టీడీపీలో ఏకాభిప్రాయం లోపించింది: మంత్రి శైలజానాథ్ | tdp make two steps on bifurcation bill, says sailajanath | Sakshi
Sakshi News home page

టీడీపీలో ఏకాభిప్రాయం లోపించింది: మంత్రి శైలజానాథ్

Published Mon, Jan 6 2014 4:14 PM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM

టీడీపీలో ఏకాభిప్రాయం లోపించింది: మంత్రి శైలజానాథ్ - Sakshi

టీడీపీలో ఏకాభిప్రాయం లోపించింది: మంత్రి శైలజానాథ్

హైదరాబాద్: రాష్ట్ర విభజన బిల్లుపై టీడీపీలో ఏకాభిప్రాయం లోపించిందని శాసన సభా వ్యహహారాల మంత్రి శైలజానాథ్ తెలిపారు. సభలో చర్చ జరగకపోతే అది తెలంగాణ ఏర్పాటుకే సహకరించినట్లువుతుందన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన విభజన బిల్లుపై సభలో చర్చ జరగకపోతే కొత్త రాష్ట్ర ఏర్పాటుకు సహకరించినట్లేనని తెలిపారు. టీ.బిల్లుపై చర్చించేందుకు టీడీపీ, వైఎస్సార్ సీపీలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. చర్చ సందర్భంగా కూడా సమైక్య తీర్మానం ప్రవేశపెట్టవచ్చని స్పష్టం చేశారు.

 

బిల్లుపై చర్చించాలా?వద్దా అనే విషయంలో టీడీపీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయన్నారు. బీఏసీలో టీడీపీ నేతలు ప్రాంతాల వారిగా అభిప్రాయాలు చెప్పారన్నారు. ఆ భేటీకి ఫ్లోర్ లీడర్లు మాత్రమే రావాలని ప్రభుత్వ పరంగా ఇప్పటికే తెలిపామన్నారు. విభజన బిల్లుపై తరగతులు వారిగా చర్చ జరగాల్సిందేనన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement