ఉన్నత పదవుల్లో ఉన్నవాళ్ల జీతం, సెలబ్రిటీల సంపాదన గురించి జనాల్లో ఒకరకమైన ఆసక్తి ఉంటుంది. ‘ఫలానా వాళ్లు ఎంత సంపాదిస్తారో తెలిస్తే షాక్ అవుతారు?’ లాంటి హెడ్డింగ్‌లకు దక్కే ఆదరణే అందుకు ఉదాహరణ. అయితే తమ జీతాలు, సంపాదన గురించి వాళ్లు బహిరంగంగా మాట్లాడే సందర్భాలు చాలా తక్కువ. అలాంటిది రాష్ట్రపతి హోదాలో రామ్‌నాథ్ కోవింద్ తన జీతం, కట్టింగ్‌ల గురించి మాట్లాడడం చర్చనీయాంశంగా మారింది.
న్యూఢిల్లీ: తాజాగా ఓ న్యూస్ ఛానెల్ ద్వారా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గురించి ట్విటర్ ఓ వీడియో వైరల్ అవుతోంది. ‘‘ దేశంలోనే అత్యధికంగా జీతం తీసుకుంటున్న వ్యక్తి నేను. నా నెల సంపాదన ఐదు లక్షలు. కానీ, అందులో 3 లక్షల దాకా ట్యాక్స్, కట్టింగ్‌ల రూపంలోనే పోతున్నాయి. ఆ లెక్కన నాకు మిగిలేది తక్కువే. అంటే మిగిలినవాళ్ల కంటే నేనేం బెటర్ కాదు. ఒక టీచర్ నాకంటే ఎక్కువే సేవింగ్స్ చేస్తున్నాడు’’ అంటూ సరదాగా నవ్వుతూ మాట్లాడారు ఆయన. అంతే..
राष्ट्रपति बोले- मुझे 5 लाख प्रति महीना तनख्वाह मिलती है जिसमें से पौने 3 लाख टैक्स चला जाता है, हमसे ज्यादा बचत तो एक टीचर की होती है#presidentkovind #UttarPradesh pic.twitter.com/D6MAgmFCZm
— News24 (@news24tvchannel) June 27, 2021
రెండు వాదనలతో..
ఇక రాష్ట్రపతి జీతంలో ట్యాక్స్ కట్టింగ్‌లు ఉండవని, ఆ విషయం తెలియక ఆయన అలా మాట్లాడడం విడ్డూరంగా ఉందని కొందరు ట్విటర్ ద్వారా హేళన చేస్తున్నారు. పైగా పోస్ట్ రిటైర్‌మెంట్ బెనిఫిట్స్, ఇతరత్రా అలవెన్స్‌లు కూడా ఉంటాయని గుర్తుచేస్తున్నారు. మరికొందరేమో రాజ్యాంగంలోని ప్రతులంటూ కొన్ని ఆధారాలను ట్విటర్‌లో పోస్ట్ చేస్తున్నారు. పెన్షన్ యాక్ట్ 1951 ప్రకారం.. రాష్ట్రపతి జీతంపై పన్ను విధించరని చెప్తున్నారు. అయితే అదంతా ఉత్తదేనని, రాష్ట్రపతి జీతంలో కట్టింగ్‌లు ఉంటాయని వాదిస్తున్నారు. ఇంకొందరేమో మరి ఆ ట్యాక్స్ కట్టింగ్‌ల జీతం ఎటుపోతుందోనని ఇంటర్నెట్ ద్వారా ఆరా తీస్తున్నారు. ఈ వివాదం ఎటు నుంచి ఎటో వెళ్లి.. రాజకీయ దుమారానికి తెరలేపింది. ఇదిలా ఉంటే కిందటి ఏడాది కరోనా టైంలో జీతాల్లో కొంత వాటాను(30 శాతం దాకా) త్యాగం చేసినవాళ్లలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి కూడా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment