న్యూఢిల్లీ: వివిధ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 49 మంది చిన్నారులకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ‘బాల్ శక్తి’అవార్డులను ప్రదానం చేశారు. 2020 సంవత్సరానికి సంబంధించిన ఈ అవార్డులను రాష్ట్రపతి భవన్‌లో బుధవారం జరిగిన కార్యక్రమంలో కోవింద్ అందజేశారు. అవార్డు కింద రూ.లక్ష నగదు, ప్రశంసాపత్రాన్ని అందించారు. దీనికిగానూ 5 నుంచి 18 ఏళ్ల మధ్య వయసున్న బాలల్లో ఆవిష్కరణలు, సామాజిక సేవ, క్రీడలు, కళలు, సంస్కృతి తదితర రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారికి ఈ అవార్డులు అందిస్తారు. దొంగల బారి నుంచి రష్యా వాసిని కాపాడిన ఇషాన్ శర్మ.. చిన్న వయసులో సైద్ధాంతిక రచయితగా రికార్డుల్లోకెక్కిన ఓంకార్ సింగ్.. పిన్న వయసున్న పియానిస్ట్ గౌరీ మిశ్రా..తదితరులు అవార్డులు అందుకున్నారు. డౌన్ సిండ్రోమ్, మానసిక వైకల్యంతో బాధపడుతున్న కొరక్ బిశ్వాస్ నాట్య రంగంలో అసాధారణ ప్రతిభ చూపడంతో బాల్ శక్తి అవార్డు అందుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment