'విభజన బిల్లును పార్లమెంట్ లో పెట్టవద్దు'
'విభజన బిల్లును పార్లమెంట్ లో పెట్టవద్దు'
Published Thu, Jan 30 2014 2:48 PM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM
హైదరాబాద్: రాష్ట్ర విభజన బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టవద్దని అసెంబ్లీలో ప్రభుత్వ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఉభయసభలు ఆమోదించాయని మంత్రులు కన్నా లక్ష్మినారాయణ, శైలజానాథ్, ఆనం రాంనారాయణ్ రెడ్డిలు అన్నారు.
అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడిన తర్వాత ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన తీర్మానానికి సీమాంధ్రకు చెందిన 159 మంది ఎమ్మెల్యేలు అనుకూలంగా ఓటేసి ఉండేవారు, తెలంగాణకు చెందిన 119 మంది తీర్మానాన్ని వ్యతిరేకించేవారు అని వారన్నారు.
విభజన బిల్లును తిరస్కరిస్తూ ప్రవేశపెట్టిన తీర్మానం మూజువాణి నిర్ణయంతొ ఆమోదం పొందింది అని వారన్నారు. అసెంబ్లీ తీర్మానాన్ని రాష్ట్రపతికి పంపిస్తాం మంత్రులు శైలజానాథ్, ఆనం, కన్నా వెల్లడించారు.
Advertisement