Indian Constitution
-
మన అడుగులు ఎటువైపు?!
భారత రాజ్యాంగానికి శతాబ్దాల ముందు.. ముస్లింలు, క్రైస్తవులు, పార్సీలు, యూదులను భారతదేశపు మట్టిలో చట్టబద్ధమైన భాగస్వాములుగా మన దేశ మూలవాసులు అంగీకరించారు. మన పూర్వీకులు మానవత్వాన్ని ఒకే కుటుంబంగా అర్థం చేసుకున్నారు. ప్రాచీన సంస్కృత పదబంధమైన ‘వసుధైక కుటుంబం’, ప్రాచీన తమిళ పద్యమైన ‘యాదుం ఊరే యావరం కేళిర్’ అర్థం కూడా ఇదే! కానీ ఇప్పటి పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. సహజీవనంతో భాగస్వామ్యాన్ని నిర్మించుకోవడం కంటే నిన్నటి రోజుని పునర్నిర్మించడానికే ప్రయత్నాలు జరుగుతున్నట్లనిపిస్తోంది. గతాన్ని మార్చలేము. గతం నుంచి కేవలం నేర్చుకోగలం. గతాన్ని పునర్వ్యవస్థీకరించే ప్రచారాలు వర్తమానాన్ని గాయపరుస్తాయనేది చరిత్ర నేర్పిన పాఠం.భారత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా, న్యాయమూర్తులు సంజయ్ కుమార్, కేవీ విశ్వనాథన్ లు 1991 నాటి ప్రార్థనా స్థలాల చట్టంతో ముడిపడిన పిటిషన్ లను తిరిగి విచారించినప్పుడు, మీడియా మరోసారి పిటిషన ర్లను ‘హిందూ’ లేదా ‘ముస్లిం’ అనే రెండు పక్షాలుగా పేర్కొంటుంది. సీజేఐ, ఆయన తోటి న్యాయమూర్తులు తమ తీర్పును ఇచ్చిన తర్వాత, మీడియా ‘విజయం సాధించిన పక్షం’ అనే శీర్షికను పెడు తుంది. నిజానికి, ఆ తీర్పు విజయాన్ని మించి మరింత ప్రాముఖ్యం కలిగినది. ఇది రెండు సంఘర్షణాత్మక దృక్పథాల మధ్య ప్రభావం చూపుతుంది, ఒకటి భారతదేశంలో సమానత్వంతో కూడిన ప్రజాస్వా మ్యాన్ని కోరుకుంటుంది, మరొకటి మెజారిటీ ఆధిపత్యాన్ని వాగ్దానం చేస్తుంది. ఆ తీర్పు హిందూ మతంపై ప్రపంచ అవగాహనను కూడా ప్రభావితం చేస్తుంది.చికాగోలో 1893లో జరిగిన ప్రపంచ సర్వ మత మహాసభముందు స్వామి వివేకానంద పేర్కొన్న ప్రఖ్యాతిగాంచిన మాటలు హిందూ మతానికి ప్రపంచవ్యాప్త ప్రతిష్ఠ తేవడంలో సాయపడ్డాయి: ‘‘సహనం, సార్వత్రిక అంగీకారం రెండింటినీ ప్రపంచానికి బోధించిన మతానికి చెందినందుకు నేను గర్విస్తున్నాను. మేము విశ్వవ్యాప్తసహనాన్ని మాత్రమే నమ్ముతాము, మేము అన్ని మతాలూ నిజమని అంగీకరిస్తాం’’ అన్నారు. తిరిగి 1896లో లండన్‌లో... ‘‘భారతీయులు ప్రజాస్వామ్యాన్ని హత్తుకుంటారు. ఐక్యతను, సమానత్వాన్ని ప్రతిష్ఠి స్తారు’’ అని పునరుద్ఘాటించారు. భారతదేశం ఆలింగనం చేసుకోవాలని వివేకానంద ఆశించిన ప్రజాస్వామ్యం, భారత గడ్డపై ప్రతిష్ఠించాలని ఆయన కోరుకున్న ఐక్యత, నాటాలనుకున్న సమానత్వపు మొక్కలు.. భారత రాజ్యాంగం అమోదం పొందిన 1949 నాటి నుండి కనిపించాయి. దాని పీఠిక సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం; ఆలోచన, వ్యక్తీకరణ,నమ్మకం, విశ్వాసం, ఆరాధనా స్వేచ్ఛ; హోదా, అవకాశాల సమా నత్వం; అలాగే... సోదరత్వం, వ్యక్తి గౌరవం, దేశ ఐక్యత, సమగ్ర తలకు హామీ ఇస్తోంది. తదుపరి 75 సంవత్సరాలలో, కొన్ని తీవ్రమైన మినహాయింపులను పక్కన పెడితే, భారతదేశంలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఆదేశాలను ఉల్లంఘించకుండా చాలా వరకు దూరంగా ఉన్నాయి. అయితే, ఆగ్రహం పెద్ద సంఖ్యలో ప్రజలను ఉత్తేజపరిచినప్పుడు, హింసను నియంత్రించడానికి అధికారులు నిరాకరించినప్పుడు రాజ్యాంగ వాగ్దానాలు మృతప్రాయంగా మారటం తెలిసిందే. సుప్రీంకోర్టు తన 2019 నాటి అయోధ్య తీర్పులో పేర్కొన్నట్లుగా, 1992 డిసెంబర్లో బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో ఇదే జరిగింది. 2019 నాటి ఆ తీర్పులో, మసీదు ఉన్న మైదానంలో రామమందిరాన్ని నిర్మించడానికి సుప్రీంకోర్టు అధికారం ఇచ్చింది. ఆ మసీదును ప్రార్థనా స్థలాల చట్టం–1991 నుండి జాగ్రత్తగా మినహాయించారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇతర మసీదుల పునాదులపైన కూడా మును పటి హిందూ పుణ్యక్షేత్రాల చిహ్నాల కోసం శోధించడాన్ని అనుమతిస్తే, ఆ చట్టానికి అర్థమే లేకుండా పోతుంది. పైగా, అటువంటి తీర్పు... హిందూ మతం అసహనంతో, ఆగ్రహంతో కూడుకున్నదనీ; వివేకా నంద, ఆయనతో ఏకీభవించిన నాలుగు తరాల హిందూ ఆలోచనా పరులు ఆనాడు వాస్తవాన్ని గ్రహించలేకపోయారనీ ప్రపంచానికి చాటి చెబుతుంది.అతని లేదా ఆమె పూర్వీకుడు నా పూర్వీకుడికి హాని కలిగించినందున నేను ఎవరినైనా గాయపరచడం చట్టబద్ధం కాదని ఆధునిక ప్రపంచం అంగీకరిస్తుంది. మూలవాస ఆఫ్రికన్లు, అమెరికన్లు, కెనడి యన్లు, ఇంకా ఆస్ట్రేలియన్లు స్వదేశీ అనుమతి లేకుండా తమ భూమిలో స్థిరపడిన బయటివారి (భారతదేశం నుండి వచ్చిన వ్యక్తులు సహా) వారసులను బహిష్కరించాలని డిమాండ్ చేయరు. ఈ ‘అంగీకారాన్ని’ మనం మానవత్వం, ఇంగితజ్ఞానం, వ్యావహారిక సత్తా వాదం లేదా మరొకదాని ఘనతగా పేర్కొన్నప్పటికీ, అది మనప్రపంచ పురోగతి గాథను గుర్తించింది.భారత రాజ్యాంగానికి శతాబ్దాల ముందు.. ముస్లింలు, క్రైస్త వులు, పార్సీలు, యూదులను భారతదేశపు మట్టిలో చట్టబద్ధమైన భాగస్వాములుగా మన దేశ మూలవాసులు అంగీకరించారు. మన పూర్వీకులు మానవత్వాన్ని ఒకే కుటుంబంగా అర్థం చేసుకున్నారు. ప్రాచీన సంస్కృత పదబంధమైన ‘వసుధైక కుటుంబం’, ప్రాచీన తమిళ పద్యమైన ‘యాదుం ఊరే యావరం కేళిర్’ అర్థం కూడా ఇదే.నేను 1999లో రాసిన పుస్తకం, ‘రివెంజ్ అండ్ రీకన్సిలియేషన్: అండర్స్టాండింగ్ సౌత్ ఏషియన్ హిస్టరీ’లో పేర్కొన్నట్లుగా, బుద్ధుడు ప్రబోధించిన సోదరభావానికీ, మహా భారత కథలో ఆధిపత్యం వహించిన ప్రతీకారానికీ మధ్య ఏదో ఒక దానిని మన ఉపఖండంలోని ప్రజలు ఎంచుకోవాల్సి వచ్చింది.ప్రతీకారం సూత్రంగా, సర్వత్రా సంహారమే పరాకాష్ఠగా కనిపించే మహాభారతంలో కూడా, సయోధ్య స్ఫూర్తి, పాఠకుల హృద యాన్ని సాంత్వనపరిచే శక్తిమంతమైన మినహాయింపులు ఉండటం కనిపిస్తుంది. భారత ఇతిహాసంలోని అత్యంత నాటకీయ సన్నివేశా లలో, యుద్ధం ముగిసిన తర్వాత, దాదాపు ప్రతి కథానాయకుడు మరణానికి గురైన తరువాత, దుఃఖంలో ఉన్న స్త్రీలను, జీవించి ఉన్న కొంతమంది యువరాజులను పురాణకర్త వ్యాసుడు ఓదార్చాడు. వ్యాసుడు అప్పుడప్పుడు కథా సన్నివేశాలలోకి ప్రవేశిస్తాడు. ‘నేను మీ దుఃఖాన్ని పోగొడతాను’ అని దుఃఖిస్తున్న వారితో చెబుతూ, వ్యాసుడు చనిపోయిన వారిని భాగీరథీ నదీ జలాల నుండి బయటకు వచ్చేలా చేశాడు: ద్వేషం అసూయ నుండి ప్రక్షాళన కాబడినది / తండ్రిని తల్లిని కొడుకు కలిసాడు / భార్య భర్తను కలుసుకున్నది / స్నేహితుడు స్నేహితుడిని పలకరించాడు/ పాండవులు కర్ణుడిని కలి శారు/ అతడిని కౌగిలించుకున్నారు/ అని రాశాడు. అది సయోధ్యకు సంబంధించిన దృశ్యం. అక్కడ దుఃఖం లేదు, భయం లేదు, అను మానం లేదు, నిందలు లేవు. అది ప్రేమించే మనసుల కలయిక తప్ప మరేమీ కాదు. (పి లాల్ వ్యాఖ్యానం). అయితే తెల్లవారుజాము నాటికి, ఆ కలయిక కల ముగిసింది. జీవం పోసుకున్న వారు భాగీరథీ నదీ జలాల లోతుల్లోకి తిరిగి వెళ్లి పోయారు. పాండవుల ఆధిపత్యాన్ని ప్రకటించడానికి అర్జునుడు సాగించిన యుద్ధానంతర ఉపఖండ దండయాత్ర సమయంలో మరొక సయోధ్య దృశ్యం మనకు కనిపిస్తుంది. సైంధవ భూభాగంలో (సింధ్‌లో) ఓడిపోయిన కౌరవుల సోదరి దుశ్శల, ఒక బిడ్డతో కలిసి అర్జునుడిని కలుస్తుంది. అర్జునుడు అన్యాయంగా చంపిన కౌరవ పక్ష యోధుడైన జయద్రథుడిని దుశ్శల వివాహం చేసుకుంది. అర్జునుడు ఆమె కొడుకు సురథుడి గురించి దుశ్శలను అడుగుతాడు. ‘అతను చనిపోయాడు,’ అని ఆమె చెబుతుంది, ‘అతను విరిగిన హృదయంతో మరణించాడు, ఎందుకంటే నీవు అతని తండ్రిని చంపావని సురధు నికి తెలుసు. నేను ఇప్పుడు సురథుడి కొడుకును నీ వద్దకు తీసుకు వస్తాను. నేను నీ రక్షణను కోరుతున్నాను’’ అంటుంది. అర్జునుడు దుశ్శలని అక్కున చేర్చుకుని తన రాజభవనానికి రావాలని ఆమెను కోరాడు. తర్వాత అర్జునుడు సైంధవులతో సంధి చేసుకున్నాడు.మనం ఇప్పుడు ఒకటే ప్రశ్నించాలి. ఈరోజు భాగస్వామ్యాన్ని నిర్మించుకోవడం కంటే నిన్నటి రోజుని పునర్నిర్మించడానికి ప్రయత్నించడం ముఖ్యమా? అని. గతం ముగిసిపోయింది. మనం దానిని మార్చలేం. జరిగిపోయిన దాన్ని పునరుద్ధరించలేము. అవును, మనం చరిత్ర నుండి కేవలం నేర్చుకోగలం. గతాన్ని పునర్వ్యవస్థీకరించే ప్రచా రాలు వర్తమానాన్ని గాయపరుస్తాయనేది చరిత్ర నేర్పే పాఠాలలో ఒకటి.- వ్యాసకర్త సంపాదకుడు, ప్రముఖ రచయిత- రాజ్‌మోహన్ గాంధీ -
రాజ్యాంగంపై చర్చ.. కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగిన నిర్మలా సీతారామన్
ఢిల్లీ: రాజ్యసభలో రాజ్యాంగంపై చర్చ సమయంలో మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, కాంగ్రెస్‌పై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ విమర్శలు గుప్పించారు. పౌర హక్కులను పరిమితం చేయడానికి కాంగ్రెస్ పదే పదే రాజ్యాంగాన్ని సవరించిందని ఆరోపించారు.రాజ్యసభలో నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. ‘గత ఏడు దశాబ్దాలలో మన రాజ్యాంగంలో అనేక సవరణలు జరిగాయి. నెహ్రూ తాత్కాలిక ప్రభుత్వంలో రాజ్యాంగంలో వాక్ స్వాతంత్య్రాన్ని అరికట్టేలా మొదటి సవరణ జరిగింది. మీడియా సంస్థలు ముఖ్యంగా రాజకీయంతో సంబంధం ఉన్న కీలక అంశాలపై లోతుగా విచారణ జరపరడాన్ని నెహ్రూ వ్యతిరేకించారని, పత్రికా స్వాతంత్య్రాన్ని తగ్గించేందుకు రాజ్యాంగాన్ని ఆమోదించిన ఏడాదిలోపే రాజ్యాంగాన్ని సవరించారని పేర్కొన్నారు.Constitution Debate | In Rajya Sabha, Union Finance Minister Nirmala Sitharaman says, "...The Congress party brazenly kept amending the Constitution to help the family and dynasty... These amendments were not to strengthen democracy but to protect those in power, the process was… pic.twitter.com/lSRyqS4FX5— ANI (@ANI) December 16, 2024 గత వారం లోక్‌సభలో రెండు రోజులపాటు జరిగిన వాడివేడి చర్చల తర్వాత ఇవాళ సీతారామన్ రాజ్యసభలో రాజ్యాంగంపై చర్చను ప్రారంభించారు . ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌పై ప్రతిపక్ష పార్టీలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ చర్చ జరిగింది.పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో రాజ్యాంగంపై చర్చ జరపాలని ప్రతిపక్షాలు కీలక డిమాండ్ చేశాయి. దీంతో పాటు అదానీ వివాదం, జార్జ్ సోరోస్ ఆరోపణలు , ఉపరాష్ట్రపతి,రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్‌పై విపక్షాలు అవిశ్వాస తీర్మానం నోటీసు వంటి అంశాలు ఉభయ సభల్లో గందరగోళానికి దారి తీశాయి. -
లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రసంగంపై దుమారం
-
సంవిధాన్.. సంఘ్ కా విధాన్ కాదు
న్యూఢిల్లీ: భారత రాజ్యాంగం అంటే సంఘ్ విధానం కాదన్న సంగతి ప్రధాని నరేంద్ర మోదీ అర్థం చేసుకోవడం లేదని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకగాంధీ వాద్రా అన్నారు. భారత్ కా సంవిధాన్ సంఘ్ కా విధాన్ కాదని తేల్చిచెప్పారు. ఎంపీగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా ఆమె శుక్రవారం లోక్‌సభలో 32 నిమిషాలపాటు హిందీ భాషలో మాట్లాడారు. రాజ్యాంగంపై జరిగిన చర్చలో పాల్గొన్నారు. బీజేపీపై విరుచుకుపడ్డారు. న్యాయం, ఐక్యత, భావప్రకటనా స్వేచ్చకు రాజ్యాంగం ఒక రక్షణ కవచమని ఉద్ఘాటించారు. అలాంటి మహోన్నత రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేయడానికి బీజేపీ ప్రభుత్వం గత పదేళ్లుగా ఎన్నో ప్రయత్నాలు చేసిందని ధ్వజమెత్తారు. ప్రియాంక ఇంకా ఏం మాట్లాడారంటే... నెహ్రూ పాత్రను ఎవరూ చెరిపేయలేరు ‘‘ఆర్థిక న్యాయానికి, రైతులకు, పేదలకు భూములు పంపిణీకి చేయడానికి మన రాజ్యాంగమే పునాది వేసింది. బీజేపీ నేతలు తరచుగా జవహర్లాల్ నెహ్రూను వేలెత్తి చూపుతున్నారు. వారి తప్పులను కప్పిపుచ్చుకోవడానికి నెహ్రూపై నిందలు వేస్తున్నారు. దేశం కోసం మీరేం చేస్తున్నారో చెప్పకుండా నెహ్రూను విమర్శిస్తే లాభం లేదు. గతంలో అది జరిగింది, ఇది జరిగింది అని బీజేపీ సభ్యుల విమర్శలు చేస్తున్నారు. రాజకీయ న్యాయం గురించి మాట్లాడుతున్నారు. డబ్బు బలంతో ప్రభుత్వాలను పడగొట్టింది మీరు కాదా? మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్‌లో రాజ్యాంగం అమలు కాలేదు. బీజేపీకి నిజంగా ధైర్యం ఉంటే బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు నిర్వహించాలి. అప్పుడు అసలు నిజం ఏమిటో బయటపడుతుంది. మోదీకి ప్రజల్లోకి వెళ్లే ధైర్యం లేదు గతంలో రాజులు మారువేషాల్లో ప్రజల్లోకి వెళ్లేవారని చదువుకున్నాం. తమ పనితీరు గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో రాజులు స్వయంగా తెలుసుకొనేవారట. తమపై ప్రజల ఆరోపణలు ఏమిటో గ్రహించేవారట. ఇప్పటి రాజు(నరేంద్ర మోదీ) వేషాలు మార్చేయడంలో ఆరితేరిపోయారు. కానీ, ప్రజల్లో వెళ్లే ధైర్యం గానీ, ఆరోపణలు వినే ధైర్యం గానీ ఆయనకు లేదు. మన ప్రధానమంత్రి రాజ్యాంగం ఎదుట తలవంచి నమస్కరించారు. రాజ్యాంగానికి నుదురు తాకించారు. సంభాల్, హథ్రాస్, మణిపూర్‌లో న్యాయం కోసం ఆక్రోశించినప్పుడు ఆయన మనసు చలించలేదు. ఆయన నుదుటిపై చిన్న ముడత కూడా పడలేదు. రాజ్యాంగాన్ని మోదీ అర్థం చేసుకోలేదు.భయాన్ని వ్యాప్తి చేసినవారు భయంతో బతుకుతున్నారు దేశంలో కుల గణన జరగాలన్నదే ప్రజల అభిమతం. అందుకోసం వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం దేశవ్యాప్తంగా కులగణన ప్రారంభించాలి. కేవలం ఒక్క బిలియనీర్(గౌతమ్ అదానీ) కోసం దేశ ప్రజలంతా కష్టాలు అనుభవించాలా? దేశంలో అసమానతలు నానాటికీ పెరిగిపోతున్నాయి. బ్రిటిష్ పాలనలో ఉన్నట్లుగానే నేడు భయం అంతటా ఆవహించింది. స్వాతంత్య్రం కోసం పోరాడిన గాం«దీజీ భావజాలం కలిగిన వ్యక్తులు ఒకవైపు, బ్రిటిషర్లతో అంటకాగిన భావజాలం కలిగిన వ్యక్తులు మరోవైపు ఉన్నారు. భయానికి ఒక లక్షణ ఉంది. భయాన్ని వ్యాప్తి చేసేవారే ఆదే భయానికి బాధితులవుతారు. ఇది సహజ న్యాయం. నేడు దేశంలో భయాన్ని వ్యాప్తి చేసినవారు అదే భయంతో బతుకున్నారు. చర్చకు, విమర్శకు భయపడుతున్నారు’’ అని ప్రియాంక అన్నారు. -
రాజ్యాంగం అంటే డాక్యుమెంట్ కాదు : ప్రధాని మోదీ
ఢిల్లీ : రాజ్యాంగం అంటే డాక్యుమెంట్ కాదు’ అని అన్నారు ప్రధాని మోదీ. సుప్రీంకోర్టులో దేశ 75వ రాజ్యాంగ వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ రాజ్యాంగంపై ప్రసంగించారు. రాజ్యాంగం అంటే డాక్యుమెంట్ కాదు. రాజ్యాంగం అంటే స్పూర్తి అని అన్నారు. Addressing a programme marking #75YearsOfConstitution at Supreme Court. https://t.co/l8orUdZV7Q— Narendra Modi (@narendramodi) November 26, 2024 -
రాజ్యాంగంలో సావర్కర్ స్వరం ఉందా?: రాహుల్ గాంధీ
సాక్షి, ఢిల్లీ: రాజ్యాంగం అనేది కేవలం ఒక పుస్తకం కాదు. అది వేల సంవత్సరాల భారతదేశ ఆలోచనల సమాహారమని చెప్పుకొచ్చారు లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. ఇదే సమయంలో తెలంగాణలో కులగణన చరిత్రాత్మక అడుగు అని చెప్పుకొచ్చారు.కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ వజ్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఢిల్లీలో కాంగ్రెస్ సంవిదాన్ రక్షక్ అభియాన్ కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క హాజరయ్యారు. ఈ సందర్బంగా ఎంపీ రాహుల్ గాంధీ మాట్లాడుతూ..‘రాజ్యాంగం అనేది కేవలం ఒక పుస్తకం కాదు. అది వేల సంవత్సరాల భారతదేశ ఆలోచనల సమాహారం. సత్యం, అహింసలతో ముడిపడి ఉంది. రాజ్యాంగంలో సావర్కర్ జీ స్వరం ఉందా? అని ప్రశ్నించారు. హింసకు గురిచేయాలి, మనుషులను చంపాలి, అబద్ధాలు చెప్పి ప్రభుత్వాన్ని నడపాలి అని ఎక్కడైనా రాసిందా? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.#WATCH | Delhi: At the Constitution Day program at Talkatora Stadium, Lok Sabha LoP & Congress MP Rahul Gandhi says, "Does it (Constitution) have Savarkar ji's voice? Is it written somewhere in it that violence should be used, people should be killed or that the govt should be… https://t.co/tYELczHI6E pic.twitter.com/vIaY4TRBXY— ANI (@ANI) November 26, 2024ఇదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణనపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాహుల్ మాట్లాడుతూ..‘తెలంగాణలో కులగణన చరిత్రాత్మక అడుగు. అక్కడ కుల గణన మొదలు పెట్టాం. కుల గణనలో అడిగే ప్రశ్నలు ఒక గదిలో కూర్చొని 15 మంది రూపొందించలేదు. కులగణనలో అడిగే ప్రశ్నలు తెలంగాణ ప్రజలే డిజైన్ చేశారు. ఇది ప్రజా ప్రక్రియ. భవిష్యత్‌లో కాంగ్రెస్ ఏ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినా కుల గణన చేస్తాం.బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఏం చేసినా సరే కుల గణన ద్వారా రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితి ఎత్తివేస్తాం. కుల గణన అనేది నేను పార్లమెంట్లో రాజ్యాంగంపై చేసిన హామీ. కుల గణనను పాస్ చేసి చూపిస్తా. అందరికీ సమాన హక్కు కోసం పోరాడుతున్నాం. కుల గణన ద్వారా ప్రజా సమాచారం తెలుస్తుంది. దీని ద్వారా పాలసీలు నిర్ణయించబడతాయి. ఐదు ఆరు శాతం ఉన్న వారు దేశాన్ని కంట్రోల్ చేస్తున్నారు అంటూ సంచలన కామెంట్స్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో కులగణన జరుగుతోంది. అన్ని వర్గాలకు సామాజిక న్యాయం కాంగ్రెస్‌తోనే సాధ్యం. అందుకే కులగణన సర్వే చేపట్టాం. దేశవ్యాప్తంగా కుల గణన అనేది కాంగ్రెస్ ఆధ్వర్యంలో సాధించే సామాజిక న్యాయం. ఇది మూడో ఉద్యమం. దేశ తొలి ప్రధానమంత్రి పండిట్ నెహ్రూ నుంచి ఇందిరా గాంధీ వరకు ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు, బ్యాంకుల జాతీయం వంటి కార్యక్రమాలతో సామాజిక న్యాయం మొదటి దశ సాధిస్తే... రాజీవ్ గాంధీ హయాంలో 18 ఏళ్లకే ఓటు హక్కు.. మండల్ కమిషన్ నివేదిక వంటి కార్యక్రమాలతో సామాజిక న్యాయం 2.0 పూర్తయింది. ఇప్పుడు సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీల ఆధ్వర్యంలో కుల గణనకు సామాజిక న్యాయం 3.0 ప్రారంభమైంది. సామాజిక న్యాయం కోసం రాహుల్ గాంధీ మహా యుద్ధం ప్రకటించారు. ఆయన బాటలో నడుస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే సామాజిక, ఆర్థిక, కుల సర్వే మొదలుపెట్టింది. ఇప్పటికే రాష్ట్రంలో సర్వే 92 శాతం పూర్తయింది.పదేళ్లుగా దేశంలో రాజ్యాంగం ప్రమాదంలో ఉందని, రాజ్యాంగ రక్షణకు రాహుల్ గాంధీ దేశ వ్యాప్త ఉద్యమం చేపట్టారు. రాహుల్ చేపపట్టిన ఉద్యమంలో ప్రజలు భాగస్వాములైనందునే మోదీ 400 వందల సీట్లు అడిగితే ప్రజలు కేవలం 240 సీట్లకు పరిమితం చేశారు. దేశవ్యాప్తంగా రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో మోదీని ప్రజలు ఓడిస్తున్నారు.. ఇందుకు వయనాడ్, నాందేడ్ లోక్‌సభ ఉప ఎన్నికల ఫలితాలే నిదర్శనం. మహారాష్ట్రలో బీజేపీ కూటమి గెలిస్తే, జార్ఖండ్‌లో కాంగ్రెస్ కూటమి గెలిచింది. రాజ్యాంగ రక్షణ ఉద్యమం కేవలం రాహుల్ గాంధీకి పరిమితమైన అంశంగా అనుకోవద్దు. మనమంతా అందులో భాగస్వాములు కావాలి. ప్రస్తుత పోరాటం రాజ్యాంగ రక్షకులు.. రాజ్యాంగ శత్రువుల మధ్యనే ఉందని గుర్తుంచుకోవాలి. మహాత్మా గాంధీ పరివార్ రాజ్యంగ రక్షణకు పూనుకుంటే.. మోదీజీ పరివార్ అంటే సంఘ్ పరివార్ రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్నారని విమర్శించారు.ఇక, అంతకుముందు వయనాడ్ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీని కలిసి సీఎం రేవంత్, భట్టి విక్రమార్క అభినందనలు తెలిపారు. -
రాజ్యాంగ నిర్మాతలకు వందనం
భారతీయ విలువలు, ఆదర్శాలను ప్రతిబింబించేలా పరమ పవిత్రమైన భారత రాజ్యాంగాన్నిరూపొందించుకుని, 1949 నవంబర్ 26 నాడు ఆమోదించుకున్న రోజు దేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చింది. ఆ రోజునే మనం ‘సంవిధాన్ దివస్’ (రాజ్యాంగ దినోత్సవం)గా జరుపుకొంటున్నాం. నేడు 75వ రాజ్యాంVýæ దినోత్సవం కావడం విశేషం. అయితే, రాజ్యాంగ నిర్మాణం చిన్న విషయం కాదు. సిద్ధాంత రాద్ధాంతాల సంఘర్షణ నుంచి వచ్చిన ఇది... ఒక భగవద్గీత, బైబిల్, ఖురాన్. భారతదేశ పురోగతి, ప్రజల సంక్షేమాలకు ఇది తోడ్పాటునందిస్తోంది. ఎప్పటికప్పుడు వ్యవస్థను పటిష్ఠపరుస్తూ ‘సజీవ పత్రం’గా నిరంతర మార్గదర్శనం చేస్తోంది.రాజ్యాంగ నిర్మాతల దూరదృష్టిభారతదేశ చరిత్రలో స్వాతంత్య్ర సిద్ధి ఓ ప్రత్యేకమైన సందర్భం. భారతీయుల భవిష్యత్తును నిర్దేశించిన రోజది. రాజకీయంగా స్వాతంత్య్రాన్ని పొందాం. కానీ, భారతీయ విలువలకు అనుగుణంగా స్వపరిపాలన జరగాలన్న బలమైన ఆకాంక్ష భారతీయుల్లో వ్యక్తమైంది. దీనికి ప్రతిరూపంగానే, భారతీయ విలువలు, ఆదర్శా లను ప్రతిబింబించేలా పరమ పవిత్రమైన భారత రాజ్యాంగాన్ని రూపొందించుకుని, 1949 నవంబర్ 26 నాడు ఆమోదించుకున్న రోజు దేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చింది.నాటి నుంచి గత 75 ఏళ్లుగా భారతదేశంలో మూలవిలువలు, సామాజికస్పృహలను ‘భారత రాజ్యాంగం’ సంరక్షిస్తోంది. మారుతున్న కాలానికి అను గుణంగా, ఎప్పటికప్పుడు వ్యవస్థను పటిష్ఠపరుస్తూ ‘సజీవ పత్రం’గా నిరంతర మార్గదర్శనం చేస్తోంది. భారతీయ ఆత్మను, అస్తిత్వాన్ని సంరక్షించడం అనే రెండు అంశాల అద్భుత సమ్మేళనంగా మన రాజ్యాంగం ముందుకు నడిపిస్తోంది. రాజ్యాంగ నిర్మాతల ఈ ముందుచూపే రాజ్యాంగ సభ చర్చల్లో ప్రతిబింబించింది.1949 సెప్టెంబర్ 18 నాడు భారత రాజ్యాంగ సభలో చర్చ సందర్భంగా... స్వాతంత్య్ర సమర యోధుడు, భారత జాతీయ కాంగ్రెస్ సభ్యుడు కల్లూరు సుబ్బారావు తన తొలి ప్రసంగంలో, రుగ్వేదంలో భారత్ అనే పదాన్ని వాడిన విషయాన్ని, వాయు పురాణంలో (45వ అధ్యాయం 75వ శ్లోకం) భారతదేశ సరిహద్దుల గురించి ఉన్న వివరణను తెలియజేశారు. ఇదంతు మాధ్యమం చిత్రం శుభాశుభ ఫలోదయం, ఉత్తరం యత్ సముద్రస్య హిమవన దక్షిణం చ యత్’... హిమాలయాల దక్షిణం వైపు, సముద్రానికి ఉత్తరం వైపున్న పవిత్ర భూమే భారతమాత అని అర్థం. భారత్ అనేది కేవలం ఒక పదం కాదు, వేలాది సంవత్సరాల ఘనమైన వార సత్వ విలువలకు సజీవ రూపం అని ఈ మాటలు స్పష్టం చేస్తున్నాయి. ఆనాటి కాంగ్రెస్ సిద్ధాంతంలో, నేటి కాంగ్రెస్ ఆలోచనలో నక్కకూ నాకలోకానికీ ఉన్నంత తేడా ఉంది. వారు తరచుగా భారతదేశపు నాగరిక విలువలను అవమానించేలా, దేశాన్ని ‘నెగోషి యేటెడ్ సెటిల్మెంట్’ అని వ్యాఖ్యానిస్తున్నారు.1948 నవంబర్ 4న రాజ్యాంగ సభ చర్చలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మాట్లాడుతూ... భారతదేశం ఓ అవిభాజ్య భూఖండం అనీ, దేశం పరిపాలనా సౌలభ్యం కొరకు వేర్వేరు రాష్ట్రాలుగా విభజించబడి నప్పటికీ... ఈ దేశ అధికారం ఒకే మూలం నుంచి ఉద్భవిస్తుందని పేర్కొన్నారు. రాజ్యాంగ పీఠికలో ‘సోషలిస్ట్’ అనే పదాన్ని చేర్చాలన్న చర్చను అంబేడ్కర్ వ్యతిరేకించారు. ‘రాజ్యా నికి సంబంధించిన విధానం ఎలా ఉండాలి? సామాజిక, ఆర్థిక కోణంలో సమాజ నిర్వహణ ఎలా జరగాలి? వంటి అంశాలను సమయానుగుణంగా ప్రజలే నిర్ణయించుకోవాలి’ అని స్పష్టం చేశారు. రేపటి రోజు సోషలిజం కంటే మంచి విధానాలు వస్తే, వాటిని రాజ్యాంగంలో చేర్చుకుని, అమలుచేసుకునే అవకాశం రానున్న తరాలకు ఉండాలనేది అంబేడ్కర్ భావన. ఈ సౌలభ్య విధానాన్ని సద్వినియోగం చేసుకుంటూ... 1991లో లైసెన్స్ రాజ్ నుంచి... ఉదారవాద, సరళీకృత ఆర్థిక వ్యవస్థకు బాటలు పడ్డాయి. నాడు రాజ్యాంగ నిర్మాతలు రాజ్యాంగ సభ వేదిక ద్వారా చేసిన సమగ్రమైన చర్చలు... నేటికీ వివిధఅంశాలపై లోతైన అవగాహనను కల్పిస్తున్నాయి. రాజ్యాంగ సభలో అంబేడ్కర్ మాట్లాడుతూ... రాజ్యాంగంలో పేర్కొన్నట్లుగా సౌభ్రాతృత్వం, సమానత్వం పదాలు సరిగ్గా అమలై అందరికీ అభివృద్ధి ఫలాలు అందినపుడే, నిజమైన జాతిగా మనం పురోగతి సాధించినట్లుగా భావించాలన్నారు. 2014లో ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత అంత్యోదయ నినాదంతో, ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’ విధానంతో సమగ్ర సాధికారత కోసం పనిచేస్తున్నారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా నిలిచే క్రమంలో... సాధికారత అనేది ప్రతి పౌరుడి సహజమైన జీవన విధానంగా, భారతదేశ పురోగతిలో అంతర్లీనంగా ఉన్నటువంటి అంశంగా మారిపోయింది.ముద్ర యోజన, స్టార్టప్ ఇండియా వంటి కార్యక్రమాలు, స్వచ్ఛభారత్, బేటీ బచావో–బేటీ పఢావోవంటి సామాజిక ఉద్యమాలు దేశం నడుస్తున్న దిశను పునర్నిర్వచించాయి. ప్రభుత్వ నియంత్రణలో ఉండే సోషలిజం అనే భావన నుంచి ఏనాడో బయటకు వచ్చి, అందరి సంక్షేమం కోసం సామాజిక న్యాయమనే నినాదంతో ప్రతి ఒక్కరికీ విస్తృతమైన అవకాశాలు కల్పిస్తున్నాం. వందకుపైగా యూనికార్న్స్ (1 బిలి యన్‌కు పైగా పెట్టుబడులున్న కంపెనీలు)తో భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థగా అవతరించింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ తయారీదారుగా నిలిచింది. వ్యాక్సిన్ సప్లయ్, రక్షణ రంగ ఉత్పత్తిలో గ్లోబల్ లీడర్‌గా మన్ననలు అందుకుంటోంది. దేశంలో సెమీకండక్టర్ల తయారీ ఉద్యమం ఊపందుకుంది. ఫి¯Œ టెక్, హెల్త్ టెక్ సంస్థలు అంతర్జాతీయ వేదికపై భారత గౌరవాన్ని ఇనుమ డింపజేస్తున్నాయి. త్వరలోనే ప్రపంచ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించబోతోంది.దేశం ఇలా అన్ని రంగాల్లో అగ్రదేశాల సరసన నిలుస్తున్న సందర్భంలో, భారతీయుల సామర్థ్యంపై విశ్వాసాన్ని ఉంచకుండా, సమాజాన్ని విభజించేందుకు, సంపదను అందరికీ పంచేవిషయంలో అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నాలు జరగడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వెళ్లడమే అవుతుంది. ప్రతి భారతీ యుడి శక్తి సామర్థ్యాలపై విశ్వాసం ఉంచి, అందరికీ కలుపుకొని ముందుకెళ్తూ, వికసిత భారత లక్ష్యాలను చేరుకోవాలని సంకల్పించుకున్న ‘అమృత కాల’మిది. వ్యక్తులకు సాధికారత కల్పించినపుడే, సుసంపన్నమైన దేశంగా ఎదగడానికి, ప్రపంచానికి మరోసారి విశ్వగురుగా మారడానికి విçస్తృత అవకాశాలుంటాయి. -జి. కిషన్ రెడ్డి, వ్యాసకర్త కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి; బీజేపీ తెలంగాణ అధ్యక్షుడుమన రాజ్యాంగ నిర్మాతలుభారత రాజ్యాంగ నిర్మాణం పూర్తయిన రోజు నవంబర్ 26. కొన్ని అత్యవస రమైన అధికరణాల అమలు వెంటనే మొదలైంది. రెండు నెలల తరువాత పూర్తి రాజ్యాంగం అమలులోకి వచ్చింది. అదే గణతంత్ర దినోత్సవం. రాజ్యాంగ నిర్మాణం చిన్న విషయం కాదు. సిద్ధాంత రాద్ధాంతాల సంఘర్షణ నుంచి వచ్చిన ఇదొక భగవద్గీత, బైబిల్, ఖురాన్. దీని రచనలో భాగస్వాములైన మహానుభావు లను తలుచుకోవడం మన కర్తవ్యం.బాబాసాహెబ్ బి.ఆర్.అంబేడ్కర్: అధికరణం 32 లేకపోతే రాజ్యాంగమే లేదు. నాయకుల నియంతృత్వం తప్ప స్వాతంత్య్రం, ప్రజాస్వామ్యం వంటి మాటలే ఉండక పోయేవి. కీలకమైన ఆర్టికల్ 32 రాసింది అంబేడ్కర్. ఆయన ఒక న్యాయవేత్త, ఆర్థికవేత్త, రాజనీతిజ్ఞుడు, సంఘ సంస్కర్త. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత మొదటి న్యాయశాఖ మంత్రి. పౌర హక్కులకు కీలకమైన ఆర్టికల్ 32 మొత్తం రాజ్యాంగాన్ని బతికించే శక్తి కలిగినది. ఏ అన్యాయం జరిగినా నేరుగా సుప్రీంకోర్టునే అడిగే హక్కును ఇచ్చిన ఆర్టికల్ ఇది. ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్)కు పునాది ఇదే. ‘‘భారత రాజ్యాంగంలో అత్యంత ముఖ్యమైన ఆర్టికల్ ఏదని అడిగితే, ‘ఆర్టికల్ 32’ అని చెబుతాను. అది లేకుండా ఈ రాజ్యాంగం శూన్యం అవుతుంది... ఇది రాజ్యాంగ ఆత్మ, హృదయంవంటిది’’ అని అంబేడ్కర్ 1948 డిసెంబర్ 9న జరిగిన రాజ్యాంగ సభ చర్చల్లో ప్రకటించారు.అసమానతలను, వివక్షను అంతం చేసేందుకు అంబేడ్కర్ రాజ్యాంగ రూపకల్పనలో తానూ ఉండాలని అనుకున్నారు. మొత్తం భారత రాజ్యాంగ సంవిధానా నికి నిర్మాత అయినారు. 8 పనిగంటలు మొదలుకొని, ప్రసూతి సెలవుల వరకు కారణం ఆయనే. సమాన హక్కులు, సమాన అవకాశాలు అంబేడ్కర్ సిద్ధాంతం. భారతీయ రిజర్వ్ బ్యాంకు స్థాపనలో అంబేడ్కర్ ఆర్థిక సిద్ధాంతాలు కీలకపాత్ర పోషించాయి.దేవీ ప్రసాద్ ఖైతాన్: న్యాయవాది, స్వాతంత్య్ర సమర యోధుడు, రాజకీయవేత్త. కలకత్తా ప్రెసిడెన్సీ కాలేజీలో విద్యార్థి. ‘ఖైతాన్–కో’ లా ఫర్మ్ వ్యవస్థాప కులు. 1925లో ఏర్పడిన ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సహ వ్యవస్థాపకులు. రచనా కమిటీ సభ్యు డిగా కొద్దికాలం పనిచేశారు. 1948లో మరణించడం వల్ల ఆ స్థానంలో టీటీ కృష్ణమాచారి వచ్చారు.సర్ సయ్యద్ మొహమ్మద్ సాదుల్లా: న్యాయవాది, అస్సాం ముస్లిం లీగ్ నాయకుడు. 1936లో బ్రిటిష్ ఇండియాలో కాంగ్రెసేతర పార్టీలతో కూటమి ఏర్పాటు చేసి అస్సాంకు తొలి ముఖ్యమంత్రి అయ్యారు. ఈశాన్య రాష్ట్రాల నుంచి రాజ్యాంVýæ ముసాయిదా రూపకల్పన కమిటీకి ఎన్నికైన ఒకే ఒక్క సభ్యుడు. రాజ్యాంగ రచనలో పాలుపంచుకున్న ఒకే ఒక్క ముస్లిం లీగ్ సభ్యుడు కూడా. అస్సాం ఆర్థిక స్థిరత్వం, మైనారిటీ హక్కులను రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు.సర్ అల్లాడి కృష్ణస్వామి అయ్యర్: తమిళ కుటుంబానికి చెందిన అయ్యర్ నెల్లూరులో పుట్టారు. ఈ ప్రాంతం అప్పట్లో మద్రాస్ స్టేట్‌లో ఉండేది. ఆయన అపారమైన జ్ఞానం కలిగిన గొప్పవాడని అంబేడ్కర్ స్వయంగా అంగీకరించారు. రాజ్యాంగంలో చేర్చవలసిన పౌరసత్వ హక్కులు, ప్రాథమిక హక్కుల గురించి బలంగా వాదించారు. ‘మన విధానాలు, నిబద్ధత విషయంలో జాతి, మతం లేదా ఇతర ప్రాతిపదికన వ్యక్తుల మధ్య లేదా వర్గాల మధ్య భేదాలు చూపకూడ’దని లౌకికరాజ్యం ఎందుకు అవసరమో చెప్పారు. సర్ బెనెగల్ నర్సింగ రావ్: మంగళూరు(కర్ణాటక)లో జన్మించిన బీఎన్ రావు బ్రిటిష్ ప్రభుత్వంలోఇండియన్ సివిల్ సర్వెంట్‌గా చేరారు. అనేక కోర్టులలో జడ్జిగా పనిచేశారు. బ్రిటిష్ ప్రభుత్వంలో పలు కమిటీలలో, పలు ముసాయిదాల తయారీలో ప్రముఖమైన వ్యక్తి. అంతర్జాతీయ న్యాయస్థానంలో జడ్జిగా, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారతదేశ ప్రతినిధిగా ఉన్నారు. ఇప్పటికీ కొందరు భారత రాజ్యాంగాన్ని రచించింది అంబేడ్కర్ కాదనీ, బి.ఎన్.రావ్ అనీ వాదించే వాళ్లున్నారు. ఆయన బ్రిటిష్ పాలనలో తయారు చేసిన ‘భారత ప్రభుత్వ చట్టం 1935’ రాజ్యాంగానికి మూల రూపమని అనేవారూ ఉంటారు.సర్ బ్రజేంద్రలాల్ మిట్టర్: పశ్చిమ బెంగాల్‌కి చెందిన మిట్టర్ బరోడా దివా¯Œ గా వ్యవహరించారు. భారత్ రాజ్యాంగ రచనలో భాగంగా, దేశంలో సంస్థానాలు విలీనం కావడానికి నియమాలు, దేశ, రాష్ట్ర, జిల్లా పాలనకు సంబంధించిన అంశాలపై పనిచేశారు. (అనారోగ్యం కారణంగా మిట్టర్ రాజీనామా చేయ డంతో ఆ స్థానంలో ఎన్.మాధవరావు వచ్చారు.)కె.ఎమ్. మున్షీ: కన్నయ్యలాల్ మాణిక్‌లాల్ గుజరాత్లో జన్మించారు. న్యాయవాది, జాతీయోద్యమ నాయకుడు. ఘనశ్యామ్ వ్యాస్ కలంపేరుతో అద్భుతమైన రచనలు చేసిన వ్యక్తి. 1938లో గాంధీ సహాయంతో ‘భారతీయ విద్యా భవన్’ స్థాపించారు. ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో చురు కుగా పాల్గొన్నారు. రాజ్యాంగ రచనలో భాగంగా ప్రాథమిక హక్కులు, పౌరసత్వం, మైనారిటీ హక్కుల చర్చల్లో కీలక పాత్ర పోషించారు.సర్ నరసింహ గోపాలస్వామి అయ్యంగార్: ఆయన్ని ఎన్.జి.ఏ. అని పిలిచేవారు. మద్రాస్ నుంచి సివిల్ అధికారిగా పనిచేశారు. 1937లో జమ్మూ కశ్మీర్ ప్రధాన మంత్రిగా వ్యవహరించారు. వాక్ స్వాత్రంత్య్రం, భూములు సేకరిస్తే నష్టపరిహారాలు ఇవ్వడం, శాసనసభతో మరో మండలి ఉండాలని వాదించిన వారు. ఆంగ్లేయ రాజులు ఇచ్చిన గొప్ప పురస్కారాలను తిరస్కరించిన దేశభక్తుడు. కశ్మీర్‌కు సంబంధించి ఆర్టికల్ 370 రచించిన ముఖ్యుడు.ఎన్. మాధవ్ రావ్: మైసూర్ సివిల్ అధికారి. తరువాత ఆ రాజ్యానికి దివాన్ అయ్యారు. ఒరిస్సానుంచి సంస్థాన రాజ్యాల పక్షాన రాజ్యాంగ సభలో ప్రతినిధులైనారు. గ్రామపంచాయతీలు, సమాఖ్యలగురించి అడిగేవారు. ఇంక ఎంతోమంది మహానుభావులు రాజ్యాంగ నిర్మాణంలో పనిచేశారు. అందులో జగ్జీవన్ రామ్, జిరోమ్ డిసౌజా, మృదులా సారాభాయ్ వంటి పెద్దలున్నారు. వారందరికీ వందనాలు!మాడభూషి శ్రీధర్ , వ్యాసకర్త మహేంద్ర యూనివర్సిటీ ‘స్కూల్ ఆఫ్ లా’లో ప్రొఫెసర్ -
మా మకుటం... సత్యమేవ జయతే!
మీరు గుడ్లురిమితే గుండెలు జారిపోవడానికి ఇక్కడ భీరువులెవరూ లేరు. మీరంతటి వీర వరేణ్యులు కూడా కారు! మీరు కళ్లెర్రజేస్తే కాలి బూడిదయ్యే కొంగలేమీ ఇక్కడ లేవు. తమరు తపోధనులైన కౌశికులు ఎంతమాత్రం కారు. మీ అధికారం సర్వంసహాధికారం కాదు. మీరు థామస్ హాబ్స్ ప్రతిపాదించిన ‘లెవయధాన్’ వంటివారు కారు. భారత రాజ్యాంగం ప్రసాదించిన పరిమితులతో కూడిన అధికారం మాత్రమే మీ చేతిలో ఉన్నది. అదే రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కులు మాకు అండగా ఉన్నవి. ఆ హక్కుల్ని రక్షించడానికి న్యాయస్థానాలు దన్నుగా ఉన్నవి.రెండు వారాల కిందనే సర్వోన్నత న్యాయస్థానం ఏం చెప్పిందో ఒకసారి గమనించండి. అచ్చం మీ సర్కారుకు మల్లేనే యూపీలోని యోగీబాబా సర్కార్ కూడా ఓ జర్నలిస్టుపై పోలీస్ స్టేషన్లో కేసు పెట్టించింది. కేసు సుప్రీంకోర్టు తలుపు తట్టింది. జస్టిస్ హృషీకేశ్ రాయ్, జస్టిస్ ఎస్విఎన్ భట్టిలతో కూడిన ధర్మాసనం చేసిన వ్యాఖ్యానమేమిటో మళ్లీ ఒకసారి పరిశీలించండి. ‘‘ప్రజల భావ ప్రకటనా స్వాతంత్య్రాన్ని ప్రజాస్వామ్య దేశాలు గౌరవించాలి. భారత రాజ్యాంగంలోని 19 (1) (ఏ) అధికరణం పాత్రికేయుల హక్కులకు రక్షణ కల్పి స్తున్నది. పాత్రికేయుడు రాసిన వార్తా కథనం విమర్శనాత్మకంగా ఉన్నదనే నెపంతో అతడిపై క్రిమినల్ కేసులు పెట్టడానికి వీల్లేదు.’’సర్వోన్నత న్యాయస్థానం ఇంత స్పష్టంగా తేటతెల్లం చేసిన అంశంపై ఏపీ ప్రభుత్వ యంత్రాంగం కళ్లు మూసుకొని వ్యవహరిస్తున్నది. విజయవాడలో వరద సహాయక చర్యల్లో జరిగిన అవకతవకలను ‘సాక్షి’ పత్రిక ఎత్తిచూపింది. బాధ్యత గల ఫోర్త్ ఎస్టేట్‌గా అది దాని విద్యుక్త ధర్మం. ‘ముంపులోనూ మేసేశారు’ అనే శీర్షికతో ఏలినవారి ఆగ్రహానికి గురైన కథనాన్ని ప్రచురించాము. దానికి కట్టుబడి ఉన్నాము. మీ ప్రభుత్వ అధి కార నివేదికల ఆధారంగానే మేమా కథనాన్ని రాశాము. మేము స్వయంగా వండి వార్చిన కథనం కాదు. వరద సహాయ కార్య క్రమాల సమీక్ష పేరుతో ముఖ్యమంత్రి నిర్వహించిన సమావేశం సందర్భంగా రెవెన్యూ శాఖ ఇచ్చిన ప్రెజెంటేషన్‌లో పేర్కొన్న విషయాల్నే ‘సాక్షి’ ఉటంకించింది.కోటిమంది భోజనాల కోసం 368 కోట్లు ఖర్చు చేశామనీ, అగ్గిపెట్టెలు, కొవ్వొత్తులు వగైరాలకు 23 కోట్లు ఖర్చయ్యాయనీ, వాటర్ బాటిల్స్‌కు 26 కోట్లు వెచ్చించామనీ, మొత్తం 534 కోట్లు పునరావాస సహాయ శిబిరం కోసం ఖర్చయినట్టు ఆ ప్రెజెంటేషన్‌లో ఉన్నది. ఈ లెక్కల్లోని అనౌచిత్యాన్ని ప్రజలు ప్రశ్నించారు. ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. సీపీఎం నేత బాబూ రావు ప్రజల సమక్షంలోనే ప్రభుత్వాన్ని నిలదీసిన వీడియో విస్తృతంగా సర్క్యులేషన్లో ఉన్నది. సరిగ్గా ఆ గణాంకాలనే పేర్కొంటూ, అవే ప్రశ్నల్ని ‘సాక్షి’ కూడా వేసింది.రెవెన్యూ శాఖ అధికారులు ప్రజంటేషన్ ఇచ్చినప్పుడు ఇవే అంకెల్ని చూసిన పెద్దలకు కోపం రాలేదు. జనంలో చర్చ జరుగు తున్నప్పుడు కూడా అంత కోపం రాలేదు. కానీ, ‘సాక్షి’లో కథనం రాగానే సుర్రున ప్రకోపించింది. ఆ కథనాన్ని ఖండ ఖండాలుగా ఖండించే బాధ్యతను ఇద్దరు మంత్రులకు అప్పగించారు. ఆ కార్యనిర్వహణ వారి వశం కాలేదు. వెంటనే కూటమిలోని ఒకటో నెంబరు పత్రిక రంగంలోకి దిగింది. అబ్బెబ్బే... సహాయ పునరావాస కార్యక్రమాలకు 139 కోట్లు మాత్రమే ఖర్చయింది. 534 కోట్లు అనే మాట అబద్ధమని ఆ పత్రిక తేల్చేసింది. అదే నిజమైతే కేంద్ర పరిశీలక బృందానికి రాష్ట్ర ప్రభుత్వం అందజేసిన నివేదికలో రిలీఫ్ క్యాంప్ ఖర్చు పేరుతో 534 కోట్లు ఎందుకు చూపెట్టారు? సదరు పత్రిక ఈ నివేదికను చూడలేదా? ప్రజల కళ్లకు గంతలు కట్టడ మనేది వారికి పెన్నుతో పెట్టిన విద్యగా చాలాసార్లు నిరూపణ అయింది.ఏ కొద్దిమందికో పులిహోర పొట్లాలు పంచి, కోటిమందికి పైగా పంచినట్టు లెక్క చూపడమేమిటి? ఆ పులిహోరకు ఒక్కో ప్లేటుకు 370 రూపాయల ఖర్చేమిటి? ఇటువంటి దగుల్బాజీ లెక్కలు చూసిన జనంలో ప్రభుత్వ ప్రతిష్ఠ బాగా పలుచబారింది. ఈ ప్రభుత్వ వ్యతిరేక వరదను ప్రతిపక్షంపైకి మళ్లించాలనే ఉద్దేశంతోనే తిరుపతి లడ్డూ వివా దాన్ని ముఖ్యమంత్రి తెరపైకి తెచ్చారనే అభిప్రాయం రాజకీయ పరిశీలకుల్లో అప్పుడే పొడసూపింది. కానీ, ఈ డైవర్షన్ స్కీమ్ ఫలితమివ్వకపోగా సర్కారుపైకే ఎదురు తిరిగింది.ఐదేళ్లు పరిపాలించడం కోసం గద్దెనెక్కిన ప్రభుత్వం ఐదు మాసాలు కూడా నిండకముందే ఒక ‘విఫల ప్రభుత్వం’గా ముద్ర వేయించుకోవడం ఒక అరుదైన సందర్భం. ఇటువంటి అప్రతిష్ఠను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూటగట్టుకున్నది. ఏ గడ్డి కరిచైనా అధికారంలోకి రావాలనే సంకల్పంతోనే ఎన్డీఏ కూటమి అలవికాని హామీలను ఇచ్చిందనే అభిప్రాయం ఆ రోజుల్లోనే రాజకీయ వర్గాల్లో వ్యక్తమైంది. అందువల్లనే మేనిఫెస్టో విడుదల రోజున బీజేపీ ప్రతినిధి దాని ప్రతిని పట్టుకోవడానికి నిరాకరించారనే వార్తలు వచ్చాయి. అటువంటి అంచనాలకు తగి నట్టుగానే ఈ నాలుగు నెలల పైచిలుకు కాలాన్ని కూటమి సర్కార్ నెట్టుకొచ్చింది.మేనిఫెస్టోలో హైలైట్‌గా వారు చెప్పుకున్న ‘సూపర్ సిక్స్’లో ఒక్క పథకం జోలికి ప్రభుత్వం వెళ్లలేకపోయింది. ఖజానాపై పెద్దగా భారం పడని ఉచిత గ్యాస్ సిలిండర్ల (ఏడాదికి మూడు) పంపిణీని ఈ దీపావళి నుంచి ప్రారంభించబోతున్నట్టు ప్రకటించారు. మిగిలిన ఐదు పథకాల అమలు సంగతి దేవుడెరుగు. ఫలానా రోజు నుంచి వాటిని ప్రారంభిస్తామనే ఒక కనీస షెడ్యూల్‌ను కూడా ప్రభుత్వం విడుదల చేయలేకపోయింది.బుడమేరు వరదల సందర్భంగా ప్రభుత్వ నిష్క్రియా పరత్వం కొట్టొచ్చినట్టు కనబడింది. ముందుచూపు లేకపోవడం, వ్యూహరాహిత్యం వల్ల నలభై నిండు ప్రాణాలను బలి పెట్టవలసి వచ్చింది. మూడు లక్షలమంది తమ సర్వస్వాన్ని కోల్పోయారు. తమ యావజ్జీవిత ఆర్జితాన్ని గంగపాలు చేసు కోవలసి వచ్చింది. వారి జీవిత చక్రాన్ని వెనక్కు తిప్పడం సాధ్యమయ్యే పనేనా? ముందుగా హెచ్చరికలు జారీ చేసి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి, వారి విలువైన సామగ్రిని భద్రపరచుకునేందుకు దోహదపడి వుంటే ఇంత దుఃస్థితి ఏర్పడేది కాదు. అందుకే దీన్ని ‘విఫల ప్రభుత్వం’అంటున్నారు. రెగ్యులర్ బడ్జెట్‌ను కూడా ప్రవేశపెట్టలేక ఇంత కాలం నెట్టుకొచ్చిన ఏకైక ప్రభుత్వం కూడా ఈ దేశంలో ఏపీ కూటమి ప్రభుత్వమే! నాలుగున్నర నెలల కాలంలో 32 వేల కోట్లు అప్పు తెచ్చినందుకు, ప్రపంచ బ్యాంకు వాళ్లు నేడో రేపో విడుదల చేస్తారని చకోర పక్షుల్లా 15 వేల కోట్ల అప్పు కోసం ఎదురు చూస్తున్నందుకు ‘అప్పుల సర్కార్’ అని కూడా అనవచ్చు. ఇసుక రీచుల్లో, మద్యం షాపుల వేలాల్లో, ఉద్యోగుల బదిలీల్లో లంచాల దుర్గంధాన్ని వెదజల్లుతున్నందుకు ‘అవినీతి సర్కా ర్’గా పరిగణించాలి. తమ సంఖ్యా బలంపై ఆధారపడిన ప్రభుత్వమే కేంద్రంలో ఉన్నా, ఆ సర్కార్‌లో తమకూ భాగ మున్నా సొంత రాష్ట్రానికి కించిత్ మేలును కూడా చేసుకోలేక పోయినందుకు ‘అసమర్థ ప్రభుత్వం’గా భావించాలి.సాధారణంగా కొత్త ప్రభుత్వాలపై ఇంత త్వరగా జనంలో వ్యతిరేకత వ్యక్తం కాదు. ఏపీ పరిణామం మాత్రం అసాధా రణమైనదే. ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత బహిరంగంగా కనిపి స్తున్నది. కొత్త సర్కార్ తన హామీలు అమలు చేయకపోగా, జగన్ సర్కార్ అందిస్తున్న పథకాలను చేజార్చుకొని మోస పోయామన్న ఆవేదన ప్రజల్లో కనిపిస్తున్నది. హామీలు, స్కీముల సంగతి పక్కనబెట్టినా సాధారణ పరిపాలన, శాంతి భద్రతలు కూడా దిగజారాయి. గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టిన విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలను కొత్త ప్రభుత్వం గాలికొదిలేసింది. గ్రామీణ ఆరోగ్యం పడకేసింది. ప్రభుత్వ స్కూళ్ల నుంచి మళ్లీ ప్రైవేట్ బడులకు విద్యార్థుల వలస మొదలైంది. ఐదేళ్ల తర్వాత ఎరువుల కోసం, విత్తనాల కోసం రైతులు క్యూలైన్లలో నిలబడవలసి రావడాన్ని చూస్తున్నాము. ఇటువంటి అనేక కారణాలు ప్రజల్లో తీవ్ర అసంతృప్తికి దారితీస్తున్నాయి.క్షేత్రస్థాయిలో జరుగుతున్న వాస్తవాలన్నీ బయటికొస్తే అసంతృప్తి మరింత పరివ్యాప్తమవుతుంది. అందుకే మాట వినని మీడియాను దండోపాయంతో దారిలోకి తెచ్చుకోవాలని భావిస్తున్నట్టుంది. ఆ ఉపాయంతోనే ‘సాక్షి’ మీద విజయవాడ పోలీస్ స్టేషన్లో ఒక అక్రమ కేసును బనాయించారు. మీడియాలో వచ్చిన వార్తలపై అభ్యంతరాలు ఉండటంలో తప్పులేదు. దాని మీద వివరణ ఇవ్వవచ్చు. దాన్ని ప్రచురించక పోతే అప్పుడు న్యాయస్థానానికి వెళ్లడం సదరు వ్యక్తులు లేదా వ్యవస్థలు చేయవలసిన పని. కానీ ఎకాయెకిన పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ చేయడం భావ వ్యక్తీకరణ హక్కుపై జరిగిన దాడిగానే పరిగణిస్తారు. రోజులు గడుస్తున్నకొద్దీ పరిణతి సాధించవలసిన ప్రజాస్వామ్యంలో ఇటువంటి దండనాథులు తలెత్తడం ఒక విషాదం.‘‘నీ అభిప్రాయంతో నేను ఏకీభవించకపోవచ్చు. కానీ,నీ అభిప్రాయం వెల్లడించే హక్కు కోసం నా ప్రాణాలైనా ఇస్తా’’ అనేది మూడు శతాబ్దాల కిందటి ఫ్రెంచ్ ప్రజాస్వామిక నినాదం. ఇంత చరిత్ర ఉన్నది కనుకనే ప్రజాస్వామిక ‘హక్కు’ను ఏ పాలకుడూ చిరకాలం అణచిపెట్టి ఉంచలేడు. ‘‘కుటిలాత్ముల కూటమికొక త్రుటికాలపు విజయమొస్తే, విశ్వసృష్టి పరిణామం విచ్ఛిన్నం అవుతుందా?’’ అన్నారు గుంటూరు శేషేంద్రశర్మ. ఏమీ కాదు! ఈ దాదాగిరి త్రుటికాలమే. అక్రమ కేసులకు భయ పడేది లేదు. ప్రజల పక్షాన నిలబడకుండా కాడి వదిలేసేదీ లేదు. నిశ్చయంగా, నిర్భయంగా జనం గుండె గొంతుకై ‘సాక్షి’ ప్రతిధ్వనిస్తుంది. ‘సాక్షి’ పత్రిక మీద కనిపించే మకుటమే ‘సత్యమేవ జయతే’!వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
జాతీయవాదమా? జాతీయోన్మాదమా?
ఇవాళ వ్యక్తులుగా పౌరులూ, సమాఖ్యలో భాగంగా ఉన్న రాష్ట్రాలూ తమ హక్కులను కోల్పోయే పరిస్థితి కనిపిస్తోంది. జాతీయవాదం పేరుతో జాతీయోన్మాదాన్ని పాలకులు ప్రేరేపిస్తున్నారు. భిన్నాభిప్రాయాలను దేశ వ్యతిరేకమైనవిగా ముద్ర వేస్తున్నారు.రాజకీయ వ్యతిరేకతను, పౌర సమాజంలో భిన్నాభిప్రాయాలను కలిగివుండి, పాలనను విమర్శించే ప్రతి ఒక్కరినీ ప్రస్తుత భారత పాలక వ్యవస్థ తరచుగా దేశ వ్యతిరేకులుగా చిత్రీకరించింది. ఈ ద్వేషభావం... అసలు జాతీయవాదం అంటే ఏమిటి, నిజమైన జాతీయవాది ఎవరు అనే మౌలిక ప్రశ్నలను లేవనెత్తింది. జాతీయవాదం అనే పదం విభిన్న రాజకీయ తత్త్వశాస్త్రాల ద్వారా ప్రత్యేకంగా గుర్తించబడింది.జాతీయవాదంపై వలసవాద వ్యతిరేక దృక్పథం... కుల, మత, వర్గ, ప్రాంతీయ అనుబంధాలతో సంబంధం లేకుండా నిర్దిష్ట రాజకీయ భౌగోళిక ప్రాంతంలో నివసించే ప్రజలందరినీ తప్పనిసరిగా కలుపుతుంది. శక్తిమంతమైన వలస పాలకుల నుండి భార తదేశం విముక్తి పొందేందుకు అటువంటి జాతీయవాద దృక్పథం చాలా అవసరం. ఆ విధంగా, స్వాతంత్య్ర పోరాటంలో అందరినీ కలుపుకొని పోవడం వల్ల జాతీయవాదపు రాజ్యాంగ దార్శనికత అభివృద్ధి చెందింది. ఇతర సంకుచిత గుర్తింపుల కన్నా మిన్నగా అది పౌరుల ప్రాధాన్యాన్ని గుర్తిస్తుంది.మతం లేదా జాతి వంటి వివాదాస్పద పరిగణనలపై ఆధారపడిన జాతీయవాద విభజన దృక్పథం తన లోపలే ఒక శత్రువును కనుగొంటుంది. విభజించి పాలించే వలస రాజ్యాల ప్రాజెక్టును లక్ష్యంగా చేసుకున్న బ్రిటిష్ వలసవాద వారసత్వపు కమ్యూనల్ అవార్డు చరిత్ర దృష్ట్యా, భారతదేశంలోని మతపరమైన మెజారిటీ శక్తులు ఇప్పుడు ముస్లింలను లోపలి శత్రువుగా ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ముస్లిం, ముజ్రా, మంగళసూత్ర, మందిర్ వంటివి సార్వత్రిక ఎన్నికలలో అధికార పార్టీ విభజిత ఎన్నికల చర్చలో ఆధిపత్యం చలా యించాయి. కానీ, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, ఇతర జీవనోపాధి సమస్యలు దాని పాలనను సవాలు చేశాయి.జాతీయవాదపు వలసవాద వ్యతిరేక దృక్పథంలోని మరొక కోణం ఏమిటంటే... వైవిధ్యాన్ని వేడుకగా జరుపుకోవడమే! నిజానికి, భారత రాజ్యాంగం, దానిలోని అనేక నిబంధనలు, దేశ న్యాయశాస్త్రం అనేవి భిన్నత్వంలో ఏకత్వాన్ని ఎల్లప్పుడూ ఆధునిక భారత జాతీయవాదపు కొనసాగుతున్న ఇతివృత్తంగా సమర్థించాయి. దేశం దైవపరిపాలనచే నడుస్తోందనే దృష్టి కోణం ఉద్దేశపూర్వకంగా దేశం, దాని ప్రజల సజాతీయ దృక్పథాన్ని ప్రోత్సహించడం ద్వారా వైవిధ్యాన్ని అణిచివేస్తుంది. జాతీయతలోని అనేక ఉపజాతి విధేయతలు తప్పనిసరిగా పరస్పర విరుద్ధమైనవి కానప్పటికీ, వాస్తవానికి అవి పరి పూర్ణమైనవి అనే వాస్తవాన్ని గుర్తించడానికి ఇది నిరాకరిస్తుంది. ఉదాహరణకు, భాషాపరమైన గుర్తింపులు జాతీయ గుర్తింపుతో విభేదించాల్సిన అవసరం లేదు. స్వాతంత్య్ర పోరాటం భాషాప్రయుక్త రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ పోరా టాన్ని హృదయపూర్వకంగా స్వీకరించింది, దాని చట్టబద్ధ మైన ప్రజాస్వామ్య స్వభావాన్ని గుర్తించింది. కానీ, భిన్న త్వానికి విరుద్ధమైన వారు విస్తృతమైన జాతీయ గుర్తింపు పేరుతో సమాజంపై ఏకరూప దృక్పథాన్ని రుద్దడానికి ప్రయ త్నిస్తారు. ఒక దేశం – ఒకే మార్కెట్, ఒక దేశం – ఒకటే భాష, ఒక దేశం – ఒకేసారి ఎన్నికలు, ఒక దేశం – ఒకటే పన్ను అలాంటి అసహన ప్రయత్నాలకు ఉదాహరణలు. ప్రస్తుత పాలక జాతీయవాద కథనం ప్రజల సామాజిక, ఆర్థిక శ్రేయస్సుతో కూడిన చిహ్నాలతో దేశం గురించిన నైరూప్య ఆలోచనను స్పృహతో ప్రోత్సహిస్తుంది. సాంఘిక, ఆర్థిక అసమానతలను సాధారణ మనిషికి హాని కలిగించేలా చేస్తుంది. కార్పొరేట్ సంపదలో పెరుగుదలను అసహజమైన అసమానతలపై జాతీయ గర్వకారణంగా చూపుతుంది. ఈ దృక్పథం అంతిమంగా కులం, వర్గం, అటువంటి ఆధిపత్య ధోరణులన్నింటినీ శాశ్వతంగా కొనసాగించే లక్ష్యానికే ఉపయోగపడుతుంది.జాతీయవాదానికి సంబంధించి పైన పేర్కొన్న వక్రీకృత దృక్పథం స్వభావం ఏమిటంటే, ప్రక్రియ దిద్దు బాటును ప్రభావితం చేసే లక్ష్యంతో వాస్తవికతపై విమర్శనాత్మక ప్రశంసలను నిరోధిస్తూనే, గతం లేదా వర్తమానాన్ని విమర్శారహితంగా కీర్తించడం! అటువంటి విమర్శనాత్మక దృక్పథాన్ని వృత్తిపరమైన నిరాశా వాదంగా కొట్టివేయడం జరుగుతుంది. కానీ, ఇది యథాతథ స్థితిని మాత్రమే ప్రోత్సహిస్తుంది. దేశ పురోగతిని అడ్డుకుంటుంది. నిరంకుశ జాతీయవాద ఉద్దేశ్యం స్వార్థ ప్రయోజనాలను ప్రోత్సహించే లక్ష్యంతో ఉంది. అందు వల్ల, భారతదేశ నాగరికత వారసత్వంగా ఉన్న వాదనా విధానం అణచివేయబడింది. దేశద్రోహం వంటి ప్రాచీన చట్టాల బలిపీఠం వద్ద వాక్ స్వాతంత్య్రాన్ని త్యాగం చేశారు. భిన్నాభిప్రాయాలను దేశ వ్యతిరేకమైనవిగా ముద్ర వేస్తారు. పౌర హక్కులు, స్వేచ్ఛ వంటివి జాతీయవాద ప్రాజెక్టుకు సహించరానివిగా చిత్రీకరించబడ్డాయి. నిజమైన జాతీయవాదం దాని సొంత గుర్తింపును మాత్రమే ప్రోత్సహిస్తుంది, ఆత్మగౌరవాన్ని వేడుక చేసు కుంటుంది. కానీ, జాతీయోన్మాదం బలవంతంగా, అసంకల్పితంగా అటువంటి స్వీయ అహంకారాన్ని దాని పౌరులపై మోపుతుంది. అటువంటి జాతీయోన్మాదాన్ని ప్రశ్నించే ఎవరైనా దేశం పట్ల అసంతృప్తిని ప్రదర్శించే వ్యక్తిగా పరిగణించబడతారు. నిజానికి అసమ్మతి అనేది ప్రజాస్వామ్యంలో ఓ అంతర్భాగం. కానీ, మెజారిటీ ప్రాజెక్ట్‌ను వ్యతిరేకించే సామాజిక, రాజకీయ శక్తులు చట్టబద్ధమైన జాతీయ గర్వాన్ని తగినంతగా ప్రకటించనప్పుడు జాతీయోన్మాదం విశ్వసనీయతను పొందుతుంది. ఆధునిక భారతీయ జాతీయవాదాన్ని ప్రజాస్వామ్యం, భాష, మతపరమైన బహుళత్వం, వైవిధ్యం, సమాఖ్యవాదం, లౌకికవాదం, సమానత్వం, స్వేచ్ఛ, సామాజిక న్యాయం మొదలైన రాజ్యాంగ విలువలపై తిరుగులేని నిబద్ధతతో నిర్వచించాలి. అందువల్ల రాజ్యాంగ జాతీయవాదం ఆధునిక ప్రజాస్వామ్యాలలో అభివృద్ధి చెందిన పౌరసత్వ భావనపై కేంద్రీకృతమై ఉంది. దీనికి విరుద్ధంగా, విభజన గుర్తింపులపై ఆధారపడిన జాతీయవాదం... రాజ్యాంగవాదానికి వ్యతిరేక సిద్ధాంతం. అందువల్ల, మెజారిటీ గుర్తింపుపై ఆధారపడిన జాతీయవాద కథానాయకుడు రాజ్యాంగపు ప్రాథమిక నిర్మాణాన్ని ద్వేషిస్తాడు. అటువంటి మెజారిటీ జాతీయ వాదం అసంపూర్తిగా ఉన్న ప్రజాస్వామిక ప్రాజెక్టులో కొనసాగుతున్న సామాజిక దోష రేఖలను ఉపయోగించు కోవడం ద్వారా అభివృద్ధి చెందుతుంది.అంబేద్కర్ ‘రాజ్యాంగ నైతికత అనేది సహజమైన భావన కాదు, ఎవరికి వారు పెంపొందించుకోవాల్సినది’ అని గమనించారు. అందువల్ల, మెజారిటీ జాతీయవాదానికి వ్యతిరేకంగా పోరాటం కేవలం నైతిక లేదా నైతిక విమర్శ కాదు. రాజ్యాంగ ప్రజాస్వామ్యంలో నేటికీ కొనసాగుతున్న సామాజిక లోపాలను సరిదిద్దడానికి కఠిన ప్రయత్నం అవసరం. కొందరిని అతి శక్తిమంతుల్ని చేసే ఘనత వహించిన జాతీయవాదంపై తద్వారానే పోరాడ వచ్చు. కానీ జాతీయవాదపు లౌకిక, ఉదారవాద విమర్శ మెజారిటీ జాతీయవాద సాంస్కృతిక అంశాలపై దృష్టి పెడుతోంది. అసలు జాడ్యాన్ని విడిచిపెట్టి, దాని లక్షణాలపై మాత్రం ఇలాంటి పోరాటం చేస్తే, అది స్వీయ ఓటమినే మిగులుస్తుంది. దానికి బదులు అటువంటి వక్రీకృత జాతీయవాద ప్రపంచ దృక్పథానికి జవజీవాలను అందించే సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక దోష రేఖలకు వ్యతిరేకంగా నిరంతర పోరాటం సాగించడమే మార్గం. ప్రొ‘‘ కె నాగేశ్వర్ వ్యాసకర్త ప్రముఖ రాజకీయ, సామాజిక విశ్లేషకులు -
రాజ్యాంగ స్ఫూర్తే రణ దుందుభి
అంబేద్కర్‌ను తలుచుకునే ప్రతి సందర్భంలోనూ మనకు భారత రాజ్యాంగం తలపునకొస్తూనే ఉంటుంది. నాలుగు వేదాల్లోని సారమెల్లా మహాభారతంలో ఉన్నదని ప్రతీతి. మానవ హక్కులకు పట్టం కట్టిన ప్రతి చారిత్రక పత్రంలోని సారాంశమంతా మన రాజ్యాంగంలో ఉన్నది. ఎనిమిది శతాబ్దాల కిందటి ‘మాగ్నాకార్టా’ దగ్గరి నుంచి ఎనిమిది దశాబ్దాల నాటి ‘విశ్వజనీన మానవ హక్కుల ప్రకటన’ (యుఎన్) వరకు ఆయా కాలాల్లోని డిక్లరేషన్లు ప్రజాస్వామ్య వ్యవస్థలకు ప్రాణ ప్రతిష్ఠ చేశాయి. ఈ డిక్లరేషన్లన్నిటిలోకి నిస్సందేహంగా అగ్రగణ్యమైనది, అత్యున్నతమైనది భారత రాజ్యాంగం. మానవ హక్కుల కథా గమనంలో పంచమవేదంలా పుట్టిన మహాకావ్యం భారత రాజ్యాంగం. దేశంలో సాధారణ ఎన్నికల వడగాడ్పుల సందర్భం కూడా ఇది. రాజ్యాంగాన్ని మార్చడం అనే అంశంపై చెలరేగుతున్న వాదోపవాదాలు కూడా ఈ సందర్భాన్ని మరింత వేడెక్కిస్తున్నాయి. రెండేళ్ల కిందట కావచ్చు, అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా రాజ్యాంగాన్ని మార్చవలసిన అవసరముందని అభిప్రాయపడ్డారు. ప్రజలు ఆయనకా అవకాశం ఇవ్వలేదు. ఆయన్నే మార్చే శారు. కాలపరిస్థితులను బట్టి రాజ్యాంగంలో స్వల్ప సవరణలు సహజమే. కానీ దాని మౌలిక స్వరూపాన్ని మార్చే అధికారం ఎవ్వరికీ లేదని ఇప్పటికే భారత సర్వోత్తమ న్యాయస్థానం ఘంటాపథంగా చాటిచెప్పింది. మౌలిక స్వరూపం అంటే ఏమిటో దాని పీఠికలో ఉన్న ఆరు వాక్యాలు చదివితే అర్థమవుతుంది. బీజేపీ నాయత్వంలోని ఎన్డీఏ కూటమి మరోమారు గెలిస్తే రాజ్యాంగం మౌలిక స్వరూపాన్ని మార్చేస్తుందని ప్రతిపక్ష నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఆరో పణల్ని బీజేపీ వాళ్లు మొక్కుబడిగా మాత్రమే ఖండి స్తున్నారు. అనంత హెగ్డే వంటి కొందరు నాయకులు బహిరంగంగానే రాజ్యాంగం మార్పుకు అనుకూలంగా మాట్లాడుతున్నారు. బీజేపీ అనే రాజకీయ వేదికకు సొంతదారైన ఆరెస్సెస్‌కు మన రాజ్యాంగం పట్ల మొదటి నుంచీ సదభిప్రాయం లేదన్నది సత్యదూరం కాదు. పైగా ఈసారి బీజేపీ వాళ్లు 400 సీట్లలో తమ కూటమి గెలవాలని తెగ ఆరాటపడుతున్నారు. ఈ ఆరాటం వెనుక ఉన్న మహ త్కార్యం రాజ్యాంగ మౌలిక మార్పులేనన్నది విమర్శకుల అభిప్రాయం. భారత రాజ్యాంగంలో ధ్వనించే సమతా నినాదం సంఘ్ పరివార్‌కు ఏమాత్రం కర్ణపేయం కాదు. ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వపు పదేళ్ల పదవీకాలంలో 40 శాతం దేశ సంపద ఒక్క శాతం కుబేరుల గుప్పెట్లోకి చేరిపోవడమే ఇందుకు ఉదాహరణ. వ్యవసాయరంగం నుంచి రైతు కూలీలను తరిమికొట్టి చీప్ లేబర్‌తో మార్కెట్లను నింపడం ఈ కూటమి విధానం. అందుకోసం తీసుకొచ్చిన వ్యవ సాయ చట్టాల ప్రహసనం తెలిసిందే. బీజేపీకి భారీ మెజారిటీ వస్తే పీఠికలోని సెక్యులర్, సోషలిస్టు పదాలు గ్యారంటీగా ఎగిరిపోతాయని చాలామంది భావన. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఇందిరాగాంధీ ఈ పదాలను జొప్పించారు. ఈ పదాలను తొలగించినప్పటికీ ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాల్లోని 39 అధికరణాల రూపంలో వాటి పునాదులు బలంగానే ఉంటాయి. అయితే ఆ పునాదులనే పెకిలించే అవకాశాలుండవచ్చని దేశంలోని బుద్ధిజీవులు భయపడుతున్నారు. ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరుతాయని సామెత. పెత్తందారీ వర్గాల తాబేదారు పాత్రలో జీవితాన్ని తరింప జేసుకుంటున్న చంద్రబాబు నాయుడు బీజేపీకి సహజ మిత్రుడు. ప్రస్తుత ఎన్నికలతో కలిసి గడిచిన ఆరు సాధారణ ఎన్నికల్లో నాలుగుసార్లు ఆయన బీజేపీ కూటమిలోనే ఉన్నారు. రెండుసార్లు మాత్రమే దూరంగా ఉన్నారు. బీజేపీపై జనంలో వ్యతిరేకత ఉందన్న అభిప్రాయంతో మాత్రమే ఆయన రెండుసార్లు దూరం జరిగారు. కాకుల్ని కొట్టి గద్దలకు వేసే ఆర్థిక విధానాల్లో ఆయన బీజేపీ కంటే నాలుగు ఆకులు ఎక్కువే చదివారు. పేద ప్రజల పట్ల, బలహీన వర్గాల పట్ల తన ఏహ్యభావాన్నీ, అసహ్యాన్నీ దాచుకునే ప్రయత్నం కూడా చంద్రబాబు పార్టీ చేయదు. పేద ప్రజలకు రాజధాని ప్రాంతాల్లో ఇళ్లు కేటాయిస్తే సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని కేసులు వేసి గుడ్డలూడదీసుకున్న వారి గురించి ఇంకేం మాట్లాడాలి? కుల, మత, ప్రాంత, రాజకీయ, లింగ వివక్షలేవీ లేకుండా నాణ్యమైన అంతర్జాతీయ స్థాయి విద్యను ప్రజలందరికీ అందజేయాలనే ఒక బృహత్తరమైన యజ్ఞాన్ని జగన్ ప్రభుత్వం ప్రారంభించింది. చంద్రబాబు కూటమి ఈ యజ్ఞాన్ని చూసి కళ్లలో నిప్పులు పోసుకోవడం తెలిసిందే. ఇంగ్లిషు మీడియం విద్యకు వ్యతిరేకంగా, అంతర్జాతీయ స్థాయి బోధనా పద్ధతులకు వ్యతిరేకంగా, పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు వ్యతిరేకంగా యెల్లో పెత్తందార్లు నడిపిన కుట్రల సంగతి కూడా తెలిసిందే. అన్ని రంగాల్లోనూ ఇదే తంతు. పేద వర్గాలను, మహిళలను వారి కాళ్లపై నిలబెట్టడానికి జగన్ సర్కార్ చేస్తున్న ప్రతి ప్రయత్నాన్నీ యెల్లో పెత్తందార్లు వ్యతిరేకిస్తున్నారు. పరిపాలనా వికేంద్రీకరణ ఎంత పెరిగితే అంతగా పారదర్శకత పెరుగుతుంది. అచ్చమైన ప్రజాస్వామ్యానికి ఇది సిసలైన లక్షణం. జగన్ ప్రభుత్వం పారదర్శకతకు పెద్ద పీట వేసింది. ప్రభుత్వ పాలనను ప్రజల ఇంటి గడప వద్దకు చేర్చింది. వికేంద్రీకరణకు పెత్తందార్లు ఎప్పుడూ వ్యతిరేకమే. పాలనా వ్యవహారాలన్నీ వారి గుప్పెట్లోనే ఉండాలి. పారదర్శకత అనే పదం వారి డిక్షనరీలోనే ఉండదు. మాదాపూర్‌లో ఐటీ పార్క్ రాబోతున్నదనే రహస్యం వారికి మాత్రమే తెలియాలి. చుట్టూరా భూములన్నీ వారి వర్గంవారే కొనుగోలు చేయాలి. ఆ తర్వాతనే పార్క్ ప్రకటన రావాలి. రాజధాని ఎక్కడ వస్తుందో వారికి మాత్రమే తెలియాలి. వారి వర్గం అక్కడి భూములన్నీ కొనుగోలు చేయాలి. ఆ తర్వాతనే రాజధాని ప్రకటన చేయాలి. ఈలోగా ఇతర వర్గం ఔత్సాహికులను తప్పుదారి పట్టించడానికి తప్పుడు లీకులు వదలాలి. చంద్రబాబు నాయకత్వంలోని పెత్తందార్ల కూటమి అనుసరిస్తున్న ఈ తరహా రియల్ ఎస్టేట్ వ్యాపారానికే వారు అభివృద్ధి అనే ముద్దు పేరు పెట్టుకున్నారు. భారత రాజ్యాంగం ప్రవచించిన ఆదేశిక సూత్రాలను శిరసావహించినందుకు జగన్ పాలన విధ్వంసకర పాలనని మన తోలుమందం పెత్తందార్లు ప్రచారం చేస్తున్నారు. యావత్తు ప్రపంచం వాంఛిస్తున్న సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను ఆదర్శంగా పెట్టుకున్నందుకు జగన్ పరిపాలన వారికి వినాశకరమైనదిగా కనిపిస్తున్నదట! దశాబ్దాలు గడిచిపోతున్నా అధికార పదవుల్లో ఆవగింజంత వాటా కూడా దొరకని వర్గాలను సమీకరించి సామాజిక న్యాయం బాట పట్టినందుకు జగన్ సర్కార్‌కు కొమ్ములు మొలిచా యట! కొవ్వు బలిసిన పెత్తందారీ వర్గాల ప్రచారం తీరు ఇది. ఎన్డీఏ పదేళ్ల ఏలుబడిలో నిరుద్యోగ సమస్య జడలు విప్పి నర్తిస్తున్నది. మన తెలుగు పెత్తందార్లకు ఆ జడల దయ్యం ముద్దొస్తున్నది. ఐదేళ్ల కింద రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు నాలుగు లక్షల మంది ఉంటే జగన్ సర్కార్ హయాంలో వారి సంఖ్య ఆరున్నర లక్షలకు పెరిగింది. ఎకాయెకిన యాభై శాతం ఉద్యోగాలు అదనంగా కల్పించిన జగన్ ప్రభుత్వం వారికి విలన్‌గా కనిపిస్తున్నది. ఈ సంఖ్యలో వలంటీర్లను చేర్చలేదు సుమా! పరిశ్రమల స్థాపనలోగానీ, మౌలిక వసతుల కల్పనలోగానీ, ఉపాధి కల్పనలోగానీ, సంక్షేమ కార్యక్రమాల అమలులోగానీ గణాంకాల ఆధారంగా జగన్ సర్కార్‌తో పోల్చడానికి ఈ పెత్తందార్లు ముందుకు రావడం లేదు. కేవలం విధ్వంసం, వినాశనం, సర్వనాశనం అనే పడికట్టు మాటలతో శాపనా ర్థాలు పెడుతూ పూట గడుపుకొస్తున్నారు. యెల్లో మీడియా అనుసరిస్తున్న ఈ తరహా ఊకదంపుడు గోబెల్స్ ప్రచారం కాలం చెల్లిన చీప్ ట్రిక్. ప్రజల చైతన్యస్థాయి పెరిగింది. సమాచార మాధ్యమాలు పెరిగాయి. ఎవరు మిత్రుడో, ఎవరు శత్రువో గుర్తించగలిగే వివేచనా శక్తి జనంలో పెరిగింది. రాజ్యాంగబద్ధమైన తమ హక్కులను రక్షించుకోవడానికి ప్రజలు సంఘటితమవు తున్నారు. కేంద్రంలో ఒక విశ్వసనీయమైన ప్రతిపక్షం, విశ్వసనీయ ప్రతిపక్షనేత అందుబాటులో లేకపోవడం అనే ఒకే ఒక్క కారణం మరోసారి ఎన్డీఏను గద్దెనెక్కించవచ్చు. అదీ బొటాబొటీ మెజారిటీతో మాత్రమే! కూటమి ఆశిస్తున్నన్ని సీట్లు గెలవడం అసంభవం. పెత్తందారీ వర్గాలకు వ్యతిరేకంగా గట్టిగా నిలబడి రాజ్యాంగ లక్ష్యాల అమలుకు ప్రయత్నిస్తున్న జగన్ సర్కార్ బలంగా ఉన్నందువల్ల ఆంధ్రప్రదేశ్‌లో పేదవర్గాల జైత్రయాత్ర కొనసాగు తుందని అంచనాలు వెలువడుతున్నాయి. మొత్తం 25 లోక్‌సభ స్థానాలతో పాటు నూటాయాభైకి పైగా అసెంబ్లీ స్థానాలను వైసీపీ గెలుచుకున్నా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
రాజ్యాంగ స్ఫూర్తికి ప్రమాదం
ఎన్నికల వేళ దేశంలో అధికార–ప్రతిపక్ష కూటములు పోటాపోటీగా ప్రకటనలు చేస్తూ తమ విధానాలను ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాయి. ఇదే సమయంలో అధికార బీజేపీ ఏకంగా బలమైన ప్రతిపక్ష నాయకులపై కేసులు బనాయించి జైళ్లలోనూ పెడుతోంది. ఇందుకు కేజ్రీవాల్ అరెస్ట్ ఉదంతంతాజా ఉదాహరణ. దీనిపై ప్రతిపక్ష కూటమి భగ్గుమంటోంది. బీజేపీ ఈ సారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని రద్దుచేసినా ఆశ్చర్య పోవలసిన అవసరం లేదని వారు అంటున్నారు. ఉత్తరప్రదేశ్‌తో సహా దేశంలో అనేక చోట్ల దళితులపై జరుగుతున్న దాడులూ, కర్నాటక బీజేపీ నాయకుడు అనంత కుమార్ హెగ్డే ‘బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తాం’ అని ప్రకటించడం వంటివన్నీ చూస్తుంటే ఆందోళన కలుగుతోంది. ప్రతిపక్షాల వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే క్రమంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను కేంద్రం అరెస్టు చేసింది. ఎన్నికల ముందు ఇలా ఒక ముఖ్యమంత్రిని అరెస్టు చేయడం గురించి ప్రపంచ దేశాలు విస్తుబోయాయి. ఇది కేవలం రాజకీయ కక్షతో చేసిన అరెస్టేనని ప్రపంచ దేశాలు ముఖ్యంగా అమెరికా, జపాన్‌లు వ్యాఖ్యానించటం గమనార్హం. జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ ఢిల్లీ ర్యాలీలో మాట్లాడుతూ ‘దళితులు, గిరిజనులు, వెనకబడిన వర్గాలకు మేలు చేయబట్టే నా మీద బీజేపీ దాడులకు దిగింద’ని వక్కాణించారు. కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీ వాల్ ఢిల్లీ రామ్ లీలా మైదానంలో జరిగిన సభలో మాట్లాడుతూ... నిర్విరామ విద్యుత్ సరఫరా, పేదలకు ఉచిత విద్యుత్తు, ప్రభుత్వ బడులు బలోపేతం, మొహల్లా క్లినిక్‌లు, మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు, రైతులకు కనీస మద్దతు ధర, ఢిల్లీకి రాష్ట్ర హోదా వంటి అనేక హామీలతో కేజ్రీవాల్ జైలు నుంచి ఒక లేఖ పంపినట్టు ప్రకటించారు. ఇటువంటి హామీలను బీజేపీ ప్రభుత్వం ఇవ్వగలదా అని ప్రశ్నించారు. బీజేపీ 400 సీట్లు వస్తాయని బీరాలు పలుకుతుందనీ, 180 సీట్లన్నా తెచ్చుకోగలదా? అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని రద్దు చేసే కుతంత్రంలో భాగంగా ఈ ఎన్నికలు జరుగుతున్నా యని, మాట్లాడే స్వేచ్ఛను కాలరాయడం, నియంతృత్వ రాజ్యాన్ని తీసుకురావడం, ఆర్ఎస్ఎస్ అజెండాను అమలు పరచడం వంటివి బీజేపీ వ్యూహమనీ ఆయన అన్నారు. నియంతలను గద్దె దించటం ఎలాగో ప్రజలకు తెలుసనీ పేర్కొన్నారు. నిజానికి బీజేపీ తన ఎన్నికల ప్రచారంలో భాగంగా దక్షిణాది రాష్ట్రాల మీద... ముఖ్యంగా తమిళనాడు సామాజిక సాంస్కృతిక అస్తిత్వం మీద దాడిచేస్తోంది. కులాంతర వివాహాలకు రక్షణ కల్పించడం, 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వడం మీద బీజేపీ అసహనంగా ఉంది. సనాతన ధర్మాన్ని నిరాకరించి అధునాతన ధర్మానికీ,రాజ్యాంగ పరిరక్షణకూ పూనుకునే కార్యక్రమాలు నిర్వహించడం మీద బీజేపీ ఆగ్రహంగా ఉంది. ఎన్నికల వేళ నరేంద్ర మోదీ ‘కచ్చతీవు’ అంశాన్ని ప్రస్తావించడంపై కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ ప్రధాన కార్య దర్శి జయరాం రమేష్‌లు తగిన విధంగా స్పందించారు. 1974లో కాంగ్రెస్ ప్రభుత్వం కచ్చతీవు (దీవి)ని శ్రీలంకకు అప్పగించిందని మోదీ ఆరోపించారనీ, మరి 2015లో బంగ్లాదేశ్‌తో ఎన్డీఏ ప్రభుత్వం చేసుకున్న భూమి సరిహద్దు ఒప్పందంలో భాగంగా 1051 ఎకరాల భారత భూభాగం కోల్పోవాల్సి వచ్చింది కదా అని జయరాం రమేష్ గుర్తు చేశారు. మొత్తం 17,161 ఎకరాల భారత భూభాగంలో 7,110 ఎకరాలు మాత్రమే మనకు వచ్చాయి అన్నారు. ఆ సమయంలో మోదీపై ఆరోపణలు చేయకుండా పార్లమెంటు ఉభయసభల్లో బిల్లుకి కాంగ్రెస్ మద్దతునిచ్చిందని వెల్లడించారు. తమిళనాడులో వారికి ఒక్క సీటు కూడా రాకపోవడం బీజేపీ వర్గాలను కలవరపెట్టిందని విమర్శించారు. తమిళనాడులో వస్తున్న సామాజిక ఆర్థిక పరిణామాలను తట్టుకోలేక మోదీ ‘కచ్చతీవు’ ప్రస్తావన తెచ్చారని అన్నారు. 1974లో సిరిమావో బండారు నాయకే– ఇందిరా గాంధీ మధ్య కుదిరిన ఒప్పందం కారణంగా శ్రీలంక నుండి ఇందిరా గాంధీ చాతుర్యం వల్ల ఆరు లక్షల మంది తమిళ భారతీయులు స్వదేశానికి రాగలిగారని ఆయన వ్యాఖ్యానించారు. మోదీ ప్రభుత్వం దక్షిణ భారతదేశంలో వస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల చైతన్యానికి బెదిరి ఎప్పటివో సరిహద్దు విషయాలను ముందుకు తెచ్చి లబ్ధి పొందాలని చూస్తోందన్నారు. బిహార్ ఓబీసీ రాజకీయ నాయకులు తేజస్వీ యాదవ్ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ఓబీసీ నాయకుల్ని బతకనివ్వటం లేదనీ, తన తల్లి, తండ్రి, తోబుట్టువులపై కేసులు పెట్టి వేధిస్తున్నారనీ, ఆర్ఎస్ఎస్ భావజాలం ప్రకారం ఓబీసీలు అంటే శూద్ర బానిసలనీ, వారు రాజ్యపాలనకు పనికిరారనేది వారి భావ జాలం అన్నారు. బీజేపీ ప్రభుత్వం ఏ గిరిజనుల, దళితుల, బీసీల రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పనిచేస్తోందో, మాట్లాడుతోందో వారే నిజానికి సామా జిక ఉత్పత్తి శక్తులు. భారతీయ గిరిజనులు మన ప్రకృతినీ, సంస్కృతినీ రక్షించినవారు. దళితులు నదీ నాగరికతను సృష్టించినవారు. వీరి శ్రమ లేనిదే భారతదేశ సంపద లేదు. ఎవరు సంపద సృష్టిస్తున్నారో వారి రక్షణ కోసమే భారత రాజ్యాంగం రాయబడింది. ప్రధాని దేశంలో సామాజిక, సాంస్కృతిక, పారిశ్రామిక, విద్యా వ్యవస్థలను విస్తృతం చేయాలనే పథకాలను రూపొందించుకోలేక పోతున్నారు. విశ్వవిద్యాలయాల్లో పరిశోధనా విభాగం సీట్లన్నీ తగ్గించేశారు. ఎస్సీలకు ఇస్తున్న ఉపకార వేతనాలను తగ్గించేశారు. ఇకపోతే మహిళా సంక్షేమ పథకాల అమలులో మోదీ ప్రభుత్వం ఈ పదేళ్ళ కాలంలో ఘోరంగా విఫలమయ్యింది. బడ్జెట్లోనూ మోదీ ప్రభుత్వం మహిళల సంక్షేమ పథకాల కేటాయింపును తగ్గించింది. 5 కీలక మహిళల సమస్యల పరిష్కారంలో విఫలమైంది. 2023 – 24 కేంద్ర బడ్జెట్లో అంగన్వాడీ కేంద్రాలు, మహిళల భద్రత, శిశు సంరక్షణ సంస్థలకు బీజేపీ ప్రభుత్వం కేవలం 0.55 శాతం నిధులు మాత్రమే కేటాయించింది. వాచాలత్వం నుండి, ఆధిపత్యం నుండి, అణచివేత నుండి, హింస నుండి ఉత్పత్తి జరగదు. ఉత్పత్తి జీవులు అయిన గిరిజనులు, దళితులు చెట్టును ప్రేమిస్తారు, నదిని ప్రేమిస్తారు, భూమిని ప్రేమిస్తారు, గాలిని ప్రేమిస్తారు. భారతదేశం ప్రకృతి జీవులది. పెట్టుబడి దారీ సామ్రాజ్యవాద శక్తులు వీరి శ్రమను దోపిడీ చేసి అభివృద్ధి చెందుతున్నాయి. ఎవరి శ్రమ దోచుకుంటున్నారో వారిపై అరాచకాలు చేస్తు న్నారు. బీజేపీ పాలనలో ఉన్న ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల ఆరు గురు యువకులు ఒక దళిత బాలికపై (16 ఏళ్ళు) లైంగిక దాడి చేశారు. వారిపై కేసు పెట్టినందుకు ఆమెను వారు అగ్నిలో దహించారు. ఇటు వంటి పాలకులను అందిస్తున్న బీజేపీకి చెందిన కర్నాటక నాయకుడు అనంత కుమార్ హెగ్డే ‘బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తాం’ అని ప్రకటించడం ముందు ముందు ఏమి జరగను న్నదనే సంగతిని సూచిస్తోంది. ఇకపోతే ఇండియా కూటమి కూడా అంబేడ్కర్‌ని ముందు పెట్టుకోకుండా వెళితే రాజ్యాంగాన్ని రక్షించలేదు. భావ ప్రకటనా స్వేచ్ఛ ఇక ప్రజలకు ఉండదు. రాజ్యాంగంలోని ‘ప్రవేశిక’ ‘భారత దేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం’గా ప్రకటించింది. ప్రస్తుత బీజేపీ ప్రభుత్వ దూకుడు చూస్తుంటే ఈ లౌకిక, ప్రజాస్వామ్య భావనలు ప్రమాదంలో పడబో తున్నట్లనిపిస్తోంది. రాజ్యాంగం ప్రాథమిక హక్కులను మనకు ప్రసాదించింది. ఇప్పుడు అవీ ప్రమాదంలో ఉన్నట్లు స్పష్టమవుతోంది. రాజ్యాంగ 11వ అధికరణం ప్రాథమిక హక్కులను హరించే ఏ శాసనం చెల్లదని చెప్పడం కొంత ఊరటనిస్తోంది. అంబేడ్కర్ ఈ రాజ్యాంగాన్ని రూపకల్పన చేయడానికి తన జీవితాన్ని అంకితం చేశారు. ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవలసిన బాధ్యత ప్రతి దళిత, బహుజన, ఆదివాసీ మీదా ఉంది. ఇప్పుడు బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైన కులతత్వ, మత తత్వవాది. ఇవాళ దక్షిణ భారతదేశం మొత్తం తన అస్తిత్వం కోసం పోరాడుతోంది. ఈ దశలో అంబేడ్కర్ ఆలోచనలతో లౌకిక భారత పునరుజ్జీవనం కోసం బడుగు వర్గాలు, లౌకికవాదులం ఏకమై రాజ్యాంగ స్ఫూర్తినీ, చైత న్యాన్నీ, ప్రతిష్ఠనూ, వ్యక్తిత్వాన్నీ కాపాడే పోరాటంలో భాగస్వాముల మవుదాం. విజయం సాధిద్దాం! డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమ నాయకులు ‘ 98497 41695 -
మారుతున్న ఢిల్లీ రాజకీయాలు.. ఎల్జీ నిర్ణయంపై ఉత్కంఠ
దేశ రాజకీయాల్లోనే పెను సంచలనం చోటు చేసుకుంది. తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో.. అదీ అవినీతి ఆరోపణల మీద ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం రాత్రి అరెస్టు చేసింది. తద్వారా పదవిలో ఉండగా అరెస్టయిన మొదటి ముఖ్యమంత్రిగా నిలిచారాయన. అయితే ఆయన అరెస్ట్ నేపథ్యంలో.. ఢిల్లీకి నెక్ట్స్ సీఎం ఎవరనే చర్చ సాధారణంగానే తెరపైకి వచ్చింది. ఆప్ మాత్రం మరో మాట చెబుతోంది. ‘‘అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ పూర్తిగా రాజకీయ కుట్ర. ఢిల్లీకి కేజ్రీవాలే ముఖ్యమంత్రి. ఆయనే మా పార్టీ కన్వీనర్‌గా కొనసాగుతారు. జైలుకు వెళ్లినా అక్కడి నుంచే ఆయన పాలన కొనసాగిస్తారు. ఆప్ ప్రభుత్వానికి వచ్చిన ఢోకా ఏం లేదు..’’ ఇది ఇప్పుడు ఆప్ కీలక నేతలు చెబుతున్న మాట. ఇప్పుడే కాదు.. గత నవంబర్‌లో లిక్కర్ స్కాంలో తొలిసారి ఈడీ కేజ్రీవాల్‌కు సమన్లు ఇచ్చింది. అప్పటి నుంచి ఆయన అరెస్ట్ అవుతారనే ప్రచారం నడుస్తూ వచ్చింది. అయితే ఆ సమయంలోనూ ఆప్ ఒక్కటే ప్రకటన చేసింది. కేజ్రీవాల్ ఎట్టిపరిస్థితుల్లో రాజీనామా చేయబోరని.. అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లినా ఆయనే సీఎంగా పాలన కొనసాగిస్తారని. అంతేకాదు ఒకవేళ ఆయన అరెస్ట్ అయితే గనుక రాజీనామా చేయాలా? లేదంటే సీఎంగా కొనసాగొచ్చా? అంటూ.. ‘మై బీ కేజ్రీవాల్’ పేరుతో ఈ జనవరిలో ఏకంగా ఓ పబ్లిక్ సర్వేను సైతం చేపట్టింది ఆప్. అయితే.. ఒక వ్యక్తి అరెస్ట్ అయ్యి ముఖ్యమంత్రి హోదాలో జైలు నుంచే పాలన నడిపించేందుకు వీలుందా?అందుకు భారత రాజ్యాంగం అనుమతిస్తుందా? చట్టాలు ఏం చెబుతున్నాయి?.. రాష్ట్రపతి, గవర్నర్ పోస్టులు మాత్రమే రాజ్యాంగం పరిధిలోని పోస్టింగులు. చట్టం ప్రకారం.. వీళ్లకు మాత్రమే అరెస్ట్ నుంచి రక్షణ ఉంటుంది. వాళ్ల పదవీకాలం ముగియడం లేదంటే స్వచ్ఛందంగా రాజీనామా చేసేదాకా వాళ్లకు ఊరట లభిస్తుంది. అప్పటిదాకా ఆర్టికల్ 361 ప్రకారం వాళ్లకు కల్పించిన రక్షణ ప్రకారం.. న్యాయస్థానాలకు వాళ్లు జవాబుదారీలుకారు. అయితే.. ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి లాంటి పదవులకు మాత్రం ఎలాంటి రక్షణ ఉండదు. అందుకే ఢిల్లీ హైకోర్టు సైతం కేజ్రీవాల్‌కు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించేందుకు విముఖత వ్యక్తం చేసింది. అలాగని కేవలం అరెస్ట్ అయినంత మాత్రానా వాళ్లు(పీఎం, సీఎంలాంటి పదవుల్లో ఉన్నవాళ్లు) ఆ పదవులకు అనర్హులైపోరు. ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951 ప్రకారం కచ్చితంగా శిక్ష పడితేనే పదవుల్ని కోల్పోతారు. కేజ్రీవాల్‌కు జైలుకెళ్తే.. తాజా పరిణామాల్ని పరిశీలిస్తే.. జైలు నుంచి కేజ్రీవాల్ ఢిల్లీని పాలించడాన్ని ఏ చట్టం అడ్డుకోదు. ఒకవేళ ఆయనకు శిక్ష పడితే మాత్రం అనర్హతకు గురవుతారు. ఇప్పటివరకైతే ఆయనకు శిక్ష పడలేదు. కాబట్టి ఆయన పాలన కొనసాగించేందుకు ఎలాంటి ఆటంకాలు ఉండకపోవచ్చని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అలాగని జైలు నుంచే సీఎంగా బాధ్యతలు నిర్వర్తించడం అంత సులువైన పనీ కాదని కూడా అభిప్రాయపడుతున్నారు. అందుకు జైలు అధికారులు ఆయనకు పలు సడలింపులు ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకు అక్కడి జైళ్ల శాఖ నిబంధనలపై స్పష్టత రావాల్సి ఉంది. స్వచ్ఛందంగా రాజీనామాను మినహాయిస్తే ఒక ముఖ్యమంత్రి తన పదవిని కోల్పోయేది అసెంబ్లీలో మెజారిటీని కోల్పోవడమో లేదంటే అవిశ్వాస తీర్మానంలో ఓడిపోవడం వల్లనో. కేజ్రీవాల్‌కు కలిసొచ్చే మరో అంశం ఏంటంటే.. ఇప్పటి వరకు ఆప్ మంత్రులు ఇద్దరు మనీశ్ సిసోడియా , సత్యేందర్ జైన్ అరెస్టై జైలుకు వెళ్లారు. కానీ, కేజ్రీవాల్ కేవలం ముఖ్యమంత్రిగానే ఉన్నారు. ఆయన వద్ద ఎలాంటి పోర్ట్‌ఫోలియో లేదు. లెఫ్టినెంట్ గవర్నర్దే నిర్ణయం? ప్రస్తుతం ఉన్న ఢిల్లీ అసెంబ్లీ కాలపరిమితి వచ్చే ఏడాది ఫిబ్రవరితో ముగియనుంది. అయితే.. ఢిల్లీ అధికార నిర్మాణం చాలా భిన్నంగా ఉంటుందన్నది తెలిసిందే. ప్రజలు ఎన్నుకునే ముఖ్యమంత్రి.. కేంద్రం ఎంపిక చేసే లెఫ్టినెంట్ గవర్నర్ పాలనలో కొనసాగుతోంది. ప్రస్తుతం ఢిల్లీ ఎల్జీగా వినయ్ కుమార్ సక్సేనా ఉన్నారు. ఆయనతో కేజ్రీవాల్ సర్కార్‌కు అంత సత్సంబంధాలు కూడా ఏం లేవు. దీంతో.. ఇప్పుడు కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా కొనసాగుతారా? లేదా?.. ఎల్జీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారన్నది ఉత్కంఠ రేకెత్తిస్తోంది. రాజధాని రీజియన్‌లోని ఢిల్లీకి మాత్రమే వర్తించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 239 ఏఏ ప్రకారం.. కేజ్రీవాల్ జైలుకు వెళ్తే గనుక ఆయన్ని అధికారం నుంచి తొలగించమని ఎల్జీ రాష్ట్రపతిని కోరేందుకు అవకాశం లేకపోలేదు. ఒకవేళ లిక్కర్ కేసులో కేజ్రీవాల్ జైలుకు గనుక వెళ్లాల్సి వస్తే.. రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం విఫలమైందని పేర్కొంటూ ఢిల్లీ ప్రభుత్వాన్ని గవర్నర్ రద్దు చేయించొచ్చు. ఆర్టికల్ 239ఏబీ ప్రకారం ఎల్జీ రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేయవచ్చు. తద్వారా బలవంతంగా అయినా కేజ్రీవాల్ రాజీనామా చేయాల్సి వస్తుంది. అప్పుడు రాష్ట్రపతి పాలన కింద ఢిల్లీ కేంద్రం చేతుల్లోకి వెళ్తుంది. రిమాండ్ పిటిషన్‌పై తీర్పు, బెయిల్ ఏదో ఒకటి వచ్చేదాకా ఎదురుచూసే అవకాశం లేకపోలేదు. -
రాజ్యాంగ విలువలు అమలవుతున్నాయా?
రాజ్యాంగ నిర్మాతలు జాతి లక్ష్యాలనూ వాటిని సాధించేందుకు అవసరమైన వ్యవస్థలనూ, ప్రక్రియలనూ రాజ్యాంగంలో పొందు పర చారు. జాతి సమైక్యత, సమగ్రత, ప్రజాస్వామిక సమాజం ఏర్పాటు అనేవి జాతి లక్ష్యాలుగా ఉద్దేశించబడ్డాయి. వీటిని సాధించేందుకు ప్రజాస్వామిక స్ఫూర్తితో రాజ్యాంగ ప్రజాస్వామిక వ్యవస్థలను విని యోగించుకుంటూ సామాజిక, ఆర్థిక విప్లవం ద్వారా నూతన సమాజాన్ని నిర్మించవలసి ఉంటుందని భావించారు. రాజ్యాంగ వ్యవస్థలు వాటికి అవే పనిచెయ్యవు. ఆ వ్యవస్థ ద్వారా ఎంపిక కాబడ్డ రాజకీయ యంత్రాంగం నడిపించాల్సి ఉంటుంది. ప్రముఖ న్యాయమూర్తి జాన్ మార్షల్ అన్నట్లు ‘రాజ్యాంగం అనేది భావితరాల కోసం రూపొందించ బడుతుంది, కానీ దాని నిర్దిష్ట క్రమం ఎప్పుడూ ఒడుదొడుకులు లేకుండా ఉండదు’. రాజ్యాంగం అంటే ఒక జాతి సామాజిక లక్ష్యాలను సాధించేందుకు ఉపయోగించే దిక్సూచిలాగా భావించాలి. నిజానికి నిత్య జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకూ పరిష్కార మార్గం ఏ రాజ్యాంగంలోనూ లభించదు. వాటిని రాజ్యాంగ సూత్రాల పరిధిలో పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. రాజ్యాంగం ఏర్పాటు చేసుకున్న లక్ష్యాలకూ, చారిత్రక అసమా నతల మీద ఏర్పడ్డ సామాజిక వ్యవస్థకూ భిన్నత్వం ఉంది. ఈ వైరుద్ధ్యాల నడుమనే భారత రాజకీయ వ్యవస్థ రాజ్యానికీ, వ్యక్తుల హక్కు లకూ మధ్య సమన్వయం సాధిస్తూ ముందుకు సాగాలి. వ్యక్తి స్వేచ్ఛ, పౌరస్వేచ్ఛ ప్రధానమైనవిగా భావించాలి. అంబేడ్కర్ చెప్పిన ‘చట్టం ముందర సమానత్వం’ భావన కేవలం సూత్రప్రాయంగా కాక ‘రూల్ ఆఫ్ లా’ ప్రాతిపదికన ముందుకు సాగాలి. వర్తమానంలో రాజ్యాంగానికి ఆవల ఉండే పద్ధతుల్లో ఎన్నో విధ్వంసకర విధానాలు ‘సర్వసమ్మతి’ పేరున జరుగుతున్నాయి. 1990ల్లో వచ్చిన నయా ఉదారవాద విధానాల నేపథ్యంలో ప్రభుత్వ రంగ సంస్థల్లో పెద్ద ఎత్తున ప్రైవేటు పెట్టుబడులు పెరిగాయి. దీనితో ‘సంక్షేమ రాజ్య’ స్థాపన లక్ష్యానికి గండిపడింది. సామాజిక సంక్షేమం సందిగ్ధంలో పడింది. ఫలితంగా సమాజ సంక్షేమం స్థానే మార్కెట్ ప్రయోజనాలే ముందుకొచ్చాయి. వరల్డ్ బ్యాంక్ విధానాలు స్థానిక ప్రభుత్వాలను సైతం దెబ్బతీశాయి. ఈ నేపథ్యంలోనే నేడు దేశంలో ‘విశ్వాసమే’ ప్రధానం అనే భావనను సర్వసమ్మతి పేరున రాజ్యాంగం ప్రసాదించిన వాక్ స్వాతంత్య్రాన్నీ భిన్న అభిప్రాయాలనూ, నేర పూరిత కుట్రగా చలామణీ చేస్తున్నాయి. భిన్నత్వంలో ఏకత్వంగా ఉన్న దేశంలో నేడు ఏకతా సూత్రాల దిశగా దేశాన్ని నడిపిస్తున్నారు. ఆహార నియమాల పట్ల కూడ ప్రత్యక్ష ఆంక్షలు తలెత్తుతున్నాయి. చట్ట ప్రకారం పరిపాలన కంటే విశ్వాసమే చట్టంగా పాటించాల్సిన పరిస్థితుల్లోకి ప్రజలు నెట్టబడుతున్నారు. ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తే దేశ వ్యతిరే కిగా, దేశద్రోహిగా కేసులు వస్తున్నాయి. ఎమర్జెన్సీ తరువాత వచ్చిన 42వ రాజ్యాంగ సవరణలో సుప్రీంకోర్టు భారత రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని పార్లమెంట్ కూడా మార్చలేదని చెప్పిన తీర్పు స్పష్టంగానే ఉంది. రాజ్యాంగ బద్ధంగా పరిపాలిస్తామని రాజ్యాంగంపై ప్రమాణం చేసిన వాళ్ళే ’విశ్వాసమే’ ప్రధానం అనే భావజాలాన్ని ముందుకు తెస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాజ్యాంగ విలువల సాక్షిగా ప్రజలు తమ హక్కులకు, జీవితాలకు, రాజ్యాంగ రక్షణకు, తామే నిబద్ధులుగా వ్యవహరించాల్సిన, కాపాడుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది. భారతదేశంలో ‘చట్టబద్ధ పాలన’ (రూల్ ఆఫ్ లా) సజాపుగా సాగాలంటే దేశ పౌరసమాజం ద్వారా మాత్రమే రూల్ ఆఫ్ లాను పొందగలరు. – డా‘‘ నూతక్కి సతీష్, నాగార్జున విశ్వవిద్యాలయం డా‘‘ బి.ఆర్. అంబేడ్కర్ స్కూల్ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ – రీసెర్చ్‌లో గెస్ట్ ఫ్యాకల్టీ -
అస్తమించని మేధా సూర్యుడు
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ప్రపంచ మేధావుల్లో అగ్రగణ్యులు. భారతదేశ పునర్నిర్మాణ దృష్టితో రాజ్యాంగాన్ని రూపొందించారు. ఆయన చెక్కిన రాజ్యాంగ శిల్పంలో ప్రపంచ మానవతా సూత్రాలన్నీ ఇమిడి ఉన్నాయి. లౌకిక భావన, ప్రజాస్వామ్య వ్యవస్థలలోని స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలను భారత ప్రజలకు లభించడానికి తీవ్రంగా కృషి చేశారు. ఆయన విశుద్ధంగా, వినిర్మలంగా, ద్వేష రహితంగా జీవించారు. అదే జీవన విధానం అందరికీ ఆచరణీయం. ఆయన సిద్ధాంతాలైన కుల నిర్మూలన, అస్పృశ్యతా నివారణ , ఆర్థిక సమత, మానవ హక్కులు, బహుజన సాధికారితలను సాధించడానికి మనందరం ముందుకెళ్ళాల్సిన చారిత్రక సందర్భమిది. అంబేడ్కర్‌కి పూర్వం, అంబేడ్కర్ తర్వాత అని భారతదేశ చరిత్రను మనం లిఖించాల్సి ఉంటుంది. అంబేడ్కర్‌కి పూర్వం భారతదేశం మనుస్మృతి రాజ్యం, వర్ణ వ్యవస్థ రాజ్యం, బ్రాహ్మణాధిపత్య రాజ్యం, లౌకికేతర రాజ్యం, అప్రజాస్వామిక రాజ్యం, నియంతృత్వ రాజ్యం. అంబేడ్కర్ భారత దేశం రూపురేఖలను మార్చారు. లౌకిక ప్రజాస్వామిక దేశంగా చేశారు. ఆయన భారత రాజ్యాంగ శిల్పంలో ప్రపంచ మానవతా సూత్రాలన్నీ ఇమిడి ఉన్నాయి. లౌకిక భావన ప్రజాస్వామ్య వ్యవస్థలలోని స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలను భారత రాజ్యాంగం ద్వారా భారత ప్రజలకు లభించడానికి కారకులయ్యారు. కులాతీత, మతాతీత రాజ్యాంగాన్ని రూపొందించి భారతదేశానికి కానుకగా సమ ర్పించారు. భారత దేశ భవిష్యత్తుకు ఆ రాజ్యాంగమే దిక్సూచి. అంబేడ్కర్ ప్రపంచంలోనే పేరెన్నిక గన్న మేధావి. తత్వవేత్త, దార్శనికుడు అని ఎవరిని అంటారు? ప్రపంచ గమన సూత్రాలను మార్చ గలిగిన వారినే అంటారు. అంబేడ్కర్‌కు ముందు ఒక బుద్ధుణ్ణి, ఒక మార్క్స్‌ను ప్రజలు తత్వవేత్తగా కొనియాడారు. ఆయన బుద్ధుని కంటే, మార్క్స్ కంటే కూడా విశిష్ట లక్షణాలు ఉన్న మేధావి. భారత దేశాన్ని పట్టి పీడిస్తున్న కుల సమస్యకు, అçస్పృశ్యతా నిర్మూలనకు నిర్మాణాత్మకమైన సిద్ధాంతాలు, సూత్రాలు అందించారు. అణగారిన ప్రజల హక్కుల సిద్ధాంతానికి కర్త అయ్యారు. అంతే కాక, దానికి చట్ట రూపాన్ని తీసుకొచ్చిన నిర్మాణ కర్త ఆయన. అంబే డ్కర్ పరినిర్వాణం 67వ ఏట అడుగు పెడుతున్నా ఆయన కీర్తి తరగ లేదు. ఆయన సిద్ధాంతాలు విశ్వవ్యాప్తమవ్వడానికి కారణం, ఆయన జీవితం అంతా అనంత పరిశోధన చేసి, కుల నిర్మూలన, అస్పృశ్యతా నిర్మూలనం, ఆర్థిక అసమానతల నిర్మూలనకు బాటలు వేయడమే. ఆయనలా విశుద్ధంగా, నిర్మలంగా, ద్వేష రహితంగా జీవించిన మేధావులు అరుదు. ఆయన భారత రాజ్యాంగ నిర్మాణాన్ని భారతదేశ పునర్నిర్మాణ దృష్టితో రూపొందించారు. అందుకు ఆయన తన ఆరోగ్యాన్ని పణంగా పెట్టారు. ఆయన విద్యార్జన గమ్యం అçస్పృశ్యుల ఉద్ధరణ. అదీ దళిత విద్యావంతులలో ఉండాల్సిన ఆదర్శం. దళిత విద్యార్థులు ఆ నిర్దేÔè కత్వం నుండి తప్పితే అంబేడ్కర్ మార్గాన్ని నిరోధించిన వారే అవు తారు. ఈ సత్యాన్ని ప్రతి అంబేడ్కర్‌వాది గుర్తుంచుకోవాలి. ఆయన లండన్‌లో ఉన్నప్పుడు కూడా తన మనస్సు మాత్రం భారతదేశ అస్పృశ్య సమాజం మీదే ఉండేది. భారతదేశంలో అస్పృశ్యుల కోసం పని చేస్తున్న సంఘాలు ఏమి చేస్తున్నాయా అని ఆయన ఎప్పటికప్పుడు తెలుసుకొంటూ ఉండేవారు. అంబేడ్కర్ విద్యార్థి దశ నుండే నాయకత్వ లక్షణాలను సంతరించుకున్నారు. నాయకుడు కేవలం తన వ్యక్తిగత జీవితం గురించి ఆలోచించడు. తన జాతి గురించే ఆలోచిస్తాడు. త్యాగపూరితంగా పనిచేయడం ద్వారా తన జాతీయుల మనసులను చూరగొంటాడు. నాయకుడు తన భావజాలాన్ని జాతికి అందించడానికి వాహికను రూపొందించుకుంటాడు. అది ఉత్తరాల ద్వారా కావచ్చు, పత్రికల ద్వారా గావచ్చు, సభలు, సమావేశాల ద్వారా గావచ్చు. ఆయన చేసిందీ అదే! ఆయన అనేక పత్రికల్లో రాయడమే కాక స్వయంగా ‘మూక్ నాయక్’, ‘బహిష్కృత్ భారత్’, ‘జనత’, ప్రబుద్ధ భారత్’ వంటి పత్రికలు స్థాపించి వాటి ద్వారా తాను చెప్పాలనుకున్నది నిర్భ యంగా, కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ఎన్నో సభల్లో ఉపన్యసించి అణగారిన వర్గాలను ఉత్తేజితులను చేశారు. నాటి ప్రభుత్వ పెద్దలకూ, రాజకీయ నాయకులకూ ఆయన రాసిన ఉత్తరాలు ఇప్పటికీ చారిత్రక ప్రాధాన్యం కలిగి ఉన్నాయి. అంబేడ్కర్ నిశిత పరిశీలకుడు. ముఖ్యంగా ఆయన పోరాటానికి పునాది పూర్తి కుల త్యాగ నిరతి. అందుకే పూర్వీకుల వీరోచిత గాథ లను వర్ణించారు. ఆయన క్రమశిక్షణతో కూడిన నిర్భయత్వాన్ని ప్రద ర్శిస్తూ వీరోచితమైన సాహసాన్నీ, మొక్కవోని నిబ్బరాన్నీ, ధైర్యాన్నీ కొనియాడదగిన నిశ్చితత్వాన్నీ ప్రదర్శించిన మహర్ సైనికులకు శాశ్వతమైన గుర్తింపును తెచ్చారు. ‘ఇద్దరిలో ఎవరి కీర్తి గొప్పదో చెప్పడం కష్టం. అది భారతీయ సైనికులదో లేక అంతటి విధేయతను, విశ్వాసాన్ని పొందేలా వ్యవహరించిన బ్రిటిష్ ఆఫీసర్లదా?’ (భారతీయ సైనికులలో అధికులు మహర్లు) అంటూ మేజర్ జె.టి. గోర్మన్ తన ‘హిస్టారికల్ రికార్డ్ ఆఫ్ ది సెకండ్ బెటాలియన్ ఫోర్త్ బాంబే గ్రెనెడీర్స్, 1796–1933’లో పేర్కొనడం ఈ సందర్భంగా గమనార్హం. అనతికాలంలోనే కోరెగాంవ్ చర్యకున్న ప్రాముఖ్యతను గుర్తించారు. కోరెగాంవ్‌లో మొదటి తూటా పేలిన స్థలంలో 65 అడుగుల ఎత్తు, 32 చదరపు అడుగుల వెడల్పు ఉన్న స్మృతి చిహ్నాన్ని నిర్మించాలని తల పెట్టారు. దీనికి 1821 మార్చి 26న పునాది రాయి వేశారు. ఈ దళం సాహసానికి స్మృతిగా ఈ స్తూపాన్ని నిర్మించారు. ఈ సాహసాన్ని కొనసాగించే ఉద్దేశంతో దీనిని నెలకొల్పారు. అస్పృశ్యులు అనబడినవారు వీరోచితమైన జాతులు అని అంబేడ్కర్ తన అస్పృశ్యుల వాడలో నిరూపించారు. పల్నాటి యుద్ధంలో తెలుగు నేలలో దళితులే పాల్గొన్నారు. కృష్ణదేవరాయల సైన్యంలో ఏనుగులను, గుర్రాలను నడిపింది దళితులే. ముఖ్యంగా పల్నాటి వీర చరిత్రలో కన్నమదాసు సైన్యాధ్యక్షుడు. ఆయన ఉపయోగించిన కత్తి ఇప్పటికీ కారంపూడిలో ఉంది. డా‘‘ అంబేడ్కర్ కృషి వలన అస్పృశ్యత ఒక నేరంగా రాజ్యాంగం పరిగణిస్తూ ఉంది. కాని భారతదేశంలో లక్ష లాది గ్రామాలలో ఇంకా అస్పృశ్యత వెన్నాడుతోంది. ఎన్నో హోట ళ్ళలో గ్లాసులు అస్పృశ్యులకు వేరుగా ఉంచుతున్నారు. కొన్ని ప్రభు త్వాలు ఊరికి దూరంగా ఇళ్ళు కట్టిస్తున్న సందర్భాలూ ఉన్నాయి. భారత రాజ్యాంగంలో 21వ ఆర్టికల్‌ను వివరిస్తూ డా‘‘ అంబే డ్కర్ ‘ప్రభుత్వ సొమ్మును మత బోధకులకు, మత కార్యకలాపాలకు ఉపయోగించరాదు. మత బోధలకు సంబంధించి స్వయంగా లేక ప్రయివేటు సంస్థల ద్వారా ప్రభుత్వం ఖజానా డబ్బును ఖర్చు చేయ డానికి వీలులేదు’ అని స్పష్టం చేశారు. దీనికి పూర్తిగా, భిన్నంగా ఈనాడు జరుగుతూ ఉంది. ప్రభుత్వ ప్రచార సాధనాలయిన రేడియో, టీవీ వంటివాటిలో మత ప్రచారం చేయడం రాజ్యాంగ విరుద్ధం. ఆనాడు అంబేడ్కర్ వివరించిన దానికి పూర్తి భిన్నంగా జరుగుతూ ఉంది. సెక్యులరిజం అంటే ‘మత ప్రమేయం లేని రాజ్యం’ అని అర్థం. ఈనాడు ప్రభుత్వం పూర్తిగా మతపరంగా వ్యవహరిస్తూ వుంది. ఇది భారత రాజ్యాంగ శిల్పి అంబేడ్కర్‌కూ, ఆయన ఆలోచనలకూ పూర్తిగా వ్యతిరేకమయిన విషయం. అందుకే రానురానూ అంబేడ్కర్ అవసరం పెరిగింది. ప్రపంచ వ్యాప్తంగా అంబేడ్కర్ మేధావిగా గుర్తింపు పొందారు. లండన్‌లోని ‘ఇండియా హౌస్’లో ఆయన బంగారు విగ్రహం ఉంది. బ్రిటిష్ పార్లమెంట్ ఎదురుగా ఆయన నిలువెత్తు విగ్రహం ఉంది. ఇక భారత్‌లో సరేసరి. ఇండియన్ పార్లమెంట్ ఎదురుగా ఆయన సము న్నత విగ్రహం వుంది. ఇవాళ హైద్రాబాద్ నడిబొడ్డులో అంబేడ్కర్ 125 అడుగుల విగ్రహం వెలుగులీనుతోంది. విజయవాడలో 125 అడుగుల విగ్రహం జనవరిలో ఆవిష్కరించబడుతుంది. ఆయన రాజ్యాంగ నిర్మాణ దక్షత, ప్రతిభా సామర్థ్యాలను గుర్తిస్తూ కశ్మీరు నుండి కన్యాకుమారి వరకు ఆయన విగ్రహాలు నిరంతరం వెలుస్తూనే ఉన్నాయి. ఈనాడు ఆయన భావజాల అవసరం చాలా ఉంది. మన మందరం ఆయన వర్ధంతికి నివాళిగా ఆయన సిద్ధాంతా లైన కుల నిర్మూలన, అస్పృశ్యతా నివారణ, ఆర్థిక సమత, మానవ హక్కుల పోరాట దీక్షలతో బహుజన సాధికారిత రాజ్యాధికార భావనలతో ముందుకెళ్ళాల్సిన చారిత్రక సందర్భమిది. డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమ నాయకుడు ‘ 98497 41695 (రేపు డా‘‘ బి.ఆర్. అంబేడ్కర్ వర్ధంతి) -
రాజ్యాంగంలో ఆ 'రెండు' పదాలు మిస్సింగ్: అధిర్ రంజన్ చౌదరి
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చిన ప్రత్యేక పార్లమెంట్ సెషన్లలో భాగంగా మొదటిరోజు పాత పార్లమెంటుకు వీడ్కోలు పలకగా రెండో రోజు సభ్యులంతా కొత్త పార్లమెంటు భవనంలో అడుగు పెట్టారు. ఈ సందర్బంగా ఎంపీల చేతికి ఇచ్చిన భారత రాజ్యాంగం ప్రతుల్లో భారత రాజ్యాంగం ముందుమాటలో సాంఘిక, లౌకిక పదాలు లేకపోవడంపై కాంగ్రెస్ నేత అధిర్ రంజాన్ చౌదరి తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. మంగళవారం పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా ఎంపీలంతా కొత్త పార్లమెంట్ భవనంలోకి అడుగు పెడుతున్న నేపథ్యంలో వారి చేతికి భారత రాజ్యాంగ ప్రతులను అందించారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి తమకు ఇచ్చిన రాజ్యాంగ ప్రతుల్లోని పీఠికలో పొరపాట్లు ఉన్నాయన్నారు. అధిర్ రంజాన్ చౌదరి మాట్లడుతూ.. మాకు అందిచ్చిన రాజ్యాంగ ప్రతుల ప్రవేశికలో సాంఘిక, లౌకిక అన్న పదాలు ముద్రించలేదన్నారు. ఆ పదాలు రాజ్యాంగ పుస్తకంలో అంతకు ముందు లేవని 1976లో రాజ్యాంగ సవరణ తరవాతే ఆ పదాలను రాజ్యాంగ ప్రవేశికలో పొందుపరిచారన్న విషయం నాకు తెలుసు. కానీ ఇప్పుడు ఎవరైనా మన చేతికి రాజ్యాంగం అందించి అందులో ఈ పదాలు కనిపించకపోతే ఆందోళన చెందాల్సిందేనన్నారు. నాకు మాత్రం ఈ విషయం ఆందోళన కలిగించేదే. వారి ఉద్దేశ్యం చూస్తే నాకు అనుమానం కలుగుతోందన్నారు. నాకు ఈ విషయంలో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదు. లేదంటే ఈ అంశం గురించి కచ్చితంగా ప్రస్తావించేవాడినని అన్నారు. ఇక ఇండియా పేరును 'భారత్'గా మార్చే అంశంపై మాట్లాడుతూ.. 'ఇండియా' 'భారత్' పేర్లలో ఏదైనా ఒక్కటే.. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 1లో ఇండియాగా పిలవబడే భారత్, రాష్ట్రాల సమూహం అని కూడా సంబోధించారు. నా దృష్టిలో రాజ్యాంగం బైబిల్, ఖురాన్, భగవత్గీత గ్రంధాలకు ఏమాత్రం తక్కువకాదు. ఆ విషయంలో ఎవ్వరూ ఎటువంటి సమస్యను సృష్టించకుండా ఉంటే బాగుంటుందని అన్నారు. అధిర్ రంజాన్ చౌదరి, భారత రాజ్యాంగం, సాంఘిక, లౌకిక, రాజ్యాంగ పీఠిక ఇది కూడా చదవండి: పొలిటికల్ మైలేజి కోసమే బిల్లు పెట్టారు: కపిల్ సిబాల్ -
పరిషత్తులో అంబేడ్కరే లేకుంటే?!
‘‘స్వాతంత్య్ర పోరాటంలో అంబేడ్కర్ పోషించిన పాత్రేమీ లేకపోవడం ఆయన అద్భుతమైన జీవన ప్రగతిలో అత్యంత వివాదాస్పదమైన అంశం’’ అంటాడు అశోక్ లాహిరి. ఇదొక్కటే కాదు లాహిరి పుస్తకం ‘ఇండియా ఇన్ సెర్చ్ ఆఫ్ గ్లోరీ’ అంబేడ్కర్ గురించి వెల్లడించిన నమ్మశక్యం కాని నిజం. రాజ్యాంగ పరిషత్తుకు అంబేడ్కర్ ఏనాడూ నేరుగా ఎన్నికవలేదన్నదీ అలాంటి వాస్తవమే. 1945–46 ఎన్నికల్లో అంబేడ్కర్ రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నిక కాలేకపోయినప్పుడు ఆయనకు స్థానం కల్పించడం కోసం ముస్లిం లీగ్ శాసనసభ్యుడు జోగేంద్రనాథ్ మండల్ తన స్థానాన్ని త్యాగం చేశారు. అంబేడ్కర్ ఆనాడు పరిషత్తు సభ్యుడిగా లేకుంటే భారతదేశానికి ఎలాంటి రాజ్యాంగం తయారై ఉండేదో ఊహించండి. ప్రజాస్వామ్యానికి మాతృమూర్తి అని మనం నేడు చెప్పుకుంటున్న దేశం తన రాజ్యాంగ పితను కోల్పోయి ఉండేది. మన జాతిరత్నాల గురించి నిజంగా మనకు తెలుసునా? వాళ్లను మనం పీఠాలపై ప్రతిష్ఠించుకుని గౌరవించుకుంటాం. వారి గురించి తరచుగానూ, అనర్గళంగానూ మాట్లాడు కుంటూ ఉంటాం. వాళ్ల మాటల్ని కూడా యథాతథంగా స్వీకరించి మన జీవితాలకు బాటలు పరుచుకుంటాం. అయితే అదంతా వేరు, వాళ్ల గురించి తెలియడం వేరు. ఇటీవల నేను చదివిన ఒక పుస్తకం బి.ఆర్.అంబేడ్కర్ గురించి నాకు తెలియని అనేకమైన విషయాలను వెల్లడించింది. అవేవీ వాస్తవ విరుద్ధమైనవి కావు. అలాగే సుప్రసిద్ధమైనవి కూడా! అయితే అవి అందరికీ తెలిసిన మనిషిగా అంబేడ్కర్లో భాగమై ఉన్నవి కావు. ఎలాంటివంటే, నిజంగా ఆయనొక స్వాతంత్య్ర సమరయోధుడు కాదని మీకు తెలుసా? 1942 నుండి 1946 వరకు ఆయన వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో కార్మిక శాఖ మంత్రిగా ఉన్నారు. అంతకు ముందు, 1931లో ఆయన: ‘‘బ్రిటిష్ వారి నుండి భారత ప్రజలకు తక్షణ అధికార మార్పిడి జరగాలని అణగారిన వర్గాలవారు (అప్పుడు షెడ్యూల్డ్ కులాలు అని పిలిచేవారు) నిరసించలేదు. నినదించలేదు. ఉద్యమించలేదు’’ అని వ్యాఖ్యానించి ఉన్నవారు. ఈ విషయాన్ని నేను అశోక్ లాహిరి పుస్తకం ‘ఇండియా ఇన్ సెర్చ్ ఆఫ్ గ్లోరీ’ నుంచి గ్రహించాను. ‘‘స్వాతంత్య్ర పోరాటంలో అంబేడ్కర్ పోషించిన పాత్రేమీ లేకపోవడం అన్నది ఆయన అద్భుతమైన జీవన ప్రగతిలో అత్యంత వివాదాస్పదమైన అంశం’’ అంటాడు అశోక్ లాహిరి. అది నన్నెంతో విస్మయానికి గురి చేసిందని నేను ఒప్పుకొని తీరాలి. అయితే ఇదొక్కటి మాత్రమే కాదు లాహిరి పుస్తకం బహిర్గతం చేసిన నమ్మలేని నిజం. అంబేడ్కర్ అసలు రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికే కాలేదని తెలుస్తోంది. 1945–46 ఎన్నికల్లో ఆయన పార్టీ ‘ఆలిండియా షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్’ (ఎస్.సి.ఎఫ్.) 151 రిజర్వుడు సీట్లలో కేవలం రెండింటిని మాత్రమే గెలుచుకుంది. ‘బాంబే ప్రొవిన్షి యల్ అసెంబ్లీ’ నుంచి ఎస్.సి.ఎఫ్. ఒకే ఒక్క సీటును గెలుచుకున్న ఫలితంగా అంబేడ్కర్ రాజ్యాంగ పరిషత్తు సభ్యుడు కాలేకపోయారు. దాన్ని మించిన పరాజయం... అంబేడ్కర్‌కు మద్దతు ఇచ్చేందుకు ఎవరూ సిద్ధంగా లేకపోవడం! ‘‘డాక్టర్ అంబేడ్కర్‌కు రాజ్యాంగ పరిషత్తు తలుపులతో పాటుగా కిటికీలు కూడా మూసి వేయబడ్డాయి’’ అని సర్దార్ పటేల్ ప్రకటించారు. ‘‘చూద్దాం... రాజ్యాంగ పరిషత్తులోకి అతడెలా ప్రవేశిస్తాడో’’ అని కూడా అన్నారు. ఆ పరిస్థితుల్లో ముస్లిం లీగ్ శాసన సభ్యుడు జోగేంద్రనాథ్ మండల్ కాస్తా అంబేడ్కర్ వైపు నిలబడ్డారు. అంబేడ్కర్ కోసం తన సీటును త్యాగం చేశారు. అలా మండల్‌తో పాటు ఒకరిద్దరు ఎస్సీ ఎమ్మెల్యేలు, ఒకటీ లేదా రెండు ఆంగ్లో–ఇండియన్ ఓట్లతో బెంగాల్ నుంచి అంబేడ్కర్ రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికయ్యారు.1947 జూలైలో మళ్లీ ఆయన ఇబ్బందుల్లో పడ్డారు. బ్రిటిష్ పార్లమెంటు భారత స్వాతంత్య్ర చట్టాన్ని ఆమోదించిన తర్వాత ఇండియాకు ఒకటి, పాకిస్థాన్‌కు ఒకటిగా రాజ్యాంగ పరిషత్తు విభజన జరిగింది. పర్యవసానంగా బెంగాల్ నుంచి అనేకమంది సభ్యులు తమ భారత రాజ్యంగ పరిషత్తు సభ్యత్వాన్ని కోల్పోయారు. వారిలో అంబేడ్కర్ ఒకరు. అయితే మళ్లొకసారి ఆయన్ని ఊహించని అదృష్టం కాపాడింది. కాంగ్రెస్ పార్టీతో విభేదాల కారణంగా ఎం.ఆర్. జయకర్ రాజీనామా చేయడంతో ఆయన స్థానం ఖాళీ అయింది. అంతేకాదు... ఈసారి భారతదేశంలోని ప్రముఖ రాజకీయ నాయకులు అంబేడ్కర్ సభ్యత్వా నికి తోడ్పాటును అందించేందుకు íసిద్ధమయ్యారు. వారిలో రాజ్యాంగ పరిషత్తు చైర్మన్ రాజేంద్ర ప్రసాద్ ఒకరు. అప్పటి బొంబాయి ప్రధానమంత్రి బి.జి.ఖేర్‌కు ఆయన లేఖ రాశారు. ‘‘ఏ ఇతర పరిగణనలతోనూ నిమిత్తం లేకుండా తన సేవలను ఎవరూ వదులుకోలేని విధంగా ఉన్న ఆయన పనితీరును మాత్రమే గుర్తిస్తూ రాజ్యాంగ పరిషత్తులో, వివిధ కమిటీలలో ఆయన నియామకానికి ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. ఆయన బెంగాల్ నుంచి ఎన్నిక య్యారని మీకు తెలిసిందే! ఆ ప్రావిన్సు విభజన వల్ల 1947 జూలై 14 నుంచి ఆయన తన రాజ్యాంగ పరిషత్తు సభ్యత్వాన్ని కోల్పోవలసి వచ్చింది కనుక వెంటనే ఆయనను ఎన్నుకోవలసిన అవసరం ఉంది’’ అని అంబేడ్కర్‌కు ఆసరాగా నిలిచారు. చివరికి పటేల్ కూడా అంబేడ్కర్ పట్ల తన వైఖరి మార్చు కున్నారు. అంబేడ్కర్‌కు సభ్యత్వం ఇప్పించేందుకు ఖేర్‌ను ఒప్పించడంతో పాటు, జయకర్ రాజీనామా వల్ల ఏర్పడిన ఖాళీని భర్తీ చేయ బోయిన జి.వి. మావలంకర్కు నచ్చజెప్పి, ఆయన్ని పక్కకు తప్పించ డంలో పటేల్ కీలకమైన పాత్ర పోషించారని లాహిరి రాశారు. అంటే దేశానికి ఇది త్రుటిలో తప్పిన ముప్పు. అంబేడ్కర్ కనుక ఆనాడు రాజ్యాంగ పరిషత్తులో సభ్యుడిగా లేకపోయుంటే ఎలాంటి రాజ్యాంగం తయారై ఉండేదో ఊహించండి. ప్రజాస్వామ్యానికి మాతృమూర్తి అని మనం నేడు చెప్పుకుంటున్న దేశం తన రాజ్యాంగ పితను కోల్పోయి ఉండేది. ఈ పుస్తకంలోని నమ్మశక్యం కాని వాస్తవాలు నాలా మీలోనూ జనింపజేసే అవకాశం ఉన్న ఒక ప్రశ్నను లేవనెత్తడం ద్వారా నేను ఈ వ్యాసాన్ని ముగిస్తాను. అంబేడ్కర్‌కు, బహుశా భారతదేశానికి కూడా మార్గనిర్దేశం చేసిన హస్తం ఏదైనా ఉండిందా? అంబేడ్కర్ మన రాజ్యంగ పరిషత్తులో భాగం అని నిర్ధారించడానికి ఎవరిదైనా, లేదా ఏదైనా గట్టిగా ప్రభావం ఉన్నట్లు కనిపిస్తోంది. వాళ్లెవరు? అది ఏమిటి? అన్నదే ఆ ప్రశ్న. వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థలు, పార్లమెంట్ కంటే.. రాజ్యాంగమే సర్వోన్నతం
సాక్షి, న్యూఢిల్లీ: న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థలు, పార్లమెంట్ కంటే రాజ్యాంగమే సర్వోన్నతమైనదని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి.లోకూర్ అన్నారు. ఓ లీగల్ వెబ్సైట్ ఇంటర్వ్యూలో ఆయన పలు అంశాలను ప్రస్తావించారు. ‘‘పార్లమెంటు చట్టాలు రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నాయా, ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తున్నాయా అనే తనిఖీ బాధ్యతను రాజ్యాంగం న్యాయ వ్యవస్థకు అప్పగించింది. జాతీయ న్యాయ నియామకాల కమిషన్ వల్ల న్యాయవ్యవస్థకు స్వతంత్రత పోతుందనే భావనతో దాన్ని రాజ్యాంగ విరుద్ధంగా సుప్రీంకోర్టు ప్రకటించారని భావించరాదు’’ అని చెప్పారు. నిర్దిష్ట చట్టం, లేదా రాజ్యాంగ సవరణ రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణాన్ని ఉల్లంఘిన్నాయా, లేదా అనేది న్యాయ వ్యవస్థ నిర్ణయించాలని జస్టిస్ లోకూర్ అభిప్రాయపడ్డారు. వ్యవస్థలన్నింటిలోనూ పార్లమెంటే అత్యున్నతమని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ ఇటీవల పేర్కొన్న నేపథ్యంలో జస్టిస్ లోకూర్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
అధికారంలో ఔన్నత్యం చాటుకోవాలి
షెడ్యూల్డ్ ఏరియాల్లో జరుగుతున్న సంక్షేమ విధానాలకు సంబంధించి రాష్ట్రపతి ఎప్పుడు అడిగినా, ఆయా రాష్ట్రాల గవర్నర్లు వెంటనే నివేదికలు అంద జేయాల్సి ఉంటుంది. అంటే ఆదివాసీలు నివసించే ప్రాంతాలలో జరుగుతున్న ఎటువంటి కార్యక్రమాలనైనా రాష్ట్రపతి పర్యవేక్షించవచ్చు. రోజురోజుకీ పెరుగుతున్న ఆర్థిక అసమానతలు ఆదివాసీలను కుంగుబాటుకు గురిచేస్తున్నాయి. అందుకే ఒక ఆదివాసీ బిడ్డగా, ఒక నాయకురాలిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్యాంగంలో పొందుపరిచిన అధికారాలను సంపూర్ణంగా వినియోగిస్తే ఆదివాసుల జీవితాల్లో కొంతైన వెలుగు రాకపోతుందా అన్న ఆశ ఆదివాసీలు, ప్రగతిశీల వాదుల్లో ఉంది. అలా జరిగితే ఓ మూలవాసీ మహిళ రాష్ట్రపతిగా ఎంపికవడమనే విషయానికి ఓ ఔన్నత్యాన్ని తీసుకొస్తుంది. ‘ఈ ఆర్టికల్ రాజ్యాంగంలోని అన్నింటి కన్నా ముఖ్యమైనది. అణగారిన వర్గాలకు సంబంధించి మనం కేవలం రిజర్వేషన్ల వరకే పరిమితమయ్యాం. కానీ అణగారిన వర్గాలు ఎదుర్కొంటున్న అన్ని రకాల సమస్యలను పరిష్క రించడానికి ఈ ఆర్టికల్ అవకాశం ఇస్తుంది. దీనిని సమర్థవంతంగా అమలు చేయడానికి రాష్ట్రపతికి శక్తి మంతమైన అధికారాలిచ్చే విధంగా ఈ ఆర్టికల్‌ను పొందుపరచాలి’’ అంటూ రాజ్యాంగ సభ సభ్యుడు పండిట్ ఠాకూర్ దాస్ భార్గవ చేసిన వ్యాఖ్యలివి. భారత రాజ్యాంగ సభలో జూన్ 16, 1949న బాబాసాహెబ్ అంబేడ్కర్ ముసాయిదా రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టిన సందర్భంగా పండిట్ భార్గవ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. రాజ్యాంగ ముసాయిదాలో 301 నంబర్‌తో ఉన్న ఆర్టికల్ రాజ్యాంగ సభ ఆమోదం పొందిన రాజ్యాంగంలో 340గా పొందు పరి చారు. ‘‘భారత దేశంలో ఉన్న వెనుకబడిన తరగతులైన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ సామాజిక విద్యా విషయాలను పరిశోధించడానికి, పరిశీ లించడానికి రాష్ట్రపతి ఒక కమిషన్‌ను ఏర్పాటు చేయవచ్చును.’’ ఇది ఆర్టికల్ 340 సారం. అయితే ఇప్పటి వరకూ రాష్ట్రపతి పదవిని పొందిన చాలామంది ఇటువంటి ప్రయత్నాలు చేయలేదు. పదవ రాష్ట్రపతిగా పనిచేసిన డా.కె.ఆర్.నారాయణన్ మినహాయింపు. 2000 జూలై 12, 13 తేదీల్లో న్యూఢిల్లీలో జరిగిన గవర్నర్ల సదస్సులో ఎస్సీ, ఎస్టీ వర్గాల సంక్షేమ కార్యక్రమాల అమలు, ప్రత్యేకించి బడ్జెట్ కేటాయింపులు, విని యోగం, దారిమళ్ళింపు సమస్యలు, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ అత్యాచా రాల నిరోధక చట్టం అమలును గురించి అధ్యయనం చేయడానికి ఏడుగురు గవర్నర్లతో ఒక కమిటీని నియమించారు. అప్పటి మహా రాష్ట్ర గవర్నర్ పి.సి. అలెగ్జాండర్ అధ్యక్షతన, మేఘాలయ గవర్నర్ ఎం.ఎం. జాకబ్, కేరళ గవర్నర్ ఎస్.ఎస్. కాంగ్, కర్ణాటక గవర్నర్ వీఎస్ రమాదేవి, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ సూరజ్ భాను, ఒడిషా గవర్నర్ ఎం.ఎం. రాజేంద్రన్, హరియాణా గవర్నర్ బాబు పరమా నంద్ ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. 2000 ఆగస్టు 8న ఏర్పడిన కమిటీ, 2001 ఏప్రిల్ 28న తన నివేదికను రాష్ట్రపతికి సమర్పించింది. ఈ నివేదికలో భూ పంపిణీ, విద్య, గృహ వసతి, ప్రజారోగ్యం, వృత్తి, వ్యాపార అభివృద్ధి పథ కాలు, వీటన్నింటితో పాటు ఈశాన్య రాష్ట్రాల ప్రగతిపైనా ఎన్నో సిఫారసులు చేసింది. నిజానికి స్వాతంత్య్రానంతరం ఎస్సీ, ఎస్టీల సమస్యలపై అత్యున్నతమైన స్థానంలో ఉన్న గవర్నర్లు అన్ని రాష్ట్రాలు తిరిగి, సంబంధిత మంత్రులు, అధికారులు, సామాజిక వర్గాల సంస్థలు, సంఘాలతో సమావేశం కావడం విశేషం. అయితే అప్పటి ఎన్డీయే ప్రభుత్వం ఈ నివేదికను పట్టించుకోలేదు. కానీ ఈ కమిటీ ప్రయత్నం ఊరికేపోలేదు. ఎస్సీ, ఎస్టీల సమస్య పరిష్కారం కోసం పనిచేసే సంస్థలకు ఒక ఆయుధమై నిలిచింది. ఎన్నో రాష్ట్ర ప్రభు త్వాలు ఈ విషయాలను పరిగణనలోకి తీసుకున్నాయి. ఈ విషయాలను ప్రస్తావించడానికి ఇప్పుడొక సందర్భం వచ్చింది. 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము బాధ్యతలు స్వీకరించి ఆరు నెలలు కావస్తోంది. దక్షిణ భారతదేశ విడిది హైదరాబాద్‌లో ప్రస్తుతం రాష్ట్రపతి మొదటిసారి ఉంటున్నారు. రాష్ట్రపతికి ప్రభుత్వా లను కాదని, మార్పులు చేయగలిగే అధికారం లేకపోయి ఉండవచ్చు. కానీ 339, 340 ఆర్టికల్స్ ప్రకారం, అదేవిధంగా 5వ షెడ్యూల్లో షెడ్యూల్ తెగల కమిటీల రక్షణ విషయంలో రాష్ట్రపతి అధికారాలను, చొరవను రాజ్యాంగం నిర్దేశిస్తున్నది. రాజ్యాంగ పరిధిలో, అది అందించిన అధికారాలను ఉపయోగించి ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసం ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇచ్చే అవకాశం రాష్ట్రపతికి ఉంటుంది. దేశంలోని ఒక ప్రధాన ఆదివాసీ తెగౖయెన సంథాల్ సమూహానికి చెందిన మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ విషయంలో నారాయణన్ చూపిన చొరవను చూపాలనే ఆకాంక్షతోనే వీటన్నింటినీ ప్రస్తావిం చాల్సి వస్తోంది. మన రాజ్యాంగంలో ఆర్టికల్ 339 ప్రకారం, క్లాజు ఒకటి చెపుతున్న ఒక చట్టబద్ధమైన కమిషన్ ఇప్పటికే అమలులో ఉంది. ఆర్టికల్ 339 క్లాజు–2 కూడా రాష్ట్రపతికి ఎస్టీల సంక్షేమ కార్య క్రమాల రూపకల్పన, సమీక్ష విషయాలలో అధికారాలను ఇచ్చింది. ‘‘రాష్ట్రాల్లో ఎస్టీ సంక్షేమ కార్యక్రమాలను రూపొందిస్తున్న తీరును పరిశీలించి, వారికి తగు నిర్దేశకత్వం ఇవ్వవచ్చు’’ అనే క్లాజు ఒక ముఖ్యమైన అంశం. అదేవిధంగా 5వ షెడ్యూల్ కేవలం ఆదివాసీల రక్షణకు ఉద్దే శించిన హక్కుల పత్రం. ఐదవ షెడ్యూల్లో పేర్కొన్న హక్కుల రక్షణలో రాష్ట్రపతి పర్యవేక్షణ ప్రధానమైనది. ఐదవ షెడ్యూల్ పార్ట్ (ఎ)లో పేర్కొన్న మూడవ అంశం గురించి ప్రస్తావించుకుందాం. ఆదివాసీలు నివసించే ప్రాంతాలను షెడ్యూల్డ్ ఏరియాగా గుర్తించాలి. అక్కడ అమలు జరుగుతున్న సంక్షేమ విధానాలకు సంబంధించి ప్రతి సంవత్సరం లేదా రాష్ట్రపతి ఎప్పుడు అడిగినా, దేన్ని గురించి అడిగినా ఆయా రాష్ట్రాల గవర్నర్లు వెంటనే నివేదికలు అందజేయాలని నిర్దేశించారు. అంటే ఆదివాసీలు నివసించే ప్రాంతాలలో జరుగుతున్న ఎటువంటి కార్యక్రమాలనైనా రాష్ట్రపతి పర్యవేక్షించవచ్చు. తగు సూచ నలు, సలహాలు చేయవచ్చు. అదేవిధంగా పార్ట్(బి)లో 4వ అంశం ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్(టీఏసీ)కు విస్తృతమైన అధికారాలున్నాయి. షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టా లన్నా, ఆదివాసీలకు సంబంధించి ఎటువంటి చట్టాలు చేయాలన్నా, ఆ ప్రాంతాల్లో ఏదైనా ప్రాజెక్టుల నిర్మాణం జరగాలన్నా, ట్రైబల్ అడ్వై జరీ కౌన్సిల్ ఆమోదం తప్పనిసరి. ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ ఏర్పా టుకు సంబంధించి కూడా నిర్దిష్టమైన విధానాలను రాజ్యాంగంలో పొందుపరిచారు. టీఏసీలో 20 మంది సభ్యులకు మించి ఉండ కూడదనీ, వీరిలో 3/4వ వంతు ఆ రాష్ట్ర ఎస్టీ ఎమ్మెల్యేలు ఉండాలనీ నిబంధన కూడా ఉంది. ఆదివాసుల హక్కుల కోసం అన్ని రకాల చట్టాల అమలును పర్యవేక్షించడం, రాజ్యాంగ హక్కులను కాపాడడం టీఏసీ బాధ్యత. అయితే ప్రస్తుతం చాలా రాష్ట్రాలలో ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ అస్తిత్వం నామమాత్రంగానే మిగిలిపోవడవం బాధాకరం. చాలా రాష్ట్రాల ప్రభుత్వాలు ఆ సలహా మండలిని పట్టించుకున్న పాపానపోలేదు. ప్రస్తుతం దేశంలో కొనసాగుతున్న ఆర్థిక, సామాజిక స్థితిగతులు, ముఖ్యంగా కార్పొరేట్ కంపెనీలు ఆదివాసీ ప్రాంతాల్లో చేపడుతున్న ప్రాజెక్టుల తీరుచూస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలన్నీ సలహా మండళ్లను సంప్రదిస్తున్న దాఖలాలే లేవు. ఇటువంటి సందర్భంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాత్ర కీలకమౌతోంది. ఒక మహిళగా, ఆదివాసీ బిడ్డగా, అడవిబిడ్డల పేగు తెంచుకొని పుట్టిన ఒక నాయకురాలిగా రాజ్యాంగంలో పొందుపరిచిన రాజ్యాంగ అధికారాలను సంపూర్ణంగా వినియోగిస్తే ఆదివాసుల జీవితాల్లో కొంతైన వెలుగు రాకపోతుందా అన్న ఆశ ఆదివాసీలు, ప్రగతిశీల వాదుల్లో ఉంది. రోజు రోజుకీ పెరుగుతున్న ఆర్థిక అసమా నతలు, సామాజిక వ్యత్యాసాలు ఆదివాసీలను మరింత వెనుకబాటు తనానికి గురిచేస్తున్నాయి. ఆదివాసీల స్థితి గతులపై ఒక అధ్యయనం జరిపి, వారి సమస్యలకు ఒక సమగ్ర పరిష్కారం కనుగొనడానికి ప్రయత్నిస్తే, ద్రౌపది ముర్ములాంటి ఓ మూలవాసీ మహిళ రాష్ట్రపతిగా ఎంపికవడమనే విషయానికి ఓ ఔన్నత్యాన్ని తీసుకొస్తుంది. అణచి వేతకు గురౌతున్న ఆయా వర్గాల ప్రాతినిధ్యం అక్షరాలా సరైనదని రుజువవుతుంది. మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ 81063 22077 -
Constitution Day: ప్రాథమిక విధులే ప్రాథమ్యం
న్యూఢిల్లీ: ప్రాథమిక విధుల నిర్వహణే పౌరుల ప్రథమ ప్రాథమ్యంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. అప్పుడే దేశం ఉన్నత శిఖరాలకు చేరుతుందన్నారు. వాటిని పూర్తి అంకితభావంతో, చిత్తశుద్ధితో పాటించాలని పిలుపునిచ్చారు. నాడు గాంధీ మహాత్ముడు కూడా ఈ మేరకు పిలుపునిచ్చారని గుర్తు చేశారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా శనివారం సుప్రీంకోర్టులో జరిగిన వేడుకల్లో ఆయన మాట్లాడారు. అన్ని రంగాల్లోనూ వృద్ధి పథంలో శరవేగంగా దూసుకుపోతున్న భారత్‌వైపే ప్రపంచమంతా చూస్తోందన్నారు. వచ్చే ఏడాది జీ 20 శిఖరాగ్ర సదస్సుకు భారత్ అధ్యక్షత వహించనుండటాన్ని ప్రపంచ శ్రేయస్సులో మన పాత్రను అందరి ముందుంచేందుకు అతి గొప్ప అవకాశంగా అభివర్ణించారు. ‘‘ప్రపంచం దృష్టిలో దేశ ప్రతిష్టను మరింత ఇనుమడింపజేసేందుకు మనమంతా కలసికట్టుగా కృషి చేయాలి. ఇది మనందరి బాధ్యత. కేంద్రం అనుసరిస్తున్న ప్రజానుకూల విధానాలు పేదలను, మహిళలను సాధికారత దిశగా నడుపుతున్నాయి. రాజ్యాంగ స్ఫూర్తిని, ప్రాచీనకాలం నుంచి వస్తున్న విలువలను కొనసాగిస్తూ ప్రజాస్వామ్యానికి మాతృకగా భారత్ అలరారుతోంది. ఈ గుర్తింపును మరింత బలోపేతం చేయాలి’’ అని పిలుపునిచ్చారు. స్వాతంత్య్రానంతరపు కాలంలో జాతి సాంస్కృతిక, నైతిక భావోద్వేగాలన్నింటినీ మన రాజ్యాంగం అద్భుతంగా అందిపుచ్చుకుందని కొనియాడారు. స్వతంత్ర దేశంగా భారత్ ఎలా మనుగడ సాగిస్తుందోనన్న తొలినాటి అనుమానాలన్నింటినీ పటాపంచలు చేస్తూ భిన్నత్వమే అతి గొప్ప సంపదగా అద్భుత ప్రగతి సాధిస్తూ సాగుతోందన్నారు. ‘‘వందేళ్ల స్వతంత్ర ప్రస్థానం దిశగా భారత్ వడివడిగా సాగుతోంది. ఇప్పటిదాకా నడిచింది అమృత కాలమైతే రాబోయే పాతికేళ్లను కర్తవ్య కాలంగా నిర్దేశించుకుందాం. ప్రాథమిక విధులను పరిపూర్ణంగా పాటిద్దాం. రాజ్యాంగంతో పాటు అన్ని వ్యవస్థల భవిష్యత్తూ దేశ యువతపైనే ఆధారపడి ఉంది. రాజ్యాంగంపై వారిలో మరింత అవగాహన పెంచాల్సిన అవసరముంది. అప్పుడే సమానత్వం, సాధికారత వంటి ఉన్నత లక్ష్యాలను వారు మరింతగా అర్థం చేసుకుని ఆచరిస్తారు’’ అని చెప్పారు. రాజ్యాంగ పరిషత్తులో మహిళా సభ్యుల పాత్రకు తగిన గుర్తింపు దక్కలేదని ఆవేదన వెలిబుచ్చారు. ‘‘అందులో 15 మంది మహిళలుండేవారు. వారిలో ఒకరైన దాక్షాయణీ వేలాయుధన్ అణగారిన వర్గాల నుంచి వచ్చిన మహిళామణి’’ అని గుర్తు చేశారు. దళితులు, కార్మికులకు సంబంధించి పలు ముఖ్యమైన అంశాలు రాజ్యాంగంలో చోటుచేసుకునేలా ఆమె కృషి చేశారన్నారు. 26/11 మృతులకు నివాళి 2008 నవంబర్ 26న ముంబైపై ఉగ్ర దాడికి 14 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వాటిలో అసువులు బాసిన వారిని మోదీ గుర్తు చేసుకున్నారు. వారికి ఘనంగా నివాళులర్పించారు. ఇ–కోర్టు ప్రాజెక్టులో భాగంగా తీసుకొచ్చిన వర్చువల్ జస్టిస్ క్లాక్, జస్ట్‌ఈజ్ మొబైల్ యాప్ 2.0, డిజిటల్ కోర్ట్, ఎస్3వాస్ వంటి సైట్లు తదితరాలను ప్రారంభించారు. వీటిద్వారా కక్షిదారులు, లాయర్లు, న్యాయవ్యవస్థతో సంబంధమున్న వారికి టెక్నాలజీ ఆధారిత సేవలందించేందుకు వీలు కలగనుంది. వేడుకల్లో కేంద్ర న్యాయ మంత్రి కిరణ్ రిజిజు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, అటార్నీ జనరల్, సొలిసిటర్ జనరల్, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
Constitution: పౌరులకు పట్టం కట్టిన పత్రం
నేడు భారత రాజ్యాంగ దినోత్సవం. భారత ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిన మన రాజ్యాంగం సంపూర్ణ ఆమోదం పొందింది. అందువల్లనే ఏడు దశాబ్దాల తర్వాత కూడా అది ఒక పవిత్రమైన డాక్యుమెంటులా నిలిచి ఉంది. రాజ్యాంగాన్ని ఎంత చక్కగా, వివరంగా రాసుకున్నప్పటికీ... సంస్థలు, ప్రజలతో అది సంకేతాత్మక బంధాన్ని నెలకొల్పుకోవడంలో విఫలమైతే అలాంటి రాజ్యాంగానికి అర్థమే లేదని మన రాజ్యాంగ నిర్మాతలు చక్కగా గుర్తించారు. అందుకే తరం తర్వాత తరంలో రాజ్యాంగానికి ఆమోదనీయత పెరుగుతూనే వస్తోంది. అలాగే భారత రాజ్యాంగంతో మనసా వాచా అవిచ్ఛిన్న బంధాన్ని నెలకొల్పుకున్న దేశ సామాన్య పౌరుడికి కూడా మనం సెల్యూట్ చేయాల్సిన సమయమిది. వలస పాలనలో దాదాపు 200 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం మగ్గిన తర్వాత భారత దేశం 1947 ఆగస్టు 15 అర్ధరాత్రి స్వతంత్రదేశంగా మారింది. జాతి ఎంతో కష్టపడి సాధించిన ఈ స్వాతంత్య్రం, దీర్ఘకాలం కొనసాగిన పోరాట ఫలితమే. తమ ప్రాణాలను అర్పించిన లేదా తీవ్రమైన నిర్బంధాన్ని చవిచూసిన వేలాదిమంది మన దేశవాసులతో పాటు ఈ పురాతనమైన, ఘనమైన గడ్డమీది సాధారణ పౌరులు కూడా కన్న కలల ఫలితమే ఈ స్వాతంత్య్రం. వలస పాలనకు పూర్వ సహస్రాబ్దంలో అంతర్జాతీయ ఆర్థిక, సాంస్కృతిక శక్తి కేంద్రంగా భారతదేశం గుర్తింపు పొందుతూ వచ్చింది. కానీ, స్వాతంత్య్రం పొందిన నాటికి దారిద్య్ర భారతాన్ని వారసత్వంగా పొందాము. దీంతో భారత నవయువ రిపబ్లిక్‌తో దీర్ఘకాల ప్రయోగంపై పలు సందేహాలు వ్యక్తమయ్యాయి. ప్రత్యేకించి నిరక్షరాస్యత అలుముకున్న, దారిద్య్రం పేరుకున్న, ఆధునిక ప్రజాతంత్ర వ్యవస్థలు, సంస్థలు లేని మన జాతికి సార్వత్రిక వయోజన హక్కును కల్పించే విషయంలో, ప్రజాస్వామిక ఆదర్శ పాలనను చేపట్టడానికి సంబంధించిన ఆకాంక్షను వ్యక్తపరిచే విషయంలో పలు సందేహాలు అలుముకున్నాయి. అయితే రెండు వేల సంవత్సరాల క్రమంలో ఏర్పడుతూ వచ్చిన మన ప్రజాస్వామిక విలువలను లోతుగా అర్థం చేసుకున్న రాజ్యాంగ నిర్మాతలు... విధ్వంసం తప్పదని జోస్యం చెబుతున్న సంశయ వాదులను చూసి భయపడకుండా గట్టిగా నిలబడ్డారు. రాజ్యాంగ సభ సభ్యులు, మన గ్రామ గణతంత్రాలలో రూపు దిద్దుకుని ఉన్న సాంప్రదాయిక భాగస్వామ్య పాలనా రూపాలను లోతుగా అర్థం చేసుకున్నారు. అయితే అన్నిటికంటే మించి మన రాజ్యాంగ రూపకర్తలకు మార్గనిర్దేశం చేసిన ముఖ్యమైన విషయాన్ని చెప్పుకొని తీరాలి. సగటు భారతీయ పౌరుల ప్రజాస్వామిక సున్నితత్వంపై వారు సంపూర్ణ విశ్వాసం ఉంచారు. ఇది లేకుంటే భారత్ తనను తాను ఒక ప్రజాస్వామ్య మాతగా న్యాయబద్ధంగానే ప్రకటించుకోలేకపోయేది. ఆధునిక చరిత్రలో ‘అమృత్ కాల్’లోకి జాతి ఆత్మవిశ్వాసంతో అడుగులు వేసేలా మన మార్గాన్ని ప్రకాశవంతం చేసేందుకు మన రాజ్యాంగ పునాదిని రూపొందించిన ఆదర్శాలు, మూల సూత్రాలు నేటికీ బలంగా కొనసాగుతున్నాయి. డాక్టర్ రాజేంద్రప్రసాద్ అధ్యక్షత వహించిన రాజ్యాంగ సభ, బాబాసాహెబ్ డాక్టర్ భీమ్రావ్ అంబేడ్కర్ అధ్యక్షత వహించిన రాజ్యాంగ ముసాయిదా కమిటీ చేసిన నిర్విరామ ప్రయత్నాల వల్లే భారత రాజ్యాంగం మనకు వరప్రసాదమైంది. భారత ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిన మన రాజ్యాంగం సంపూర్ణ ఆమోదం పొందింది. అందువల్లనే ఏడు దశాబ్దాల తర్వాత కూడా అది ఒక పవిత్రమైన డాక్యుమెంటులా నిలిచి ఉంది. ప్రత్యేకించి రాజ్యాంగాల జీవితకాలం తరచుగా తక్కువగా ఉంటున్న, కొత్తగా విముక్తి పొంది అభివృద్ధి చెందుతున్న ప్రపంచంలో భారత రాజ్యాంగం సాధించిన విజయం సామాన్యమైంది కాదు. భారత రాజ్యాంగం మనసా వాచా ఎల్లప్పుడూ పౌరులందరి ఆత్మగౌరవం, సంక్షేమం కోసం నిలబడింది. దేశంలో రాజ్యాంగ ప్రజాస్వామ్య పునాదులను బలోపేతం చేయడంలో ప్రభుత్వ అంగా లన్నీ దశాబ్దాలుగా దోహదం చేస్తూ వచ్చాయి. దీని కారణంగానే మన దేశం ఆకలి, నిరక్షరాస్యత, దారిద్య్రం, వెనుకబాటుతనం వంటి వాటిని నిర్మూలించి, సమగ్ర అభివృద్ధి, జవాబుదారీతనం, పారదర్శ కత వైపు అలుపు లేని ప్రయాణం సాగించడానికి వీలుపడింది. ఈ క్రమంలో భిన్నత్వంలో ఏకత్వాన్ని, రాజకీయ సుస్థిరతను దేశం సాధించగలుగుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే స్వావలంబనను, సమానతను, దేశ పౌరులందరికీ నాణ్యమైన జీవితాన్ని కల్పించే కృషిని ప్రోత్సహిస్తున్న ఆధునిక సంక్షేమ రాజ్యంగా మారడానికి మన ప్రయాణాన్ని భారత రాజ్యాంగం సులభతరం చేసింది. రాజ్యాంగం అంటే ప్రకరణాలు, నిబంధనల సమాహారం మాత్రమే కాదు. భారత రాజ్యాంగపు అత్యంత ప్రధాన అంశం ఏమిటంటే, అది శిలాజం కాదు, ఒక సజీవ పత్రం. దీంట్లో మన జాతి ప్రాథమిక విలువలకు, నాగరికతకు ఆశ్రయమిచ్చే అనుల్లంఘనీయ మైన కేంద్రకం ఉంటుంది. అదే సమయంలో వేగంగా మారిపోతున్న ప్రపంచంలో ప్రజా ప్రయోజనాల డిమాండ్లకు ప్రతిస్పందించేలా ఎప్పటికప్పుడు మార్చుకోగల సరళమైన నిర్మాణాన్ని కూడా ఇది బల పరుస్తుంది. ఈ సరళత వల్లే పార్లమెంటు ఎప్పటికప్పుడు ప్రజా కేంద్ర కమైన రాజ్యాంగ సవరణలను చేయగలుగుతోంది. 75 ఏళ్ల స్వాతంత్య్రాన్ని పూర్తి చేసుకున్న మనం ఒక జాతిగా ఇంత వరకు సాగించిన ప్రయాణం పట్ల, విభిన్న రంగాల్లో మనం సాధించిన విజయాల పట్ల గర్వపడవచ్చు. ‘అమృత్ కాల్’లోకి మనం ప్రవేశిస్తూ, స్వావలంబనతో కూడిన, బలమైన ఐక్యమైన మహా జాతిగా వచ్చే 25 సంవత్సరాల్లో మారాలనే మన స్వప్న సాకారం కోసం మనల్ని మనం పునరంకితం చేసుకుంటున్నాము కాబట్టి మన ప్రజల్లో, మన రాజ్యాం గంలో మన విశ్వాసాన్ని మరోసారి ప్రకటించుకునే తరుణం ఇదే. ‘అమృత్ కాల్’లో భాగమైన ‘పంచ ప్రాణ్’ అంటే అర్థం, వచ్చే పాతికేళ్లలో అభివృద్ధి చెందిన భారత్ గురించి మనం చేసుకున్న తీర్మానం మాత్రమే. వలసవాద ఆలోచనా తీరునుంచి బయట పడటం, మన వారసత్పం పట్ల గర్వపడటం, ఐక్యతను, సంఘీ భావాన్ని బలోపేతం చేసుకోవడం, పౌరుల్లో కర్తవ్య పరాయణత్వాన్ని పోషించడం వంటి లక్ష్యాలు... 1949 నవంబర్ 26న మనం చట్ట రూపంలోకి మార్చుకుని ఆమోదించిన రాజ్యాంగ ఆదర్శాలను గుర్తిం చడంలో నిస్సందేహంగా తోడ్పడతాయి. 1931లోనే మహాత్మా గాంధీ రాశారు: ‘‘నైతిక బానిసత్వం నుంచి, ఆధారపడటం నుంచి భారత్‌ను విముక్తం చేసే రాజ్యాంగం కోసం నేను పరితపిస్తాను. అత్యంత నిరు పేదలు సైతం ఇది నా దేశం అని భావించే భారత్ కోసం నేను కృషి చేస్తాను. అగ్రకులం, తక్కువ కులం అనే తేడా లేని భారత్ కోసం నేను శ్రమిస్తాను. అన్ని సామాజిక బృందాలు సామరస్యంతో కలిసి జీవించే భారత్ కోసం నేను కృషి చేస్తాను. అలాంటి భారతదేశంలో అంటరాని తనం అనే శాపానికి తావు ఉండకూడదు. దోపిడీకి గురికావడం కానీ, దోపిడీ చేయడం కానీ లేని ప్రపంచంలో శాంతియుతంగా ఉండగలం. ఇదే నా స్వప్నాల్లో ఉంటున్న భారతదేశం.’’ సామాన్యుడిని కేంద్రస్థానంలో ఉంచగల రాజకీయ సౌర్వభౌమా ధికారం కలిగిన రాజ్యాంగం కోసం స్వాతంత్య్ర సమరం కాలంలోని రాజకీయ నేతలు ప్రయత్నించారు. సామాన్యుడి సంక్షేమం, ఆత్మ గౌరవానికి రాజ్యాంగంలో కీలక స్థానం ఉంటోంది. ‘పంచ ప్రాణ్’ను తీసుకుని, దాని సాకారం కోసం మనస్ఫూర్తిగా పనిచేయగలగాలి. అప్పుడే మన ప్రజాస్వామిక నైతిక విలువలు సంపూర్ణ వికసనాన్ని చూస్తాయి. అసంఖ్యాక స్వాతంత్య్ర సమరయోధుల స్వప్నాలను, త్యాగాలను గుర్తిస్తాయి. అప్పుడు మాత్రమే రెండు సహస్రాబ్దాలుగా మనం న్యాయబద్ధంగానే సాధించుకుని ఉన్న అగ్రగామి ప్రపంచ దేశంగా భారతదేశాన్ని తిరిగి నెలకొల్పగలుగుతాము. రాజ్యాంగం ప్రజలకు అధికారం కట్టబెడుతున్నట్లే, ప్రజలు కూడా రాజ్యాంగానికి అధికారం కట్టబెడతారు. రాజ్యాంగాన్ని ఎంత చక్కగా, వివరంగా రాసుకున్నప్పటికీ, సంస్థలు, ప్రజలతో అది సంకేతాత్మకంగా బంధాన్ని నెలకొల్పుకోవడంలో విఫలమైతే అలాంటి రాజ్యాంగానికి అర్థమే లేదని మన రాజ్యాంగ నిర్మాతలు చక్కగా గుర్తించారు. రాజ్యాంగ సభలోని ఒక గొప్ప వ్యక్తి ముందుచూపు, మేధాతత్వం, చాతుర్యం అనేవి రాజ్యాంగానికి రూపురేఖలు దిద్ద డంలో తోడ్పడ్డాయి. తరం తర్వాత తరంలో రాజ్యాంగానికి ఆమోద నీయత పెరుగుతూనే వస్తోంది. అలాగే భారత రాజ్యాంగంతో మనసా వాచా అవిచ్ఛిన్న బంధాన్ని నెలకొల్పుకున్న దేశ సామాన్య పౌరుడికి కూడా మనం సెల్యూట్ చేయాల్సిన సమయమిది. గత ఏడు దశాబ్దాల మన ప్రయాణంలోని ప్రతి సంక్లిష్టమైన మలుపులోనూ సామాన్య పౌరులే రాజ్యాంగ ఉన్నతాదర్శాల పట్ల తమ విశ్వాసాన్ని, నిబద్ధతను పునరుద్ధరించుకుంటా వస్తున్నారు. ఓం బిర్లా, వ్యాసకర్త, లోక్‌సభ స్పీకర్ (నేడు భారత రాజ్యాంగ దినోత్సవం) -
రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసే కుట్ర
భారత రాజ్యాంగం దానికదే ఒక విప్లవం. రెండు వేల సంవత్సరాలకు పైగా ఉన్న ఒక అసమాన వ్యవస్థ నిర్మాణాన్ని అది బద్దలు చేసింది. కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా భారతదేశంలో ఉన్న ప్రజలందరినీ ఒక్కటి చేయగలిగింది. అయితే కొంతకాలంగా రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతియ్యడానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగమే రాజ్యాంగ పీఠిక నుంచి ‘సోషలిస్టు’ (సామ్యవాద), ‘సెక్యులర్’ (లౌకికవాద) పదాలను తొలగించాలని సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం! పైగా తన వాదనకు బలం చేకూర్చుకోవడానికి సోషలిస్టు భావనను వ్యతిరేకించినట్టుగా అంబేడ్కర్ మాటలను ఆయన ఉటంకించారు. ఇది అంబేడ్కర్‌ను పూర్తిగా తప్పుగా అర్థం చేసుకోవడమే! భారతదేశ చరిత్రను అర్థం చేసుకోవాలంటే, ‘భారత రాజ్యాంగం అమలుకు ముందు, అటు తర్వాత’ అని చూడాల్సి ఉంటుంది. భారత రాజ్యాంగానికి ముందు ఈ దేశంలో మనుషులంతా ఒక్కటి కాదు. కులాలు, మతాలు, ప్రాంతాలుగా విడివడి ఉన్నారు. కుల సమాజాన్ని సృష్టించి, పెంచి పోషించిన మనువాదం ఒక పరిపాలనాపత్రంగా, అదే శాసనంగా, అదే రాజ్యాంగంగా అమలు అవుతూ సమాజంలో అంత రాలను ఇంకా బలంగా వేళ్ళూనుకొనేలా చేసింది. అలాంటి సంద ర్భంలో కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా భారతదేశంలో ఉన్న ప్రజలందరినీ రాజ్యాంగం ఒక్కటి చేయగలిగింది. అప్పటి వరకు కులాన్ని బట్టి విలువ ఉండేది. ఒక్కొక్క కులానికి ఒక్కొక్క విలువను మనువాదం ప్రబోధించింది. కానీ భారత రాజ్యాంగం ప్రతి పౌరునికి ఒక ఓటు, ఒక ఓటుకు ఒకే విలువను కల్పించి, కనీసం దానిలోనైనా ఒక సమానత్వ ప్రపంచాన్ని అందించింది. అందుకే భారత రాజ్యాంగం దానికదే ఒక విప్లవం. రెండు వేల సంవత్సరాలకు పైగా ఉన్న ఒక అసమాన వ్యవస్థ నిర్మాణాన్ని అది బద్దలు చేసింది. అయితే కొంతకాలంగా భారత రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బ తియ్యడానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగం గానే గతవారం కేంద్ర మాజీ మంత్రి సుబ్రహ్మణ్యస్వామి రాజ్యాంగ పీఠిక నుంచి ‘సోషలిస్టు’(సామ్యవాద), ‘సెక్యులర్’ (లౌకిక వాద) పదాలను తొలగించాలని పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ సెప్టెంబర్ 23న విచారణకు రానున్నది. ఇదే విషయమై, 2020 జూలైలో న్యాయవాది విష్ణు శంకర్ కూడా పిటిషన్ వేశారు. ఈ రెండు పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణకు అంగీకరించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తుల నేతృత్వంలోని ధర్మాసనం ముందు దీన్ని విచారించనున్నారు. సోషలిస్టు, సెక్యులర్ అనే పదాలు రాజ్యాంగ సభ ద్వారా ఆమోదించిన పీఠికలో లేవనీ, 1976లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ వీటిని చేర్చారనీ, రాజ్యాంగ సభ చర్చలలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ లాంటి వాళ్ళు కూడా వీటిని వ్యతిరేకించారనీ ఈ పిటిషన్లో పేర్కొ న్నారు. పిటిషనర్‌గా ఉన్న సుబ్రహ్మణ్యస్వామి తన వాదనకు బలం చేకూర్చుకోవడానికి బాబాసాహెబ్ అంబేడ్కర్ మాటలను ఉటం కించినట్టు కనిపిస్తున్నది. అయితే, అంబేడ్కర్ మాటలను పరిశీలిస్తే సుబ్రహ్యణ్యస్వామియే అంబేడ్కర్‌ను తప్పుగా అర్థంచేసుకున్నట్టు కనిపిస్తున్నది. ఆ రోజు సభలో అంబేడ్కర్ మాట్లాడుతూ... ‘‘రాజ్యాం గాన్ని మనం ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా రూపొందించు కోవాలి. భవిష్యత్‌లో ప్రజలు ఎటువంటి విధానాలను అవలంబించా లనుకుంటారో వారికి అవకాశం ఇవ్వాలి. అంతేగానీ ఇప్పుడే అన్ని విషయాలను ముగించకూడదు. అంతేకాకుండా, రాజ్యాంగంలోని నాలుగవ భాగమైన ఆదేశిక సూత్రాల్లో పొందుపరిచిన అంశాలన్నీ కూడా సోషలిస్టు భావనలను సమర్థిస్తు్తన్నాయనే విషయాన్ని గుర్తుం చుకోవాలి’’ అంటూ రాజ్యాంగ సభకు కేటీ షా ప్రతిపాదించిన సవరణకు సమాధానమిచ్చారు. అంబేడ్కర్ ఎక్కడా, సోషలిస్టు భావనను వ్యతిరేకించింది లేదు. పైగా దాని సారాంశాన్ని ఆదేశిక సూత్రాల్లో పొందుపరిచినట్టు పేర్కొన్నారు. సరిగ్గా ఇక్కడే అంబేడ్కర్‌ను అర్థం చేసుకోవడానికి రాజ్యాంగ సభలో మాట్లాడింది మాత్రమే సరిపోదు. ఒకరకంగా అది అప్పటి నాయకుల ఉమ్మడి అభిప్రాయం కూడా కావచ్చు. అయితే అంబేడ్కర్ మొదటినుంచీ సమానత్వ సమాజ స్థాపనకు పాటుపడిన వ్యక్తి. అంతేకాకుండా, రాజ్యాంగ సభలో తాను సభ్యుడిగా ఉంటానో లేదో నని భావించి, 1946లో రాజ్యాంగ సభకు ఒక మెమోరాండంను సమర్పించారు. దానినే ‘స్టేట్స్ అండ్ మైనారిటీస్’ అంటారు. అందులో ప్రభుత్వం సోషలిస్టు విధానాలను అనుసరించాలని, దానికి స్టేట్ సోషలిజం అనే మాటను కూడా ఆయన వాడారు. అందులో ఆర్థికపరమైన అంశాలను పేర్కొంటూ– దేశంలోని భారీ పరిశ్రమలను ప్రభుత్వమే నిర్వహించాలనీ, ఇన్సూరెన్స్ లాంటి ఆర్థిక సంస్థలు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండాలనీ, దేశవ్యాప్తంగా ఉన్న భూములను జాతీయం చేయాలనీ ప్రతిపాదించారు. ఈ విషయాలన్నింటినీ రాజ్యాంగంలో పొందుపరచడానికి తన శాయశక్తులా కృషి చేశారు. అయినా సఫలం కాలేదు. అటువంటి సామాజిక మార్పును కోరుకుని, దాని కోసమే యావత్ జీవితాన్నే ప్రజలకు సమర్పించిన ఓ మహో న్నత వ్యక్తి వ్యాఖ్యలను తప్పుగా, తమ సోషలిస్టు వ్యతిరేక భావాలకు మద్దతుగా వాడుకోవడం విచారకరం. ఈ విషయం అట్లా ఉంచితే, 1976లో అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ïపీఠికలో ‘సోషలిస్టు, సెక్యులర్’ అనే పదాలను మాత్రమే కాకుండా, ఇంకా చాలా విష యాలను రాజ్యాంగంలో చేర్చారు. అయితే 1977లో జనతాపార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత చాలా విషయాలను 43వ సవరణ ద్వారా తొలగించారు. అయితే రాజ్యాంగ పీఠికలోని ఆ రెండు పదాల జోలికి మాత్రం పోలేదు. ప్రస్తుత పిటిషనర్ సుబ్రహ్యణ్యస్వామి అప్పుడు జనతాపార్టీ లోక్‌సభ సభ్యుడిగా గెలిచారు. మరి అప్పుడు తన గొంతును ఎందుకు వినిపించలేదో ఆయనకే తెలియాలి. 2008లో ‘గుడ్ గవర్నెన్స్ ఇండియా ఫౌండేషన్’కు చెందిన సంజీవ్ అగర్వాల్ ఇదే విషయమై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కె.జి.బాలకృష్ణన్ నాయకత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ పిటిషన్‌ను తిరస్కరించింది. ‘‘సోషలిజం అనగానే అదేదో కమ్యూనిస్టులకు సొంతమైనట్టు అను కోవడం సరైనది కాదు. ప్రజల సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడం కూడా అందులో భాగమే’’ అని వ్యాఖ్యానించింది. అందు వల్ల ఆ పదాలను తొలగించాల్సిన అవసరమే లేదని భారత అత్యు న్నత న్యాయస్థానం ఆనాడు కుండ బద్దలుకొట్టింది. ప్రస్తుతం మళ్లీ ఎందుకు ఈ ప్రతిపాదన ముందుకుతెస్తున్నారనేది ప్రశ్న. దీనికి ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక, సామాజిక విధానాలు... సోషలిస్టు, సెక్యులర్ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయి. ముఖ్యంగా ప్రభుత్వరంగ పరిశ్రమలను, ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు, కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడం చూస్తూనే ఉన్నాం. అదేవిధంగా మైనారిటీ మతాలను, వాటికి సంబంధించిన సంస్థలను వేధిస్తుండడం ఎక్కువైందని అంత ర్జాతీయ సంస్థలు ఎన్నో నివేదికల ద్వారా వెల్లడించాయి. ఎవరైనా ఈ విషయాలన్నింటినీ కోర్టుల్లో సవాల్ చేస్తారని ముందే ఊహించి, వాటిని తొలగిస్తే ఇక నైతికంగా కూడా తమకు ఎదురు ఉండదని భావించి అటువంటి పిటిషన్‌ను అధికార పార్టీ సభ్యుడే వేయడం జరిగి ఉండొచ్చనే అభిప్రాయానికి రావడవం తప్పేమీకాదు. అదే విధంగా భారత దేశంలో హిందూమతాన్ని అధికార మతంగా చేయడానికి ఒక ప్రయత్నం జరుగుతున్నది. దానికి రాజ్యాంగాన్నే మార్చేయాలనే ప్రయత్నం చేస్తున్నట్టు సా«ధువులు, సంతులు స్వయంగా ప్రకటించారు. అందుకనుగుణంగానే ఇప్పటికే ముప్ఫై పేజీల డాక్యుమెంటు రూపొందించినట్టు కూడా ప్రకటించారు. ఇటువంటి నేపథ్యం నుంచి ఈ పీఠికను చూడాల్సి ఉంది. నిజానికి రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు సోషలిస్టు, సెక్యులర్ స్ఫూర్తిని బలపరచడమే కాకుండా నిర్దిష్టమైన మార్గాన్ని చూపుతున్నాయి. సోషలిస్టు, సెక్యులర్ పదాలు భారత రాజ్యాంగాన్ని మరింత శక్తిమంతం చేస్తున్నాయే తప్ప ఎటువంటి దుష్ప్రభావాన్నీ కలిగించడం లేదు. భారత రాజ్యాంగ రక్షణ ఈ దేశ సామాజిక ప్రగతికీ, మనుగడకూ ఒక తక్షణ అవసరంగా ఉంది. అందువల్ల రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసే ఇటువంటి కుట్రలను భారత సమాజం సహించబోదని ఆశిద్దాం. (చదవండి: చరిత్రను పాతిపెట్టి ఏం బావుకుంటారు?) - మల్లెపల్లి లక్ష్మయ్య సామాజిక విశ్లేషకులు -
ఆంగ్ల సహన పాఠం నేర్చుకుందామా?
బ్రిటన్ ఒకప్పుడు భారత దేశ వలసాధిపతిగా ఉండేది. కానీ ప్రస్తుతం భారత సంతతికి చెందిన ఒక కన్సర్వేటివ్ పార్టీ నాయకుడు బ్రిటన్ ప్రధానమంత్రి పదవి బరిలో ఉన్నారంటేనే ప్రపంచం ఎంతగా మారిపోయిందో బోధపడుతుంది. క్రైస్తవులకు ప్రాధాన్యత ఉన్న బ్రిటన్‌లో రిషీ సునాక్ తనది హిందూమతం అని చెబుతూ, ప్రధాని అభ్యర్థిగా బరిలో నిలబడుతున్నారు. అక్కడి ప్రతిపక్ష నేత లేదా ప్రధాని పదవికి పోటీచేస్తున్న ఆయన పార్టీకి చెందిన వారెవరూ కూడా సునాక్ మతాన్ని ప్రశ్నించడం లేదు. అతడి సంపదను ప్రశ్నిస్తున్నారు. కార్మికవర్గం పట్ల అతడి వైఖరిని ప్రశ్నిస్తున్నారు. కానీ అదే భారత్‌లో ఒక ముస్లిం, లేదా క్రిస్టియన్ని ప్రధాని అభ్యర్థిగా అంగీకరించేవారు కాదు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి తల్లిలాంటి బ్రిటన్... సహన భావం గురించి, సమానత్వం గురించి ఇండియాకు ఒక ముఖ్యమైన పాఠం నేర్పుతోంది. భారత సంతతికి చెందిన బ్రిటిష్ రాజకీయ నేత రిషీ సునాక్ కన్సర్వేటివ్ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తూ బ్రిటన్ ప్రధానమంత్రి పదవి కోసం పోటీపడుతున్నారు. కొన్ని సంవత్స రాల క్రితం అమెరికన్ అధ్యక్ష పదవికి డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థిగా కమలా హారిస్ ప్రయత్నించిన విషయం తెలిసిందే. ఆమె తర్వాత రాజకీయ ఉన్నత పదవిని అందుకోవడానికి పశ్చిమ దేశాల్లోని భారత సంతతి వలస ప్రజల్లో ఇటీవల వేగంగా దూసుకొచ్చిన వ్యక్తి రిషీ సునాక్. బ్రిటన్ ఒకప్పుడు భారత దేశ వలసాధిపతిగా ఉండేది. భారతీయ కోణం నుంచి చూస్తే బ్రిటిష్ ప్రధానమంత్రి అంటే దోపిడీ సామ్రాజ్యానికి చారిత్రాత్మకమైన రాజకీయ ప్రతినిధిగా మాత్రమే కనిపిస్తారు. అదే సమయంలో అది సంస్కరణల సామ్రాజ్యం కూడా అని గుర్తుంచుకుందాం. మరి బ్రిటిష్ వలస పాలనా కోణం నుంచి చూస్తే, దానికి వ్యతిరేకంగా స్వాతంత్య్రం కోసం హక్కుల ప్రాతి పదికన పోరాటం చేసి ఉండకపోతే, భారతదేశం 1947లో ప్రజాస్వామిక, రాజ్యాంగబద్ధ రిపబ్లిక్ అయి ఉండేదికాదు. హిందూ లేదా బౌద్ధం... అది ఏదైనా కావచ్చు, మన ప్రాచీన నిర్మాణాలలోనే మన ప్రజాస్వామ్యానికి మూలాలు ఉన్నాయని మనం ఎంత గట్టిగా చెప్పుకున్నప్పటికీ. చర్చలో మతం లేదు మన స్వాతంత్య్ర పోరాటం, వలస జీవితానికి సంబంధించిన అన్ని కీలక అంశాలూ బ్రిటిష్ రాజకీయ వ్యవస్థతో అనుసంధానమై ఉండేవి. ప్రత్యేకించి 20వ శతాబ్ది ప్రారంభం నుంచి బ్రిటిష్ ప్రధాని అంటే వలసపాలనా చిహ్నంగానే భారతీయ ఆందోళనాకారులు భావించేవారు. దూషించడానికైనా, అభ్యర్థించడానికైనా బ్రిటిష్ ప్రధానే మన తలపుల్లో ఉండేవారు. ఈ చారిత్రక నేపథ్యంలో, ప్రస్తుతం భారత సంతతికి చెందిన ఒక కన్సర్వేటివ్ పార్టీ నాయకుడు బ్రిటిష్ ప్రధానమంత్రి పదవి కోసం బరిలో ఉన్నారంటేనే ప్రపంచం ఎంతగా మారిపోయిందో బోధపడుతుంది. హిందూ– జాతీయవాదం ప్రేరేపిస్తున్న వివక్షను భారత్ ఎదుర్కొంటున్న ఈ తరుణంలో క్రైస్తవులకు ప్రాధా న్యత ఉన్న బ్రిటన్‌లో ఒక వ్యక్తి తనది హిందూ మతం అని చెబుతూ, ప్రధాన మంత్రి పదవికి అభ్యర్థిగా బరిలో నిలబడుతున్నారు. బ్రిటన్ పార్ల మెంటు సభ్యుడిగా, తర్వాత ఆర్థిక మంత్రిగా ఆయన గతంలో భగవద్గీత సాక్షిగా ప్రమాణం చేశారని మనం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు అదే హిందూ సునాక్... బ్రిటన్ ప్రధాని అధికారిక నివాస భవనమైన 10 డౌనింగ్ స్ట్రీట్‌కు వెళ్లాలని కోరుకుంటున్నారు. సునాక్ భార్య అక్షత హిందూ భారతీయ కోటీశ్వరుల కుమార్తె. సునాక్ సంపద ఇప్పుడు ప్రజల్లో చర్చించుకునే అంశమైంది. ఎందుకంటే ఆర్థిక, సామాజిక వర్గాలు చాలాకాలంగా బ్రిటిష్ రాజకీయాల్లో భాగంగా ఉంటున్నాయి. అయితే సునాక్ మతం మాత్రం ప్రస్తుతానికి చర్చనీయాంశంగా కనిపించడం లేదు. బ్రిటన్ ఓటర్లు, రాజకీయ వర్గంలో గణనీయంగా గుర్తించదగిన బహుళ సాంస్కృతిక సహన స్థాయిని ఇది సూచిస్తోంది. ఈ కోణంలో, అమెరికా కంటే మరింత లౌకికమైన, బహుళ సాంస్కృతిక దేశం బ్రిటనే అని నేను అనుకుంటున్నాను. కమలా హారిస్ గనక తనను తాను హిందువు అని బహిరంగంగా చెప్పుకునివుంటే, డెమొక్రాటిక్ పార్టీ టికెట్‌ని గెల్చుకునేవారు కాదని నా అనుమానం. ఆంగ్లికన్ క్రిస్టియానిటీ బ్రిటన్ అధికార మతం. చర్చ్ ఆఫ్ ఇంగ్లండ్ హెడ్ ఎలిజబెత్ రాణి. అయినా సరే బ్రిటన్ ప్రధానమంత్రి కావాలన్న రిషీ సునాక్ కోరికను మత ప్రాతిపదికన అసంగతమైన అంశంగా అక్కడ ఎవరూ చూడటం లేదు. ఇదేనా సహనం? అదే భారతదేశం విషయానికి వస్తే, బ్రిటన్‌కు కాబోయే ప్రధానిగా అవకాశమున్న, దానికి అక్కడి సమాజ ఆమోదం పొందిన భారత సంతతి హిందువు గురించి ఆరెస్సెస్, బీజేపీ ఏమని ఆలోచిస్తాయో ఊహించగలరా? ఎందుకంటే వీళ్లు భారతీయ ముస్లింలను, క్రిస్టియన్లను మతపరమైన మెజారిటీవాద అజెండాతో అట్టడుగున పడేశారు. పార్లమెంటు ఉభయసభల్లో బీజేపీ తరపున ఒక్క ముస్లిం కూడా లేరు. అలాగే భారత ప్రభుత్వ మంత్రివర్గంలో ఒక్క ముస్లిం కూడా లేరు. (అదే బోరిస్ జాన్సన్ నేతృత్వంలోని ఆయన మంత్రి వర్గంలో భారత్ కంటే ఎక్కువ ముస్లింలు ఉన్నారు.) హిందూయిజం ప్రపంచానికే విశ్వగురువుగా ఉందంటూ ఆరెస్సెస్, బీజేపీ శక్తులు పదేపదే ఎత్తిపడుతున్నాయి. ఇక ఆరెస్సెస్ సాహిత్యమంతా బ్రిటిష్ వారిపై, క్రిస్టియన్ నాగరికతా చరిత్రపై మతయుద్ధ వీరులు, వలసవాద విస్తరణవాదులు అంటూ దాడులతో నిండిపోయింది. దేశంలో ఇప్ప టికీ కొనసాగుతున్న కుల అంతరాలు, దళితులపై దౌర్జన్యాలు వంటి సామాజిక దుర్మార్గాలను ఏమాత్రం పట్టించుకోని ఈ కూటమి, ప్రపంచం లోనే అత్యంత సహనభావం కలిగినది హిందూ మతమేనని మాత్రమే గొప్పగా చెప్పుకుంటుంది. మరోవైపున వీరి తాజా చరిత్ర వర్ణనలో స్థానిక భారతీయ ముస్లింలను, క్రిస్టియన్లను కూడా శత్రువులుగా పరిగణిస్తున్నారు. నేడు బ్రిటన్‌లో హిందువులు చిన్న మైనారిటీగా ఉంటున్నారు. జనాభాలో వీరి వాటా 1.6 శాతం మాత్రమే. వీరు బ్రిటన్‌కి ఇటీవలే వలస వచ్చినవారు, వారి వారసులతో కూడి ఉన్నారు. అయినప్పటికీ మైనారిటీవాదం బ్రిటన్ ప్రజా స్వామిక పోటీలో ప్రధాన పాత్ర వహిస్తున్నట్లు కనిపించడం లేదు. అదే ఆరెస్సెస్, బీజేపీ భారత్‌లో గానీ, చివరకు గతకాలపు కాంగ్రెస్ హయాంలో గానీ ఒక ముస్లిం, లేదా క్రిస్టియన్ని ప్రధానమంత్రి పదవికి అభ్యర్థిగా అంగీకరించేవారు కాదు. ఇలా హిందూయిజం సహనభావం గురించి చెప్పుకోవ లసింది చాలానే ఉంది మరి. ప్రజాస్వామ్యంలో అసలైన ప్రశ్నలు ఇవే... క్రిస్టియన్ వలసవాద సామ్రాజ్యాన్ని బ్రిటన్ సర్వవ్యాప్తం చేసింది. కానీ ఇప్పుడు అదే బ్రిటన్ అత్యున్నత పదవికి సునాక్ పోటీ చేయడాన్ని అనుమతిస్తోంది. బ్రిటన్‌లోని ప్రతిపక్ష నేత లేదా ప్రధాని పదవికి పోటీచేస్తున్న ఆయన పార్టీకి చెందిన వారెవరూ కూడా సునాక్ మతాన్ని ప్రశ్నిం చడం లేదు. అతడి సంపదను ప్రశ్నిస్తున్నారు. కార్మికవర్గం పట్ల అతడి వైఖరిని ప్రశ్నిస్తున్నారు. అతడి భార్య పన్ను ఎగవేత గురించి ప్రశ్నిస్తు న్నారు. ప్రజాస్వామ్యంలో సంధించవలసిన అసలు సిసలైన ప్రశ్నలు ఇవే. కానీ ఇలాంటి ప్రశ్నలు భారత్‌లో అరుదుగానే అడుగుతుంటారు. బ్రిటన్ ప్రధాని పదవికి రిషి సునాక్ వేసిన అభ్యర్థిత్వ ఫలితం పట్ల నేను అజ్ఞేయవాదిగానే ఉంటాను. బ్రిటన్ భావి ప్రధాని ఎంపికలో ఫలితాలు ఎలా అయినా ఉండనివ్వండి... కానీ పార్ల మెంటరీ ప్రజాస్వామ్యానికి తల్లిలాంటి బ్రిటన్... సహన భావం గురించీ, సమానత్వం గురించీ భారతదేశానికి ఒక ముఖ్యమైన పాఠం నేర్పు తోందని నాకు తెలుసు. కానీ భారతదేశం మాత్రం ఆ పాఠాన్ని నేర్చుకునే దేశంగా మాత్రం ఉండటం లేదని నా భావన. వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ -
రాజ్యాంగంపై విమర్శలు: ఎట్టకేలకు మంత్రి సాజీ రాజీనామా
తిరువనంతపురం: భారత రాజ్యాంగంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన.. కేరళ మత్స్యశాఖ మంత్రి సాజీ చెరియన్ తన పదవికి రాజీనామా చేశారు. భారత రాజ్యాంగాన్ని అవమానపరిచారంటూ ఆయనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసే ఉంటుంది. ఈ తరుణంలో రాజకీయ ఒత్తిళ్ల మేరకు.. బుధవారం సాయంత్రం కేబినెట్ పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. వీలైనంత మంది సాధారణ ప్రజలను దోచుకునేలా మన రాజ్యాంగాన్ని రాశారని సాజీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. పాతానమిట్ట జిల్లాలో జరిగిన సీపీఎం సమావేశాల్లో మాట్లాడుతూ ఆయన పై వ్యాఖ్యలు చేశారు. చెరియన్ కామెంట్లపై రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. చెరియన్ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ముఖ్యమంత్రి విజయన్ ను గవర్నర్ కోరారు. మరోవైపు తన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో చెరియన్ దిద్దుబాటు చర్యలకు దిగారు. తాను రాజ్యాంగాన్ని దూషించలేదని చెప్పారు. తనకు రాజ్యాంగంపై ఎంతో గౌరవం ఉందని అన్నారు. పాలనా వ్యవస్థ సరిగా లేదని, ఆ కోణంలోనే తాను మాట్లాడానని వివరణ ఇచ్చారు. అంతేకాదు, తాను చేసిన వ్యాఖ్యలకు ఆయన క్షమాపణలు కూడా చెప్పారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యుడిఎఫ్) ఈ వ్యవహారంపై అసెంబ్లీలో వాయిదా తీర్మానాన్ని స్వీకరించడానికి సిద్ధమైంది. ఈ క్రమంలో రాజ్యాంగాన్ని, రాజ్యాంగ రూపకర్తలను చెరియన్ అవమానించారంటూ వ్యతిరేక నినాదాలు చేశాయి విపక్షాలు. ఈ క్రమంలో చర్చ జరగకుండానే.. స్పీకర్ ఎంబి రాజేష్ సభను వాయిదా వేశారు. ఈ చర్యపై నిరసన వ్యక్తం చేస్తూ.. స్పీకర్ కార్యాలయంలో విపక్షాలు నిరసన చేపట్టాయి. చెరియన్ పై చర్యలు తీసుకోవాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆయనపై చర్యలు తీసుకోకుంటే కోర్టుకు వెళతామని హెచ్చరించాయి. బీజేపీ లేఖ రాయడం, చివరకు సొంత పార్టీ నేతల ఒత్తిళ్ల మేరకు ఆయనే రాజీనామా చేశారు. -
రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్న మోదీ: భట్టి
ఎర్రుపాలెం: భారత రాజ్యాంగం, ప్రజా స్వామ్యాన్ని ప్రధాని మోదీ అపహాస్యం చేస్తున్నారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్ర మార్క ఆరోపించారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో భట్టి చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర శనివారం ఎర్రుపాలెం మండలంలోని బనిగం డ్లపాడు, పెద్దగోపవరం, బంజర, కండ్రిక, తెల్లపాలెం, ఎర్రుపాలెం గ్రామాల్లో సాగింది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభల్లో భట్టి మాట్లాడుతూ అంబేడ్కర్ రాసిన రాజ్యాం గాన్ని కాకుండా మోదీ సొంత రాజ్యాంగం అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమ ర్శించారు. వచ్చే ఎన్నికల్లో దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికా రంలోకి రావడం ఖాయమని భట్టి ధీమా వ్యక్తం చేశారు. -
స్వతంత్ర భారతి: హిందూ వివాహ చట్టం
హిందూ వివాహ చట్టం 1955కి రూపకల్పన జరిగింది. అయితే ఈ చట్టం స్త్రీల పట్ల వివక్ష చూపుతోందనే విమర్శలూ ఉన్నాయి. భారత రాజ్యాంగం ఆర్టికల్ 14 కింద సమానత్వానికి, ఆర్టికల్ 15 కింద వివక్షా రాహిత్యానికి హామీ ఇచ్చింది కానీ కుటుంబం లోపల వివాహ వ్యవస్థలో స్త్రీపై పురుషుడి ఆధిక్యత కొనసాగుతూనే ఉందన్నది కొందరు స్త్రీవాదుల పరిశీలన. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత రూపొందిన 1955 నాటి హిందూ వివాహ చట్టాన్ని మనం పరిశీలించినప్పుడు వివక్ష అన్నది స్పష్టంగా కనిపిస్తుంది అని మహిళా హక్కుల న్యాయవాదుల అభిప్రాయం. ‘‘వివాహ వ్యవస్థ లోపల మహిళల ప్రతిపత్తి పురుషులతో పోలిస్తే చాలా వ్యత్యాసంతో ఉంటుంది. పురుషుడు సంపాదనాపరుడు, అతడి సంపాదనను ఆర్థిక పదబంధాలతో కొలుస్తారు. మహిళ గృహిణి. అంతే కాకుండా వివాహ వ్యవస్థ లోపల ఆమె అధీనురాలి స్థితిలో ఉంటుంది. ఆమె కుటుంబం, సమాజానికి చెందిన సాంస్కృతిక నియమాలను నిలబెట్టే స్థానంలో ఉంటుంది. అయితే వివాహ చట్టాల్లోపల వధూవరుల మధ్య ఉంటున్న ఈ అసమానతా స్థితిని ఎవరూ గుర్తించరు. ఇక విడాకులకు ప్రయత్నిస్తున్నప్పుడు స్త్రీపురుషులిరువురూ తమ పిటిషన్లను ఒకే నిర్దిష్ట భూమికపై సమర్పించాల్సి ఉంటుంది. అవేమిటంటే– వ్యభిచారం, పారిపోవడం, క్రూరత్వం! ఇందులో ఔచిత్యం లేదనిపిస్తుంది’’ అనే కోణం కూడా వారి అభిప్రాయంలో కనిపిస్తుంది. ఏమైనా హిందూ వివాహ చట్టంలో కొన్ని మార్పులైతే తప్పనిసరిగా జరగవలసి ఉందని ఇటీవలి కొన్ని కేసులలో మహిళల తరఫున వాదించే న్యాయవాదులు స్పష్టం చేశారు. అడ్డుపడుతున్న సెక్షన్ : విడాకుల పిటిషన్ కోర్టులో అపరిష్కృతంగా ఉన్న సమయంలో జరిగిన రెండో వివాహం చెల్లుబాటు అవుతుందని సుప్రీంకోర్టు 2018లో స్పష్టతనిచ్చింది. హిందూ వివాహ చట్టంలోని ‘వివాహ అనర్హత’ నిబంధన ద్వారా రెండో వివాహాన్ని రద్దుచేయలేమని ఆ కేసులో జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ ఎల్.నాగేశ్వరరావుల ధర్మాసనం తెలిపింది. విడాకుల పిటిషన్ పరిష్కృతమయ్యే వరకు రెండో వివాహంపై ఆంక్షలు విధించిన హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 15ను ఈ సందర్భంగా బెంచ్ ప్రస్తావించింది. ఇరు వర్గాలు (భార్యాభర్తలు) కోర్టు బయట సమస్యను పరిష్కరించుకుని, ఇక కేసును కొనసాగించొద్దని నిర్ణయించుకున్న సందర్భంలో సెక్షన్ 15 వర్తించదని తెలిపింది. అంతేకాదు, విడాకుల పిటిషన్ పెండింగ్‌లో ఉండగా జరిగిన వివాహం చెల్లదని ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును తోసిపుచ్చింది. తన భార్యతో విడాకులు కోరుతూ దాఖలుచేసిన పిటిషన్ ఢిల్లీ హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న సమయంలోనే పిటిషన్ దారుడు మరో వివాహం చేసుకున్నారు. తొలి భార్యతో సమస్యను పరిష్కరించుకున్నానని, తమకు విడాకులకు అనుమతివ్వాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. తన అప్పీల్‌ను వెనక్కి తీసుకోవడానికి అనుమతించాలని కోరారు. కానీ, విడాకుల పిటిషన్ పెండింగ్‌లో ఉండగా జరిగిన వివాహం చెల్లబోదని హైకోర్టు తీర్పునివ్వడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.