ఎర్రుపాలెం: భారత రాజ్యాంగం, ప్రజా స్వామ్యాన్ని ప్రధాని మోదీ అపహాస్యం చేస్తున్నారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్ర మార్క ఆరోపించారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో భట్టి చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర శనివారం ఎర్రుపాలెం మండలంలోని బనిగం డ్లపాడు, పెద్దగోపవరం, బంజర, కండ్రిక, తెల్లపాలెం, ఎర్రుపాలెం గ్రామాల్లో సాగింది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభల్లో భట్టి మాట్లాడుతూ అంబేడ్కర్ రాసిన రాజ్యాం గాన్ని కాకుండా మోదీ సొంత రాజ్యాంగం అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమ ర్శించారు. వచ్చే ఎన్నికల్లో దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికా రంలోకి రావడం ఖాయమని భట్టి ధీమా వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment