
లవ్లీ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయిన అందాల భామ శాన్వీ శ్రీవాస్తవ. తొలి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న శాన్వీ తరువాత ఆ సక్సెస్ ట్రాక్ ను కొనసాగించలేకపోయింది. దీంతో సాండల్ వుడ్ మీద దృష్టి పెట్టి అక్కడ వరుస అవకాశాలు సొంతం చేసుకుంది. తమిళంలోనూ అదృష్టాన్ని పరీక్షించుకున్నా.. అక్కడ కూడా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు.
అయితే కన్నడలో మంచి ఫాంలో ఉన్న ఈ భామ ఇప్పుడో క్రేజీ ప్రాజెక్ట్ లో నటిస్తోంది. ఓ ప్రాంతీయ భాషల్లో హీరోయిన్ గా నటిస్తున్న ఈ భామ ఏకంగా చైనీస్ వెబ్ సిరీస్ లో యువరాణి పాత్రకు ఎంపికైంది. ది డార్క్ లార్డ్ పేరుతో తెరకెక్కుతున్న చైనీస్ వెబ్ సిరీస్ లో భారతీయ యువరాణిగా కనిపించనుంది శాన్వీ. ఇటీవల జరిగిన ఈ షో షూటింగ్ కు సంబంధించిన ఫొటోలను తన సోషల్ మీడియాలో పేజ్ లో పోస్ట్ చేసింది శాన్వీ. ఈ ఫొటోలలో శాన్వీ లుక్ కు సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది.
One more beautiful experience in my bag☺️ “the dark lord”.playing an indian princess in china was quite an experience ☺️☺️ #chineseseries pic.twitter.com/wzjgWqGREN
— shanvi srivastava (@shanvisrivastav) 4 October 2017
Comments
Please login to add a commentAdd a comment