రాజ్యాంగ పరిషత్ సభ్యుల సంఖ్య ఎంత? | Indian Polity | Sakshi
Sakshi News home page

రాజ్యాంగ పరిషత్ సభ్యుల సంఖ్య ఎంత?

Published Wed, Oct 26 2016 5:01 AM | Last Updated on Mon, Sep 4 2017 6:17 PM

రాజ్యాంగ పరిషత్ సభ్యుల సంఖ్య ఎంత?

రాజ్యాంగ పరిషత్ సభ్యుల సంఖ్య ఎంత?

ఇండియన్ పాలిటీ
రాజ్యాంగం అంటే - ప్రజలు,  ప్రభుత్వానికి మధ్య సంబంధాన్ని తెలిపే మౌలిక శాసనం. దేశ పాలనా విధానానికి మూలాధారం.
 
 రాజ్యాంగ లక్ష్యం - రాజ్యాధికార నియంత్రణ, వ్యక్తి స్వేచ్ఛ, హక్కుల పరిరక్షణ.
 
 చట్టాలు
 భారత రాజ్యాంగ అభివృద్ధికి తోడ్పడిన మొదటి చట్టం- 1773 రెగ్యులేటింగ్ చట్టం.     ఈ చట్టం ద్వారా బెంగాల్ గవర్నర్‌ను గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్‌గా మార్చారు. మొదటి గవర్నర్ జనరల్‌గా వారన్ హేస్టింగ్‌‌సను నియమించారు. ఇతనికి సాయపడేందుకు నలుగురు సభ్యులతో కార్యనిర్వాహక మండలిని ఏర్పాటు చేశారు. ప్రధాన న్యాయమూర్తి, మరో ముగ్గురు న్యాయమూర్తులతో సుప్రీంకోర్టును ఏర్పాటు చేశారు.    
 
 1813 చార్టర్ చట్టం ద్వారా విద్యాభివృద్ధికి బడ్జెట్‌లో రూ.లక్ష కేటాయించారు. క్రిస్టియన్ మిషనరీలను భారత్‌లోకి అనుమతించారు.  
 
 1833 చార్టర్ చట్టం ద్వారా బెంగాల్ గవర్నర్ జనరల్‌ను గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చారు. మొదటి గవర్నర్ జనరల్‌గా విలియం బెంటిక్ నియమితుడయ్యాడు. మెకాలే అధ్యక్షతన మొదటి ‘లా’ కమిషన్‌ను నియమించారు.
 
 1853 చార్టర్ చట్టం ద్వారా పార్లమెంటరీ ప్రభుత్వానికి పునాదులు వేశారు. ఉద్యోగుల భర్తీకి పోటీ పరీక్షల విధానాన్ని ప్రవేశపెట్టారు.
 
 1858 విక్టోరియా మహారాణి ప్రకటన ద్వారా కంపెనీ పరిపాలన రద్దు చేసి, మహారాణి ప్రత్యక్ష పరిపాలన ప్రారంభించారు. గవర్నర్ జనరల్‌ను వైస్రాయ్‌గా మార్చి మొదటి వైస్రాయ్‌గా లార్‌‌ట కానింగ్‌ను నియమించారు. బ్రిటన్‌లో భారత వ్యవహారాల కార్యదర్శి పదవి ఏర్పాటు చేసి మొదటి కార్యదర్శిగా చార్లెస్ ఉడ్‌ను నియమించారు.
 
 1861 కౌన్సిల్ చట్టం ద్వారా పోర్‌‌టఫోలియో విధానాన్ని ప్రవేశపెట్టారు. ఆర్టినెన్‌‌సలను జారీచేసే అధికారాన్ని వైస్రాయ్‌కి కల్పించారు. బడ్జెట్ ప్రవేశపెట్టే విధానాన్ని ప్రారంభించారు.

 1892 కౌన్సిల్ చట్టం ద్వారా కేంద్ర శాసన సభలో భారతీయుల ప్రాతినిధ్యాన్ని 6కి పెంచారు. బడ్జెట్ మినహా మిగిలిన అన్ని అంశాలపై ప్రశ్నించే అధికారం కల్పించారు.
 
 1885లో ఎ.ఒ.హ్యూమ్ జాతీయ కాంగ్రెస్‌ను స్థాపించాడు. ఈ పార్టీ మొదటి సమావేశం 1885, డిసెంబర్‌లో బాంబేలో డబ్ల్యు.సి.బెనర్జీ అధ్యక్షతన జరిగింది. సూరత్ సమావేశం (1907)లో ఇందులోని వారు  అతివాదులు, మితవాదులుగా చీలిపోయారు. ఈ సమావేశఅధ్యక్షుడు రాస్‌బిహారి ఘోష్. 1916 లక్నో సమావేశంలో వీరంతా తిరిగి కలిసిపోయారు.

 1909 మింటో-మార్లే సంస్కరణల చట్టం రూపకల్పనలో భారత కార్యదర్శి మార్లే, గవర్నర్ జనరల్ మింటో ప్రముఖ పాత్ర పోషించారు. ఈ చట్టం ద్వారా పరిమిత ప్రాతిపదికన ఓటింగ్ పద్ధతిని ప్రవేశపెట్టారు. శాసనసభ సభ్యుల సంఖ్యను 16 నుంచి 60కి పెంచారు. గవర్నర్ కార్యనిర్వాహక మండలిలోకి ఒక భారతీయుడిని సభ్యుడిగా (ఎస్.పి.సిన్హా) తీసుకున్నారు. ముస్లిం లకు ప్రత్యేక నియోజకవర్గాలను కేటాయించారు.
 
 1919 మాంటేగు-ఛెమ్స్‌ఫర్‌‌డ సంస్కరణల చట్టం రూపకల్పనలో భారత కార్యదర్శి మాంటేగు, గవర్నర్ జనరల్ ఛెమ్స్‌ఫర్‌‌డ ప్రముఖపాత్ర పోషించారు. ఈ చట్టం ద్వారా పాక్షిక బాధ్యతాయుత ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టారు. రాష్ట్రాల్లో ద్వంద్వపాలన, కేంద్రంలో ద్విసభా విధానం, కేంద్ర బడ్జెట్ నుంచి రాష్ర్ట బడ్జెట్‌ను వేరు చేయడం, సిక్కులకు ప్రత్యేక నియోజకవర్గాల కేటాయింపు, సర్వీస్ కమిషన్, ఆడిటింగ్ వ్యవస్థ ఏర్పాటు మొదలైనవి ప్రవేశపెట్టారు.
 
 సైమన్ కమిషన్ నివేదిక, రౌండ్ టేబుల్ సమావేశాలు, ఎం.ఎన్.రాయ్ డిమాండ్ ఆధారంగా 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని రూపొందించారు. ఇందులో 321 అధికరణలు, 10 షెడ్యూళ్లు, 14 భాగాలు ఉండేవి. ఈ చట్టం ద్వారా పూర్తి బాధ్యతాయుత ప్రభుత్వం, కేంద్రంలో ద్వంద్వపాలన, సమాఖ్య ప్రభుత్వం, కేంద్రం, రాష్ట్రాల మధ్య అధికారాల విభజన, కేంద్రం, రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారానికి ఫెడరల్ కోర్టు, ఫెడరల్ సర్వీసుల ఏర్పాటు, రాష్ట్రాల్లో ద్విసభా విధానం, ఎస్సీ, ఆంగ్లో ఇండియన్లకు ప్రత్యేక నియోజకవర్గాల కేటాయింపు, రిజర్‌‌వ బ్యాంక్ స్థాపన, ఇండియా నుంచి బర్మాను వేరు చేయడం, అడ్వకేట్ జనరల్ పదవి ఏర్పాటు మొదలైనవి ప్రవేశపెట్టారు.
 
 ‘మన దేశంలో నూతన బానిసత్వానికి ఈ చట్టం నాంది’ అని గాంధీ పేర్కొన్నారు. ‘పటిష్టమైన బ్రేకులు మాత్రమే ఉన్న, ఇంజన్‌లేని వాహనం’గా నెహ్రూ ఈ చట్టాన్ని విమర్శించారు.
 
 రాజ్యాంగ పరిషత్
 1945లో రెండో ప్రపంచ యుద్ధం ముగిసింది. ఇందులో పాల్గొన్న బ్రిటన్ బలహీనపడింది. బ్రిటన్‌లో ఎన్నికలు జరిగి లేబర్ పార్టీ విజయం సాధించింది. లేబర్ పార్టీ నాయకుడు, బ్రిటన్ ప్రధాని లార్‌‌డ క్లెమెంట్ అట్లీ, భారత్‌కు పూర్తి  స్వాతంత్య్రం ఇవ్వబోతున్నామని, స్వాతంత్య్రానంతరం రాజ్యాంగ రూపక ల్పనలో సహకరిస్తామని ప్రకటించారు. ఇందు కోసం ముగ్గురు సభ్యులతో 1946, మార్చిలో క్యాబినెట్ మిషన్ ప్లాన్‌ను నియమించారు. దీని సలహా మేరకు 1946, నవంబర్‌లో రాజ్యాంగ పరిషత్‌ను ఏర్పాటు చేశారు.
 
 రాజ్యాంగ పరిషత్ సభ్యుల సంఖ్య 389. వీరిలో 292 మంది బ్రిటిష్ పాలిత రాష్ట్రాల నుంచి, 93 మంది స్వదేశీ సంస్థానాల నుంచి, నలుగురు బ్రిటిష్ కేంద్రపాలిత ప్రాంతాల నుంచి నియమితులయ్యారు. ప్రత్యేక పాకిస్తాన్ డిమాండ్ సభ్యులు వెళ్ళిపోగా మిగిలిన సభ్యుల సంఖ్య 299. వీరిలో ఎన్నికైన వారు 229 మంది, నియమితులైనవారు 70 మంది.
 
 రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశం 1946, డిసెంబర్ 9న సచ్చిదానంద సిన్హా అధ్యక్షతన జరిగింది. 1946, డిసెంబర్ 11న రాజ్యాంగ పరిషత్ శాశ్వత అధ్యక్షుడిగా రాజేంద్రప్రసాద్, ఉపాధ్యక్షులుగా హెచ్.సి.ముఖర్జీ, వి.టి.కృష్ణమాచారి, సలహాదారుగా బి.ఎన్.రావు ఎన్నికయ్యారు. 1946, డిసెంబర్ 13న లక్ష్యాలు, ఆశయాల తీర్మానాన్ని జవహర్‌లాల్ నెహ్రూ  ప్రవేశపెట్టారు.
 
 రచనా సంఘం
 రాజ్యాంగ ముసాయిదాను తయారు చేయడానికి రచనా సంఘాన్ని 1947, ఆగస్టు 29న నియమించారు. అధ్యక్షుడితో కలిపి సభ్యుల సంఖ్య 7. అధ్యక్షుడు అంబేద్కర్, సభ్యులు గోపాలస్వామి అయ్యంగార్, కృష్ణస్వామి అయ్యర్, మహమ్మద్ సాదుల్లా, కె.ఎం. మున్షీ, మాధవరావు, వి.టి. కృష్ణమాచారి.
 
 రాజ్యాంగ ముసాయిదాను రాజ్యాంగ పరిషత్‌లో బి.ఎన్.రావు ప్రవేశపెట్టారు. ఇందులో 315 అధికరణలు, 8 షెడ్యూళ్లు ఉన్నాయి.
 
 రాజ్యాంగ పరిషత్, రాజ్యాంగ ముసాయిదాను  1949, నవంబర్ 26న ఆమోదించింది. అందువల్ల ఆ రోజు నుంచి పాక్షిక రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. పూర్తి రాజ్యాంగం 1950, జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ రెండు నెలల ఆలస్యానికి కారణం.. 1929 లాహోర్ కాంగ్రెస్ సమావేశంలో నెహ్రూ ప్రవేశపెట్టిన సంపూర్ణ స్వరాజ్య తీర్మానం.
 
 భారత రాజ్యాంగంపై విమర్శలు
 భారత రాజ్యాంగం న్యాయవాదుల  స్వర్గం
 - ఐవర్ జెన్నింగ్‌‌స
 భారత రాజ్యాంగ ఒక అరువు తెచ్చుకున్న రాజ్యాంగం     - ఐవర్ జెన్నింగ్‌‌స
 భారత రాజ్యాంగాన్ని పరిషత్‌గుర్తుకు అనుగు ణంగా రూపొందించారు - హెచ్.వి.కామత్
 భారత రాజ్యాంగం 1935 చట్టపు జిరాక్స్ కాపీ     - ప్రొ. కె.టి.షా
 భారత రాజ్యాంగ పరిషత్ కాంగ్రెస్ పార్టీ సభ     
 - చర్చిల్
 
 ఇతర రాజ్యాంగాల నుంచి గ్రహించిన అంశాలు
 బ్రిటన్: పార్లమెంటరీ ప్రభుత్వం, శాసనప్రక్రియ, స్పీకర్ వ్యవస్థ, సమన్యాయపాలన, ఏక పౌరసత్వం, ఏకీకృత న్యాయవ్యవస్థ, ఎన్నికల సంఘం, కాగ్ వ్యవస్థ, అఖిల భారత సర్వీసులు.

 అమెరికా: ప్రజాస్వామ్యం, ఉపరాష్ర్టపతి వ్యవస్థ, రాజ్యాంగ ప్రవేశిక, ప్రాథమిక హక్కులు, స్వయం ప్రతిపత్తి గల న్యాయవ్యవస్థ, న్యాయ సమీక్ష, మహాభియోగ తీర్మానం.

 కెనడా: సమాఖ్య విధానం, అవశిష్ట అధికారాలు, గవర్నర్ వ్యవస్థ.
 ఐర్లాండ్: ఆదేశిక సూత్రాలు, రాష్ర్టపతి ఎన్నిక, రాజ్యసభ సభ్యుల నియామకం.
 దక్షిణాఫ్రికా: రాజ్యాంగ సవరణ, రాజ్యసభ సభ్యుల ఎన్నిక.
 ఆస్ట్రేలియా: పార్లమెంట్ ఉమ్మడి సభ సమావేశం, ఉమ్మడి జాబితా.
 ఫ్రాన్‌‌స: గణతంత్ర, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం.
 రష్యా: ప్రాథమిక విధులు, సామ్యవాదం, న్యాయం, ప్రణాళికలు.
 
 జపాన్: జీవించే హక్కు
 జర్మనీ: అత్యవసర పరిస్థితి
 షెడ్యూళ్లు
 మొదటి షెడ్యూల్: కొత్త రాష్ట్రాల ఏర్పాటు, రాష్ట్రాల పేర్ల మార్పు.
 రెండో షెడ్యూల్: ప్రముఖుల జీతభత్యాలు.
 మూడో షెడ్యూల్: ప్రముఖుల పదవీ ప్రమాణ స్వీకారాలు.
 నాలుగో షెడ్యూల్: రాజ్యసభలో సీట్ల కేటాయింపు.
 ఐదో షెడ్యూల్: ఆదివాసి ప్రాంతాల ప్రత్యేక పరిపాలన.
 ఆరో షెడ్యూల్: అసోం, నాగాలాండ్, మిజోరాం, త్రిపుర రాష్ట్రాలకు సంబంధించి ప్రత్యేక పరిపాలన.
 
 ఏడో షెడ్యూల్: కేంద్రం, రాష్ట్రాల మధ్య అధికార విభజన.
 ఎనిమిదో షెడ్యూల్: మొదట 14 అధికార భాషలను గుర్తించారు. 1967లో 21వ సవరణ ద్వారా సింధి భాషను, 1992లో 71వ సవరణ ద్వారా మణిపురి, కొంకణి, నేపాలి భాషలను, 2003లో 92వ సవరణ ద్వారా మైథిలి, సంతాలి, డోగ్రి, బోడో భాషలను అధికార భాషలుగా గుర్తించారు.
 
 తొమ్మిదో షెడ్యూల్: భూ సంస్కరణలు. (1951లో ఒకటో రాజ్యాంగ సవరణ ద్వారా)
 పదో షెడ్యూల్: పార్టీ ఫిరాయింపు నిషేధ చట్టం. (1985లో 52వ సవరణ ద్వారా చేర్చారు)
 పదకొండో షెడ్యూల్: పంచాయతీరాజ్ చట్టం. (1992లో 73వ సవరణ ద్వారా చేర్చారు)
 పన్నెండో షెడ్యూల్: నగర పాలక చట్టం. దీన్ని 1992లో 74వ సవరణ ద్వారా చేర్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement