seemandhra New Capital
-
సీమాంధ్ర అభివృద్ధి అన్ని నగరాల్లో ఉండాలా?
రాష్ట్ర విభజన జరిగిపోయింది. మరి కొద్ది రోజులలో కొత్త రాజధాని కూడా ఏర్పడబోతుంది. ఇందుకోసం అయిదుగురు నిఫుణుల కమిటీని కేంద్ర హోంశాఖ నియమించింది. గతం నుండి పాఠాలు నేర్చుకుని, వర్తమాన పరిస్థితులకు తగ్గట్లుగా వ్యవహరించి భవిష్యత్ ప్రణాళికలు సిద్దం చేసుకోవడమే వివేకవంతుల లక్షణం. మరి మన సీమాంధ్ర ప్రాంతాన్ని అనేక రంగాలలో అభివృద్ధి చేయచ్చు. అందుకోసం అన్ని పెట్టుబడులు, కార్యాలయాలు, విద్యాసంస్థలు, మౌలిక వసతులు ఒకే చోట కేంద్రికృతం కాకుండా చూడాలా? హైదరాబాదు విషయంలో చేసిన పొరపాట్లు మరలా చేయకూడదా? సీమాంధ్రను అన్ని రంగాల్లో.. అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి చేయాలి తప్ప ఏదో ఒక్క నగరానికే అభివృద్ధి పరిమితం కాకూడదా? అభివృద్ధి వికేంద్రీకరణ తప్పనిసరిగా ఉండాలా? ప్రత్యేక ప్రతిపత్తి హోదాని పదేళ్ళకు పొడిగించేలా? -
తెలంగాణ దశాబ్ధాలనాటి డిమాండ్: జైరాం రమేష్
-
తెలంగాణ దశాబ్ధాలనాటి డిమాండ్: జైరాం రమేష్
గుంటూరు : సీమాంధ్ర ప్రయోజనాలను కాపాడటంతో కాంగ్రెస్ పార్టీ ముందు ఉంటుందని కేంద్రమంత్రి, జీవోఎం సభ్యుడు జైరాం రమేష్ అన్నారు. గుంటూరు జిల్లా పర్యటనలో భాగంగా ఆయన మంగళవారమిక్కడ మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ ఇచ్చింది 2014 ఎన్నికల్లో లబ్ది పొందటం కోసం కాదని జైరాం రమేష్ అన్నారు. తెలంగాణ డిమాండ్ దశాబ్దాల నాటిదని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ఇవ్వటంతో పాటు సీమాంధ్రుల ప్రయోజనాలను కూడా కాంగ్రెస్ కాపాడిందని అన్నారు. అభివృద్ధి అంతా ఒకేచోట కేంద్రీకృతం చేయకూడదనేది హైదరాబాద్ నేర్పిన పాఠమన్నారు. రాజధాని ఏర్పాటుకు సీమాంధ్రలో అనేక నగరాలు ఉన్నాయని జైరాం రమేష్ తెలిపారు. భవిష్యత్‌లో ఆంధ్రప్రదేశ్ అంతటా అభివృద్ధి ఉంటుందని.... సీమాంధ్రలో రాజధాని కోసం వారంలోగా నిపుణుల కమిటీ ఏర్పుడుతందని తెలిపారు. సీమాంధ్రలో అభివృద్ధిని వికేంద్రీకరిస్తామని ....రాజధాని ఒకచోట, అసెంబ్లీ మరోచోట, కార్యాలయాలు ఇంకోచోట ఉండవచ్చునని జైరాం రమేష్ పేర్కొన్నారు. అన్ని అవకాశాలను నిపుణుల కమిటీ పరిశీలిస్తుందని ఆయన తెలిపారు. 84వేల రాష్ట్ర ఉద్యోగులను జనాభా ప్రాతిపదిక మీద ఆప్షన్ల మేరకు విభజిస్తామని జైరాం రమేష్ చెప్పారు. -
సీమాంధ్ర ప్రత్యేకం
* ప్రత్యేక హోదాకు ఆమోదం.. ప్రధాని ప్రకటన అమలుకు ప్రణాళిక సంఘానికి నిర్దేశం * కేంద్ర కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు * రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో 2 సవరణలకు ఆమోదం.. * పోలవరం గ్రామాలు, ఎన్టీపీసీ విద్యుత్ పంపిణీలపై స్పష్టత * పోలవరం ప్రాజెక్టు ముంపు మండలాలు సీమాంధ్రకే * భద్రాద్రికి దారి ఉండదంటూ జైపాల్‌రెడ్డి అభ్యంతరం * దీంతో భద్రాచలం పట్టణం, రామాలయం.. భద్రాద్రిని కలిపే బూర్గంపాడులోని 12 రెవెన్యూ గ్రామాలు తెలంగాణలోనే ఉంచాలని కేబినెట్ నిర్ణయం * ముంపు బాధితులకు సొంత మండలాల్లో భూ కేటాయింపు * ఎన్టీపీసీ విద్యుత్‌లో 85% గాడ్గిల్ ఫార్ములా ప్రకారం పంపిణీ * మిగతా 15% గత వినియోగం ఆధారంగా రెండు రాష్ట్రాలకు * ఈ సవరణలపై ఆర్డినెన్స్ తెచ్చే బాధ్యత వచ్చే ప్రభుత్వానిదే * త్వరలో అపాయింటెడ్ డే ప్రకటన, కమిటీల పని నేటి నుంచి.. * 3 రోజుల్లో సీమాంధ్ర కొత్త రాజధానిపై నిపుణుల కమిటీ సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన అనంతరం మిగిలే 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐదేళ్ల పాటు ప్రత్యేక తరగతి హోదా ఇస్తామని ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ రాజ్యసభలో చేసిన ప్రకటనకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. సీమాంధ్రకు ప్రత్యేక హోదా వర్తించేలా చర్యలు తీసుకోవాలని ప్రణాళికా సంఘానికి మంత్రిమండలి ఆదేశించింది. ఆదివారం సాయంత్రం 6.30 నుంచి 8.30 గంటల వరకు ప్రధాని నివాసంలో జరిగిన కేబినెట్ సమావేశం.. రాష్ట్ర విభజనకు సంబంధించి - ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర) రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరం ముంపు ప్రాంతాల బదిలీ, కేంద్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థల నుంచి వచ్చే విద్యుత్ పంపిణీ - మూడు అంశాలపై స్పష్టత ఇచ్చింది. ఖమ్మం జిల్లా పోలవరం ప్రాజెక్టు ముంపు బాధితులకు ఊరట కలిగించేలా.. నిర్వాసితులకు సొంత మండలంలోనే భూమికి బదులు భూమి లభించేలా పునరావాస ప్యాకేజీ అమలుచేయాలని నిర్ణయించింది. ఇందుకు మండలాలను యూనిట్‌గా తీసుకుని నిర్వాసిత ప్రాంతాలనుసమాంధ్రలో కలపాలనే నిర్ణయానికి మంత్రిమండలి సభ్యులు నిర్ణయించారు. అయితే భద్రాచలానికి దారినిచ్చే బూర్గంపాడు మండలంలోని 12 రెవెన్యూ గ్రామాలను, భద్రాచలం పట్టణాన్ని మాత్రం తెలంగాణలోనే ఉంచాలని నిర్ణయించారు. అలాగే.. రాష్ట్రంలోని రెండు కేంద్ర విద్యుత్ సంస్థలు (ఎన్టీపీసీ) ఉత్పత్తి చేసే 4,100 మెగావాట్ల విద్యుత్‌లో 85 శాతాన్ని గాడ్గిల్ ఫార్ములా ప్రకారం, మిగతా 15 శాతం విద్యుత్‌ను గత ఐదేళ్ల సగటు విద్యుత్ వినియోగం ఆధారంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు కేటాయించాలని కేబినెట్ నిర్ణయించింది. పోలవరం ముంపు ప్రాంతాలు, ఎన్టీపీసీ విద్యుత్తు అంశాలపై స్పష్టత ఇస్తూ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టానికి రెండు సవరణలు చేయాలన్న నిర్ణయాలను ఆమోదించింది. ఈ సవరణలతో ఆర్డినెన్స్ తేవాల్సి ఉన్నప్పటికీ.. దానిపై నిర్ణయం తీసుకోలేదు. తదుపరి ఏర్పాటయ్యే ప్రభుత్వమే ఈ సవరణలను ఆర్డినెన్స్ ద్వారా గానీ, పార్లమెంటు ద్వారా గానీ ఆమోదించాల్సి ఉంటుంది. సీమాంధ్రకు ప్రత్యేక తరగతి హోదా కల్పిస్తూ తీసుకున్న నిర్ణయం పరిపాలనాపరమైనది కావటంతో దాని కోసం విభజన చట్టానికి సవరణ చేయనవసరం లేదని కేంద్రం స్పష్టంచేసింది. ముంపు, పునరావాసం.. సీమాంధ్రలోనే... కేంద్ర కేబినెట్ భేటీకి రాష్ట్రానికి చెందిన కేబినెట్ మంత్రులు ఎస్.జైపాల్‌రెడ్డి, కావూరి సాంబశివరావు, పళ్లంరాజు, కిశోర్ చంద్రదేవ్ కూడా హాజరయ్యారు. పోలవరం ముంపు ప్రాంతాలైన ఏడు మండలాలను సీమాంధ్రలో కలపాలన్న అంశం చర్చకు వచ్చినప్పుడు జైపాల్‌రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. ఇంతకుముందు సమావేశాల్లో ఈ అంశాన్ని వ్యతిరేకించినప్పుడు భద్రాచలం పట్టణం, రామాలయం మినహా ఏడు మండలాల్లోని పలు రెవెన్యూ గ్రామాలను మాత్రమే బిల్లులో చేర్చారు. కేవలం ముంపు గ్రామాలను మాత్రమే కలిపితే నిర్వాసితులకు భూమికి బదులు భూమి ఇవ్వాలంటే సీమాంధ్ర రాష్ట్రానికి కష్టమవుతుందన్న అక్కడి ప్రజాప్రతినిధుల డిమాండ్ మేరకు... నిర్వాసితుల పునరావాసం విషయంలో అవసరమైన అన్ని చర్యలు కేంద్రం తీసుకుంటుందని రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి ఒక ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో రెవెన్యూ గ్రామాలను కాకుండా మండలాలను పూర్తిగా ఇస్తే భూమికి బదులు భూమి సొంత మండలంలోనే ఇవ్వొచ్చని కేంద్రం భావించింది. ఈ నిర్ణయాన్ని జైపాల్‌రెడ్డి తప్పుపట్టారు. మండలాలన్నీ ఇచ్చేస్తే భ ద్రాచలం పట్టణానికి తెలంగాణకు అనుసంధానం ఎలా ఉంటుందని ప్రశ్నించారు. దీంతో అనుసంధానానికి అవసరమైన బూర్గంపాడు మండలంలోని 12 రెవెన్యూ గ్రామాలను తెలంగాణలోనే ఉంచాలని కేబినెట్ నిర్ణయించింది. సీమాంధ్రకు ఇచ్చిన తరహాలోనే తెలంగాణ రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలని జైపాల్‌రెడ్డి కేబినెట్ భేటీలో కోరినట్లు సమాచారం. అయితే దీనిపై కేబినెట్ స్పందించలేదని తెలిసింది. ప్రత్యేక ప్యాకేజీ అమలుకు ప్రణాళికా సంఘానికి నిర్దేశం కేబినెట్ భేటీ అనంతరం.. రాష్ట్ర విభజనపై కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం) సభ్యుడు జైరాం రమేశ్ మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్(సీమాంధ్ర) రాష్ట్రానికి ప్రత్యేక హోదా నిర్ణయాన్ని కేంద్ర కేబినెట్ ఆమోదించిందని, దీనిని అమలు చేయాల్సిందిగా ప్రణాళికా సంఘానికి నిర్దేశించిందని తెలిపారు. ప్రణాళికా సంఘం పాలనా విభాగమని.. కేంద్ర సాయం ప్రణాళికా సంఘం ద్వారానే అందుతుందని ఆయన వివరించారు. ఈ ప్రతిపాదనలో సీమాంధ్రకు పన్ను ప్రోత్సాహకాల వంటి ఆరుసూత్రాల అభివృద్ధి ప్యాకేజీ ఉంటుందని చెప్పారు. ఇందులో రాయలసీమ నాలుగు జిల్లాలకు, ఉత్తర కోస్తాలోని మూడు జిల్లాలు కూడా ఉంటాయన్నారు. సొంత మండలంలోనే భూమికి బదులు భూమి... ‘‘పాల్వంచ రెవెన్యూ డివిజన్లోని కుకునూరు, వేలేరుపాడు, బూర్గుంపాడు (రెవెన్యూ గ్రామాలు పినపాక, మోరంపల్లి బంజర, బూర్గంపాడు, నాగినిప్రోలు, కృష్ణసాగర్, టేకుల, సారపాక, ఇలవెండి, మోతెపట్టినగర్, ఉప్పుశాక, నకిరీపేట, సోంపల్లి గ్రామాలు మినహా), భద్రాచలం రెవెన్యూ డివిజన్లోని చింతూరు, కూనవరం, వీఆర్‌పురం, భద్రాచలం (భద్రాచలం రెవెన్యూ గ్రామం మినహా) మండలాలు ఖమ్మం నుంచి సీమాంధ్రకు వెళతాయి. భద్రాచలం టౌన్, రామాలయం తెలంగాణలో ఉంటాయి. దీనివల్ల ముంపు బాధితులు భూమికి బదులు భూమి సొంత మండలంలోనే పొందుతారు. పోలవరం ప్రాజెక్టును కేంద్రం నిర్మిస్తుంది. ముంపు ప్రాంతం, పునరావాస ప్రాంతం రెండూ సీమాంధ్రలోనే ఉంటాయి...’’ అని జైరాం వివరించారు. ముంపు ప్రాంతాలను సీమాంధ్రలో కలిపితే వాళ్లు ఏ రాష్ట్రానికి ఓటర్లు అవుతారని విలేకరులు ప్రశ్నించగా.. ‘‘2014 ఎన్నికల్లో లోక్‌సభ, శాసనసభ ఎన్నికలు ప్రస్తుత డిలిమిటేషన్ ప్రకారమే జరుగుతాయి. అంటే 2014 ఎన్నికలకు సంబంధించి పూర్తిగా గతంలో జరిగిన రీతిలోనే జరుగుతాయి’’ అని ఆయన స్పష్టం చేశారు. గాడ్గిల్ ఫార్ములా ప్రకారం కేంద్ర విద్యుత్ పంపిణీ... విభజన తర్వాత రెండు రాష్ట్రాలకూ విద్యుత్తు పంపిణీ విషయంపై జైరాం రమేశ్ మాట్లాడుతూ ‘‘విద్యుత్తు పంపిణీపై విభజన బిల్లులో కొంత అస్పష్టత ఉంది. అందువల్ల దీనిపై కేబినెట్ ఇప్పుడు స్పష్టత ఇచ్చింది. కేంద్ర విద్యుత్తు ఉత్పత్తి సంస్థల నుంచి వచ్చే విద్యుత్తును గడిచిన ఐదేళ్ల వాస్తవ వినియోగం ఆధారంగా రెండు రాష్ట్రాలకు పంపిణీ చేయాలని బిల్లులో చెప్పింది. అంటే ఎన్టీపీసీ తదితర ప్రభుత్వ రంగ సంస్థల నుంచి ఉత్పత్తయ్యే విద్యుత్తు ఇది. అయితే కేబినెట్ ఇప్పుడు దీనిపై స్పష్టత ఇచ్చింది. కేటాయింపులు జరపని విద్యుత్తులో 15 శాతం మాత్రమే గడచిన ఐదేళ్ల వాస్తవ వినియోగం ఆధారంగా ఉంటుంది. ఉత్పత్తి అయిన 85 శాతం విద్యుత్తు గాడ్గిల్ ఫార్ములా ఆధారంగా పంపిణీ అవుతుంది’’ అని వివరించారు. రాష్ట్రంలో కేంద్ర విద్యుత్ సంస్థలు (ఎన్టీపీసీకి చెందిన విద్యుత్ ప్లాంట్లు) రెండు ఉన్నాయి. రామగుండంలో 2,100 మెగావాట్ల ప్లాంటు, విశాఖపట్నం సమీపంలో 2,000 మెగావాట్ల సింహాద్రి విద్యుత్ ప్లాంటు ఉన్నాయి. ఇవి ఉత్పత్తి చేసే మొత్తం విద్యుత్‌లో 15 శాతం విద్యుత్‌ను ఎవరికీ కేటాయించకుండా కేంద్రం తన వద్ద ఉంచుకుంటుంది. దీనినే అన్-అలొకేటెడ్ కోటాగా వ్యవహరిస్తారు. రెండు ప్లాంట్ల 4,100 మెగావాట్లలో ఇది 615 మెగావాట్లుగా ఉంటుంది. సాధారణంగా ఈ విద్యుత్‌ను విద్యుత్ సమస్యను ఎదుర్కొంటున్న వివిధ రాష్ట్రాలకు అవసరాన్ని బట్టి కేంద్రం కేటాయిస్తుంది. అయితే.. తాజాగా ఈ 15 శాతం విద్యుత్‌ను తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాలకు గత ఐదేళ్ల సగటు వినియోగం ఆధారంగా కేటాయించనున్నట్లు జైరాం తెలిపారు. ఈ ప్రకారం చూస్తే.. అన్-అలొకేటెడ్ కోటా నుంచి తెలంగాణకు 55 నుంచి 60% విద్యుత్, సీమాంధ్రకు 40 నుంచి 45% విద్యుత్ వచ్చేఅవకాశం ఉందని ఇంధన శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక మిగిలిన 85 శాతం విద్యుత్‌ను గాడ్గిల్ ఫార్ములా ఆధారంగా రెండు రాష్ట్రాలకు కేటాయిస్తామని జైరాం చెప్పారు. గాడ్గిల్ ఫార్ములా అంటే.. ఆ రాష్ట్రం ప్రణాళిక బడ్జెట్, సగటు విద్యుత్ వినియోగం, వ్యవసాయ విద్యుత్ డిమాండ్, విద్యుత్ సంస్కరణల అమలు, ప్రభుత్వ సబ్సిడీ విడుదల.. ఈ ఐదు అంశాల ఆధారంగా విద్యుత్‌ను కేటాయిస్తారు. ఈ ప్రాతిపదికన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు ఎంతెంత విద్యుత్ కేటాయించాలనే లెక్కలు వేసే పనిలో విద్యుత్‌శాఖ అధికారులు నిమగ్నమయ్యారు. రెండు మూడు రోజుల్లో సీమాంధ్ర రాజధాని కమిటీ ‘‘ఆస్తులు, అప్పుల పంపిణీ తదితర అంశాలను బేరీజు వేసుకుని సాధ్యమైనంత త్వరలో అపాయింటెడ్ డే ప్రకటన ఉంటుంది. సిబ్బంది వ్యవహారాల శాఖ ఇప్పటికే విభజనకు సంబంధించి రెండు కమిటీలు ఏర్పాటుచేసింది. అఖిల భారత సర్వీసు అధికారులు, రాష్ట్రస్థాయి అధికారుల పంపిణీకి ఈ కమిటీలు ఏర్పాటయ్యాయి. ఈ కమిటీలు సోమవారం నుంచి పనిచేస్తాయి. సీమాంధ్రకు కొత్త రాజధానిపై అధ్యయనం చేసేందుకు కమిటీ రెండు 3 రోజుల్లో ఏర్పాటవుతుంది..’’ అని జైరాం చెప్పారు. సీమాంధ్రలో కలిసే ప్రాంతాలు ఇవీ.. పాల్వంచ రెవెన్యూ డివిజన్లోని కుకునూరు, వేలేరుపాడు, బూర్గంపాడు (పాక్షికంగా) మండలాలు; భద్రాచలం రెవెన్యూ డివిజన్లోని చింతూరు, కూనవరం, వీఆర్‌పురం, భద్రాచలం (భద్రాచలం రెవెన్యూ గ్రామం, రామాలయం సహా పట్టణం మినహా) మండలాలు తెలంగాణలో ఉండే గ్రామాలు: బూర్గంపాడు మండలంలోని రెవెన్యూ గ్రామాలు పినపాక, మోరంపల్లి బంజర, బూర్గంపాడు, నాగినిప్రోలు, కృష్ణసాగర్, టేకుల, సారపాక, ఇలవెండి, మోతెపట్టినగర్, ఉప్పుశాక, నకిరీపేట, సోంపల్లి. అలాగే భద్రాచలం మండలంలోని భద్రాచలం రెవెన్యూ గ్రామం, రామాలయం సహా పట్టణం -
'సీమాంధ్ర రాజధానిగా విశాఖే బెస్ట్'
విశాఖ : సీమాంధ్రకు విశాఖ రాజధానిని చేయాలని కేంద్ర మంత్రి కిషోర్ చంద్రదేవ్ మరోసారి డిమాండ్ చేశారు. కొత్త రాజధానికి విశాఖ అనుకూలమైన ప్రాంతమని ఆయన బుధవారమిక్కడ వ్యాఖ్యానించారు. సీమాంధ్రకు స్వయంప్రతిపత్తి పదేళ్లు ఇవ్వాలని కిషోర్ చంద్రదేవ్ సూచించారు. విశాఖ ఏజెన్సీ పర్యటన సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రెండో అతి పెద్ద నగరం విశాఖపట్టణమేనని, సీమాంధ్ర ప్రాంతానికి విశాఖపట్టణమే రాజధానికి సరైన ప్రత్యామ్నాయమని అన్నారు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను ఉంచడం కన్నా విశాఖను రాజధానిని చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఈమేరకు కిషోర్ చంద్రదేవ్ గతంలో కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేకి లేఖ కూడా రాశారు. కిశోర్ చంద్రదేవ్ విశాఖ జిల్లా అరకు నుంచి ప్రాతినిద్యం వహిస్తున్న విషయం తెలిసిందే. -
దొనకొండ..ఒక ఆశ
దొనకొండ.. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా జనం నోళ్లలో నానుతున్న ఊరి పేరు. దొనకొండను ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చేయనున్నారనే అంశంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. పారిశ్రామికంగా అభివృద్ధి చెందేందుకు పలకల గనులు, వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు అందుబాటులో ఉండటంతో సీమాంధ్ర రాజధానిగా దొనకొండ పేరు తెరపైకొచ్చింది. రాష్ట్ర విభజన అంకం ఓ కొలిక్కి రావడంతో కొత్త రాజధాని ఏర్పాటుకు అనువైన స్థలాలు జిల్లాలోని దొనకొండ ప్రాంతంలో ఉన్నాయని రాష్ట్ర భూ పరిపాలనా విభాగం ఢిల్లీకి పంపిన నివేదికల్లో పేర్కొంది. దొనకొండ గత చరిత్ర ఘనమే.. రాష్ట్రం ఏర్పడక ముందు దొనకొండ ప్రాంతం నెల్లూరు జిల్లాలో ఉండేది. బ్రిటీష్ పాలకులు 1934లో దొనకొండకు దగ్గరలో 136.5 ఎకరాల విస్తీర్ణంలో విమానాశ్రయాన్ని నిర్మించారు. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో విమానాలను ఇక్కడ నిలిపి ఇంధనాన్ని నింపుకుని సమావేశాలు నిర్వహించుకునే వారు. 1965-70 మధ్య కాలంలో విమానాలు రాకపోకలు సాగించేవి. విమానాశ్రయ స్థలం ఆక్రమణలకు గురికాకుండా నాలుగు నెలల కిందట సుమారు 43 లక్షల రూపాయల ఖర్చుతో కేంద్ర ప్రభుత్వం ఫెన్సింగ్ ఏర్పాటు చేయించింది. ఈ స్థలం ప్రస్తుతం ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధీనంలో ఉంది. ఇక రవాణా పరంగా దొనకొండ రైల్వేస్టేషన్ గుంతకల్ డివిజన్లో అత్యంత ప్రాధాన్యత కలిగి ఉంది. 1992కు పూర్వం మీటర్ గేజ్‌గా ఉన్న సమయంలో గుంటూరు నుంచి గుంతకల్ వెళ్లే రైళ్లు, గూడ్స్ బండ్లు దొనకొండలో నిలిపేవారు. డ్రైవర్లు విధులు మారే వారు. 2 వేల మంది రైల్వే ఉద్యోగులు ఇక్కడ పనిచేసే వారు. వీరి కోసం బ్రిటీష్ ప్రభుత్వం ప్రత్యేకంగా రైల్వే ఇన్స్టిట్యూట్ను నెలకొల్పింది. బ్రాడ్ గేజ్ కావడంతో ఇక్కడ పని చేస్తున్న సిబ్బందిని వివిధ ప్రాంతాలకు బదిలీ చేశారు. సుమారు 200 మంది ఉద్యోగులు నివసించే క్వార్టర్లను నిర్మించారు. రైల్వే క్వార్టర్లు శిథిలావస్థకు చేరడంతో అధికారులు పడేశారు. మొత్తం 140 ఎకరాల స్థలం రైల్వే శాఖ ఆధీనంలో ఉంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం దొనకొండ ప్రాంతంలో 35 వేల ఎకరాల సాగు భూమి ఉండగా.. 25 వేల ఎకరాలు సాగర్ ఆయకట్టు పరిధిలో ఉంది. సుమారు 34 వేల ఎకరాల అసైన్డ్ భూములున్నాయి. పుష్కలంగా నీటి సౌకర్యం గుండ్లకమ్మతో పాటు, నాగార్జున సాగర్ నీరు త్రిపురాంతకం, కురిచేడు, దర్శి, దొనకొండ, చీమకుర్తి తదితర ప్రాంతాల్లోని పొలాలకు అందుతోంది. ఇక వెలిగొండ ప్రాజెక్టు పూర్తయితే సుమారు 15 లక్షల మందికి తాగునీరు, 4.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతం గుండ్లకమ్మ నీరు వృథాగా సముద్రంలో కలుస్తోంది. ఈ నీటిని పరిశ్రమలకు ఉపయోగించుకునే అవకాశం ఉంది. రవాణా రంగం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, మార్కాపురం, నంద్యాల మీదుగా గుంతకల్ రైల్వే జంక్షన్‌ను, కర్నూలు మీదుగా హైదరాబాద్‌ను కలిపే రైలు మార్గం దొనకొండలో ఉంది. ప్రస్తుతం విద్యుదీకరణకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు టెండర్లు పిలిచారు. నడికుడి-శ్రీకాళహస్తి రైలు మార్గం ప్రతిపాదన దశలో ఉంది. ఉత్తరాంధ్ర నుంచి తెలంగాణకు ఈ మార్గం ద్వారా రాకపోకలు సాగిస్తుంటారు. గుంటూరు నుంచి నంద్యాల వెళ్లే రాష్ట్ర రహదారి దొనకొండ సమీపంలో ఉంది. ఇటీవలే నల్గొండ జిల్లా నకిరేకల్ నుంచి సాగర్ , మాచర్ల, యర్రగొండపాలెం, మార్కాపురం, కొనకనమిట్ల, కనిగిరి, నెల్లూరు జిల్లా వెంకటగిరి మీదుగా రహదారిని మంజూరు చేశారు. జిల్లా కేంద్రం ఒంగోలుకు దొనకొండ 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. విద్యుత్‌కు ఇబ్బంది లేదు.. శ్రీశైలం డ్యామ్ దొనకొండకు వంద కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ పవర్ ప్రాజెక్టు నుంచి దొనకొండ ప్రాంతానికి విద్యుత్ అందించవచ్చు. విజయవాడ ఎన్టీపీసీ విద్యుత్ లైన్లు ఒంగోలు నుంచి పొదిలి వరకు ఉన్నాయి. ఇక్కడ నుంచి లైన్ ఏర్పాటు చేసే అవకాశం కూడా ఉంది. శ్రీశైలం కుడిగట్టు కాలువ నుంచి ప్రతి రోజూ కోటి 41 లక్షల 14 వేల మెగా యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. జిల్లాకు 41.60 లక్షల మెగా యూనిట్ల విద్యుత్‌ను కేటాయించారు. జిల్లా మొత్తం విద్యుత్ వినియోగం 71.60 లక్షల మెగా యూనిట్లు. శ్రీశైలం నుంచి వచ్చే విద్యుత్ సరఫరాతో పాటు మిగిలిన విద్యుత్‌ను విజయవాడ ఎన్టీ పీఎస్ నుంచి అందిస్తున్నారు. మార్కాపురం డివిజన్లో రోజుకు 20 లక్షల 60 వేల మెగా యూనిట్ల విద్యుత్‌ను, పొదిలిలో 15.60 లక్షల మెగా యూనిట్ల విద్యుత్‌ను శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా ఉపయోగించుకుంటున్నారు. రాష్ర్ట విభజన నేపథ్యంలో ఈ గణాంకాలకు అటుఇటుగా విద్యుత్ అందించే అవకాశం ఉంది. భౌగోళికంగా.. రాజధాని నిర్మించాలంటే సుమారు 5 లక్షల మంది నివసించే ప్రాంతం అవసరం. ఇందుకు అవసరమైన ప్రభుత్వ భూమి దొనకొండ, మార్కాపురం, పొదిలి ప్రాంతాల్లో ఉంది. భౌగోళికంగా ఈ ప్రాంతం జనజీవనానికి అనుకూలంగా ఉంటుంది. తుఫాన్లు, భూకంపాల తాకిడి చాలా తక్కువ. సునామీలు వచ్చే అవకాశమే లేదు. సుమారు 34 వేల ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉంది. దొనకొండ మండలంలోని రుద్రసముద్రం, మల్లంపేట, పోలేపల్లి, లక్ష్మీపురం, కొచ్చర్లకోట తదితర గ్రామాల్లో అసైన్డ్ భూములు విస్తారంగా ఉన్నాయి. తాగునీటి సౌకర్యానికి ఇబ్బంది లేకుండా సాగర్ నీరు, గుండ్లకమ్మ జలాలు అందుబాటులో ఉన్నాయి. మార్కాపురం నుంచి నల్లమల అటవీ ప్రాంతం ప్రారంభమవుతుంది. దొనకొండకు 22 కిలోమీటర్ల దూరంలో డివిజన్ కేంద్రం, అంతర్జాతీయంగా పలకల ఉత్పత్తిలో పేరు గాంచిన మార్కాపురం పట్టణం ఉంది. కంభం నుంచి పొదిలి వరకు సుమారు 1.35 లక్షల ఎకరాల అటవీ భూమి ఉంది. మేకలవారిపల్లె, కలుజువ్వలపాడు, గానుగపెంట, కొనకనమిట్ల, గొట్లగట్టు తదితర ప్రాంతాల్లో అటవీ భూములున్నాయి. ఇందులో ఎక్కువగా చిల్లచెట్లు మాత్రమే ఉన్నాయి. మార్కాపురం నుంచి దోర్నాల, పెద్దారవీడు, యర్రగొండపాలెం, పుల్లలచెరువు అటవీప్రాంతంలో సుమారు 1.11 లక్షల ఎకరాల అటవీ భూములున్నట్లు అంచనా. ప్రస్తుత మార్కాపురం ప్రాంతం గతంలో కర్నూలు జిల్లాలో ఉండేది. ఇటు రాయలసీమకు, అటు కోస్తాంధ్రకు పశ్చిమ ప్రకాశం సరిహద్దుగా ఉండటంతో రాజధానిగా దొనకొండ అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు. పారిశ్రామిక రంగానికి అనుకూలం దొనకొండ ప్రాంతంలో సుమారు 34 వేల ఎకరాల అసైన్డ్ భూమి, 1.35 లక్షల ఎకరాల అటవీ భూమి కంభం-మార్కాపురం-పొదిలి మధ్య అందుబాటులో ఉంది. మార్కాపురం ప్రాంతంలో నల్లమలలోని 1.11 లక్షల ఎకరాల అటవీ భూములున్నాయి. గట్టి నేల కావడంతో పాటు భూకంపాలు వచ్చే అవకాశాలు చాలా తక్కువ. మార్కాపురం మండలం రాయవరం నుంచి సుమారు 15 కిలోమీటర్ల పొడవున పలకల గనులు విస్తరించి ఉన్నాయి. సుమారు 50 గ్రామాల ప్రజలు పలకల గనుల ద్వారా ఉపాధి పొందుతున్నారు. 60 కిలోమీటర్ల దూరంలో చీమకుర్తి గ్రానైట్ గనులున్నాయి. మానవ వనరులకు కొదవ లేదు. మార్కాపురం, దొనకొండ, కొనకనమిట్ల, పొదిలి తదితర మండలాల్లో సుమారు రెండు లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారు. వీరిలో ఏటా సుమారు 20 వేల మంది కూలీలు జీవనోపాధి కోసం వివిధ ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. నిర్మాణ రంగంలో ఎక్కువగా పనిచేస్తున్నారు. కేంద్రానికి నివేదిక గతంలో జిల్లా కలెక్టర్‌గా, ప్రత్యేకాధికారిగా పనిచేసిన ఐఏఎస్ అధికారి మూడు నెలల క్రితం ఈ ప్రాంతంలో రాజధాని ఏర్పాటుపై కేంద్రానికి నివేదిక పంపినట్లు తెలిసింది. పారిశ్రామిక రంగం అభివృద్ధికి అవసరమైన ప్రభుత్వ భూములు విస్తారంగా ఉండటం, జీవనది గుండ్లకమ్మ ప్రవహించడం, వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణ దశలో ఉండటంతో నీటి సమస్య కూడా తలెత్తదని కేంద్రానికి పంపిన నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. ప్రకృతి వైపరీత్యాలు సంభవించే అవకాశాలు లేకపోవడం, సీమాంధ్రలో అన్ని ప్రాంతాలను కలుపుతూ దొనకొండ మీదుగా రైల్వే లైన్, రహదారులు ఉండటంతో రాజధానికి అనువుగా ఉంటుందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా రాయలసీమలోని కడపకు సెయిల్ కర్మాగారం, విజయవాడ-గుంటూరు, తెనాలి పట్టణాలను మెట్రో నగరంగా, విశాఖపట్నం నుంచి చెన్నై వరకు పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి చేస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో సీమాంధ్రకు దొనకొండను రాజధానిగా చేసే అంశం ప్రజల్లో ఆశలు రేకెత్తిస్తోంది. -
'వాళ్లు సామ్రాట్లు....మనం సామంతులం'
తిరుపతి : రాష్ట్ర విభజన విషయంలో ఢిల్లీవాళ్లు సామ్రాట్లులాగా వ్యవహరిస్తూ... మనల్ని సామంతులుగా చూస్తున్నారని శైలజానాథ్ విమర్వించారు. ఆయన సోమవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం శైలజానాథ్ మాట్లాడుతూ మొత్తం తెలుగు జాతి నాశమైనప్పుడు ఇక రాజధానుల కోసం పోట్లాడుకోవటం ఎందుకని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తెలుగు వారికి అన్యాయం చేశాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాను విభజన వాదిని కాదని... ఆరోగ్యం సరిగా లేకున్నా రాష్ట్రం సమైక్యంగా ఉండేందుకు పోరాడినట్లు తెలిపారు. కాగా శైలజానాథ్‌తో పాటు రుద్రరాజు పద్మరాజు కూడా వెంకన్నను దర్శించుకున్నారు.