'ఎలాంటి విచారణకైనా సిద్ధం, స్టేలు తెచ్చుకోను' | Ready to face any inquiry, says botsa satyanarayana | Sakshi
Sakshi News home page

'ఎలాంటి విచారణకైనా సిద్ధం, స్టేలు తెచ్చుకోను'

Published Sat, May 17 2014 3:02 PM | Last Updated on Fri, Jul 12 2019 3:10 PM

'ఎలాంటి విచారణకైనా సిద్ధం, స్టేలు తెచ్చుకోను' - Sakshi

'ఎలాంటి విచారణకైనా సిద్ధం, స్టేలు తెచ్చుకోను'

విజయనగరం : రాష్ట్ర విభజన ఫలితాన్ని కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో చవి చూసిందని, మాజీ పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. ఆయన శనివారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ తనపై వచ్చిన అవినీతి ఆరోపణలకు సంబంధించి ఎలాంటి విచారణకైనా సిద్ధమేనని స్పష్టం చేశారు. ముందస్తుగా కోర్టుల నుంచి స్టేలు తెచ్చుకోనని బొత్స అన్నారు. ఎన్నికల్లో టీడీపీ ఇచ్చిన రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం వంటి హామీలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

కాగా విజయనగరం జిల్లాను తన కనుసన్నల్లో పెట్టుకుని పదేళ్లపాటు జిల్లాలో చక్రం తిప్పిన బొత్స సత్యనారాయణ తాజా ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. టీడీపీ అభ్యర్థి కిమిడి మృణాళిని చేతిలో 20వేల ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. ఒక ఎంపీ పదవిని పెట్టుకుని జిల్లాను శాసించిన బొత్సకు ఈసారి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలవకపోవడంతో ఆయన ప్రతిష్ట పూర్తిగా మసకబారిపోయిందనే చెప్పుకోవచ్చు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement