lovely
-
ఇదేరా ప్రేమంటే...! వైరల్ వీడియో
సిరిసంపద, ఈడూజోడు అన్నీఉన్నా కలిసి కాపురం చేయలేని జంటలెన్నో. కలసి ఉన్నా, సఖ్యత, ప్రేమ లేని సంసారాలు మరెన్నో నిత్యం మన కళ్ల ముందు కనబడుతూనే ఉంటాయి. అలాగే ఒకరికొకరు తోడు నీడగా, ప్రేమకు, ఆప్యాయతకు ప్రతిరూపంగా నలుగురికీ ఆదర్శంగా నిలిచే జంటలు కూడా చాలా ఉన్నాయి. తాజాగా అన్యోన్య దాంపత్యానికి, భార్యభర్తల అనుబంధానికి నిదర్శనంగా నిలిచిన ఒక జంట వీడియో నెటిజనులను ఆకర్షిస్తోంది. వినోద్మెహతా అనే ఎక్స్ యూజర్ ‘ఇదీ జీవితం.. ఈ ప్రేమ ఇలాగే ఉండాలి’ అంటూ షేర్చేసిన వీడియో నెట్టింట సందడి చేస్తోంది. భార్య, భర్త, వారికొక బిడ్డ అందమైన ఫ్యామిలీ. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే భర్తకు రెండు చేతులూ (కుడి చేయి మోచేతి కిందనించి లేదు) లేవు. ఇద్దరూ కలిసి ఒక హోటల్‌కు వెళ్లారు. బిడ్డను ఒడిలో పెట్టుకుని కూచుని ఉన్న భార్య మరో చేతితో అతనికి చపాతీ తినిపించింది. మరో విశేషం ఏమిటంటే..సగం కుడిచేత్తోనే చపాతిని గుండ్రంగా ఒడుపుగా చుట్టి కూరలో ముంచి భార్యకు తినిపించాడు. ఇది చూసిన నెటిజన్లు లవ్లీ, బ్యూటిఫుల్ అంటూ కమెంట్ చేశారు. డబ్బుకు పేదలే గానీ, ప్రేమకు కాదు, ఇదే కదా ప్రేమంటే అంటూ ఈ జంటపై ప్రశంసలు కురిపించారు. -
Dinesh Karthik: ఆ నవ్వే నన్ను ముంచేసింది!.. ఎల్లప్పుడూ నా వాడే!(ఫొటోలు)
-
కాంగ్రెస్‌కు షాక్.. ఢిల్లీ పీసీసీ చీఫ్ రాజీనామా
ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల ముందు కాంగ్రెస్‌కు ఢిల్లీలో షాక్ తగిలింది. ఢిల్లీ పీసీసీ అధ్యక్ష పదవికి అరవిందర్ సింగ్ లవ్లీ రాజీనామా చేశారు. అవినీతి కేసులు ఎదుర్కొంటున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆప్ పార్టీతో పొత్తు పెట్టుకోవడంపై అసంతృప్తితో కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పారు. కాంగ్రెస్ కార్యకర్తల అభిప్రాయాలకు భిన్నంగా పార్టీ అధిష్టానం ఆప్‌తో పెట్టుకోవడంపై నిరసనగా రాజీనామా చేశారు. అధిష్టానం తన అభిప్రాయాలను పట్టించుకోవడంలేదని కాంగ్రెస్‌కు రాసిన రాజీనామా లేఖ పేర్కొన్నారు. Arvinder Singh Lovely resigns from the position of Delhi Congress president."The Delhi Congress Unit was against an alliance with a Party which was formed on the sole basis of leveling false, fabricated and malafide corruption charges against the Congress Party. Despite that,… https://t.co/Y1A360fuut pic.twitter.com/hLP9RtnzUE— ANI (@ANI) April 28, 2024 -
పతాకధారులుగా హర్మన్‌ప్రీత్ సింగ్, లవ్లీనా
ఆసియా క్రీడల ప్రారంభ వేడుకల్లో భారత బృందానికి పతాకధారులగా పురుషుల హాకీ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్, మహిళా స్టార్ బాక్సర్ లవ్లీనా బొర్గోహైన్ వ్యహరించనున్నారు. ఈనెల 23న చైనాలోని హాంగ్జూ నగరంలో ఆసియా క్రీడలకు తెర లేవనుంది. అస్సాంకు చెందిన 25 ఏళ్ల లవ్లీనా టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం, ఈ ఏడాది ప్రపంచ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించింది. పంజాబ్‌కు చెందిన హర్మన్ భారత్ తరఫున 191 మ్యాచ్‌లు ఆడి 155 గోల్స్ చేశాడు. -
ప్రపంచంలోని టాప్ 10 ఆకర్షణీయమైన పక్షులు
-
నువ్వురాకపోతే చచ్చిపోతా.. నువ్వు అవి మానేస్తానంటేనే వస్తా..
సాక్షి, ఒంగోలు: స్థానిక నేతాజీ కాలనీలో నక్కా మణికంఠ(30) ఇంటి సీలింగ్‌కు ఉన్న కొక్కేనికి తాడుసాయంతో ఉరేసుకుని ఆత్మహత్యచేసుకున్నాడు. తాను నివాసం ఉండే ఇంట్లోనే ఈ ఘటన సోమవారం అర్థరాత్రి దాటిన తరువాత వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం మణికంఠ స్వగ్రామం టంగుటూరు మండలం మర్లపాడు. రెండు సంవత్సరాలుగా తుపాకుల విజయ్‌కుమార్ అలియాస్ లవ్లీ అనే ట్రాన్స్‌జెండర్‌తో కలిసి ఉంటున్నాడు. ఆరు నెలల క్రితం ఇద్దరు వివాహం కూడా చేసుకున్నారు. గత నెల 19న మణికంఠకు గుండెపోటు వచ్చింది. దీంతో ఆస్పత్రిలో చూపించగా వైద్యులు మద్యం, ధూమపానానికి దూరంగా ఉండాలని సూచించారు. చదవండి: (దారుణ హత్య: తల, మొండెం వేరుచేసి తలతో పారిపోయి..) అయితే వత్తిరీత్యా డ్రైవర్ అయిన మణికంఠ మద్యం, సిగిరెట్లు మానకపోవడంతో సోమవారం మణికంఠ , లవ్లీ మధ్య వివాదం జరిగింది. దీంతో లవ్లీ చిలకలూరిపేట వెళ్ళింది. దీంతో నువ్వురాకపోతే చచ్చిపోతానని ఫోన్లో హెచ్చరించాడు. మానేస్తానంటేనే వస్తానంటూ అటునుంచి సమాధానం వచ్చింది. ఆ తరువాత కొద్దిసేపటికి ఫోన్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాకపోతుండడంతో లవ్లీ సమీపంలోని వారికి ఫోన్‌చేసింది. వారు వెళ్లి చూడగా ఇంటిపైన ఉన్న కొక్కేనికి వేలాడుతూ కనిపించాడు. దీంతో ఉరేసుకున్నట్లు గుర్తించి వారు లవ్లీకి, పోలీసులకు సమాచారం అందించారు. దీంతో తాలూకా ఎస్సై దేవకుమార్ ఘటనాస్థలానికి చేరుకుని మతదేహాన్ని కిందకు దించి చుట్టుపక్కల వారిని విచారించారు. లవ్లీ కూడా ఒంగోలుకు చేరుకోవడంతో ఆమెను విచారించారు. గతంలోను ఇదే విధంగా.. మణికంఠ తరచూ ఆత్మహత్యచేసుకుంటానని బెదిరించేవాడని, అదే విధంగా బెదిరిస్తున్నాడని అనుకున్నానని లవ్లీ చెబుతోంది. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ముచ్చటైన జంట ఆర్య, సాయేషా ఫోటోలు
-
డైనమిజ(య)ం
తెలుగు పరిశ్రమలో అతి తక్కువ మంది మహిళా దర్శకుల్లో ఒకరైన బి. జయ గురువారం తుది శ్వాస విడిచారు. 1964 జనవరి 11న జన్మించారామె. చెన్నై యూనివర్శిటీలో యం.ఎ ఇంగ్లీష్, అన్నామలై యూనివర్శిటీలో యం.ఎ సైకాలజీ పూర్తి చేయడంతో పాటు జర్నలిజంలో డిప్లొమా కూడా సంపాదించారు జయ. 1986లో పాత్రికేయురాలిగా కెరీర్ ఆరంభించి, పలు ప్రముఖ పత్రికల్లో పని చేశారు. మరోవైపు కథలు, నవలలు కూడా రాసేవారు. సుమారు 50కు పైగా షార్ట్ స్టోరీలు, కొన్ని సీరియల్స్, నవల్స్ రాశారు. తెలుగు, తమిళ, ఇంగ్లీష్‌లో 100కు పైగా కార్టూన్స్ వేశారు. ‘ఆనందో బ్రహ్మ’ అనే షార్ట్ స్టోరీకి నేషనల్ అకాడమీ అవార్డ్ అందుకున్నారు. ‘స్పర్శ’, ‘నీతి’ కథలకు కూడా అవార్డులు దక్కాయి. పాత్రికేయుడు బీఏ రాజుని పెళ్లాడిన అనంతరం ఆరంభించిన ‘సూపర్ హిట్’ పత్రికకు ఎగ్జిక్యూటివ్‌గా వ్యవహరించారు. డైనమిక్ జర్నలిస్ట్ అనిపించుకున్న జయకు డైరెక్టర్ అవ్వాలనే ఆకాంక్ష ఉండేది. దర్శకురాలు కాకముందు దీపక్, అంకిత జంటగా నటించిన ‘ప్రేమలో పావనీ కల్యాణ్’ సినిమాకు ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరించారు. డైరెక్టర్‌గా జయ ఫస్ట్ సినిమా ‘చంటిగాడు’ (2003). బాల నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న బాలాదిత్యను హీరోగా, సుహాసినిని హీరోయిన్గా పరిచయం చేస్తూ జయ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మలి ప్రయత్నంగా 2005లో యువరాజ్, రిషీ గిరీశ్ హీరోలుగా కామ్నా జెఠ్మలానీని హీరోయిన్గా పరిచయం చేస్తూ తెరకెక్కించిన చిత్రం ‘ప్రేమికులు’. ఆ తర్వాత కమెడియన్ అలీని హీరోగా పెట్టి రూపొందించిన చిత్రం‘ గుండమ్మగారి మనవడు’. 2008లో ‘సవాల్’, ఆ తర్వాత ఆది సాయికుమార్ హీరోగా, శాన్వీని హీరోయిన్గా పరిచయం చేస్తూ రూపొందించిన లవ్‌స్టోరీ ‘లవ్లీ’. డైరెక్టర్‌గా బి.జయకు, హీరోగా ఆది సాయికుమార్‌కు ‘లవ్లీ’ పెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ‘లవ్లీ’ తర్వాత కొత్త నటీనటులతో తెరకెక్కించిన ‘వైశాఖం’ (2017) కూడా మంచి సక్సెస్ అందుకుంది. ఈ చిత్రాలను ఆర్జే బ్యానర్‌పై బీఏ రాజు నిర్మించారు. ‘వైశాఖం’ తర్వాత ‘లక్కీ ఫెల్లో’ పేరుతో జయ, రాజు ఓ చిత్రం చేయడానికి ప్లాన్ చేశారు. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లాల్సి ఉంది. ఈలోపే ఊహించని విధంగా ఆమె తిరిగి రాని లోకాలకు వెళ్లారు. జర్నలిజమ్ నుంచి సినిమా డైరెక్షన్ వరకూ జయ సాధించిన విజయాలెన్నో. డైనమిక్ జర్నలిస్ట్, డైనమిక్ డైరెక్టర్, డైనమిక్ లేడీ అనిపించుకున్న జయ ఇటు పాత్రికేయ రంగంలోనూ, అటు సినిమా రంగంలోనూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ఆమె మరణం తీరని లోటు అని పలువురు పాత్రికేయులు, సినీ రంగ ప్రముఖులు పేర్కొన్నారు. జయ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. బి. జయకు ప్రముఖుల నివాళి మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, హీరో మహేశ్‌బాబు, ఆయన సతీమణి నమ్రతా శిరోద్కర్, దర్శకులు రేలంగి నరసింహారావు, పూరి జగన్నాథ్, ఆయన సతీమణి లావణ్య, కుమారుడు ఆకాశ్, దర్శకుడు వంశీ పైడిపల్లి, నటుడు ఉత్తేజ్, నిర్మాతలు బీవీఎస్ఎన్ ప్రసాద్, కె.ఎస్. రామారావు, దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, నిర్మాతలు బెల్లంకొండ సురేశ్, అనీల్ సుంకర, నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), సి.కల్యాణ్, శోభారాణి, రచయితలు చిన్నికృష్ణ, భాస్కర భట్ల, నటీమణులు చార్మీ, హేమ, అపూర్వ, నటి–దర్శకురాలు జీవిత తదితరులు జయకు నివాళులర్పించారు. జయగారు మన మధ్య లేరనేది జీర్ణించుకోలేనిది. చెన్నయ్‌లో ఉన్నప్పటి నుంచి జయగారితో, బీఏ రాజుతో నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. రచయిత్రిగా, పత్రిక ఎడిటర్‌గా, దర్శకురాలిగా.. ఇలా అన్ని శాఖల మీద మంచి పట్టున్న గొప్ప సాంకేతిక నిపుణురాలు లేకపోవడం పరిశ్రమకు తీరని లోటు. బీఏ రాజు ఒక మాట అన్నారు.. ‘చనిపోయింది తను కాదు, నేను. నా ఆలోచనల్లో, ఊహల్లో జయ బ్రతికే ఉంది. తను లేకపోతే నేను లేను’ అన్నారు. బాధ అనిపించింది. – నటుడు చిరంజీవి జయ చనిపోవడం బాధగా ఉంది. తను డైరెక్టర్ అవ్వకముందు జర్నలిస్ట్‌గా ఉన్నప్పటి నుంచీ నాకు తెలుసు. వెరీ హానెస్ట్, ఫ్రాంక్ పర్సన్. ఏ ఇంటర్వ్యూ తీసుకున్నా చాలా బాగా తీసుకునేది. డైరెక్టర్‌గా సక్సెస్ఫుల్ సినిమాలు తీశారు. – నటుడు వెంకటేశ్ జయగారు బహుముఖ ప్రజ్ఞాశాలి. తెలుగు పరిశ్రమలోని మహిళా దర్శకుల్లో సావిత్రిగారు, విజయనిర్మలగారి తర్వాత జయగారే. ఆమె 6 సినిమాలు డైరెక్ట్ చేసి హిట్ కొట్టారు. ఆమె రాసిన ‘ఆనందోబ్రహ్మ’ 14 భాషల్లో అనువాదమైంది. ఆవిడలోని మానవీయ కోణం చాలా గొప్పది. – నటుడు–దర్శక–నిర్మాత ఆర్. నారాయణమూర్తి జయగారికి, నాకు ఉన్న అనుబంధం ఏంటంటే మా ఇద్దరి బర్త్‌డే ఒకే రోజు (జనవరి 11). ఆవిడ ‘హ్యాపీ బర్త్‌డే అంటే నేను సేమ్ టు యు’ అనేవాణ్ని. నేను ‘హ్యాపీ బర్త్‌డే అంటే ఆవిడ సేమ్ టు యు’ అనేవారు. నా సినిమాలు ఎప్పుడు రిలీజ్ అయినా ఫోన్ చేసి విశ్లేషిస్తూ మాట్లాడేవారు. – దర్శకుడు సుకుమార్ ఎప్పుడో ఇంకా 30 ఏళ్ల తర్వాత వినాల్సిన వార్త ఇంత తొందరగా వినడం చాలా బాధ అనిపించింది. జయ తపన ఉన్న డైరెక్టర్. తను చాలా సక్సెస్ఫుల్ సినిమాలు చేశారు. ఇండస్ట్రీ దురదృష్టం ఏంటంటే మొన్న హరికృష్ణగారు చనిపోయారు.. ఇప్పుడు జయగారు. బాధ తర్వాత బాధ. – దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి విజయనిర్మలగారి తర్వాత ఆమె వారసత్వాన్ని జయగారు కొనసాగిస్తూ ఎంతో మంది మహిళా దర్శకులు రావడానికి ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ చాలా స్ఫూర్తి ఇచ్చారు. అలాంటి జయగారు మన మధ్య లేకపోవడం గొప్ప లోటు. క్రాంతికుమార్‌గారి వద్ద నేను అసిస్టెంట్‌గా చేస్తున్నప్పుడు తను కలిదిండి జయ పేరుతో కథలు, పుస్తకాలు రాసేవారు. అవి ఆయనకు బాగా నచ్చేవి. అప్పుడే ఆమె అంటే నాకు అభిమానం ఏర్పడింది. – దర్శకుడు గుణశేఖర్ బలమైన వ్యక్తిత్వం ఉన్నవారు జయగారు. ఆమెతో మాది 30 ఏళ్ల అనుబంధం. పరిశ్రమ పట్ల పూర్తి అవగాహన ఉన్న గొప్ప టెక్నీషియన్. విజయనిర్మలగారి తర్వాత ఆ స్థాయిలో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ఎక్కుతారేమో అనేంత పట్టుదల ఉన్న జయగారు సడెన్‌గా ఈ లోకాన్ని విడిచి వెళ్లడం చాలా బాధాకరం. రాజుగారికి తీరని లోటు ఇది. – నిర్మాత అచ్చిరెడ్డి జయగారు నా సినిమాలు చూసి ఎప్పటికప్పుడు అభినందించేవారు.. చాలా ఆప్యాయంగా మాట్లాడేవారు. నువ్వు మంచి సినిమాలు తీస్తున్నావు.. ఇంకా మంచి సినిమాలు తీయాలి అంటూ ప్రోత్సహించేవారు. చాలా ఫ్రెండ్లీ నేచర్. – డైరెక్టర్ నందినీరెడ్డి జయ మేడమ్‌కి ఆరోగ్యంపై శ్రద్ధ ఎక్కువ. రోజూ వాకింగ్ చేస్తారు, ఫ్రూట్స్ తింటారు. నాకు ఆవిడ తల్లిలాంటిది. నా ఫస్ట్ సినిమా ‘చంటిగాడు’ డైరెక్టర్ ఆవిడ. ఆ చిత్రం టైమ్‌లో నేను చాలా చిన్నమ్మాయిని. నన్ను కూతురిలా చూసుకున్నారు. – నటి సుహాసిని జయగారు ‘లవ్లీ’ సినిమాతో నాకు మంచి హిట్ ఇచ్చారు. ఆ తర్వాత కూడా అప్పుడప్పుడు ఫోన్ చేసి, మంచి సినిమాలు చేయాలి, హిట్ కొట్టాలని ఎంకరేజ్ చేసేవారు. – నటుడు ఆది హరికృష్ణను చివరిసారి చూడాలనుకున్నారు కొద్ది రోజులుగా హాస్పిటల్లో ఉంటున్న జయ బుధవారం హరికృష్ణ మరణ వార్త విని షాకయ్యారు. ఆయన్ను కడసారి చూడాలనుకున్నారు. ఆమె తెరకెక్కించిన ‘చంటిగాడు’ చిత్రం ఓపెనింగ్‌కి గెస్ట్‌గా హరికృష్ణ వచ్చారు. ‘‘వేడుక 9 గంటలకు అంటే ఆయన 8.30కి వచ్చారు. ఎంతో ఆప్యాయంగా మాట్లాడి, సినిమా సక్సెస్ కావాలని అభినందించారు. ఆయన భౌతికకాయాన్ని సందర్శించాలనుకున్నారు జయ. అయితే ఆరోగ్య సమస్యల రీత్యా కొన్ని రోజుల తర్వాత కుటుంబాన్ని పరామర్శిద్దాం అనుకునే లోపే ఆమె మృతి చెందడం విచారకరం’’ అని బీఏ రాజు ఉద్వేగానికి గురయ్యారు. బీఏ రాజు, చిరంజీవి, వెంకటేశ్, మహేశ్‌బాబు... -
జయకు మహేష్ బాబు నివాళి
హైదరాబాద్: నందమూరి హరికృష్ణ మరణవార్తను జీర్ణించుకోక ముందే టాలీవుడ్ కు మరో షాక్ తగిలింది. జర్నలిస్ట్‌గా తన ప్రస్థానాన్ని ప్రారంభించి, దర్శకత్వం వైపు అడుగులు వేసి చంటిగాడు సినిమా ద్వారా దర్శకురాలిగా తన ప్రతిభను నిరూపించుకున్న బి జయ గురువారం అర్ధరాత్రి గుండెపోటుతో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న టాలీవుడ్ ఒక్కసారిగా షాక్ కు గురైంది. బి జయ మరణవార్త తెలుసుకున్న మహేష్ బాబు.. ఆమె భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. జయ మరణం టాలీవుడ్ కు తీరని లోటని, జయలాంటి దర్శకురాలు టాలీవుడ్ కు అరుదుగా దొరుకుతుంటారని మహేష్ బాబు అన్నారు. బీఏ రాజు కుటుంబానికి మహేష్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మహేష్‌తో పాటు సీనియర్ హీరో వెంకటేష్, మంచు మనోజ్, ఆది, ఛార్మి, ఎస్వీ కృష్ణారెడ్డి, వంశీ పైడిపల్లి, గుణశేఖర్ తదితరులు ఆమెకు నివాళులు అర్పించారు. జయ ఆకస్మిక మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటని, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలన్నారు. దీనిలో భాగంగా జయతో తమకున్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్నారు. టాలీవుడ్ దర్శకురాలు మృతి (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
టాలీవుడ్ దర్శకురాలు మృతి
సాక్షి, హైదరాబాద్: తెలుగు సినీ దర్శకురాలు, డైనమిక్ లేడీ బి.జయ(54) గురువారం అర్ధరాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. జయ ప్రముఖ పీఆర్వో బీఏ రాజు సతీమణి. జర్నలిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన ఆమె సూపర్ హిట్ అనే సినీవారపత్రికకు జనరల్ మేనేజర్‌గా పనిచేశారు. అనంతరం చంటిగాడు సినిమా ద్వారా దర్శకురాలిగా మారారు. ఆమె తూర్పుగోదావరి జిల్లా అడ్డతీగల మండలం రావులపాలెంలో జన్మించారు. తెలుగు సినీ పరిశ్రమలో తనకో ప్రత్యేకతను సంపాదించుకున్నారు. చంటిగాడు, ప్రేమికులు, గుండమ్మగారి మనవడు, సవాల్, లవ్లీ, వైశాఖం చిత్రాలకు ఆమె దర్శకత్వం వహించారు. ’వైశాఖం’చిత్రంతో ప్రేక్షకుల ప్రశంసలతోపాటు సిల్వర్ క్రౌన్ అవార్డ్‌ను అందుకున్నారు. -
చైనీస్ సీరియల్ లో తెలుగు హీరోయిన్
లవ్లీ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయిన అందాల భామ శాన్వీ శ్రీవాస్తవ. తొలి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న శాన్వీ తరువాత ఆ సక్సెస్ ట్రాక్ ను కొనసాగించలేకపోయింది. దీంతో సాండల్ వుడ్ మీద దృష్టి పెట్టి అక్కడ వరుస అవకాశాలు సొంతం చేసుకుంది. తమిళంలోనూ అదృష్టాన్ని పరీక్షించుకున్నా.. అక్కడ కూడా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. అయితే కన్నడలో మంచి ఫాంలో ఉన్న ఈ భామ ఇప్పుడో క్రేజీ ప్రాజెక్ట్ లో నటిస్తోంది. ఓ ప్రాంతీయ భాషల్లో హీరోయిన్ గా నటిస్తున్న ఈ భామ ఏకంగా చైనీస్ వెబ్ సిరీస్ లో యువరాణి పాత్రకు ఎంపికైంది. ది డార్క్ లార్డ్ పేరుతో తెరకెక్కుతున్న చైనీస్ వెబ్ సిరీస్ లో భారతీయ యువరాణిగా కనిపించనుంది శాన్వీ. ఇటీవల జరిగిన ఈ షో షూటింగ్ కు సంబంధించిన ఫొటోలను తన సోషల్ మీడియాలో పేజ్ లో పోస్ట్ చేసింది శాన్వీ. ఈ ఫొటోలలో శాన్వీ లుక్ కు సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. One more beautiful experience in my bag☺️ “the dark lord”.playing an indian princess in china was quite an experience ☺️☺️ #chineseseries pic.twitter.com/wzjgWqGREN — shanvi srivastava (@shanvisrivastav) 4 October 2017 -
అది జాత్యహంకారం..
రాహుల్ ‘ఫెయిర్ అండ్ లవ్లీ’ వ్యాఖ్యలపై జైట్లీ * నల్లధనంపై పథకం సంపూర్ణ క్షమాభిక్ష పెట్టదు * నగలపై ఎక్సైజ్ సుంకం ఉపసంహరణ కుదరదు * బడ్జెట్‌పై లోక్‌సభలో చర్చకు ఆర్థికమంత్రి జవాబు న్యూఢిల్లీ: నల్లధనం వివరాలను వెల్లడించేందుకు ప్రభుత్వం ప్రకటించిన పథకాన్ని తప్పుపడుతూ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు చేసిన ‘ఫెయిర్ అండ్ లవ్లీ’ వ్యాఖ్యలు జాత్యహంకార మనఃస్థితిని ప్రతిఫలిస్తోందని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ తిప్పికొట్టారు. రాహుల్ పేరును ప్రస్తావించకుండానే.. ఆ వ్యాఖ్య రాజకీయంగా సరైనది కాదని, తెల్లగా (ఫెయిర్) లేని వారు ఆకర్షణీయంగా (లవ్లీ) ఉండబోరన్నది ఆ వ్యాఖ్యల మనఃస్థితిని పేర్కొన్నారు. నల్లధనంపై ప్రభుత్వం ప్రకటించిన పథకం సంపూర్ణ క్షమాభిక్ష పెట్టే పథకం కాదని ఉద్ఘాటించారు. నల్లధనం వెల్లడించే వారు 30 శాతం పన్ను, 15% సర్‌చార్జి, జరిమానా చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. బడ్జెట్‌పై లోక్‌సభలో చర్చకు జైట్లీ సోమవారం సాయంత్రం సమాధానం ఇస్తూ.. ఆటంకతత్వం లేకపోతే భారతదేశం వేగంగా అభివృద్ధి చెందగలదన్నారు. జీఎస్టీ, దివాలా బిల్లుల ఆమోదానికి కాంగ్రెస్ పార్టీ మద్దతివ్వాలని కోరారు. నగలపై ఒక శాతం ఎక్సైజ్ సుంకాన్ని ఉపసంహరించాలన్న డిమాండ్లను తిరస్కరించారు. జీఎస్టీ అమలు చేయటానికి సన్నాహంలో భాగంగా ఈ సుంకం విధించినట్లు పేర్కొన్నారు. అలాగే.. రుణ బకాయిల చెల్లింపుల్లో విఫలమైన వాణిజ్యవేత్త విజయ్‌మాల్యా దేశం విడిచి వెళ్లటంపై విపక్షాల విమర్శలకు స్పందిస్తూ.. చట్ట వ్యవస్థ ఆ రుణాల వసూళ్లకు అడ్డంకిగా మారి, ఆయన తప్పించుకుపోవటానికి వీలు కల్పించిందా అన్న ప్రశ్న తలెత్తుతోందని వ్యాఖ్యానించారు. అనంతరం.. బడ్జెట్ కసరత్తులో తొలి దశను పూర్తిచేస్తూ వినిమయ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. అర్ధసత్యాల బడ్జెట్: విపక్షంఅంతకుముందు ప్రతిపక్ష సభ్యులు మాట్లాడుతూ.. బడ్జెట్ అంతా ఎంతో బాగుందన్నట్లు చిత్రిస్తోందని.. అర్థసత్యాలతో నిండి ఉందని ధ్వజమెత్తారు. ప్రభుత్వ ‘అచ్ఛే దిన్’ నినాదాన్ని గుర్తుచేస్తూ.. నిక్కర్ల నుంచి ప్యాంట్లకు ఎదిగిన ఆర్ఎస్ఎస్కు మాత్రమే మంచి రోజులు వచ్చాయని ఎద్దేవా చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ బడ్జెట్‌కు నూరు శాతం మార్కులు ఇవ్వటాన్ని ప్రస్తావిస్తూ.. పరీక్ష రాసే వారిగా, ఆ పరీక్షను పరిశీలించే వారిగా మోదీయే వ్యవహరిస్తున్నారని తారిక్ అన్వర్ (ఎన్సీపీ) విమర్శించారు. బడ్జెట్ మధ్యతరగతికి వ్యతిరేకమైనదని సంతోక్సింగ్చౌదరి (కాంగ్రెస్) ధ్వజమెత్తారు. బడ్జెట్‌కు దిశానిర్దేశమేదీ లేదని, అంతా డొల్ల అని ప్రకాశ్నారాయణ్యాదవ్ (ఆర్జేడీ) విమర్శించారు. బడ్జెట్లో దూరదృష్టి లేదని తపస్మండల్ (టీఎంసీ) తప్పుపట్టారు. రైతులను కాపాడటానికి ఏదైనా చేయాలని మాజీ ప్రధాని, జేడీఎస్ నేత దేవెగౌడ విజ్ఞప్తిచేశారు. రైతుల సమస్యలను పరిష్కరించటానికి ప్రభుత్వం వద్ద ఏ మంత్రదండం ఉందని ధర్మేంద్రయాదవ్ (ఎస్పీ) ప్రశ్నించారు. బడ్జెట్ సంతులనంగా ఉన్నప్పటికీ.. కొన్ని లోపాలు ఉన్నాయని, నగలపై విధించిన ఎక్సైజ్ సుంకాన్ని ఉపసంహరించాలని బుట్టా రేణుక (వైఎస్సార్ కాంగ్రెస్) ప్రభుత్వాన్ని కోరారు. పలువురు బీజేపీ సభ్యులు బడ్జెట్‌ను ప్రశంసించారు. -
రాహుల్ వ్యాఖ్యల్లో అజ్ఞానం కనిపిస్తోంది : జైట్లీ
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తప్పుబట్టారు. రాహుల్ వ్యాఖ్యలు ప్రేరేపించేవిగా ఉన్నాయని, ఫెయిర్ అండ్ లవ్లీ యోజన అంటూ ప్రభుత్వ పథకాలను రాహుల్ విమర్శించడంలో సమన్వయం కనిపించడం లేదని ఆరోపించారు. ఇటువంటి వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా సమంజసం కాదన్నారు. నల్లధనాన్ని తెల్లగా మార్చేందుకు ఎన్డీఏ ప్రభుత్వం ఫెయిర్ అండ్ లవ్లీ పథకాన్ని ప్రారంభించింది అంటూ రాహుల్ ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్ వ్యాఖ్యలకు స్పందించిన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ... అటువంటి వ్యాఖ్యలు వ్యక్తుల్లోని అజ్ఞానాన్ని తెలియజేస్తాయని అన్నారు. 'ఫెయిర్ అండ్ లవ్లీ యోజన్' అంటూ రాహుల్ వాడిన పదబంధం రాజకీయ నాయకులు మాట్లాడే పద్ధతిలో లేదని, ఇది జాతి అభిప్రాయం అంటూ అరుణ్ జైట్లీ లోక్ సభ బడ్జెట్ చర్చ జరుగుతున్న సమయంలో పేర్కొన్నారు. -
విజయనిర్మలగారు చేసిన చిత్రాల సంఖ్యలో సగమైనా...
‘‘ఓ విజయవంతమైన చిత్రం చేసిన తర్వాత తదుపరి చిత్రంపై అంచనాలు పెరగడం సహజం. అందుకే ‘లవ్లీ’ తర్వాత హడావిడిగా సినిమా మొదలుపెట్టకుండా కథా పరంగా జాగ్రత్త తీసుకుంటున్నాను’’ అని దర్శకురాలు బి. జయ అన్నారు. ఆదివారం ఆమె పుట్టినరోజు వేడుక జరిగింది. ఈ వేడుకలో సూపర్ హిట్ పత్రికాధినేత, నిర్మాత బీఏ రాజు, సీనియర్ పాత్రికేయులు పసుపులేటి రామారావు పాల్గొన్నారు. బి. జయ మాట్లాడుతూ - ‘‘ఈ ఏడాది ‘తొక్కుడుబిళ్ల’, ‘కలిసుందాం.. కండీషన్స్ అప్లయ్’ పేరుతో రెండు చిత్రాలు, నూతన హీరో సజ్జన్‌తో ఓ చిత్రం చేయబోతున్నాం. వీటిలో ఒకటి మలయాళ చిత్రాల తరహాలో సహజత్వానికి దగ్గరగా ఉంటుంది. ‘తొక్కుడుబిళ్ల’కు పరుచూరి గోపాలకృష్ణ కథ, మాటలు అందిస్తున్నారు. సంగీతదర్శకుడు వసంత్ ఆధ్వర్యంలో వచ్చే నెల పాటలను రికార్డ్ చేస్తాం’’ అని చెప్పారు. మీ దర్శకత్వంలో సినిమా చేయడానికి నాగార్జున సుముఖత వ్యక్తపరిచారు కదా? అనే ప్రశ్నకు - ‘‘నాగార్జునగారు విభిన్న తరహా చిత్రాలు చేశారు. ఆయనతో చేయాలంటే సరికొత్త కథ కావాలి. లేడీ డెరైక్టర్‌తో చేసే సినిమా నాకు కొత్తగా ఉండాలని ఆయన కూడా ఉన్నారు. కథ కుదరాలి’’ అన్నారు. దర్శకురాలిగా విజయనిర్మల తనకు ఆదర్శం అని చెబుతూ - ‘‘దాదాపు 50 చిత్రాలకు దర్శకత్వం వహించిన ఘనత ఆమెది. పైగా అన్నీ విభిన్న కథాంశం గల చిత్రాలే. విజయనిర్మలగారు చేసిన చిత్రాల సంఖ్యలో సగమైనా చేరాలనుకుంటున్నాను’’ అన్నారు. -
మదన్ దర్శకత్వంలో ఆది
రచయితగా ‘ఆ నలుగురు’, దర్శకునిగా ‘పెళ్లైన కొత్తలో’... ఈ రెండు సినిమాలు చాలు మదన్ ప్రతిభ ఏంటో చెప్పడానికి. ‘ప్రవరాఖ్యుడు’ తర్వాత ఆయన నుంచి సినిమా రాలేదు. ఇన్నాళ్ల విరామం తర్వాత మదన్ దర్శకత్వంలో ఓ చిత్రం రాబోతోంది. ప్రేమ కావాలి, లవ్లీ చిత్రాలతో యువతరానికి చేరువైన ఆది ఇందులో కథానాయకుడు. వ్యాపారవేత్త రాజ్‌కుమార్.ఎం. ఈ చిత్రానికి నిర్మాత. ఆర్.కె స్టూడియోస్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కనుంది. నిర్మాత మాట్లాడుతూ ‘‘ఆది గత చిత్రాలకన్నా ఈ సినిమా భిన్నంగా ఉంటుంది. దర్శకునిగా మదన్‌ను మరోమెట్టు పై నిలబెట్టే సినిమా ఇది. వచ్చే నెల 28 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతాం. డిసెంబర్లో చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ‘‘నేను ఇప్పటిదాకా చేసిన సినిమాల కథలన్నీ నావే. తొలిసారి మా అసిస్టెంట్ డెరైక్టర్ శ్రీనివాస్ గవిరెడ్డి చెప్పిన కథ బాగా నచ్చి, ఆ కథతో దర్శకత్వం చేయబోతున్నాను. ఇందులో ఆది పాత్ర వైవిధ్యంగా ఉంటుంది. హై ఓల్టేజి ఉన్న పాత్రలో ఆయన కనిపిస్తారు. పల్లెటూరు, పట్టణ నేపథ్యంలో కథ సాగుతుంది. నిర్మాత రాజ్‌కుమార్ సినిమాపై అభిమానంతో నిర్మించడానికి ముందుకొచ్చారు. ‘పెళ్లైన కొత్తలో’ తర్వాత అగస్త్య నా సినిమాకు సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ప్రముఖ కథానాయిక, భారీ తారాగణం ఇందులో నటిస్తారు’’ అని చెప్పారు. ఈ చిత్రానికి కథ, మాటలు: శ్రీనివాస్ గవిరెడ్డి, కెమెరా: సురేందర్ రెడ్డి.టి., కళ: నాగేంద్ర, ఎడిటింగ్: కార్తిక్ శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: బి. నాగిరెడ్డి, కో డైరక్టర్: అనిల్. -
సన్‌స్క్రీన్ లోషన్ అవసరం లేని బాల్యం...
వేసవి జ్ఞాపకం ‘ప్రేమకావాలి’, ‘లవ్లీ’, ‘సుకుమారుడు’ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మదిని గెలుచుకున్నారు ఆది(ఆదిత్య). ‘ప్యార్ మే పడిపోయానే’, ‘గాలిపటం’ సినిమా షూటింగ్‌లతో బిజీ బిజీగా ఉన్న ఆది బాల్యంలో తన వేసవి ముచ్చట్ల గురించి ఇలా తెలిపారు... ‘నా చిన్నప్పుడు 7వ తరగతి వరకు చెన్నైలోనే ఉన్నాం. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చేశాం. ఇప్పుడంటే ఎండలో తిరిగితే నల్లబడతామని మానేస్తాం. తప్పదంటే సన్‌స్క్రీన్ లోషన్ రాసుకొని వెళతాం. కానీ, చిన్నప్పుడు అలా కాదు.. ఎండలో విపరీతంగా తిరిగేసేవాళ్లం. నాన్నగారు(సాయికుమార్) సినిమా షూటింగ్స్ కారణంగా బిజీగా ఉండేవారు. అందుకే ఊళ్లు వెళ్లేవాళ్లం కాదు. బోర్ కొడుతుందని కొన్ని రోజులు సమ్మర్ క్యాంప్‌కి వెళ్లేవాడిని. మా నాన్నగారికి ఇద్దరు చెల్లెళ్లు, ముగ్గురు అన్నదమ్ములు. వారు పిల్లలతో సహా వేసవిలో మా ఇంటికే వచ్చేవారు. మా పిల్లల సంఖ్యే 15 వరకు ఉండేది. ఇంకా తాతగారు, నానమ్మ... అంతమందితో వేసవిలో ఇల్లంతా పండగ వాతావరణమే! వీరికి తోడు బయట మా స్నేహితులు... అంతా కలిసి బయట క్రికెట్, బ్యాడ్మింటన్.. పగలు ఇంట్లోనే క్యారమ్స్, చెస్... ఆడేవాళ్లం. మారుతీ వ్యాన్‌లో అందరం కలిసి సినిమాలకు, షికార్లకు వెళ్లేవాళ్లం. ఆటలు, అల్లరి, షికార్లతో.. సెలవులు ఇట్టే గడిచిపోయేవి. తర్వాత అంతా వెళ్లిపోయేవారు. ఇల్లంతా బోసిపోయినట్టుగా అనిపించేది. మళ్లీ త్వరగా వేసేవి వచ్చేస్తే బాగుండు అనుకునేవాడిని. పెద్దయ్యాక వేసవి సెలవుల ఎంజాయ్మెంట్ అంతగా ఉండదు. ఈ మధ్యే కొత్తగా ఇల్లు కొనుక్కున్నాం. ఇంటి పనుల్లో అందరం బిజీ. ఈ నెల 23న బంధువులు, వారి పిల్లలు మా కొత్తింటికి వస్తున్నారు. వాళ్లతో మళ్లీ నా చిన్ననాటి వేసవిని గుర్తుతెచ్చుకుంటూ ఆనందించనున్నాను.’ -
అలాంటి సినిమాలు చేయాలనే...
‘‘2012లో నేను డెరైక్ట్ చేసిన ‘లవ్లీ’ ఆ ఏడాది టాప్ టెన్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. వందకి వంద మార్కులు పడే సినిమాలు చేయాలనే ఉద్దేశంతో 2013లో సినిమా చేయలేదు. ప్రస్తుతం రెండు కథలు సిద్ధంగా ఉన్నాయి. ఒకటి పెద్ద హీరోతో, మరోటి చిన్న సినిమా ఉంటుంది’’ అని దర్శకురాలు బి.జయ తెలిపారు. శనివారం తన పుట్టినరోజు వేడుకను హైదరాబాద్‌లోని ఆశ్రయ్-ఆకృతి బధిర పాఠశాలలో జరుపుకున్నారు. ఈ సంస్థ నిర్వహణ నిమిత్తం ఒక లక్షా తొమ్మిదివేల రూపాయలను విరాళంగా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బి.ఎ.రాజు, బాబు తదితరులు పాల్గొన్నారు. -
ప్రేమలో పడిపోయాడే...
సామాన్యుడు, శ్రీమన్నారాయణ తదితర చిత్రాల దర్శకుడు రవి చావలి దర్శకత్వంలో ‘లవ్లీ’ పెయిర్ ఆది, శాన్వి నటిస్తున్న చిత్రం ‘ప్యార్ మే పడిపోయానె’. కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. నిర్మాత మాట్లాడుతూ- ‘‘మా సంస్థ నుంచి వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రమిది. రవి చావలి చెప్పిన కథ అద్భుతంగా ఉండటంతో చిత్రాన్ని స్టార్ట్ చేశాం. ‘లవ్లీ’ తర్వాత ఆది, శాన్వి కలిసి నటిస్తున్న ఈ చిత్రం తప్పకుండా విజయం సాధిస్తుంది’’ అని నమ్మకం వ్యక్తం చేశారు. హీరోగా తనకు మంచి పేరు తెచ్చే సినిమా అవుతుందని, ప్రస్తుతం జరుగుతున్న తొలి షెడ్యూల్ డిసెంబర్ 8 వరకూ జరుగుతుందని ఆది తెలిపారు. ఆదితో మళ్లీ కలిసి నటించడం పట్ల శాన్వి ఆనందం వ్యక్తం చేశారు. అలీ, కాశీ విశ్వనాథ్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా: టి.సురేందర్‌రెడ్డి, కూర్పు: కె.వి.కృష్ణారెడ్డి, కళ: కె.వి.రమణ, కార్యనిర్వాహక నిర్మాత: ఎం.ఎస్.కుమార్.