ఇదేరా ప్రేమంటే...! వైరల్‌ వీడియో | This is life beautiful and lovely couple video goes viral | Sakshi
Sakshi News home page

ఇదేరా ప్రేమంటే...! వైరల్‌ వీడియో

Published Sat, Jul 27 2024 4:29 PM | Last Updated on Sat, Jul 27 2024 5:04 PM

This is life  beautiful and lovely couple video goes viral

సిరిసంపద, ఈడూజోడు అన్నీఉన్నా కలిసి కాపురం చేయలేని జంటలెన్నో. కలసి  ఉన్నా, సఖ్యత, ప్రేమ లేని సంసారాలు మరెన్నో నిత్యం మన కళ్ల  ముందు కనబడుతూనే ఉంటాయి. అలాగే ఒకరికొకరు తోడు నీడగా,  ప్రేమకు, ఆప్యాయతకు ప్రతిరూపంగా నలుగురికీ ఆదర్శంగా నిలిచే జంటలు కూడా చాలా ఉన్నాయి. తాజాగా అన్యోన్య దాంపత్యానికి, భార్యభర్తల అనుబంధానికి నిదర్శనంగా నిలిచిన ఒక జంట  వీడియో నెటిజనులను ఆకర్షిస్తోంది.  

వినోద్‌మెహతా అనే ఎక్స్‌ యూజర్‌ ‘ఇదీ జీవితం.. ఈ ప్రేమ ఇలాగే  ఉండాలి’ అంటూ  షేర్‌చేసిన వీడియో  నెట్టింట సందడి చేస్తోంది. భార్య, భర్త, వారికొక బిడ్డ అందమైన ఫ్యామిలీ.  కానీ ఇక్కడ ట్విస్ట్‌ ఏంటంటే భర్తకు రెండు చేతులూ (కుడి చేయి మోచేతి కిందనించి లేదు) లేవు. ఇద్దరూ కలిసి ఒక హోటల్‌కు వెళ్లారు. బిడ్డను ఒడిలో పెట్టుకుని కూచుని ఉన్న భార్య మరో చేతితో అతనికి చపాతీ తినిపించింది. మరో విశేషం ఏమిటంటే..సగం కుడిచేత్తోనే చపాతిని గుండ్రంగా ఒడుపుగా చుట్టి కూరలో ముంచి భార్యకు తినిపించాడు. ఇది చూసిన నెటిజన్లు లవ్లీ, బ్యూటిఫుల్‌ అంటూ కమెంట్‌ చేశారు. డబ్బుకు పేదలే గానీ, ప్రేమకు కాదు,  ఇదే కదా ప్రేమంటే అంటూ ఈ జంటపై ప్రశంసలు కురిపించారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement