మదన్ దర్శకత్వంలో ఆది | Actor Aadi to work with director Madan | Sakshi
Sakshi News home page

మదన్ దర్శకత్వంలో ఆది

Published Sat, Jun 28 2014 11:17 PM | Last Updated on Thu, Sep 27 2018 8:48 PM

మదన్ దర్శకత్వంలో ఆది - Sakshi

మదన్ దర్శకత్వంలో ఆది

 రచయితగా ‘ఆ నలుగురు’, దర్శకునిగా ‘పెళ్లైన కొత్తలో’... ఈ రెండు సినిమాలు చాలు మదన్ ప్రతిభ ఏంటో చెప్పడానికి. ‘ప్రవరాఖ్యుడు’ తర్వాత ఆయన నుంచి సినిమా రాలేదు. ఇన్నాళ్ల  విరామం తర్వాత మదన్ దర్శకత్వంలో ఓ చిత్రం రాబోతోంది. ప్రేమ కావాలి, లవ్లీ చిత్రాలతో యువతరానికి చేరువైన ఆది ఇందులో కథానాయకుడు. వ్యాపారవేత్త రాజ్‌కుమార్.ఎం. ఈ చిత్రానికి నిర్మాత. ఆర్.కె స్టూడియోస్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కనుంది.
 
  నిర్మాత మాట్లాడుతూ ‘‘ఆది గత చిత్రాలకన్నా ఈ సినిమా భిన్నంగా ఉంటుంది. దర్శకునిగా మదన్‌ను మరోమెట్టు పై నిలబెట్టే సినిమా ఇది. వచ్చే నెల 28 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతాం. డిసెంబర్‌లో చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ‘‘నేను ఇప్పటిదాకా చేసిన సినిమాల కథలన్నీ నావే. తొలిసారి మా అసిస్టెంట్ డెరైక్టర్ శ్రీనివాస్ గవిరెడ్డి చెప్పిన కథ బాగా నచ్చి, ఆ కథతో దర్శకత్వం చేయబోతున్నాను. ఇందులో ఆది పాత్ర వైవిధ్యంగా ఉంటుంది.
 
  హై ఓల్టేజి ఉన్న పాత్రలో ఆయన కనిపిస్తారు. పల్లెటూరు, పట్టణ నేపథ్యంలో కథ సాగుతుంది. నిర్మాత రాజ్‌కుమార్ సినిమాపై అభిమానంతో నిర్మించడానికి ముందుకొచ్చారు. ‘పెళ్లైన కొత్తలో’ తర్వాత అగస్త్య నా సినిమాకు సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ప్రముఖ కథానాయిక, భారీ తారాగణం ఇందులో నటిస్తారు’’ అని చెప్పారు. ఈ చిత్రానికి కథ, మాటలు: శ్రీనివాస్ గవిరెడ్డి, కెమెరా: సురేందర్ రెడ్డి.టి., కళ: నాగేంద్ర, ఎడిటింగ్: కార్తిక్ శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: బి. నాగిరెడ్డి, కో డైరక్టర్: అనిల్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement