రౌడీ మాప్లేగా కృష్ణార్జున
టాలీవుడ్ నటుడు నాగార్జున, యువ నటుడు విష్ణు కలిసి నటించిన భారీ తెలుగు చిత్రం కృష్ణార్జున. అందాల బొమ్మ మమతా మోహన్‌దాస్ కథానాయకిగా నటించిన ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు పీ.వాసు కథ, దర్శకత్వం బాధ్యతల్ని నిర్వహించారు.నాజర్, నెపోలియన్, మనోరమ, బ్రహ్మానందం, భువనేశ్వరి ప్రముఖ పాత్రలు పోషించిన ఈ చిత్రానికి మరగదమణి(కీరవాణి) సంగీతాన్ని అందించారు. ఇందులో నాగార్జున మానవరూపంలో ఉండే శ్రీకృష్ణుడిగా నటించగా ఆయన భక్తుడిగా విష్ణు నటించారు.
వీరిద్దరి మధ్య జరిగే సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయి. యాక్షన్, లవ్, సెంటిమెంట్ అంటూ కమర్షియల్ అంశాలతో తెరకెక్కిన చిత్రం ఇది. ఇంతకు ముందు పలు అనువాద చిత్రాలను రూపొందించిన శివం అసోసియేషన్స్ సంస్థ ఈ కృష్ణార్జున చిత్రాన్ని తమిళంలో రౌడీమాప్లే పేరుతో అనవదిస్తోంది.
దీనికి కథానువాదం, పాటలను ఈఎంఎస్.రాజ్ రాశారు. చిత్రం గురించి నిర్మాత తెలుపుతూ ఒక జాతక దోషం ఉన్న అందమైన అమ్మాయిని మరణానికి చేరువలో ఉన్న ఒక అమాయక యువకుడికిచ్చి పెళ్లి చేస్తారన్నారు.ఆ తరువాత కథ ఎలాంటి మలుపులు తిరింగిందన్నదే రౌడీ మాప్లే చిత్ర కథ అన్నారు. చిత్రాన్ని మార్చిలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు.