న్యూఢిల్లీ: క్రాంగెస్ పార్టీలో సాగుతున్న అంతర్గత విభేదాల మధ్య సోనియా గాంధీ ఎట్టకేలకు రాష్ట్రపతిని కలిశారు. ఈ మేరకు సోనియాగాంధీ మంగళవారం రాష్ట్రపతి భవన్ ద్రౌపది ముర్ముని కలిసి ఆమెని అభినందించారు. ఇటీవలే సోనియా గాంధీ రెండుసార్లు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అంతర్గత విభేదాలతో అట్టుడుకిపోతుంది.
ఇటీవలే కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఆనంద్ శర్మ ఆ పార్టీ స్టీరింగ్ కమిటీ చైర్మన్ పదికి రాజీనామ చేస్తున్నట్లు ప్రకటించారు. తనను పదే పదే అవమానించడంతో రాజీనామ చేయక తప్పడం లేదని వాపోయారు. దీంతో ఆయన్ని శాంతింప చేయడానికి హిమచల్‌ప్రదేశ్ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ చైర్మన్ రాజీవ్ శుక్లాని పంపారు. ఆ తర్వాత ఆయన రాజీవ్ శర్మను కలిసి మాట్లాడిన తదనంతరం సోనియాను కలిసేందుకు ఢిల్లీ పయనమయ్యారు.
(చదవండి: కాంగ్రెస్ వల్లే సజీవంగా ప్రజాస్వామ్యం .. 32 ఏళ్లలో ఏ పదవీ చేపట్టని కుటుంబం అది!)
Comments
Please login to add a commentAdd a comment