కృష్ఱా బేసిన్ లో చుక్క నీరు లేక రాష్ట్ర ప్రజలు కరువుతో అల్లాడుతుంటే.. మరో పక్క టీ సర్కార్ చేపడుతున్న అక్రమ ప్రాజెక్టులకు నిరసనగా ధర్నా చేస్తున్న వారికి మద్దతు తెలుపకుండా..
హైదరాబాద్: కృష్ఱా బేసిన్ లో చుక్క నీరు లేక రాష్ట్ర ప్రజలు కరువుతో అల్లాడుతుంటే.. మరో పక్క టీ సర్కార్ చేపడుతున్న అక్రమ ప్రాజెక్టులకు నిరసనగా ధర్నా చేస్తున్న వారికి మద్దతు తెలుపకుండా.. వారిని అరెస్టు చేయడం దారుణమని ఎపీసీసీ ఉపాధ్యక్షులు శైలజానాధ్, ప్రధాన కార్యదర్శి జంగా గౌతమ్ లు మండిపడ్డారు. అక్రమ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ సోమవారం ప్రకాశం బ్యారేజీ వద్ద ఎపీసీసీ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాను టీడీపీ కుట్రపూరితంగా అడ్డుకుందని వారు విమర్శించారు. రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తుంటే కరువు సహాయక చర్యలు మానేసి, ప్రజల పక్షాన పోరాడుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను అరెస్టు చేయడం అప్రజాస్వామికమన్నారు. అరెస్టులను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు.