preamble
-
భారత్ లౌకిక దేశంగా ఉండాలనుకోవడం లేదా?
న్యూఢిల్లీ: ఇందిరాగాంధీ ప్రభుత్వ హయాంలో 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగ పీఠికలో చేర్చిన సామ్యవాద, లౌకిక( సోషలిస్ట్, సెక్యులర్) పదాలను తొలగించాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాలను సోమవారం సుప్రీంకోర్టు విచారించి పిటిషన్లపై పలు ప్రశ్నలు సంధించింది. మాజీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి, లాయర్ విష్ణు శంకర్ జైన్, బలరామ్ సింగ్, లాయర్ అశ్వినీ ఉపాధ్యాయ్ తదితరులు దాఖలుచేసిన ఈ పిల్లను జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్ల ధర్మాసనం విచారించింది. ‘‘సామ్యవాదం అనే పదానికి అర్ధాలను ప్రాశ్చాత్య దేశాల కోణంలో చూడొద్దు. సోషలిజం పదానికి అర్థాన్ని అందరికీ సమాన అవకాశాలు అనే దృక్కోణంలోనే చూడాలి. సెక్యులరిజం అనే పదం భారత రాజ్యాంగంలో భాగమని గతంలో ఎన్నో తీర్పుల్లో న్యాయస్థానాలు తేలి్చచెప్పాయి. సెక్యులర్ పదం రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగం. ఫ్రెంచ్ వారి సెక్యులరిజంకు బదులు ఆధునిక భావజాల సెక్యులరిజాన్ని భారత్ సంగ్రహించింది. మీరు భారత్ లౌకిక దేశంగా ఉండాలనుకోవాట్లేరా?’’అని జస్టిస్ ఖన్నా ప్రశ్నించారు. దీనికి లాయర్ విష్ణుశంకర్ జైన్ బదులిచ్చారు. ‘‘మేం లౌకిక అనే పదానికి వ్యతిరేకం కాదు. కానీ ఆ పదాన్ని పీఠికలో చేర్చిన విధానాన్ని మాత్రమే సవాల్ చేస్తున్నాం. తప్పుడు మార్గంలో సోషలిజం పదాన్ని చేరిస్తే వ్యక్తిగత స్వేచ్ఛ అనేది ప్రమాదంలో పడుతుందని బీఆర్ అంబేడ్కర్ అభిప్రాయపడ్డారు. 1949 నవంబర్ 26నాటి రాజ్యాంగ పీఠికనే కొనసాగిద్దాం. సవరణల ద్వారా పీఠికలో సవరణ చేయకూడదు. అదనపు పదాలను చేర్చడంలో హేతుబద్ధత లోపించింది’అని లాయర్ వాదించారు. ‘‘కొత్తగా చేరిన పదాలు దేశంలో ఎలాంటి మార్పులు తీసుకురాకున్నా ఒక గందరగోళానికి తెరలేపాయి. దీంతో పీఠికలో ఎలాంటి మార్పులైనా చేయొచ్చన్న భావన తదుపరి ప్రభుత్వాల్లో నెలకొంది’’అని లాయర్ అశ్వినీ ఉపాధ్యాయ్ వాదించారు. వాదోపవాదనల తర్వాత కేసు విచారణ నవంబర్ 18వ తేదీకి వాయిదాపడింది. -
బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు.. మెజార్టీ సీట్లు గెలిస్తే!
బెంగళూరు: మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ అనంత్‌కుమార్ హెగ్డే సంచలన వ్యాఖ్యలు చేశారు. రానున్న సార్వత్రిక ఎన్నికలల్లో బీజేపీ మూడింట రెండు వంతుల ఎంపీ సీట్లలో గెలుపొంది.. బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే రాజ్యాంగంలో కొన్ని మార్పులు చేస్తామని అన్నారు. రాజ్యాంగంలోని పీఠికలో ఉన్న ‘లైకికవాదం’ను తొలగిస్తామని అన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయ. ‘అనవసరమైన అంశాలను కాంగ్రెస్ బలవంతంగా చొప్పించి రాజ్యాంగాన్ని వక్రీకరించింది. ముఖ్యంగా హిందూ సామాజాన్ని అణచివేసే చట్టాలను తీసుకుచ్చింది. వాటిలో మార్పులు తీసుకురావాలంటే బీజేపీకి ప్రస్తుతం ఉన్న మెజార్టీ సరిపోదు. కాంగ్రెస్ మెజార్టీ లోక్‌సభ స్థానాలు గెలువలేదు. మోదీ నాయకత్వంలో బీజేపీ లోక్‌సభలో మూడింట రెండు వంతుల సీట్లను గెలుస్తుంది. అయితే లోక్‌సభ, రాజ్యసభల్లో మూడింట రెండువంతుల సీట్లను బీజేపీ గెలవటంతో పాటు.. అదే స్థాయిలో 20 రాష్ట్రాల్లో కూడా బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగంలో మార్పులు తీసుకురావచ్చు’ అని అనంత్‌కుమార్ హెగ్డే అన్నారు. ‘ఈసారి బీజేపీ 400 సీట్లు గెలవాలి. 400 సీట్లు ఎందుకంటే? లోక్‌సభలో మెజార్టీ ఉన్నా.. రాజ్యసభలో బీజేపీ మెజార్టీ లేదు. రాజ్యసభలో తక్కువ మెజార్టీ ఉంది. అలాగే పలు రాష్ట్రాల్లో కూడా బీజేపీకి కావల్సినంత మెజార్టీ లేదు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ కూటమి 400 సీట్ల గెలుపొందితే.. రాజ్యసభలో బీజేపీ మెజార్టీ పెరగటానికి దోహదపడుతుంది’అని స్పష్టం చేశారు. అనంత్‌కుమార్ హెగ్డే చేసిన వ్యాఖ్యలు వివాదస్పదం అయ్యాయి. హెగ్డే వ్యాఖ్యలపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పందిస్తూ.. బీజేపీ రాజ్యాంగ వ్యతిరేకమైన పార్టీ అని మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలతో కేంద్రంలోని బీజేపీకి అంబేద్కర్ రాసిన రాజ్యాంగంపై వ్యతిరేకత ఎంత ఉందో అర్థమవుతోందని దుయ్యబట్టారు. MP Shri Ananth Kumar Hegde's remarks on the Constitution are his personal views and do not reflect the party's stance. @BJP4India reaffirms our unwavering commitment to uphold the nation's Constitution and will ask for an explanation from Shri Hegde regarding his comments. — BJP Karnataka (@BJP4Karnataka) March 10, 2024 దీంతో కర్ణాటక బీజేపీ ‘ఎక్స్’వేదికగా స్పందిస్తూ.. ‘ఎంపీ అనంత్‌కుమార్ హెగ్డే రాజ్యాంగంపై చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమైనవి.. వాటితో పార్టీకి ఎటువంటి సంబంధిం లేరు. ఆయన వ్యాఖ్యలు పార్టీని ప్రతిబింబించవు. ఆయన చేసిన వ్యాఖ్యలపై మేము వివరణ కోరుతాం’ అని బీజేపీ పేర్కొంది. -
రాజ్యాంగంలో ఆ 'రెండు' పదాలు మిస్సింగ్: అధిర్ రంజన్ చౌదరి
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చిన ప్రత్యేక పార్లమెంట్ సెషన్లలో భాగంగా మొదటిరోజు పాత పార్లమెంటుకు వీడ్కోలు పలకగా రెండో రోజు సభ్యులంతా కొత్త పార్లమెంటు భవనంలో అడుగు పెట్టారు. ఈ సందర్బంగా ఎంపీల చేతికి ఇచ్చిన భారత రాజ్యాంగం ప్రతుల్లో భారత రాజ్యాంగం ముందుమాటలో సాంఘిక, లౌకిక పదాలు లేకపోవడంపై కాంగ్రెస్ నేత అధిర్ రంజాన్ చౌదరి తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. మంగళవారం పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా ఎంపీలంతా కొత్త పార్లమెంట్ భవనంలోకి అడుగు పెడుతున్న నేపథ్యంలో వారి చేతికి భారత రాజ్యాంగ ప్రతులను అందించారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి తమకు ఇచ్చిన రాజ్యాంగ ప్రతుల్లోని పీఠికలో పొరపాట్లు ఉన్నాయన్నారు. అధిర్ రంజాన్ చౌదరి మాట్లడుతూ.. మాకు అందిచ్చిన రాజ్యాంగ ప్రతుల ప్రవేశికలో సాంఘిక, లౌకిక అన్న పదాలు ముద్రించలేదన్నారు. ఆ పదాలు రాజ్యాంగ పుస్తకంలో అంతకు ముందు లేవని 1976లో రాజ్యాంగ సవరణ తరవాతే ఆ పదాలను రాజ్యాంగ ప్రవేశికలో పొందుపరిచారన్న విషయం నాకు తెలుసు. కానీ ఇప్పుడు ఎవరైనా మన చేతికి రాజ్యాంగం అందించి అందులో ఈ పదాలు కనిపించకపోతే ఆందోళన చెందాల్సిందేనన్నారు. నాకు మాత్రం ఈ విషయం ఆందోళన కలిగించేదే. వారి ఉద్దేశ్యం చూస్తే నాకు అనుమానం కలుగుతోందన్నారు. నాకు ఈ విషయంలో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదు. లేదంటే ఈ అంశం గురించి కచ్చితంగా ప్రస్తావించేవాడినని అన్నారు. ఇక ఇండియా పేరును 'భారత్'గా మార్చే అంశంపై మాట్లాడుతూ.. 'ఇండియా' 'భారత్' పేర్లలో ఏదైనా ఒక్కటే.. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 1లో ఇండియాగా పిలవబడే భారత్, రాష్ట్రాల సమూహం అని కూడా సంబోధించారు. నా దృష్టిలో రాజ్యాంగం బైబిల్, ఖురాన్, భగవత్గీత గ్రంధాలకు ఏమాత్రం తక్కువకాదు. ఆ విషయంలో ఎవ్వరూ ఎటువంటి సమస్యను సృష్టించకుండా ఉంటే బాగుంటుందని అన్నారు. అధిర్ రంజాన్ చౌదరి, భారత రాజ్యాంగం, సాంఘిక, లౌకిక, రాజ్యాంగ పీఠిక ఇది కూడా చదవండి: పొలిటికల్ మైలేజి కోసమే బిల్లు పెట్టారు: కపిల్ సిబాల్ -
కర్ణాటకలో ఘనంగా రాజ్యాంగ పీఠిక పఠనం
బెంగళూరు: అంతర్జాతీయ రాజ్యాంగ దినోత్సవాన్ని కర్ణాటక ప్రభుత్వం శుక్రవారం ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా భారత రాజ్యాంగ పీఠికను చదివే కార్యక్రమంలో దేశ విదేశాల నుంచి ఏకకాలంలో లక్షలాది మంది పాల్గొన్నారు. బెంగళూరు విధానసౌధ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తోపాటు ఇతర అతిథులు రాజ్యాంగ పీఠికను కన్నడ భాషలో స్వయంగా పఠించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని విద్యా సంస్థల్లో నిత్యం ఉదయం ప్రార్థన సమయంలో రాజ్యాంగ పీఠికను తప్పనిసరిగా చదవాలని కర్ణాటక ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు జూన్‌లో ఉత్వర్వులు జారీ చేసింది. -
రాజ్యాంగ పీఠిక ఓ ప్రకటన!
భారత రాజ్యాంగ పీఠిక ఒక జాతీయ గీతం వలె కనిపిస్తుంది, వినిపిస్తుంది. కవీంద్ర రవీంద్రుడు రాసిన జాతీయ గీతం ‘జనగణ మన అధినాయక జయహే’ ఒక దేశభక్తి గీతం. సందేహం లేదు. ఒక గౌరవ వందన గీతం. ఈ పీఠిక పాట కాదు, ఒక పాఠం. ఒక ప్రతిజ్ఞ. ఒక ప్రకటన. ఒక లక్ష్య వాగ్దానం! ఇందులో నిరంతరం గుర్తుంచుకోవలసిన మంత్రాక్షరాలున్నాయి. దిశా నిర్దేశనం నియంత్రణ చేసే ఒక ఆదేశ పత్రం. ప్రజాసార్వభౌములు జారీ చేసిన ఒక రిట్. అనుల్లంఘనీయ శాసనం. కానీ రక్షిస్తామన్నవారూ, పాటిస్తామన్నవారూ, చదవవలసిన వారూ, అర్థం చేసు కోవలసిన వారూ అందరూ మరిచిపోయారు!! ఈ పీఠిక చదవడం ప్రభువులకు కోపకారణం అయింది! పోలీసులు లాఠీలెత్తారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని విమర్శిస్తూ ప్రసంగించినందుకూ, పీఠిక చదివి నందుకూ, రాజ్యాంగాన్ని జనానికి చూపినందుకూ చంద్రశేఖర్ ఆజాద్‌పై క్రిమినల్ కేసులు పెట్టారు. పీఠికను గుర్తు చేయడం తరాజులకు నచ్చడం లేదు. యూఏపీఏ చట్టం కింద బెయిల్ రాని సెక్షన్లతో కొడుతున్నారు. తిడుతున్నారు. రాజు దైవమై పోతున్నాడు. కోర్టులు బెయిల్ ఇవ్వడం దైవాధీనంగా మారిపోయింది. చివరకు ఢిల్లీ కోర్టు న్యాయాధికారి కామినీ లావ్ ‘‘ధర్నా చేస్తే తప్పేమిటి, నిరసన చేయడం నేరమా? అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు కదా? మీరు అసలు రాజ్యాంగం చదివారా?’’ అని పోలీసులను అడిగారు. న్యాయమూర్తులకూ, న్యాయాధికారులకూ, రాజ్యాంగం కింద నియుక్తులైన అధికారులకూ... అందరికీ రాజ్యాంగం పవిత్ర పత్రమైనపుడూ, ఆ రాజ్యాంగం సరైనదైనపుడూ, చదివితే నేరమా? ఎంత మాత్రం కాదని ఆ కోర్టు తీర్పు చెప్పవలసి వచ్చింది. పీఠిక రాజ్యాంగాన్ని పరిచయం చేస్తుంది. రాజ్యాంగ లక్ష్యం, సూత్రాలు, మౌలిక తత్వం వివరించిన పీఠం అది. పీఠిక చదివితే అరెస్టు చేయరాదని కోర్టు చెప్పిన తరువాత గానీ బెయిల్ దొరకలేదు. విడుదలైన వెంటనే పీఠిక చదివాడాయన, కరతాళ ధ్వనుల మధ్య! ప్రభుత్వ రాజ్యాంగ వ్యతిరేక విధానాలను వ్యతిరేకించడానికి ఉపయోగించే నిరసనోద్యమ దీప్తిగా పీఠికా పఠనం మారిపోయింది. తరువాత కొన్ని నెలలకు భారత ప్రభుత్వం పీఠికా పఠనాన్ని అధికారిక కార్యక్రమంగా నిర్దేశించింది. 75 సంవత్సరాల అజాదీ ఆమృతోత్సవంలో తప్పనిసరిగా కేంద్ర మంత్రిత్వశాఖలు తమ కార్యాల యాల్లో గోడలమీద ప్రవేశిక లిఖించి పెట్టాలని ఆదేశించింది. రాష్ట్రపతి స్వయంగా పీఠికను అందరితోపాటు చదివే కార్యక్రమాన్ని 2020లో అధికారికంగా ఆరంభిం చారు. 2015లో ప్రధాని నరేంద్రమోదీ పార్లమెంట్ సెంట్రల్ హాల్లో పీఠిక చదివారు. న్యాయ, పర్యావరణ శాఖామాత్యులు తన మంత్రిత్వ భవనంలో ప్రియాంబుల్ గోడను ఆవిష్కరించారు. మధ్యప్రదేశ్, కేరళ వంటి అనేక రాష్ట్ర ప్రభుత్వాలు పీఠికను అన్ని పాఠశాలల్లో తప్పని సరిగా చదవాలని ఆదేశం జారీ చేశాయి. ఇదీ మన పీఠిక! దీన్ని అవతారిక అనీ అంటారు. ఇంగ్లీషులో ప్రియాంబుల్ అన్నారు. భారత ప్రజలమైన మనం, మన భారతదేశాన్ని సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్య వ్యవస్థగా నిర్మించేందుకు పవిత్ర దీక్షతో తీర్మానించి, మన దేశ పౌరులందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాలను; ఆలోచనా, భావ ప్రకటనా, మత విశ్వాస ఆరాధనా స్వేచ్ఛను; హోదాల్లోనూ, అవకాశా ల్లోనూ సమానత్వాన్ని సాధించేందుకు; వ్యక్తి గౌరవాన్నీ, జాతి ఐక్యత– సమగ్రతను కల్పించే సౌభ్రాతృత్వాన్ని పెంపొందించాలనీ; మన రాజ్యాంగ పరిషత్తులో 1949 నవంబర్ 26వ తేదీన ఈ రాజ్యాంగాన్ని స్వీకరించి, శాసనీ కరించి, ఆమోదించి, మనకు మనము సమర్పించు కున్నాం. మొదట్లో భారత్‌ను సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా పేర్కొన్నారు. అయితే 42వ రాజ్యాంగ సవరణలో భాగంగా ఇది సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా మారింది. (చదవండి: ‘అడిగే హక్కే’ అన్నిటికీ ఆధారం) 1776లో అమెరికన్ రాజ్యాంగ పీఠిక అమెరికా స్వతంత్ర ప్రకటనలో కీలకమైన భాగం. రాజ్యాంగానికి పీఠిక గుర్తింపు కార్డు వంటిదని శంకరీ ప్రసాద్ కేసులో (1952) జస్టిస్ హిదయతుల్లా పేర్కొన్నారు. విచిత్రమేమంటే పీఠిక మన రాజ్యాంగంలో అంతర్భా గమా లేక బయట ఉన్న ఒక పేజీయా అని పేచీ వచ్చింది. ఈ అంశాన్ని బాగా విచారించి, సుదీర్ఘమైన వాదోపవాదాలు విన్న తరువాత న్యాయమూర్తుల ధర్మాసనం కేశవానంద భారతి కేసులో పీఠిక రాజ్యాంగంలోని అంతర్భాగమేనోయీ అని తీర్పు చెప్పింది. అంతకు ముందు సుప్రీంకోర్టు వారు పీఠిక అంతర్భాగం కాదన్నారు. విచిత్రమేమంటే పీఠికలో ఉన్న హక్కులకు భంగకరమైన నియమాలు, లక్ష్యాలను అడ్డుకునే నియ మాలు కొన్ని మొదటినుంచీ ఉండటం; మరెన్నో తరువాత కాలంలో వచ్చి చేరుతూ ఉండటం గమనించవలసి ఉంది. భారత ప్రజలు చేసుకున్న సామాజిక ఒప్పందమే ఈ పీఠిక. ఇందులో విలువలను కాపాడటానికి మనం దీక్షాబద్ధులం కావాలి. పౌరుడిని చైతన్యవంతమైన, సహేతుకమైన, స్వేచ్ఛాయుతుడైన వ్యక్తిగా తీర్చిదిద్దడానికి ప్రతిజ్ఞ చేయాలి. మనం ఇంకా కులమతాల చట్రాలలోంచీ, చట్టాల లోంచీ బయటకు రాలేదు. మన ఎన్నికలన్నీ కులమతాలకు చెందిన ఓటర్లను ప్రేరేపించడంతోనే మొదలై, ముగుస్తున్నాయి. 75 ఏళ్ల స్వాతంత్య్రం తరువాత కూడా మనం సామాజిక అభివృధ్ధి, ప్రజాస్వామ్య విలువల వంటి వాటిని చూడడం లేదు. తాతల నాటి కట్టడాలు తమ ఘన కార్యక్రమం అన్నట్టు చూపి, సంస్కృతిని బూచిగా మార్చి, మతాన్నీ, కులాన్నీ నిత్యం వల్లిస్తూ ఎన్నికల్లో గెలవటం కోసం ప్రయత్నించడం చూస్తూనే ఉన్నాం. మత్తు పుచ్చుకుని ఇచ్చుకుంటున్నాం. (చదవండి: ఒక తీర్పు – అనేక సందేహాలు) - ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ స్కూల్ ఆఫ్ లా డీన్, మహీంద్రా యూనివర్సిటీ -
‘లౌకికవాదులకు వాళ్ల రక్తం ఏంటో తెలియదు’
కొప్పల్(కర్ణాటక) : భారత రాజ్యాంగం నుంచి ‘లౌకికతత్వం’ పదాన్ని తొలగించాలని కేంద్రం ప్రభుత్వం భావిస్తున్నట్లు కేంద్ర మంత్రి అనంత్‌కుమార్ హెగ్డే వెల్లడించారు. కొప్పల్ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. సెక్యులరిస్టులపై విరుచుకుపడ్డారు. లౌకికవాదులకు వాళ్ల రక్తం ఏంటో తెలియదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘మేము సెక్యులరిస్టులం అని చెప్పుకోవడానికి రాజ్యాంగం ప్రజలకు అనుమతి ఇచ్చింది. రాజ్యాంగాన్ని పలుమార్లు సవరించారన్న విషయం గుర్తుంచుకోవాలి. మేం కూడా రాజ్యాంగాన్ని సవరించి లౌకికతత్వం అనే పదాన్ని తొలగిస్తాం. మేం అధికారంలోకి వచ్చింది అందుకే. మీరు ముస్లింలు, క్రైస్తవులు లేదా వేరే మతాలకు చెందిన వారు అయితే ఆ మతంతో, కులంతో సంబంధం కలిగివున్నందుకు గొప్పగా భావించండి. అంతేకానీ, అసలు ఎవరీ లౌకికవాదులు?. లౌకికవాదులకు తల్లిదండ్రులు లేరు’ అని వ్యాఖ్యానించారు అనంత్. అనంత కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు. గతేడాది ఇస్లాం మతాన్ని ఉద్దేశించి అవమానకరంగా మాట్లాడినందుకు ఆయనపై కేసు నమోదైంది. ఈ ఏడాది నవంబర్‌లో జరిగిన టిప్పు సుల్తాన్ జయంతి ఉత్సవాల్లో పాల్గొనడానికి ఆయన నిరాకరించారు. -
ప్రవేశికలో జోక్యం చేసుకోం..
-
ప్రవేశికలో జోక్యం చేసుకోం..
తమది రైతు పక్షపాతి ప్రభుత్వమని బీజేపీ నేత వెంకయ్యనాయుడు అన్నారు. రైతులకు వ్యతిరేకంగా తాము ఎలాంటి చర్యలకు దిగడం లేదని చెప్పారు. ఈ సందర్భంగా రాజ్యాంగ ప్రవేశిక ప్రతిని లోక్‌సభలో ప్రదర్శిస్తూ దానిపై కొద్ది సేపు చర్చించారు. ఈ సవరణతో ప్రవేశికకు ఎలాంటి భంగపాటు జరగదని, ప్రవేశిక జోలికి తాము వెళ్లబోమని చెప్పారు. మంగళవారం ప్రారంభమైన బడ్జెట్ సమావేశాలు లోక్‌సభలో గందరగోళానికి దారి తీశాయి. లోక్‌సభలో పలు ఆర్డినెన్స్‌పై జరిగిన ప్రశ్నోత్తరాల్లో విపక్షాలు ప్రశ్నలతో విరుచుకుపడ్డారు. భూసేకరణ సవరణ బిల్లును వెంటనే వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ పట్టుబట్టింది. దీంతో వెంకయ్యనాయుడు జోక్యం చేసుకున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ నేత జ్యోతిరాధిత్య సింథియా, వెంకయ్యమధ్య మాటల యుద్ధం జరిగింది. అయితే, సవాళ్లు ప్రతిసవాళ్లు వద్దని, సమస్య పరిష్కారం వైపుగా సాగుదామని వెంకయ్యనాయుడు సూచించారు. రాజ్యాంగ ప్రవేశికలో జోక్యం చేసుకోమని స్పష్టం చేశారు. -
ఆ 'ప్రవేశిక' జాతికే దీపశిఖ
రాజ్యాంగ నిర్ణయసభలో ముసాయిదా రాజ్యాంగం చర్చకు వచ్చినపుడు ‘దేవుని పేరిట’ (‘ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్’) ‘‘ఈ ప్రియాంబుల్‌ను ఆమోదిస్తున్నాం’’ అంటూ తీర్మానాన్ని ప్రవేశపెట్టినప్పుడు చాలామంది సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎందుకని? ‘దేవుని పేరిట’ అనగానే ఏ దేవుని పేరిట, ఏ మతం పేరిట, ఏ మతదైవం పేరిట అన్న మీమాంస తలెత్తే ప్రమాదముంది. అందుకే అసలా పదాన్నే సభ వారు ఉపసంహరించడం జరిగిందని మరచిపోరాదు! తన దాకా వస్తేగాని తలనొప్పి బాధ తెలియదట. ఆ తెలివి రావడానికి బీజేపీ, ఎన్డీఏ సారథులకూ, పరివార్ పాలకులకూ ఇంతకాలం పడుతోంది. భారత రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారాలు చేసి, ఆ రాజ్యాంగం ఆదేశాలకే విరుద్ధంగా వికృతార్థాలూ, విధాన ప్రకటనలూ చొప్పిస్తూ భారతీయ సమాజంలో స్థిరపడిన సెక్యులర్ భావనా స్రవంతిని దారి మళ్లించాలని బీజేపీ నాయకులు చూస్తున్నారు. డిసెంబర్ 9, 1946 నుంచి జనవరి 1, 1950 వరకు తాత్కాలిక రాజ్యాంగ నిర్ణయ సభ సుదీర్ఘంగా చర్చించింది. అనంతరం ముసాయిదా రాజ్యాంగాన్ని సవరణలతో ఆమోదిస్తూ ‘భారత ప్రజలమైన మేము ఈ రాజ్యాంగాన్ని మా కోసం రూపొందించుకుని నేడు, నవంబర్ 26, 1949 అమలు జరుపుకునేందుకు దీనిని మాకై మేము సమర్పించుకుంటు న్నాం’ అని ప్రతినబూనారు. వృథా ప్రయాస అలాంటి రాజ్యాంగ ముసాయిదాకు సంబంధించిన ఒక చిత్తుప్రతి దుమ్ము దులిపి మొన్న గణతంత్ర దినోత్సవాన మోదీ ప్రభుత్వ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఒక వ్యాపార ప్రకటనగా కొన్ని పత్రికలకు విడుదల చేసింది. అది ఎలాంటి చర్చకు నోచుకోని 1946 నాటి చిత్తుప్రతి. ఇందులో ‘లౌకిక’ (సెక్యులర్), ‘సోషలిస్ట్’ అన్న పదాలు లేవు. కాబట్టి దీని మీద ఉన్న ముద్ర (వాటర్ మార్క్) ఆధారంగా దుమ్ము దులిపి ఒక ప్రభుత్వ ప్రకటనగా ప్రచురించి గందరగోళం సృష్టించే యత్నం చేశారు. అటల్ బిహారీ వాజపేయి హయాంలో కూడా రాజ్యాంగ ఉపోద్ఘాతంలోని ఆ రెండు పదాలను తొలగించే ప్రయత్నం జరగకపోలేదు. అప్పుడు ఎల్కే అద్వానీ ఉప ప్రధాని. నాడు కూడా ఎన్డీఏ అందుకు తీవ్రంగా ప్రయత్నించలేదు. కానీ, ఇప్పుడు న రేంద్ర మోదీ ప్రభుత్వం ఆ వివాదం నుంచి లబ్ధి పొందాలని చూడడం ఒక హెచ్చరిక గానే భావించాలి. రాజ్యాంగం అమలులోకి వచ్చిన తరువాత జరిగిన అనేక సవరణలను, వాటితో పాటు ఈ రెండు పదాలను గౌరవిస్తూనే అన్ని ప్రభు త్వాలు పాలన సాగించాయి. కాంగ్రెస్ ప్రభుత్వాలే కాదు, ఇతర సంకీర్ణాలు, కూటములు కూడా దేశాన్ని రాజ్యాంగం ప్రవచించినట్టు ‘సర్వసత్తాక, సోషలిస్ట్, లౌకిక ప్రజాస్వామిక గణతంత్రం’గానే గౌరవించాయి. కానీ నేడు ఎన్డీఏ ప్రభుత్వం ఆ రెండు పదాలు లేని, అసలు చర్చకే రాని తొలి చిత్తు ప్రతిని బయటకు లాగి ఉపయోగించుకోదలచింది. అయితే చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా ‘రాజ్యాంగ ఉపోద్ఘాతాన్ని లేదా ప్రవేశిక (ప్రియాంబుల్)ను మార్చవలసిన అవసరమే లేదు’ అని ప్రకటించవలసి వచ్చింది. చిత్రం ఏమిటంటే, ఈ గత్తర పట్ల ప్రధాని మోదీ మాత్రం ఇంతవరకు మౌనంగానే ఉండిపోయారు. ‘ప్రవేశిక’ ప్రత్యేకతను గుర్తించవద్దా! ఒక వివాదాన్ని లేవనెత్తడం, అది ప్రజా బాహుళ్యాన్ని ఏ రీతిలో ప్రభావితం చేస్తున్నదో పరీక్షించడం; తీరా ప్రయోగం వికటించి పార్టీ ఆస్థిత్వం దెబ్బతినే విధంగా పరిస్థితులు మారే సమయంలో ప్లేటు ఫిరాయించడం బీజేపీ లక్ష ణం. చర్చకే రాని ఆ చిత్తుప్రతిలో ఈ రెండు పదాలు కనిపించకపోవచ్చు. తరువాత ఎన్నో చర్చలు జరిగి, ఎమర్జెన్సీ కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన సవరణ ద్వారా ‘సెక్యులర్’, ‘సోషలిస్ట్’ అన్న పదాలు రాజ్యాంగ ప్రవేశికలో చేరాయి. ఆ రెండు పదాల వెనుక ఉన్న ఆదర్శం ఏ మేరకు ఆచరణలో నెరవేరుతున్నదీ అనేది మాత్రం వేరే చర్చ. కానీ ప్రియాంబుల్ రాజ్యాంగ మౌలిక చట్రంలో భాగంగానే న్యాయశాస్త్ర కోవిదులు పరిగణిస్తు న్నారు. అయినా బీజేపీని శాసించే సంఘ పరివార్ శాఖలు, వాటి ఉప శాఖలు యథేచ్ఛగా రాజ్యాంగ వ్యతిరేక విధాన ప్రకటనలు చేస్తూ ఉంటాయి. గందరగోళం సృష్టించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాయి. ఈ రగడ లేచిన తరు వాత అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మన రాజ్యాంగంలోని అధికరణ లతో సహా ఉదహరిస్తూ, ఈ రాజ్యాంగం ఇస్తున్న స్వేచ్ఛను అమలు చేసే అవ కాశమే లేకుంటే అభివృద్ధి శూన్యం కాగలదని బాహాటంగా హెచ్చరించారు. ఈ హెచ్చరిక వచ్చేదాకా అమిత్‌షా స్పందించకపోవడం గమనించదగిన అంశం. అంతేగాదు, ‘ప్రియాంబుల్‌ను మార్చవలసిన అవసరంలేద’ని చెబు తూనే ‘మతమార్పిళ్ల’ను నిషేధిస్తూ చట్టం తేవాలని ఆయన అంటున్నారు. ఆ రెండు పదాలు రెండు కళ్లు రాజ్యాంగం గుర్తించిన పౌరుల మతస్వేచ్ఛకూ, మత ప్రచారానికీ, నమ్మకా నికీ, ఆరాధనా స్వేచ్ఛకూ అభ్యంతరం చెప్పే హక్కు ఎవరికీ ఉండదు. మత స్వేచ్ఛకూ, అందులో అల్పసంఖ్యాక వర్గాల (మైనారిటీల) ప్రయోజనాలకూ సంబంధించిన రాజ్యాంగ అధికరణలు (25 నుంచి 30 వరకూ) నిర్దేశిస్తున్న నియమ నిబంధనలకు అంతా కట్టుబడి ఉండక తప్పదు. ఆదర్శవంతమైన సామాజిక వ్యవస్థ ఉండాలని, స్త్రీ పురుషులకు సమాన హక్కులుండాలని, ఉత్పత్తి పరికరాలు, ప్రకృతి వనరులు కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతమై సామాన్య ప్రజల ప్రయోజనాలకు విఘాతం కలగకుండా ఉండేలా దేశ ఆర్థిక విధానం ఉండాలని 38-39 అధికరణల ద్వారా రాజ్యాంగం ఆదేశిస్తున్నది. ఈ నిర్దేశాన్ని పాటిస్తే- మత వివక్షకు సంబంధించిన సమస్యలు కూడా పరి ష్కారమైపోతాయన్న ఇంగితజ్ఞానం పాలకులకు ఉండాలి. అన్నింటి కన్నా ముఖ్యం- జాతిపిత గాంధీజీని సంఘ్ పరివార్ ప్రచారక్ నాథురాం గాడ్సే హతమార్చినా కూడా, దానిని హత్యగా పరిగణించడానికి ఇష్టపడని వర్గాలు మన మధ్యనే ఉండటం! పైగా గాడ్సేపై చలనచిత్రాన్ని విడుదల చేయడానికి బీజేపీ అధికారంలోకి రాగానే ఉద్యమించడం! ఇలాంటి ధోరణులు దేశంలో తలెత్తుతూండటం వల్లనే రాజ్యాంగంలో ‘‘51-ఎ’’ అధికరణ ద్వారా పౌర బాధ్యతల అధ్యాయాల్ని రాజ్యాంగ నిర్ణేతలు తెరవాల్సి వచ్చిందని గుర్తిం చాలి. తద్వారా పౌరులలో మూఢనమ్మకాలను పారదోలి హేతువాద దృక్ప థాన్ని, శాస్త్రీయమైన అవగాహనను పెంపొందించాలనీ సుసంపన్నమైన సమష్టి వారసత్వాన్ని కాపాడుకోవాలనీ అదే అధికరణంలో ‘51-ఎ’లో భాగంగా ‘ఎఫ్’, ‘హెచ్’ అంశాలు ఆదేశించవలసి వచ్చింది! అందువల్ల రాజ్యాంగ కోవిదులు ‘సెక్యులర్’ పదాన్ని వ్యవస్థ భద్రతకూ, భిన్నత్వంలో ఏకత్వానికీ చేసే దిశానిర్దేశంగానూ; ‘సోషలిస్టు’ పదాన్ని సామాజిక న్యాయ ప్రతిష్ఠాపనకు ఆదర్శంగానూ ఉంచవలసి వచ్చిందని గుర్తించాలి! సెక్యులరిజం అంటే ఏమిటి? అందుకే భారత రాజ్యాంగానికి భాష్య నిర్దేశకుడిగా 29 సంపుటాల బృహత్ వ్యాఖ్యానాన్ని ప్రపంచానికి అందించిన న్యాయశాస్త్ర కోవిదుడు డాక్టర్ డి.డి. బసు ప్రియాంబుల్ విశిష్టతను ఇలా వివరించాడు: ‘సెక్యులరిజం అంటే- ప్రభుత్వానికి తనకై ఒక మతం ఉండదు, విభిన్న మతాలకు చెందిన ప్రజలు నివసిస్తుండే వ్యవస్థే సెక్యులరిజం’ అన్నాడు (బసు కామెంటరీ: వాల్యూం-1, పేజి : 400). అంతేకాదు, ఇండియా ఒక ప్రత్యేక మతాన్ని అంటకాగకుండా ఉన్న సెక్యులర్ వ్యవస్థ, అంటే ప్రభుత్వం సెక్యులర్ గాని, దేశ ప్రజలు భిన్న మతానుయాయులై ఉండటం. అంతేగాని అది రాజ్యాధికార మతవ్యవస్థ కాదు అని కూడా నిర్వచించాడు. కనుకనే రాజ్యాంగ నిర్ణయసభలో ముసా యిదా రాజ్యాంగం చర్చకు వచ్చినపుడు ‘దేవుని పేరిట’ (‘ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్’) ‘‘ఈ ప్రియాంబుల్‌ను ఆమోదిస్తున్నాం’’ అంటూ తీర్మానాన్ని ప్రవేశ పెట్టినప్పుడు పెక్కుమంది సభ్యులు అభ్యంతరం తెలిపారు. ఎందుకని? ‘దేవుని పేరిట’ అనగానే ఏ దేవుని పేరిట, ఏ మతం పేరిట, ఏ మతదైవం పేరిట అన్న మీమాంస తలెత్తే ప్రమాదముంది. అందుకే అసలా పదాన్నే సభ వారు ఉపసంహరించడం జరిగిందని మరచిపోరాదు! విశ్వాసాల్ని కలిగి ఉండటానికి, లేదా ప్రచారం చేసుకోవడానికి పౌరులకు స్వేచ్ఛ ఉండాలి. సెక్యులరిజం అంటే దైవనింద కాదని, ఇతర మతాల పట్ల అవగాహ నను, గౌరవాన్ని పెంపొందించుకోవటమే; మత భేదాల ఆధారంగా రాజ్యవ్య వస్థ ప్రజల పట్ల వివక్షతో వ్యవహరించకుండా ఉండటమే సెక్యులరిజమని బసు స్పష్టంగా వివరించాడు! రాజకీయ, సామాజిక, ఆర్థిక సమానత్వం పాదుకొల్పడం ద్వారానే ‘సాంఘిక న్యాయా’నికి ద్వారాలు తెరచుకుం టాయి. అవి పరస్పరాధారాలు. కనుకనే రాజ్యాంగాన్ని అమలు చేసేటప్పుడు ఏ సందర్భంలో, ఎక్కడ అస్పష్టత, అనుమానం తలెత్తినా ఉపోద్ఘాతాన్ని (ప్రియాంబుల్) ఆశ్రయించమంటారు న్యాయశాస్త్రకోవిదులు. ప్రియాంబు ల్ను అనుల్లంఘనీయమైన ‘దీపశిఖ’ అన్నారు! అందుకే, సుప్రీంకోర్టు 1975 నుంచీ 2004 వరకూ చెప్పిన అనేక తీర్పులలో, చివరికి కాశీవిద్యా పీఠానికి చెందిన ఆది విశ్వేశ్వర (యూపీ), ఎస్ఆర్ బొమ్మయ్, యూనియన్- ప్రవీణ్ తొగాడియా (కర్ణాటక) కేసులలో సహా చెప్పిన తీర్పులలో, వ్యాఖ్యలలో ఈ ప్రియాంబుల్‌ను సమర్థించాల్సివచ్చింది! ఇప్పటిదాకా మతాతీతంగా పాలనా వ్యవహారాలను, ఆర్థికాంశాలను ఆలోచించక బొందలో పెడుతున్న బీజేపీ నాయకత్వం పిదప ఆలోచనల్ని ఇప్పటికైనా మానుకోవటం అవసరం. తాత్కాలిక వైరాగ్యం అక్కరకు రాదు, రాదు. ఇంతకూ భారతీయ జనతాపార్టీ తన పేరును ‘హిందూ జనతా పార్టీగా మార్చుకోక పోవడానికి కారణం ఏమిటో! విశ్లేషణ: ఏబీకే ప్రసాద్, సీనియర్ సంపాదకులు (వ్యాసకర్త మొబైల్: 9848318414)