మిజోరం గవర్నర్‌పై వేటు
న్యూఢిల్లీ: మిజోరం గవర్నర్ అజీజ్ ఖురేషిపై వేటు పడింది. ఆయన్ను తొలగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఖురేషిని తొలగిస్తున్నట్టు రాష్ట్రపతి భవన్ శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఖురేషి స్థానంలో మిజోరం గవర్నర్‌గా పశ్చిమబెంగాల్ గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠీకి అదనపు బాధ్యతలు అప్పగించినట్టు తెలిపింది. ఖురేషి 2017, మే నెల వరకు కొనసాగాల్సి ఉంది.
యూపీఏ హయాంలో నియమితులైన గవర్నర్లలో ఒకరైన ఖురేషిని కూడా పదవినుంచి తప్పుకోవాలని గతేడాది జూలై 30న అప్పటి హోంశాఖ కార్యదర్శి అనిల్ గోస్వామి కోరారు. దీన్ని వ్యతిరేకిస్తూ ఖురేషి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్ గవర్నర్‌గా ఉన్న ఆయన్ను మిజోరం రాష్ట్రానికి కేంద్రం బదిలీ చేసింది. అదను చూసి ఇప్పుడు ఆయనపై వేటువేసింది.