
లక్నో: దేశంలో బీజేపీలో మరోసారి అధికారంలోకి వస్తే భారత రాజ్యాంగాన్ని మార్చేస్తుందని ఉత్తరప్రదేశ్, ఉత్తరఖండ్ మాజీ గవర్నర్ అజీజ్ ఖురేషీ విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నరేంద్రమోదీ నేతృత్వంలో బీజేపీ 2024లో మళ్లీ అధికారంలో వస్తే.. రాజ్యాంగాన్ని మరుస్తుందని, దేశం నాశనమైపోందని పేర్కొన్నారు. అందుకే అన్ని పార్టీలు ఏకమై బీజేపీని వచ్చే ఎన్నికల్లో ఓడించాలని తెలిపారు.
చదవండి: అధికారం కాదు... ప్రజాసేవే లక్ష్యం
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని బీజేపీ పార్టీ జీర్ణించుకోలేకపోతుందని అన్నారు. అందుకే రాజ్యాంగాన్ని కూడా మార్చాలని చూస్తుందని వ్యాఖ్యానించారు. అయితే బీజేపీని వచ్చే ఎన్నికల్లో ఓడిస్తే.. రాజ్యాంగంతో పాటు దేశాన్ని కూడా రక్షించినవాళ్లమవుతామని చెప్పారు. కానీ, బీజేపీ ఓడించాలంటే మాత్రం అన్ని ప్రతిపక్ష పార్టీలు ఏకం కావాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు.
చదవండి: మహారాష్ట్రలో "ఒమిక్రాన్" వేరియంట్ కలకలం!!
ఇదే విషయాన్ని గత నెల నుంచి తాను ప్రచారం చేస్తున్నానని తెలిపారు. అయితే బీజేపీ, ఎంఐఎం పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ముస్లింకు శత్రువులని మండిపడ్డారు. దేశంలో ముస్లింలు లేకుండా చేద్దామని వాళ్లు పని చేస్తున్నారని తీవ్రంగా వివర్శించారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఒవైసీ బీజేపీతో కలిసి పని చేస్తాడని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment