రాష్ట్రానికి, రాజ్యాంగానికి సంబంధం లేకుండా విభజన' | State bifurcation process is not connected to indian constitution,says Sailajanath | Sakshi
Sakshi News home page

రాష్ట్రానికి, రాజ్యాంగానికి సంబంధం లేకుండా విభజన'

Published Sat, Jan 18 2014 10:32 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM

రాష్ట్రానికి, రాజ్యాంగానికి సంబంధం లేకుండా విభజన' - Sakshi

రాష్ట్రానికి, రాజ్యాంగానికి సంబంధం లేకుండా విభజన'

రాజ్యాంగంలోని ఏ నిబంధన ప్రకారం ఉమ్మడి రాజధాని చేస్తారని శైలజానాధ్ కేంద్రాన్ని ప్రశ్నించారు. అసెంబ్లీలో శనివారం బిల్లుపై జరిగిన చర్చలో శైలజానాథ్ ప్రసంగిస్తూ... ఇరుప్రాంతాలలో రాజకీయ లబ్ధి కోసమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజిస్తున్నారని ఆరోపించారు. విభజన విషయాన్ని రాజకీయ పార్టీలు తేలిగ్గా తీసుకున్నందు వల్లే  ఇప్పుడు ఈ సమస్య  జఠిలమైందని అన్నారు.

 

తాను సమైక్య రాష్ట్రానికే కట్టుబడి ఉన్నానని శైలజానాథ్ పునరుద్ఘాటించారు. హైదరాబాద్పై రిఫరెండం పెడదామని టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ గతంలో వ్యాఖ్యలు చేశారని కానీ ఎప్పటిలానే కేసీఆర్ మాటా మార్చారని ఈ సందర్బంగా శైలజానాథ్ గుర్తు చేశారు. విభజన బిల్లును చూస్తుంటే మన రాష్ట్రానికి, రాజ్యాంగానికి సంబంధం లేనట్లుగా అనిపిస్తోందని శైలజానాథ్ వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement