ఢిల్లీ: రాజ్యసభలో రాజ్యాంగంపై చర్చ సమయంలో మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ, కాంగ్రెస్‌పై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ విమర్శలు గుప్పించారు. పౌర హక్కులను పరిమితం చేయడానికి కాంగ్రెస్ పదే పదే రాజ్యాంగాన్ని సవరించిందని ఆరోపించారు.
రాజ్యసభలో నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. ‘గత ఏడు దశాబ్దాలలో మన రాజ్యాంగంలో అనేక సవరణలు జరిగాయి. నెహ్రూ తాత్కాలిక ప్రభుత్వంలో రాజ్యాంగంలో వాక్ స్వాతంత్య్రాన్ని అరికట్టేలా మొదటి సవరణ జరిగింది. మీడియా సంస్థలు ముఖ్యంగా రాజకీయంతో సంబంధం ఉన్న కీలక అంశాలపై లోతుగా విచారణ జరపరడాన్ని నెహ్రూ వ్యతిరేకించారని, పత్రికా స్వాతంత్య్రాన్ని తగ్గించేందుకు రాజ్యాంగాన్ని ఆమోదించిన ఏడాదిలోపే రాజ్యాంగాన్ని సవరించారని పేర్కొన్నారు.
Constitution Debate | In Rajya Sabha, Union Finance Minister Nirmala Sitharaman says, "...The Congress party brazenly kept amending the Constitution to help the family and dynasty... These amendments were not to strengthen democracy but to protect those in power, the process was… pic.twitter.com/lSRyqS4FX5
— ANI (@ANI) December 16, 2024
గత వారం లోక్‌సభలో రెండు రోజులపాటు జరిగిన వాడివేడి చర్చల తర్వాత ఇవాళ సీతారామన్ రాజ్యసభలో రాజ్యాంగంపై చర్చను ప్రారంభించారు . ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌పై ప్రతిపక్ష పార్టీలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ చర్చ జరిగింది.
పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో రాజ్యాంగంపై చర్చ జరపాలని ప్రతిపక్షాలు కీలక డిమాండ్ చేశాయి. దీంతో పాటు అదానీ వివాదం, జార్జ్ సోరోస్ ఆరోపణలు , ఉపరాష్ట్రపతి,రాజ్యసభ చైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖడ్‌పై విపక్షాలు అవిశ్వాస తీర్మానం నోటీసు వంటి అంశాలు ఉభయ సభల్లో గందరగోళానికి దారి తీశాయి.
Comments
Please login to add a commentAdd a comment