Krishnarjuna
-
బీ బ్రేవ్.. నేనున్నా
Mekapati Goutham Reddy Funeral At Udayagiri: ఉదయగిరిలో బుధవారం మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అంత్యక్రియలకు హాజరైన సీఎం వైఎస్ జగన్ దగ్గరుండి కార్యక్రమాన్ని నిర్వహించారు. మేకపాటి రాజమోహన్‌రెడ్డితో కలిసి చితి వద్దకు చేరుకుని పార్థివదేహంపై స్వయంగా గంధపు చెక్కలను పేర్చి చితిపై నెయ్యి వేశారు. మేకపాటి కుటుంబానికి మనోధైర్యం కల్పిస్తూ నేనున్నా.. పార్టీ అండగా ఉంటుంది.. ధైర్యంగా ఉండాలని అనునయించారు. గౌతమ్‌రెడ్డి సోమవారం గుండెపోటుతో మృతి చెందారని తెలియగానే, సీఎం జగన్ దంపతులు హుటాహుటిన హైదరాబాద్ చేరుకుని మేకపాటి కుటుంబ సభ్యులను ఓదార్చిన విషయం తెలిసిందే. కృష్ణార్జునరెడ్డిని భుజం తట్టి.. తండ్రి అంతిమ సంస్కారాలు నిర్వహించిన కృష్ణార్జునరెడ్డిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భుజం తట్టి అనునయించారు. ‘బీ బ్రేవ్’.. నేనున్నా... మీకు ఎప్పటికీ పార్టీ అండగా ఉంటుందని ఓదార్చారు. గౌతమ్‌రెడ్డి సతీమణి కీర్తిరెడ్డి, కుమార్తె సాయిఅనన్య, తల్లి మణిమంజరిలను సీఎం సతీమణి వైఎస్ భారతీరెడ్డి ఓదార్చి ధైర్యం నింపారు. గౌతమ్‌రెడ్డి అంతిమ సంస్కారాల్లో సహచర మంత్రులు, ప్రజాప్రతినిధులు విషణ్ణ వదనాలతో ఆవేదన పంచుకున్నారు. వివాద రహితుడు, సౌమ్యుడు, చురుకైన నాయకుడు, మచ్చలేని మనిషిగా కీర్తి గడించిన గౌతమ్‌రెడ్డి కుటుంబానికి దేవుడు అన్యాయం చేశాడని కంట తడి పెట్టారు. -
రౌడీ మాప్లేగా కృష్ణార్జున
టాలీవుడ్ నటుడు నాగార్జున, యువ నటుడు విష్ణు కలిసి నటించిన భారీ తెలుగు చిత్రం కృష్ణార్జున. అందాల బొమ్మ మమతా మోహన్‌దాస్ కథానాయకిగా నటించిన ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు పీ.వాసు కథ, దర్శకత్వం బాధ్యతల్ని నిర్వహించారు.నాజర్, నెపోలియన్, మనోరమ, బ్రహ్మానందం, భువనేశ్వరి ప్రముఖ పాత్రలు పోషించిన ఈ చిత్రానికి మరగదమణి(కీరవాణి) సంగీతాన్ని అందించారు. ఇందులో నాగార్జున మానవరూపంలో ఉండే శ్రీకృష్ణుడిగా నటించగా ఆయన భక్తుడిగా విష్ణు నటించారు. వీరిద్దరి మధ్య జరిగే సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయి. యాక్షన్, లవ్, సెంటిమెంట్ అంటూ కమర్షియల్ అంశాలతో తెరకెక్కిన చిత్రం ఇది. ఇంతకు ముందు పలు అనువాద చిత్రాలను రూపొందించిన శివం అసోసియేషన్స్ సంస్థ ఈ కృష్ణార్జున చిత్రాన్ని తమిళంలో రౌడీమాప్లే పేరుతో అనవదిస్తోంది. దీనికి కథానువాదం, పాటలను ఈఎంఎస్.రాజ్ రాశారు. చిత్రం గురించి నిర్మాత తెలుపుతూ ఒక జాతక దోషం ఉన్న అందమైన అమ్మాయిని మరణానికి చేరువలో ఉన్న ఒక అమాయక యువకుడికిచ్చి పెళ్లి చేస్తారన్నారు.ఆ తరువాత కథ ఎలాంటి మలుపులు తిరింగిందన్నదే రౌడీ మాప్లే చిత్ర కథ అన్నారు. చిత్రాన్ని మార్చిలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు.