రాహుల్ వ్యాఖ్యల్లో అజ్ఞానం కనిపిస్తోంది : జైట్లీ
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తప్పుబట్టారు. రాహుల్ వ్యాఖ్యలు ప్రేరేపించేవిగా ఉన్నాయని, ఫెయిర్ అండ్ లవ్లీ యోజన అంటూ ప్రభుత్వ పథకాలను రాహుల్ విమర్శించడంలో సమన్వయం కనిపించడం లేదని ఆరోపించారు. ఇటువంటి వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా సమంజసం కాదన్నారు.
నల్లధనాన్ని తెల్లగా మార్చేందుకు ఎన్డీఏ ప్రభుత్వం ఫెయిర్ అండ్ లవ్లీ పథకాన్ని ప్రారంభించింది అంటూ రాహుల్ ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్ వ్యాఖ్యలకు స్పందించిన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ... అటువంటి వ్యాఖ్యలు వ్యక్తుల్లోని అజ్ఞానాన్ని తెలియజేస్తాయని అన్నారు.
'ఫెయిర్ అండ్ లవ్లీ యోజన్' అంటూ రాహుల్ వాడిన పదబంధం రాజకీయ నాయకులు మాట్లాడే పద్ధతిలో లేదని, ఇది జాతి అభిప్రాయం అంటూ అరుణ్ జైట్లీ లోక్ సభ బడ్జెట్ చర్చ జరుగుతున్న సమయంలో పేర్కొన్నారు.