Illegal projects
-
ప్రాజెక్టుల పేరుతో సిద్దిపేటలో అక్రమ దందా!
-
అక్రమ ప్రాజెక్టులతోనే నీటి కష్టాలు
– జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు కర్నూలు సిటీ: కృష్ణానదిపై ఎగువ రాష్ట్రాల్లో నిర్మించిన అక్రమ ప్రాజెక్టుల వల్లే దిగువకు నీరు రావడం లేదని జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ఆరోపించారు. శనివారం నగరంలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మట్లాడారు. అక్రమ ప్రాజెక్టులను గత ప్రభుత్వాలు అడ్డుకోలేకపోయాయన్నారు. దీని వల్లే రాయల సీమకు నీటి కష్టాలు వచ్చాయని మంత్రి వెల్లడించారు. ఈ ఏడాది జూలైలో పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను కష్ణానదికి తరలిస్తున్నామని.. ఇప్పటీకి 6.3 టీయంసీల గోదావరి జలాలను డెల్టాకు ఇచ్చామన్నారు. అంతే మొత్తంలో రాయలసీమకు ఇవ్వాలని సీఎం ఆదేశించారని, దీంతో శుక్రవారం హంద్రీనీవా ద్వారా, శనివారం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా నీరు విడుదల చేశామన్నారు. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం ఈ నెల 15కు పూర్తి చేస్తామని హామీ ఇచ్చామని, అయితే అక్టోబరు నాటికి గడుపు పెంచామన్నారు. శ్రీశైలం డ్యాం నిండకుండానే దిగువకు నీటిని ఎలా తీసుకెళ్తారని విలేకరులు అడిగిన ప్రశ్నకు మంత్రి నీళ్లు నమిలారు. విలేకరుల సమావేశంలో జిల్లా ఇన్చార్జీ మంత్రి అచ్చెన్నాయుడు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణి రెడ్డి, ఎమ్మెల్యేలు బీసీ జనార్దన్ రెడ్డి, ఎస్వీ మోహన్‌రెడ్డి, జెడ్పీ చైర్మెన్ మల్లెల రాజశేఖర్, టీడీపీ జిల్లా పరిశీలకులు వర్ల రామయ్య తదితరులు పాల్గొన్నారు. -
ప్రాజెక్టుల వద్దే విపక్షాలకు సమాధానం
రాష్ట్ర ప్రణాళిక బోర్డు ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేపట్టిన ప్రతి పనిని వ్యతిరేకించడమే లక్ష్యంగా ప్రతిపక్షాలు తమ సిద్ధాంతాలను పక్కన పెట్టి పనిచేస్తున్నాయని రాష్ట్ర ప్రణాళిక బోర్డు ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. బుధవారం ఇక్కడ తెలంగాణ భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. త్వరలో కల్వకుర్తి ఎత్తిపోతల నుంచి ప్రాజెక్టుల యాత్ర చేపడతామని, ప్రతిపక్షాలు, నిపుణులు ఎవరు వచ్చినా ప్రాజెక్టుల వద్దే సమాధానం చెబుతామన్నారు. కృష్ణా నదిపై ఆంధ్రా పాలకులు అక్రమ ప్రాజెక్టులు నిర్మించినా కాంగ్రెస్‌నేతలు డీకే అరుణ, మల్లు భట్టివిక్రమార్క ఎందుకు అడ్డుకోలేదని నిరంజన్‌రెడ్డి ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు పేరిట తెలంగాణలో 1.60 లక్షల ఎకరాలు ముంచుతున్నా బీజేపీ నేత నాగం జనార్దన్‌రెడ్డి స్పందించలేదన్నారు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి భూములు ఇవ్వొద్దంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ, టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి రైతులను రెచ్చగొడుతున్నారని అన్నారు. జేఏసీ చైర్మన్ కోదండరాం కూడా ప్రాజెక్టులపై అర్థం లేని విమర్శలు చేస్తున్నారని నిరంజన్‌రెడ్డి విమర్శించారు. హింసతో ప్రాజెక్టులను అడ్డుకునే యత్నం: గొంగిడి సునీత కోటి ఎకరాలకు నీరు అందించడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రణాళికలు రూపొందించగా హింసాత్మక ఘటనలతో ప్రాజెక్టులను అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ శాసనసభా పక్షం కార్యాలయంలో బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ నేతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి ఏనాడూ నల్లగొండ జిల్లాను పట్టించుకోలేదని, ప్రాజెక్టులను అడ్డుకొని ప్రజల నోట్లో మట్టికొడితే భువనగిరి, ఆలేరు ప్రాంతాల్లో ఆ ఇద్దరూ అడుగుపెట్టలేరని హెచ్చరించారు. -
'ప్రజల పక్షాన నిలబడితే అరెస్టులా..?'
హైదరాబాద్: కృష్ఱా బేసిన్ లో చుక్క నీరు లేక రాష్ట్ర ప్రజలు కరువుతో అల్లాడుతుంటే.. మరో పక్క టీ సర్కార్ చేపడుతున్న అక్రమ ప్రాజెక్టులకు నిరసనగా ధర్నా చేస్తున్న వారికి మద్దతు తెలుపకుండా.. వారిని అరెస్టు చేయడం దారుణమని ఎపీసీసీ ఉపాధ్యక్షులు శైలజానాధ్, ప్రధాన కార్యదర్శి జంగా గౌతమ్ లు మండిపడ్డారు. అక్రమ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ సోమవారం ప్రకాశం బ్యారేజీ వద్ద ఎపీసీసీ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాను టీడీపీ కుట్రపూరితంగా అడ్డుకుందని వారు విమర్శించారు. రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తుంటే కరువు సహాయక చర్యలు మానేసి, ప్రజల పక్షాన పోరాడుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను అరెస్టు చేయడం అప్రజాస్వామికమన్నారు. అరెస్టులను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. -
కేసీఆర్‌కు లొంగిపోయిన చంద్రబాబు
* అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తున్నా ప్రశ్నించే ధైర్యం లేదు * కేసుల భయంతో బీజేపీతో టీడీపీ పొత్తులు * దీక్ష విరమణ సభలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ చిలకలూరిపేట రూరల్ : కేసీఆర్‌కు లొంగిపోయిన చంద్రబాబు తెలంగాణలో చేపడుతున్న అక్రమ ప్రాజెక్టులపై ప్రశ్నించలేకపోతున్నారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ విమర్శించారు. కర్నూలులో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్న జలదీక్షకు మద్దతుగా పట్టణంలోని కళామందిర్ సెంటర్లో మంగళవారం జరిగిన నిరాహారా దీక్ష ముగింపు కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. పాలమూరు, డిండీ పథకాలకు అనుమతులు లేకుండా తెలంగాణలో నిర్మిస్తుంటే పాలకులు అడ్డుకోవాలని వైఎస్సార్ సీపీ డిమాండ్ చేస్తుంటే ప్రజలను టీడీపీ తప్పుదోవ పట్టిస్తోందని మండిపడ్డారు. ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్న చంద్రబాబు అక్కడ ఉంటే జైల్లో పెడతారని భయపడి విజయవాడకు పారిపోయి వచ్చారని ఎద్దేవా చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌కు లొంగిపోయి అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తున్నా ప్రశ్నించే ధైర్యం చంద్రబాబు చేయటం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వంతో విభేదించి బయటకు వస్తే కేసులు పైన పడతాయని పొత్తు కొనసాగిస్తున్నారని ఎద్దేవా చేశారు. అక్రమ నిర్మాణాలను అడ్డుకోని పక్షంలో భవిష్యత్‌లో సాగు భూములు బీడుగా మారే ప్రమాదం ఉందన్నారు. వాస్తవాలు గమనించి నీటి కోసం వైఎస్సార్ సీపీ చేస్తున్న పోరాటానికి రాజకీయాలకు అతీతంగా మద్దతు తెలపాలని కోరారు. అంతకుముందు రాజశేఖర్‌కు గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా నిమ్మరసం అందించి నిరాహార దీక్షను విరమింప చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు అడుసుమల్లి ప్రతాప్‌కుమార్, న్యాయవాది చిట్టిబాబు, కౌన్సిలర్లు అబ్దుల్ రౌఫ్, నాయుడు శ్రీనివాసరావు, సాపా సైదావలి, మాజీ కౌన్సిలర్లు గాలిబ్‌షా, నిడమానూరు హనుమంతరావు, వైఎస్సార్ సీపీ యువజన నాయకులు వేజెర్ల కోటేశ్వరరావు, సాతులూరు కోటి, మైనార్టీ నాయకులు అబ్దుల్లా బాషా, బేరింగ్ మౌలాలి, బాలకోటి నాయక్, కుప్పాల శంకర్, నాంపల్లి రాము, యిర్రి రాఘవ, రఫానీ, చిన్నా, హిదయతుల్లా, తదితరులు పాల్గొన్నారు. జగన్ వెంటే జనం... అధికార పార్టీ ప్రలోభాలకు ఎంతమంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి వెళ్ళినా ప్రజలు జగన్ వెంటే ఉన్నారని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ ముస్తఫా అన్నారు. దీక్ష విరమణ అనంతరం జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ప్రజలు అనేక కష్టాలు ఎదుర్కొంటున్నారన్నారు. -
అక్రమ ప్రాజెక్టులతో ఏపీ ఎడారే
- కేసుల భయంతోనే చంద్రబాబు నిలదీయడం లేదు - వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి ధ్వజం - వైఎస్ జగన్ జల దీక్ష ఏర్పాట్ల పరిశీలన సాక్షి ప్రతినిధి, కర్నూలు: ఎగువ రాష్ట్రాల అక్రమ ప్రాజెక్టులతో ఆంధ్రప్రదేశ్ ఎడారిగా మారుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, పార్టీ కర్నూలు జిల్లా అదనపు పరిశీలకులు రవీంద్రనాథ్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోకపోతే రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాలకు కనీసం తాగునీరు కూడా లభించే పరిస్థితి ఉండదని అభిప్రాయపడ్డారు. అక్రమ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఈ నెల 16, 17, 18 తేదీల్లో కర్నూలు నగరంలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టనున్న జలదీక్ష స్థలిని పార్టీ నాయకులు శనివారం పరిశీలించారు. అంతకుముందు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అటు గోదావరి, ఇటు కృష్ణాలపై తెలంగాణ అక్రమ ప్రాజెక్టుల నిర్మాణంతో రాష్ర్టంలో రాయలసీమలోని నాలుగు జిల్లాలతో పాటు ప్రకాశం, నెల్లూరు, గుంటూరు, కృష్ణా జిల్లాలు తీవ్రంగా నష్టపోనున్నాయన్నారు. ఈ ప్రాంతాల్లో వలసలు మరింత పెరిగే ప్రమాదం ఉందని రవీంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. అక్రమ ప్రాజెక్టుల వ్యవహారాన్ని కోర్టుల దృష్టికి తీసుకుపోవాల్సిన అవసరం ఉందన్నారు. కేసులు, కాసుల భయంతోనే.. కేసులు, కాసుల భయంతో తెలంగాణ అక్రమ ప్రాజెక్టులపై చంద్రబాబు నిలదీయడం లేదని రవీంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు. ఓటుకు కోట్లు కేసులో తెలంగాణ పోలీసులు అరెస్టు చేయకుండా ఉండేందుకు రాత్రి హైదరాబాద్‌లో, పగలు విజయవాడలో ఆయన ఉంటున్నారని ఎద్దేవా చేశారు. జగన్ దీక్ష ప్రకటన తర్వాతే అక్రమ ప్రాజెక్టులపై చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారని, మంత్రి దేవినేని ప్రాజెక్టులను సందర్శిస్తున్నారని ఎమ్మెల్యేలు ఐజయ్య, అంజద్ బాషా తెలిపారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కొత్తకోట ప్రకాశ్‌రెడ్డి, మురళీకృష్ణ, నాయకులు తెర్నేకల్లు సురేందర్‌రెడ్డి, నరసింహయాదవ్, రాంపుల్లయ్య యాదవ్, మద్దయ్య తదితరులు పాల్గొన్నారు. -
అక్రమ ప్రాజెక్టుల చరిత్ర పునరావృతం
- సీఎంపై బుగ్గన రాజేంద్రనాథ్ ధ్వజం - చంద్రబాబు అప్పటి పాలనలోనే ఆల్మట్టి, బాబ్లీలకు అంకురార్పణ - ఇప్పుడు ‘పాలమూరు’, డిండిలను నిర్మిస్తున్న తెలంగాణ - అన్యాయాన్ని అడ్డుకునేందుకే విపక్ష నేత జగన్ దీక్ష సాక్షి, హైదరాబాద్: చంద్రబాబునాయుడు అప్పటి తొమ్మిదేళ్ల పాలనలో ఎగువ రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రలు సాగునీటి ప్రాజెక్టులు కట్టి ఏపీకి నష్టం కలుగజేశాయని, ఇప్పుడు తెలంగాణ కూడా ఆయన హయాంలోనే అక్రమంగా ప్రాజెక్టులు కడుతోందని పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ధ్వజమెత్తారు. బాబు హయాంలో చరిత్ర పునరావృతమవుతోందన్నారు. కృష్ణా, గోదావరి బేసిన్లలో నీటి కొరత తీవ్రంగా ఉంటున్న పరిస్థితుల్లో.. ఎగువ రాష్ట్రాలు అనుమతులు లేకుండా ప్రాజెక్టులు కడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో బుగ్గన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు గతంలో అధికారంలో ఉన్న 1995-2004 మధ్య కాలంలోనే అల్మట్టి, బాబ్లీ ప్రాజెక్టుల నిర్మాణానికి అంకురార్పణ జరిగిందన్నారు. అప్పట్లో కేంద్రంలో తాను కింగ్మేకర్ని అని చెప్పుకుంటూ కూడా చంద్రబాబు కర్ణాటకలో ఆల్మట్టిని, మహారాష్ట్రలో బాబ్లీని ఆపలేక పోయారని ఎద్దేవా చేశారు. ఈ నిర్మాణాల వల్లనే బచావత్ అవార్డు గడువు ముగిసి కొత్తగా వచ్చిన బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ నుంచి ఆ రాష్ట్రాలు ఎక్కువ నీటి కేటాయింపులు పొందగలిగాయని వివరించారు. కర్ణాటక, మహారాష్ట్రలు తమ ప్రాజెక్టులను వేగంగా నిర్మించుకుంటే ఏపీలో ప్రాజెక్టులపై బాబు అసలు శ్రద్ధే చూపలేదని విమర్శించారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం కృష్ణా నదిపై పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, డిండి ప్రాజెక్టులను నిర్మిస్తుంటే చంద్రబాబు ఒక లేఖ రాసి సరిపెట్టారని విమర్శించారు. ఈ రెండు ప్రాజెక్టులకు కలిపి శ్రీశైలం రిజర్వాయర్ బ్యాక్ వాటర్‌లో 800 అడుగుల నుంచి 120 టీఎంసీల నీటిని తోడుకోవాలని తెలంగాణ సంకల్పించిందని చెప్పారు. ఇదే కనుక జరిగితే రాయలసీమ పూర్తిగా ఎడారిలా మారుతుందని, కృష్ణా డెల్టా.. ప్రకాశం జిల్లాలు అల్లాడి పోతాయని బుగ్గన ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీశైలం నుంచి ఈ ప్రాంతాలకు నీరందాలంటే కనీసం 854 అడుగుల మేర నీటి మట్టం ఉండాలని చెప్పారు.బాబుకు రాయలసీమపై ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని, గుండ్రేవుల, సిద్ధేశ్వరం ప్రాజెక్టుల నిర్మాణంపై శ్రద్ధ పెట్టక పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. అందరి దృష్టికీ తీసుకెళ్లేందుకే.. ఏపీకి జరుగుతున్న అన్యాయాన్ని ఆపేందుకే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కర్నూలులో ఈ నెల 16, 17, 18 తేదీల్లో దీక్షను చేయబోతున్నారని బుగ్గన తెలిపారు. ఈ అక్రమాన్ని ప్రజ ల దృష్టికి, వివిధ ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగుల దృష్టికి, కేంద్రం దృష్టికి తీసుకువెళ్లడానికే జగన్ ఆందోళనకు దిగుతున్నారన్నారు. -
కరువు నివారణ చర్యలేవి?
రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తుంటే పాలకులు నిమ్మకు నీరెత్తినట్లుండటం బాధాకరం. తాగునీరు, సాగునీరు లేక రైతులు పడుతున్న ఆవేదన వర్ణనాతీతం. పంటలు ఎండిపోతున్నాయి. తోటలు మాడిపోతున్నాయి. గడ్డిలేక పశువులను చౌక ధరలకు అమ్ముకుంటూ ఆ మూగజీవులను కబేళాలకు తరలించడం హృదయవిదారకం. ట్యాంకర్లతో నీటిని కొని బత్తాయి తోటకు నీరు పోస్తున్న రైతు దంపతుల వెతలు చూసి కళ్లు చెమర్చుతున్నాయి. రైతులు, రైతు కూలీలు వలసబాట పట్టడం దారుణం. కళ్లముందు ఇంత ఉత్పాతాలు జరుగు తున్నా మన పాలకులు ఏం చేస్తున్నారు? కేంద్రాన్ని ప్రత్యేక హోదా అడగలేరు. ఎందుకంటే అక్కడ మిత్రపక్షం గనుక. తెలంగాణ పాలకులు మన నీటిని ఎగువనే దోచేస్తుంటే తేలుకుట్టిన దొంగల్లా కిమ్మనకుండా ఉన్నారు. ఎందుకంటే ఎక్కడ ఓటుకు కోట్లు కేసును తిరగతోడి గుక్క తిప్పుకోనీయరే మోనని భయం కారణం కావచ్చు. ఎంతసేపూ ఇంకుడు గుంతలు తవ్వుకోండి అనటం తప్ప ఇంతగా ఎండలు మండి పోతుంటే, చెరువులు, కాల్వలు ఎండిపోతుంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏం చేస్తున్నట్లు? కేంద్రంతో మాట్లాడి అవసరమైతే పొరుగు రాష్ట్రాల నుంచి రైల్వే ట్యాంకర్లతో విధిగా నీటిని కరువు ప్రాంతాలకు సరఫరా చేయించాలి. రాష్ట్రంలో నీటి లభ్యత ఉన్న ప్రాంతాల నుంచి నీటిని కరువు ప్రాంతాలకు సరఫరా చేయించాలి. ఎగువన ఉన్న తెలంగాణ రాష్ట్రం అక్రమ ప్రాజెక్టులు కట్టి మన నదీజలాల్ని దోచుకోకుండా అడ్డుకోవాలి. అప్పట్లో కర్నాటక ఆలమట్టి డ్యాం ఎత్తు పెంచి మన నీటిని దోచు కుంటుంటే కృష్ణా ట్రిబ్యునల్ వరకు వెళ్లి పరిష్కార మార్గాలను వెతుక్కున్నాం కదా. నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు మహారాష్ట్రకు తన అను చరులతో వెళ్లి బాబ్లీ వివాదంలో అరెస్టు అయ్యారు కూడా. మరి ఆ పోరాట పటిమ, స్ఫూర్తి ఇప్పుడే మయ్యాయి? ఆనాడు వైఎస్సార్ తలపెట్టిన జలయజ్ఞాన్ని నేడు దారి మళ్లించారు. ఇంకా పోలవరాన్ని పూర్తి చేయలేక పోతున్నారు. గోదావరి, కృష్ణా, పెన్నా నదులను అనుసంధానం చేసి రాయలసీమకు మళ్లించి ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయొచ్చని ఆ మధ్య ఒక విద్యావేత్త రాశారు. రాజధాని ప్రాంతంలోని సస్యశ్యామలమైన, ఏడాదికి మూడు పంటలు పండే భూముల్ని నిర్జీవ భవనాల కోసం దుర్వినియోగపరిస్తే ఆ ప్రభావం రాష్ట్రాన్ని ఇంకా భ్రష్టు పట్టించకమానదు. చంద్రబాబు, కరువు కవలపిల్లలు అని జనంలో నమ్మకం ప్రబలుతోంది. ముంచు కొచ్చిన ప్రస్తుత కరువును చూస్తే ఇది నిజమనిపిస్తోంది కూడా. ఆయన పరిపా లనలో గతంలోనూ ఇలాగే జరిగింది. ఇప్పుడూ అలాగే జరుగుతోంది. ఆయన ప్రజావ్యతిరేక, రైతు వ్యతిరేక స్వభావం గురించి చెప్పనవసరం లేదు. ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్ష నేత కేంద్రాన్ని నిలదీస్తుంటే తప్పనిసరై కేబినెట్ సమావేశంలో తీర్మానం చేశారు తప్పితే ముఖ్యమంత్రి ఈ అంశంపై ఏమాత్రం బాధ్యత తీసుకోవడానికి సిద్ధ పడక పోవడం దారుణం. - అచ్యుత, సామాజిక కార్యకర్త, కవి, కర్నూలు మొబైల్: 7675958696 గొంతెండుతోంది దాహం దాహం కేకలు/ గొంతెండుతున్న జనం అడుగంటిన జలం / మండుతున్న ఎండలు ఎండుతున్న బతుకులు / కరువు కోరల కాలం చిమ్మిన ఛిద్రమైన గాయం బిందెల బొందలో బురదనీళ్లే తాగి బతుకీడుస్తున్న ప్రజలు... గుక్కెడు నీళ్ల కోసం / నెర్రెలిచ్చిన నాలుక... ఇంకిపోయిన మడుగులా మొహం చిన్న నీటి తుంపర్ల ఆశలు ‘మద్యం’ పొంగిపొరలుతున్న రక్తపు రహదారులు... పర్యావరణాన్ని ప్రేమించలేనప్పుడు పక్షులు పాటలే పాడనప్పుడు వృక్షాలనే అడ్డంగా నరికితే... నరకయాతనల కేకలు పెట్టాల్సిందే! కుళాయిలో కాకుల్లా రాళ్లు కూర్చాల్సిందే!! గొంతెండుతోంది.. గొంతెండుతోంది అని మేఘాలకై మొహం చూడాల్సిందే తంగిరాల సోని, కంచికచర్ల మొబైల్: 9676609234 -
అక్రమ ప్రాజెక్టుల పాపం బాబుదే
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గతంలో చేసిన నిర్వాకాల వల్లే కర్ణాటక ప్రభుత్వం అక్రమంగా బ్యారేజీలను నిర్మించుకునే స్థాయికి బరి తెగించిందని తెలంగాణ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మండిపడ్డారు. కృష్ణానదిపై కర్ణాటక ప్రభుత్వం రాయచూర్ జిల్లా గిరిజాపూర్‌లో నిర్మిస్తున్న అక్రమ బ్యారేజీ నిర్మాణాన్ని బుధవారం ఆయన పరిశీలించారు. మహబూబ్‌నగర్ నుంచి భారీ వాహన శ్రేణితో కర్ణాటక సరిహద్దుకు చేరుకున్న పొంగులేటి.. కర్ణాటక ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ సరిహద్దు బ్రిడ్జిపై పాదయాత్ర నిర్వహించారు. కార్యకర్తలతో కలసి గిరిజాపూర్ ప్రాంతానికి వెళ్లేందుకు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వైఎస్సార్సీపీ నేతలు ప్రయత్నించారు. ఒక దశలో కర్ణాటక పోలీసులను ప్రతిఘటించారు. ఈ సందర్భంగా ‘శీనన్న సంఘర్ష్ కరో.. హమ్ తుమ్హారా సాత్‌హై..’ అంటూ నినాదాలిస్తూ పెద్దఎత్తున తరలివచ్చిన కార్యకర్తలు పొంగులేటికి అండగా నిలిచారు. దాదాపు 4 కిలోమీటర్ల పొడవున్న బ్రిడ్జిపై ఆయన కార్యకర్తలతో కలసి కాలినడకన కర్ణాటకలోకి ప్రవేశించారు. గిరిజాపూర్ వద్ద 144 సెక్షన్ ఉన్నందున అనుమతించలేమని కర్ణాటక పోలీసులు చెప్పడంతో తాము వెళ్లి తీరాల్సిందేనని పొంగులేటి వారికి స్పష్టంచేశారు. దీంతో చేసేది లేక మీడియాతో పాటు ఎనిమిది మందిని బ్యారేజీ సందర్శనకు అనుమతించారు. బ్యారేజీ పనులు క్షుణ్ణంగా పరిశీలించిన పొంగులేటి అక్కడి అధికారులతో నిర్మాణ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ.. కర్టాటక తీరుతో తెలంగాణ ఎడారిగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణా పరీవాహక ప్రాంతంలో అక్రమ ప్రాజెక్టుల నిలిపివేత కోసం తమతో కలసి వచ్చే అన్ని పార్టీలతో పెద్ద ఎత్తున ఉద్యమం ఏర్పాటు చేస్తామన్నారు. ఉమాభారతికి ఫిర్యాదు చేస్తాం కర్ణాటక, తెలంగాణ సరిహద్దుల్లో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు అక్రమ ప్రాజెక్టుల నిర్మాణంపై పల్లెత్తు మాట అనలేదని.. అదే అలుసుతో ఎగువ రాష్ట్రాలు అక్రమ కట్టడాలకు పాల్పడుతున్నాయని పేర్కొన్నారు. చంద్రబాబు ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడు ఆల్మట్టి డ్యాం ఎత్తును 518 అడుగుల నుంచి 526 అడుగులకు ఎత్తు పెంచుకున్నా ఏమాత్రం స్పందించకపోగా.. సహకరించినట్లుగా వ్యవహరించార ని దుయ్యబట్టారు. కర్ణాటక ప్రభుత్వ అక్రమ కట్టడ నిర్మాణాలపై త్వరలో కేంద్రమంత్రి ఉమాభారతికి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ప్రాజెక్టు పరిశీలనకు బయల్దేరే ముందు మహబూబ్‌నగర్‌లో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పొంగులేటికి ఘనంగా స్వాగతం పలికారు. స్థానిక ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్ సమీపంలో వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ వ్యవసాయ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎడ్మ కిష్టారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లా సూర్యప్రకాశ్, జిల్లా అధ్యక్షుడు మామిడి శ్యాంసుందర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి భగవంత్‌రెడ్డి, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు భీష్వ రవీందర్, నాయకులు జెట్టి రాజశేఖర్, మహ్మద్ వాజీద్, మతిన్ ముజాహిత్ అలీ, జయరాజ్, జెఎస్.మేరీ, వంగ లక్ష్మణ్, లింగారెడ్డి, రవిందర్‌రెడ్డి, కుసుమకుమార్‌రెడ్డి, హైదర్ అలీ, విష్ణువర్ధన్‌రెడ్డి, జయంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
'కాంగ్రెస్ నేతల్లా దొంగపనులు చేయం'
హైదరాబాద్: కుంభకోణాలు, దొంగ పనులు చేయడం, ప్రాజెక్టుల పేరుతో అడ్వాన్స్పేమెంట్లు తీసుకోవడం కాంగ్రెస్ పార్టీ నేతలకే అలవాటని వాణిజ్యపన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ దుయ్యబట్టారు. దేశాన్ని రాష్ట్రాన్ని దోచేసిన కాంగ్రెస్ పార్టీకి తమను విమర్శించే అర్హత లేదన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్య పోరు కోసం చిల్లర చేష్టలు చేస్తున్నారని మండిపడ్డారు. సచివాలయంలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర పురోగతిపై కాంగ్రెస్ నేతలకు చిత్తశుద్ధ్ది ఉంటే వెంటనే పార్టీ అధినేత్రి సోనియాగాంధీ వద్దకెళ్లి కర్ణాటకలో నిర్మితమవుతున్న అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోవాలన్నారు. మద్యం పాలసీ విషయంలో అన్ని పార్టీల నేతలు కావాలనే రాజకీయ విమర్శలు చేస్తున్నారన్నారు. గుడుంబాను అరికట్టడం కోసమే ప్రభుత్వం ఛీప్‌లిక్కర్ తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామాల్లో విచ్చలవిడిగా బెల్టుషాపులు కొనసాగుతున్న వైనం టీడీపీ నేతలకు కనిపించడం లేదా? గుజరాత్లో ప్రతీ పాన్‌షాప్‌లో లిక్కర్ దొరుకుతుందనే విషయం బీజేపీ నేతలకు తెలియదా? అని విమర్శలు గుప్పించారు. హైదరాబాద్‌ను తానే కట్టానని గొప్పలు చెప్పుకునే చంద్రబాబుకు, ఏడాదిన్నర పూర్తవుతున్నా ఏపీలో ఎందుకు నిర్మించలేకపోతున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరుతో ప్రధాని నరేంద్రమోదీ కూడా అపాయింట్మెంట్ ఇచ్చి రద్దు చేశారన్నారు. -
అక్రమ ప్రాజెక్టులను ఆపే దమ్ముందా?
టీడీపీ నేతలకు జితేందర్‌రెడ్డి సవాల్ జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): కృష్ణానదిపై కర్ణాటక రాష్ట్రం అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులను మిత్రపక్షం బీజేపీతో మాట్లాడి ఆపించే దమ్ముందా? అని టీఆర్ఎస్ లోక్‌సభ పక్షనేత ఏపీ జితేందర్‌రెడ్డి టీటీడీపీ నేతలకు సవాల్ విసిరారు. తెలంగాణ ప్రజలపై నిజంగా ప్రేమ ఉంటే కర్ణాటక కడుతున్న ప్రాజెక్టులను ఆపించాలని, లేకపోతే తెలంగాణ లో టీడీపీకి నైతిక అర్హత లేనట్లేనన్నారు. ఆదివారం ఆయన మహబూబ్‌నగర్‌లో విలేకరులతో మాట్లాడారు. కర్ణాటక ప్రభుత్వం తెలంగాణకు నీళ్లు ఇవ్వకుండా రోడ్డు బ్రిడ్జిలు అంటూ బ్యారేజీలను నిర్మిస్తుందన్నారు. ఇది నిర్మిస్తే తెలంగాణకు కృష్ణాజలాలు రావన్నారు. ప్రాజెక్టులకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ ఎంపీలమంతా కేంద్రం తో పోరాటం చేస్తామన్నారు. టీడీపీ తమ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ప్రాజెక్టుల యాత్ర చేయడం ఆపి కేంద్రంలో ఉన్న మిత్రపక్షం బీజేపీ ప్రభుత్వంతో మాట్లాడి ఆపించాలని హితవుపలికారు. ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను అక్రమంగా కలుపుకున్నప్పుడు టీడీపీ అఖిలపక్ష సమావేశం పెట్టిందా? అని ప్రశ్నించారు. తెలంగాణ విభజన సమస్యలను పరిష్కరించాలని పోరాటం చేశామని, హైకోర్టును విభజించాలనే డిమాండ్‌తో పార్లమెంట్‌ను స్తంభింపజేశామన్నారు. రూ.1250 కోట్ల తెలంగాణకు చెందిన ఆదాయపన్ను నిధులను ఏపీకి మళ్లించడాన్ని ప్రశ్నిం చామని తెలిపారు. తన నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలతో ఎలాంటి విభేదాలు లేవని అందరిని కలుపుకుపోతానని అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఎమ్మెల్యేలు మనస్తాపానికి గురైన విషయాన్ని సీఎం కేసీఆర్ చూసుకుంటారని చెప్పారు. -
మంజీరకు సంకెళ్లు!
నిజాంసాగర్: కర్ణాటక, మహారాష్ర్టల్లో అక్రమ ప్రాజెక్టుల నిర్మాణాల వల్ల అటు గోదావరి, ఇటు మంజీర నదులకు సంకెళ్లుపడ్డాయి. మహా రాష్ట్ర సర్కారు తీరుతో గోదావరినది ఏడారిని తలపిస్తుండగా కర్ణాటక ప్రాంత సరిహద్దుల్లో అక్రమ చెక్‌డ్యామ్‌ల వల్ల మంజీర ఉపనదిలో నీటిప్రవాహపు గలగలలు కనుమరుగయ్యాయి. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నప్పటికీ తెలంగాణ రాష్ట్ర జలాశయాల్లోకి చుక్కనీరు రావడం లేదు. మంజీర ఉపనదిపై ఉన్న సింగూరు జలాశయంతో పాటు నిజాంసాగర్ ప్రాజెక్టు నీళ్లు లేక నిరాశజనకంగా కనిపిస్తోంది. రెండు ప్రాజెక్టుల క్యాచ్మెంట్ ఏరియాల్లో కురుస్తున్న వర్షాలకు జలధారలు వస్తున్నాయి తప్పా పక్క రాష్ట్రాల్లో కురిసిన వర్షాలకు వరదలు రావడం లేదు. కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు కరంజా, సయిగావ్ ఆనకట్టల ద్వారా మంజీర ఉపనదిలోకి వరదలు వచ్చేవి. ఇప్పుడు అక్కడి ప్రాజెక్టులు, ఆనకట్టలే నిండుతున్నాయి. సింగూరు జలాశయం, నిజాంసాగర్‌లోకి వరదలు రావడం లేదని నీటిపారుదల శాఖ అధికారులు విశ్లేషిస్తున్నారు. వర్షాభావ పరిస్థితుల్లో మెదక్ జిల్లాలోని సింగూరు జలాశయంతో పాటు ఇందూరు జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు ప్రాంత రైతులు దుర్బర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తోంది. పడిపోతున్న నిజాంసాగర్ సామర్థ్యం నిజాం నవాబు కాలంలో 1923-31 సంవత్సరంలో నిర్మించిన నిజాం సాగర్ ప్రాజెక్టు నీటి సామర్థ్యం ఏడాదికేడాది పడిపోతోంది. మంజీర ఉప నదిపై నిర్మించిన నిజాంసాగర్ ప్రాజెక్టు ద్వారా జిల్లాలోని 11 మండలాల్లో ఉన్న 2.75 లక్షల ఎకరాలకు సాగునీరందిస్తోంది. ప్రాజెక్టు నిర్మాణ సమయంలో 1400.50 అడుగులతో 25.67 టీఎంసీలు సామర్థ్యం ఉండేది. కర్ణాటక, మహా రాష్ట్రల్లో కురిసిన భారీ వర్షాల వల్ల మంజీర నదిలో వరద నీటి ప్రవాహానికి నిజాంసాగర్ ప్రాజెక్టులోకి పూడిక మట్టి వచ్చి చే రింది. దీంతో 1977 సంవత్సరంలో నిజాంసాగర్ ప్రాజెక్టు నీటిమట్టం 11.8 టీఎంసీలకు పడిపోయింది. నీటి మట్టం పడిపోవడంతో అప్పటి సర్కారు ప్రాజెక్టు నీటిసామర్థం్య పెంపు కోసం చర్యలు తీసుకోంది. అదే సంవత్సరంలో 4.5 టీఎంసీల సామర్థ్యాన్ని ప్రభుత్యం పెంచింది. దాంతో అప్పటి నుంచి నిజాంసాగర్ ప్రాజెక్టు నీటి మట్టం 1405 అడుగులతో 17.8 టీఎంసీల సామర్థ్యానికి చేరుకుంది. ప్రాజెక్టులో నీటిసామర్థ్యం పెరిగినా చివరి ఆయకట్టు వరకు ప్రధాన కాలువ ద్వారా సాగునీరందించడం లేదు. దాంతో చివరి ఆయకట్టు ప్రాంత రైతులు ప్రత్యామ్నాయంగా బోరుబావులపై ఆధారపడి పంటలను సాగు చేస్తున్నారు. పోచారం పెంపుతో .. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురిసినా మెదక్ జిల్లాలోని సింగూరు జలాశయానికి వరద నీరు పరిమితం అవుతోంది. జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టుకు మాత్రం పోచారం ప్రాజెక్టు జీవనాధారంగా ఉంది. వర్షాకాలం ఆరంభ సమయంలో కురిసిన వర్షాలకు జిల్లాలోని గాంధారి, లింగంపేట, తాడ్వాయి, నాగిరెడ్డిపేట మండలాల్లో కురిసిన వర్షాలకు వరద నీటి ప్రవాహంతో పోచారం ప్రాజెక్టు నిండుకుండలాగా మారుతోంది. అదనంగా వచ్చిన వరదనీటి ద్వారా మంజీర ఉపనది ఉరకలేస్తోంది. ప్రస్తుతం పోచారం ప్రాజెక్టు కట్ట ఎత్తుపెంపుపై రాష్ట్ర బారీనీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావ్ నీటిపారుదలశాఖ అధికారులతో నిర్ణయం తీసుకున్నారు. అందువల్ల పోచారం ప్రాజెక్టులోకి వచ్చిన అదనపు జలాలు దిగువనకు వెళ్లకుండా నిలిచిపోనున్నాయి. పోచారంతోనే గతేడాది నిండిన ప్రాజెక్టు గతేడాది జిల్లాలో కురిసిన వ ర్షాల వల్ల పోచారం ప్రాజెక్టు నీటితోనే నిజాంసాగర్ ప్రాజెక్టు నిండింది. పోచారం ప్రాజెక్టు పూర్థిస్తాయి నీటిమట్టానికి చేరుకొని పొంగిపోర్లింది. దాంతో పోచారం ప్రాజెక్టు ద్వారా 9.08 టీఎంసీల నీరు నిజాంసాగర్ ప్రాజెక్టులోకి చేరింది. పోచారం నీటితో పాటు క్యాచ్ మెంట్ ఏరియాలో నుంచి వచ్చిన నీటితో గతేడాది నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంది. పోచారం ప్రాజెక్టు కట్ట ఎత్తు పెంచితే నిజాంసాగర్ ప్రాజెక్టు నీటిముప్పు ఎదురవునుందని నీటిపారుదల శాఖ అధికారులు అంటున్నారు.