rashtrapati bhavan
-
రాష్ట్రపతి భవన్‌కు పెళ్లి కళ
సాక్షి, న్యూఢిల్లీ: చరిత్రలోనే మొట్టమొదటి సారిగా రాష్ట్రపతి భవన్లో పెళ్లి వేడుక జరగనుంది. ఈ నెల 12న జరిగే ఈ వేడుక కోసం యంత్రాంగం రాష్ట్రపతి భవన్‌ను ముస్తాబు చేసింది. భారీగా భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. ఇంతకీ పెళ్లెవరిది? అని కదా మీ సందేహం! రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కుటుంబసభ్యులదీ, సంబంధీకులదీ మాత్రం కాదు! రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వ్యక్తిగత భద్రతా అధికారి(పీఎస్వో) పూనమ్ గుప్తా పెళ్లి. పూనమ్ వినతి మేరకు ఈ వేడుకకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అనుమతినిచ్చారు. జమ్మూకశ్మీర్‌కు చెందిన సీఆర్పీఎప్ అసిస్టెంట్ కమాండెంట్ అవ్నీశ్ కుమార్, పూనమ్ గుప్తా ఓ ఇంటి వారు కానున్నారు. రాష్ట్రపతి ముర్ము సారథ్యంలో అంగరంగ వైభవంగా జరిగే ఈ కార్యక్రమానికి హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ తదితర ప్రముఖులు హాజరుకానున్నారు. జీవితాంతం గుర్తుండిపోయే కానుక మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చెందిన పూనమ్‌గుప్తా 2018 యూపీఎస్సీ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్(సీఆర్ఎఫ్) విభాగంలో 81వ ర్యాంకు సాధించారు. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్‌గా బిహార్‌లోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతంలో పని చేశారు. ఆ తర్వాత ఆమె రాష్ట్రపతి పీఎస్ఓగా నియమితులయ్యారు. జమ్మూకశ్మీర్‌లో సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్‌గా ఉన్న అవ్నీశ్ కుమార్‌తో ఈమె వివాహం నిశ్చయమైంది. కుటుంబ సభ్యులు మధ్యప్రదేశ్ లేదా కశ్మీర్లో వివాహం చేయాలని యోచిస్తుండగా కాబోయే వధువు పూనమ్ మాత్రం సరికొత్తగా ఆలోచించారు. ‘మీకు పీఎస్ఓగా పనిచేయడం నాకెంతో ఆనందంగా ఉంది. దీనిని నేను ఒక బాధ్యతగా స్వీకరిస్తున్నాను. నాకు వివాహం నిశ్చయమైంది. రాష్ట్రపతి భవన్లో పెళ్లి చేసుకోవాలనేది నా చిరకాల కోరిక. నా కోరికను మీరు తీరుస్తారని ప్రారి్థస్తున్నాను’అంటూ రెండు నెలల క్రితం రాష్ట్రపతికి లేఖ రాశారు. ఈ లేఖపై రాష్ట్రపతి ముర్ము సానుకూలంగా స్పందించారు. ‘డియర్, పూనమ్ గుప్తా(పీఎస్వో) మీకు వివాహ శుభాకాంక్షలు. విధుల్లో మీరు కనబరుస్తున్న శ్రద్ద, బాధ్యత నాకెంతో నచ్చాయి. మీ వివాహ వేడుకను రాష్ట్రపతి భవన్లో జరిపేందుకు అనుమతి ఇస్తున్నాను’అంటూ బదులిచ్చారు. దీంతో పూనమ్గుప్తాకు రాష్ట్రపతి జీవితాంతం గుర్తుండిపోయే కానుకను ఇచ్చారంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ముస్తాబవుతున్న రాష్ట్రపతి కార్యాలయం పూనమ్ అవ్నీశ్ల పెళ్లి వేడుకకు రాష్ట్రపతి కార్యాలయంలోని మదర్ థెరిస్సా క్రౌన్కాంప్లెక్స్ సిద్దమైంది. భారతీయ, సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడేలా వేదికను అలంకరించారు. వేడుక అతి కొద్ది మంది సమక్షంలో జరగనుంది. వధూవరుల కుటుంబ సభ్యులు వంద మంది, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు, సీఆర్పీఎఫ్ డీజీ, ఢిల్లీ పోలీస్ ఉన్నత అధికారులు హాజరు కానున్నట్లు తెలిసింది. చారిత్రక కట్టడం రెండు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న రాష్ట్రపతి భవన్ చరిత్రల సమ్మేళనంతో కూడిన ఓ కళాఖండమే. మొత్తం నాలుగు అంతస్తుల్లో 340 గదులు ఉంటాయి. గదులు, కారిడార్లు, కోర్టులు, గ్యాలరీలు, సెలూన్లు, వంటశాలలు, ప్రింటింగ్ ప్రెస్, థియేటర్లు... ఇలా వీటన్నింటినీ కాలినడకన తిరుగుతూ చూడాలంటే కనీసం మూడు గంటల సమయం పడుతుంది. ఇటలీలోని క్విరినల్ ప్యాలస్ తర్వాత ప్రపంచంలో రెండో అతిపెద్ద దేశాధినేత భవనంగా రాష్ట్రపతి భవనం నిలుస్తుంది. ప్రఖాత్య అమృత ఉద్యాన్, ఒక మ్యూజియం, గణతంత్ర, అశోక మండపాలు, రాగి ముఖం గల గోపురాలు ఉన్నాయి. ఈ భవన్లో మొట్టమొదటిగా 1948లో స్వతంత్ర భారతదేశపు మొదటి గవర్నర్ జనరల్ సి.రాజగోపాలాచారి నివసించారు. రాష్ట్రపతి భవన్లో నివసించిన మొదటి భారతీయుడిగా చరిత్రలో నిలిచారు. -
ఎవరీ పూనమ్ గుప్తా..? ఏకంగా రాష్ట్రపతి భవన్లో పెళ్లి..!
వివాహం మనకు నచ్చిన చోటు లేదా విదేశాల్లో చేసుకుంటారు. ఇంకాస్త బడా బాబులైతే లగ్జరీయస్ హోటల్స్ లేదా ప్యాలెస్‌లలో చేసుకుంటారు. కానీ ఇలా ఏకంగా రాష్ట్రపతిలో భవన్లో వివాహంలో జరగడం గురించి విన్నారా..!. ఔను సీఆర్పీఎఫ్ అధికారిణి పూనమ్ గుప్తా ఆ లక్కీఛాన్స్ కొట్టేసింది. ఇలా భారతదేశ రాష్ట్రపతి భవన్లో జరుగనున్న తొలి పెళ్లి ఇదే కావడం విశేషం. అసలు ఆ అధికారిణికి ఇలాంటి అవకాశం ఎలా దక్కింది? రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎలా అనుమతించారు తదితరాల గురించి ఈ కథనంలో తెలుసుకుందామా..!.భారతదేశ అత్యున్నత శక్తికి కేంద్రబిందువు రాష్ట్రపతి భవనం(Rashtrapati Bhavan). అలాంటి అత్యున్నత గౌరవనీయ ప్రదేశంలో సీఆర్పీఎఫ్ అధికారిణి వివాహం ఫిబ్రవరి 12, 2025న రాష్ట్రపతి భవన్లో జరగనున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. భారతదేశ రాష్ట్రపతి భవన్ ప్రపంచంలోనే రెండొవ అదిపెద్ద నివాసం. దీన్ని సర్ ఎడ్విన్ లుటియెన్స్ రూపొందించారు. దీన్ని దాదాపు 300 ఎకరాల ఎస్టేట్‌లో నిర్మించారు. రాష్ట్రపతి భవన్లో మొత్తం నాలుగు అంతస్తులు, 340 గదులు ఉంటాయి. దీనితోపాటు అమృత్ ఉద్యాన్, మ్యూజియం, గణతంత్ర మండపం, అశోక మండపం, రాగి ముఖం గల గోపురం కూడా ఉన్నాయి. అంతేగాదు 1948 స్వతంత్ర భారతదేశంలో తొలి గవర్నర్ జనరల్ సీ రాజగోపాలాచారి ఈ రాష్ట్రపతి భవన్లో నివశించిన తొలి భారతీయుడు. అలా ఎందరో రాష్ట్రపతులు ఈ భవన్లో నివశించారు. అలాగే ఎందరో ఉన్నతస్థాయి ప్రముఖులు ఇందులో ఆతిథ్యం పొందారు. అలాంటి ఘన చరిత్ర గలిగిన ప్రతిష్టాత్మక రాష్ట్రపతి భవన్లో సీఆర్పీఎఫ్ అధికారిణి పూనమ్ గుప్తా(Poonam Gupta) వివాహం జరగనుండటానికి గల కారణం ఏంటంటే..అనుమతి ఎలా లభించిందంటే..సీఆర్పీఎఫ్ అధికారిణి పూనమ్ గుప్తా రాష్ట్రపతి భవన్లో పీఎస్ఓగా నియమితులయ్యారు. ఆమె 74వ గణతంత్ర దినోత్సవం పరేడ్(74th Republic Day Parade)లో పూర్తిగా మహిళా బృందానికి నాయకత్వం వహించింది. అలాగే పూనమ్ వృత్తిపరంగా నిబద్ధతగా, అంకితభావంతో పనిచేసే ప్రవర్త నియమావళే ఆ అదృష్టాన్ని పొందేలా చేసింది. ఆ నేపథ్యంలోనే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమెకు అనుమతిచ్చారు. దీంతో పూనమ్ ఇలా రాష్ట్రపతి భవన్లో వివాహం చేసుకున్న తొలిగా వ్యక్తి చరిత్ర సృష్టించనుంది. పూనమ్ గుప్తా ఎవరంటే..సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్(CRPF Assistant Commandant) పూనమ్ గుప్తా మధ్యప్రదేశ్(Madhya Pradesh)కు చెందిన మహిళ. ఆమె 2018 యూపీఎస్సీ, సీఆర్పీఎఫ్ పరీక్షలో ఉత్తీర్ణురాలై 81వ ర్యాంకుని సాధించింది. ఆ తర్వాత ఆమె సీఆర్పీఎఫ్లో అసిస్టెంట్ కమాండెంట్‌గా బాధ్యతలు చేపట్టింది. అలా బీహార్‌లోని నక్సల్స్ ప్రభావిత జోన్లో కూడా పనిచేశారు. అక్కడ ఆమె కనబర్చిన ధైర్య సాహసాలు అసామాన్యమైనవి. ఇక ఆమె కాబోయే భర్త అవినాష్ కుమార్ కూడా సీఆర్ఎఫ్ కమాండెంట్. ప్రస్తుతం అతడు జమ్ము కాశ్మీర్లో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ నెల(ఫిబ్రవరి 12, 20205న) రాష్ట్రపతి భవన్‌లోని ఆ జంట వివాహం మదర్ థెరిసా క్రౌన్ కాంప్లెక్స్‌లో జరగనుంది. ఈ వివాహానికి ఇరువురి దగ్గరి కుటుంబ సభ్యలు మాత్రమే హాజరవుతారు. ఇలా రాష్ట్రపతి భవన్లో వివాహం చేసుకునే అదృష్టం దక్కిన ఆ అధికారిణికి శుభాకాంక్షలు చెబుదామా..!.(చదవండి: బట్టతల అందమే..! చూసే విధానంలోనే ఉందంతా..) -
Republic Day 2025: జయమ్మ విజయం
‘మన దేశంలో పేదలు కలలు కనగలరు. వాటిని నిజం చేసుకోగలరు’ అనే మాట ఎన్నో సందర్భాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నోటి నుంచి వినిపించింది. పేదరాలైన జయమ్మ కల కన్నది. ‘నా కష్టాన్ని చూసి నలుగురు మెచ్చుకుంటే చాలు’ నలుగురు ఏం ఖర్మ... సాక్షాత్తూ రాష్ట్రపతిభవన్ ఆమె కష్టాన్ని గుర్తించింది.‘నీ భర్త ఏం పనిచేస్తాడు?’ అనే ప్రశ్నకు... జయమ్మ చెప్పిన జవాబుకు అవతలి వ్యక్తి ముఖం అదోలా మారిపోయేది. మాటల్లో చిన్న చూపు కనిపించేది.నెల్లూరుకు చెందిన జయమ్మ ఔట్సోర్సింగ్ పారిశుధ్య కార్మికురాలు. దీంతోపాటు భర్తతో కలిసి సెప్టిక్ ట్యాంకు క్లీనింగ్ పనులు చేస్తుంది.‘చేయడానికి మీకు ఈ పనే దొరికిందా తల్లీ’ అని వెక్కిరించిన వాళ్లు ఎందరో! అయితే ఏ రోజూ చేస్తున్న పనిపట్ల నిర్లక్ష్యం, విముఖత జయమ్మలో కనిపించలేదు. ఆమె రెక్కల కష్టం వృథా పోలేదు. వృత్తి పట్ల జయమ్మ అంకితభావానికి గుర్తింపుగా దిల్లీలోని రాష్ట్రపతిభవన్‌లో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి ఆహ్వానం అందింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇస్తున్న విందులో పాల్గొనబోతోంది జయమ్మ.‘పెద్దోళ్లకు అందరూ చుట్టాలే. పేదోళ్లకు కష్టాలే చుట్టాలు’ అంటుండేది జయమ్మ తల్లి రాజమ్మ.ఆ ఇంటికి కష్టాలు కొత్త కాదు. కష్టపడడం కొత్త కాదు. నెల్లూరు నగరంలోని ఉమ్మారెడ్డిగుంట ప్రాంతానికి చెందిన జయమ్మ తన తల్లిదండ్రులకు సాయంగా రోజువారీ కూలిపనులకు వెళ్తుండేది. ‘ఏ పనీ లేకుండా ఇంట్లో కూర్చోవడం కంటే పనికి పోవడమే నాకు ఇష్టం’ అంటున్న జయమ్మకు ‘శ్రమ’ అనేది చిన్నప్పటి నేస్తం.జయమ్మకు రమేష్‌తో వివాహం జరిగింది. రమేష్ మొదట్లో సెప్టిక్‌ట్యాంక్ వాహనానికి డ్రైవర్‌గా వెళ్తుండేవాడు. పదేళ్లపాటు డ్రైవర్‌గా పనిచేసిన అనుభవంతో తానే సొంతంగా ఓ సెప్టిక్ ట్యాంకర్ సెకండ్ హ్యాండ్ వాహనాన్ని కొనుగోలు చేసి క్లీనింగ్ పనులు చేసుకుంటూ కుటుంబ పోషణ చేసేవాడు. ఇద్దరు పిల్లలు స్కూల్‌కి వెళ్లే వయస్సు వచ్చేవరకు గృహిణిగా ఉన్న జయమ్మ ఆ తరువాత భర్త చేసే సెప్టిక్ ట్యాంకు క్లీనింగ్ పనులకు తాను కూడా తోడుగా వెళ్తుండేది.చిన్నచూపు చూసినా..భూగర్భ డ్రైనేజీ పారిశుధ్య పనులకు వెళ్లే జయమ్మను తోటివారే చిన్నచూపు చూసేవారు. అవేమీ పట్టించుకోకుండా భర్తకు చేదోడువాదోడుగా ఉండేది. క్లీనింగ్ సమయాల్లో చర్మవ్యాధుల బారిన పడేది. ఈ దంపతుల కష్టాన్ని చూసిన ‘నవజీవన్ ’ అనే స్వచ్ఛంద సంస్థ నాలుగేళ్ల క్రితం నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ షూరిటీతోపాటు ఎన్ ఎస్కేఎఫ్డీ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకు రుణం మంజూరు చేయించింది. రూ.10 లక్షల సబ్సిడీతో రూ.32 లక్షలు విలువైన కొత్త సెప్టిక్ ట్యాంకర్ క్లీనింగ్ వాహనాన్ని మంజూరు చేయించడంతో వారికి సొంతవాహనం సమకూరింది. దీంతో దంపతులిద్దరూ సొంత వాహనంతో పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కార్పొరేషన్ అధికారుల సహకారంతో నగరంలోని ఎన్నో నివాసాల్లో సెప్టిక్‌ట్యాంక్ క్లీనింగ్ పనులు చేస్తున్నారు.అన్ని అంశాల్లో మంచి మార్కులుకేంద్ర ప్రభుత్వ ఎన్ ఎస్కేఎఫ్డీసీ (నేషనల్ సఫాయి కర్మచారీస్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పోరేషన్) పథకం లబ్ధిదారు అయిన జయమ్మ సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ వాహనానికి యజమాని అయింది. పథకాన్ని ఏ మేరకు సద్వినియోగం చేసుకున్నారు, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారా, సకాలంలో ఈఎంఐ కడుతున్నారా, లోడ్‌ను ఎక్కడంటే అక్కడ డంప్ చేస్తున్నారా లేక ప్రభుత్వం చూపిన పాయింట్లోనే డంప్ చేస్తున్నారా... ఇలాంటి అంశాలతో పాటు తగినవిధంగా జీవనోపాధి పొందుతున్నారా.. పోలీస్ స్టేషన్లో ఏమైనా కేసులు నమోదయ్యాయా... ఇలా ఎన్నో అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు ఎన్ఎస్కేఎఫ్డీసీ అధికారులు. అన్నింట్లో మంచి మార్కులు రావడంతో జయమ్మ కృషికి గుర్తింపు లభించింది. రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొనడానికి రాష్ట్రపతి భవన్ నుంచి ఆహ్వానం వచ్చింది.ఆ నమ్మకంతోనే...‘నమ్మిన పని ఎప్పుడూ మోసం చేయదు అనే మాట ఎన్నోసార్లు విన్నాను. ఆ నమ్మకంతోనే ఎంతమంది వెక్కిరించినా పట్టించుకోలేదు. మా ఆర్థిక స్థాయికి సెఫ్టిక్ ట్యాంకర్ క్లీనింగ్ బండికి సొంతదారులమవుతామని అనుకోలేదు. కష్టపడితే ఆ కష్టమే మనల్ని ముందుకు తీసుకువెళుతుంది’ అంటూ ఆత్మవిశ్వాసం నిండిన గొంతుతో అంటుంది జయమ్మ.జీవితంలో మర్చిపోలేని రోజుమేము చేసే వృత్తి తప్పుడు పనేం కాదు. మా రెక్కల కష్టాన్నే నమ్ముకుని పనిచేసి కుటుంబాన్ని పోషించుకుంటున్నాం. అందులోనే మాకు సంతృప్తి ఉంది. ఎవరేమి అనుకున్నా మేము ఎప్పుడూ బాధపడలేదు. నా భర్తకు తోడుగా సాయంగా వెళ్లి క్లీనింగ్ పనులు చేస్తున్నా. గణతంత్ర వేడుకల్లో పాల్గొనాలని రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఆహ్వాన పత్రిక రావడం జీవితంలో మర్చిపోలేని సంఘటన. ఎంతో సంతోషంగా ఉంది.– జయమ్మ– చిలక మస్తాన్‌రెడ్డి సాక్షి ప్రతినిధి, నెల్లూరు -
రాష్ట్రపతి నిలయంలో ఉద్యాన్ ఉత్సవ్
సాక్షి, సిటీబ్యూరో: పర్యాటక నిలయంగా ప్రసిద్ధి చెందిన బొల్లారం రాష్ట్రపతి నిలయంలో సందర్శకులకు నూతన సంవత్సర కానుకగా జనవరి 2 నుంచి 13 వరకూ ఉద్యాన్ ఉత్సవ్ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రకటించిన ఈ కార్యక్రమం వ్యవసాయం, రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ మద్దతుతో ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రదర్శన పుష్పాలు, ఇతర ప్రదర్శనలకు వేదిక కానుందని, ఉద్యానవన స్పృహను పెంపొందించేందుకు రాష్ట్రపతి నిలయం పరిపాలనాధికారి రజనిప్రియా శనివారం వెల్లడించారు. మొదటి సారి నిర్వహించే ఈ ఉద్యాన్ ఉత్సవ్ పన్నెండు రోజుల పాటు నిర్వహిస్తున్నామని, ఉదయం 10 నుంచి రాత్రి 8 గంటల వరకూ కొనసాగుతుందని చెప్పారు. సేంద్రియ ఎరువులు, కంపోస్టింగ్, గార్డెనింగ్ టూల్స్, గార్డెన్ డెకర్, హారీ్టకల్చర్ డోమైన్లు ఉంటాయని, ఇందులో 50 స్టాళ్ళతో గ్రాండ్ ఎగ్జిబిషన్, సాంస్కృతిక ప్రదర్శనలు, జానపద, గిరిజన ప్రదర్శనలు, వంటకాలు, ఇంటరాక్షన్ సెషన్లు ఉంటాయని తెలిపారు. పలువురు ఎగ్జిబిటర్లు, ప్రభుత్వ, కమ్యూనిటీ సంస్థలు, ఎన్జీవోలు, ప్రైవేటు కంపనీలు భాగాస్వామ్యం ఉంటుందని తెలిపారు. ఒడిశ్సా శంఖ్ వదన్ నృత్యం, మధ్యప్రదేశ్ యుద్ధ కళ నృత్యం వంటి ప్రదర్శనలు ఉన్నాయని, సందర్శకులకు ప్రవేశం పూర్తిగా ఉచితమని చెప్పారు. -
నూతన సీజేఐ జస్టిస్ ఖన్నా ప్రమాణ స్వీకారం నేడు
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నా రు. రాష్ట్రపతి భవన్లో ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. జస్టిస్ ఖన్నా ఆరు నెలలపాటు సీజేఐగా కొనసాగుతారు. ఆయన పదవీ కాలం వచ్చే ఏడాది మే 13వ తేదీన ముగియనుంది. ప్రస్తుత సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ ఆదివారం పదవీ విరమణ చేశారు. ఆయన సిఫార్సు మేరకు నూతన సీజేఐగా జస్టిస్ ఖన్నాను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ 24న నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. న్యాయ వ్యవస్థతో సుదీర్ఘ అనుబంధం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న జస్టిస్ సంజీవ్ ఖన్నాకు న్యాయ వ్యవస్థతో సుదీర్ఘ అనుబంధం ఉంది. ఆయన 1960 మే 14న జని్మంచారు. ఆయన తండ్రి జస్టిస్ దేవ్‌రాజ్ ఖన్నా ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. జస్టిస్ ఖన్నా ఢిల్లీలోని మోడ్రన్ స్కూల్లో చదువుకున్నారు. సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ అనంతరం ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన క్యాంపస్ లా సెంటర్లో న్యాయ విద్య అభ్యసించారు. 1983లో బార్ కౌన్సిల్ ఆఫ్ ఢిల్లీలో అడ్వొకేట్‌గా చేరారు. తొలుత తీస్‌హజారీ కాంప్లెక్స్‌లోని జిల్లా కోర్టుల్లో, తర్వాత ఢిల్లీ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. ఆదాయపు పన్ను విభాగంలో సీనియర్ స్టాండింగ్ కౌన్సిల్ సభ్యుడిగా పని చేశారు. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (నల్సా) ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా సేవలందించారు. ఢిల్లీ హైకోర్టులో అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా, అమికస్ క్యూరీగా ఎన్నో క్రిమినల్ కేసుల్లో సమర్థంగా వాదించి పేరు తెచ్చుకున్నారు. 2005 జూన్ 24న ఢిల్లీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఏడాది తిరగకుండానే శాశ్వత న్యాయమూర్తి అయ్యారు. 2019 జనవరి 18న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. హైకోర్టు న్యాయమూర్తుల్లో ఆయన కంటే 32 మంది సీనియర్లున్నా వారిని కాదని జస్టిస్ ఖన్నాకు పదోన్నతి దక్కడం వివాదాస్పదంగా మారింది. అయినా ఆయన నియామకాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. పలు కీలక తీర్పులు ఇచ్చిన సుప్రీంకోర్టు ధర్మాసనాల్లో జస్టిస్ ఖన్నా సభ్యుడిగా ఉన్నారు. మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని రద్దు చేసిన ధర్మాసనంలో ఆయన సభ్యుడు. ఆరి్టకల్ 370 రద్దును వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లను కొట్టివేశారు. ఎల్రక్టానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం) వాడకాన్ని సమర్థించారు. బ్యాలెట్ పేపర్ విధానంలో ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను తిరస్కరించారు. ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేశారు. పెండింగ్ కేసుల పరిష్కారంపై జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రత్యేక శ్రద్ధ చూపుతారని పేరుంది. అనవసరమైన వాయిదాలకు తావు లేకుండా వేగంగా న్యాయం చేకూర్చడంలో ఆయన దిట్ట అని న్యాయవాద వర్గాలు చెబుతాయి. ఇక ఇంట్లోనే మార్నింగ్ వాక్ తెల్లవారుజామునే ట్రాక్ ప్యాంట్, ఆఫ్ హ్యాండ్స్ టీ షర్ట్‌తో ఢిల్లీ వీధుల్లో వాకింగ్ చేయడం జస్టిస్ ఖన్నాకు చాలా ఇష్టం. అనేక సందర్భాల్లో ఆయన మార్నింగ్ వాక్ గురించి ప్రస్తావించారు. ‘‘ఉదయాన్నే వాకింగ్ చేస్తే రోజంతా మనసు ప్రశాంతంగా ఉంటుంది. మంచి ఆలోచనలు వస్తాయి’’ అంటారాయన. సీజేఐగా బాధ్యతలు స్వీకరిస్తున్న నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా ఇకపై మార్నింగ్ వాక్కు ఆయన స్వస్తి పలకనున్నట్లు తెలిసింది. వాకింగ్‌తో పాటు జిమ్ వంటి కసరత్తులన్నీ ఇంట్లోనే చేయనున్నారు. -
కోణార్క్ సూర్య రథచక్రం రాష్ట్రపతి భవనంలో...
ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం. ఈ కోణార్క్ సూర్య రథ చక్రాన్ని పోలిన నాలుగు ఇసుకరాయి ప్రతిరూపాలను ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్ అమృత్ ఉద్యాన్ లో ఏర్పాటు చేశారు.కోణార్క్ చక్రం భారతదేశ సాంస్కృతిక వారసత్వానికి చిహ్నం. సాంస్కృతిక, చారిత్రక అంశాలను సందర్శకులకు పరిచయం చేసే దశల్లో భాగంగా, భారతదేశం గొప్ప వారసత్వాన్ని తెలుసుకోవడానికి ప్రోత్సహించే లక్ష్యంతో దీనిని ఏర్పాటు చేసినట్టు రాష్ట్రపతి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.కోణార్క్ సూర్య దేవాలయం యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో ఒకటి. ఒడిషా ఆలయ నిర్మాణ శైలికి పరాకాష్టగా దీనిని చెప్పుకోవచ్చు. ఇది సూర్య భగవానుడిని మోసుకెళ్లే బృహత్తర రథం ఆకారంలో నిర్మించబడింది. (చదవండి: అమెరికాలో ... శాస్త్రీయ నృత్య రూపకంగా దుర్యోధనుడు) -
రాష్ట్రపతితో కలిసి బ్యాడ్మింటన్ ఆడిన సైనా నెహ్వాల్ (ఫొటోలు)
-
రాష్ట్రపతి భవన్ లో చిరుత ?
-
మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పులి?.. వీడియో వైరల్
న్యూఢిల్లీ: దేశ ప్రధానిగా నరేంద్రమోదీ మూడోసారి ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో పాటు 71 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. రాష్ట్రపతి భవన్ వేదికగా ఆదివారం అట్టహాసంగా ఈ కార్యక్రమం జరిగింది. దేశ, విదేశాలకు చెందిన రాజకీయ, సినీ ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలతో సహా 8 వేల మంది అతిథులు హాజరయ్యారు.అయితే అత్యంత కట్టుదిట్టమైన భద్రతా వలయంలో జరిగిన ఈ వేడుకలో ఆహ్వానం లేదని ఓ అతిథి ప్రత్యక్షమైంది. ప్రమాణస్వీకార కార్యక్రమం పూర్తయిన తర్వాత మధ్యప్రదేశ్ బీజేపీ ఎంపీ దుర్గా దాస్ ఉయికే.. రాష్ట్రపతి ముర్ముకు అభివాదం చేస్తుండగా.. స్టేజీ వెనక భాగంలో ఓ జంతువు అటుగా వెళుతూ కెమెరా కంటికి చిక్కింది. ప్రమాణ స్వీకార వేదికకు కాస్త దూరంలోనే సంచరించడం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.సోషల్‌మీడియాలో దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. తొలుత ఫేక్ వీడియో లేదా ఏఐ జనరేటెడ్ వీడియో అని కొట్టిపారేశారు. తర్వాత ప్రధానమంత్రి కార్యాలయం నిన్న షేర్ చేసిన యూట్యూబ్ లైవ్ ఫీడ్‌ను పరిశీలించినప్పుడు.. ఓ జంతువు సంచరించడం నిజమేనని తేలింది.అది చూడటానికి పులిలా కనిపించింది. కానీ ఆ జంతువు పెంపుడు పిల్లి అని, లేదా కు అయి ఉండవచ్చిన పలువురు అభిప్రాయపడుతున్నారు. అంతేగాక కొంతమంది ఈ దృశ్యాలను కూడా నమ్మడం లేదు, బ్యాగ్రౌండ్లో ఎడిట్ చేసి చూపిస్తున్నారని చెబుతున్నారు. మరికొందరైతే అతి కచ్చితంగా చిరుతపులిలా కనిపిస్తుందని, అక్కడి వారు అదృష్టవంతులు దాని బారి నుంచి తప్పించుకున్నారని కామెంట్ చేస్తున్నారు. దీనిపై రాష్ట్రపతి భవన్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.An animal was seen strolling back in the Rashtrapati Bhavan after MP Durga Das finished the paperwork~ Some say it was a LEOPARD while others call it some pet animal. Have a look 🐆 pic.twitter.com/owu3ZXacU3— The Analyzer (News Updates🗞️) (@Indian_Analyzer) June 10, 2024 -
కన్నులపండువగా...
న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారోత్సవం ఆదివారం కన్నులపండువగా జరిగింది. దేశాధినేతల నుంచి రాజకీయ దిగ్గజాల దాకా వేడుకలో పాల్గొన్నారు. పారిశ్రామిక ప్రముఖులు మొదలుకుని సినీ తారల దాకా తళుక్కుమన్నారు. 8,000 మందికిపైగా వీవీఐపీలు, వీఐపీలతో రాష్ట్రపతి భవన్ ఆవరణ కళకళలాడింది. వరుసగా మూడోసారి ప్రధానిగా మోదీతో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రమాణస్వీకారం చేయిస్తుండగా ప్రాంగణమంతా కరతాళ ధ్వనులు, హర్షధ్వానాలతో మారుమోగింది. మాజీ రాష్ట్రపతులు ప్రతిభా పాటిల్, రామ్‌నాథ్ కోవింద్ తదితరులు పాల్గొన్నారు. షారుఖ్ ఖాన్ నుంచి రజనీకాంత్ దాకా పలువురు సినీ ప్రముఖులు కుటుంబ సమేతంగా హాజరై అలరించారు. పారిశ్రామికవేత్తలు గౌతం అదానీ దంపతులు, ముకేశ్ అంబానీ దంపతులు వేడుకకు హాజరయ్యారు. భిన్న మతాలకు చెందిన పెద్దలు పాల్గొనడం అందరినీ ఆకర్షించింది. బీజేపీ నుంచి తొలిసారి ఎంపీగా నెగ్గిన ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ప్రధానాకర్షణగా నిలిచారు. కేరళలోని త్రిసూర్ ఎంపీ, మలయాళ సినీ స్టార్ సురేశ్ గోపీ కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం అందరి దృష్టినీ ఆకర్షించింది. లోక్‌సభ ఎన్నికల్లో కేరళలో బీజేపీకి ఇదే తొలి విజయమన్నది తెలిసిందే. మోదీకి పలు రంగాల ప్రముఖుల అభినందనలు, శుభాకాంక్షల సందేశాలతో ఎక్స్ తదితర సోషల్ సైట్లు హోరెత్తిపోయాయి. ఏడుగురు దేశాధినేతలు: మోదీ ప్రమాణ స్వీకారానికి 7 దేశాల అధినేతలు హాజరయ్యారు. బంగ్లాదేశ్ అధ్యక్షురాలు షేక్ హసీనా, శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే, మారిషస్ ప్రధాని ప్రవింద్ కు మార్ జగన్నాథ్, మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు, నేపాల్ ప్రధానమంత్రి పుష్ప కమల్ దహల్ ప్రచండ, భూటాన్ ప్ర ధానమంత్రి త్సెరింగ్ టాగ్బే, సీషెల్స్ ఉపాధ్యక్షుడు అహ్మద్ అఫిఫ్ తదితరులు కార్యక్ర మంలో పాల్గొన్నారు. భారత్, మాల్దీవుల మ« ద్య సంబంధాలు బలహీనపడ్డ నేపథ్యంలో ముయిజ్జు హాజరు ప్రాధాన్యం సంతరించుకుంది. 2023 నవంబర్‌లో అధ్యక్షుడయ్యాకఆయన భారత్ రావడం ఇదే తొలిసారి.తెలుపు కుర్తా–చుడీదార్, నీలి రంగు జాకెట్లో... మెరిసిపోయిన మోదీవిశేష సందర్భాల్లో తన వస్త్రధారణతో ఆకట్టుకునే మోదీ ఈసారి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తెలుపు కుర్తా, చుడీదార్, దానిపై నీలి రంగు జాకెట్ ఎంచుకున్నారు. 2014లో తొలిసారి ప్రధానిగా ప్రమాణ చేసిన సందర్భంగా ఆయన క్రీం కలర్ కుర్తా, తెల్ల పైజామా, బంగారు రంగు జాకెట్ ధరించారు. 2019లో రెండోసారి ప్రధాని అయినప్పుడు తెలుపు రంగు కుర్తా, పైజామా, వాటిపై బంగారు రంగు జాకెట్ ధరించి ప్రమాణస్వీకారం చేశారు. పంద్రాగస్టు, గణతంత్ర వేడుకలకు మోదీ రంగురంగుల తలపాగాలు ధరించి అలరిస్తుంటారు. -
మోదీ అనే నేను..
న్యూఢిల్లీ: స్వతంత్ర భారత రాజకీయాల్లో అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది. దేశ ప్రధానిగా నరేంద్ర దామోదర్ దాస్ మోదీ వరుసగా మూడోసారి బాధ్యతలు చేపట్టారు. తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తర్వాత ఈ ఘనత సాధించిన నాయకునిగా రికార్డులకెక్కారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము 73 ఏళ్ల మోదీతో ప్రధానిగా ప్రమాణంచేయించారు. ఆయన దైవసాక్షిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆదివారం రాత్రి ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో అన్ని రంగాలకూ చెందిన అతిరథ మహారథుల సమక్షంలో కార్యక్రమం 155 నిమిషాల పాటు అత్యంత వేడుకగా జరిగింది.మోదీ సహా 72 మందితో పూర్తిస్థాయి నూతన కేంద్ర మంత్రివర్గం కూడా ఈ సందర్భంగా కొలువుదీరింది. 30 మందితో కేబినెట్ మంత్రులుగా, ఐదుగురితో స్వతంత్ర, 36 మందితో సహాయ మంత్రులుగా రాష్ట్రపతి ప్రమాణస్వీకారం చేయించారు. బీజేపీకి పూర్తి మెజారిటీ రాని నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారిన ఎన్డీఏ మిత్రపక్షాలకు మంత్రివర్గంలో 11 బెర్తులతో సముచిత ప్రాధాన్యం దక్కింది. బీజేపీ నుంచి రాజ్‌నాథ్‌సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా, నిర్మలా సీతారామన్, ఎస్.జైశంకర్ వంటి అతిరథులతో పాటు మిత్రపక్షాల నుంచి కింజరాపు రామ్మోహన్ నాయుడు (టీడీపీ), లలన్‌సింగ్ (జేడీయూ), చిరాగ్ పాస్వాన్ (ఎల్జేపీ), హెచ్.డి.కుమారస్వామి (జేడీఎస్) తదితరులు ప్రమాణస్వీకారం చేసిన ప్రముఖుల్లో ఉన్నారు.ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జేడీ(యూ) చీఫ్, బిహార్ సీఎం నితీశ్ కుమార్ తదితరులు హాజరయ్యారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కార్యక్రమంలో పాల్గొనగా తృణమూల్ కాంగ్రెస్, సమాజ్‌వాదీతో పాటు పలు విపక్షాలు గైర్హాజరవడం విశేషం. 140 కోట్ల మంది భారతీయులకు మరోసారి సేవ చేయబోతున్నందుకు చాలా ఆనందంగా ఉందని కార్యక్రమం అనంతరం మోదీ పేర్కొన్నారు.‘‘నూతన మంత్రివర్గ సహచరులతో కలిసి ప్రగతి పథంలో దేశాన్ని నూతన శిఖరాలకు తీసుకెళ్లడమే లక్ష్యంగా పని చేస్తా. అనుభవం, యువత కలబోతగా కొత్త మంత్రివర్గం అలరారుతోంది. ప్రజల జీవితాలను మెరుగు పరిచేందుకు నిరంతరం శ్రమిస్తాం’’ అంటూ ఎక్స్‌లో ఆయన పోస్ట్ చేశారు. నూతన మంత్రులకు శాఖల కేటాయింపు సోమవారం జరిగే అవకాశముంది. ఆరుగురు మాజీ సీఎంలు మోదీ 3.0 మంత్రివర్గం పలు విశేషాల సమాహారంగా రూపుదిద్దుకుంది. బీజేపీ అధ్యక్షుడు నడ్డా ఐదేళ్ల విరామం తర్వాత కేంద్ర మంత్రివర్గంలోకి అడుగు పెట్టారు. మాజీ సీఎంలు శివరాజ్‌సింగ్ చౌహాన్, కుమారస్వామిలకు తొలిసారి కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కింది. వారితో పాటు నూతన మంత్రివర్గంలో 33 మంది కొత్త ముఖాలున్నాయి. శివరాజ్, కుమారస్వామి, రాజ్‌నాథ్‌సింగ్, మనోహర్‌లాల్ ఖట్టర్, సర్బానంద సోనోవాల్, జితిన్‌రాం మాంఝీ రూపంలో నూతన మంత్రివర్గంలో ఆరుగురు మాజీ సీఎంలుండటం విశేషం! 43 మందికి మూడుసార్ల కంటే ఎక్కువగా కేంద్ర మంత్రులుగా చేసిన అనుభవముంది. యూపీకి అత్యధికంగా 9 బెర్తులు కేంద్ర మంత్రివర్గంలో ఉత్తరప్రదేశ్‌కు అత్యధికంగా 9 స్థానాలు దక్కాయి. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలున్న కీలకమైన బిహార్‌కు ఏకంగా 8 బెర్తులు దక్కాయి! ఈ ఏడాదే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మహారాష్ట్రకు కూడా ఆరు బెర్తులు లభించాయి. గుజరాత్‌కు ఐదు; మధ్యప్రదేశ్, రాజస్తాన్‌లకు ఐదేసి; హరియాణా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులకు మూడేసి; ఒడిశా, అసోం, జార్ఖండ్, తెలంగాణ, పంజాబ్, పశి్చమబెంగాల్‌కు రెండేసి చొప్పున స్థానాలు దక్కాయి.అయితే యూపీకి ఒకే కేబినెట్ హోదా బెర్తు దక్కగా బిహార్‌కు ఏకంగా నాలుగు లభించడం విశేషం! గుజరాత్‌కు కూడా మోదీ, అమిత్ షా, మాండవీ, సీఆర్ పాటిల్ రూపంలో ఏకంగా నాలుగు కేబినెట్ హోదా బెర్తులు దక్కాయి! మధ్యప్రదేశ్, రాజస్తాన్‌లకు మూడేసి; మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు, ఒడిశాలకు రెండేసి కేబినెట్ మంత్రి పదవులు దక్కాయి. తెలంగాణ, ఏపీలతో పాటు హరియాణా, పంజాబ్‌లకు ఒక్కో కేబినెట్ హోదా బెర్తు దక్కాయి. దక్షిణాది రాష్ట్రాల నుంచి 13 మందికి మంత్రివర్గంలో చోటు దక్కింది. 37 మందికి ఉద్వాసన మోదీ 2.0 మంత్రివర్గంలో పని చేసిన వారిలో స్మృతీ ఇరానీ, అనురాగ్ ఠాకూర్, నారాయణ్ రాణే సహా ఏకంగా 37 మందికి ఈసారి కేబినెట్లో చాన్స్ దొరకలేదు. వీరిలో పలువురు లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. 2.0 మంత్రివర్గంలోని 19 మంతి కేబినెట్ మంత్రులతో సహా మొత్తం 34 మంది తిరిగి చోటు దక్కించుకున్నారు. వీరిలో తమిళనాడుకు చెందిన ఎల్ మురుగన్‌కు లోక్‌సభ ఎన్నికల్లో ఓడినా చాన్స్ దక్కడం విశేషం. ఆయన రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు. కొత్త మంత్రుల్లో ప్రతి ఆరుగురిలో ఒకరు చొప్పున 12 మంది రాజ్యసభ సభ్యులున్నారు. 58 మంది లోక్‌సభ సభ్యులు కాగా రవ్‌నీత్‌సింగ్ బిట్టూ, జార్జి కురియన్ ఏ సభలోనూ సభ్యలు కారు. వారు ఆర్నెల్లలోగా పార్లమెంటు సభ్యులుగా ఎన్నికవాల్సి ఉంటుంది. భాగస్వాములకు పెద్దపీట ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు నూతన మంత్రివర్గంలో సముచిత స్థానం దక్కింది. తాజా మాజీ మంత్రివర్గంలో వాటికి ఒక్క కేబినెట్ హోదా, స్వతంత్ర హోదా మంత్రి పదవి కూడా లేదు. ఈసారి మాత్రం కుమారస్వామి (జేడీఎస్), మాంఝి (హెచ్ఏఎల్), లలన్‌సింగ్ (జేడీయూ), రామ్మోహన్ నాయుడు (టీడీపీ), చిరాగ్ పాస్వాన్ (ఎల్జేపీ–ఆర్వీ) రూపంలో ఏకంగా ఐదు కేబినెట్ హోదా బెర్తులు దక్కాయి! ప్రతాప్‌రావ్ జాదవ్ (శివసేన), జయంత్ చౌదరి (ఆరెల్డీ)లకు స్వతంత్ర హోదా కూడిన పదవులు లభించాయి. 2.0 మంత్రివర్గంలో సహాయ మంత్రులైన అనుప్రియా పటేల్ (అప్నాదళ్–యూపీ), రామ్‌దాస్ అథవాలె (ఆర్పీఐఏ–మహారాష్ట్ర)లకు మళ్లీ చాన్సిచ్చారు. వారితో పాటు రామ్‌నాథ్ ఠాకూర్ (జేడీయూ), పెమ్మసాని చంద్రశేఖర్ (టీడీపీ)లకు సహాయ మంత్రి పదవులు దక్కాయి. కొత్త మంత్రులు 33 మంది మోదీ 3.0 మంత్రివర్గంలో 33 కొత్త ముఖాలకు చోటు దక్కింది. మాజీ సీఎంలు శివరాజ్‌సింగ్, కుమారస్వామి, మనోహర్‌లాల్ ఖట్టర్ తదితర దిగ్గజాలతో పాటు తొలిసారి ఎంపీలుగా నెగ్గిన సురేశ్ గోపి తదితరుల దాకా వీరిలో ఉన్నారు. 24 రాష్ట్రాలకు ప్రాతినిధ్యం కేంద్ర మంత్రివర్గంలో 24 రాష్ట్రాలకు ప్రాతినిధ్యం దక్కింది. గోవా, అరుణాచల్ వంటి చిన్న రాష్ట్రాలను మినహాయిస్తే నలుగురు, అంతకంటే ఎక్కువ మంది లోక్‌సభ సభ్యులున్న ప్రతి రాష్ట్రం నుంచీ కనీసం ఒక్కరికి మంత్రివర్గంలో స్థానం లభించింది. ఏడుగురు మహిళలు నూతన మంత్రివర్గంలో మహిళలు 10 శాతం కంటే తక్కువే ఉన్నారు. మొత్తం ఏడుగురికి స్థానం దక్కింది. ఇదీ కులాల కూర్పు మోదీ 3.0 మంత్రివర్గంలో 27 మంది ఓబీసీ, 10 మంది ఎస్సీ, ఐదుగురు ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన వారు. కా>గా ఐదుగురు మైనారిటీలున్నారు. అయితే ముస్లింలు ఒక్కరు కూడా లేకపోవడం విశేషం. ఇంకో 8 మందికి అవకాశం కేంద్ర మంత్రివర్గ గరిష్ట పరిమాణం 81 (543 మంది లోక్‌సభ సభ్యుల్లో 15 శాతం). దాంతో మరో 9 మందికి మంత్రులుగా అవకాశముంది. అయితే 2019–24 మధ్య మోదీ 2.0 మంత్రివర్గంలో 78 మంది సభ్యులే ఉన్నారు. అత్యంత పిన్న వయసు్కలు రామ్మోహన్, ఖడ్సే నూతన కేంద్ర మంత్రివర్గంలో ఏపీకి చెందిన కింజరాపు రామ్మోహన్ నాయుడు (టీడీపీ), మహారాష్ట్రకు చెందిన రక్షా ఖడ్సే (బీజేపీ) అత్యంత పిన్న వయసు్కలు. వారికి 37 ఏళ్లు. అత్యంత పెద్ద వయసు్కనిగా 79 ఏళ్ల హెచ్ఏఎల్ అధినేత జితిన్‌రాం మాంఝీ నిలిచారు. బాక్సు నేడు కేబినెట్ తొలి భేటీ మోదీ 3.0 మంత్రివర్గ తొలి సమావేశం సోమవారం జరగనుంది. లోక్ కల్యాణ్ మార్గ్‌లోని ప్రధాని మోదీ నివాసంలో సాయంత్రం భేటీ ఉంటుందని సమాచారం. నూతన మంత్రివర్గ సభ్యులందరికీ బీజేపీ అధ్యక్షుడు నడ్డా ఆదివారం రాత్రి విందు ఇచ్చారు. -
ద్రౌపది ముర్ము మోదీకి దహీ-చీనీని తినిపించడానికి రీజన్!
భారత ప్రధానిగా నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి బాధ్యతలు చేపట్టేందుకు రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన్ను రాష్ట్రపతి భవన్‌కి ఆహ్వానించారు. ఆయన మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించేందుకు సూచనగా.. దహీ చీనీని రాష్ట్రపతి ద్రౌపది ముర్మునే స్వహస్తాలతో మోదీకి అందించారు. ఇలా ఎందుకు తినిపిస్తారు? ఏంటీ స్వీట్ ప్రాముఖ్యత.లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ విజయ దుందుభి మోగించారు. ఆ తర్వాత నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) భాగస్వామ్య పక్షాలన్నీ పార్లమెంటరీ పార్టీ నేతగా మోదీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మోదీని రాష్టపతి భవన్‌కి ఆహ్వానించారు. ముచ్చటగా మూడోసారి పదవిని అంకరిస్తున్నందుకు శుభాకాంక్షలు తెలుతూ.. మోదీకి దహీ-చీనీని తినిపించారు రాష్టపతి ముర్ము. ఈ ఆచారం అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఇలా ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన వ్యక్తి రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ స్వీట్ తీసుకోవడం అనాదిగా జరుగుతుంది. ఇలా ఎందుకు చేస్తారంటే..Dahi-Cheeni Tradition of Bharat. 🇮🇳 https://t.co/ojqpaw7LuE pic.twitter.com/BGYznrKWra— Aditya Raj Kaul (@AdityaRajKaul) June 7, 2024 దహీ-చీనీ అంటే..పెరుగు-పంచదార లేదా బెల్లంతో కూడిన స్వీట్. దీన్ని దహీ-చీనీ అంటారు. ఈ స్వీట్ సంప్రదాయం భారతీయ సంస్కృతిలో సుదీర్ఘ చరిత్రను కలిగి ఉంది. ముఖ్యంగా ఇంటి నుంచి బయటకు వెళ్లే పెద్దలు, పిల్లలకు ఇలా పెరుగుతో కూడిన బెల్లం లేదా చక్కెరను తినిపిస్తారు. ఇలా చేస్తే వారికి మంచి అదృష్టం, విజయం లభిస్తుందని పెద్దల నమ్మకం. ఇలా దహీ చీనీని తినడం వెనుకు పెద్ద శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి. ఆయుర్వేదంలో దహీని కపా-వర్థక్ అని అంటారు. అంటే శరీరానికి స్వాంతన చేకూర్చి, ప్రశాంతతను ఇచ్చేది అని అర్థం. వేసవిలో దీన్ని తీసుకోవడంలో శరీరానికి చలువ చేస్తుంది. ఇందులో కలిపే పంచదార లేదా బెల్లం శరీరానికి తక్షణ శక్తి అందిస్తుంది. ఈ రెండింటి కలియిక ఒత్తిడిని తగ్గించి, అలసటను దూరం చేస్తుంది. ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది. దీనిలో కాల్షియం, రిబోఫ్లేవిన్, బీ6, బీ12 ఉంటాయి. ముఖ్యంగా పెరుగులో ఉండే బ్యాక్టీరియా శరీరానికి మంచి ప్రోబయోటిక్స్‌ని అందించి ప్రేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇందులోని తీపి శరీరానికి తక్షణ ఎనర్జీని ఇచ్చే ఇంధనంగా ఉంటుంది కాబట్టి ఈ స్వీట్ ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. భారతీయ సంప్రదాయంలో ఉండే కొన్ని ఆచారాలు సైన్సుతో ముడిపడి ఉంటాయి. అవి మానవుల హితార్థం ఏర్పరిచినవే. కాగా, ఇక్కడ మోదీ ప్రధానిగా మంచి పాలను ప్రజలకు అందించే క్రమంలో ఎదురయ్యే సమస్యలను సునాయాసంగా జయించి కీర్తి గడించాలని కోరుకుంటూ ఈ దహీ చీని రాష్ట్రపతి తినిపించడం జరుగుతుంది. అంటే నీకు మంచి జరగాలని ఆశ్వీరదిస్తూ ఓ మధురమైన స్వీట్‌తో పని ప్రారంభిస్తే..ఆ మధురమైన తీపి పదార్థం వలే పనులన్నీ ఆనందాయకంగా చకచక అవుతాయని అర్థం. అలాగే మనం కూడా మంచి జరిగినా, ఏదైనా విజయం సాధించిన స్వీట్లతోనేగా వేడుక చేసుకుంటాం. అయితే ఇక్కడ మన సంప్రదాయం ఆరోగ్య ప్రయోజనాలతో కూడి ఈ స్వీట్‌తో ప్రారంభించమని చెబుతుతోంది.(చదవండి: మృగశిర కార్తెకు ఆ పేరే ఎలా వచ్చింది? బెల్లం ఇంగువ ఎందుకు తింటారు?) -
Padma Awards 2024: ఘనంగా ‘పద్మ’ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)
-
రాష్ట్రపతి భవన్ లో భారతరత్న అవార్డుల ప్రదానోత్సవం
-
అడ్వాణీకి భారతరత్న
న్యూఢిల్లీ: రాజకీయ కురు వృద్ధుడు, బీజేపీ అగ్ర నేత లాల్‌కృష్ణ అడ్వాణీ (96)కి కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఎక్స్‌లో ఈ మేరకు పోస్ట్ చేశారు. ఆ వెంటనే రాష్ట్రపతి భవన్ నుంచి ఈ మేరకు ప్రకటన వెలువడింది. అయోధ్యలో రామాలయం నిర్మాణం కోసం 1990లో దేశవ్యాప్త రథయాత్రతో బీజేపీకి ఊపు తెచ్చి అధికార సాధనకు బాటలు పరిచిన అడ్వాణీని, రామాలయ ప్రారం¿ోత్సవం జరిగిన కొద్ది రోజులకే భారతరత్న వరించడం విశేషం. అడ్వాణీకి ఈ సందర్భంగా మోదీ అభినందనలు తెలిపారు. ‘‘సమకాలీన రాజకీయవేత్తల్లో అత్యంత గౌరవనీయుడు అడ్వాణీ. దేశాభివృద్ధిలో ఆయనది అత్యంత కీలక పాత్ర. అచంచలమైన చిత్తశుద్ధి, అంకితభావంతో దేశానికి దశాబ్దాల పాటు సేవ చేశారు. ప్రజాస్వామ్యానికి జాతీయవాద విలువలను కూర్చిన గొప్ప నాయకుడు. అత్యంత కింది స్థాయి నుంచి మొదలై ఉప ప్రధానిగా ఎదిగారు. రాజకీయాల్లో నైతిక విలువలకు నూతన ప్రమాణాలు నెలకొల్పారు’’ అంటూ ప్రశంసించారు. ‘‘ఇది నాకెంతో భావోద్వేగపూరిత క్షణం. అడ్వాణీతో అత్యంత సన్నిహితంగా మెలిగి ఎంతగానో నేర్చుకునే అవకాశం నాకు దక్కింది’’ అని ఈ సందర్భంగా మోదీ అన్నారు. ప్రకటన అనంతరం అడ్వాణీకి మోదీ ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. తనకు అత్యున్నత పౌర పురస్కారం లభించడం పట్ల అడ్వాణీ హర్షం వెలిబుచ్చారు. ‘‘దేశం కోసమే నా జీవితమంతా ధారపోశా. నా ఆశయాలకు సిద్ధాంతాలకు దక్కిన గౌరవమిది. నాకెంతో ఆనందంగా ఉంది’’ అన్నారు. ప్రధాని మోదీకి, దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఆయనకు దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తాయి. అద్వానీతో కలిపి ఇప్పటిదాకా 50 మందికి ఈ పురస్కారం దక్కింది. పది రోజుల క్రితమే బిహార్ దివంగత ముఖ్యమంత్రి, ప్రఖ్యాత సామాజికవేత్త కర్పూరి ఠాకూర్‌కు కూడా కేంద్రం భారతరత్న ప్రకటించడం తెలిసిందే. ఒక ఏడాదిలో గరిష్టంగా ముగ్గురికి ఈ పురస్కారం ఇవ్వవచ్చు. కానీ 1999లో మాత్రం నలుగురికి భారతరత్న ప్రకటించారు. కుటుంబ రాజకీయాలను సవాలు చేసిన అడ్వాణీ: మోదీ సంభాల్పూర్ (ఒడిశా): అడ్వాణీ ఆజన్మాంతం కుటుంబ రాజకీయాలను సవాలు చేశారని, దేశ ప్రజాస్వామిక విలువల పునరుద్ధరణ కోసం పోరాడారని మోదీ అన్నారు. బీజేపీపై అంటరాని పార్టీ ముద్రను పోగొట్టి ప్రపంచంలోకెల్లా అతి పెద్ద రాజకీయ వేదికగా తీర్చిదిద్దారని కొనియాడారు. ‘‘దివంగత ప్రధాని వాజ్పేయితోకలిసి భారత ప్రజాస్వామ్యానికి అడ్వాణీ జాతీయ విలువలద్దారు. దేశ ప్రజాస్వామ్యాన్ని ఒక కుటుంబ గుత్తాధిపత్యం నుంచి విముక్తం చేసేందుకు నిరంతరం పోరాడారు. ఆయనకు భారతరత్న లభించడం బీజేపీకి, దాని అసంఖ్యా కార్యకర్తలకు కూడా గొప్ప గౌరవం’’ అని ఒడిశాలోని సంభాల్పూర్ ర్యాలీలో మోదీ పేర్కొన్నారు. మరోవైపు కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్‌సింగ్, అనురాగ్ ఠాకూర్ తదితరులతో పాటు పలు పారీ్టల నాయకులు కూడా అడ్వాణీకి అభినందనలు తెలిపారు. దేశానికి, బీజేపీకి, పార్టీ సిద్ధాంతానికి ఆయన చేసిన నిస్వార్థ సేవలను వరి్ణంచేందుకు మాటలు చాలవని షా అన్నారు. తన గురువైన అద్వానీకి ఇంతటి గౌరవం దక్కడం ఆనందంగా ఉందని మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు అన్నారు. ఆయనకు ఫోన్లో శుభాకాంక్షలు తెలిపానన్నారు. జేడీ(ఎస్) నేత కుమారస్వామి, ఎల్జేపీ (రాంవిలాస్) చీఫ్ చిరాగ్ పాశ్వాన్, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు తదితరులు అడ్వాణీకి అభినందనలు తెలిపారు. నేడు అయోధ్యలో రామాలయం కొలువుదీరిందంటే అందుకు అడ్వాణీయే కారణమని బీజేపీ సీనియర్ నేత యడియూరప్ప అన్నారు. త్వరలో దిగిపోనున్న మోదీ సర్కారు బీజేపీ ఓటుబ్యాంకును కాపాడుకునేందుకే అడ్వానీకి భారతరత్న ప్రకటించిందని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ విమర్శించారు. నేను ఆచరించిన విలువలకు, నా సేవలకు గుర్తింపు ‘‘భారతరత్న పురస్కారం నాకు అత్యున్నత గౌరవం మాత్రమే కాదు. నేను జీవితాంతం ఆచరించిన విలువలకు, శక్తివంచన లేకుండా అందించిన సేవలకు గుర్తింపు కూడా. దీన్ని అత్యంత వినమ్రతతో, కృతజ్ఞతతో స్వీకరిస్తున్నా. 14 ఏళ్ల వయసులో కార్యకర్తగా ఆరెస్సెస్‌లో చేరిన రోజు నుంచి భరతమాతకు నిస్వార్థంగా సేవ చేయడమే లక్ష్యంగా బతికా. ఈ జీవితం నాది కాదు, దేశానిదేనన్న భావనే నన్ను ముందుకు నడిపింది. ఈ సందర్భంగా పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ, అటల్ బిహారీ వాజ్‌పేయిలను కృతజ్ఞతతో గుర్తు చేసుకుంటున్నా. ఈ ఇద్దరు మహనీయులతో కలిసి పని చేసే అదృష్టం నాకు దక్కింది. సుదీర్ఘ ప్రజా జీవితంలో నాతో పాటు కలిసి పని చేసిన లక్షలాది బీజేపీ, ఆరెస్సెస్ కార్యకర్తలు తదితరులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నాకు భారతరత్న ప్రకటించినందుకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు, ప్రధాని మోదీకి కృతజ్ఞతలు. నాకు అడుగడుగునా అంతులేని ప్రేరణ శక్తిగా నిలిచిన నా కుటుంబీకులను, ముఖ్యంగా నన్ను వీడి వెళ్లిన నా భార్య కమలను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నా. నా దేశం మరిన్ని ఘనతలు అందుకోవాలని ఆకాంక్షిస్తున్నా’’ – భారతరత్న ప్రకటన అనంతరం విడుదల చేసిన ప్రకటనలో అడ్వాణీ. -
‘అర్జున’ అందుకున్న ఇషా
సాక్షి, న్యూఢిల్లీ: భారత మహిళా షూటింగ్ రైజింగ్ స్టార్, తెలంగాణ అమ్మాయి ఇషా సింగ్ 2023 సంవత్సరానికిగాను జాతీయ క్రీడా పురస్కారం ‘అర్జున అవార్డు’ను బుధవారం అందుకుంది. కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ అవార్డును ఇషా సింగ్‌కు బహూకరించారు. ఈనెల 9న రాష్ట్రపతి భవన్లో జాతీయ క్రీడా పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది. అయితే అదే సమయంలో ఇషా జకార్తాలో ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలో ఆడుతుండటంతో ఆమె హాజరుకాలేకపోయింది. ఇషాకు ‘అర్జున’ అందించిన అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ పారిస్ ఒలింపిక్స్ నుంచి ఇషా పతకంతో తిరిగి రావాలని ఆకాంక్షించారు. -
‘అర్జున’తో అందలం
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక క్రీడా పురస్కారం ‘అర్జున’ అవార్డు ప్రదాన కార్యక్రమం మంగళవారం రాష్ట్రపతి భవన్లో ఘనంగా జరిగింది. వేర్వేరు క్రీడాంశాల్లో సత్తా చాటి ఈ పురస్కారానికి ఎంపికైన భారత ఆటగాళ్లు దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా దీనిని సగర్వంగా అందుకున్నారు. భారత క్రికెట్ జట్టు స్టార్ పేస్ బౌలర్ మొహమ్మద్ షమీతో పాటు తెలంగాణ బాక్సర్ మొహమ్మద్ హుసాముద్దీన్ అర్జున అవార్డు అందుకున్న వారిలో ఉన్నారు. జకార్తాలో ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలో ఆడుతున్న కారణంగా తెలంగాణ షూటర్ ఇషా సింగ్ ఈ అవార్డును అందుకోలేకపోయింది. దేశ అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్ ధ్యాన్‌చంద్ ‘ఖేల్‌రత్న’ అవార్డుకు ఎంపికైన టాప్ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్ (ఆంధ్రప్రదేశ్), చిరాగ్ శెట్టి (మహారాష్ట్ర) కూడా ఈ కార్యక్రమానికి గైర్హాజరయ్యారు. వీరిద్దరు ప్రస్తుతం కౌలాలంపూర్‌లో జరుగుతున్న మలేసియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో పాల్గొంటున్నారు. భారత మహిళా చెస్ గ్రాండ్‌మాస్టర్, తమిళనాడు అమ్మాయి ఆర్. వైశాలి, రెజ్లర్ అంతిమ్ పంఘాల్, అథ్లెట్ పారుల్ చౌదరి, భారత కబడ్డీ జట్టు కెపె్టన్, తెలుగు టైటాన్స్ జట్టు స్టార్ ప్లేయర్ పవన్ కుమార్ సెహ్రావత్ కూడా అర్జున పురస్కారాన్ని అందుకున్నారు. పారా ఆర్చర్ శీతల్ దేవి అవార్డు అందుకుంటున్నప్పుడు ప్రేక్షకులు పెద్ద ఎత్తున చప్పట్లతో అభినందించగా... వీల్‌చైర్‌లో కూర్చుకున్న పార్ కనోయిస్ట్ ప్రాచీ యాదవ్ వద్దకు వెళ్లి స్వయంగా రాష్ట్రపతి అవార్డు అందించారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అంధ క్రికెటర్ అజయ్ కుమార్ రెడ్డి కూడా అర్జున అవార్డును అందుకోగా... ఆంధ్రప్రదేశ్‌కే చెందిన స్విమ్మర్ మోతుకూరి తులసీ చైతన్య టెన్జింగ్ నార్గే జాతీయ సాహస పురస్కారాన్ని స్వీకరించాడు. విజయవాడ సిటీ స్పెషల్ బ్రాంచ్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న 34 ఏళ్ల తులసీ చైతన్య కాటలీనా చానెల్, జిబ్రాల్టర్ జలసంధి, పాక్ జలసంధి, ఇంగ్లిష్ చానెల్, నార్త్ చానెల్లను విజయవంతంగా ఈది తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. 2023 సంవత్సరానికి ఇద్దరికి ‘ఖేల్ రత్న’... 26 మందికి ‘అర్జున’... ఐదుగురికి ‘ద్రోణాచార్య’ రెగ్యులర్ అవార్డు... ముగ్గురికి ‘ద్రోణాచార్య’ లైఫ్‌టైమ్... ముగ్గురికి ‘ధ్యాన్‌చంద్ లైఫ్‌టైమ్’ అవార్డులు ప్రకటించారు. ప్రతి ఏటా జాతీయ క్రీడా దినోత్సవం (ఆగస్టు 29న) ఈ అవార్డులను అందజేస్తారు. అయితే ఆ సమయంలో హాంగ్జౌ ఆసియా క్రీడలు జరుగుతుండటంతో అవార్డుల ఎంపికతోపాటు ప్రదానోత్సవ కార్యక్రమాన్ని కూడా వాయిదా వేశారు. -
రాష్ట్రపతి శీతాకాల విడిదికి ఘనంగా ఏర్పాట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈనెల 18 నుంచి 23వ తేదీ వరకు శీతాకాల విడిదికి కోసం హైదరాబాద్ వస్తున్న నేపథ్యంలో ఘనంగా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి బుధవారం ఉన్నతాధికారులను ఆదేశించారు. రాష్ట్రపతికి ఘనస్వాగతం పలకడంతోపాటు, శాఖల మధ్య సమన్వయంతో వ్యవహరించాలని, ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని ఆమె స్పష్టం చేశారు. సచివాలయంలో ఆమె డీజీపీ రవిగుప్తా, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్‌శర్మ, సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి శేషాద్రి, ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వి, సీనియర్ పోలీసు ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. రాష్ట్రపతి విడిది చేసే బొల్లారంలోని రాష్ట్రపతి భవన్ వద్ద పటిష్టమైన బందోబస్తుతో పాటు, ట్రాఫిక్ సమస్యలేవీ రాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. వీవీఐపీల భద్రతకు ఉపయోగించే బ్లూబుక్ ఆధారంగా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సూచించారు. -
సీఐసీ చీఫ్ కమిషనర్‌గా హీరాలాల్ సమారియా
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర సమాచార కమిషన్ (సెంట్రల్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్) ప్రధాన కమిషనర్‌గా హీరాలాల్ సమారియా బాధ్యతలు స్వీకరించారు. సోమవారం రాష్ట్రపతి భవన్లో ద్రౌపదీ ముర్ము సమక్షంలో హీరాలాల్ ప్రమాణ స్వీకారం చేశారు. వైకే సిన్హా పదవీ కాలం అక్టోబర్ 3న ముగియడంతో.. సమాచార కమిషన్ నియామకాలను చేపట్టాలంటూ కేంద్రానికి ఇటీవల సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాజస్తాన్‌కు చెందిన హీరాలాల్ సమారియాను సీఐసీ చీఫ్ కమిషనర్‌గా రెండేళ్ల కాలానికి గాను కేంద్రం నియమించింది. ఈ పదవిని దళిత వర్గానికి చెందిన అధికారి చేపట్టడం ఇదే మొదటిసారి. 1985వ బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి హీరాలాల్ సమారియా గతంలో కేంద్ర కారి్మక, ఉపాధి మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పలు విభాగాల్లో కూడా ఆయన సేవలందించారు. -
జడ్జి హిమ బిందుపై టీడీపీ నేతల పోస్టులు..రాష్ట్రపతి భవన్ సీరియస్
-
డాక్టర్ సమరానికి గోల్డ్‌మెడల్ ప్రదానం
లబ్బీపేట(విజయవాడ తూర్పు): కరోనా సమయంలో విశేష సేవలు అందించిన ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఎన్టీఆర్ జిల్లా చైర్మన్ డాక్టర్ జి.సమరానికి జాతీయ స్థాయిలో గోల్డ్‌మెడల్ లభించింది. సోమవారం న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ వార్షిక సమావేశంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా గోల్డ్ మెడల్ అందుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ సమరాన్ని హరియాణా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ గవర్నర్లు బండారు దత్తాత్రేయ, విశ్వభూషణ్ హరిచందన్, తమిళిసై, తదితరులు అభినందనలు తెలియజేశారు. -
తెలంగాణ నర్సుకు నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డు.. 27 ఏళ్లుగా సేవలు
వృత్తే దైవంగా,సేవే పరమార్థంగా భావించిన తేజావత్ సుశీలకు ఈ యేడాది ప్రతిష్టాత్మక ‘ఫ్లారెన్స్ నైటింగేల్’ అవార్డు దక్కింది.తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం, ఎర్రగుంట ప్రాథమిక వైద్యశాలలోఏఎన్ఎంగా సేవలందిస్తున్న సుశీల గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ పురస్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా 27 ఏళ్ల తన కెరీర్ గురించి సుశీల ‘సాక్షి’తో పంచుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎర్రగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చెందిన తేజావత్ సుశీల జాతీయ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డును అందుకున్నారు. దేశవ్యాప్తంగా నర్సులు చేస్తున్న ఉత్తమ సేవలకుగాను జాతీయ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డులను ఏటా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అందిస్తున్నారు. గురువారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో 2022, 2023 సంవత్సరాలకుగాను జాతీయ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డులను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అందించారు. ఇందులో 2022కుగాను ఏఎన్ఎమ్ కేటగిరీలో తెలంగాణకు చెందిన నర్సు తేజావత్ సుశీల రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డును స్వీకరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎర్రగుంట సమీపంలో కనీసం రహదారి సదుపాయం కూడా లేని మారుమూల ప్రాంతంలో ఉండే గుత్తికోయలకు అందించిన సేవలకు గుర్తుగా నైటింగేల్ అవార్డును అందించినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. 1973 నుంచి ఈ ఏడాది వరకు మొత్తం 614 మంది నర్సులు ఉత్తమ నర్సులకు నైటింగేల్ అవార్డులు అందుకున్నారని కేంద్రం తెలిపింది. ‘‘ఉమ్మడి ఖమ్మం జిల్లాలలోని వీ వెంకటాయపాలెం అనే గ్రామం మా సొంతూరు. 1996లో ఏఎన్ఎంగా తొలి పోస్టింగ్ మణుగూరులో వచ్చింది. ఆ తర్వాత సుజాతనగర్లో కొన్నాళ్లు పని చేశాను. 2010 నుంచి ఏజెన్సీ ప్రాంతమైన ఎర్రగుంట పీహెచ్సీలో పని చేస్తున్నాను. 27 ఏళ్ల కెరీర్లో పనిలోనే సంతృప్తి వెతుక్కుంటూ వస్తున్నాను. మా ఇల్లు, నాకు కేటాయించిన గ్రామాలు తప్ప పెద్దగా బయటకి పోయిందీ లేదు. హైదరాబాద్‌కు కూడా వెళ్లడం తక్కువే. చదువుకునేప్పటి నుంచి ఈ రోజు వరకు... ఏనాటికైనా ఢిల్లీని చూస్తానా అనుకునేదాన్ని. కానీ ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ వరకు నా ప్రయాణం ఉంటుందని అనుకోలేదు. దేశ ప్రథమ మహిళ చేతుల మీదుగా అవార్డు అందుకున్న క్షణాలు మరువలేనివి. రెండు ప్రయాణాలు 2010 సమయంలో ఛత్తీస్గడ్ నుంచి గుత్తి కోయలు తెలంగాణకు రావడం ఎక్కువైంది. నా పీహెచ్సీ పరిధిలో మద్దుకూరు సమీపంలో గుత్తికోయలు వచ్చి మంగళబోడు పేరుతో ఓ గూడెం ఏర్పాటు చేసుకున్నట్టు అక్కడి సర్పంచ్ చెప్పాడు. ఆ గ్రామానికి తొలిసారి వెళ్లినప్పుడు ఎవ్వరూ పలకరించలేదు. నేనే చొరవ తీసుకుని అన్ని ఇళ్లలోకి తలుపులు తీసుకుని వెళ్లాను. ఓ ఇంట్లో ఓ మహిళ అచేతనంగా పడుకుని ఉంది. పదిహేను రోజుల కిందటే ప్రసవం జరిగిందని చెప్పారు. తీవ్ర రక్తస్రావం కావడంతో మనిషి నీరసించిపోయి ఉంది. ఒళ్లంతా ఉబ్బిపోయి ఉంది. వెంటనే ఆ గ్రామ సర్పంచ్‌ను బతిమాలి ఓ సైకిల్ ఏర్పాటు చేసి అడవి నుంచి మద్దుకూరు వరకు తీసుకొచ్చాను. అక్కడి నుంచి ఆటోలో కొత్తగూడెం ఆస్పత్రికి వచ్చాం. పరిస్థితి విషమించడంతో వరంగల్ తీసుకెళ్లాలని సూచించారు. 108లో ఆమెను వెంటబెట్టుకుని వరంగల్‌కు తీసుకెళ్లాను. 21 రోజుల పాటు చికిత్స అందించిన తర్వాత ఆ తల్లిబిడ్డలు ఇద్దరూ ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారు. ఈ ఘటన తర్వాత అక్కడున్న వలస గుత్తి కోయలకు నాపై నమ్మకం కలిగింది. ఏదైనా సమస్య ఉంటే సంకోచం లేకుండా చెప్పుకోవడం మొదలు పెట్టారు. రక్తం కోసం బతిమాలాను ఓసారి గుత్తికోయగూడెం వెళ్లినప్పుడు పిల్లలందరూ నా దగ్గరకు వచ్చారు కానీ జెమిలీ అనే ఏడేళ్ల బాలిక రాలేదు. ఏమైందా అని ఆరా తీస్తూ ఆ పాప ఇంట్లోకి వెళ్లాను. నేలపై స్పృహ లేని స్థితిలో ఆ పాప పడుకుని ఉంది. బ్లడ్ శాంపిల్ తీసుకుని టెస్ట్ చేస్తే మలేరియా పాజిటివ్‌గా తేలింది. వెంటనే పీహెచ్‌సీకి అక్కడి నుంచి కొత్తగూడెం తీసుకువస్తే పాప పరిస్థితి చాలా సీరియస్‌గా ఉందని డాక్టర్లు చెప్పారు. ఖమ్మం తీసుకెళ్లమన్నారు. ఆక్కడకు వెళ్తే వరంగల్ పొమ్మన్నారు. కానీ డాక్టర్లను బతిమాలి అక్కడే వైద్యం చేయమన్నాను. ఆ పాపది ఓ-నెగెటివ్ గ్రూప్ రక్తం కావడంతో చాలా మందికి ఫోన్లు చేసి బతిమాలి రెండు యూనిట్ల రక్తం సంపాదించగలిగాను. చివరకు ఆ పాప ప్రాణాలు దక్కాయి. మరోసారి ఓ గ్రామంలో ఓ బాలింత చంటిపిల్లకు ఒకవైపు రొమ్ము పాలే పట్టిస్తూ రెండో రొమ్ముకు పాలిచ్చేందుకు తంటాలు పడుతున్నట్టు గమనించాను. వెంటనే ఇన్ఫెక్షన్ గుర్తించి ఆస్పత్రికి తరలించాను. అర్థం చేసుకోవాలి మైదానం ప్రాంత ప్రజలకు ఒకటికి రెండు సార్లు చెబితే అర్థం చేసుకుంటారు. వారికి రవాణా సదుపాయం కూడా బాగుంటుంది. కానీ వలస ఆదివాసీల గుత్తికోయల గూడేల్లో పరిస్థితి అలా ఉండదు. ముందుగా వారిలో కలిసిపోవాలి. ఆ తర్వాత అక్కడి మహిళలను ఆస్పత్రికి తీసుకెళ్లాలంటే భర్త/తండ్రి తోడు రావాలి. వాళ్లు పనులకు వెళితే సాయంత్రం కానీ రారు. వచ్చే వరకు ఎదురు చూడాలి. వచ్చినా పనులు వదిలి ఆస్పత్రికి వచ్చేందుకు సుముఖంగా ఉండరు. ఆస్పత్రి కోసం పని వదులుకుంటే ఇంట్లో తిండికి కష్టం. అన్నింటికీ ఒప్పుకున్నా.... ఆస్పత్రికి తీసుకెళ్లాలంటే అడవుల్లో ఉండే గుత్తికోయ గ్రామాలకు రవాణా కష్టం. క్షేత్రస్థాయిలో ఉండే ఈ సమస్యలను అర్థం చేసుకుంటే అత్యుత్తమంగా వైద్య సేవలు అందించే వీలుంటుంది. కోవిడ్ సమయంలో మద్దుకూరు, దామరచర్ల, సీతాయిగూడెం గ్రామాలు నా పరిధిలో ఉండేవి. కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో ఈ మూడు గ్రామాల్లో కలిపి ఓకేసారి 120 మందిని ఐసోలేçషన్లో ఉంచాను. ఇదే సమయంలో మా ఇంట్లో నలుగురికి కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉదయం నుంచి రాత్రి వరకు అన్ని గ్రామాలు తిరుగుతూ ప్రాణనష్టం రాకుండా సేవలు అందించాను. నా పరిధిలో ఉన్న గ్రామాల్లో ఏ ఒక్కరూ కోవిడ్‌తో ఇంట్లో చనిపోలేదు. వారి సహకారం వల్లే వృత్తిలో మనం చూపించే నిబద్ధతను బట్టి మనకంటూ ఓ గుర్తింపు వస్తుంది. ఎవరికైనా ఆరోగ్యం బాగోలేకప్పుడు అర్థరాత్రి ఫోన్ చేసినా డాక్టర్లు లిఫ్ట్ చేసి అప్పటికప్పుడు సలహాలు ఇస్తారు. అవసరాన్ని బట్టి హాస్పిటల్‌కు వచ్చి కేస్ అటెండ్ చేస్తారు. అదే విధంగా నాతో పాటు పని చేసే ఇతర సిబ్బంది పూర్తి సహకారం అందిస్తారు. ఇక ఆశా వర్కర్లు అయితే నా వెన్నంటే ఉంటారు. ఏదైనా పని చెబితే కొంత ఆలçస్యమైనా ఆ పని పూర్తి చేస్తారు. వీరందరి సహకారం వల్లే నేను ఉత్తమ స్థాయిలో సేవలు అందించగలిగాను. ఈ రోజు నాకు దక్కిన గుర్తింపుకు డాక్టర్ల నుంచి ఆశావర్కర్ల వరకు అందరి సహకారం ఉంది’’ అని వివరించారు సుశీల. – తాండ్ర కృష్ణగోవింద్ సాక్షి,భద్రాద్రి కొత్తగూడెం -
రాష్ట్రపతి ముర్ముతో ప్రచండ భేటీ
న్యూఢిల్లీ: నేపాల్‌ను ప్రాధాన్యత గల దేశంగా భారత్ పరిగణిస్తుందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము స్పష్టం చేశారు. కీలక ప్రాజెక్టులను నిర్ణీత కాలంలోగా పూర్తి చేయడం సహా రెండు దేశాల మధ్య అభివృద్ధి భాగస్వామ్యాన్ని విస్తృతం చేసుకునేందుకు కట్టుబడి ఉంటుందని హామీ ఇచ్చారు. భారత్ పర్యటిస్తున్న నేపాల్ ప్రధాని పుష్పకుమార్ దహల్ ‘ప్రచండ’గురువారం రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో భేటీ అయ్యారు. ఇటీవలి సంవత్సరాల్లో నేపాల్–భారత్ ద్వైపాక్షిక సంబంధాలు క్రమేపీ వృద్ధి చెందుతు న్నాయని ముర్ము అన్నారు. ఇరు దేశాల ప్రజల మధ్య సంబంధాలను, పర్యాట కాన్ని అభివృద్ధి చేసేందుకు ఆధ్యాత్మిక పర్యాటక సర్క్యూట్‌ను పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. తరాలుగా కొనసాగుతున్న సంబంధాలు మరింతగా బలపడాలని రాష్ట్రపతి ముర్ము ఆకాంక్షించారని రాష్ట్రపతి భవన్ తెలిపింది. అనంతరం నేపాల్ ప్రధాని ప్రచండ ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్‌ను ఆయన నివాసంలో కలుసుకున్నారు. -
ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందంటూ రోడ్డెక్కిన విపక్షాలు..ఢిల్లీలో ఉద్రిక్తత
కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్ష పార్టీలన్ని రోడ్డెక్కి ఆందోళనలు చేపట్టాయి. ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందంటూ ప్రతిపక్ష పార్టీలకు చెందిన పలువురు ఎంపీలు బ్యానర్లు చేతపట్టుకుని పార్లమెంట్ వరకు నిరసన ర్యాలీలు చేపట్టారు. అయితే పోలీసులు వీరిని అడ్డుకుని పోలీస్టేషన్‌కు తరలించారు. రాష్ట్రపతి భవన్ వైపు పాదయాత్రతో వస్తున్న విపక్ష ఎంపీలను పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఢిల్లీలో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. అదానీ హిండెన్‌బర్గ్ వ్యవహారం, రాహుల్ గాంధీ అరెస్టు తదితర అంశాల నేపథ్యంలో శుక్రవారం విపక్షాలన్ని ఆందోళనకు దిగాయి. ఈ మేరకు ఈ అంశంపైనే శుక్రవారం కూడా ప్రతిపక్ష సభ్యులు ఉభయల సభల్లో ఆందోళనకు దిగడంతో ఎలాంటి చర్చలు జరగకుండానే సభలు మరోసారి వాయిదాపడ్డాయి. ఈ నేపథ్యంలోనే తొలుత పార్లమెంట్ ప్రాంగణంలోనే నిరసనలు చేపట్టిన ప్రతిపక్ష ఎంపీలు..విజయ్ చౌక్ నుంచి రాష్ట్రపతి భవన్వైపుకు ర్యాలీ ప్రదర్శనలు చేపట్టాయి. అయితే పోలీసులు ర్యాలీలకు అనుమతి లేదంటూ వారిని అదుపులో తీసుకున్నారు. దీంతో విజయ్ చౌక్ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అదీగాక గత కొంతకాలంగా అదానీ హిండెన్‌బర్గ్ సమస్యపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)తో విచారణ చేపట్టాలని డిమాండ్ చేయడమే గాక రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశం కావాలని కోరుతున్నాయి. ఐతే దీనిపై పార్లమెంట్లో చర్చ జరగనివ్వకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటుందని విపక్ష ఆరోపిస్తున్నాయి. పైగా దీని నుంచి దృష్టి మరల్చడానికే కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌పై అరెస్టు వంటి ఎత్తుగడలను ఉపయోగిస్తుందని ప్రతిపక్షాలు విరుచుకుపడ్డాయి.కేంద్ర ప్రభుత్వం రాజకీయ ప్రతీకారం తీర్చుకుంటుందంటూ విపక్షాలన్నీ దుమ్మెత్తిపోస్తున్నాయి. Democracy in danger.. We stand in support with #RahulGandhi.pic.twitter.com/848QlEQcVt — WB Youth Congress (@IYCWestBengal) March 24, 2023 (చదవండి: రాహుల్ గాంధీపై ఎంపీగా అనర్హత వేటు.. ప్రకటించిన లోక్‌సభ సెక్రటరీ జనరల్) -
పద్మభూషణ్ స్వీకరించిన కుమార మంగళం బిర్లా
న్యూఢిల్లీ: ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా బుధవారం రాష్ట్రపతి భవన్లో జరిగిన ఒక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నుంచి పద్మభూషణ్ అవార్డును స్వీకరించారు. దీనితో బిర్లా కుటుంబంలో దేశ అత్యున్నత పౌర పురస్కారం అందుకున్న నాల్గవ వ్యక్తిగా నిలిచారు. ఆయన ముత్తాత జీడీ బిర్లా 1957లో పద్మవిభూషణ్ గ్రహీత. తల్లి రాజశ్రీ బిర్లా 2011లో పద్మభూషణ్ పురస్కారం పొందారు. కుమార మంగళం బిర్లా తాత బీకే బిర్లా బంధువు జీపీ బిర్లా 2006లో పద్మభూషణ్‌ను అందుకున్నారు. ఆయన 28 ఏళ్ల సుదీర్ఘ వాణిజ్య అనుభవంలో గ్రూప్ టర్నోవర్ 30 రెట్లు పెరిగి 60 బిలియన్ డాలర్లకు చేరింది. ‘‘ఉన్నత లక్ష్యానికి వ్యాపారం దోహదపడుతూ, జీవితాలను సుసంపన్నం చేయాలన్న ఆదిత్య బిర్లా గ్రూప్ సంకల్పానికి ఈ అవార్డు ఒక గుర్తింపు’’ అని కుమార మంగళం బిర్లా పేర్కొన్నారు. ఈ ఏడాది మరణానంతర పద్మశ్రీ అవార్డులు లభించిన వారిలో ప్రముఖ శీతల పానీయాల బ్రాండ్ రస్నా వ్యవస్థాపకుడు, దివంగత అరీజ్ ఖంబట్టా, దిగ్గజ ఇన్వెస్టర్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలా ఉన్నారు. -
రాష్ట్రపతి భవన్: మొఘల్ గార్డెన్స్ పేరు మార్పు.. ఇకపై అమృత్ ఉద్యాన్
Amrit Udyan.. కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఉన్న మొఘల్ గార్డెన్స్ పేరును మారుస్తున్నట్టు శనివారం ఓ ప్రకటనలో పేర్కొంది. మొఘల్ గార్డెన్ పేరును అమృత్ ఉద్యాన్‌గా మార్చింది. మరోవైపు.. జనవరి 31 నుంచి అమృత్ ఉద్యాన్‌లోకి ప్రజలను అనుమతించనున్నట్టు కేంద్రం వెల్లడించింది. అయితే, భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఆజాదీకా అమృత్ మహోత్సవ్ థీమ్‌కు అనుగుణంగా మొఘల్ గార్డెన్స్ పేరును మార్చుతున్నట్టు కేంద్రం స్పష్టం చేసింది. ఇక, ఈ నెల 29న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. అమృత్ ఉద్యాన్‌ను ప్రారంభించనున్నారు. అనంతరం, 31వ తేదీ నుంచి అమృత్ ఉద్యాన్‌లోకి ప్రజలకు ఎంట్రీ లభించనుంది. ప్రజల సందర్శన కోసం నెల రోజుల పాటు అమృత్ ఉద్యాన్‌లోకి ప్రవేశం కల్పించనున్నట్టు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము డిప్యూటీ ప్రెస్ సెక్రటరీ నవికా గుప్తా వెల్లడించారు. The Mughal Gardens at Rashtrapati Bhavan will now be known as '#AmritUdyan'. pic.twitter.com/HbxxYjsXvY — Nikhil Parmar (@NikhilparmarBJP) January 28, 2023 రాష్ట్రపతి భవన్లో 15 ఎకరాల్లో మొఘల్ గార్డెన్ ఉంది. దీన్ని మొఘల్ గార్డెన్స్‌ను మొఘల్ చక్రవర్తులు నిర్మించారు. ఇవి పెర్షియన్ శైలిలో నిర్మించిన తోటలు. ఈ రకపు తోటలు పెర్షియా తోటల చార్ బాగ్ నిర్మాణంలో కట్టినవి. సాధారణంగా ఈ గార్డెన్స్ లో సరస్సులు, ఫౌంటైన్లు, కాలువలు కూడా ఉండటం విశేషం. భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ లలో ఎన్నో మొఘల్ గార్డెన్స్ ఉన్నాయి. షాలిమర్ గార్డెన్స్(లాహోర్), ఢాకాలోని లాల్ బాగ్ కోట, శ్రీనగర్ లోని షాలిమర్ గార్డెన్స్ మొఘల్ గార్డెన్స్‌లో ఉన్నాయి. తాజ్ మహల్ వద్ద కూడా మొఘల్ గార్డెన్స్ ఉంది. -
పుల్లారెడ్డి స్వీట్స్ అధినేత కోడలి మెయిల్‌పై స్పందించిన రాష్ట్రపతి భవన్
సాక్షి, హైదరాబాద్: పుల్లారెడ్డి స్వీట్స్ అధినేత జి.రాఘవరెడ్డి కోడలు ప్రజ్ఞ రెడ్డి ఈ–మెయిల్‌కు రాష్ట్రపతి భవన్ స్పందించింది. నగర పర్యటనకు వస్తున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు ప్రజ్ఞ సోమవారం మెయిల్ ద్వారా లేఖ రాసిన విషయం విదితమే. రాఘవరెడ్డితో పాటు ఆయన భార్య భారతి రెడ్డి, కుమార్తె శ్రీవిద్య రెడ్డి తనతో పాటు తన కుమార్తెను వేధిస్తున్న అంశాన్ని ప్రజ్ఞ రాష్ట్రపతి దృష్టికి తీసుకువెళ్లారు. ఈమె పంపిన ఈ–మెయిల్‌పై రాష్ట్రపతి భవన్ స్పందించింది. తక్షణం చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ అండర్ సెక్రటరీ పీసీ మీనా ప్రభుత్వానికి బుధవారం మెయిల్ పంపారు. ప్రజ్ఞ ఫిర్యాదుపై ఏ చర్యలు తీసుకున్నారో తమకు తెలపాలంటూ అందులో ఆదేశించారు. ఈ పరిణామంతో ప్రజ్ఞ ఆమె కుటుంబీకులు రాష్ట్రపతికి కృతజ్ఞతలు తెలిపారు. చదవండి: న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి పుల్లారెడ్డి స్వీట్స్ అధినేత కోడలు విజ్ఞప్తి -
జీ–20 దేశాల సన్నాహక సదస్సు: ఎలాంటి బాధ్యతైనా సిద్ధమే
సాక్షి, న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక జీ–20 దేశాల సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇస్తున్న నేపథ్యంలో నిర్వహణ, సన్నాహాలకు సంబంధించి ఎలాంటి బాధ్యతలు అప్పగించినా చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. సదస్సు విజయవంతానికి రాష్ట్రం తరపున అన్నివిధాలా సహాయ సహకారాలు అందజేస్తామన్నారు. జీ–20 దేశాల సదస్సు సన్నాహకాలు, వ్యూహాల ఖరారులో భాగంగా ప్రధాని మోదీ అధ్యక్షతన సోమవారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో నిర్వహించిన సమావేశానికి ముఖ్యమంత్రి జగన్ హాజరయ్యారు. రాష్ట్రపతి భవన్లో అఖిలపక్ష భేటీలో ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌షా, సీఎం వైఎస్ జగన్, తదితరులు జీ–20 దేశాధినేతల ప్రతిష్టాత్మక సదస్సుకు భారత్ వేదిక కావడం పట్ల ఈ సందర్భంగా సీఎం సంతోషం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ సమాజం మన దేశం వైపు చూస్తున్న తరుణంలో పార్టీలకతీతంగా అందరూ ఒకేతాటిపైకి రావాల్సి ఉందని స్పష్టం చేశారు. ఈ సమయంలో రాజకీయ కోణాల్లో వ్యాఖ్యలు చేయడం సరి కాదన్నారు. రాజకీయ పార్టీల మధ్య విభేదాలు సహజమని, వాటిని మనవరకే పరిమితం చేసి జీ–20 సదస్సును విజయవంతం చేయాలని ఆకాంక్షించారు. అనంతరం సీఎం జగన్ రాష్ట్రపతి భవన్ నుంచి నేరుగా విమానాశ్రయానికి చేరుకొని విజయవాడ బయల్దేరారు. అంతకుముందు ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ముఖ్యమంత్రి జగన్‌కు వైఎస్సార్సీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డి, వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. -
జీ20 అఖిలపక్ష సమావేశానికి సీఎం జగన్
సాక్షి, అమరావతి: భారతదేశం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న జీ20 దేశాల సదస్సును విజయవంతం చేసేందుకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయడానికి కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. డిసెంబర్ 5న న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో సాయంత్రం 5 గంటలకు జరిగే ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆహ్వానించారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఈ సమావేశం జరగనుంది. ప్రపంచంలో ఆర్థికంగా బలంగా ఉన్న గ్రూప్ ఆఫ్ ట్వంటీ (జీ 20) దేశాలకు 2022 డిసెంబర్ 1 నుంచి 2023 నవంబర్ 30 వరకు భారత్ నేతృత్వం వహించనుంది. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా 32 రంగాలకు సంబంధించి వివిధ నగరాల్లో 200కు పైగా సమావేశాలు నిర్వహించనున్నారు. భారతదేశం నేతృత్వం వహిస్తున్న ఈ సమావేశాలను విజయవంతం చేయడం ద్వారా దేశ సత్తాను ప్రపంచానికి తెలియచేసే విధంగా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయనున్నారు. ప్రపంచ జీడీపీలో 90 శాతం, వ్యాపారంలో 80 శాతం, జనాభాలో మూడింట రెండొంతుల వాటా ఈ దేశాలదే. ఈ దేశాలు కలిసి పని చేయడం ద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తూ సుస్థిరమైన వృద్ధిని సాధించడమే ఈ సమావేశాల లక్ష్యం. -
రాష్ట్రపతి చేతుల మీదుగా ఎన్ఎస్ఎస్ అవార్డుల ప్రదానం
సాక్షి, న్యూఢిల్లీ/వెంకటాచలం(శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా): జాతీయ సేవా పథకం(ఎన్ఎస్ఎస్–2020–21) అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో ప్రదానం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు మూడు, తెలంగాణకు రెండు అవార్డులు లభించాయి. ప్రోగ్రామ్ ఆఫీసర్ కేటగిరీలో జేఎన్టీయూ అనంతపురానికి చెందిన జితేంద్రగౌడ్, వలంటీర్ కేటగిరీలో నెల్లూరులోని కృష్ణచైతన్య డిగ్రీ కాలేజీకి చెందిన చుక్కల పార్థసారథి, అనంతపురానికి చెందిన దేవనపల్లి సిరి రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు. -
యు.యు.లలిత్ అనే నేను..
న్యూఢిల్లీ: భారత సుప్రీంకోర్టు 49వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో ఆయనతో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రమాణం చేయించారు. రిజిస్టర్లో సంతకం చేసిన అనంతరం జస్టిస్ లలిత్‌కు రాష్ట్రపతి ముర్ము అభినందనలు తెలియజేశారు. ప్రమాణ స్వీకారోత్సవంలో ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు, కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు, మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ప్రమాణం చేసిన తర్వాత జస్టిస్ లలిత్ తన తండ్రి, బాంబే హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఉమేశ్ రంగనాథ్ లలిత్(90)తోపాటు కుటుంబ పెద్దల పాదాలకు నమస్కరించి, ఆశీర్వాదం పొందారు. బార్ నుంచి నేరుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయిన రెండో వ్యక్తి జస్టిస్ లలిత్. 1964లో జస్టిస్ ఎస్.ఎం.సిక్రీ బార్ నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జస్టిస్ లలిత్ పదవీ విరమణ అనంతరం నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డీవై చంద్రచూడ్ నియమితులయ్యే అవకాశముంది. 100 రోజుల్లోపే పదవిలో ఉండే ఆరో సీజేఐ దేశంలో ఇప్పటిదాకా 100 రోజుల్లోపే పదవిలో ఉన్న ఆరో ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ యు.యు.లలిత్ రికార్డుకెక్కనున్నారు. ఆయన ఈ ఏడాది నవంబర్ 8న పదవీ విరమణ చేస్తారు. అంటే కేవలం 74 రోజులపాటు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందిస్తారు. ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేసిన జస్టిస్ కమల్ నారాయణ్ సింగ్ 18 రోజులు, జస్టిస్ రాజేంద్రబాబు 30 రోజులు, జస్టిస్ జె.సి.షా 36 రోజులు, జస్టిస్ జి.బి.పట్నాయక్ 41 రోజులు, జస్టిస్ ఎల్.ఎం.శర్మ 86 రోజులపాటు పదవిలో కొనసాగారు. -
రాష్ట్రపతిని కలిసిన సోనియా గాంధీ
న్యూఢిల్లీ: క్రాంగెస్ పార్టీలో సాగుతున్న అంతర్గత విభేదాల మధ్య సోనియా గాంధీ ఎట్టకేలకు రాష్ట్రపతిని కలిశారు. ఈ మేరకు సోనియాగాంధీ మంగళవారం రాష్ట్రపతి భవన్ ద్రౌపది ముర్ముని కలిసి ఆమెని అభినందించారు. ఇటీవలే సోనియా గాంధీ రెండుసార్లు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అంతర్గత విభేదాలతో అట్టుడుకిపోతుంది. ఇటీవలే కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఆనంద్ శర్మ ఆ పార్టీ స్టీరింగ్ కమిటీ చైర్మన్ పదికి రాజీనామ చేస్తున్నట్లు ప్రకటించారు. తనను పదే పదే అవమానించడంతో రాజీనామ చేయక తప్పడం లేదని వాపోయారు. దీంతో ఆయన్ని శాంతింప చేయడానికి హిమచల్‌ప్రదేశ్ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ చైర్మన్ రాజీవ్ శుక్లాని పంపారు. ఆ తర్వాత ఆయన రాజీవ్ శర్మను కలిసి మాట్లాడిన తదనంతరం సోనియాను కలిసేందుకు ఢిల్లీ పయనమయ్యారు. (చదవండి: కాంగ్రెస్ వల్లే సజీవంగా ప్రజాస్వామ్యం .. 32 ఏళ్లలో ఏ పదవీ చేపట్టని కుటుంబం అది!) -
Independence Day 2022:నేడు జాతినుద్దేశించి రాష్ట్రపతి ముర్ము ప్రసంగం
న్యూఢిల్లీ: 76వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆదివారం జాతినుద్దేశించి మొట్టమొదటిసారిగా ప్రసంగించనున్నారు. ఆమె ప్రసంగం రాత్రి 7 గంటలకు దేశవ్యాప్తంగా ఆల్ ఇండియా రేడియో(ఏఐఆర్)తోపాటు, దూరదర్శన్ అన్ని చానళ్లలో హిందీ, ఇంగ్లిష్ భాషల్లో ప్రసారమవుతుందని రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటనలో తెలిపింది. అనంతరం ప్రసంగాన్ని దూరదర్శన్ ప్రాంతీయ చానళ్లు ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేస్తాయని వివరించింది. ఏఐఆర్ కూడా రాష్ట్రపతి ప్రసంగాన్ని ప్రాంతీయ భాషల్లో ప్రాంతీయ నెట్‌వర్క్‌ల ద్వారా రాత్రి 9.30 గంటలకు ప్రసారం చేయనుందని పేర్కొంది. ఒడిశాకు చెందిన ముర్ము జూలై 25వ తేదీన రాష్ట్రపతిగా ప్రమాణం చేసిన విషయం తెలిసిందే. -
7న ప్రధాని అధ్యక్షతన నీతి ఆయోగ్ భేటీ
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ అధ్యక్షతన ఆదివారం నీతి ఆయోగ్ ఏడో గవర్నింగ్ కౌన్సిల్ భేటీ ఉంటుందని ప్రధానమంత్రి కార్యాలయం అధికారులు తెలిపారు. కేంద్రం, రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల మధ్య సహకారానికి ఈ సమావేశం మరింతగా తోడ్పడుతుందన్నారు. 2019 జూలై తర్వాత నీతి ఆయోగ్ సభ్యులు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రత్యక్షంగా పాల్గొంటున్న ఈ సమావేశం రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్ వేదికగా జరుగుతుందన్నారు. పంటల వైవిధ్యం, పప్పులు, నూనె గింజల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి, అగ్రి కమ్యూనిటీస్, ఎన్ఈపీ అమలు, పట్టణ పాలన వంటి అంశాలపై ఈ భేటీలో చర్చలు ఉంటాయన్నారు. -
CM Jagan: ఢిల్లీకి ఏపీ సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండు రోజుల పర్యటనకు శనివారం ఢిల్లీకి వెళ్లనున్నారు. 6వ తేదీ సాయంత్రం విశాఖపట్నం నుంచి విమానంలో ఢిల్లీకి బయలుదేరుతారు. రాత్రికి వన్ జన్‌పథ్‌లో బస చేసి, 7వ తేదీ (ఆదివారం) ఉదయం 9.30 గంటలకు రాష్ట్రపతి భవన్ చేరుకుంటారు. ఆ తర్వాత నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు అక్కడ జరిగే నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ ఏడవ సమావేశంలో పాల్గొననున్నారు. అనంతరం తిరిగి తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు. కాగా.. సీఎం వైఎస్ జగన్ శనివారం శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస జూనియర్ కాలేజీ మైదానంలో జరగనున్న శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం కుమారుడి వివాహ వేడుకల్లో పాల్గొననున్నారు. ఇదీ చదవండి: ఏపీ మెగా ప్రాజెక్టు ఒక గేమ్ చేంజర్ -
హస్తినలో హైటెన్షన్.. పోలీసుల అదుపులో ప్రియాంక, రాహుల్
సాక్షి,న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం, ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసన ప్రదర్శనలకు పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రధాని నివాస ముట్టడితో పాటు పార్లమెంటు నుంచి రాష్ట్రపతి భవన్ వైపు ర్యాలీగా వెళ్లాలని కాంగ్రెస్ నేతలు భావించారు. ఈలోపు నిరసనలకు దిగిన రాహుల్, ప్రియాంకతో పాటు పలువురు ముఖ్యనేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆందోళనల్లో భాగంగా పార్లమెంటు నుంచి విజయ్ చౌక్ రోడ్డులో రాష్ట్రపతి భవన్‌కు ర్యాలీగా వెళ్లాలని కాంగ్రెస్ శ్రేణులు భావించాయి. అయితే పారామిలిటరీ, పోలీసు బలగాలు ఆ మార్గాన్ని బ్లాక్ చేశాయి. ఎవరూ ముందుకు వెళ్లకుండా బారీకేడ్లు ఏర్పాటు చేశాయి. ఈ క్రమంలోనే రాష్ట్రపతి భవన్ మార్గంలో వెళ్తున్న కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. నిరసనల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ నివాసాన్ని ముట్టడించాలని కాంగ్రెస్ భావించింది. तानाशाह कहां तुम रोक पाओगे- जनता की आवाज उठाने से, जनता के लिए तानाशाही हुकूमत से भिड़ जाने से। ये नारीशक्ति है। तानाशाही हुकूमत की चूलों को भी हिला सकती है।।#महंगाई_पर_हल्ला_बोल pic.twitter.com/OTOcGNthjj — Congress (@INCIndia) August 5, 2022 నిరసనలకు ముందు ఢిల్లీ కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు రాహుల్ గాంధీ. కేంద్ర ప్రభుత్వంపై విమర్శలతో విరుచుకుపడ్డారు. దేశంలో ప్రస్తుత నియంత పాలన నడుస్తోందని ఆరోపించారు. ప్రజాస్వామ్యం కనుమరుగైందని, ఆర్ఎస్ఎస్ దేశాన్ని నియంత్రిస్తోందని ఆరోపించారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం సహా ఇతర అంశాలపై కేంద్రానికి వ్యతిరేకంగా శుక్రవారం దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టింది కాంగ్రెస్. అన్ని రాష్ట్రాల్లోని నాయకులు ఈ నిరసనల్లో పాల్గొన్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖర్గే వంటి నేతలు నల్ల దుస్తులు ధరించి నిరసన తెలిపారు. చదవండి: అదంతా ఓ జ్ఞాపకం.. ఆ నలుగురి నియంతృత్వంలో దేశం: రాహుల్ ఫైర్ -
నూతన సీవీసీ సురేశ్ ఎన్ పటేల్
న్యూఢిల్లీ: విజిలెన్స్ కమిషనర్ సురేశ్ ఎన్ పటేల్ సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్(సీవీసీ)గా నియమితులయ్యారు. రాష్ట్రపతి భవన్లో బుధవారం ఉదయం జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరయ్యారు. సీవీసీ పోస్ట్ ఏడాది కాలంగా ఖాళీగా ఉంది. సంజయ్ కొఠారీ పదవీ కాలం పూర్తి కావడంతో సురేశ్ ఎన్ పటేల్ జూన్ నుంచి తాత్కాలిక సీవీసీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎంపిక కమిటీ సురేశ్ ఎన్ పటేల్ పేరును గత నెలలోనే ఖరారు చేసిన విషయం తెలిసిందే. అదేవిధంగా, ఇద్దరు కమిషనర్ల పేర్లను హోం మంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నేతతో కూడిన ప్యానెల్ ఎంపిక చేసింది. సీవీసీగా బాధ్యతలు చేపట్టిన సురేశ్ ఎన్ పటేల్ అనంతరం ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) మాజీ చీఫ్ అర్వింద్ కుమార్, రిటైర్డు ఐఏఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవలతో విజిలెన్స్ కమిషనర్లుగా ప్రమాణం చేయించారు. సీవీసీ, ఇద్దరు కమిషనర్ల నియామకంతో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఇక పూర్తి స్థాయిలో పనిచేయనుంది. ఆంధ్రా బ్యాంక్ మాజీ చీఫ్ అయిన సురేశ్ ఎన్ పటేల్ 2020 ఏప్రిల్‌లో విజిలెన్స్ కమిషనర్‌గా నియమితులయ్యారు. అదేవిధంగా, 1984 బ్యాచ్ రిటైర్డు ఐపీఎస్ అధికారి అయిన అర్వింద్ కుమార్ 2019–22 సంవత్సరాల్లో ఐబీ డైరెక్టర్‌గా ఉన్నారు. అస్సాం–మేఘాలయ కేడర్‌కు చెందిన 1988 బ్యాచ్ రిటైర్డు ఐఏఎస్ అధికారి అయిన శ్రీవాస్తవ కేబినెట్ సెక్రటరీగా పనిచేశారు. సీవీసీ, విజిలెన్స్ కమిషనర్లు నాలుగేళ్లపాటు లేదా 65 ఏళ్లు వచ్చే వరకు పదవుల్లో కొనసాగుతారు. -
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జీతం ఎంతో తెలుసా?
న్యూఢిల్లీ: భారత తొలి గిరిజన రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. సంతాల్ ఆదివాసీ తెగకు చెందిన ఆమె భారత 15వ రాష్ట్రపతిగా తిరుగులేని మెజారిటీతో కొత్త చరిత్ర లిఖించారు. స్వాతంత్య్రానంతరం జన్మించిన తొలి రాష్ట్రపతిగానే గాక ఇప్పటిదాకా ఆ పదవి చేపట్టిన వారిలో అత్యంత పిన్న వయస్కురాలిగా కూడా నిలిచారు. ప్రతిభా పాటిల్ తర్వాత ఈ పదవి అధిష్టించనున్న రెండో మహిళ ముర్ము. అధికార ఎన్డీఏ తరఫున బరిలో దిగిన ముర్ము గురువారం జరిగిన ఓట్ల లెక్కింపులో దాదాపు మూడింట రెండొంతల మెజారిటీతో విజయ దుందుభి మోగించారు. విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాపై ఘన విజయం సాధించారు. ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వారసురాలిగా 25వ తేదీ సోమవారం ఆమె పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ క్రమంలో రాష్ట్రపతికి జీతం ఎంత ఉంటుంది, ఆమెకు లభించే ఇతర అలవెన్స్‌లు, విరమణ తర్వత పెన్షన్ వంటి విషయాలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి. మరి వాటిపై ఓ లుక్కేద్దాం. చదవండి: కొత్త రాష్ట్రపతిగా గిరిజన బిడ్డ.. ద్రౌపది ముర్ము ప్రస్థానమిదే 25న ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ముర్ము రాష్ట్రపతి భవన్‌లోకి మారనున్నారు. ప్రస్తుతం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవి కాలం 24తో ముగియడంతో ఆయన ఢిల్లీలోని 12 జనపథ్ రోడ్డులో గల బంగ్లాలోకి వెళ్లనున్నారు. ► భారత రాష్ట్రపతి నెల జీతం రూ. 5 లక్షలు. దీనిని 2018లో రూ. 1.50 లక్షల నుంచి 5 లక్షలకు పెంచారు. ►దేశంలో అత్యధిక జీతం రాష్ట్రపతికే ఉంటుంది. జీతంతోపాటు ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి. ►రాష్ట్రపతికి గృహ, వైద్యం, ప్రయాణ ఖర్చులు ఉచితం. అలాగే కార్యాలయ ఖర్చుల నిమిత్తం సంవత్సరానికి రూ.1 లక్ష లభిస్తుంది. ►భారత రాష్ట్రపతితోపాటు వారి జీవిత భాగస్వామి ప్రపంచంలో ఎక్కడైనా ఉచితంగా ప్రయాణించవచ్చు. చదవండి: Draupadi Murmu: గిరిజన ఘన మన... అధినాయకి ►ప్రెసిడెంట్ అధికారిక నివాసాన్ని రాష్ట్రపతి భవన్‌గా పిలుస్తారు. ఇందులో 340 గదులు ఉంటాయి. ఇది 2 లక్చషల దరపు అడుగుల విస్తీర్ణం కలిగి ఉంది. ►రాష్ట్రపతికి మరో రెండు విడిది నివాసాలు ఉన్నాయి. అక్కడికి సెలవుల నిమిత్తం వెళ్లవచ్చు. ఒకటి సిమ్లాలోని మషోబ్రాలో(వేసవి విడిది) ఉంది, మరొకటి హైదరాబాద్‌లోని బొల్లారంలో(శీతాకాల విడిది) ఉంది. ►రాష్ట్రపతి ప్రీమియమ్ కార్లలోనే ప్రయాణిస్తారు. కస్టమ్-బిల్ట్ బ్లాక్ మెర్సిడెస్ బెంజ్ ఎస్600 (డబ్ల్యూ221)లో ప్రయాణిస్తారు. కార్లలో అత్యాధునిక సెక్యూరిటీ సిస్టమ్ కలిగి ఉంటుంది. బుల్లెట్, బాంబులు, గ్యాస్ దాడులు, ఇతర పేలుడు పదార్థాలను తట్టుకోగలవు. ►భారత ఆర్మీ విభాగంలోని అత్యున్నత విభాగం ప్రెసిడెంట్ బాడీగార్డ్ రాష్ట్రపతికి రక్షణ కల్పిస్తారు. ఈ విభాగంలో త్రివిధ (ఆర్మీ, వాయు, నావీ) దళాలకు చెందిన అగ్రశ్రేణి సైనికులు ఉంటారు. ►భద్రతా కారణాల దృష్ట్యా భారత రాష్ట్రపతి కార్ల వివరాలు ఎప్పుడూ వెల్లడించరు. ఈ కార్లకు లైసెన్స్ ప్లేట్ ఉండదు. దీనికి బదులు జాతీయ చిహ్నం ఉంటుంది ►రాష్ట్రపతి పదవీ విరమణ చేసిన తర్వాత నెలల రూ. 1.5 లక్షల పెన్షన్ వస్తుంది. అంతేగాక వారి జీవిత భాగస్వామికి నెలకు రూ. 30,000 సెక్రటేరియల్ సహాయం అందుతుంది. ►పెన్షన్ కాకుండా ఎలాంటి అద్దె చెల్లించకుండానే పెద్ద బంగ్లాలో నివసించేందుకు అవకాశముంటుంది. అయిదుగురు వ్యక్తిగత సిబ్బందిని నియమించుకునే వెసులుబాటు ఉంటుంది. వారి ఖర్చుల కోసం సంవత్సరానికి రూ. 60,000 లభిస్తుంది. జీవిత భాగస్వామితో సహా ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చు. -
పద్మభూషణ్ అందుకున్న కృష్ణ ఎల్ల దంపతులు
సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: వివిధ రంగాల్లో సేవలు చేసినవారికి అందజేసే పద్మ అవార్డుల రెండో విడత ప్రదానోత్సవం సోమవారం రాష్ట్రపతిభవన్‌లో జరిగింది. మార్చి 21న తొలి విడతలో 54 మందికి అవార్డులు ఇవ్వగా.. సోమవారం 74 మందికి పురస్కారాలు అందజేశారు. అందులో నలుగురు తెలుగువారు ఉన్నారు. భారత్ బయోటెక్ చైర్మన్ కృష్ణ ఎల్ల, ఆయన సతీమణి సుచిత్ర ఎల్ల ఇద్దరికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పద్మభూషణ్ పురస్కారాన్ని అందజేశారు. కూచిపూడి నాట్య కళాకారిణి గడ్డం పద్మజారెడ్డి, కోయ కళాకారుడు సకిని రామచంద్రయ్య కూడా పద్మశ్రీ అవార్డులను అందుకున్నారు. అవార్డు అందుకున్న అనంతరం పద్మజారెడ్డి, రామచంద్రయ్య ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. పద్మశ్రీ అవార్డు తనకు మహాశివుడు ఇచ్చిన వరమని, దీనిని తన నాట్య గురువు దివంగత శోభానాయుడుకు అంకితం చేస్తున్నానని పద్మాజారెడ్డి చెప్పారు. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉందని, ఆదివాసీ కథలే తనను ఈ స్థాయికి తెచ్చాయని సకిని రామచంద్రయ్య అన్నారు. (చదవండి: గూర్ఖాల్యాండ్ డిమాండ్‌ను వదిలిన మోర్చా) -
‘పద్మ’ అవార్డుల ప్రదానం
సాక్షి, న్యూఢిల్లీ: 2022 సంవత్సరానికి 64 మందికి రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ సోమవారం పద్మ పురస్కారాలను అందించారు. ఇందులో రెండు పద్మ విభూషణ్, 8 పద్మభూషణ్, 54 పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి. రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్ హాలులో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో దివంగత సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ తరఫున ఆయన కుమార్తెలు కృతిక రావత్, తరిణి రావత్, గీతాప్రెస్ అధినేత దివంగత రాధేశ్యామ్ ఖేమ్కా తరఫున ఆయన కుమారుడు కృష్ణ కుమార్ ఖేమ్కాలు పద్మ విభూషణ్ పురస్కారాలను స్వీకరించారు. కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్, సీరం ఇన్స్టిట్యూట్ ఎండీ సైరస్ పూనావాలా, పంజాబీ జానపద గాయకుడు గుర్మీత్ బావా (మరణానంతరం), టాటా సన్స్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్, మాజీ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ రాజీవ్ మెహర్షి, దేవేంద్ర ఝఝరియా, రషీద్ ఖాన్, సచ్చిదానంద స్వామి తదితర ప్రముఖులు పద్మభూషణ్ పురస్కారాలను రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా అందుకున్నారు. కాగా తెలుగు రాష్ట్రాల నుంచి మహా సహస్రావధాని డాక్టర్ గరికపాటి నరసింహారావు, డాక్టర్ సుంకర వెంకట ఆదినారాయణ రావు, కిన్నెర వాయిద్యకారుడు దర్శనం మొగులయ్య, నాదస్వర వాయిద్యకారుడు గోసవీడు షేక్ హసన్ సాహెబ్ (మరణానంతరం)లు పద్మశ్రీ అవార్డులను స్వీకరించారు. 2022 పద్మ అవార్డుల రెండో విడత ప్రదానోత్సవం ఈ నెల 28న జరుగనుంది. ఏటా మాదిరిగానే గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ ఏడాది మొత్తం 128 పద్మ అవార్డులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో నాలుగు పద్మ విభూషణ్, 17 పద్మ భూషణ్, 107 పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి. రెండు విడతల్లో 34 మంది మహిళలు, 10 మంది విదేశీయులు/ఎన్ఆర్ఐలు ఉండగా, 13 మందికి మరణానంతరం అవార్డులు ప్రకటించారు. -
ప్రభుత్వాలకు మీరు మార్గదర్శకులు
న్యూఢిల్లీ: రాష్ట్రాల గవర్నర్లు ప్రభుత్వానికి, ప్రజలకు మిత్రులుగా, మార్గదర్శకులుగా వ్యవహరించాలని మన దేశ రాజ్యాంగ రూపకర్తలు భావించారని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చెప్పారు. రాష్ట్రాల అభ్యున్నతి కోసం గవర్నర్లు సాధ్యమైనంత ఎక్కువ సమయం కేటాయించాలని, ప్రజలతో మమేకం కావాలన్నారు. ఢిల్లీలో రాష్ట్రపతి భవన్లో గురువారం రాష్ట్రాల గవర్నర్లు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్ల 51వ సదస్సులో రాష్ట్రపతి మాట్లాడారు. ప్రజా సంక్షేమానికి, వారి సేవ కోసం కట్టుబడి ఉండాలన్న విషయాన్ని సదా గుర్తుంచుకోవాలని ఉద్బోధించారు. ప్రజల్లో చైతన్యం పెంచడంలో, జాతీయ లక్ష్యాలను సాధించేగా దిశగా వారికి స్ఫూర్తినివ్వడంలో గవర్నర్ల పాత్ర అత్యంత కీలకమని అన్నారు. గవర్నర్లు జిల్లాలకు వెళ్లాలని, జిల్లాల్లోని మారుమూల ప్రాంతాలను సందర్శించాలని రాష్ట్రపతి చెప్పారు. ప్రజల సహకారంతో బాధ్యతలను చక్కగా నిర్వర్తించాలని గవర్నర్లను కోరారు. కరోనాపై పోరాటంలో చురుకైన పాత్ర ప్రధాని మోదీ నాయకత్వంలో కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా భారత్ చిరస్మరణీయ పోరాటం సాగించిందని, ఇందులో గవర్నర్లు తమ వంతు సహకారం అందించారని కోవింద్ ప్రశంసించారు. ఈ పోరాటంలో వారు చురుగ్గా వ్యవహరించారని కొనియాడారు. దేశంలో కరోనా ఉధృతి సమయంలో వైద్యులు, ఫ్రంట్‌లైన్ కార్మికులంతా అసాధారణ త్యాగం, అంకితభావంతో విధులు నిర్వర్తించారని గుర్తుచేశారు.దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత గవర్నర్ల సదస్సు దాదాపు ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారు. తొలి సదస్సు 1949లో రాష్ట్రపతి భవన్లో జరిగింది. పథకాల అమలును పర్యవేక్షించాలి: వెంకయ్య రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల అమలు తీరును పర్యవేక్షించాలని గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లకు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సూచించారు. గవర్నర్ల సదస్సులో ఆయన ప్రసంగించారు. జాతి నిర్మాణ కార్యక్రమాల్లో ప్రజలను భాగస్వాములను చేయాలని చెప్పారు. ప్రభుత్వ విధాన నిర్ణయాలు, వాటి అమలులో గవర్నర్ల పాత్ర కీలకమని తెలిపారు. గవర్నర్ పదవిని కేవలం ఒక రాజ్యాంగబద్ధమైన పదవిగా భావించకూడదని, రాష్ట్రానికి తొలి పౌరుడిగా ప్రజలకు సేవ చేయాలని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణతోపాటు సంస్కృతిని కాపాడడానికి తోడ్పాటునందించాలని గవర్నర్లకు వెంకయ్య పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య వారధి: మోదీ గవర్నర్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వారధిగా వ్యవహరిస్తారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గవర్నర్లు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా క్రియాశీలకంగా పని చేయాలని సూచించారు. గవర్నర్ల సదస్సులో ఆయన మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల సందర్శనకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. పొరుగు రాష్ట్రాల గవర్నర్లతోనూ తరచుగా భేటీ కావాలని, దానివల్ల ప్రజల సమస్యలు తెలుస్తాయని వెల్లడించారు. రాష్ట్రాల్లో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ అధికారులతోనూ మాట్లాడుతూ ఉండాలని మోదీ వివరించారు. అన్ని రాష్ట్రాల గవర్నర్ల మధ్య అనుసంధానం కోసం ఓ సంస్థాగత యంత్రాంగం ఉండాలన్నారు. ఒక రాష్ట్రంలో గవర్నర్ అమలు చేస్తున్న ఉత్తమ విధానాలను ఇతర రాష్ట్రాల గవర్నర్లు సైతం అందిపుచ్చుకోవాలని కోరారు. -
భారీ మార్పులతో జంబో కేబినెట్
సాక్షి, న్యూఢిల్లీ: భారీ మెజారిటీతో రెండోసారి అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తరువాత తొలిసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన టీమ్‌లో భారీ మార్పులకు శ్రీకారం చుట్టారు. అనూహ్య మార్పులు, భారీ చేర్పులతో జంబో కేబినెట్‌ను తీర్చిదిద్దారు. కఠిన నిర్ణయాలతో సీనియర్ మంత్రులకు సైతం షాకిచ్చారు. వివిధ కారణాలతో ఏకంగా 12 మందికి ఉద్వాసన పలికారు. పలువురు జూనియర్లకు సీనియర్లుగా ప్రమోషన్ ఇచ్చి కేబినెట్ హోదా కల్పించారు. యూపీ సహా పలు రాష్ట్రాల్లో త్వరలో జరగనున్న ఎన్నికలు, సామాజిక సమీకరణాలు, పనితీరు, సంస్థాగత అవసరాలు ప్రాతిపదికగా భారీ కసరత్తు అనంతరం మొత్తం 77 మంది మంత్రులతో సరికొత్త మంత్రి మండలిని కొలువుదీర్చారు. ప్రధానితో కలిపి మంత్రుల సంఖ్య 78 కి చేరగా, గరిష్టంగా 81 మంది వరకు మంత్రులుగా ఉండవచ్చు. పదవి కోల్పోయిన మంత్రుల్లో సీనియర్లైన ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్, ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్, సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ కూడా ఉన్నారు. మొత్తం 15 మంది కేబినెట్ మంత్రులుగా, 28 మంది సహాయ మంత్రులుగా బుధవారం సాయంత్రం రాష్ట్రపతి భవన్లో ప్రమాణ స్వీకారం చేశారు. తాజా మంత్రివర్గంలో మహారాష్ట్ర మాజీ సీఎం నారాయణ రాణే, అస్సాం మాజీ ముఖ్యమంత్రి శర్బానంద సొనొవాల్, కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన మధ్యప్రదేశ్ నేత జ్యోతిరాదిత్య సింధియాలకు చోటు కల్పించారు. కరోనా రెండో వేవ్‌ను ఎదుర్కోవడంలో ప్రభుత్వం విఫలమైందన్న విమర్శలకు ఆస్కారమిచ్చిన వైద్య, విద్యా శాఖల మంత్రులు డాక్టర్ హర్షవర్థ్దన్, రమేష్ నిశాంక్ పోఖ్రియాల్ సహా మొత్తం 12 మందిని మంత్రివర్గం నుంచి తప్పించారు. వీరి రాజీనామాను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు ముందే ఆమోదించారు. కరోనాను సమర్థవంతంగా ఎదుర్కోలేదన్న విమర్శలతో ప్రజల్లో ప్రభుత్వంపై విశ్వసనీయత తగ్గుతోందన్న సంకేతాల నేపధ్యం ఈ భారీ ఉద్వాసనకు కారణంగా విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా, దేశంలో కరోనా ఉధృతంగా ఉన్న సమయంలో వైద్య శాఖ మంత్రి హర్షవర్ధన్ చేసిన పలు వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. 43 మంది ప్రమాణ స్వీకారం బుధవారం సాయంత్రం 6 గంటలకు రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో ఏడుగురు మహిళలు సహా మొత్తం 43 మంది ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో 36 మంది కొత్త వారు కాగా.. ఇప్పటికే స్వతంత్ర, సహాయ మంత్రులుగా ఉన్న ఏడుగురు కేబినెట్ మంత్రులుగా ప్రమాణం చేశారు. తెలంగాణ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న జి.కిషన్‌రెడ్డికి కేబినెట్ ర్యాంక్‌తో పదోన్నతి లభించింది. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి బీజేపీలో కేబినెట్ మంత్రిగా పనిచేసిన నేతల్లో ఎం.వెంకయ్యనాయుడు తరువాత కిషన్‌రెడ్డి రెండో తెలుగు వ్యక్తి కావడం విశేషం. కాగా కొత్తగా ప్రమాణం చేసిన వారిలో 9 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. కొత్తగా పలువురు మహిళల చేరికతో మంత్రివర్గంలో మహిళల సంఖ్య 11కి చేరింది. తమిళనాడుకు చెందిన ఎల్ మురుగన్ ఏ సభలోనూ సభ్యుడిగా లేరు. ఆయనను పుదుచ్చేరి నుంచి రాజ్యసభకు పంపించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గం నుంచి నిష్క్రమిస్తున్న రవిశంకర్ ప్రసాద్, హర్షవర్ధన్, జావదేకర్ కూడా ఈ ప్రమాణ స్వీకారానికి హాజరుకావడం విశేషం. భాగస్వామ్య పక్షాలకు పదవులు అలాగే భాగస్వామ్య పక్షాలను కేబినెట్లో భాగం చేయడం ద్వారా ప్రాంతీయంగా, సామాజికంగా వివిధ వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఎన్డీయేలో భాగస్వామ్య పక్షాలుగా ఉన్న జేడీయూ, లోక్‌జనశక్తి పార్టీ, అప్నాదళ్ పార్టీలకు మంత్రివర్గంలో భాగస్వామ్యం కల్పించారు. జేడీయూ జాతీయ అధ్యక్షుడు రామచంద్రప్రసాద్ సింగ్, లోక్‌జనశక్తి లోక్‌సభాపక్ష నేత పశుపతి కుమార్ పారస్, అప్నాదళ్ అధ్యక్షురాలు అనుప్రియా సింగ్ పటేల్‌కు స్వతంత్ర హోదాతో సహాయ మంత్రి పదవి దక్కింది. యూపీకి పెద్దపీట వచ్చే ఏడాది మార్చిలో ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి మంత్రివర్గ విస్తరణలో పెద్దపీట దక్కింది. కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన సహాయ మంత్రుల్లో అత్యధికంగా యూపీ నుంచి ఏడుగురికి ప్రాతినిథ్యం లభించింది. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్న బి.ఎల్.వర్మ, పం కజ్ చౌదరి, డాక్టర్ సత్యపాల్ సింగ్ భగేల్, భానూప్రతాప్ సింగ్ వర్మ, కౌశల్ కిశోర్, బి.ఎల్.వర్మ, అజయ్ కుమార్ మిశ్రాలతో పాటు అప్నాదళ్ అధ్యక్షురాలు అనుప్రియా సింగ్ పటేల్‌కు యూపీ నుంచి ప్రాతినిధ్యం దక్కింది. యూపీలో సోషల్ ఇంజనీరింగ్ యూపీ కోటాలో ఓబీసీ, బ్రాహ్మణ, దళిత సామాజిక వర్గాలకు ప్రాధాన్యత లభించింది. వారణాసికి పొరుగున ఉన్న మీర్జాపూర్ నుంచి అనుప్రియా పటేల్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అప్నా దళ్ (ఎస్) అధ్యక్షురాలిగా ఉన్న అనుప్రియా పటేల్ కుర్మి సామాజిక వర్గ ప్రతినిధిగా ఉన్నారు. తూర్పు యూపీ, బుందేల్‌ఖండ్ ప్రాంతంలోని కుర్మి ఓట్లపై ఆమె ప్రభావం చూపుతారు. బి.ఎల్.వర్మ లోధి ఓటు బ్యాంకుపై ప్రభావం చూపుతారని బీజేపీ విశ్వసిస్తోంది. కౌషల్ కిషోర్ యూపీ బీజేపీ షెడ్యూలు కులాల ఫ్రంట్ అధ్యక్షుడిగా ఉన్నారు. భానూ ప్రతాప్ సింగ్ వర్మ కూడా షెడ్యూలు కులాల ఓట్లపై ప్రభావం చూపగలరని బీజేపీ భావిస్తోంది. అజయ్ మిశ్రా బ్రాహ్మణ వర్గ ప్రతినిధిగా ఉన్నారు. పదోన్నతి వీరికే.. స్వతంత్ర హోదాలో క్రీడల శాఖ మంత్రిగా ఉన్న కిరెణ్ రిజిజు, విద్యుత్తు శాఖ మంత్రిగా ఉన్న ఆర్కే సింగ్, గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిగా ఉన్న హర్దీప్సింగ్ పూరి, షిప్పింగ్ శాఖ మంత్రిగా ఉన్న మన్సుఖ్ ఎల్.మాండవీయలకు కేబినెట్ ర్యాంకు లభించింది. హోం శాఖ సహాయ మంత్రిగా ఉన్న గంగాపురం కిషన్‌రెడ్డికి, ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా ఉన్న అనురాగ్‌సింగ్ ఠాకూర్‌కు, పంచాయతీరాజ్, వ్యవసాయ శాఖ సహాయ మంత్రిగా ఉన్న పర్షోత్తమ్ రుపాలాకు కేబినెట్ హోదా దక్కింది. క్రియాశీల నేతలకు పదవులు బీజేపీలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు భూపేందర్ యాదవ్ కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ ఎల్.మురుగన్‌కు సహాయ మంత్రి పదవి లభించింది. యూపీ బీజేపీ ఉపాధ్యక్షుడిగా ఉన్న బి.ఎల్.వర్మనూ మంత్రిపదవి వరించింది. గుజరాత్‌కు పెరిగిన ప్రాతినిథ్యం.. కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రుల్లో గుజరాత్ నుంచి ఇద్దరికి కేబినెట్ పదవులు, ముగ్గురికి సహాయ మంత్రి పదవులు దక్కడం విశేషం. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వారణాసి నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నప్పటికీ స్వరాష్ట్రం గుజరాతే. హోం శాఖ మంత్రి అమిత్ షా కూడా గుజరాత్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. తాజాగా కేబినెట్ ర్యాంకులు దక్కిన మన్సుఖ్ మాండవీయ ఇప్పటికే స్వతంత్ర మంత్రిగా, పర్షోత్తం రుపాలా సహాయ మంత్రిగా ఉన్నారు. బిహార్‌కు చెందిన ముగ్గురికి, మధ్యప్రదేశ్‌కు చెందిన ఇద్దరికీ కేబినెట్ ర్యాంకులు దక్కడం విశేషం. ఇక కర్ణాటకకు నాలుగు పదవులు దక్కాయి. పనితీరు కోణంలో.. కోవిడ్ నేపథ్యంలో కొందరు మంత్రుల పనితీరు సవ్యంగా లేకపోవడం, విమర్శలకు ఆస్కారం ఇవ్వడం వంటి కారణాల నేపథ్యంలో పాలనను మరింత పటిష్టం చేసేందుకు ప్రధాని పూర్తిస్థాయిలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు భారీ కసరత్తు చేశారు. నెల రోజులుగా పలు దఫాలుగా పార్టీ, ప్రభుత్వ వర్గాల నుంచి స్పందన సేకరించి మంత్రివర్గానికి కొత్త రూపు తెచ్చారు. పనితీరు మెరుగ్గా ఉండేందుకు యువతకు పెద్దపీట వేశారు. సివిల్ సర్వీసెస్ మాజీ అధికారులు, వృత్తి నిపుణులను కేబినెట్లో భాగం చేశారు. రాజకీయ కోణంలో.. సామాజిక సమీకరణాలపై పకడ్బందీగా కసరత్తు చేసినట్టు అవగతమవుతోంది. మొత్తం మంత్రిమండలిలో ఓబీసీ వర్గాలకు చెందిన వారు 27 మంది, ఎస్సీ వర్గానికి చెందిన 12 మంది, ఎస్టీ వర్గానికి చెందిన 8 మంది, మైనార్టీలు ఐదుగురు, 11 మంది మహిళలు ఉన్నారు. కేబినెట్ ర్యాంకుతో ఐదుగురు ఓబీసీ మంత్రులు ఉన్నారు. ఎస్సీల్లో చమర్, ఖాతిక్, పాసీ, కోరి, మాదిగ, మహర్, అరుంధతియార్, మేఘ్వాల్, రాజ్బొన్షి, మథువా–నామశూద్ర, దంగర్ తదితర ఉపకులాలకు సమాన ప్రాతినిథ్యం కల్పించారు. ఇక ఎస్టీల్లో గోండులు, సంతాల్, మిజి, తదితర వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించారు. మంత్రులుగా అవకాశం దక్కినవారిలో ఎక్కువ మంది తొలిసారి ఎన్నికైన వాళ్లే ఉన్నారు. అలాగే వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌కు కొత్తగా ఏడు మంత్రి పదవులు ఇచ్చి పెద్ద పీట వేశారు. హోంశాఖ సహాయ మంత్రిగా పిన్నవయస్కుడు నిశిత్ హోంశాఖ సహాయ మంత్రిగా నిశిత్ ప్రామానిక్ బాధ్యతలు చేపట్టనున్నారు. తాజా మంత్రి వర్గ విస్తరణలో పిన్న వయస్కుడైన నిశిత్‌కు యువజన, క్రీడల వ్యవహారాల శాఖ సహాయ మంత్రి బాధ్యతలు కూడా అప్పగించారు. గత కేబినెట్లో సహాయ మంత్రులుగా ఉన్న అనురాగ్ ఠాకూర్‌కు సమాచార ప్రసార శాఖతోపాటు క్రీడలు యువజన వ్యవహారాలు అప్పగించగా మాన్సుఖ్‌లాల్ మాండవీయకు ఆరోగ్యశాఖ అప్పగించారు. తాజా విస్తరణలో చొటు దక్కించుకున్న అశ్విని వైష్ణవ్‌కు కీలక రైల్వే శాఖతోపాటు ఐటీ, కమ్యూనికేషన్ల శాఖలు అప్పగించారు. శంతను ఠాకూర్‌కు ఓడరేవులు, జలరవాణా సహాయమంత్రిగా మహిళల్లో అనుప్రియ పటేల్‌కు వాణిజ్య, పరిశ్రమల శాఖసహాయ మంత్రిగా, భారతిప్రవీణ్ పవార్‌కు ఆరోగ్యశాఖసహాయమంత్రిగా బాధ్యతలు అప్పగించారు. ప్రమాణ స్వీకారం తర్వాత కేబినెట్ మంత్రులతో రాష్ట్రపతి కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య, ప్రధాని మోదీ తదితరులు -
సీజేఐగా నేడు జస్టిస్ ఎన్వీ రమణ ప్రమాణం
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు 48వ ప్రధాన న్యాయమూర్తిగా సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ శనివారం ప్రమాణం చేయనున్నారు. రాష్ట్రపతి భవన్లో ఉదయం 11 గంటలకు జస్టిస్ ఎన్వీ రమణతో రాష్ట్రపతి రామ్నా«థ్ కోవింద్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఉమ్మడి ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా, తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా, ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వర్తించిన జస్టిస్ ఎన్వీ రమణ ఫిబ్రవరి 17, 2014న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. నాటి నుంచి సుప్రీంకోర్టులో పలు కీలక తీర్పుల్లో భాగస్వామ్యం అయిన జస్టిస్ఎన్వీ రమణను ప్రస్తుత సీజేఐ ఎస్ఏ బాబ్డే తదుపరి సీజేఐగా సిఫార్సు చేయగా ఈ నెల 5న రాష్ట్రపతి కోవింద్ ఆమోదముద్ర వేసిన విషయం విదితమే. సీజేఐగా జస్టిస్ ఎన్వీ రమణ ఆగస్టు 26, 2022 వరకూ కొనసాగనున్నారు. మూడేళ్లపాటు ఉండాలి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవీ కాలం మూడేళ్లపాటు ఉండాలని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ అభిప్రాయపడ్డారు. సీజేఐ పదవీ విరమణ కార్యక్రమం ఎప్పుడూ విచారకరమేనన్నారు. కరోనా నేపథ్యంలో వర్చువల్ విచారణల ద్వారా సుప్రీంకోర్టులో సుమారు 50వేల కేసులు విచారణ ముగించడం గొప్ప అచీవ్‌మెంట్‌గా కేకే వేణుగోపాల్ అభివర్ణించారు. సంతృప్తిగా ఉంది.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా తన వంతు కృషి చేశానన్న సంతృప్తితో ఉన్నానని జస్టిస్ ఎస్ఏ బాబ్డే అన్నారు. శుక్రవారం కోర్టు హాలులో నిర్వహించిన వీడ్కోలు కార్యక్రమంలో చాలా క్లుప్తంగా మాట్లాడారు. బాధ్యతలను జస్టిస్ ఎన్వీ రమణకు అప్పగిస్తున్నానని, సమర్థంగా కోర్టును నడిపిస్తారన్న విశ్వాసం ఉందని జస్టిస్ ఎస్ఏ బాబ్డే అన్నారు. క్రమశిక్షణతోనే కరోనాను జయించగలం:జస్టిస్ ఎన్వీ రమణ కరోనాను క్రమశిక్షణతోనే జయించగలమని మరికొద్ది గంటల్లో సుప్రీంకోర్టు 48వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణం చేయనున్న జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. మాస్కు ధరించడం, తరచూ చేతులు కడుక్కోవడం, అవసరం ఉంటేనే బయటకు రావడం వంటి క్రమశిక్షణ చర్యలు పాటించాలన్నారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే వీడ్కోలు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కష్టకాలం బలమైన వారిని సృష్టిస్తుందని, సుప్రీంకోర్టు సిబ్బంది, న్యాయమూర్తులు, న్యాయవాదుల్లో కూడా కరోనా బాధితులున్నారని తెలిపారు. -
కిరణ్ బేడికి బై బై.. తమిళిసైకి బాధ్యతలు
సాక్షి చెన్నై/న్యూఢిల్లీ: పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో కీలక పరిణామాలు సంభవించాయి. లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీని కేంద్రం పదవి నుంచి తొలగించింది. ఈ మేరకు మంగళవారం రాత్రి రాష్ట్రపతి భవన్ నుంచి ఒక ప్రకటన వెలువడింది. తెలంగాణ గవర్నర్ తమిళిసై.. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలను నిర్వహిస్తారని తెలిపింది. మరొకరిని నియమించే వరకు ఆ బాధ్యతలు తమిళిసై నిర్వర్తిస్తారు. సీఎం నారాయణ స్వామి ప్రభుత్వం మైనారిటీలో పడిపోయిన కొద్ది గంటల్లోనే ఈ పరిణామాలు చోటుచేసుకోవడం గమనార్హం. మేలో జరగనున్న ఎన్నికల్లో కిరణ్ బేడీపై వ్యతిరేకతను ప్రతిపక్షాలు ప్రధాన ప్రచారాంశంగా మలుచుకోరాదనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గత నెలలో కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన ఇద్దరు ఎమ్మెల్యేల్లో ఒకరైన ఎ.నమశ్శివాయం ప్రధాన డిమాండ్లలో కిరణ్ బేడీ తొలగింపు ఒకటని సమాచారం. నారాయణ స్వామి ఏమంటున్నారు? మాజీ ఐపీఎస్ అధికారి కిరణ్‌బేడీ 2016 మేలో పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమితులయ్యారు. అప్పటి నుంచి నారాయణ స్వామి ప్రభుత్వంతో విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆమె పనితీరు అప్రజాస్వామికంగా ఉందంటూ నారాయణ స్వామి ఆరోపిస్తున్నారు. 2019లో, తిరిగి గత నెలలో లెఫ్టినెంట్ గవర్నర్ అధికార నివాసం ఎదుట నారాయణ స్వామి ధర్నాకు కూడా దిగారు. సీఎం నారాయణ స్వామి మీడియాతో మాట్లాడుతూ..‘మా ఎమ్మెల్యే మల్లాడి నారాయణ స్వామిని కిరణ్ బేడీ పలుమార్లు వేధింపులకు గురి చేశారు. దీనిపై రాష్ట్రపతి కోవింద్‌కు కూడా ఫిర్యాదు చేశాం. రోజువారీ పరిపాలనా వ్యవహారాల్లోనూ కిరణ్ బేడీ జోక్యం చేసుకుంటున్నారు. సమస్యలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు’అని చెప్పారు. తన ప్రభుత్వానికి ఇప్పటికీ మెజారిటీ ఉందని సీఎం నారాయణ స్వామి ఎన్డీటీవీతో అన్నారు. కృష్ణారావు, కుమార్ల రాజీనామాలను ఆమోదించలేదనీ, అవి ఇంకా స్పీకర్ పరిశీలనలోనే ఉన్నాయన్నారు. నేడు రాహుల్ రాక బలం కోల్పోవడంతో ప్రభుత్వాన్ని రద్దు చేయాలని సీఎం నారాయణస్వామి నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అసెంబ్లీలో మొత్తం 30 స్థానాలకు గాను 2016 ఎన్నికల్లో 15 సీట్లు గెలుపొందిన కాంగ్రెస్ అధికారం చేపట్టింది. ముగ్గురు డీఎంకే ఎమ్మెల్యేలు, ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యే మిత్రపక్షాలుగా ఉన్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్ప డుతున్నారనే ఆరోపణలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే ధనవేలును ఆ పదవి నుంచి పార్టీ తొలగించింది. ఇటీవల మంత్రి నమశ్శివాయం, ఎమ్మెల్యే దీపా యన్దన్ సైతం రాజీనామా చేశారు. కొన్ని రోజుల క్రితం మంత్రి పదవికి రాజీనామా చేసిన మల్లాడి కృష్ణారావు ఈనెల 15న ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేశారు. మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే జాన్‌కుమార్ మంగళవారం తన రాజీనామా పత్రాన్ని స్పీకర్‌కు అందజేశారు. స్పీకర్‌ను కలుపుకుని అసెంబ్లీలో కాంగ్రెస్ బలం 10కి పడింది. మూడు డీఎంకే, ఒక స్వతంత్ర అభ్యర్థులను కలుపుకున్నా 14కి పరిమితం కాగలదు. ప్రతిపక్షంలో ఎన్ఆర్ కాంగ్రెస్ 7, అన్నాడీఎంకే 4, నామినేటెడ్ (బీజేపీ) ఎమ్మెల్యేలు 3తో కలుపుకుని మొత్తం 14 సభ్యుల బలం ఉంటుంది. అధికార, ప్రతిపక్షాలకు సమబలం ఏర్పడడంతో ప్రభుత్వం మైనార్టీలో పడింది. ఒక ఎమ్మెల్యేకు బీజేపీ గాలం వేస్తే మ్యాజిక్ ఫిగర్ 15 స్థానాలతో అధికారంలోకి రాగలదు. ప్రభుత్వం మెజార్టీ కోల్పోయిన నేపథ్యంలో పుదుచ్చేరి చేరుకున్న రాష్ట్ర పార్టీ ఇన్చార్జ్ దినేష్ గుండూరావుతో నారాయణస్వామి, మంత్రులు, ఎమ్మెల్యేలు సమాలోచనలు జరిపారు. మరో రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు సమీస్తున్నందున మంత్రివర్గమే రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. -
రాజీవ్ హత్య కేసు: రాష్ట్రపతి భవన్‌కు క్షమాభిక్ష
మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసులో ఖైదీల విడుదల అంశం రాజ్‌భవన్ నుంచి మళ్లీ రాష్ట్రపతి భవన్‌కు చేరింది. సుప్రీం కోర్టు ఇచ్చి న వారంరోజుల గడువు పూర్తయినా నేటికీ ఎటూ తేలని వ్యవహారంగా మారిపోయింది. సాక్షి, చెన్నై : రాజీవ్ హత్య కేసులో వేలూరు జైలులో శిక్ష అనుభవిస్తున్న ఏడుగురు నిందితుల్లో ఒకరైన పేరరివాళన్ తనను విడుదల చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై జడ్జి నాగేశ్వరరావు నేతృత్వంలోని డివిజన్ బెంచ్ విచారణ జరుపుతోంది. ఈ పిటిషన్ గత నెల 21న విచారణకు రాగా కేంద్ర ప్రభుత్వ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా హాజరయ్యారు. పేరరివాళన్ సహా ఏడుగురు ఖైదీల విడుదలకు తమిళనాడు ప్రభుత్వం 2018 సెప్టెంబర్ 9న సిఫార్సు చేస్తూ చేసిన తీర్మానంపై గవర్నర్ మూడు లేదా నాలుగు రోజుల్లో నిర్ణయం తీసుకుంటారని చెప్పా రు. సుప్రీం కోర్టు నిర్ణయం తీసుకోకూడదా అని జడ్జి నాగేశ్వరరావు ప్రశ్నకు అవసరం లేదని తుషార్ మెహతా బదులిచ్చారు. విచారణను రెండు వారా లు వాయిదా వేయాలని పేరరివాళన్ తరఫు న్యా యవాది కోర్టును కోరా రు. దీనిపై జడ్జి స్పంది స్తూ తమిళనాడు గవర్నర్ నిర్ణ యం వరకు వేచిచూద్దామని తెలిపారు. మూడు లేదా నాలుగు రోజుల్లో గవర్నర్ నిర్ణయం తీసుకుంటారని సొలిసిటర్ జనరల్ చెప్పిన మాటలను రికార్డు చేస్తున్నామని చెప్పి విచారణను రెండు వారాలకు వాయిదా వేశా రు. ఇదిలా ఉండగా, ఈ అంశంపై కేంద్ర హోంమంత్రిత్వశాఖ అఫిడవిట్‌ను సుప్రీం కోర్టులో గురువారం దాఖలు చేసింది. అందులో ‘పేరరివాళన్ క్షమాభిక్షకు సంబంధించిన అన్ని పత్రాలను గవర్నర్ పరిశీలించారు. ఈ విషయంలో రాష్ట్రపతికి మాత్రమే పూర్తి అధికారం ఉంది. చట్ట ప్రకారం ఆయన తగిన నిర్ణయం తీసుకుంటారు.’ అని ఉంది. దీంతో పేరరివాళన్ పిటిషన్‌పై విచారణ ఈనెల 9వ తేదీకి వాయిదా పడింది. రాజీవ్ హత్య కేసులో ఖైదీల విడుదలపై తమిళనాడు ప్రభుత్వం, పలు రాజకీయ పార్టీలు పట్టుపడుతున్నాయి. గవర్నర్ తనకు అధికారం లేదని తేల్చిచెప్పడంతో ఈ వ్యవహారం రాజ్‌భవన్ నుంచి మళ్లీ రాష్ట్రపతి భవన్‌కు చేరింది. -
రాష్ట్రపతి భవన్ తెరచుకునేది ఎప్పుడంటే..?
సాక్షి, న్యూఢిల్లీ: కోవిడ్–19 కారణంగా గత 11 నెలలుగా మూసివేతకు గురైన రాష్ట్రపతి భవన్ ఈ నెల 6 నుంచి తెరచుకోనుందని అధికారులు తెలిపారు. ప్రభుత్వ సెలవుదినాలు కాకుండా శనివారం, ఆదివారం రోజుల్లో రాష్టపతి భవన్ తెరచే ఉంటుందని స్టేట్మెంట్ ద్వారా చెప్పారు. భౌతిక దూరాన్ని పాటించేందుకుగానూ గరిష్టంగా స్లాట్‌కు 25 మంది చొప్పున మూడు స్లాట్లలో (ఉదయం 10:30, మధ్యాహ్నం 12:30, 2:30) పర్యాటకులను అనుమతించనున్నట్లు చెప్పింది. లోపలికి అనుమతించేందుకు ఒక్కొక్కరికి రూ. 50 చెల్లించాల్సి ఉంటుంది. 8 నుంచి తెరచుకోనున్న జేఎన్‌యూ కరోనా కారణంగా మూతబడిన జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఈ నెల 8 నుంచి తెరచుకోనుందని జేఎన్‌యూ సోమవారం ప్రకటించింది. 4వ సెమిస్టర్ చదువుతున్న ఎంఫిల్, ఎంటెక్ విద్యార్థులు, ఎంబీఏ చివరి సెమిస్టర్‌విద్యార్థులు ఈ నెల 8 నుంచి కాలేజీకి, హాస్టల్‌కు రావచ్చని ప్రకటించింది. జూన్ 30లోగా థీసిస్‌ను సమర్పించాలని చెప్పింది. చదవండి: వింత సంఘటన: దానికదే కదలిన వాహనం ‘డీజిల్‌కి డబ్బులివ్వు.. బిడ్డను వెతుకుతాం’ -
సుప్రీంకోర్టులో త్వరలో ప్రత్యక్ష విచారణ
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ విస్తరణ కారణంగా నిలిపివేసిన కేసుల ఫిజికల్ హియరింగ్ (వీడియోలో కాకుండా కోర్టురూములో న్యాయమూర్తులు, న్యాయవాదుల సమక్షంలో దావా జరపడం) ప్రక్రియను త్వరలో హైబ్రిడ్ పద్ధతిలో ఆరంభిస్తామని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బాబ్డె చెప్పినట్లు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. కరోనా సంక్షోభం సమసిపోతున్నందున ఫిజికల్ హియరింగ్స్ ఆరంభించాలని పలువురు న్యాయవాదులు డిమాండ చేస్తున్న తరుణంలో బార్ కౌన్సిల్ సభ్యులతో చీఫ్ జస్టిస్, సొలిసిటర్ జనరల్ సమావేశమై ఈ అంశాన్ని చర్చించారు. గత మార్చి నుంచి సుప్రీంకోర్టులో వీడియోకాన్ఫరెన్స్ ద్వారానే కేసుల హియరింగ్ నిర్వహిస్తున్నారు. అయితే ఫిజికల్ హియరింగ్‌కు డిమాండ్ పెరుగుతుండడంతో త్వరలో ఈ ప్రక్రియను హైబ్రిడ్ పద్ధతిలో(కొన్ని కేసులు వీడియో కాన్ఫరెన్సు ద్వారా, కొన్నింటిని భౌతికంగా) నిర్వహించేందుకు చీఫ్ జస్టిస్ చెప్పారని బీసీఐ చైర్మన్ మనన్ కుమార్ చెప్పారు. అయితే అంతకుముందు మెడికల్, టెక్నికల్ సమస్యలపై రిజిస్ట్రీతో చర్చించి నిర్ణయం తీసుకుంటారన్నారు. సాంకేతిక సమస్యలను పరిశీలించి నిర్ణయం చెప్పాలని సెక్రటరీ జనరల్‌ను చీఫ్ జస్టిస్ ఆదేశించారని, కుదిరితే మార్చి మొదటివారం నుంచి ఫిజికల్ హియరింగ్‌లు నిర్వహించ వచ్చని తెలిపారు. కరోనా సమస్య పూర్తిగా అంతమయ్యేవరకు హైబ్రిడ్ పద్ధతిలో హియరింగ్స్ జరపుతారని, ఢిల్లీలో ఉన్న లాయర్లకు మాత్రమే వీడియో హియరింగ్ సౌకర్యం కల్పిస్తారని తెలిపారు. మరోవైపు తక్షణమే ఫిజికల్ హియరింగ్స్ ఆరంభించాలని కొందరు న్యాయవాదులు సుప్రీంకోర్టు ప్రాంగణంలో నిరసన చేపట్టారు. న్యాయవాదుల సంఘాల కోరిక మేరకు లాయర్స్ ఛాంబర్‌ను ఉదయం 9 నుంచి సాయంత్రం 7 వరకు తెరిచిఉంచేందుకు చీఫ్ జస్టిస్ అంగీకరించారు. 6 నుంచి తెరచుకోనున్న రాష్ట్రపతి భవన్ కోవిడ్-19 కారణంగా గత 11 నెలలుగా మూసివేతకు గురైన రాష్ట్రపతి భవన్ ఈ నెల 6 నుంచి తెరచుకోనుందని అధికారులు సోమవారం తెలిపారు. ప్రభుత్వ సెలవుదినాలు కాకుండా శనివారం, ఆదివారం రోజుల్లో రాష్టపతి భవన్ తెరచే ఉంటుందని స్టేట్మెంట్ ద్వారా చెప్పారు. భౌతిక దూరాన్ని పాటించేందుకుగానూ గరిష్టంగా స్లాట్‌కు 25 మంది చొప్పున మూడు స్లాట్లలో (ఉదయం 10:30, మధ్యాహ్నం 12:30, 2:30) పర్యాటకు లను అనుమతించనున్నట్లు చెప్పింది. లోపలికి అనుమతించేందుకు ఒక్కొక్కరికి రూ. 50 చెల్లించాల్సి ఉంటుంది. 8 నుంచి తెరచుకోనున్న జేఎన్‌యూ కరోనా కారణంగా మూతబడిన జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఈ నెల 8 నుంచి తెరచుకోనుందని జేఎన్‌యూ సోమవారం ప్రకటించింది. 4వ సెమిస్టర్ చదువుతున్న ఎంఫిల్, ఎంటెక్ విద్యార్థులు, ఎంబీఏ చివరి సెమిస్టర్‌విద్యార్థులు ఈ నెల 8 నుంచి కాలేజీకి, హాస్టల్‌కు రావచ్చని ప్రకటించింది. జూన్ 30లోగా థీసిస్‌ను సమర్పించాలని చెప్పింది. -
రాష్ట్రపతి భవన్ వద్ద తొమ్మిదేళ్ల బాలిక నిరసన
న్యూఢిల్లీ: రాష్ట్రపతి భవన్ ముందు తొమ్మిదేళ్ల బాలిక లిసిప్రియా కంగుజమ్ నిరసనకు దిగింది. దేశ రాజధానిలో స్వచ్ఛమైన గాలి కరువైందని ఆక్షేపించింది. గురువారం రాత్రి ప్రాంభమైన ఆమె నిరసన కార్యక్రమం శుక్రవారం ఉదయం వరకూ కొనసాగింది. ‘కాలుష్యకారక గాలి పీల్చలేక ఢిల్లీ ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఈ విపత్కర పరిస్థితుల నుంచి ఎలా బయడతామని ఆందోళన చెందుతున్నారు. రాజకీయ నాయకులేమో చర్యలు తీసుకోవడం మరచి ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఢిల్లీలో ఫ్రెష్ ఎయిర్ కోసం ప్రభుత్వాలు ఇప్పటివరకు చెప్పుకోదగ్గ చర్యలేమీ తీసుకోలేదు! కలుషిత గాలిని పీల్చడం వల్ల ప్రతియేడు ప్రపంచవ్యాప్తంగా 60 లక్షల మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారు. (చదవండి: ఢిల్లీలో క్షీణించిన వాయు నాణ్యత) మాకు శాశ్వత పరిష్కారం కావాలి. ఢిల్లీ కాలుష్యం నుంచి రక్షించండి. పటిష్టమైన క్లయిమేట్ ‘లా’ తీసుకురండి’ అని ఆమె ప్లకార్డు ప్రదర్శింది. ఆమె వెంట మరికొందరు పర్యావరణ పరిరక్షణ కార్యకర్తలు ఉన్నారు. అనంతరం వారంతా సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ని కలిశారు. ప్రమాదకర కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలను మూసేయాలని, దేశ రాజధానిలో వాతావరణ కాలుష్య నివారణకు చర్యలు తీసుకోవాలని కోరారు.లిసిప్రియ మణిపూర్ యాక్టివిస్ట్. బెంగళూరు ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతోంది. డాక్టర్ ఎ.పి.జె.అబ్దుల్ కలామ్ చిల్డ్రన్ అవార్డు, వరల్డ్ చిల్డ్రన్స్ పీస్ ప్రైజ్, ఇండియా పీజ్ ప్రైజ్, రైజింగ్ స్టార్ ఆఫ్ ఎర్త్ డే నెట్వర్క్, ఎస్.డి.జీస్ అంబాసిడర్ అవార్డు, నోబెల్ సిటిజన్ అవార్డులను లిసిప్రియ అందుకుంది. పర్యావరణ కార్యకర్తల్లో ప్రపంచంలోనే ఆమె అత్యంత పిన్నవయస్కురాలిగా పేరొందింది. (చదవండి: అడుగుతున్నా చెప్పండి) -
రాష్ట్రపతిగా ప్రణబనాదం
న్యూఢిల్లీ: దేశ ప్రథమ పౌరుడిగా ప్రణబ్ ముఖర్జీ అందించిన సేవలు మరపురానివి. మరువలేనివి. ప్రజాస్వామ్యబద్ధంగా, హుందాగా, ఉత్తేజంగా రాష్ట్రపతిగా ప్రణబ్ ఉరిమే ఉత్సాహంతో పనిచేశారు. ఏపీజే అబ్దుల్ కలాం తర్వాత ఇంచుమించుగా అంతటి పేరు తెచ్చుకొని రాష్ట్రపతి భవన్‌కు పునరుజ్జీవనం తీసుకువచ్చారు. 2012–2017 వరకు దేశ 13వ రాష్ట్రపతిగా ప్రణబ్ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ ఇ గవర్నెన్స్ విధానాన్ని తీసుకువచ్చారు. ఆన్లైన్ కార్యకలాపాలు అధికంగా నిర్వహించారు. కేంద్రం అడుగులకి మడుగులు ఒత్తకుండా అన్నివైపుల నుంచి ఆలోచించి నిర్ణయాలు తీసుకునేవారు. రక్షణ, ఆర్థిక, వాణిజ్యం వంటి కీలక శాఖలు నిర్వహించిన అనుభవం రాష్ట్రపతిగా ఆయన తీసుకునే నిర్ణయాలకు బాగా పనికివచ్చింది. తన పదవీకాలంలో ఆఖరి రెండేళ్లు రాష్ట్రపతి భవన్‌ను ఒక పాఠశాలగా మార్చి తాను స్వయంగా టీచర్ అవతారం ఎత్తారు. రాష్ట్రపతి ఎస్టేట్‌లోని రాజేంద్రప్రసాద్ సర్వోదయ విద్యాలయాలో 11, 12 తరగతి విద్యార్థులకు పాఠాలు చెప్పారు. ఆచితూచి అడుగులు పార్లమెంటు ఆమోదించిన బిల్లులు సంతకం కోసం రాష్టపతి దగ్గరకి వస్తే ఆయన వెంటనే ఆమోదించేవారు కాదు. అవి రాజ్యాంగబద్ధంగా ఉన్నాయా లేవా ? వాటి వల్ల కలిగే ప్రయోజనాలేంటి, నష్టాలేంటి అన్న అంశాలన్నీ నిశితంగా పరిశీలించేవారు. భూసేకరణ, పునరావాస చట్టంపై బాహాటంగానే తన అసంతృప్తి వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వం వివిధ అంశాలపై ఆర్డినెన్స్‌లు ఎక్కువగా తీసుకువస్తోందని దాదా ఆగ్రహించారు. ప్రజలకు చేరువగా భారతీయ చారిత్రక వైభవాన్ని, వారసత్వ సంపదని కాపాడుతూనే రాష్ట్రపతి భవన్‌ను ప్రజలకి చేరువ కావడానికి ఎన్నో చర్యలు తీసుకున్నారు. ఇన్ రెసిడెన్స్ కార్యక్రమం ద్వారా రచయితలు, కళాకారులు, సృజనాత్మకత ఉన్నవారికి రాష్ట్రపతి భవన్ తలుపులు బార్లా తెరిచారు. సామాజిక సేవపై ఆసక్తి ఉన్న వారు రాష్ట్రపతి భవన్లో ఉంటూ ప్రాజెక్టులు నిర్వహించే సదుపాయం కల్పించారు. రాష్ట్రపతి భవన్‌కు ఎక్కువ మంది అతిథులు వచ్చేలా చర్యలు చేపట్టారు. క్షమాభిక్ష పిటిషన్లు ఉరిశిక్ష పడిన వారు దరఖాస్తు చేసుకునే క్షమాభిక్ష పిటిషన్ల విషయంలో ప్రణబ్ చాలా త్వరగా నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఖాతాలో ఎక్కువగా తిరస్కరణలే ఉన్నాయి. అయిదేళ్ల పదవీ కాలంలో నలుగురికి క్షమాభిక్ష ప్రసాదిస్తే, 30 పిటిషన్లను తిరస్కరించారు పర్యాటక ప్రాంతంగా.. భారత్‌లో ప్రముఖ పర్యాటక కేంద్రంగా రాష్ట్రపతి భవన్‌ను నిలపడానికి ప్రణబ్ ముఖర్జీ ఎంతో కృషి చేశారు. రాష్ట్రపతి భవన్, మొఘల్ గార్డెన్స్, మ్యూజియం సందర్శించడానికి ప్రజలకు అనుమతులు ఇచ్చారు. ప్రణబ్ హయాంలో భారీగా ప్రజలు రాష్ట్రపతి భవన్‌ను సందర్శించారు. 2017లో జరిగిన ఉద్యానోత్సవ్కి 7 లక్షల మంది వరకు హాజరవడం ఒక రికార్డుగా చెప్పుకోవాలి. ట్విట్టర్లో ‘సిటిజన్ ముఖర్జీ’ ప్రణబ్ ముఖర్జీ హయాంలోనే రాష్ట్రపతి భవన్ మొదటిసారిగా సామాజిక మాధ్యమాల్లో అడుగుపెట్టింది. 2014 జూలై 1న ట్విట్టర్లో అకౌంట్ ప్రారంభించి ప్రజలకు మరింత చేరువయ్యారు. రాష్ట్రపతిగా ప్రణబ్ పదవీ విరమణ చేసినప్పుడు 33 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ప్రజల మనిషి అయిన ప్రణబ్ ట్విట్టర్లో ‘సిటిజన్ ముఖర్జీ’పేరును వాడారు. కొత్త మ్యూజియం రాష్ట్రపతి భవన్లో గుర్రపు శాలలు ఉండే ప్రాంతాన్ని ఒక మ్యూజియంగా మార్చారు. ఇందులో మొదటి రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్ దగ్గర్నుంచి ప్రతీ ఒక్కరూ ప్రమాణ స్వీకారం చేసే ఫొటోలను ఉంచారు. పురాతన ఆయుధాలు, ఫర్నీచర్ కూడా ఈ మ్యూజియంలో కనువిందు చేస్తాయి. -
రాష్ట్రపతిగా మూడేళ్లు
న్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మూడేళ్ల పదవీకాలాన్ని శనివారంనాటికి పూర్తి చేసుకున్నారు. ఈ మూడేళ్ల కాలంలో ఆయన ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. దేశ ప్రథమ పౌరుడిగా కరోనాపై పోరాటంలో ప్రజలకు మార్గదర్శకుడిగా ఉన్నారని రాష్ట్రపతి కార్యాలయం ఒక ట్వీట్లో వెల్లడించింది. కరోనా సంక్షోభ సమయంలో 7వేల మంది సైనికులు, శాస్త్రవేత్తల్ని కోవింద్ కలుసుకున్నట్టు ఆ ట్వీట్లో వెల్లడించింది. ఈ మూడేళ్లలో ఆయన చేపట్టిన కార్యక్రమాలు, సంక్షోభ సమయంలో ప్రదర్శించిన మానవత్వం గురించి రాష్ట్రపతి భవన్ వివరించింది. ► కరోనాపై పోరాటంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పీఎం కేర్స్ ఫండ్‌కి రాష్ట్రపతి ఒక నెల వేతనాన్ని విరాళంగా ఇచ్చారు. ఏడాదిపాటు 30% జీతాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నారు. ► కరోనా నేపథ్యంలో రాష్ట్రపతి భవన్ తొలిసారిగా డిజిటల్ సదస్సులను ఏర్పాటు చేసింది. ఉపరాష్ట్రపతి, అన్ని రాష్ట్రాల గవర్నర్లతో మాట్లాడి కరోనా పరిస్థితులపై చర్చలు జరిపారు. ► రాష్టపతి భవన్లో నిర్వహించే కార్యక్రమాలకు ఆన్లైన్ ద్వారా ఆహ్వానించే ఈ–ఇన్విటేషన్ వ్యవస్థను ప్రవేశపెట్టారు. ► పార్లమెంటు పాస్ చేసిన 48 బిల్లులు, రాష్ట్ర ప్రభుత్వాల 22 బిల్లుల్ని ఆమోదించారు. 13 ఆర్డినెన్స్‌లు జారీ చేశారు. 11 రాష్ట్రాలకు గవర్నర్లను నియమించారు. ► రాష్ట్రపతి భవన్లో ప్లాస్టిక్ బాటిల్స్ వినియోగంపై నిషేధం విధించి వాటి స్థానంలో గాజు బాటిల్స్‌ను వినియోగించడం మొదలు పెట్టారు. ► మూడో ఏడాది పదవీకాలంలో రామ్‌నాథ్ ఏడు రాష్ట్రాల్లో పర్యటించారు. ► రాష్ట్రపతిగా మూడేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుసుకున్న కోవింద్‌కు ఉప రాష్ట్రపతి వెంకయ్య శుభాకాంక్షలు చెప్పారు. దేశ అభివృద్ధి విషయంలో మూడేళ్లుగా కోవింద్‌తో కలిసి పని చేస్తుండడం అద్భుతమైన అనుభూతినిస్తోందన్నారు. -
‘అవసరమైతే రాష్ట్రపతి భవన్ ముందు ధర్నా’
జైపూర్: రాజస్తాన్‌లో రాజకీయ ప్రతిష్టంభన కొనసాగుతోంది. బల పరీక్ష నిరూపణ కోసం అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాల్సిందిగా ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ తన మద్దతుదారులతో కలిసి రాజ్‌భవన్ బయట ధర్నా చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే సమావేశాల నిర్వహణపై గవర్నర్ ఏ నిర్ణయం తీసుకోలేదు. ఈ నేపథ్యంలో శనివారం సీఎం నివాసంలో మరోసారి రాష్ట్ర మంత్రివర్గం భేటీ అయ్యింది. అసెంబ్లీనిర్వహణకు సంబంధించిన అజెండాపై మంత్రులు చర్చించారు. శాసనసభ సమావేశాలు జరపాలని గవర్నర్‌కు కేబినెట్ విజ్ఞప్తి చేసింది. అంతకుముందు జైపూర్ ఫైర్‌మౌంట్ హోటల్లో సీఎల్పీ భేటీ నిర్వహించారు. ఎమ్మెల్యేలంతా ఐకమత్యంగా ఉండాలని గహ్లోత్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. అవసరమైతే రాష్ట్రపతి భవన్ ముందు ధర్నాకు సిద్ధమన్నారు. ప్రభుత్వాన్ని కూల్చడంలో బీజేపీ సక్సెస్ అయితే.. తాము ప్రధాని కార్యాలయం ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు. తమ ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ ఉందని.. ధైర్యంగా ఉండాలని శాసనసభ్యులకు తెలిపారు. 3 వారాలపాటు క్యాంప్‌లో ఉండాల్సి రావచ్చని అన్నారు. గవర్నర్‌తో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ భేటీ రెండోసారి వాయిదాపడింది. (రాజస్తాన్ సంక్షోభం : గెహ్లాత్‌కు చుక్కెదురు) -
రాష్ట్రపతితో ప్రధాని భేటీ
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం రాష్ట్రపతి భవన్‌కు వెళ్లి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో భేటీ అయ్యారు. వారిరువురు ప్రస్తుత జాతీయ, అంతర్జాతీయ అంశాలను చర్చించారని రాష్ట్రపతి భవన్ అధికారులు తెలిపారు. తూర్పు లద్దాఖ్‌లో సరిహద్దుల్లో చైనాతో ఉద్రిక్తతలు నెలకొనడం, తాజాగా, శుక్రవారం లేహ్ వెళ్లిన ప్రధాని, అక్కడ బలగాలను ఉద్దేశించి స్ఫూర్తిదాయక ప్రసంగం చేయడం.. తదితర కీలక ఘటనల నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. -
రాష్ట్రపతితో ప్రధాని మోదీ భేటీ
న్యూఢిల్లీ : రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు జాతీయ, అంతర్జాతీయ అంశాల గురించి వీరు చర్చించినట్టుగా అధికారులు తెలిపారు. సరిహద్దుల్లో చైనాతో తీవ్రస్థాయి ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో మోదీ శుక్రవారం లద్దాఖ్‌లో ఆకస్మిక పర్యటన జరిపిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జూన్ 15న గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో అమరులైన సైనికుల త్యాగాలను ఆయన కొనియాడారు. లేహ్‌లోని సైనిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సైనికులను పరామర్శించారు. అలాగే నిములో ఉన్న ఫార్మర్డ్ పోస్ట్ వద్ద భారతీయ సైనిక, వైమానిక, ఐటీబీపీ దళాలనుద్దేశించి ఉద్వేగపూరితంగా, స్ఫూర్తిదాయకంగా ప్రసంగించారు. మరోవైపు ఆర్మీ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ నేపథ్యంలో మోదీ, రాష్ట్రపతితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. (చదవండి : సెల్యూట్.. బ్రేవ్ హార్ట్స్!) ఈ భేటీకి సంబంధించి రాష్ట్రపతి భవన్ అధికారిక ట్విటర్ ఖాతాలో ఓ పోస్ట్ కూడా చేసింది. ‘ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసి పలు జాతీయ, అంతర్జాతీయ అంశాలను ఆయనకు వివరించారు’ అని పేర్కొంది. Prime Minister @narendramodi called on President Kovind and briefed him on the issues of national and international importance at Rashtrapati Bhavan today. pic.twitter.com/yKBXCnfboE — President of India (@rashtrapatibhvn) July 5, 2020 -
ఖర్చు ఆదా చేసే పనిలో రాష్ట్రపతి భవన్
న్యూఢిల్లీ : కరోనాపై పోరుకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తన వంతు సాయం అందించిన సంగతి తెలిసిందే. మరోవైపు కరోనా సంక్షోభం వేళ రాష్ట్రపతి భవన్ ఖర్చులను కూడా ఆదా చేసే పనిలో ఆయన నిమగ్నమయ్యారు. వచ్చే ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి వినియోగం కోసం రూ. 10 కోట్లు విలువచేసే విలాసవంతమైన సరికొత్త లిమోసిన్ కారు కొనుగోలు చేయాలని రాష్ట్రపతి భవన్ భావించింది. అయితే ప్రస్తుతం ఆ నిర్ణయాన్ని వాయిదా వేశారు. అలాగే విందులకు పెద్ద మొత్తంలో ఖర్చు చేయకూడదని రాష్ట్రపతి భవన్ వర్గాలు నిర్ణయించాయి. భవిష్యత్తులో జరిగే విందుల్లో పరిమిత సంఖ్యలో ఆహార పదార్థాలను ఉంచడంతో పాటు.. అతిథుల జాబితాను కొంతమేర తగ్గించాలని చూస్తోంది. (చదవండి : రాష్ట్రపతి వేతనంలో 30 శాతం స్వచ్ఛందంగా) అలాగే రాష్ట్రపతి భవన్ పరిసరాల్లో పెద్ద ఎత్తున జరిగే పూల అలంకరణలు కూడా పరిమితం చేయాలని భావిస్తోంది. వచ్చే ఏడాది వరకు రాష్ట్రపతి భవన్‌కు సంబంధించి ఎటువంటి నిర్మాణాలు చేపట్టరాదని నిర్ణయం తీసకుంది. లక్షలాది మంది వలస కార్మికులు, పేద ప్రజలు కరోనా కష్టకాలంలో ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో రాష్ట్రపతి భవన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిసింది. కాగా, రామ్‌నాథ్ కోవింద్ ప్రస్తుతం.. మెర్సిడెస్ బెంజ్ ఎస్ క్లాస్ (ఎస్ 600) వినియోగిస్తున్నారు. కరోనాపై పోరుకు తనవంతు సాయంగా పీఎంకేర్స్ ప్రత్యేక నిధికి రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఇప్పటికే ఒక నెల జీతాన్ని విరాళంగా అందజేయగా.. తాజాగా ఆయన తన వేతనంలో 30 శాతాన్ని ఏడాది పాటు పీఎం కేర్స్ నిధికి విరాళంగా ఇస్తున్నట్లు గురువారం రాష్ట్రపతి భవన్ ఓ ప్రకటన చేసింది. -
మాస్కులు తయారు చేసిన భారత ప్రథమ మహిళ
సాక్షి, న్యూఢిల్లీ: భారత ప్రథమ మహిళ, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సతీమణి సవితా కోవింద్ కరోనాపై వ్యతిరేక పోరులో తనవంతు చేయూతను అందించారు. కరోనా మహమ్మారిపై భారత్ చేస్తున్న కృషికి ఆమె బాసటగా నిలిచారు. నిరాశ్రయుల కోసం బుధవారం రాష్ట్రపతి భవన్‌లోని శక్తి హాత్ వద్ద స్వయంగా కుట్టు మిషన్‌పై ఫేస్ మాస్క్‌లు కుట్టారు. వీటిని ఢిల్లీ అర్బన్ షెల్టర్ ఇంప్రూవ్మెంట్ బోర్డు ద్వారా వివిధ ప్రదేశాలలో ఆశ్రయం పొందుతున్న వారికి అందజేయనున్నారు. సవితా స్వయంగా మాస్కులు తయారు చేస్తూ.. కరోనాపై వ్యతిరేక పోరాటంలో దేశంలోని ప్రతి ఒక్కరు భాగస్వామ్యం అవ్వాలనే సందేశాన్ని ఇచ్చారు. అయితే మాస్కులు కుడుతున్న సమయంలోనూ ఆమె ముఖానికి మాస్కు ధరించడం విశేషం. ( ఆ ఎడిటర్‌ను పెళ్లి చేసుకోవాలని ఉంది: వర్మ) ఇక దేశ వ్యాప్తంగా కరోనా చాపకింద నీరులా విస్తరిస్తోంది. 130 కోట్ల మందికి పైగా ఉన్న దేశంలో కరోనాను కట్టడి చేయడం కత్తి మీద సాములాగా తయారయింది. ఈ మహమ్మారిని అడ్డుకునేందుకు దేశంలో మే 3 వరకు లాక్డౌన్ అమలులో ఉన్న విషయం తెలిసిందే. అలాగే ప్రతి ఒక్కరూ భౌతిక దూరం, వ్యక్తిగత శుభ్రత, ముఖానికి మాస్క్‌లు ధరించడం వంటి ముందు జాగ్రత్త చర్యలను పాటించాలని వైద్యులు తెలియజేస్తూనే ఉన్నారు. కాగా భారత్‌లో కరోనా కేసులు గురువారం ఉదయం నాటికి 20, 471 నమోదవ్వగా.. 652 మంది మృత్యువాత పడ్డారు. 3960 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. (‘రాజీనామా చేయమంటున్నారు.. కానీ..’ ) -
ప్రధాన సమాచార కమిషనర్‌గా బిమల్
న్యూఢిల్లీ: ప్రధాన సమాచార కమిషనర్ (సీఐసీ)గా ప్రస్తుత సమాచార కమిషనర్ (ఐసీ) అయిన బిమల్ జుల్కా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ జుల్కా చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం సమాచార కమిషనర్‌గా అమిత పండోవే బాధ్యతలు స్వీకరించారు. ఆమె చేత సీఐసీ జుల్కా ప్రమాణ స్వీకారం చేయించారు. అమిత సమాచార కమిషనర్ కావడంతో కేంద్ర సమాచార కమిషన్‌లో మొత్తం కమిషనర్ల సంఖ్య (సీఐసీతో కలిపి) 7కు చేరుకుంది. మాజీ సీఐసీ సుధీర్ భార్గవ జనవరి 11న పదవీ విరమణ చేసినప్పటి నుంచి సీఐసీ పోస్టు ఖాళీగానే ఉంది. సీఐసీ కాకుండా 10 మంది కమిషనర్లు ఉండాల్సిన కేంద్ర సమాచార కమిషన్‌లో కేవలం 6 మందే కమిషనర్లు ఉన్నారు. ప్రస్తుతం అమిత పండోవే నియామకం తర్వాత మరో 4 సమాచార కమిషన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గత నెలలో ప్రధాని మోదీ నేతృత్వంలోని కమిటీ గతంలో సమాచార, ప్రసారశాఖ కార్యదర్శిగా పనిచేసిన జుల్కా పేరును సీఐసీ పదవికి, అమిత పండోవేను సమాచార కమిషనర్ పదవికి సూచించింది. -
న్యూఢిల్లీ : రాష్ట్రపతి భవన్లో ట్రంప్ దంపతులు
-
రాష్ట్రపతి భవన్లో ట్రంప్ దంపతులు
-
సైనిక వందనం స్వీకరించిన ట్రంప్
సాక్షి, న్యూఢిల్లీ : భారత పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం ఉదయం రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దంపతులు, ప్రధాని నరేంద్ర మోదీ ట్రంప్‌కు ఘనస్వాగతం పలికారు. అనంతరం ట్రంప్ త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. (చదవండి : ట్రంప్‌కు ‘తాజ్’ను చూపించింది ఎవరో తెలుసా?) ఆ తర్వాత కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్, సీడీఎస్ చీఫ్ బిపిన్ రావత్‌తో పాటు ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ దళాధిపతులు, కాన్సులేట్ సభ్యులను ట్రంప్‌కు మోదీ పరిచయం చేశారు. అనంతరం ట్రంప్ నేరుగా రాజ్‌ఘాట్‌కు వెళ్లి మహాత్మాగాంధీ సమాధి వద్ద నివాళులర్పించారు. అక్కడున్న సందర్శకుల బుక్‌లో ట్రంప్ దంపతులు సంతకం చేశారు. ట్రంప్‌తో కలిసి మెలానియా.. రాజ్‌ఘాట్‌లో మొక్క నాటారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ట్రంప్‌తో విందుకు సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గౌరవార్థం ఈ నెల 25న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి భవన్లో జరిగే ఈ విందులో పాల్గొనాల్సిందిగా సీఎం కేసీఆర్‌కు రాష్ట్రపతి కార్యాలయం ఆహ్వానం పంపింది. ఈమేరకు కేసీఆర్ మంగళవారం ఢిల్లీకి చేరుకుంటారు. కాగా, ట్రంప్ సోమ వారం ఉదయం అహ్మదాబాద్‌కు చేరుకుని ప్రధాని మోదీతో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. సాయంత్రం ఆగ్రాలో తాజ్‌మహల్‌ను సందర్శించి ఢిల్లీకి చేరుకుంటారు. అనంతరం ఢిల్లీలో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొని సాయంత్రం రాష్ట్రపతి ఏర్పాటు చేసే గౌరవ ఆతిథ్యాన్ని స్వీకరిస్తారు. -
ఢిల్లీలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
-
ఘనంగా గణతంత్రం.. ప్రధాని మోదీ నివాళి
సాక్షి, న్యూఢిల్లీ : గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశ వ్యాప్తంగా సంబరాలు అంబరానంటాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్‌లో అమర జవాన్లకు నివాళి అర్పించారు. దేశ రక్షణకు ప్రాణత్యాగం చేసిన అమర జవాన్లను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా సైనికులు చేసిన గౌరవ వందనాన్ని మోదీ స్వీకరించారు. దేశ 71వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో రామ్‌నాథ్ కోవింద్ త్రివర్ణ పతాకాన్ని ఎగరేశారు. ఈ సందర్భంగా సైనిక దళం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి పాల్గొన్నారు. రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిధిగా వచ్చిన బ్రెజిల్ అధ్యక్షుడు జయిర్ బొల్సనారోతో కలిసి ఆయన ఈ వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా సైనికుల గౌరవందనాన్ని వారు స్వీకరించారు. ఈ వేడుకల్లో సైనికులు చేసిన విన్యాసాలు చూపరులను ఆకట్టుకున్నాయి. దేశ రాజధానిలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా జాతీయ జెండా ఆవిష్కరించారు. ప్రధాన కార్యదర్శి హోదాలో ఆయన జెండాను ఆవిష్కరించడం ఇదే తొలిసారి. ఈ కార్యక్రమంలో పలువురు కేంద్రమంత్రులు, పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. జమ్మూకశ్మీర్‌లోని లడఖ్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. 17 వేల అడుగుల ఎత్తున మంచుకొండలపై ఐటీబీపీ సిబ్బంది జాతీయ జెండాను ఆవిష్కరించారు. మంచుకొండల్లో ప్రత్యేక విన్యాసాలు చేశారు. యుద్ధరంగంలో అమరులైన జవాన్లకు నివాళి అర్పించారు. -
49 మందికి ‘బాల్ శక్తి’ అవార్డులు
న్యూఢిల్లీ: వివిధ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 49 మంది చిన్నారులకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ‘బాల్ శక్తి’అవార్డులను ప్రదానం చేశారు. 2020 సంవత్సరానికి సంబంధించిన ఈ అవార్డులను రాష్ట్రపతి భవన్లో బుధవారం జరిగిన కార్యక్రమంలో కోవింద్ అందజేశారు. అవార్డు కింద రూ.లక్ష నగదు, ప్రశంసాపత్రాన్ని అందించారు. దీనికిగానూ 5 నుంచి 18 ఏళ్ల మధ్య వయసున్న బాలల్లో ఆవిష్కరణలు, సామాజిక సేవ, క్రీడలు, కళలు, సంస్కృతి తదితర రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారికి ఈ అవార్డులు అందిస్తారు. దొంగల బారి నుంచి రష్యా వాసిని కాపాడిన ఇషాన్ శర్మ.. చిన్న వయసులో సైద్ధాంతిక రచయితగా రికార్డుల్లోకెక్కిన ఓంకార్ సింగ్.. పిన్న వయసున్న పియానిస్ట్ గౌరీ మిశ్రా..తదితరులు అవార్డులు అందుకున్నారు. డౌన్ సిండ్రోమ్, మానసిక వైకల్యంతో బాధపడుతున్న కొరక్ బిశ్వాస్ నాట్య రంగంలో అసాధారణ ప్రతిభ చూపడంతో బాల్ శక్తి అవార్డు అందుకున్నాడు. -
‘ఫాల్కే’ అందుకున్న బిగ్‌బీ
న్యూఢిల్లీ: బాలీవుడ్ మెగాస్టార్, బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు. రాష్ట్రపతి భవన్లో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో కోవింద్ ఈ అవార్డును ప్రదానం చేశారు. వాస్తవంగా బిగ్‌బీ ఈ అవార్డును కొద్ది రోజుల క్రితమే అందుకోవాల్సి ఉన్నా అనారోగ్య కారణాల రీత్యా కార్యక్రమానికి హాజరుకాలేకపోయారు. దీంతో ఆదివారం జరిగే ప్రత్యేక కార్యక్రమంలో బిగ్‌బీకి అవార్డు అందిస్తామని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఇటీవల ప్రకటించారు. జాతీయ సినీ పురస్కారాలు అందుకున్న నటులకు రాష్ట్రపతి తన నివాసంలో ఆదివారం తేనీటి విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా అమితాబ్‌కు అవార్డు అందజేశారు. భారతీయ సినీ రంగానికి విశిష్ట సేవలు అందించినందుకు గానూ.. బిగ్‌బీకి ఈ పురస్కారం లభించింది. భారతీయ సినిమాలో ఇది అత్యున్నత పురస్కారం. ఈ అవార్డు కింద రూ.10 లక్షలతో పాటు స్వర్ణ కమలం అందజేస్తారు. కాగా.. ఈ అవార్డుకు అర్హుడిగా తనను ఎంపిక చేసిన నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ జ్యూరీ సభ్యులకు, కేంద్ర ప్రభుత్వం, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖలకు అమితాబ్ కృతజ్ఞతలు తెలిపారు. తనతో సినిమాలు తీసిన నిర్మాతలు, దర్శకులు, తోటి కళాకారులు, తనను ఆరాధిస్తున్న ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అమితాబ్ సతీమణి, ఎంపీ జయా బచ్చన్, కుమారుడు అభిషేక్ బచ్చన్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ సినిమా పితామహుడు ధుండిరాజ్ గోవింద్ ఫాల్కే పేరు మీదుగా 1969 నుంచి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును అందజేస్తున్నారు. అదే ఏడాది అమితాబ్ ‘సాత్ హిందుస్తానీ’అనే హిందీ సినిమాతో అరంగేట్రం చేశారు. -
జేఎన్‌యూ విద్యార్థులపై లాఠీచార్జ్
న్యూఢిల్లీ: హాస్టల్ ఫీజుల పెంపుపై జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఫీజుల పెంపుపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేసేందుకు ఆయన అపాయింట్మెంట్ కోసం రాష్ట్రపతి భవన్‌కు ర్యాలీగా వెళ్తున్న జేఎన్‌యూ విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. సోమవారం వర్సిటీ క్యాంపస్ నుంచి ర్యాలీగా బయలుదేరిన విద్యార్థులను భికాజీ కామాప్లేస్ మెట్రో స్టేషన్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. విద్యార్థులు బారికేడ్లను దూకేందుకు యత్నించడంతో లాఠీలతో విరుచుకుపడ్డారు. పోలీసుల దాడిలో దాదాపు 30 మందికి గాయాలైనట్లు విద్యార్థులు ఆరోపించారు. శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తున్న మహిళలు, విద్యార్థులపై పోలీసులు దాడులు చేస్తున్నారని, క్యాంపస్‌లోకి తిరిగి వెళ్లిపోవాలని బెదిరిస్తున్నారని జేఎన్‌యూ స్టూడెంట్ యూనియన్ అధ్యక్షురాలు ఐషే ఘోష్ చెప్పారు. ఫీజుల పెంపు నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే వరకు తమ ఆందోళనలు ఆపబోమన్నారు. -
సీజేఐగా జస్టిస్ బాబ్డే
న్యూఢిల్లీ: భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు 47వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అరవింద్ బాబ్డే ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్ హాల్లో సోమవారం జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆయనతో ప్రమాణం చేయించారు. ఆంగ్లంలో దేవుడి పేరున ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయన.. వీల్‌చైర్‌లో ఆ కార్యక్రమానికి వచ్చిన తన తల్లికి పాదాభివందనం చేశారు. ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని మోదీ, ఉప రాష్ట్రపతి వెంకయ్య, కొందరు సీనియర్ మంత్రులు హాజరయ్యారు. మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులు ఆర్.ఎం.లోధా, టీఎస్.ఠాకూర్, జేఎస్.కెహార్ హాజరయ్యారు. మహారాష్ట్రకు చెందిన జస్టిస్ బాబ్డే సీనియర్ న్యాయవాది అరవింద్ శ్రీనివాస్ బాబ్డే కుమారుడు. 2021 ఏప్రిల్ 23 వరకు మొత్తం 17 నెలల పాటు జస్టిస్ బాబ్డే ఈ పదవిలో కొనసాగుతారు. నూతన సీజేఐకి నెటిజన్ల ప్రశంసలు ప్రమాణ స్వీకారం అనంతరం జస్టిస్ బాబ్డే వీల్‌చైర్‌లో వచ్చిన తన మాతృమూర్తి(92)కి పాదాభివందనం చేయడం పలువురి ప్రశంసలు అందుకుంది. తల్లికి జస్టిస్ బోబ్డే పాదాభివందనం చేస్తున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. పలువురు నెటిజన్లు ఆయన్ను మెచ్చుకున్నారు. -
2022కల్లా కొత్త పార్లమెంట్!
న్యూఢిల్లీ: 2022 పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కొత్తగా నిర్మించిన లేదా ఉన్న భవనాలకే ఆధునిక హంగులద్దిన పార్లమెంట్లో జరుగుతాయని ప్రభుత్వ వర్గాలు గురువారం తెలిపాయి. రాష్ట్రపతి భవన్, ఇండియా గేట్‌కు మధ్య ఉత్తర, దక్షిణ బ్లాకుల వద్ద 3 కిలోమీటర్ల విశాలమైన సెంట్రల్ విస్తాను ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా నిర్మించనున్నారు. దీని కోసం ప్రభుత్వం దేశ విదేశాల నుంచి డిజైన్, ఆర్కిటెక్ట్ సంస్థలను పిలిచింది. కొత్తగా నిర్మించనున్న ఈ భవనాలు కనీసం 150 నుంచి 200 ఏళ్లపాటు సేవలు అందించనున్నాయి. ఫ్లోటింగ్ ఆఫ్ రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్ఎఫ్పీ)లోని నిర్దేశిత నిబంధనల ప్రకారం నిర్మాణాలు చేపట్టాల్సి ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. ఇంకా నిర్ణయం తీసుకోలేదా ! ఇప్పుడున్న భవన సముదాయం 1927లో నిర్మితమైందని, ప్రస్తుతం కావాల్సిన అవసరాలను అది అందుకోలేకపోతోందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే కొత్త భవనం నిర్మించాలా లేక పాతదాన్నే పునర్నిర్మించాలా ? అనే అంశంపై ప్రభుత్వం ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. వివిధ మంత్రిత్వ శాఖల కింద ఉన్న ఆఫీసు కార్యాలయాలను నిర్వహించేందుకు ఏటా రూ. 1,000 కోట్లు ఖర్చువుతోంది. కొత్తవాటిని నిర్మించడం ద్వారా ఈ వ్యయాన్ని ఆదా చేయ వచ్చని ప్రభుత్వం భావిస్తోంది. -
భారత రత్న పురస్కారాల ప్రదానం
న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, భారతీయ జన సంఘ్ దివంగత నేత నానాజీ దేశ్‌ముఖ్, దివంగత గాయకుడు భూపేన్ హజారికాలకు ఈ ఏడాది జనవరిలో ప్రకటించిన భారత రత్న పురస్కారాలను గురువారం ప్రదానం చేశారు. రాష్ట్రపతి కోవింద్ ఈ అవార్డులను ముఖర్జీకి, హజారికా కొడుకు తేజ్‌కు, నానాజీ సన్నిహిత బంధువు విక్రమజీత్ సింగ్‌కు రాష్ట్రపతి భవన్లో జరిగిన వేడుకలో అందజేశారు. నానాజీ, హజారికాలకు ఈ అవార్డును వారి మరణానంతరం ప్రకటించారు. ‘ప్రణబ్ దా’ అని సన్నిహితులు ప్రేమగా పిలుచుకునే ప్రణబ్ ముఖర్జీ.. భారత రత్న అందుకున్న ఐదో రాష్ట్రపతి. కాంగ్రెస్‌కు అత్యంత విశ్వాసపాత్రుడైన ప్రణబ్ భారత్‌కు అత్యంత పిన్న వయస్కుడైన ఆర్థిక మంత్రిగా పనిచేశారు. నానాజీ దేశ్‌ముఖ్‌కు 1928 నుంచి ఆయన చనిపోయే వరకు ఆరెస్సెస్‌తో సంబంధాలు ఉన్నాయి. భారతీయ జన సంఘ్ స్థాపకుల్లో నానాజీ ఒకరు. కాగా, అస్సాంకు చెందిన హజారికా నేపథ్య గాయకుడు, గేయ రచయిత, సంగీత వాద్యకారుడు, చిత్ర నిర్మాత కూడా. -
నాలుగు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు
న్యూఢిల్లీ: కేంద్రం నాలుగు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించడంతోపాటు ఉత్తరప్రదేశ్, బిహార్ గవర్నర్లకు స్థానచలనం కలిగించింది. పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా మాజీ ఎంపీ, ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాది జగ్దీప్ ధంకర్(68)ను నియమిస్తూ శనివారం రాష్ట్రపతి భవన్ ఒక సర్క్యులర్ జారీ చేసింది. వచ్చే వారం పదవీ విరమణ చేయనున్న కేసరీనాథ్ త్రిపాఠీ స్థానంలో ధంకర్ బాధ్యతలు చేపడతారని రాష్ట్రపతి భవన్ పేర్కొంది. బెంగాల్లో రాజకీయ ఆధిపత్యం కోసం బీజేపీ, మమతా బెనర్జీల మధ్య పోరు కొనసాగుతున్న సమయంలో ఈ నియామకం చేపట్టడం గమనార్హం. ధంకర్ 1990–91 సంవత్సరాల మధ్య పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రిగా పనిచేశారు. 2003లో కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరి ఎంపీగా ఎన్నికయ్యారు. అలాగే, 2018 జనవరి నుంచి మధ్యప్రదేశ్ గవర్నర్‌గా పనిచేస్తున్న ఆనందీబెన్ పటేల్‌ను కీలక రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌కు గవర్నర్‌గా నియమించింది. ఆనందీ బెన్ స్థానంలో బీజేపీ కురువృద్ధ నేత, బిహార్ గవర్నర్ లాల్జీ టాండన్‌ను మధ్యప్రదేశ్ గవర్నర్‌గా నియమించినట్లు రాష్ట్రపతి భవన్ పేర్కొంది. టాండన్ స్థానంలో బిహార్ గవర్నర్‌గా బీజేపీ సీనియర్ నేత ఫగు చౌహాన్ బాధ్యతలు చేపడతారని ఆ సర్క్యులర్ వెల్లడించింది. త్రిపుర గవర్నర్‌గా ఛత్తీస్‌గఢ్‌కు చెందిన బీజేపీ సీనియర్ నేత రమేశ్ బైస్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుత గవర్నర్ కప్తాన్ సింగ్ సోలంకి పదవీ కాలం 27న ముగియనుంది. నాగాలాండ్ గవర్నర్‌గా ఇంటెలిజెన్స్ బ్యూరో రిటైర్డు స్పెషల్ డైరెక్టర్ ఎన్.రవి నియమితులయ్యారు. 1976 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన రవి నాగా వేర్పాటువాదులతో కేంద్రం ఒప్పందం కుదుర్చుకోవడంలో కీలకపాత్ర పోషించారు. వీరు పదవీ బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి ఈ నియామకాలు అమల్లోకి వస్తాయని రాష్ట్రపతి భవన్ తెలిపింది. 1950లో యూపీ ఏర్పడిన తర్వాత మొదటి మహిళా గవర్నర్ ఆనందీబెన్. అంతకుముందు ఉన్న యునైటెడ్ ప్రావిన్సుకు 1947లో సరోజినీ నాయుడు గవర్నర్‌గా నియమితులయ్యారు. -
బాలశాస్త్రవేత్తలకు రాష్ట్రపతి భవన్ ఆహ్వానం
సాక్షి, విశాఖపట్నం : ఏకంగా రాష్ట్రపతి భవన్‌లోనే బస. రాష్ట్రపతితో పాటు కేంద్ర మంత్రులు, శాస్త్ర సాంకేతిక రంగాల్లో తలపండిన వారితో సమాలోచనలు..సమాచార మార్పిడికి అవకాశం..అభినందలు. ఇది ఏ కొద్దిమంది పెద్దలకో అందుబాటులో ఉండే అంశం. కానీ పాఠశాల విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చింది కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అహ్మదాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న జాతీయ ఇన్నోవేషన్ ఫౌండేషన్ సంస్థ . విద్యార్థుల్లోని అరుదైన ప్రతిభా పాటవాలను గుర్తించి ..వారికి పోటీ నిర్వహించి జాతీయ స్థాయిలో ప్రతిభ చూపిన వారికి భారత రాష్ట్రపతి భవన్లో బస చేసేందుకు అవకాశం కల్పిస్తోంది. ప్రధానంగా పదో తరగతి విద్యార్థులతో అద్భుతమైన ఆలోచనలు, ప్రయోగాలు చేయించి వారిని ప్రోత్సహించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన పరిశోధన పత్రాల సమర్పణకు ప్రకటన వెలువడిన నేపథ్యంలో ‘సాక్షి’ ప్రత్యేక కథనం పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు కాసింత స్వేచ్ఛనిస్తే అద్భుతాలు సృష్టించగలరు. తమ మది లోని భావాలను ఆవిష్కరిస్తారు. ప్రతి విద్యార్థి చదువుకుంటూనే విభిన్న రంగాల్లో రాణించాలంటూ భారత మాజీ రాష్ట్రపతి దివంగత అబ్దుల్‌కలామ్ ఎన్నోమార్లు సూచించారు. ఈ దిశలో విద్యార్థులను ప్రయోగాల్లో తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో జాతీయ ఇన్నోవేషన్ ఫౌండేషన్ శ్రీకారం చుట్టింది. విద్యార్థులు సృజనాత్మకతతో మంచి ప్రయోగాలను చేయాలన్నదే ఈ సంస్థ లక్ష్యం. ఉత్తమ ప్రయోగాలు చేసిన విద్యార్థులకు దేశ ప్రథమ పౌరుడు, భారత రాష్ట్రపతి భవన్లో బస చేసే అవకాశాన్ని జాతీయ ఇన్నోవేషన్ ఫౌండేషన్ సంస్థ అవకాశం కల్పిస్తుంది. తాను పొందిన జ్ఞానాన్ని దేశాధ్యక్షుడితో పాటు, కేంద్ర మంత్రులు, శాస్త్రసాంకేతిక రంగాల్లో తలపండిన వారితో సమాలోచనలు, సమాచార మార్పిడికి అవకాశం, వారి నుంచి అభినందనలు అందుతాయి. ఈ అరుదైన అవకాశం ఏ కొద్దిమంది పెద్దలకో లభిస్తుంది. కాని పాఠశాల విద్యార్థులకు ఈ అవకాశాన్ని అందుబాటులోకి తెచ్చింది నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్. భౌతికశాస్త్ర ఉపాధ్యాయుల పర్యవేక్షణలో పదో తరగతి విద్యార్థులు ప్రయోగాలు చేసి వాటిని ఈ నెల 31వ తేదీలోపు IGST@ NIF INDIA.org వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు విద్యార్థులు జాతీయ ఇన్నోవేషన్ ఫౌండేషన్ సంస్థను ఇంటర్నెట్ ద్వారా సంప్రదించవచ్చు. అర్హులు ఎవరంటే... పోటీకి దేశంలోని వివిధ పాఠశాలల్లో చదువుతున్న అన్ని తరగతులు, ప్రధానంగా పదో తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు. దరఖాస్తు చేసుకోవడం ఎలా..? విద్యార్థులు వివిధ అంశాలకు సం బంధించిన తమ ఆవిష్కరణలు, పరిష్కార మార్గాలను తయారు చేయడమే ప్రాథమిక సమాచారం ఉద్దేశం, ఆవిష్కరణ లక్ష్యం. ఎలాం టి ప్రయోజనాలున్నాయనే విషయాలపై ప్రాథమిక సమాచారాన్ని ఆ విద్యార్థి చదువుతున్న పాఠశాల నుంచి ఈ మెయిల్ ద్వారా, ఐఎ ఖీః Nఐఊ ఐNఈఐఅ.ౌటజ ఇంటర్నెట్ ద్వారా లేదా తపాలా ద్వారా పంపవచ్చు. తపాలా చిరునామా ఆయా పాఠశాలల నుంచి అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎంపిక ఇలా... ఇన్స్పైర్ వంటి వేడుకలకు పరిమిత సంఖ్యలోనే ప్రతిపాదనలు ఆహ్వానిస్తారు. ఈ కార్యక్రమానికి అపరిమిత సంఖ్యలో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. తమకు తోచిన అంశాలపై ప్రతి పాదనలు సిద్ధం చేసి సమర్పించడమే తరువాయి. తొలుత విద్యార్థి పంపిన ఆవిష్కరణలను నిపుణుల కమిటీ ఎంపిక చేసి సమాచారమిస్తుంది. జాతీయ స్థాయిలో పరిశీలనకు తుది ఎంపికకు పంపిస్తారు. అక్కడ కూడా ఎంపికయ్యాక విద్యార్థికి ఆహ్వానం పంపిస్తారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యార్థులకు దేశ రాజధానిలోని భారత రాష్ట్రపతి నివాసంలో బస కల్పించి ప్రధానమంత్రి, ఇతర మంత్రులు సహా భారత ప్రభుత్వంలో శాస్త్ర, సాంకేతిక రంగాల శాఖ ఉన్నతాధికారులతో సమావేశాలు, మేధోమదనానికి అవకాశం కల్పిస్తారు. జాతీయ స్థాయిలో ప్రతిభ చూపిన వారికి పది మార్కులు బోనస్‌గా లభిస్తుంది. ఏఏ అంశాలంటే... సమాజం ఎదుర్కొంటున్న అనేక సమస్యలు. ప్రధానంగా వాస్తవానికి దగ్గరగా ఉన్న విషయాలపై విద్యార్థి స్పందనను ఆహ్వానిస్తారు. అంశం ఎలాంటిదైనా తమ ఆవిష్కరణ సాధ్యాసాధ్యం విషయంలో కాసింత సానుకూలత ఉంటే సరిపోతుంది. నిత్య జీవితంలో ఎదురవుతున్న అనేక సమస్యలకు సాంకేతికంగా పరిష్కారం కోసం కృషి చేసే ఆవిష్కరణల కోణం. సమాజంలో తలపండిన వారి అనుభవాలకు సాంకేతికత జోడించి అందుబాటులోకి తెచ్చే అవకాశాల గురించిన ఆలోచనలు. ఇంటి పక్కనే ఉన్న ప్రతిభావంతులు లేదా సమాజం గుర్తించని బాలమేధావుల ఆలోచనలు, వారి ఆవిష్కరణలు గురించిన సమాచారం అందించాలి. పోటీలు ఎలా ఉంటాయి..? సాంకేతిక విద్య పరిశోధనల గురించిన పోటీ ఇది. నాలుగైదు అంశాలకు సంబంధించిన విషయాలపై పాఠశాలల విద్యార్థులు స్పందించి తమ పరిధిలో సొంతంగా ఆలోచించి, ఉన్నంతలో మెరుగైన అంశాల గురించిన సమాచారాన్ని వేదికకు పంపించాలి. ఈ అంశాలకు సంబంధించిన ఆవిష్కరణలు కేవలం స్వతంత్రంగా ఆలోచించినవే కావాలి. ఇంటర్నెట్ లేదా ఇతరత్రా వాటి నుంచి సేకరించి ఉండకూడదు. ఈ విషయమై సదరు విద్యార్థి ఆవిష్కరణ స్వయంగా చేసిందేనని, ఎవరినీ అనుకరించడం లేదా అనుసరించడం లేదా ఇంటర్నెట్ నుంచి సేకరించలేదని విద్యార్థి, తల్లిదండ్రులు ధ్రువీకరించాలి. -
ఏపీ కొత్త గవర్నర్‌గా విశ్వభూషణ్ హరిచందన్
సాక్షి, అమరావతి/భువనేశ్వర్: ఒడిశాకు చెందిన భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత విశ్వభూషణ్ హరిచందన్‌ను ఆంధ్రప్రదేశ్ కొత్త గవర్నర్‌గా నియమిస్తూ రాష్ట్రపతి భవన్ మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ఆయన ఐదుసార్లు ఎమ్మెల్యేగా, ఒడిశా రాష్ట్ర న్యాయ శాఖ మంత్రిగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. రాష్ట్రం విడిపోయి ఐదేళ్లు దాటినప్పటికీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు గవర్నర్‌గా నియమితులైన ఈఎస్ఎల్ నరసింహన్ ఇప్పటివరకు నూతన ఆంధ్రప్రదేశ్‌కు కూడా గవర్నర్‌గా కొనసాగుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో ఏపీకి కొత్త గవర్నర్‌ను నియమిస్తారని ఇప్పటికే పలుమార్లు వార్తలు వచ్చినప్పటికీ కేంద్ర ప్రభుత్వం నరసింహన్‌నే తెలుగు రాష్ట్రాల గవర్నర్‌గా కొనసాగిస్తూ వచ్చింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు హరిచందన్ నియమితులైనందున నరసింహన్ ఇక నుంచి తెలంగాణకు మాత్రమే గవర్నర్‌గా కొనసాగుతారు. కాగా, విశ్వభూషణ్ హరిచందన్ జనతా, జనతాదళ్ పార్టీల నుంచి ఒక్కోసారి, బీజేపీ నుంచి మూడుసార్లు ఒడిశా శాసనసభకు వరుసగా ఎన్నికయ్యారు. భువనేశ్వర్ నుంచి మూడుసార్లు, సిలికా నుంచి రెండుసార్లు ఎన్నికైన ఆయన 2004లో బిజూ జనతాదళ్ – భారతీయ జనతా పార్టీ సంకీర్ణ ప్రభుత్వంలో న్యాయశాఖ మంత్రిగా కూడా పనిచేశారు. ఇదిలా ఉంటే.. ఛత్తీస్‌గఢ్ గవర్నర్‌గా రాజ్యసభ సభ్యురాలు అనసూయా ఊకేను కూడా కేంద్రం నియమించింది. వీరిద్దరి నియామకాలకు సంబంధించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేశారు. గత ఆగస్టులో బాలరాం దాస్ టాండన్ మృతి చెందినప్పటి నుంచి మధ్యప్రదేశ్ గవర్నర్ ఆనందిబెన్ పటేల్ ఛత్తీస్‌గఢ్‌కు కూడా గవర్నర్‌గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. జనసంఘ్‌తో విశ్వభూషణ్ రాజకీయ ప్రస్థానం కాగా, భారతీయ జనసంఘ్‌లో 1971లో చేరడం ద్వారా రాజకీయ ప్రవేశం చేసిన విశ్వభూషణ్ హరిచందన్.. ఆ పార్టీ జాతీయ కార్యనిర్వాహక సభ్యునిగా, రాష్ట్ర జనరల్ సెక్రటరీగా పనిచేశారు. ఎమర్జెన్సీని వ్యతిరేకించినందుకు ఆయన 1975లో మీసా చట్టం కింద నిర్బంధానికి గురయ్యారు. 1977లో భారతీయ జనసంఘ్ జనతా పార్టీగా మారే వరకు ఆయన ఆ పదవుల్లో కొనసాగారు. తర్వాత బీజేపీలో చేరి 1980 నుంచి 1988 వరకు ఒడిశా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. 1988లో విశ్వభూషణ్ జనతా పార్టీలో చేరి తిరిగి మళ్లీ 1996 ఏప్రిల్‌లో బీజేపీలో చేరారు. ఆయనకు కవిత్వమంటే మక్కువ. మొరుబొత్తాస్, రాణా ప్రతాప్, శేషఝలక్, అష్టశిఖ, మానసి పుస్తకాలను ఒరియాలో రచించారు. ఒక నాటికనూ రచించారు. చారిత్రక ప్రదేశాలను సందర్శించడం ఆయనకెంతో ఇష్టం. ప్రధాని మోదీకి కృతజ్ఞతలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్‌గా నియమించినందుకు విశ్వభూషణ్ హరిచందన్ ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ప్రధానమంత్రి సోమవారం తనతో ఫోన్లో సంభాషించారని.. ‘మీరు ఒడిశా వీడాల్సి ఉంటుంది, ఒకట్రెండు రోజుల్లో మీకు గురుతర బాధ్యతల్ని కట్టబెడతా’నని ఆయన తనకు చెప్పినట్లు విశ్వభూషణ హరిచందన్ వివరించారు. అలాగే, ఏపీ గవర్నర్‌గా నియమితులైన విశ్వభూషణ హరిచందన్‌ను ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ మంగళవారం అభినందించారు. బయోడేటా పుట్టిన తేదీ : 03–08–1934 తండ్రి పేరు : పరశురాం హరిచందన్ భార్య : సుప్రవ హరిచందన్ చదివినది : బీఏ (ఆనర్స్), ఎల్ఎల్బీ వృత్తి : న్యాయవాది ఆసక్తి : ప్రజల భాగస్వామ్యంతో అవినీతి, అన్యాయాలపై ఉద్యమాలు సామాజిక కార్యకలాపాలు : సామాజిక, రాజ్యాంగ హక్కులపై పౌరులకు అవగాహన కల్గించడం -
ఈనెల 15న నీతి ఆయోగ్ సమావేశం
సాక్షి, అమరావతి: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఈనెల 15వ తేదీన నీతి ఆయోగ్ సమావేశం కానుంది. ఇందులో వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాల సమగ్రాభివృద్ధి, తీవ్రవాద నియంత్రణ ప్రధాన అంశాలుగా ఉంటాయి. ఇతర అంశాలపైనా చర్చిస్తారు. ఈ సమావేశానికి హాజరుకావాలని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్ట్‌నెంట్ గవర్నర్లను నీతి ఆయోగ్ ఆహ్వానించింది. ఆ రోజు మధ్యాహ్నం 2.30 నుంచి 3 గంటల వరకూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ముఖ్యమంత్రులు, లెఫ్ట్‌నెంట్ గవర్నర్లతో హై టీ కార్యక్రమం ఉంటుంది. అనంతరం 3 గంటలకు కేంద్ర హోంమంత్రి ప్రారంభోపన్యాసం చేస్తారు. వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధి ప్రాధాన్యం, తీవ్రవాద కట్టడికి తీసుకోవాల్సిన చర్యలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించాల్సిన వ్యూహాలపై అమిత్ షా ప్రసంగిస్తారు. అనంతరం ముఖ్యమంత్రులు మాట్లాడతారు. సమావేశంలో ఒక్కో ముఖ్యమంత్రి/లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌కు ఏడు నిమిషాలు మాత్రమే మాట్లాడేందుకు సమయం ఇస్తారు. అక్షర క్రమం ప్రకారం ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మాట్లాడే అవకాశం ఇవ్వాలన్నది ఒక ప్రతిపాదన. దీని ప్రకారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి మొట్టమొదట ప్రసంగించే అవకాశం దక్కనుంది. ముఖ్యమంత్రుల ప్రసంగాల అనంతరం నీతి ఆయోగ్ చైర్మన్ హోదాలో ప్రధాని నరేంద్ర మోదీ ముగింపు ఉపన్యాసం చేస్తారు. -
మంత్రివర్గంలో ఆమె లేకుంటే ఎలా?
మోదీ కొత్త కేబినెట్లో 10 శాతానికి పైగా మహిళా మంత్రులు ఉన్నప్పటికీ... అదా విషయం! ఆరుని మూడుకు తగ్గించడం గురించి కదా.. మరో సుష్మను కేబినెట్ హోదాలోకి తీసుకోకపోవటం గురించి కదా.. ఇప్పుడు మాట్లాడుకోవలసింది! మాధవ్ శింగరాజు రాష్ట్రపతి భవన్లో గురువారం సాయంత్రం కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన ముగ్గురు మహిళల్లో సుష్మా స్వరాజ్ లేరు! మంత్రివర్గంలో ఆమె లేకపోవడం ఏంటని కాదు ఆశ్చర్యం. ఆమె లేకుండా ఎలా అని! ‘మిస్ యూ సుష్మాజీ’ అని పార్టీలతో నిమిత్తం లేకుండా దేశ నాయకులు, దేశ ప్రజలు ఆమెకు ఇప్పటికీ ట్వీట్లు పెడుతూనే ఉన్నారు. కిడ్నీ మార్పిడి తర్వాత ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండవలసిన అవసరమే సుష్మను క్రియాశీలక రాజకీయాలకు దూరం చేసినప్పటికీ అది ఏమాత్రం సంభవించవలసిన పరిణామం కాదనే భావన ఈ దేశ ప్రజలు, పూర్వపు మంత్రి వర్గ సహచరులలోనూ ఉంది.మోదీ కొత్త ప్రభుత్వంలో శుక్రవారం నాడు విదేశాంగ మంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన సుబ్రహ్మణ్యం జైశంకర్ పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే ‘‘సుష్మాజీ అడుగుజాడల్లో నడవడాన్ని నేను గొప్ప గౌరవంగా భావిస్తున్నాను’’ అని ట్వీట్ చేశారు. మంత్రిగా ఆయన పెట్టిన తొలి ట్వీట్ అది. ప్రస్తుత మంత్రివర్గంలో సుష్మాస్వరాజ్ కూడా ఉండి ఉంటే మోదీ రెండో ఆలోచన లేకుండా ఆమెకు విదేశాంగ శాఖనే ఇచ్చి ఉండేవారు. గత ఐదేళ్లలో విదేశాంగ మంత్రిగా సుష్మ భారతదేశ దౌత్య సంబంధాలను చక్కబరచడం ఒక్కటే అందుకు కారణం కాదు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ, న్యాయశాఖలతో కలిసి ఎన్నారై బాధిత భార్యల కోసం ఆమె చక్కటి పరిష్కార విధానాలను రూపొందించారు. ఎన్నారై భర్తలపై స్వదేశంలోనూ, ప్రవాసంలోనూ ఉన్న భార్యలు చేసిన ఫిర్యాదులను జాప్యం లేకుండా పరిశీలించి, ఆగడాల భర్తల్ని పట్టి తేవడం కోసం తన యంత్రాంగాన్ని పరుగులు తీయించారు. ఉపాధి కోసం వలసవెళ్లి బందీలైన వారికి ఒకే ఒక ట్వీట్‌తో తక్షణ విముక్తి కల్పించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆమెకు ‘దేశ ప్రజల ప్రియతమ మంత్రి’ అనే గుర్తింపునిచ్చా యి. ‘వాల్ స్ట్రీట్ జర్నల్’ ఆమెను భారతదేశపు ‘బెస్ట్ లవ్డ్ పొలిటీషియన్’ అని కీర్తించింది. అరవై నాలుగేళ్ల ఏళ్ల వయసులో 2016 నవంబరులో మధుమేహం తీవ్రం కావడంతో చికిత్స కోసం ఢిల్లీలోని ‘ఎయిమ్స్’ ఆసుపత్రిలో సుష్మ అడ్మిట్ అయ్యారు. ఆ వివరాలను ట్వీట్ చేస్తూ.. కిడ్నీ ఫెయిల్ అవడంతో తనకు డాక్టర్లు డయాలసిస్ చేస్తున్నారని ఆమె వెల్లడించినప్పుడు అనేక మంది తమ కిడ్నీ ఇస్తామని ముందుకు వచ్చారు! ‘మేడమ్.. మీకు సమ్మతమైతే నా కిడ్నీని డొనేట్ చెయ్యడానికి నేను సిద్ధంగా ఉన్నాను. దేశానికి మీ సేవలు అత్యవసరం’ ఒక యువకుడు ట్వీట్ చేశాడు. జమ్మూలో ఇంజనీరింగ్ చదువుతున్న 24 ఏళ్ల ఖేమ్రాజ్ శర్మ అయితే తన ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాడు. ‘‘విదేశాల్లో చిక్కుకుపోయిన ఎంతోమంది భారతీయులను ఆమె కాపాడారు. ఆదివారాలు కూడా ఆమె మంత్రిత్వ శాఖ కార్యాలయం తెరిచే ఉండేది. సుష్మ చేస్తున్న సేవలకు ప్రతిఫలంగా నేను నా కిడ్నీ ఇవ్వాలని ఆశపడుతున్నాను’’ అని శర్మ బీబీసీ ప్రతినిధితో అన్నారు. వాటన్నిటికీ ఒకే సమాధానంగా.. ‘‘ఫ్రెండ్స్.. నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది. మాటలు రావడం లేదు. మీ అందరికీ ధన్యవాదాలు’’ అని సుష్మ ట్వీట్ చేశారు. ఆ ఏడాది డిసెంబరులో సుష్మకు విజయవంతంగా కిడ్నీ మార్పిడి జరిగింది. మరింత ఆరోగ్యకరమైన పరిసరాల పరిశుభ్రత అనివార్యం కావడంతో తనిక పోటీ చేయబోవడం లేదని ఎన్నికలకు కొన్ని నెలల ముందే సుష్మ ప్రకటించారు. సర్జరీ తర్వాత కూడా రెండేళ్ల పాటు అవిశ్రాంతంగా శ్రమించిన సుష్మ.. విదేశాల్లో నిస్సహాయ స్థితిలో ఉండిపోయి, సహాయం కోసం చేతులు చాచిన ఎందరినో ఒక తల్లిలా జన్మభూమి ఒడిలోకి తీసుకున్నారు. సుష్మ ఇంతగా తన ప్రభావాన్ని చూపించబట్టే కేంద్ర మంత్రివర్గంలో ఈసారి మహిళలకు దక్కని సముచిత స్థానం గురించి కాకుండా, మంత్రివర్గంలో సుష్మ లేకపోవడం అనే విషయమే ప్రాముఖ్యాంశం అయింది. 78 మంది మహిళా ఎంపీలు ఉన్న ప్రస్తుత లోక్‌సభలో మహిళలకు మోదీ ఇచ్చిన కేబినెట్ హోదాలు మూడంటే మూడు మాత్రమే! స్మృతీ ఇరానీ, నిర్మలా సీతారామన్, హర్‌సిమ్రత్‌కౌర్ బాదల్. ఈ ముగ్గురూ గత లోక్‌సభలోనూ కేబినెట్ మంత్రులుగా ఉన్నవారే. అప్పట్లో వీరితో పాటు సుష్మా స్వరాజ్, మేనకా గాంధీ, ఉమాభారతి.. మొత్తం ఆరుగురు కేబినెట్ మంత్రులుగా ఉండేవారు. సాధ్వి నిరంజన్ జ్యోతి, అనుప్రియా పటేల్ సహాయ మంత్రులుగా ఉండేవారు. మొత్తం ఎనిమిది మంది. ఆరు కేబినెట్ హోదాలు. రెండు సహాయ పదవులు. అదిప్పుడు మూడు కేబినెట్ హోదాలు, మూడు సహాయ పదవులుగా కుదించుకుపోయింది. 64 మంది మహిళా ఎంపీలు ఉన్న గత లోక్‌సభతో పోలిస్తే అంతకంటే పద్నాలుగు మంది మహిళా ఎంపీలు ఎక్కువగా ఉన్న ప్రస్తుత లోక్‌సభలో ఉండాల్సిన మహిళా మంత్రుల సంఖ్య మరీ ఆరైతే కాదు. గత లోక్‌సభలో సుష్మతో సమానంగా మహిళా సంక్షేమం కోసం పని చేసిన మేనకా గాంధీని ప్రస్తుతానికి మోదీ పక్కన ఉంచారు. గంగాజల ప్రక్షాళన సేవలకు తన జీవితాన్ని అంకితం చేయాలనుకున్న ఉమాభారతి తనంతట తనే తప్పుకున్నారు. సహాయమంత్రి అనుప్రియా పటేల్ మళ్లీ అదే హోదాలో కొనసాగేందుకు ఆసక్తి చూపలేదు. సహాయ హోదాలోకి మునుపు అదే హోదాలో ఉన్న సాధ్వి నిరంజన్ జ్యోతితో పాటు కొత్తగా రేణుకా సింగ్ సరితను, దేవశ్రీ చౌదరిని తీసుకున్నారు. పాత లోక్‌సభలో 6+2 గా ఉన్న మహిళా మంత్రులు కొత్త లోక్‌సభలో 3+3 అయ్యారు. జాతీయవాద మోదీ ప్రభుత్వానికి ‘మానవీయ’ ఇమేజ్‌ని తెచ్చిపెట్టిన సుష్మాస్వరాజ్ ఇప్పుడు మంత్రివర్గంలో లేని కారణంగా ఆమెపై పడుతున్న ఫోకస్.. మోదీ మంత్రివర్గంలో మహిళల సంఖ్య సగానికి సగం తగ్గడం అనే అంశాన్ని అవుట్ ఫోకస్ చేస్తోందని చెప్పడం కాదిది. కొత్తగా ఎన్నికైన లోక్ సభ మహిళా ఎంపీలలో సుష్మాస్వరాజ్‌లు లేకుండా పోరు. లేకున్నా, బాధ్యతలు అప్పగిస్తే తయారవుతారు. 1977లో దేవీలాల్ సుష్మపై నమ్మకం ఉంచి పాతికేళ్ల వయసులో ఆ కొత్తమ్మాయికి కేబినెట్ బాధ్యతలు అప్పగించినట్లే మోదీ కూడా కొత్త మహిళా ఎంపీలలో కనీసం మరో ముగ్గురికైనా కేబినెట్ హోదాను ఇస్తే దేశ ప్రయోజనాలకు అవసరమైన శక్తి సామర్థ్యాలు నిరూపితం కావా! 543 మంది సభ్యులున్న లోక్‌సభలో 80 వరకు మంత్రుల్ని తీసుకోవచ్చు. కేబినెట్లో ఇప్పుడు 58 మంది ఉన్నారు. ఫస్ట్ టైమ్ మహిళా ఎంపీలలో సహాయమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన రేణుకా సింగ్, దేవశ్రీ చౌదరి, కాకుండా బీజేపీలో ఫస్ట్ టైమ్‌లు ఇంకా అనేక మంది ఉన్నారు. వాళ్లు కాకున్నా సీనియర్లు ఉన్నారు. వాళ్లలోంచి తీసుకోవచ్చు. తీసుకుం టారా?! ∙ -
ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం
-
మే 30, రాత్రి 7 గంటలు
న్యూఢిల్లీ: భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ రెండోసారి ప్రమాణస్వీకారం చేసేందుకు ముహూర్తం ఖరారైంది. మే 30న రాత్రి 7 గంటలకు మోదీ ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని రాష్ట్రపతి కార్యాలయం తెలిపింది. మోదీతో పాటు కొందరు మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేస్తారని వెల్లడించింది. రాష్ట్రపతి భవన్లో జరిగే ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మోదీ చేత ప్రమాణం చేయిస్తారని పేర్కొంది. ఎన్డీయే కూటమి మోదీని తమ నాయకుడిగా శనివారం ఎన్నుకున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన లేఖను బీజేపీ చీఫ్ అమిత్ షాతో పాటు ప్రకాశ్‌సింగ్ బాదల్, ఉద్ధవ్ ఠాక్రే, సుష్మా స్వరాజ్, నితిన్ గడ్కారీ, నితీశ్‌కుమార్ తదితరులు రాష్ట్రపతికి అందచేశారు. దీంతో ఎన్డీయేకు లోక్‌సభలో స్పష్టమైన మెజారిటీ ఉన్న నేపథ్యంలో రాష్ట్రపతి కోవింద్ తన రాజ్యాంగాధికారాలను ఉపయోగించి మోదీని ప్రధానిగా నియమించారు. మంత్రివర్గంలో చేరే సభ్యుల పేర్లు, ప్రమాణస్వీకార కార్యక్రమం తేదీ, సమయం పై మోదీ అభిప్రాయాన్ని అడిగి తెలుసుకున్నారు. తొలి ఐదేళ్ల పదవీకాలం పూర్తిచేసుకుని మరోసారి ప్రధానిగా ఎన్నికైన తొలి బీజేపీ నేతగా మోదీ చరిత్ర సృష్టించారు. మోదీకి ముందు జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీలు మాత్రమే ఈ ఘనత సాధించారు. ఈ కార్యక్రమానికి విదేశీ నేతలు హాజరుకావడంపై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. మరోవైపు సార్వత్రిక ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన మోదీకి పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆదివారం ఫోన్ చేశారు. ఇరుదేశాల్లోని ప్రజల అభివృద్ధి కోసం కలసికట్టుగా పనిచేద్దామని కోరారు. దక్షిణాసియాలో శాంతి, సుస్థిరత, శ్రేయస్సు కోసం తాము కట్టుబడి ఉన్నట్లు పునరుద్ఘాటించారు. ఇందుకోసం మోదీతో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. 17వ లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 542 స్థానాలకు ఎన్డీయే 353 చోట్ల విజయదుందుభి మోగించింది. బీజేపీకి 303 సీట్లు దక్కాయి. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి మాల్దీవుల్లో తొలి పర్యటన.. ప్రమాణస్వీకారం చేసిన అనంతరం మోదీ తన తొలి పర్యటనను మాల్దీవుల్లో చేపట్టే అవకాశముందని దౌత్య వర్గాలు తెలిపాయి. 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక మోదీ తొలిసారి భూటాన్‌ను సందర్శించారు. జూన్ నెలలో మొదటి లేదా రెండో వారంలో మోదీ మాల్దీవుల్లో పర్యటిస్తారని దౌత్యవర్గాలు చెప్పాయి. మోదీ పర్యటన జూన్ 7–8 తేదీల మధ్య ఉంటుందని సమాచారం. వెంకయ్య ఇంటికి మోదీ కేంద్రంలో మరోసారి అధికారం చేపట్టబోతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడితో భేటీ అయ్యారు. ఆదివారం ఉదయాన్నే మోదీ వెంకయ్య ఇంటికి వెళ్లగా, ఆయన ప్రధానిని సాదరంగా ఆహ్వానించారు. మోదీ మర్యాదపూర్వకంగానే వెంకయ్యను కలిసినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఈ సమావేశంలో ముఖ్యంగా దేశాభివృద్ధిని వేగవంతం చేయడం, పార్లమెంటరీ వ్యవస్థలను పటిష్టం చేయడంపై ప్రధానితో చర్చించినట్లు వెంకయ్య నాయుడు ట్వీట్ చేశారు. -
రాష్ట్రపతి భవన్లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం
-
రాష్ట్రపతి భవన్లో ఎట్‌హోం కార్యక్రమం
-
బొల్లారంలో కొత్త అందాలు
సాక్షి, హైదరాబాద్: బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం కొత్త సోయగాలు నింపుకుంది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లోని పూదోటలకు దీటుగా పూర్తి పచ్చదనాన్ని సంతరించుకుంది. హరితహారం కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర అటవీ శాఖ చేపట్టిన ప్రత్యేక కార్యాచరణ మంచి ఫలితాలనిచ్చింది. కాండం లేకుండా ఆకులతోనే ఉండే పామ్ జాతికి చెందిన 30 రకాల మొక్కలతో పామేటమ్ ఏర్పాటు, నీటి అవసరం అంతగా లేని మొక్కల జాతులతో రాక్ గార్డెన్ అభివృద్ధి, ప్రస్తుతమున్న రాళ్ల మధ్యనే అందంగా తీర్చిదిద్దిన జలపాతాన్ని అటవీ శాఖ ప్రత్యేకంగా అభివృద్ధి చేసింది. సోమవారం ఈ రాక్ గార్డెన్, పామేరియం, జలపాతాలను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దంపతులు ప్రారంభించారు. అనంతరం రాష్ట్రపతి దంపతులు కొన్ని మొక్కలు కూడా నాటారు. 170 జాతుల మొక్కలు.. ఆగస్టు నుంచి నాలుగున్నర నెలల కాలంలో 20 రకాల థీమ్స్‌తో అటవీ శాఖ వివిధ రకాల మొక్కలు నాటింది. దాదాపు 75 ఎకరాల్లో మొత్తం 170 జాతులకు చెందిన 13,714 కొత్త మొక్కలు నాటింది. శీతాకాల విడిదిలో భాగంగా రోజువారీ మార్నింగ్ వాక్‌లో కొత్తగా నాటిన మొక్కలను, పచ్చదనం కోసం చేపట్టిన అభివృద్ధి పనులను అటవీ అధికారులతో కలిసి రాష్ట్రపతి పరిశీలించారు. ఈ మొక్కలు నాటక ముందు ఎలా ఉంది, కొత్త మొక్కలు నాటిన తర్వాత అక్కడి పచ్చదనం ఎలా ఉందనే ఆల్బమ్‌ను కూడా అటవీ శాఖ రాష్ట్రపతికి సమర్పించింది. అటవీ శాఖ పనితీరును స్వయంగా చూసిన రాష్ట్రపతి అధికారులను మెచ్చుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా హరితహారాన్ని కొనసాగించి పర్యావరణపరంగా మంచి ఫలితాలు సాధించాలని, కొత్తగా ఎలాంటి పచ్చదనం చర్యలున్నా ఆహ్వానిస్తామని రాష్ట్రపతి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, పీసీసీఎఫ్ పీకే ఝా, రఘువీర్, అదనపు అటవీ సంరక్షణాధికారులు శోభ, డోబ్రియల్ పాల్గొన్నారు. మూడేళ్లకు రూ. 1.7 కోట్లు.. క్రితంసారి హైదరాబాద్ పర్యటనకు వచ్చినప్పుడు హరితహారంలో పాల్గొన్న రాష్ట్రపతి, బొల్లారంలో ఉన్న 75 ఎకరాల్లో కూడా విరివిగా పచ్చదనం పెంచాలని అటవీ శాఖ అధికారులకు సూచించారు. దీనికి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపాలని ఆదేశించారు. ఇందుకోసం ఉన్న చెట్లను తొలగించకుండా, జీవ వైవిధ్యం విలువ పెంచేలా కొత్తగా అభివృద్ధి చేయటం, మొక్కలు లేని ప్రాంతాల్లో పెద్దవి నాటడం, సందర్శనకు వచ్చే పిల్లలు, పెద్దలకు మొక్కలపై అవగాహన పెరిగేలా బొల్లారం నిలయం ఉండాలని ఐదు సూత్రాలను ప్రతిపాదించారు. ఆ తర్వాత అటవీ శాఖ సిద్ధం చేసిన ప్రతిపాదనలకు ఆమోద ముద్ర వేసిన ఆయన మూడేళ్లకు కలిపి రూ. 1.7 కోట్ల నిధులు కూడా విడుదల చేశారు. 26 నుంచి రాష్ట్రపతి నిలయం సందర్శనకు అవకాశం సాక్షి, హైదరాబాద్: బొల్లారంలోని రాష్ట్రపతి నిలయాన్ని సందర్శించే అవకాశాన్ని సాధారణ ప్రజలకు కల్పిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ నెల 26 నుంచి జనవరి 6 వరకు ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రజలు రాష్ట్రపతి నిలయాన్ని సందర్శించవచ్చని తెలిపింది. శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్రపతి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయాన్ని సందర్శించిన అనంతరం సాధారణ ప్రజల సందర్శనకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. కాగా, బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం 75 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఆర్పీ నిలయం ఆవరణలో వివిధ రకాల ఔషధ గుణాలు కలిగిన మొక్కలతో కూడిన ఔషధ ఉద్యానవనం సందర్శకులను ఆకట్టుకుంటుంది. -
ప్రతిభకు పట్టాభిషేకం
న్యూఢిల్లీ: భారత కెప్టెన్ విరాట్ కోహ్లి ‘రాజీవ్‌గాంధీ ఖేల్ రత్న’ అవార్డును సగర్వంగా అందుకున్నాడు. రాష్ట్రపతి భవన్లో మంగళవారం కన్నులపండువగా జరిగిన ఈ వేడుకలో భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ క్రీడాపురస్కారాలు ప్రదానం చేశారు. క్రీడల్లో అత్యున్నత పురస్కారమైన ‘ఖేల్ రత్న’ అవార్డును కోహ్లితో పాటు ప్రపంచ చాంపియన్ వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను కూడా అందుకుంది. ఈ అవార్డుల వేడుకకు కోహ్లి సతీమణి, బాలీవుడ్ నటి అనుష్క శర్మ, మాతృమూర్తి సరోజ్ కోహ్లి, సోదరుడు వికాస్ హాజరయ్యారు. ‘ఖేల్ రత్న’ అందుకున్న మూడో క్రికెటర్ కోహ్లి. గతంలో సచిన్ టెండూల్కర్ (1997–98), ధోని (2007)లు ఈ అవార్డు అందుకున్నారు. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ బ్యాట్స్‌మన్‌గా కొనసాగుతున్న కోహ్లి గత కొన్నేళ్లుగా అసాధారణ ఫామ్‌లో ఉన్నాడు. 2016, 2017లలో కూడా ఖేల్‌రత్న నామినీల్లో ఉన్నప్పటికీ అప్పుడు దక్కని అవార్డు మూడో నామినేషన్‌తో లభించింది. ఐదేళ్ల క్రితం (2013) ‘అర్జున’ అందుకున్న కోహ్లికి గతేడాది ‘పద్మశ్రీ’ పురస్కారం దక్కింది. తెలంగాణకు చెందిన భారత మహిళల డబుల్స్ నంబర్‌వన్ షట్లర్ నేలకుర్తి సిక్కి రెడ్డి ‘అర్జున అవార్డు’ను అందుకుంది. ఆమె గత మూడేళ్లుగా అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నీల్లో నిలకడగా విజయాలు సాధిస్తున్న సంగతి తెలిసిందే. పలువురు మేటి టేబుల్ టెన్నిస్ ప్లేయర్లను తయారుచేసిన ఆచంట శ్రీనివాసరావు ద్రోణాచార్య అవార్డు పొందారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శ్రీనివాసరావు చెన్నైలో స్థిరపడ్డారు. ‘ఖేల్ రత్న’ విజేతకు పతకం, ప్రశంసా పత్రంతో పాటు రూ. 7.5 లక్షలు... ‘అర్జున’ గ్రహీతలకు అర్జునుడి ప్రతిమతోపాటు రూ. 5 లక్షలు ప్రైజ్‌మనీ అందించారు. ఈ రెండు అవార్డులతో పాటు ప్రతిష్టాత్మక ధ్యాన్‌చంద్, కోచ్‌లకు ద్రోణాచార్య, మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ ట్రోఫీ, రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్, టెన్సింగ్ నార్కే జాతీయ అడ్వెంచర్ పురస్కారాలను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అందజేశారు. జాతీయ అడ్వెంచర్ పురస్కారాల్లో భాగంగా టెన్సింగ్ నార్కే అవార్డును ఈసారి ఆరుగురు అమ్మాయిలకు అందజేశారు. భారత నావిక దళానికి చెందిన బొడ్డపాటి ఐశ్వర్య, పాతర్లపల్లి స్వాతి, పాయల్ గుప్తా, వర్తిక జోషి, విజయా దేవి, ప్రతిభ జమ్వాల్ ఈ అవార్డులు అందుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఐశ్వర్య, వైజాగ్ అమ్మాయి స్వాతి తదితరులు లెఫ్టినెంట్ కమాండర్ వర్తిక జోషి నేతృత్వంలో ఐఎన్ఎస్వీ తరిణి నావలో 254 రోజుల్లో ప్రపంచాన్ని చుట్టి వచ్చారు. ఈ ఏడాది ఇద్దరికి ఖేల్‌రత్న దక్కగా, 20 మంది అర్జునకు, ఎనిమిది మంది కోచ్‌లు ద్రోణాచార్య అవార్డులకు ఎంపికయ్యారు. జీవిత సాఫల్య పురస్కారమైన ధ్యాన్‌చంద్ అవార్డును నలుగురు మాజీ క్రీడాకారులు సత్యదేవ్ ప్రసాద్ (ఆర్చరీ), భరత్ కుమార్ చెత్రీ (హాకీ), బాబీ అలోసియస్ (అథ్లెటిక్స్), దత్తాత్రేయ చౌగలే (రెజ్లింగ్)లకు అందజేశారు. ప్రతీ ఏటా దివంగత హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్ జయంతి రోజైన ఆగస్టు 29న ఈ అవార్డులు అందజేసేవారు. ఈ సారి అదే సమయంలో ఆసియా క్రీడలు జరగడంతో వేడుక తేదీని మార్చాల్సి వచ్చింది. ఎప్పట్లాగే ఇప్పుడు కూడా అవార్డుల అంశం వివాదాస్పదమైంది. ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలిచిన రెజ్లర్ బజరంగ్ పూనియా ‘ఖేల్‌రత్న’ విషయమై న్యాయపోరాటం చేస్తానన్నాడు. క్రీడలమంత్రి రాజ్యవర్ధన్ రాథోడ్‌తో భేటీ అయ్యాక మెత్తబడ్డాడు. ఆర్చరీ కోచ్ జీవన్‌జ్యోత్ సింగ్ తేజను ద్రోణాచార్య జాబితా నుంచి తప్పించడంతో ఆయన కోచ్ పదవికి రాజీనామా చేశారు. గతంలో క్రమశిక్షణ రాహిత్యం వల్లే ఆయన్ని తప్పించినట్లు తెలిసింది. విజేతల వివరాలు అర్జున: సిక్కి రెడ్డి (బ్యాడ్మింటన్), నీరజ్ చోప్రా, జిన్సన్ జాన్సన్, హిమ దాస్ (అథ్లెటిక్స్), సతీశ్ (బాక్సింగ్), స్మృతి మంధాన (క్రికెట్), శుభాంకర్ శర్మ (గోల్ఫ్), మన్‌ప్రీత్ సింగ్, సవిత పూనియా (హాకీ), రవి రాథోడ్ (పోలో), రాహీ సర్నోబత్, అంకుర్ మిట్టల్, శ్రేయసి సింగ్ (షూటింగ్), మనిక బత్రా, సత్యన్ (టేబుల్ టెన్నిస్), రోహన్ బోపన్న (టెన్నిస్), సుమిత్ (రెజ్లింగ్), పూజ కడియాన్ (వుషు), అంకుర్ ధామ (పారా అథ్లెటిక్స్), మనోజ్ సర్కార్ (పారా బ్యాడ్మింటన్). ద్రోణాచార్య: సి.ఎ.కుట్టప్ప (బాక్సింగ్) విజయ్ శర్మ (వెయిట్‌లిఫ్టింగ్), ఆచంట శ్రీనివాస రావు (టేబుల్ టెన్నిస్), సుఖ్‌దేవ్ సింగ్ పన్ను (అథ్లెటిక్స్), క్లారెన్స్ లోబో (హాకీ), తారక్ సిన్హా (క్రికెట్), జీవన్ కుమార్ (జూడో), వి.ఆర్.బీడు (అథ్లెటిక్స్). -
ఘనంగా పద్మా అవార్డుల ప్రదానోత్సవం