![Union minister Hegde hints at removing 'secular' from Constitution - Sakshi](/styles/webp/s3/article_images/2017/12/26/Ananth_Hegde.jpg.webp?itok=jEIQzuCE)
కేంద్రమంత్రి అనంత్‌కుమార్ హెగ్డే
కొప్పల్(కర్ణాటక) : భారత రాజ్యాంగం నుంచి ‘లౌకికతత్వం’ పదాన్ని తొలగించాలని కేంద్రం ప్రభుత్వం భావిస్తున్నట్లు కేంద్ర మంత్రి అనంత్‌కుమార్ హెగ్డే వెల్లడించారు. కొప్పల్ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. సెక్యులరిస్టులపై విరుచుకుపడ్డారు. లౌకికవాదులకు వాళ్ల రక్తం ఏంటో తెలియదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
‘మేము సెక్యులరిస్టులం అని చెప్పుకోవడానికి రాజ్యాంగం ప్రజలకు అనుమతి ఇచ్చింది. రాజ్యాంగాన్ని పలుమార్లు సవరించారన్న విషయం గుర్తుంచుకోవాలి. మేం కూడా రాజ్యాంగాన్ని సవరించి లౌకికతత్వం అనే పదాన్ని తొలగిస్తాం. మేం అధికారంలోకి వచ్చింది అందుకే. మీరు ముస్లింలు, క్రైస్తవులు లేదా వేరే మతాలకు చెందిన వారు అయితే ఆ మతంతో, కులంతో సంబంధం కలిగివున్నందుకు గొప్పగా భావించండి. అంతేకానీ, అసలు ఎవరీ లౌకికవాదులు?. లౌకికవాదులకు తల్లిదండ్రులు లేరు’ అని వ్యాఖ్యానించారు అనంత్.
అనంత కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు. గతేడాది ఇస్లాం మతాన్ని ఉద్దేశించి అవమానకరంగా మాట్లాడినందుకు ఆయనపై కేసు నమోదైంది. ఈ ఏడాది నవంబర్‌లో జరిగిన టిప్పు సుల్తాన్ జయంతి ఉత్సవాల్లో పాల్గొనడానికి ఆయన నిరాకరించారు.
Comments
Please login to add a commentAdd a comment