'వాళ్లు సామ్రాట్లు....మనం సామంతులం' | Sailajanath takes to congress highcommand | Sakshi
Sakshi News home page

'వాళ్లు సామ్రాట్లు....మనం సామంతులం'

Published Mon, Feb 24 2014 10:55 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM

'వాళ్లు సామ్రాట్లు....మనం సామంతులం' - Sakshi

'వాళ్లు సామ్రాట్లు....మనం సామంతులం'

తిరుపతి : రాష్ట్ర విభజన విషయంలో ఢిల్లీవాళ్లు సామ్రాట్లులాగా వ్యవహరిస్తూ... మనల్ని సామంతులుగా చూస్తున్నారని  శైలజానాథ్ విమర్వించారు. ఆయన సోమవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం శైలజానాథ్ మాట్లాడుతూ మొత్తం తెలుగు జాతి నాశమైనప్పుడు ఇక రాజధానుల కోసం పోట్లాడుకోవటం ఎందుకని ప్రశ్నించారు.  

కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తెలుగు వారికి అన్యాయం చేశాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాను విభజన వాదిని కాదని... ఆరోగ్యం సరిగా లేకున్నా రాష్ట్రం సమైక్యంగా ఉండేందుకు పోరాడినట్లు తెలిపారు. కాగా శైలజానాథ్తో పాటు రుద్రరాజు పద్మరాజు కూడా వెంకన్నను దర్శించుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement