'ఇంటికో ఉద్యోగం కోసం రాష్ట్రంలో ఆందోళనలు' | sailajanath takes on chandra babu naidu | Sakshi
Sakshi News home page

'ఇంటికో ఉద్యోగం కోసం రాష్ట్రంలో ఆందోళనలు'

Published Mon, Aug 17 2015 2:54 PM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM

sailajanath takes on chandra babu naidu

హైదరాబాద్:టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీపై శ్వేత పత్రం విడుదల చేయాలని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత శైలజానాథ్ డిమాండ్ చేశారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని.. ఆ హామీలు అమలు కాకపోవడంతో రాష్ట్రంలో ఆందోళనలు జరుగుతున్నాయని విమర్శించారు. నిరుద్యోగ భృతి రూ. 2 వేలు హామీలు కూడా అమలు కాలేదన్నారు. తక్షణమే లక్షా ముప్ఫై లక్షల పోస్టులు భర్తీ చేయాలని శైలజానాథ్ డిమాండ్ చేశారు.

 

అనంత జిల్లా లేపాక్షి మండలంలో ఉద్యోగం రాలేదని  దినేష్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకోవడానికి బాధ్యత సీఎం చంద్రబాబుదేనన్నారు. ఆ యువకుని కుటుంబానికి రూ. 10 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement