91వ ఆస్కార్ అవార్డ్ ఫంక్షన్‌లో నాలుగు విభాగాలను (ఎడిటింగ్, లైవ్ యాక్షన్ షార్ట్, మేకప్ అండ్ హైయిర్ స్టైల్) తొలగిస్తున్నట్టు, ఆ విభాగాలకు సంబంధించిన అవార్డులను యాడ్స్ బ్రేక్‌లో ప్రదానం చేయనున్నట్లు ఆస్కార్ బృందం పేర్కొంది. పలువురు హాలీవుడ్ నటులు, సాంకేతిక నిపుణులు ఈ నిర్ణయం కరెక్ట్ కాదన్నారు. ‘‘మీ అందరి అభిప్రాయాలను స్వీకరించాం. వాటిని గౌరవిస్తున్నాం. ఆస్కార్ అవార్డ్స్ ఫంక్షన్ మునుపటిలానే ఎటువంటి ఎడిటింగ్ లేకుండా జరుగుతుంది’’ అని అకాడమీ బృందం పేర్కొంది. వచ్చే ఆదివారం (భారతీయ కాలమానం ప్రకారం సోమవారం ఉదయం) ఆస్కార్ అవార్డ్ వేడుక జరగనుంది.
ఆస్కార్.. నాట్ సో వైట్?
ఆస్కార్ అవార్డ్ ఫంక్షన్‌లో నల్ల జాతీయులకు దక్కే ప్రాధాన్యం గురించి చర్చ జరుగుతోంది. ఆస్కార్ తెల్లవాళ్ల వైపే మొగ్గు చూపుతుంది అనే కలర్‌ఫుల్ కామెంట్‌ను మోస్తూ వస్తోంది అకాడమీ. అయితే ఈ ఏడాది నామినేషన్‌లో నల్లజాతీయులు సుమారు 15మంది వరకూ కనిపించనున్నారు. దర్శకుల విభాగంలో ఇద్దరు (మునుపు ఒక్కరు లిస్ట్‌లో కూడా ఉన్న దాఖలాలు లేవు), ప్రొడక్షన్ డిజైనర్ విభాగంలో నల్లజాతీయురాలు (హన్నా బీచ్లర్) ఎంపిక కావడం మొట్టమొదటిసారి. గతేడాది ఆస్కార్‌ను వీక్షించిన వారి సంఖ్య రికార్డ్ స్థాయిలో తగ్గిపోయిందని, అందుకే నల్ల జాతీయులకూ ప్రాధాన్యం ఇచ్చారని, 2015లో ‘ఆస్కార్ సో వైట్’ అనే నిందను పోగొట్టుకోవడానికి కూడా ఇలా చేశారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఆస్కార్ నాట్ సో వైట్ అనిపించుకోవడానికి కమిటీ ప్రయత్నం చేస్తోందని అర్థం అవుతోంది.
మీ అభిప్రాయాన్ని గౌరవిస్తున్నాం
Published Sun, Feb 17 2019 3:12 AM | Last Updated on Sun, Feb 17 2019 3:12 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment