అహ్మదాబాద్ అత్యంత పరిశుభ్రమైన నగరాలు (లక్ష కంటే తక్కువ జనాభా ఉన్నవి) 1. కరాడ్ 2. సస్వద్ 3. లోనావాలా పరిశుభ్రమైన రాష్ట్రం(100కుపైగా పట్టణ స్థానిక సంస్థలున్న కేటగిరీ) 1. ఛత్తీస్‌గఢ్ 2. మహారాష్ట్ర 3. మధ్యప్రదేశ్ పరిశుభ్రమైన రాజధాని.. 1. న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ కంటోన్మెంట్లలో పరిశుభ్రమైనవి 1. జలంధర్ కంటోన్మెంట్ బోర్డ్ 2. ఢిల్లీ కంటోన్మెంట్ బోర్డ్ 3. మీరట్ కంటోన్మెంట్ బోర్డ్ ► పౌరుల ఫీడ్‌బ్యాక్ ఆధారంగా గ్రేటర్ హైదరాబాద్ ‘ఉత్తమ మెగా సిటీ’గా ఎంపికైంది. ► పౌరుల ఫీడ్‌బ్యాక్ ఆధారంగా ఉత్తమ కేంద్రపాలిత ప్రాంతంగా చండీగఢ్ ఎంపికైంది. ► ఇన్నోవేషన్, ఉత్తమ విధానాలు ఆచరిస్తున్న గుజరాత్ రాజధాని గాంధీనగర్ మొదటి ర్యాంకు సాధించింది. -
ఆదర్శ మాతృమూర్తులకు అవార్డ్స్ ప్రధానం
నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (నాటా) అధ్వర్యంలో 'మదర్స్ డే' వేడుకలను ఘనంగా నిర్వహించారు. నాటా డీసీ మెట్రో వారు గత మూడు సంవత్సరాల నుంచి ప్రతి ఏటా నలుగురు ఆదర్శ మాతృమూర్తులను గుర్తించి వారికి గౌరవ ప్రదమైన ఆదర్శ మాతృమూర్తి పురస్కారాలతో సత్కరించడం రివాజుగా మారింది. అందులో భాగంగానే ఈసారి కూడా అమెరికా రాజధాని పరిసర ప్రాంతాల తెలుగు సేవా సంస్థలైన తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం (టీడీఎఫ్) అధ్యక్షురాలు కవితా చల్లా, బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం (జీడబ్ల్యూటీసీఎస్) అధ్యక్షురాలు సాయిసుధ పాలడుగు, వారధి అధ్యక్షురాలు పుష్యమి దువ్వూరి, ఉజ్వల ఫౌండేషన్ అధ్యక్షురాలు అనిత ముత్తోజు, రాజధాని ప్రాంతీయ తెలుగు సంఘం (సీఏటీఎస్) అధ్యక్షురాలు సుధారాణి కొండపులను ఆదర్శ మాతృమూర్తి పురస్కారాలకు ఎంపిక చేశారు. వీరంతా తమ కుటుంబ బాధ్యతలే కాక వృత్తి, వ్యాపారాలకు న్యాయం చేస్తూనే అనేక సేవాకార్యక్రమాలతో ఆడదంటే అబల కాదు అని నిరూపిస్తున్నారు. వారిని ఈ ప్రపంచానికి ఆదర్శంగా చూపిస్తూ మదర్స్ డే రోజున వారందరికీ ఆదర్శ మాతృమూర్తి గౌరవ పురస్కారాలను అందజేశారు. కార్యక్రమానికి నాటా ఉమెన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ సుధారాణి సారధ్యం వహించారు. సంధ్య బైరెడ్డి వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ కార్యక్రమాన్ని టీవీ ఏషియా తెలుగు ఛానల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేశారు. రితిక స్వాగత గీతం పాడగా.. ఆర్వీపీ అనిత నాటా సేవా కార్యక్రమాల గురించి తెలియజేశారు. ఆర్వీపీ చైతన్య నాటా ఆధ్వర్యంలో జరిగే పలు కార్యక్రమాలకు తోడ్పాటు అందిస్తున్న నాటా అడ్వైజరీ కౌన్సిల్ గౌరవ చైర్మన్ డాక్టర్ ప్రేమ్ రెడ్డి, నాటా ప్రెసిడెంట్ డాక్టర్ గోసల రాఘవరెడ్డి, ఎగ్జిక్యూటివ్ కమిటీ, అడ్వైజరీ కౌన్సిల్ వారికి, లోకల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీలకు, రీజినల్ వైస్ ప్రెసిడెంట్లకు, రీజినల్ కోఆర్డినేటర్స్‌కు, నాటా నాయకులు సోమవరపు శ్రీనివాసులు రెడ్డి(సంయుక్త కార్యదర్శి), బోర్డు సభ్యులు సతీష్ నరాల, కిరణ్ గుణ్ణం, బాబూ రావు సామల, కలాడి మోహన్, మీడియా మిత్రులకు, నాటా శ్రేయోభిలాషులందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు. -
49 మందికి ‘బాల్ శక్తి’ అవార్డులు
న్యూఢిల్లీ: వివిధ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 49 మంది చిన్నారులకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ‘బాల్ శక్తి’అవార్డులను ప్రదానం చేశారు. 2020 సంవత్సరానికి సంబంధించిన ఈ అవార్డులను రాష్ట్రపతి భవన్లో బుధవారం జరిగిన కార్యక్రమంలో కోవింద్ అందజేశారు. అవార్డు కింద రూ.లక్ష నగదు, ప్రశంసాపత్రాన్ని అందించారు. దీనికిగానూ 5 నుంచి 18 ఏళ్ల మధ్య వయసున్న బాలల్లో ఆవిష్కరణలు, సామాజిక సేవ, క్రీడలు, కళలు, సంస్కృతి తదితర రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారికి ఈ అవార్డులు అందిస్తారు. దొంగల బారి నుంచి రష్యా వాసిని కాపాడిన ఇషాన్ శర్మ.. చిన్న వయసులో సైద్ధాంతిక రచయితగా రికార్డుల్లోకెక్కిన ఓంకార్ సింగ్.. పిన్న వయసున్న పియానిస్ట్ గౌరీ మిశ్రా..తదితరులు అవార్డులు అందుకున్నారు. డౌన్ సిండ్రోమ్, మానసిక వైకల్యంతో బాధపడుతున్న కొరక్ బిశ్వాస్ నాట్య రంగంలో అసాధారణ ప్రతిభ చూపడంతో బాల్ శక్తి అవార్డు అందుకున్నాడు. -
28న క్రెడాయ్ రియల్టీ పురస్కారాలు
హైదరాబాద్, సిటీ బ్యూరో: నిర్మాణ రంగంలో నాణ్యతతో పాటు వినియోగదారుడి భద్రతకు పెద్దపీట వేసిన డెవలపర్‌ను ప్రోత్సహించేందుకే పురస్కారాలను ఆరంభించినట్లు కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) తెలంగాణ శాఖ ఛైర్మన్ గుమ్మి రామిరెడ్డి, అధ్యక్షుడు సీహెచ్ రామచంద్రారెడ్డి చెప్పారు. గురువారమిక్కడ విలేకరులతో వారు మాట్లాడారు. ఈ నెల 28న క్రియేట్–2019 పేరిట హైదరాబాద్ ‘జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్’లో క్రెడాయ్ తెలంగాణ రియాల్టీ పురస్కారాలను అందజేయనున్నట్లు తెలియజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కేటీఆర్ హాజరవుతారని, మొత్తం 13 విభాగాల్లో 103 నామినేషన్లు వచ్చాయని వారు తెలియజేశారు. రేటింగ్ సంస్థ క్రిసిల్ ద్వారా ఆయా ప్రాజెక్టుల లొకేషన్, గ్రీనరీ, నాణ్యత, వినియోగదారుడి భద్రతను పరిగణనలోకి తీసుకుని వాటి ఆధారంగా అవార్డులకు ఎంపిక జరుగుతుందని తెలియజేశారు. ఏపీలో 3 రాజధానులు సరైన నిర్ణయమే.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజధానుల విషయంలో సరైన నిర్ణయం తీసుకున్నారని క్రెడాయ్ సభ్యులు అభిప్రాయపడ్డారు. విలేకరులడిగిన ప్రశ్నకు స్పందిస్తూ... అమరావతితో పాటు కర్నూలు, విశాఖలో రాజధానులు వస్తే మరింత పురోగతి సాధ్యపడుతుందన్నారు. సమావేశంలో క్రెడాయ్ కార్యదర్శి ప్రేమ్‌సాగర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు కె.ఇంద్రసేనా రెడ్డి, జి.అజయ్‌కుమార్, కోశాధికారి బి.పాండు రంగారెడ్డి పాల్గొన్నారు. -
దాసరి గుర్తుండిపోతారు
రాక్‌స్టార్ ఈవెంట్స్, కింగ్ మీడియా ఈవెంట్స్ సంయుక్తంగా దర్శకరత్న దాసరి నారాయణరావు పేరిట ప్రతి యేటా అవార్డులు ప్రదానం చేయనున్నారు. ఎన్ఆర్ఐలు జై శంకర్, కళ్యాణ్, సాయిప్రసాద్ యండమూరి, నాగ రాజు, నవీన్‌తో పాటు వారి స్నేహితులు కలిసి అక్టోబర్ 26న శిల్పకళా వేదికలో ‘దాసరి అవార్డ్స్’ కార్యక్రమం నిర్వహించనున్నారు. అందుకు సంబంధించిన బ్రోచర్‌ను దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, దర్శకుడు రేలంగి నరసింహారావు విడుదల చేశారు. రేలంగి నరసింహారావు మాట్లాడుతూ– ‘‘మా గురువు దాసరి నారాయణరావుగారు మరణించినా కూడా ఇప్పటికీ ఆయనకి అభిమానులు ఉండటం నిజంగా గర్వించదగ్గ విషయం. ఆయన పేరిట అవార్డ్స్‌ను ప్రదానం చేయడం ఇంకా ఆనందదాయకం. అక్టోబర్ 25న దాసరి పద్మగారి జయంతి కాబట్టి ఈ మహోన్నత కార్యక్రమాన్ని అక్టోబర్ 26న కాకుండా 25న జరిపితే బాగుంటుందనేది నా ఉద్దేశం. ప్రతి నెలా కొంతమంది పేద ఆర్టిస్టులకు చెక్కులు ఇవ్వడం, ప్రతియేటా మే 4న తన పుట్టినరోజును పురస్కరించుకొని పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడమంటే దాసరిగారికి చాలా ఇష్టం. దీనిని∙ఆయన ఓ బాధ్యతగా భావించేవారు. ఆ కార్యక్రమాలను కూడా కళ్యాణ్, నాగరాజు, జై శంకర్ తదితరులు ప్రతి యేటా నిర్వర్తిస్తామని మాటిచ్చారు’’ అన్నారు. ఈ సమావేశంలో ఆర్గనైజర్లు (ఎన్ఆర్ఐ) జై శంకర్, కళ్యాణ్, సాయి ప్రసాద్ యండమూరి, నాగరాజు, నవీన్ పాల్గొన్నారు. -
ఆశలకు ఆటగాళ్లు రెక్కలు తొడుగుతున్నారు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ స్థాయిలో భారత క్రీడాకారుల ప్రదర్శన పట్ల దేశ ప్రధాని నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు. దేశానికి కీర్తి ప్రతిష్టలు తెస్తున్న ఆటగాళ్లను జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఆయన అభినందించారు. ‘త్రివర్ణ పతాకాన్ని ఎంతో ఎత్తుకు తీసుకెళుతున్న అథ్లెట్లను ఈ రోజు అభినందిస్తున్నాను. అది బాక్సింగ్‌లో కానివ్వండి లేదా బ్యాడ్మింటన్, టెన్నిస్, లేదంటే మరే క్రీడాంశంలోనైనా సరే... మన ఆశలకు ఆటగాళ్లు కొత్త రెక్కలు తొడుగుతున్నారు. మన దేశం మరింత విశ్వాసంతో ముందుకు వెళుతోందన్న విషయాన్ని క్రీడల్లో సాధిస్తున్న ఫలితాలు ప్రతిబింబిస్తున్నాయి’ అని ప్రధాని వ్యాఖ్యానించారు. హాకీ దిగ్గజం ధ్యాన్‌చంద్ 114వ జయంతి సందర్భంగా ఆయనను మోదీ స్మరించుకొన్నారు. ‘ధ్యాన్చంద్లాంటి గొప్ప వ్యక్తి జన్మించిన రోజు, జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా అందరికీ నా అభినందనలు. హాకీ స్టిక్‌తో ఆయన ప్రపంచాన్ని మంత్రముగ్ధులను చేశారు. ఆయనకు తలవంచి నమస్కరిస్తున్నాను’ అని ప్రధాని అన్నారు. గురువారం ‘జాతీయ క్రీడా పురస్కారాలు’ అందుకున్న ఆటగాళ్లకు కూడా మోదీ తన అభినందనలు తెలిపారు. కన్నుల పండువగా... క్రీడా పురస్కారాల ప్రదానం రాష్ట్రపతి భవన్లో కన్నులపండువగా జరిగింది. రాజీవ్ ఖేల్‌రత్నతో పాటు అర్జున, ద్రోణాచార్య, ధ్యాన్‌చంద్ అవార్డులను విజేతలు అందుకున్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈ అవార్డులు అందజేశారు. ‘ఖేల్‌రత్న’కు ఎంపికైన వారిలో మహిళా పారా అథ్లెట్ దీపా మాలిక్ వీల్‌చైర్‌లో తన అవార్డును స్వీకరించింది. ట్రోఫీ, ప్రశంసాపత్రంతో పాటు రూ.7.5 లక్షల నగదు ప్రోత్సాహకం కూడా ఆమె అందుకుంది. ఈ ఏడాది మొత్తం 19 మంది ‘అర్జున’కు ఎంపికయ్యారు. తెలుగు కుర్రాడు, ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత భమిడిపాటి సాయిప్రణీత్ తన ‘అర్జున’ను స్వీకరించాడు. ఈ కార్యక్రమానికి అతని తల్లిదండ్రులు కూడా హాజరయ్యారు. అర్జున విజేతకు రూ. 5 లక్షల నగదు ప్రోత్సాహకం లభిస్తుంది. హైదరాబాద్‌కే చెందిన షూటర్, లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత గగన్ నారంగ్‌కు చెందిన ‘స్పోర్ట్స్ ప్రమోషన్ ఫౌండేషన్’కు రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్ దక్కింది. దీనిని నారంగ్, తన అకాడమీ కోచ్, సహ భాగస్వామి పవన్ సింగ్‌తో కలిసి అందుకున్నాడు. ఇదే విభాగంలో అనంతపురం జిల్లాకు చెందిన ‘రాయలసీమ డెవలప్మెంట్ ట్రస్ట్’ తరఫున మాంచో ఫెర్రర్ పురస్కారాన్ని స్వీకరించారు. బజరంగ్ గైర్హాజరు... ‘రాజీవ్ ఖేల్‌రత్న’కు ఎంపికైన భారత మేటి రెజ్లర్ బజరంగ్ పూనియా తన అవార్డును అందుకోలేకపోయాడు. వరల్డ్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ సన్నాహాల్లో భాగంగా అతను రష్యాలో ఉన్నాడు. వెస్టిండీస్‌లో ఉన్న క్రికెటర్ రవీంద్ర జడేజా కూడా కార్యక్రమానికి హాజరు కాలేదు. అథ్లెట్లు తజీందర్‌పాల్ సింగ్, మొహమ్మద్ అనస్, షూటర్ అంజుమ్ మౌద్గిల్ కూడా గైర్హాజరయ్యారు. వీరందరికి మరో రోజు క్రీడా మంత్రి కిరణ్ రిజిజు చేతుల మీదుగా అవార్డులను అందజేస్తారు. అవార్డు విజేతల జాబితా రాజీవ్ ఖేల్‌రత్న: బజరంగ్ పూనియా (రెజ్లింగ్), దీపా మాలిక్ (పారా అథ్లెటిక్స్) అర్జున: భమిడిపాటి సాయిప్రణీత్ (బ్యాడ్మింటన్), రవీంద్ర జడేజా, పూనమ్ యాదవ్ (క్రికెట్), మొహమ్మద్ అనస్, తజీందర్‌పాల్ సింగ్, స్వప్న బర్మన్ (అథ్లెటిక్స్), గుర్ప్రీత్ సింగ్ సంధు (ఫుట్‌బాల్), సోనియా లాథర్ (బాక్సింగ్), చింగ్లెన్సానా సింగ్ (హాకీ), ఎస్.భాస్కరన్ (బాడీ బిల్డింగ్), అజయ్ ఠాకూర్ (కబడ్డీ), అంజుమ్ మౌద్గిల్ (షూటింగ్), ప్రమోద్ భగత్ (పారా బ్యాడ్మింటన్), హర్మీత్ దేశాయ్ (టేబుల్ టెన్నిస్), పూజా ధాండా (రెజ్లింగ్), ఫౌద్ మీర్జా (ఈక్వెస్ట్రియన్), సిమ్రన్ సింగ్ షెర్గిల్ (పోలో), సుందర్ సింగ్ గుర్జర్ (పారా అథ్లెటిక్స్), గౌరవ్ సింగ్ గిల్ (మోటార్ స్పోర్ట్స్). ద్రోణాచార్య (రెగ్యులర్): మొహిందర్ సింగ్ ధిల్లాన్ (అథ్లెటిక్స్), సందీప్ గుప్తా (టేబుల్ టెన్నిస్), విమల్ కుమార్ (బ్యాడ్మింటన్). ద్రోణాచార్య (లైఫ్‌టైమ్): సంజయ్ భరద్వాజ్ (క్రికెట్), రామ్‌బీర్ సింగ్ ఖోఖర్ (కబడ్డీ), మెజ్బాన్ పటేల్ (హాకీ). ధ్యాన్‌చంద్ (లైఫ్‌టైమ్ అచీవ్మెంట్): మనోజ్ కుమార్ (రెజ్లింగ్), లాల్రెమ్సంగా (ఆర్చరీ), అరూప్ బసక్ (టేబుల్ టెన్నిస్), నితిన్ కీర్తనే (టెన్నిస్), మాన్యుయెల్ ఫ్రెడ్రిక్స్ (హాకీ). రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్: గగన్ నారంగ్ స్పోర్ట్స్ ప్రమోషన్ ఫౌండేషన్ (షూటింగ్), రాయలసీమ డెవలప్మెంట్ ట్రస్ట్ (మాంచో ఫెర్రర్, అనంతపురం), గో స్పోర్ట్స్ ఫౌండేషన్. మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ ట్రోఫీ (క్రీడా ప్రదర్శనలో ఉత్తమ విశ్వవిద్యాలయం): పంజాబ్ యూనివర్సిటీ (చండీగఢ్). రెజ్లర్ పూజా ధాండ, క్రికెటర్ పూనమ్ యాదవ్, కబడ్డీ ప్లేయర్ అజయ్ ఠాకూర్ ఆర్డీటీ డైరెక్టర్ మాంచో ఫెర్రర్, షూటర్ గగన్ నారంగ్, పవన్ సింగ్ (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
నేడు జాతీయ క్రీడా పురస్కారాల ప్రదానం
భారత హాకీ దిగ్గజం, దివంగత మేజర్ ధ్యాన్‌చంద్ జయంతిని పురస్కరించుకొని ప్రతి యేటా ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు నిర్వహిస్తారు. ఇదే రోజున కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జాతీయ క్రీడా పురస్కారాల విజేతలకు రాష్ట్రపతి భవన్లో అవార్డులు అందజేస్తారు. నేడు జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా 2018 సంవత్సరానికిగాను జాతీయ క్రీడా పురస్కారాలు గెల్చుకున్న ఆటగాళ్లు అవార్డులు స్వీకరించనున్నారు. స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియా, మహిళా పారాథ్లెట్ దీపా మలిక్లు దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘రాజీవ్ గాంధీ ఖేల్‌రత్న’ అందుకోనున్నారు. తెలంగాణ నుంచి బ్యాడ్మింటన్ ప్లేయర్ భమిడిపాటి సాయిప్రణీత్ ‘అర్జున అవార్డు’ను పొందనున్నాడు. సాయంత్రం 5 గంటలకు మొదలయ్యే ఈ కార్యక్రమాన్ని దూరదర్శన్ జాతీయ చానెల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. -
త్వరలో ఏపీ మా అవార్డులు
‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్’ ఆధ్వర్యంలో త్వరలో అవార్డులు ఇవ్వనున్నట్లు ‘మా ఏపీ’ వ్యవస్థాపకుడు–దర్శకుడు దిలీప్‌రాజా, ‘మా ఏపీ’ ప్రెసిడెంట్ సినీ నటి కవిత తెలిపారు. తెనాలిలో ఇటీవల ‘మా ఏపీ’ సర్వసభ్య సమావేశం జరిగింది. తొలుత స్వర్గీయ విజయ నిర్మలకు నివాళులర్పించారు. అనంతరం దిలీప్‌రాజా, కవిత మాట్లాడుతూ– ‘‘2018కి సంబంధించి ఉత్తమ చిత్రాలకు అవార్డులు ఇవ్వనున్నాం. ఎలాంటి జ్యూరీని నియమించకుండా తెలుగు రాష్ట్రాల ప్రజలే న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తారు. ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారిని అవార్డులకు ఎంపిక చేస్తాం. స్వర్గీయ విజయనిర్మల స్మారక అవార్డును ప్రముఖ దర్శకులకుగానీ, ప్రముఖ మహిళా నటీమణికిగానీ ఇస్తాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రజలు ఆగస్టు 15, 2019 వరకు ఎంట్రీలను పంపొచ్చు. తమ పేరు, చిరునామా, ఆధార్ కార్డులతో ప్రజలు తమ తీర్పును సీల్డ్ కవర్లో ‘మా ఏపీ’ కార్యాలయం, ఆలపాటి నగర్, సుల్తానాబాద్, తెనాలి–522201, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్‌కు పంపాలి’’ అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నటుడు, ‘మా ఏపీ’ ప్రధానకార్యదర్శి నర్సింహరాజు, జయశీల, నిర్వహణ కమిటీ చైర్మన్ బాసింశెట్టి వీరబాబు తదితరులు పాల్గొన్నారు. -
సిరివెన్నెలకు పద్మశ్రీ
సాక్షి, న్యూఢిల్లీ: అక్షరాన్ని అందలమెక్కించిన ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. తన పాటతో, తూటాలాంటి మాటతో తెలుగు సినీ రచనా రంగానికి కీర్తిప్రతిష్టలు తీసుకొచ్చిన సిరివెన్నెలకు 2019 ఏడాదికిగానూ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘పద్మ’ పురస్కారాల ప్రదానోత్సవం రెండో విడత కార్యక్రమం శనివారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ దర్బార్ హాల్లో çజరిగింది. రాష్ట్రపతి చేతుల మీదుగా సిరివెన్నెల సీతారామశాస్త్రి పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. పద్మశ్రీ పురస్కారం స్వీకరించిన సిరివెన్నెలను ఢిల్లీ ఆంధ్ర అసోసియేషన్ శనివారం సాయంత్రం ఘనంగా సన్మానించింది. రాష్ట్రపతికి తిమ్మక్క ఆశీస్సులు అవార్డుల ప్రదానోత్సవం సందర్భంగా ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ‘వృక్షమాతె’గా కర్ణాటకలో అందరూ పిలుచుకునే 107 ఏళ్ల సాలుమరద తిమ్మక్క రాష్ట్రపతి నుంచి పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్న అనంతరం రామ్‌నాథ్ కోవింద్ నుదుటిపై చేయుంచి ఆశ్వీదించారు. అలా చేయడం ప్రొటోకాల్‌కు వ్యతిరేకం అయినప్పటికీ రాష్ట్రపతి కూడా తల్లివంటి ఆమె నుంచి ఆశీస్సులను వినమ్రంగా స్వీకరించారు. దీంతో ప్రధాని మోదీ మొదలుకొని దర్బార్ హాల్లో ఉన్న సభికులు పెద్ద పెట్టున హర్షధ్వానాలు వ్యక్తం చేశారు. అర్హుడిగా భావిస్తున్నా: రాష్ట్రపతి కోవింద్ అనంతరం ఈ ఘటనపై రాష్ట్రపతి ట్విట్టర్లో స్పందించారు. ‘పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో ఉత్తములైన, అర్హులైన వారిని గౌరవించడం రాష్ట్రపతికి దక్కే అరుదైన అవకాశం. కానీ, కర్ణాటకకు చెందిన పర్యావరణ ఉద్యమకారిణి, పద్మ అవార్డు గ్రహీతల్లో అత్యంత వయోవృద్ధురాలైన సాలుమరద తిమ్మక్క ఈ రోజు నన్ను ఆశీర్వదించడం నన్ను కదిలించివేసింది. ఆమె ఆశీర్వాదానికి నేను అర్హుడిని. సాధారణ భారతీయులకు ముఖ్యంగా ధైర్యం, పట్టుదల, నిరంతరం శ్రమించే గుణాలున్న భారతీయ మహిళలకు తిమ్మక్క ప్రతినిధి. అవార్డు గ్రహీతల స్ఫూర్తితో దేశం మరింత ఉన్నత శిఖరాలకు ఎదుగుతుంది’ అని కోవింద్ ట్వీట్‌చేశారు. దృఢసంకల్పానికి ప్రతీక కర్ణాటకలోని హుళికల్ గ్రామానికి చెందిన సాలుమరద తిమ్మక్క ధైర్యం, దృఢ సంకల్పానికి ప్రతీక. సంతానం కలగకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందిన తిమ్మక్క ఒక దశలో ఆత్మహత్యకు యత్నించారు. కానీ, భర్త బిక్కల చిక్కయ్య ఆమెకు ధైర్యం నూరిపోసి తోడుగా నిలిచారు. ఆపై ఇద్దరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. మొక్కలను నాటి వాటినే బిడ్డలుగా భావించి సాకాలనుకున్నారు. రోజంతా పొలం పనులు చేసి, సాయంత్రం మొక్కలు నాటేవారు. అలా వారు మొదటి ఏడాది తమ గ్రామ పరిసరాల్లో 10 మొక్కలు నాటారు. ఏడాదికేడాది సంఖ్య పెంచారు. నాటిన మొక్కలను నాలుగైదు కిలోమీటర్ల దూరం నుంచి నీటిని తీసుకువచ్చి మరీ బతికించారు. అలా వారు 65 ఏళ్లలో ఆ ప్రాంతంలో 400 మర్రి చెట్లు సహా 8000 చెట్లను పెంచారు. చిక్కయ్య 1991లో కన్నుమూశారు. -
సార్వభౌమత్వ రక్షణకు సత్తా చాటుతాం
సాక్షి ప్రతినిధి, చెన్నై: సార్వభౌమత్వ రక్షణకు భారత్ అన్ని శక్తులు ఉపయోగిం చుకుంటుందని రాష్ట్రపతి కోవింద్ అన్నారు. తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరు జిల్లా సులుర్లోని ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో సోమవారం అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొని జవాన్లనుద్దేశించి ప్రసంగించారు. ‘భారత్ మిమ్మల్ని చూసి గర్వపడుతోంది. భారత వైమానిక దళాన్ని మరింత ఆధునీకరిస్తున్నాం. 1975 నుంచి హెలికాఫ్టర్‌లో మహిళా పైలట్లు తమ దక్షతను చాటుకుంటున్నారు. 2016 నుంచి యుద్ధ విమానాల్లో సైతం మహిళలకు శిక్షణ ఇస్తున్నాం. ప్రకృతి వైపరీత్యాలు చోటుచేసుకున్నపుడు వైమానిక దళాల సేవలు వెలకట్టలేనివి’ అని ఆయన కొనియాడారు. కార్యక్రమంలో తమిళనాడు గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్, కేంద్ర రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. -
మీ అభిప్రాయాన్ని గౌరవిస్తున్నాం
91వ ఆస్కార్ అవార్డ్ ఫంక్షన్లో నాలుగు విభాగాలను (ఎడిటింగ్, లైవ్ యాక్షన్ షార్ట్, మేకప్ అండ్ హైయిర్ స్టైల్) తొలగిస్తున్నట్టు, ఆ విభాగాలకు సంబంధించిన అవార్డులను యాడ్స్ బ్రేక్‌లో ప్రదానం చేయనున్నట్లు ఆస్కార్ బృందం పేర్కొంది. పలువురు హాలీవుడ్ నటులు, సాంకేతిక నిపుణులు ఈ నిర్ణయం కరెక్ట్ కాదన్నారు. ‘‘మీ అందరి అభిప్రాయాలను స్వీకరించాం. వాటిని గౌరవిస్తున్నాం. ఆస్కార్ అవార్డ్స్ ఫంక్షన్ మునుపటిలానే ఎటువంటి ఎడిటింగ్ లేకుండా జరుగుతుంది’’ అని అకాడమీ బృందం పేర్కొంది. వచ్చే ఆదివారం (భారతీయ కాలమానం ప్రకారం సోమవారం ఉదయం) ఆస్కార్ అవార్డ్ వేడుక జరగనుంది. ఆస్కార్.. నాట్ సో వైట్? ఆస్కార్ అవార్డ్ ఫంక్షన్లో నల్ల జాతీయులకు దక్కే ప్రాధాన్యం గురించి చర్చ జరుగుతోంది. ఆస్కార్ తెల్లవాళ్ల వైపే మొగ్గు చూపుతుంది అనే కలర్‌ఫుల్ కామెంట్‌ను మోస్తూ వస్తోంది అకాడమీ. అయితే ఈ ఏడాది నామినేషన్లో నల్లజాతీయులు సుమారు 15మంది వరకూ కనిపించనున్నారు. దర్శకుల విభాగంలో ఇద్దరు (మునుపు ఒక్కరు లిస్ట్‌లో కూడా ఉన్న దాఖలాలు లేవు), ప్రొడక్షన్ డిజైనర్ విభాగంలో నల్లజాతీయురాలు (హన్నా బీచ్లర్) ఎంపిక కావడం మొట్టమొదటిసారి. గతేడాది ఆస్కార్‌ను వీక్షించిన వారి సంఖ్య రికార్డ్ స్థాయిలో తగ్గిపోయిందని, అందుకే నల్ల జాతీయులకూ ప్రాధాన్యం ఇచ్చారని, 2015లో ‘ఆస్కార్ సో వైట్’ అనే నిందను పోగొట్టుకోవడానికి కూడా ఇలా చేశారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఆస్కార్ నాట్ సో వైట్ అనిపించుకోవడానికి కమిటీ ప్రయత్నం చేస్తోందని అర్థం అవుతోంది. -
సివిల్ సర్వీసెస్ అధికారులకు అవార్డులు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మకమైన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లిన అధికారులకు ఏప్రిల్ 21న సివిల్ సర్వీసెస్ డే సందర్భంగా ప్రధాని మోదీ అవార్డులు అందించనున్నారు. వివిధ శాఖల అధికారుల నుంచి మొత్తం 623 జిల్లాల నుంచి 2010 దరఖాస్తులు వచ్చినట్లు కేంద్ర సిబ్బంది శిక్షణ వ్యవహారాల శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ ఏడాది ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, డిజిటల్ చెల్లింపులు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన (అర్బన్, రూరల్), దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ్ కౌశల్య యోజన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లిన అధికారులకు అవార్డులు ఇవ్వనున్నారు. కేంద్ర ప్రభుత్వంలో సేవలందిస్తున్న అడిషనల్ సెక్రటరీ /జాయింట్ సెక్రటరీ, డైరెక్టర్/ డిప్యూటీ సెక్రటరీ హోదాలో ఉన్న అధికారులకు ఈ అవార్డులు అందిస్తారు. కేంద్ర, రాష్ట్ర, జిల్లా స్థాయిలో వాతావరణ పరిరక్షణకు, విపత్తుల నిర్వహణ, జలవనరుల సంరక్షణ, విద్యుత్, విద్య, ఆరోగ్యం, మహిళలు, శిశువుల సంక్షేమానికి కృషి చేసిన వారికి కూడా అవార్డులు అందజేస్తారు. -
ఎల్పీయూ అవార్డుల ప్రదానం
న్యూఢిల్లీ: ఉత్తమ పాఠశాలలు, ఉపాధ్యాయులకు మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ‘ఎల్పీయూ ట్రాన్స్ఫార్మింగ్ ఎడ్యుకేషన్’ అవార్డులను తన నివాసంలో ప్రదానం చేశారు. దేశవ్యాప్తంగా 89 పాఠశాలలు, 29 కోచింగ్ సెంటర్లకు రూ. కోటి విలువైన గ్రాంట్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులకు ప్రోత్సాహకంగా నగదు బహుమతులను అందజేశారు. విద్యార్థులతో మాట్లాడేందుకు వీలుగా ‘ప్రణబ్ సర్ కి పాఠశాల’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా తొలి కార్యక్రమంలో లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ(ఎల్పీయూ) విద్యార్థులతో ముచ్చటిస్తూ.. రిజర్వేషన్లు, సమానత్వం, భావి భారత దార్శనికత తదితర అంశాలకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. -
ఉపాధ్యాయులంతా ఉత్తములే
♦ అవార్డులతో గుర్తించాల్సిన అవసరం లేదు ♦ మరింత ప్రోత్సహించేందుకే సన్మానాలు ♦ కష్టపడండి.. ప్రతిభావంతుల్ని తీర్చిదిద్దండి ♦ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో చైర్పర్సన్ సునీతారెడ్డి ♦ 92 మంది టీచర్లకు పురస్కారాల ప్రదానం సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘ఉపాధ్యాయ వృత్తి ఉత్తమమైంది. అవార్డులు అందుకునే వారే కాదు.. ప్రతి టీచరూ ఉత్తముడే. వారిని మరింత ప్రోత్సహించేందుకు కొందరిని ఎంపిక చేసి ప్రత్యేకంగా కార్యక్రమం నిర్వహించి పురస్కరిస్తున్నాం.’ అని జెడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి పేర్కొన్నారు. జిల్లా పరిషత్‌లో గురువారం నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో ఆమె మాట్లాడారు. భావిభారత పౌరులు తయారయ్యేది పాఠశాలల్లోనే అని, ప్రతి టీచరు వారి వృత్తికి వందశాతం న్యాయం చేస్తేనే దేశం పురోగమిస్తుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల సమస్యలున్నాయని, వాటిని పరిష్కరించేందుకు జిల్లా పరిషత్ ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తుందన్నారు. సమస్యలున్నప్పటికీ బోధనపై మరింత దృష్టి కేంద్రీకరించాలని ఆమె సూచించారు. ప్రభుత్వ పథకాలపైనా అవగాహన అవసరం.. పాఠశాలల్లో విద్యార్థులకు పాఠ్యాంశ బోధనతోపాటు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపైనా అవగాహన కల్పించాల్సిన ఆవశ్యకత ఉందని జెడ్పీ చైర్పర్సన్ గుర్తు చేశారు. విద్యార్థులను చైతన్య పరిస్తే క్షేత్రస్థాయిలో సత్ఫలితాలు వస్తాయన్నారు. హరితహారంలో భాగంగా ప్రతి పాఠశాలలో మెక్కలు నాటి వాటిని సంరక్షించాలని, ఇబ్రహీంపట్నం ప్రాంతంలో తీవ్ర కరువున్నందున అక్కడ విరివిగా మొక్కలు నాటాలన్నారు. మధ్యాహ్న భోజన అనంతరం చేతులు కడిగే నీటిని మొక్కలకు మళ్లించే ఏర్పాటు చేయాలని సూచించారు. ఇటీవల విద్యుదాఘాతంతో ప్రధానోపాధ్యాయురాలు ప్రభావతి మరణించడం విద్యాశాఖకు తీరని లోటన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్ల సౌకర్యం కోసం జిల్లా పరిషత్ నుంచి రూ.3 కోట్లు విడుదల చేశామన్నారు. ప్రతి పాఠశాలకు మౌలిక వసతులు కల్పిస్తామని, ఒకేసారి కాకుండా విడతలవారీగా పూర్తి చేస్తామన్నారు. కార్యక్రమంలో 92 మంది టీచర్లకు శాలువా, మెమోంటోతో సన్మానించారు. కార్యక్రమంలో డీఈఓ రమేష్, సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్టు అధికారి శ్రీనివాస్, డీసీఎంఎస్ చైర్మన్ శ్రవణ్, జెడ్పీ సీఈఓ రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలు
తూర్పుగోదావరి జిల్లాలోని పెద్దాపురం నియోజకవర్గంలో జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలు ఆదివారం జరిగాయి. ఈ వేడుకల సందర్భంగా పెద్దాపురం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కొత్తగా ఓటు నమోదు చేయించుకున్నవారిని సీనియర్ సిటిజన్స్ సన్మానించారు. అనంతరం వారికి ఓటరు గుర్తింపుకార్డులు అందజేశారు. ఓటర్ల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీలలో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో పెద్దాపురం ఆర్డీవో విశ్వేశ్వరరావు, పెద్దాపురం మున్సిపల్‌చైర్మన్ రాజు, తహశీల్దార్లు శ్రీదేవి, సునీల్‌బాబు తదితరులు పాల్గొన్నారు. -
మేమేం చేశాం.. పాపం
సాక్షి, విశాఖపట్నం: హుద్‌హుద్ తుపాను సహాయ, పునరావాస చర్యల్లో పాల్గొన్న వివిధ శాఖల అధికారులు, సిబ్బందికి అవార్డుల ప్రదానంలో అన్యా యం జరిగింది. అవార్డులు కాదు కదా కనీసం సోమవారం రాత్రి వుడా పార్కు ఆవరణలో జరిగిన అభినందన సభకు ఆహ్వానం కూడా రాలేదు. దీనిపై వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ శాఖతో పాటు దాని అనుబంధ శాఖలైన మత్స్య, పశుసంవర్థక, పాడి పరిశ్రమలు తదితర శాఖలను పూర్తిగా విస్మరించారంటూ ఆయా ఉద్యోగ సంఘాల ప్రతినిధులు మంగళవారం కలెక్టర్ ఎన్.యువరాజ్‌ను కలిసి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. తుపాను సమయంలో కుటుంబాలను పట్టించుకోకుండా ప్రజల కోసం రేయింబవళ్లు శ్రమించామని, అయినా తమను గుర్తించకపోవడం బాధిస్తోందని వారు కలెక్టర్ వద్ద గోడు వెళ్లబోసుకున్నారు. ఏపీ ఎన్జీవో సంఘ నేతలు చెప్పిన సంఘాలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవడం ఎంతవరకు సమంజసమని, తాము కూడా గెజిటెడ్ ఉద్యోగులమేనని వ్యవసాయ శాఖాధికారులు ఆవేదన వ్యక్తం చేశారు. గణతంత్ర, స్వాతంత్య్ర దినోత్సవ సమయంలో కూడా అవార్డుల ప్రదానంలో ఇదే రీతిలో తమను చిన్నచూపు చూస్తున్నారంటూ వారు వాపోయారు. ఈసారి అన్ని శాఖలను పరిగణనలోకి తీసుకునేలా చర్యలు తీసుకుంటామని, ప్రతి ఒక్కరి సేవలను గుర్తించి తగురీతిలో గౌరవిస్తామని కలెక్టర్ వారికి హామీ ఇచ్చారు.