aziz qureshi
-
మళ్లీ మోదీ అధికారంలోకి వస్తే.. బీజేపీ రాజ్యాంగాన్ని మార్చేస్తుంది..
లక్నో: దేశంలో బీజేపీలో మరోసారి అధికారంలోకి వస్తే భారత రాజ్యాంగాన్ని మార్చేస్తుందని ఉత్తరప్రదేశ్, ఉత్తరఖండ్ మాజీ గవర్నర్ అజీజ్ ఖురేషీ విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నరేంద్రమోదీ నేతృత్వంలో బీజేపీ 2024లో మళ్లీ అధికారంలో వస్తే.. రాజ్యాంగాన్ని మరుస్తుందని, దేశం నాశనమైపోందని పేర్కొన్నారు. అందుకే అన్ని పార్టీలు ఏకమై బీజేపీని వచ్చే ఎన్నికల్లో ఓడించాలని తెలిపారు. చదవండి: అధికారం కాదు... ప్రజాసేవే లక్ష్యం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని బీజేపీ పార్టీ జీర్ణించుకోలేకపోతుందని అన్నారు. అందుకే రాజ్యాంగాన్ని కూడా మార్చాలని చూస్తుందని వ్యాఖ్యానించారు. అయితే బీజేపీని వచ్చే ఎన్నికల్లో ఓడిస్తే.. రాజ్యాంగంతో పాటు దేశాన్ని కూడా రక్షించినవాళ్లమవుతామని చెప్పారు. కానీ, బీజేపీ ఓడించాలంటే మాత్రం అన్ని ప్రతిపక్ష పార్టీలు ఏకం కావాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. చదవండి: మహారాష్ట్రలో "ఒమిక్రాన్" వేరియంట్ కలకలం!! ఇదే విషయాన్ని గత నెల నుంచి తాను ప్రచారం చేస్తున్నానని తెలిపారు. అయితే బీజేపీ, ఎంఐఎం పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ముస్లింకు శత్రువులని మండిపడ్డారు. దేశంలో ముస్లింలు లేకుండా చేద్దామని వాళ్లు పని చేస్తున్నారని తీవ్రంగా వివర్శించారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఒవైసీ బీజేపీతో కలిసి పని చేస్తాడని ఆరోపించారు. -
బెంగాల్ గవర్నర్‌కు మిజోరాం బాధ్యతలు
ఇప్పటికే పశ్చిమబెంగాల్, బీహార్ రాష్ట్రాల గవర్నర్‌గా ఉన్న కేఎన్ త్రిపాఠీకి మిజొరాం అదనపు బాధ్యతలు కూడా ఇచ్చారు. ఆయన ఈనెల 4వ తేదీన బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆయన శనివారం ఐజ్వాల్ వస్తారని, సాయంత్రం 4 గంటల ప్రాంతంలో రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకారం చేస్తారని మిజొరాం ప్రభుత్వ అధికార ప్రతినిధి ఎల్.ఆర్. సైలో తెలిపారు. కేంద్రప్రభుత్వం గతవారం తొలగించిన పాత గవర్నర్ అజీజ్ ఖురేషి అదేరోజు.. అంటే ఏప్రిల్ 4న రాష్ట్రం వదిలి వెళ్తారు. అయితే.. రాష్ట్రంలో పదే పదే గవర్నర్లను ఎందుకు మారుస్తున్నారంటూ విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. గడిచిన 8 నెలల్లో ఈ రాష్ట్రంలో ఏడుగురు గవర్నర్లు మారారు. -
మిజోరం గవర్నర్‌పై వేటు
న్యూఢిల్లీ: మిజోరం గవర్నర్ అజీజ్ ఖురేషిపై వేటు పడింది. ఆయన్ను తొలగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఖురేషిని తొలగిస్తున్నట్టు రాష్ట్రపతి భవన్ శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఖురేషి స్థానంలో మిజోరం గవర్నర్‌గా పశ్చిమబెంగాల్ గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠీకి అదనపు బాధ్యతలు అప్పగించినట్టు తెలిపింది. ఖురేషి 2017, మే నెల వరకు కొనసాగాల్సి ఉంది. యూపీఏ హయాంలో నియమితులైన గవర్నర్లలో ఒకరైన ఖురేషిని కూడా పదవినుంచి తప్పుకోవాలని గతేడాది జూలై 30న అప్పటి హోంశాఖ కార్యదర్శి అనిల్ గోస్వామి కోరారు. దీన్ని వ్యతిరేకిస్తూ ఖురేషి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్ గవర్నర్‌గా ఉన్న ఆయన్ను మిజోరం రాష్ట్రానికి కేంద్రం బదిలీ చేసింది. అదను చూసి ఇప్పుడు ఆయనపై వేటువేసింది. -
తీవ్రవాదానికి మతం లేదు: అజీజ్ ఖురేషీ
సంభాల్(యూపీ): తీవ్రవాదానికి మతం లేదని ఉత్తరాఖండ్ గవర్నర్ అజీజ్ ఖురేషీ అన్నారు. తీవ్రవాద హింసను తుదముట్టించేందుకు ప్రజలు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. కల్కి మహోత్సవంలో గురువారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ... మనదేశంలో తీవ్రవాదులు అడుగుపెట్టకుండా చూడాలన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన 'స్వచ్ఛ భారత్' కార్యక్రమంపై ఆయన ప్రశంసలు కురిపించారు. దేశాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజలందరూ పూనిక వహించాలని విజ్ఞప్తి చేశారు. -
ఉత్తరాఖండ్ గవర్నర్‌ను గద్దె దిగమనలేదు: రాజ్‌నాథ్
లక్నో: కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం.. పదవి నుంచి తప్పుకోవాలని తనకు చెప్పిందన్న ఉత్తరాఖండ్ గవర్నర్ అజీజ్ ఖురేషీ ఆరోపణలను కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తోసిపుచ్చారు. ‘ఆయనను తొలగించేందుకు ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు’ అని స్పష్టం చేశారు. ఈ అంశంపై త్వరలో సుప్రీం కోర్టుకు తగిన స్పందన తెలియజేస్తామన్నారు. రాజ్‌నాథ్ శుక్రవారం ఉత్తరప్రదేశ్‌లో వరదప్రాంతాల పర్యటన తర్వాత మాట్లాడారు. మోడీ సర్కారు వచ్చాక నలుగురు గవర్నర్లను మార్చింది. -
గవర్నర్ తొలగింపుపై నోటీసులు
ఉత్తరాఖండ్ గవర్నర్ ఖురేషీ తొలగింపు వ్యవహారంలో సుప్రీంకోర్టు చర్య న్యూఢిల్లీ: యూపీఏ హయాంలో నియమితులైన గవర్నర్ల తొలగింపుపై ఏర్పడిన వివాదం తాజాగా కోర్టుకెక్కింది. ఉత్తరాఖండ్ గవర్నర్ పదవినుంచి తనచేత రాజీనామా చేయించేందుకు ప్రభుత్వం వ్యవహరించిన తీరును సవాలుచేస్తూ అజీజ్ ఖురేషీ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు గురువారం కేంద్రానికి నోటీసు జారీ చేసింది. గవర్నర్ పదవికి రాజీనామా చేయాలని, లేదా కేంద్రంచేత బర్తరఫ్కు సిద్ధపడాలని తనను బెదిరించినట్టు ఖురేషీ చేసిన ఆరోపణలపై వివరణ ఇవ్వాలని కేంద్ర హోమ్‌శాఖ కార్యదర్శి అనిల్ గోస్వామికి సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసింది. ఆరువారాల్లోగా వివరణ ఇవ్వాలంటూ కేంద్రాన్ని, కేంద్ర హోమ్‌శాఖ కార్యదర్శిని ఆదేశించింది. పిటిషన్‌పై విచారణను ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసింది. పిటిషన్‌లోని అంశాలు రాజ్యాంగంలోని 156వ ఆర్టికల్ (గవర్నర్ పదవీకాలం)కు సంబంధించివైనందున పిటిషన్‌ను ఐదుగురు జడ్జీల ధర్మాసనానికి బదలీ చేస్తున్నట్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎం లోథా అధ్యక్షతలోని సుప్రీంకోర్టు బెంచ్ పేర్కొంది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది, మాజీ కేంద్ర మంత్రి కపిల్ సిబల్ కోర్టులో తన వాదనలు వినిపిస్తూ, గవర్నర్ రాజీనామా కోరేందుకు ఒక పద్ధతి అంటూ ఉండాలని, గవర్నర్‌ను తొలగించేందుకు రాష్ట్రపతికి మాత్రమే అధికారం ఉంటుందని, కేంద్ర హోమ్‌శాఖ కార్యదర్శి కేవలం ఒక ఫోన్‌కాల్‌తో గవర్నర్‌ను రాజీనామా కోరడం కుదరదని అన్నారు. ఈ అంశంపై గతంలో రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును సిబల్ ఉదహరించారు. గవర్నర్ల తొలగింపు వ్యవహారంలో మోడీ సర్కార్ చర్యను వ్యతిరేకిస్తూ ఖురేషీ మాత్రమే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. యూపీఏ నియమించిన మరో ఇద్దరు గవర్నర్లను కేంద్రం బర్తరఫ్ చేసింది. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటివరకూ నలుగురు గవర్నర్లు రాజీనామా చేశారు. -
కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు
ఢిల్లీ: గవర్నర్ల తొలగింపు వ్యవహారంపై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఉత్తరాఖండ్ గవర్నర్ అజీజ్ ఖురేషీ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఈ నోటీసులు జారీ చేసింది. గవర్నర్ పదవి నుంచి వైదొలగాలంటూ కేంద్రం ఒత్తిడిని ప్రశ్నిస్తూ అజీజ్ ఖురేషి సుప్రీంకోర్టుకు వెళ్ళారు. ఐదుగురు జడ్జీల రాజ్యాంగ ధర్మాసనానికి ఈ పిటిషన్‌ను బదిలీ చేశారు. 6 వారాల్లోగా సమాధానం ఇవ్వాలంటూ కోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. గవర్నర్ల తొలగింపు వ్యవహారం వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ నాయకులను గవర్నర్లుగా నియమించడం ఆనవాయితీ అయిపోయింది. అప్పటి వరకు వున్న గవర్నర్లను తొలగించడం లేదా రాజీనామా చేయమని ఒత్తిడి తేవడం పరిపాటిగా మారింది. యుపిఎ ప్రభుత్వం నియమించిన గవర్నర్లను రాజీనామా చేయాల్సిందిగా ఎన్‌డిఎ ప్రభుత్వం ఒత్తిడి చేస్తోంది. ఉత్తరప్రదేశ్ గవర్నర్ జోషి రాజీనామా చేశారు. రాజీనామాకు కొంతమంది తిరస్కరించారు. మరి కొంతమంది ఆ పదవిలో కొనసాగడానికి అధికారపక్షంతో తమవంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. -
దేవుడికే తప్ప పోలీసులకు సాధ్యం కాదు
లక్నో: మహిళలపై దాడులు, అత్యచార సంఘటనలకు సంబంధించి ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ ములయాం సింగ్ యాదవ్ తరహాలో ఆ రాష్ట్ర గవర్నర్ అజీజ్ ఖురేషీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మొత్తం పోలీస్ వ్యవస్థనంతటినీ మహిళల రక్షణ కోసం మోహరించినా అత్యాచారాలను ఆపలేరని ఖురేషీ అన్నారు. ఎక్కడో ఒక చోట అత్యాచారాలు జరుగుతూనే ఉంటాయని ఖురేషీ చెప్పారు. ఇలాంటి నేరాలను అరికట్టాలంటే దేవుడే దిగివచ్చి కాపాడాలని, లేకుంటే సాధ్యంకాదని ఖురేషీ అన్నారు. దీనిపై ఉత్తరప్రదేశ్ బీజేపీ శాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఉన్నత పదవిలో ఉన్న ఖురేషీ ఇలాంటి వ్యాఖ్యాలు చేయడం సరికాదని పేర్కొంది. ఉత్తరప్రదేశ్‌లో అత్యాచారాలు, దాడులతో శాంతిభద్రతలు క్షీణిస్తుంటే.. ములయాం మాత్రం 21 కోట్ల మంది ఉన్న రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు చాలా తక్కువేనని వ్యాఖ్యానించారు. -
రాష్ట్రప్రభుత్వానికి ఉత్తరాఖండ్ గవర్నర్ కృతజ్ఞతలు
సాక్షి, హైదరాబాద్: ఉత్తరాఖండ్ గవర్నర్ డాక్టర్ అజీజ్ ఖురేషీ బుధవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో భేటీ అయ్యారు. గత జూన్‌లో భారీ వర్షాలు, వరదలతో ఉత్తరాఖండ్ రాష్ట్రం అల్లకల్లోమైన సందర్భంలో రాష్ట్రప్రభుత్వం ఆర్థిక చేయూతను అందించినందుకుగాను ఆయన సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఉత్తరాఖండ్ వరద బాధితుల సహాయార్థం రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో రూ.50 కోట్లు ప్రకటించింది. ఇందులో రూ.10 కోట్లు ప్రభుత్వానికి ఆర్థిక సాయంగా, మిగతా డబ్బుతో టీటీడీ ఆధ్వర్యంలో మూడు సత్రాల నిర్మాణానికి, యాత్రికులకు వసతులు కల్పించేందుకు అందజేసింది.