దేవుడికే తప్ప పోలీసులకు సాధ్యం కాదు | Entire police force cannot stop rapes: Uttar Pradesh Governor Aziz Qureshi | Sakshi
Sakshi News home page

దేవుడికే తప్ప పోలీసులకు సాధ్యం కాదు

Published Mon, Jul 21 2014 10:09 PM | Last Updated on Sat, Jul 28 2018 8:35 PM

దేవుడికే తప్ప పోలీసులకు సాధ్యం కాదు - Sakshi

దేవుడికే తప్ప పోలీసులకు సాధ్యం కాదు

లక్నో: మహిళలపై దాడులు, అత్యచార సంఘటనలకు సంబంధించి ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ చీఫ్ ములయాం సింగ్ యాదవ్ తరహాలో ఆ రాష్ట్ర గవర్నర్ అజీజ్ ఖురేషీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మొత్తం పోలీస్ వ్యవస్థనంతటినీ మహిళల రక్షణ కోసం మోహరించినా అత్యాచారాలను ఆపలేరని ఖురేషీ అన్నారు.

ఎక్కడో ఒక చోట అత్యాచారాలు జరుగుతూనే ఉంటాయని ఖురేషీ చెప్పారు. ఇలాంటి నేరాలను అరికట్టాలంటే దేవుడే దిగివచ్చి కాపాడాలని, లేకుంటే సాధ్యంకాదని ఖురేషీ అన్నారు. దీనిపై ఉత్తరప్రదేశ్ బీజేపీ శాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఉన్నత పదవిలో ఉన్న ఖురేషీ ఇలాంటి వ్యాఖ్యాలు చేయడం సరికాదని పేర్కొంది. ఉత్తరప్రదేశ్లో అత్యాచారాలు, దాడులతో శాంతిభద్రతలు క్షీణిస్తుంటే.. ములయాం మాత్రం 21 కోట్ల మంది ఉన్న రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు చాలా తక్కువేనని వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement