‘అమ్మమ్మ డాట్ కామ్’తో పేరొచ్చింది | Serial actor mantripragada naga ravishankar | Sakshi

‘అమ్మమ్మ డాట్ కామ్’తో పేరొచ్చింది

Published Mon, Sep 8 2014 12:16 AM | Last Updated on Fri, Sep 28 2018 4:53 PM

‘అమ్మమ్మ డాట్ కామ్’తో పేరొచ్చింది - Sakshi

‘అమ్మమ్మ డాట్ కామ్’తో పేరొచ్చింది

‘అమ్మమ్మ డాట్ కామ్’ సీరియల్‌తో తనకు మంచి పేరొచ్చిందని.. బుల్లితెర రంగంలో స్థిరపడగలిగానని నటుడు మంత్రిప్రగడ నాగరవిశంకర్ అన్నారు.

నటుడు మంత్రిప్రగడ నాగ రవిశంకర్
పాలకొల్లు అర్బన్ : ‘అమ్మమ్మ డాట్ కామ్’ సీరియల్‌తో తనకు మంచి పేరొచ్చిందని.. బుల్లితెర రంగంలో స్థిరపడగలిగానని నటుడు మంత్రిప్రగడ నాగరవిశంకర్ అన్నారు. మంచిని స్వాగతిస్తూ ప్రేక్షకాదరణ లభించే పాత్రలు చేయడమే లక్ష్యమని చెప్పారు. దాసరి నారాయణరావు సారథ్యంలో కాపుగంటి రాజేంద్ర దర్శకత్వంలో నిర్మిస్తున్న ‘గోకులంలో సీత’ సీరియల్‌లో హీరోగా నటిస్తున్న ఆయన పాలకొల్లులో విలేకరులతో ముచ్చటించారు.
 ? : పరిశ్రమకు ఎలా పరిచయమయ్యారు
 2002 నంది అవార్డుల ప్రదానోత్సవ సభలో అల్లూరి సీతారామరాజు వేషం వేశా. దాంతో సీరియల్‌లో నటించే అవకాశాలు వచ్చాయి.
 ?: బుల్లితెర నటుడు కావాలని ఎందుకు అనుకున్నారు
 నాకు ఎవరూ గాడ్‌ఫాదర్లు లేరు. మాది శ్రీకాకుళం. బీకాం చదువుకున్నా. యాక్టింగ్ నేర్చుకోవాలని 2002లో రూ.10 వేలు పట్టుకుని హైదరాబాద్ వెళ్లా. మీడియా వర్కుషాపు ఆన్ యాక్టింగ్‌లో చేరా. శిక్షణ అనంతరం నెలరోజులే లక్ష్యంగా పెట్టుకున్నా. 30వ రోజు రాత్రి 11 గంటలకు కెమెరా ముందు నిలుచునే అవకాశం వచ్చింది. లేకపోతే వెనక్కి వెళ్లిపోయేవాడిని.
 ?: డిగ్రీ పూర్తికాగానే ఏమి చే శారు
 కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం చేశా. సునామీ డేటా వింగ్‌లో విధులు నిర్వర్తించా.
 ?: నటించిన తొలి సీరియల్.. గుర్తింపు తెచ్చింది ఏది
 అలౌఖిక సీరియల్‌తో బుల్లితెరకు పరిచయమయ్యా. ‘నువ్వువస్తావని’లో నెగిటివ్ రోల్ చేశా. ‘అమ్మమ్మ డాట్ కామ్’తో పేరువచ్చింది.
 ?: ఇప్పటివరకు ఏయే సీరియల్స్‌లో నటించారు
 నిజం-నిజం, అపరాధి, నమ్మలేని నిజాలు, అలౌఖిక, నువ్వువస్తావని, అమ్మమ్మ డాట్ కామ్, ఏడడుగులు, శ్రావణమేఘాలు, లయ, యువ, సావిరహే, ఇట్లు ప్రేమతో అమ్మ.., అభిషేకం, కుంకుమరేఖ, నెం.23 మహాలక్ష్మి నివాసం, చిన్నకోడలు, బంగారు కోడలు, అష్టాచమ్మాలో నటించా
 ?: సినిమా అవకాశాలు
 కథ (జెనీలియా ఫేం), స్నేహితుడా (నాని హీరో) సినిమాల్లో నటించా. సీరియల్స్‌లో బిజీ అవ్వడం వల్ల సినిమా అవకాశాల కోసం
 ఎదురుచూడలేదు.
 ?: ఆర్టిస్టుగా స్థిరపడడానికి కారణమైన సీరియల్
 అమ్మమ్మ డాట్ కామ్,
 లయ, అభిషేకం.
 ?: ఏయే అవార్డులు తీసుకున్నారు
 ‘అభిషేకం’లో నటనకు వంశీ, ఉగాది, ఆరాధన అవార్డులు, ‘చిన్నకోడలు’లో నటనకు మా టీవీ, జెమినీ టీవీ, ఈటీవీ అవార్డులు అందుకున్నా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement