'విభజనను పార్లమెంటే తేల్చగలుగుతుంది'
న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ విభజనను పార్లమెంట్ మాత్రమే తేల్చగలుగుతుందని పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి కమల్‌నాథ్ అన్నారు. తెలంగాణ ఏర్పాటుపై ఎప్పుడు నిర్ణయం తీసుకున్నా గందరగోళం తప్పదని ఆయన శుక్రవారమిక్కడ స్పష్టం చేశారు. తెలంగాణ, సీమాంధ్ర నేతలు వారి వారి ప్రాంతాలకు అనుగుణంగా ఆందోళనలు చేస్తారని, ఈ పరిస్థితుల్లో పార్లమెంటే తగిన నిర్ణయం తీసుకోగలదని పేర్కొన్నారు.
కాగా మరోవైపు కాంగ్రెస్ కోర్ కమిటీ ఈరోజు సాయంత్రం భేటీ కానుంది. ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలపై కీలకంగా చర్చించనుంది. తెలంగాణ బిల్లు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తిరుగుబాటపై దృష్టి సారించనుంది.