గౌతమ్‌రెడ్డి కుమారుడు కృష్ణార్జునరెడ్డికి ధైర్యం చెబుతున్న సీఎం వైఎస్ జగన్
Mekapati Goutham Reddy Funeral At Udayagiri: ఉదయగిరిలో బుధవారం మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అంత్యక్రియలకు హాజరైన సీఎం వైఎస్ జగన్ దగ్గరుండి కార్యక్రమాన్ని నిర్వహించారు. మేకపాటి రాజమోహన్‌రెడ్డితో కలిసి చితి వద్దకు చేరుకుని పార్థివదేహంపై స్వయంగా గంధపు చెక్కలను పేర్చి చితిపై నెయ్యి వేశారు. మేకపాటి కుటుంబానికి మనోధైర్యం కల్పిస్తూ నేనున్నా.. పార్టీ అండగా ఉంటుంది.. ధైర్యంగా ఉండాలని అనునయించారు. గౌతమ్‌రెడ్డి సోమవారం గుండెపోటుతో మృతి చెందారని తెలియగానే, సీఎం జగన్ దంపతులు హుటాహుటిన హైదరాబాద్ చేరుకుని మేకపాటి కుటుంబ సభ్యులను ఓదార్చిన విషయం తెలిసిందే.
కృష్ణార్జునరెడ్డిని భుజం తట్టి..
తండ్రి అంతిమ సంస్కారాలు నిర్వహించిన కృష్ణార్జునరెడ్డిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భుజం తట్టి అనునయించారు. ‘బీ బ్రేవ్’.. నేనున్నా... మీకు ఎప్పటికీ పార్టీ అండగా ఉంటుందని ఓదార్చారు. గౌతమ్‌రెడ్డి సతీమణి కీర్తిరెడ్డి, కుమార్తె సాయిఅనన్య, తల్లి మణిమంజరిలను సీఎం సతీమణి వైఎస్ భారతీరెడ్డి ఓదార్చి ధైర్యం నింపారు. గౌతమ్‌రెడ్డి అంతిమ సంస్కారాల్లో సహచర మంత్రులు, ప్రజాప్రతినిధులు విషణ్ణ వదనాలతో ఆవేదన పంచుకున్నారు. వివాద రహితుడు, సౌమ్యుడు, చురుకైన నాయకుడు, మచ్చలేని మనిషిగా కీర్తి గడించిన గౌతమ్‌రెడ్డి కుటుంబానికి దేవుడు అన్యాయం చేశాడని కంట తడి పెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment