'Everything Everywhere All At Once' Movie Wins 7 Oscars - Sakshi
Sakshi News home page

Oscars 2023: అత్యధిక ఆస్కార్స్‌ గెలుచుకున్న చిత్రమిదే.. పదేళ్ల కష్టానికి ప్రతిఫలం

Published Tue, Mar 14 2023 8:57 AM

Everything Every Where All At Once Movie Wins 7 Oscars - Sakshi

మిషెల్‌ యో, స్టెఫానీ, కే హుయ్‌ క్వాన్, జెన్నీ స్లాట్, జామి లీ కర్టిస్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఎవ్రీవేర్‌ ఎవ్రీథింగ్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌’. డేనియల్‌ క్వాన్, డేనియల్‌ స్కీనెర్ట్‌ సంయుక్త దర్శకత్వంలో రూపొందిన ఈ సైన్స్‌ ఫిక్షన్‌ మూవీ గత ఏడాదిæ బాక్సాఫీస్‌ వద్ద సూపర్‌ బంపర్‌హిట్‌ కొట్టింది. 25 మిలియన్‌ డాలర్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం అంతకు నాలుగు రెట్లు అంటే వంద మిలియన్‌ డాలర్లకుపైగా వసూలు చేసింది.

ఇక ఏడు ఆస్కార్‌ అవార్డులను సాధించిన ఈ చిత్రకథ విషయానికి వస్తే... చైనా నుంచి అమెరికాకు వలస వచ్చిన ఎవిలిన్‌ క్వాడ్‌ కుటుంబం అక్కడ లాండ్రీషాపు పెట్టుకుని జీవనం సాగిస్తుంటుంది. వీరు ఒక ప్రపంచంలో జీవిస్తున్నట్లే మరో ప్రపంచంలో వీరిలాంటి వారే ఉంటారు. వీరు ఒకరికొకరు తారసపడినప్పుడు ఎలాంటి విపత్కర పరిస్థితులు ఏర్పడతాయి అన్నదే కథ.

ఈ మల్టీవర్స్‌ కాన్సెప్ట్‌ ప్రేక్షకులను బాగా మెప్పించింది. ఈ చిత్రదర్శకులు డేనియల్‌ క్వాన్, స్కీనెర్ట్‌ 2010లోనే ‘ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌’ చిత్రకథను స్టార్ట్‌ చేశారు. కానీ షూటింగ్‌కి వెళ్లడానికి పదేళ్లు పట్టింది. రెండేళ్లకు పైగా షూటింగ్‌ జరుపుకున్న ఈ చిత్రం 2022 లో విడుదలై అఖండ విజయాన్ని అందుకుంది.


 

Advertisement
 
Advertisement
 
Advertisement