
లబ్బీపేట(విజయవాడ తూర్పు): కరోనా సమయంలో విశేష సేవలు అందించిన ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఎన్టీఆర్ జిల్లా చైర్మన్ డాక్టర్ జి.సమరానికి జాతీయ స్థాయిలో గోల్డ్‌మెడల్ లభించింది. సోమవారం న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ వార్షిక సమావేశంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా గోల్డ్ మెడల్ అందుకున్నారు.
ఈ సందర్భంగా డాక్టర్ సమరాన్ని హరియాణా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ గవర్నర్లు బండారు దత్తాత్రేయ, విశ్వభూషణ్ హరిచందన్, తమిళిసై, తదితరులు అభినందనలు తెలియజేశారు.