Indian Polity
-
The annual report of the UPSC is submitted to?
1. Which of the following Constitutional Amendment Acts was said to be a 'Mini Constitution'? (A) 42nd (B) 44th (C) 46th (D) 50th 2. Where was the first Municipal Corporation in India set up? (A) Bombay (B) Calcutta (C) Delhi (D) Madras 3. Which of the following is not a Panchayati Raj institution? (A) Gram Sabha (B) Gram Panchayat (C) Nyaya Panchayat (D) Gram Co-operative Society 4. Which of the following subjects lies in the Concurrent List? (A) Agriculture (B) Education (C) Police (D) Defence 5. Which one of the following forms the largest share of deficit in Government of India Budget? (A) Primary Deficit (B) Fiscal Deficit (C) Revenue Deficit (D) Budgetary Deficit 6. Five Year Plan in India finally approved by? (A) Union Cabinet (B) President (C) Planning Commission (D) National Development Council 7. The annual report of the UPSC is submitted to? (A) The President (B) The Supreme Court (C) The Prime Minister (D) The Chairman of UPSC 8. A national political party is one which receives 4% of the total votes polled in? (A) Two or more States (B) The Capital City (C) Four or more States (D) In all States 9. Who accords recognition to various political parties in India as National or Regional parties? (A) The Parliament (B) The President (C) The Election Commission (D) The Supreme Court 10. The Election Commission was converted into 'Three Members Commission' in the following year? (A) 1987 (B) 1988 (C) 1989 (D) 1990 11. The provisions related to official language of India can be amended by? (A) Simple majority (B) Minimum 2/3rd majority (C) Minimum 3/4th majority (D) Can not be amended 12. In India, within how much period, was the proclamation of emergency to be approved by both Houses of the Parliament? (A) 14 days (B) 1 month (C) 3 months (D) 6 months 13. How many times has Financial Emergency been declared in India so far? (A) Once (B) 4 times (C) 5 times (D) Never 14. How many times did the President of India declare National Emergency so far? (A) Never (B) Only once (C) Only twice (D) Thrice 15. Which Indian State came under President's rule for maximum number of times? (A) Punjab (B) Himachal Pradesh (C) Kerala (D) Karnataka 16. The method of Constitutional Amendment is provided in? (A) Article 348 (B) Article 358 (C) Article 368 (D) Article 378 Key 1.A 2.D 3.D 4.B 5.B 6.D 7.A 8.C 9.C 10.D 11.A 12.B 13.D 14.D 15.A 16.C -
రాజ్యాంగ పరిషత్ సభ్యుల సంఖ్య ఎంత?
ఇండియన్ పాలిటీ రాజ్యాంగం అంటే - ప్రజలు, ప్రభుత్వానికి మధ్య సంబంధాన్ని తెలిపే మౌలిక శాసనం. దేశ పాలనా విధానానికి మూలాధారం. రాజ్యాంగ లక్ష్యం - రాజ్యాధికార నియంత్రణ, వ్యక్తి స్వేచ్ఛ, హక్కుల పరిరక్షణ. చట్టాలు భారత రాజ్యాంగ అభివృద్ధికి తోడ్పడిన మొదటి చట్టం- 1773 రెగ్యులేటింగ్ చట్టం. ఈ చట్టం ద్వారా బెంగాల్ గవర్నర్‌ను గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్‌గా మార్చారు. మొదటి గవర్నర్ జనరల్‌గా వారన్ హేస్టింగ్సను నియమించారు. ఇతనికి సాయపడేందుకు నలుగురు సభ్యులతో కార్యనిర్వాహక మండలిని ఏర్పాటు చేశారు. ప్రధాన న్యాయమూర్తి, మరో ముగ్గురు న్యాయమూర్తులతో సుప్రీంకోర్టును ఏర్పాటు చేశారు. 1813 చార్టర్ చట్టం ద్వారా విద్యాభివృద్ధికి బడ్జెట్లో రూ.లక్ష కేటాయించారు. క్రిస్టియన్ మిషనరీలను భారత్‌లోకి అనుమతించారు. 1833 చార్టర్ చట్టం ద్వారా బెంగాల్ గవర్నర్ జనరల్‌ను గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చారు. మొదటి గవర్నర్ జనరల్‌గా విలియం బెంటిక్ నియమితుడయ్యాడు. మెకాలే అధ్యక్షతన మొదటి ‘లా’ కమిషన్‌ను నియమించారు. 1853 చార్టర్ చట్టం ద్వారా పార్లమెంటరీ ప్రభుత్వానికి పునాదులు వేశారు. ఉద్యోగుల భర్తీకి పోటీ పరీక్షల విధానాన్ని ప్రవేశపెట్టారు. 1858 విక్టోరియా మహారాణి ప్రకటన ద్వారా కంపెనీ పరిపాలన రద్దు చేసి, మహారాణి ప్రత్యక్ష పరిపాలన ప్రారంభించారు. గవర్నర్ జనరల్‌ను వైస్రాయ్గా మార్చి మొదటి వైస్రాయ్గా లార్‌ట కానింగ్‌ను నియమించారు. బ్రిటన్‌లో భారత వ్యవహారాల కార్యదర్శి పదవి ఏర్పాటు చేసి మొదటి కార్యదర్శిగా చార్లెస్ ఉడ్‌ను నియమించారు. 1861 కౌన్సిల్ చట్టం ద్వారా పోర్టఫోలియో విధానాన్ని ప్రవేశపెట్టారు. ఆర్టినెన్సలను జారీచేసే అధికారాన్ని వైస్రాయ్కి కల్పించారు. బడ్జెట్ ప్రవేశపెట్టే విధానాన్ని ప్రారంభించారు. 1892 కౌన్సిల్ చట్టం ద్వారా కేంద్ర శాసన సభలో భారతీయుల ప్రాతినిధ్యాన్ని 6కి పెంచారు. బడ్జెట్ మినహా మిగిలిన అన్ని అంశాలపై ప్రశ్నించే అధికారం కల్పించారు. 1885లో ఎ.ఒ.హ్యూమ్ జాతీయ కాంగ్రెస్‌ను స్థాపించాడు. ఈ పార్టీ మొదటి సమావేశం 1885, డిసెంబర్లో బాంబేలో డబ్ల్యు.సి.బెనర్జీ అధ్యక్షతన జరిగింది. సూరత్ సమావేశం (1907)లో ఇందులోని వారు అతివాదులు, మితవాదులుగా చీలిపోయారు. ఈ సమావేశఅధ్యక్షుడు రాస్‌బిహారి ఘోష్. 1916 లక్నో సమావేశంలో వీరంతా తిరిగి కలిసిపోయారు. 1909 మింటో-మార్లే సంస్కరణల చట్టం రూపకల్పనలో భారత కార్యదర్శి మార్లే, గవర్నర్ జనరల్ మింటో ప్రముఖ పాత్ర పోషించారు. ఈ చట్టం ద్వారా పరిమిత ప్రాతిపదికన ఓటింగ్ పద్ధతిని ప్రవేశపెట్టారు. శాసనసభ సభ్యుల సంఖ్యను 16 నుంచి 60కి పెంచారు. గవర్నర్ కార్యనిర్వాహక మండలిలోకి ఒక భారతీయుడిని సభ్యుడిగా (ఎస్.పి.సిన్హా) తీసుకున్నారు. ముస్లిం లకు ప్రత్యేక నియోజకవర్గాలను కేటాయించారు. 1919 మాంటేగు-ఛెమ్స్‌ఫర్‌డ సంస్కరణల చట్టం రూపకల్పనలో భారత కార్యదర్శి మాంటేగు, గవర్నర్ జనరల్ ఛెమ్స్‌ఫర్‌డ ప్రముఖపాత్ర పోషించారు. ఈ చట్టం ద్వారా పాక్షిక బాధ్యతాయుత ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టారు. రాష్ట్రాల్లో ద్వంద్వపాలన, కేంద్రంలో ద్విసభా విధానం, కేంద్ర బడ్జెట్ నుంచి రాష్ర్ట బడ్జెట్‌ను వేరు చేయడం, సిక్కులకు ప్రత్యేక నియోజకవర్గాల కేటాయింపు, సర్వీస్ కమిషన్, ఆడిటింగ్ వ్యవస్థ ఏర్పాటు మొదలైనవి ప్రవేశపెట్టారు. సైమన్ కమిషన్ నివేదిక, రౌండ్ టేబుల్ సమావేశాలు, ఎం.ఎన్.రాయ్ డిమాండ్ ఆధారంగా 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని రూపొందించారు. ఇందులో 321 అధికరణలు, 10 షెడ్యూళ్లు, 14 భాగాలు ఉండేవి. ఈ చట్టం ద్వారా పూర్తి బాధ్యతాయుత ప్రభుత్వం, కేంద్రంలో ద్వంద్వపాలన, సమాఖ్య ప్రభుత్వం, కేంద్రం, రాష్ట్రాల మధ్య అధికారాల విభజన, కేంద్రం, రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారానికి ఫెడరల్ కోర్టు, ఫెడరల్ సర్వీసుల ఏర్పాటు, రాష్ట్రాల్లో ద్విసభా విధానం, ఎస్సీ, ఆంగ్లో ఇండియన్లకు ప్రత్యేక నియోజకవర్గాల కేటాయింపు, రిజర్వ బ్యాంక్ స్థాపన, ఇండియా నుంచి బర్మాను వేరు చేయడం, అడ్వకేట్ జనరల్ పదవి ఏర్పాటు మొదలైనవి ప్రవేశపెట్టారు. ‘మన దేశంలో నూతన బానిసత్వానికి ఈ చట్టం నాంది’ అని గాంధీ పేర్కొన్నారు. ‘పటిష్టమైన బ్రేకులు మాత్రమే ఉన్న, ఇంజన్‌లేని వాహనం’గా నెహ్రూ ఈ చట్టాన్ని విమర్శించారు. రాజ్యాంగ పరిషత్ 1945లో రెండో ప్రపంచ యుద్ధం ముగిసింది. ఇందులో పాల్గొన్న బ్రిటన్ బలహీనపడింది. బ్రిటన్‌లో ఎన్నికలు జరిగి లేబర్ పార్టీ విజయం సాధించింది. లేబర్ పార్టీ నాయకుడు, బ్రిటన్ ప్రధాని లార్డ క్లెమెంట్ అట్లీ, భారత్‌కు పూర్తి స్వాతంత్య్రం ఇవ్వబోతున్నామని, స్వాతంత్య్రానంతరం రాజ్యాంగ రూపక ల్పనలో సహకరిస్తామని ప్రకటించారు. ఇందు కోసం ముగ్గురు సభ్యులతో 1946, మార్చిలో క్యాబినెట్ మిషన్ ప్లాన్‌ను నియమించారు. దీని సలహా మేరకు 1946, నవంబర్‌లో రాజ్యాంగ పరిషత్‌ను ఏర్పాటు చేశారు. రాజ్యాంగ పరిషత్ సభ్యుల సంఖ్య 389. వీరిలో 292 మంది బ్రిటిష్ పాలిత రాష్ట్రాల నుంచి, 93 మంది స్వదేశీ సంస్థానాల నుంచి, నలుగురు బ్రిటిష్ కేంద్రపాలిత ప్రాంతాల నుంచి నియమితులయ్యారు. ప్రత్యేక పాకిస్తాన్ డిమాండ్ సభ్యులు వెళ్ళిపోగా మిగిలిన సభ్యుల సంఖ్య 299. వీరిలో ఎన్నికైన వారు 229 మంది, నియమితులైనవారు 70 మంది. రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశం 1946, డిసెంబర్ 9న సచ్చిదానంద సిన్హా అధ్యక్షతన జరిగింది. 1946, డిసెంబర్ 11న రాజ్యాంగ పరిషత్ శాశ్వత అధ్యక్షుడిగా రాజేంద్రప్రసాద్, ఉపాధ్యక్షులుగా హెచ్.సి.ముఖర్జీ, వి.టి.కృష్ణమాచారి, సలహాదారుగా బి.ఎన్.రావు ఎన్నికయ్యారు. 1946, డిసెంబర్ 13న లక్ష్యాలు, ఆశయాల తీర్మానాన్ని జవహర్లాల్ నెహ్రూ ప్రవేశపెట్టారు. రచనా సంఘం రాజ్యాంగ ముసాయిదాను తయారు చేయడానికి రచనా సంఘాన్ని 1947, ఆగస్టు 29న నియమించారు. అధ్యక్షుడితో కలిపి సభ్యుల సంఖ్య 7. అధ్యక్షుడు అంబేద్కర్, సభ్యులు గోపాలస్వామి అయ్యంగార్, కృష్ణస్వామి అయ్యర్, మహమ్మద్ సాదుల్లా, కె.ఎం. మున్షీ, మాధవరావు, వి.టి. కృష్ణమాచారి. రాజ్యాంగ ముసాయిదాను రాజ్యాంగ పరిషత్‌లో బి.ఎన్.రావు ప్రవేశపెట్టారు. ఇందులో 315 అధికరణలు, 8 షెడ్యూళ్లు ఉన్నాయి. రాజ్యాంగ పరిషత్, రాజ్యాంగ ముసాయిదాను 1949, నవంబర్ 26న ఆమోదించింది. అందువల్ల ఆ రోజు నుంచి పాక్షిక రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. పూర్తి రాజ్యాంగం 1950, జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ రెండు నెలల ఆలస్యానికి కారణం.. 1929 లాహోర్ కాంగ్రెస్ సమావేశంలో నెహ్రూ ప్రవేశపెట్టిన సంపూర్ణ స్వరాజ్య తీర్మానం. భారత రాజ్యాంగంపై విమర్శలు భారత రాజ్యాంగం న్యాయవాదుల స్వర్గం - ఐవర్ జెన్నింగ్‌స భారత రాజ్యాంగ ఒక అరువు తెచ్చుకున్న రాజ్యాంగం - ఐవర్ జెన్నింగ్‌స భారత రాజ్యాంగాన్ని పరిషత్గుర్తుకు అనుగు ణంగా రూపొందించారు - హెచ్.వి.కామత్ భారత రాజ్యాంగం 1935 చట్టపు జిరాక్స్ కాపీ - ప్రొ. కె.టి.షా భారత రాజ్యాంగ పరిషత్ కాంగ్రెస్ పార్టీ సభ - చర్చిల్ ఇతర రాజ్యాంగాల నుంచి గ్రహించిన అంశాలు బ్రిటన్: పార్లమెంటరీ ప్రభుత్వం, శాసనప్రక్రియ, స్పీకర్ వ్యవస్థ, సమన్యాయపాలన, ఏక పౌరసత్వం, ఏకీకృత న్యాయవ్యవస్థ, ఎన్నికల సంఘం, కాగ్ వ్యవస్థ, అఖిల భారత సర్వీసులు. అమెరికా: ప్రజాస్వామ్యం, ఉపరాష్ర్టపతి వ్యవస్థ, రాజ్యాంగ ప్రవేశిక, ప్రాథమిక హక్కులు, స్వయం ప్రతిపత్తి గల న్యాయవ్యవస్థ, న్యాయ సమీక్ష, మహాభియోగ తీర్మానం. కెనడా: సమాఖ్య విధానం, అవశిష్ట అధికారాలు, గవర్నర్ వ్యవస్థ. ఐర్లాండ్: ఆదేశిక సూత్రాలు, రాష్ర్టపతి ఎన్నిక, రాజ్యసభ సభ్యుల నియామకం. దక్షిణాఫ్రికా: రాజ్యాంగ సవరణ, రాజ్యసభ సభ్యుల ఎన్నిక. ఆస్ట్రేలియా: పార్లమెంట్ ఉమ్మడి సభ సమావేశం, ఉమ్మడి జాబితా. ఫ్రాన్స: గణతంత్ర, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం. రష్యా: ప్రాథమిక విధులు, సామ్యవాదం, న్యాయం, ప్రణాళికలు. జపాన్: జీవించే హక్కు జర్మనీ: అత్యవసర పరిస్థితి షెడ్యూళ్లు మొదటి షెడ్యూల్: కొత్త రాష్ట్రాల ఏర్పాటు, రాష్ట్రాల పేర్ల మార్పు. రెండో షెడ్యూల్: ప్రముఖుల జీతభత్యాలు. మూడో షెడ్యూల్: ప్రముఖుల పదవీ ప్రమాణ స్వీకారాలు. నాలుగో షెడ్యూల్: రాజ్యసభలో సీట్ల కేటాయింపు. ఐదో షెడ్యూల్: ఆదివాసి ప్రాంతాల ప్రత్యేక పరిపాలన. ఆరో షెడ్యూల్: అసోం, నాగాలాండ్, మిజోరాం, త్రిపుర రాష్ట్రాలకు సంబంధించి ప్రత్యేక పరిపాలన. ఏడో షెడ్యూల్: కేంద్రం, రాష్ట్రాల మధ్య అధికార విభజన. ఎనిమిదో షెడ్యూల్: మొదట 14 అధికార భాషలను గుర్తించారు. 1967లో 21వ సవరణ ద్వారా సింధి భాషను, 1992లో 71వ సవరణ ద్వారా మణిపురి, కొంకణి, నేపాలి భాషలను, 2003లో 92వ సవరణ ద్వారా మైథిలి, సంతాలి, డోగ్రి, బోడో భాషలను అధికార భాషలుగా గుర్తించారు. తొమ్మిదో షెడ్యూల్: భూ సంస్కరణలు. (1951లో ఒకటో రాజ్యాంగ సవరణ ద్వారా) పదో షెడ్యూల్: పార్టీ ఫిరాయింపు నిషేధ చట్టం. (1985లో 52వ సవరణ ద్వారా చేర్చారు) పదకొండో షెడ్యూల్: పంచాయతీరాజ్ చట్టం. (1992లో 73వ సవరణ ద్వారా చేర్చారు) పన్నెండో షెడ్యూల్: నగర పాలక చట్టం. దీన్ని 1992లో 74వ సవరణ ద్వారా చేర్చారు. -
ఏకగ్రీవంగా ఎన్నికైన రాష్ట్రపతి?
ఇండియన్ పాలిటీ భారత రాష్ట్రపతి భారతదేశ రాజ్యాంగ అధినేత రాష్ట్రపతి. ఈయన గురించి నిబంధన 52 నుంచి 62 వరకు తెలియజేస్తాయి. అధికరణ 52: భారత దేశానికి రాష్ట్రపతి ఉంటారు. వీరు దేశంలో అత్యున్నత వ్యక్తి. అధికరణ 53: రాష్ట్రపతి రాజ్యాంగ అధినేత, ప్రధాన కార్య నిర్వహణ అధికారి, ప్రథమ పౌరుడు, సర్వ సైన్యాధ్యక్షుడు అని తెలియజేస్తుంది. రాష్ట్రపతి పేరుమీదే పరిపాలన కొనసాగుతుంది. ఈయనకు సహాయ పడేందుకు అధికరణ 74(1) ప్రకారం ప్రధానమంత్రి నాయకత్వంలో మంత్రి మండలి ఉంటుంది. అధికరణ 58: రాష్ట్రపతి పదవికి పోటీ చేయడానికి ఉండాల్సిన అర్హతల గురించి తెలియజేస్తుంది. అవి: 1. భారతీయ పౌరుడై ఉండాలి. 2. 35 ఏళ్లు నిండి ఉండాలి. 3. లోక్‌సభ సభ్యుడికి ఉండాల్సిన అర్హతలు ఉండాలి. 4. ఎలక్ట్రోరల్ కాలేజ్ సభ్యుల్లో కనీసం 50 మంది బలపర్చాలి. 5. రూ. 15000 డిపాజిట్‌గా చెల్లించాలి. అధికరణ 54: రాష్ట్రపతి ఎన్నిక గురించి తెలియజేస్తుంది. ఎలక్ట్రోరల్ కాలేజ్ నైష్పత్తిక ప్రా తినిధ్య పద్ధతి ద్వారా రాష్ట్రపతిని ఎన్నుకుంటుంది. ఎలక్ట్రోరల్ కాలేజ్‌లో పార్లమెంట్‌కు ఎన్నికైన ఉభయ సభ సభ్యులు, అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల కు ఎన్నికైన విధాన సభ సభ్యులు ఉంటారు. కేంద్ర పాలిత ప్రాంతాల సభ్యులకు 1992లో 70వ రాజ్యాంగ సవరణ ద్వారా ఓటు హక్కును కల్పించారు. ఓటుహక్కు ఉన్న ఎంపీలు 776 (లోక్‌సభ 543 + రాజ్యసభ 233) ఓటుహక్కు ఉన్న ఎమ్మెల్యేలు 4120 (రాష్ట్రాలు 4020 + కేంద్ర పాలిత ప్రాంతాలు 100) అధికరణ 55: ఓటు విలువను ప్రత్యేక పద్ధతి ద్వారా లెక్కిస్తారు. ఎమ్మెల్యేల ఓటు విలువ = రాష్ట్ర జనాభా/ఎమ్మెల్యేల సంఖ్య * 1/1000 ఈ ఓటు విలువ అత్యధికంగా ఉత్తర ప్రదేశ్ (208), తమిళనాడు (176), మహారాష్ట్ర (175) రాష్ట్రాలకు, అతి తక్కువగా సిక్కిం (7), అరుణాచల్ ప్రదేశ్ (8), నాగాలాండ్ (9) రాష్ట్రాలకు ఉంది. దీన్ని 1971 జనాభా లెక్కల ఆధారంగా లెక్కిస్తారు. ఎంపీ ఓటు విలువ = మొత్తం ఎమ్మెల్యేల ఓటు విలువ/ ఎంపీల సంఖ్య. {పస్తుతం ఎంపీ ఓటు విలువ 708. రాష్ట్రపతి ఎన్నికల్లో మొత్తం ఓట్ల విలువ 10,98,882. వీటిలో మొత్తం ఎమ్మెల్యేల ఓట్ల విలువ 5,49,478. మొత్తం ఎంపీల ఓట్ల విలువ 5,49,408. రాష్ట్రపతి ఎన్నికను నిర్వహించేది కేంద్ర ఎన్నికల సంఘం. ఇప్పటివరకు పద్నాలుగుసార్లు ఎన్నికలు జరిగాయి. మొదటి ఎన్నిక 1952లో, పద్నాలుగో ఎన్నిక 2012లో జరిగింది. అధికరణ 56: రాష్ట్రపతి పదవి కాలం 5 ఏళ్లు. రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తే మహాభియోగ తీర్మానం ద్వారా తొలగించవచ్చు. పదవిలో కొనసాగేందుకు ఇష్టం లేకపోతే రాజీనామా లేఖను ఉపరాష్ట్రపతికి సమర్పించి తప్పుకోవచ్చు. అధికరణ 57: దీని ప్రకారం ఒక వ్యక్తి రాష్ర్టపతి పదవికి ఎన్నిసార్లయినా పోటీ చేయవచ్చు. మొదటి రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్ రెండుసార్లు పదవి నిర్వహించారు. మూడోసారి కూడా బలపర్చినప్పటికీ పోటీ చేయకుం డా రెండుసార్లు మాత్రమే పోటీ చేసే సాం ప్రదాయాన్ని నెలకొల్పారు. రాష్ట్రపతిగా ఎక్కువ కాలం రాజేంద్రప్రసాద్, తక్కువ కాలం జాకీర్ హుస్సేన్ పని చేశారు. అధికరణ 59: రాష్ట్రపతి జీతభత్యాల గురించి వివరిస్తుంది. దీన్ని పార్లమెంట్ నిర్ణయిస్తుంది. కేంద్ర సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు. ప్రస్తుత వేతనం రూ. 1,50,000. జీతభత్యాలను తగ్గించే వీలులేదు. వీటికి ఆదాయపు పన్ను నుంచి పూర్తి మినహాయింపు ఉంది. అధికరణ 60: సుప్రీంకోర్ట ప్రధాన న్యాయమూర్తి రాష్ట్రపతితో పదవీ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ప్రధాన న్యాయమూర్తి అందుబాటులో లేని సందర్భంలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. తాత్కాలిక రాష్ట్రపతి బాధ్యతలు నిర్వహించే సందర్భంలో ఉపరాష్ట్రపతి కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తారు. అధికరణ 61: దేశ ద్రోహానికి పాల్పడిన, రాజ్యాంగాన్ని ధిక్కరించిన సందర్భాల్లో రాష్ట్రపతిని మహాభియోగ తీర్మానం ద్వారా పార్లమెంట్ పదవి నుంచి తొలగిస్తుంది. ఈ తీర్మానాన్ని ఉభయ సభల్లో ఏ సభలోనైనా ప్రవేశ పెట్టవచ్చు. దీన్ని 1/4 సభ్యుల మద్దతుతో 14 రోజుల ముందు నోటీస్ జారీ చేసి ప్రవేశపెట్టాలి. ఈ తీర్మానాన్ని 2/3 మెజార్టీతో ఆమోదిస్తే రెండో సభకు వెళుతుంది. రెండో సభ కూడా 2/3 మెజార్టీతో ఆమోదిస్తే రాష్ట్రపతి పదవి కోల్పోతారు. ఒక సభ ఆమోదించి, మరోసభ వ్యతిరేకిస్తే తీర్మానం రద్దవుతుంది. ఈ తీర్మానంపై నామినేటెడ్ సభ్యులకు కూడా ఓటు హక్కు ఉంటుంది. 1971లో వి.వి.గిరికి నోటీస్ జారీ చేసి విరమించుకున్నారు. అధికరణ 62: ఏదైనా కారణంతో రాష్ట్రపతి పదవికి ఖాళీ ఏర్పడితే, ఆరు నెలల్లోపు నూతన రాష్ట్రపతిని ఎన్నుకోవాలి. పదవీ కాలం ముగియడానికి 15 రోజుల ముందు నుంచి నూతన రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియను ప్రారంభించాలి. అధికరణ 71: రాష్ట్రపతి ఎన్నిక వివాదాలను సుప్రీంకోర్టు పరిష్కరిస్తుంది. ఓడిపోయిన అభ్యర్థి లేదా ఎలక్ట్రోరల్ కాలేజ్‌లోని సభ్యుడు ఎన్నిక వివాదాలపై పిటిషన్ వేయవచ్చు. పిటిషన్‌ను ఎన్నిక ముగిసిన 30 రోజుల్లోపు దాఖలు చేయాలి. ఎన్నిక వివాదంపై కోర్టులో స్వయంగా హాజరైన రాష్ట్రపతి వి.వి.గిరి. రాష్ట్రపతి ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా ఒకసారి లోక్‌సభ సెక్రటరీ జనరల్, మరోసారి రాజ్యసభ సెక్రటరీ జనరల్ వ్యవహరిస్తారు. భారత రాష్ట్రపతులు 1. డాక్టర్ రాజేంద్రప్రసాద్ (1950-62): బీహార్‌కు చెందినవారు. ఎక్కువ కాలం రాష్ట్రపతిగా కొనసాగారు. రెండుసార్లు రాష్ట్రపతి గా పనిచేసిన ఏకైక వ్యక్తి. హిందూకోడ్ బిల్లును పునఃపరిశీలన కోసం పంపారు. ఈయన ప్రధాన రచన ‘ఇండియా డివెడైడ్’. 2. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ (1962-67): తమిళనాడుకు చెందినవారు. విదేశీ రాయబారిగా, ఉపరాష్ట్రపతిగా పని చేసి రాష్ట్రపతి అయిన మొదటి వ్యక్తి. ఈయన ప్రధా న రచనలు ‘హిందూ వ్యూ ఆఫ్ లైఫ్’, ‘యాన్ ఐడియలిస్ట్ వ్యూ ఆఫ్ లైఫ్’. 3. డాక్టర్ జాకీర్ హుస్సేన్ (1967-69): తక్కు వ కాలం రాష్ట్రపతిగా పనిచేశారు. పదవి లో కొనసాగుతూ మరణించిన మొదటి రాష్ట్రపతి. ఈయన ఉత్తరప్రదేశ్‌కు చెందినవారు. 4. వి.వి.గిరి (1969-74): ఈయన ఒడిశాకు చెందినవారు. అతి తక్కువ మెజార్టీతో ఓటు బదలాయింపు ద్వారా ఎన్నికైన రాష్ట్రపతి. స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. కార్మిక సంఘాల నాయకుడిగా పనిచేశారు. 5. ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ (1974-77): ఈయన అసోంకు చెందినవారు. పదవిలో ఉండగా మరణించిన రెండో రాష్ట్రపతి. అంతరంగిక అత్యవసర సమయంలో రాష్ట్రపతిగా పనిచేశారు. 6. నీలం సంజీవరెడ్డి (1977-82): రాష్ట్రపతిగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఏకైక వ్యక్తి. ఈయన ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు. లోక్‌సభ స్పీకర్‌గా పనిచేసి రాష్ట్రపతి అయిన ఏకైక వ్యక్తి. మిగతావారితో పోలిస్తే తక్కువ వయసు (62 ఏళ్లు)లో రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. 7. జ్ఞానీ జైల్ సింగ్ (1982-87): రాష్ట్రపతి అయిన ఏకైక సిక్కు వ్యక్తి. ఈయన పంజాబ్‌కు చెందినవారు. ఈయన కాలంలోనే ‘ఆపరేషన్ బ్లూ స్టార్’ జరిగింది. ‘పాకెట్ విటో’ అధికారాన్ని ఉపయోగించుకున్న ఏకైక రాష్ట్రపతి. 8. ఆర్. వెంకట్రామన్ (1987-92): ఈయన తమిళనాడుకు చెందినవారు. లోక్‌సభ ఎన్నికల్లో ఏ పార్టీకి మెజార్టీ రాకుంటే అతిపెద్ద పార్టీ నాయకున్ని ఆహ్వానించడం ప్రారంభించింది ఈయనే. పార్లమెంట్ సభ్యుల జీతభత్యాల పెంపు బిల్లు పునఃపరిశీలన కోసం పంపించారు. జాతీయ ప్రభుత్వ ఏర్పాటుకు ప్రతిపాదించారు. అర్థిక మంత్రిగా పనిచేసి రాష్ట్రపతి అయిన మొదటి వ్యక్తి. ఈయన ప్రధాన రచన ‘మై ప్రెసిడెన్షియల్ ఇయర్స’. 9. డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ (1992-97): ఈయన మధ్యప్రదేశ్‌కు చెందినవారు. వివాదాస్పద దళిత క్రైస్తవుల రిజర్వేషన్ బిల్లును వెనక్కి పంపారు. బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో రాష్ట్రపతి పదవిలో ఉన్నారు. 10. కె.ఆర్. నారాయణన్ (1997 - 2002): అత్యధిక మెజార్టీతో రాష్ట్రపతిగా ఎన్నికైనవారు. ఏకైక దళిత రాష్ట్రపతి. రాయబారిగా పనిచేసి రాష్ట్రపతి అయిన రెండో వ్యక్తి. అమెరికా ప్రభుత్వం నుంచి ‘బెస్ట్ స్టేట్స్‌మ్యాన్’ అవార్డు పొందారు. ఈయన కేరళకు చెందినవారు. 11. డాక్టర్ ఎ.పి.జె.అబ్దుల్ కలాం (2002-07): రాజకీయ నేపథ్యం లేకుండా రాష్ట్రపతి అయిన వ్యక్తి. ఈయన తమిళనాడుకు చెందినవారు. 2006లో లాభదాయక బిల్లును పునఃపరిశీలనకు పంపారు. ఈయన ప్రధాన రచన ‘వింగ్‌స ఆఫ్ ఫైర్’. 12. {పతిభాపాటిల్ (2007-12): ఏకైక మహిళా రాష్ట్రపతి. మహారాష్ట్రకు చెందినవారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా పనిచేసి రాష్ట్రపతి అయిన ఏకైక వ్యక్తి. 13. {పణబ్ ముఖర్జీ (2012): పశ్చిమ బెంగాల్‌కు చెందినవారు. ఆర్థిక మంత్రిగా పనిచేసి రాష్ట్రపతి అయిన రెండో వ్యక్తి. తీవ్రవాదులైన కసబ్, అఫ్జల్‌గురు క్షమాభిక్షను తిరస్కరించారు. 1969లో వి.వి.గిరి, మహ్మద్ హిదాయతుల్లా; 1977లో బీ.డి. జెత్తి తాత్కాలిక రాష్ట్రపతులుగా పనిచేశారు. రాష్ట్రపతిగా పోటీ చేసి ఓడిపోయిన మొదటి మహిళ లక్ష్మీ సెహగల్. ఉపరాష్ట్రపతి కాకుండా రాష్ట్రపతి అయినవారు: 1. రాజేంద్రప్రసాద్, 2. ఫక్రుద్దీన్ అలీ అహ్మద్, 3. నీలం సంజీవరెడ్డి, 4. జ్ఞానీ జైల్ సింగ్, 5. అబ్దుల్ కలాం, 6. ప్రతిభా పాటిల్, 7. ప్రణబ్ ముఖర్జీ.