Jaitley
-
లక్ష్యాన్ని అధిగమించిన డిజిన్వెస్ట్‌మెంట్: జైట్లీ
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల విక్రయం (డిజిన్వెస్ట్‌మెంట్) ద్వారా నిర్దేశించుకున్న నిధుల సమీకరణ లక్ష్యాన్ని అధిగమించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. ఈసారి డిజిన్వెస్ట్‌మెంట్ నిధుల సమీకరణ రూ. 85,000 కోట్లకు చేరిందని, ఇది నిర్దేశిత లక్ష్యానికన్నా రూ. 5,000 కోట్లు అధికమని మైక్రోబ్లాగింగ్ సైటు ట్విట్టర్లో ఆయన పేర్కొన్నారు. ‘ఈ ఆర్థిక సంవత్సరంలో డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా రూ. 80,000 కోట్లు సమీకరించాలని నిర్దేశించుకున్నాం. నిధుల సమీకరణ ప్రస్తుతం లక్ష్యాన్ని అధిగమించి రూ. 85,000 కోట్లకు చేరింది‘ అని ఆయన పేర్కొన్నారు. అయిదో విడత సీపీఎస్ఈ ఈటీఎఫ్ ద్వారా కేంద్రం రూ. 9,500 కోట్లు సమీకరించగా, ఆర్ఈసీ–పీఎఫ్సీ డీల్‌తో మరో రూ. 14,500 కోట్లు వచ్చాయి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ. 90,000 కోట్ల డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించుకుంది. -
బడ్జెట్ ‘హల్వా’ రెడీ..!
న్యూఢిల్లీ: సాంప్రదాయకంగా వస్తున్న ‘హల్వా’ తీపి రుచులతో 2019 కేంద్ర బడ్జెట్ పత్రాల ముద్రణా కార్యక్రమం ప్రారంభమైంది. న్యూఢిల్లీలోని నార్త్‌బ్లాక్‌లో సోమవారంనాడు ఈ మేరకు జరిగిన ఒక కార్యక్రమంలో ‘బడ్జెట్ హల్వా’ రుచి చూడడానికి కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రులు శివ్ ప్రతాప్ శుక్లా, పొన్ రాధాకృష్ణన్, ఆర్థికశాఖ ఇతర సీనియర్ అధికారులు హాజరయ్యారు. ఫైనాన్స్ సెక్రటరీ ఏఎన్ ఝా, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాశ్ చంద్ర గార్గ్, రెవెన్యూ కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే, డీఐపీఏఎం కార్యదర్శి ఏ చక్రవర్తి, ఆర్థిక సేవల కార్యదర్శి రాజీవ్ కుమార్‌లు కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ అధికారుల్లో ఉన్నారు. వైద్య పరీక్షల నిమిత్తం అమెరికా వెళ్లిన ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ ఈ కార్యక్రమానికి హాజరుకాలేకపోయారు. ఎన్డీఏ ప్రభుత్వం ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంటులో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. 2019లో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో... కేంద్రం ఓట్–ఆన్–అకౌంట్‌ను ప్రవేశపెట్టనున్న సంగతి తెలిసిందే. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2019–2020) పూర్తి స్థాయి బడ్జెట్‌ను ఎన్నికల అనంతరం కేంద్రంలో కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. బయటి ప్రపంచంతో సంబంధాలు కట్... కీలక హల్యా కార్యక్రమం అనంతరం బడ్జెట్ ముద్రణ ప్రక్రియతో సంబంధమున్న ముఖ్య అధికారులు అందరికీ... ‘ఆర్థికమంత్రి పార్లమెంటులో బడ్జెట్‌ను సమర్పించేంతవరకూ’ బాహ్య ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోతాయి. ఈ కార్యక్రమం అనంతరం మంత్రులు, అతికొద్ది మంది ఉన్నత స్థాయి ఆర్థిక శాఖ అధికారులకు మాత్రమే ఇళ్లకు వెళ్లడానికి అనుమతి ఉంటుంది. మిగిలినవారికి కనీసం వారి ఆప్తులతో సైతం ఫోనులోగానీ, ఈ–మెయిల్‌తోగానీ మరే రకంగానూ మాట్లాడ్డానికి వీలుండదు. నార్త్ బ్లాక్ హౌసెస్‌లోని ప్రత్యేక బడ్జెట్ ప్రెస్‌లో ఈ కీలక పత్రాల ముద్రణ జరుగుతుంది. అంత గోప్యత ఎందుకు? ఎంతో పకడ్బందీగా తయారయ్యే బడ్జెట్ గనక ముందే బయటకు తెలిసిపోతే... బడ్జెట్‌ను కొన్ని వర్గాలు ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి... బడ్జెట్ తయారీని అత్యంత గోప్యంగా ఉంచుతారు. ఒక దేశానికి ఎంత పటిష్ట స్థాయిలో రక్షణ ఉంటుందో... బడ్జెట్ తయారీ అయ్యే ముద్రణ విషయంలో కూడా అంతే స్థాయి నిఘా ఉంటుంది. అత్యాధునిక పర్యవేక్షణ పరికరాలు, పటిష్టమైన సైనిక భద్రత, ఆధునిక నిఘా పరికరాలు, జామర్లు, పెద్ద స్కానర్లు... ఇలా అనేక పరికరాల్ని ఏర్పాటు చేస్తారు. ఆర్థికమంత్రి పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టే వరకూ ఈ భద్రత కొనసాగుతూనే ఉంటుంది. వీటితో పాటు ఈ బడ్జెట్ ప్రక్రియ కొనసాగినంత కాలం నార్త్‌బ్లాక్‌లో ఉండే ఆర్థికశాఖ కార్యాలయం నుంచి, ఆ బ్లాక్ కింద ఉండే బడ్జెట్ ముద్రణా విభాగం నుంచి వెళ్లే ఫోన్లను అన్నింటినీ ట్యాప్ చేసేందుకు ఒక ప్రత్యేక ఎక్సే్ఛంజీని ఏర్పాటు చేస్తారు. అంతేకాక మొబైల్ ఆపరేటర్ల సమన్వయంతో ఇక్కడి నుంచి వెళ్లే ప్రతి కాల్‌ను ట్యాప్ చేస్తారు. అలాగే ఆర్థికశాఖ కార్యాలయ వరండాలలో ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు పనిచేయకుండా ప్రత్యేక పరికరాలు ఏర్పాటు చేస్తారు. మధ్య మధ్యలో ‘మాక్ డ్రిల్’ పద్ధతిలో కొంతమంది ఉద్దేశపూర్వకంగా కొన్ని పత్రాలు బయటకు తెచ్చేందుకు ప్రయత్నిస్తారు. వీరినిసమర్థంగా పట్టుకోగలిగితే భద్రత చక్కగా ఉన్నట్లే. లేకుంటే భద్రత సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవు. ఇక బడ్జెట్‌రోజున వాటి ప్రతుల్ని భారీ బందోబస్తు మధ్య పార్లమెంటు భవనానికి తరలిస్తారు. అనంతరం ఆర్థికమంత్రి సార్వత్రిక బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెడతారు. -
ఐటీ.. వైద్యం.. ఇంటి రుణం
ఈయన పేరు ఎండీ అజీమ్.. హయత్‌నగర్ ఎంపీడీవో ఆఫీసులో సూపరింటెండెంట్.. పెరుగుతున్న నిత్యావసర ఖర్చులు.. పిల్లల చదువులు.. ఇంటి అద్దె.. అన్నీ లెక్కేసుకుంటే వచ్చే జీతం వాటికే సరిపోతోంది..! వీటికితోడు వార్షికాదాయంపై పన్ను విధిస్తుండటంతో అజీమ్ దిగులు చెందుతున్నాడు. ఇది ఒక్క ఆయన బాధనే కాదు.. సగటు జీతభత్యాలను అందుకునే చిన్న ఉద్యోగులందరిదీ ఇదే సమస్య. అందుకే కేంద్ర బడ్జెట్ ఈసారైనా తమకు న్యాయం చేస్తుందేమోనని ఎదురుచూస్తున్నారు. ప్రధానంగా ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని పెంచాలని కోరుతున్నారు. ప్రస్తుతం రూ.2.5 లక్షల వరకు ఆదాయానికి పన్ను మినహాయింపు ఉంది. అదనంగా మరో రూ.1.5 లక్షల సేవింగ్స్‌పై పన్ను లేదు. మొత్తం రూ.4 లక్షల ఆదాయం దాటితే 20 శాతం పన్ను అమలవుతోంది. అందుకే ఈసారి బడ్జెట్లో ఆదాయ పన్ను పరిమితిని కనీసం రూ.5 లక్షలకు పెంచాలని ఉద్యోగులు కోరుతున్నారు. సెక్షన్ 80(ఇ) కింద రూ.1.5 లక్షల సేవింగ్స్‌కు ఉన్న మినహాయింపును కనీసం రూ.3 లక్షలకు పెంచితే ఎక్కువ మందికి లాభం చేకూరుతుందని అంటున్నారు. ‘పిల్లల చదువులకు విద్యా రుణాలను వందశాతం ఇవ్వాలి. ప్రస్తుతం పిల్లలను ఉన్నత చదువులు చదివించాలంటే ఆషామాషీగా లేదు. ఇంజనీరింగ్ చదివించాలంటే ఏడాది జీతం చెల్లించినా సరిపోవడం లేదు’అని సగటు ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అలాగే తనతోపాటు తన కుటుంబీకులకు వైద్య ఆరోగ్య ఖర్చులపై ఆదాయపు పన్ను మినహాయింపును ఉద్యోగులు ఆశిస్తున్నారు. వీటన్నింటికీ మించి సగటు, మధ్య తరగతి ఉద్యోగులందరూ సొంతింటి కలను సాకారం చేసుకోవాలనుకుంటారు. అందుకే గృహరుణాలను మరింత సులభతరం చేయాల్సిన అవసరం ఉంది. ‘గృహరుణాలపై వడ్డీ రేటును తగ్గించాలి. ప్రస్తుతం ఉద్యోగి వేతనంపై దాదాపు ఇరవై రెట్ల వరకు బ్యాంకులు గృహ రుణాలు మంజూరు చేస్తున్నాయి. ఈ రుణ పరిమితిని పెంచాలి. ఆస్తి విలువకు తగినట్లు గరిష్ట రుణం మంజూరు చేసేలా సడలింపు ఇవ్వాలి. ఉద్యోగుల గృహ రుణాలపై వడ్డీ రేటు బ్యాంకుల్లో కనిష్టంగా 8.5 శాతం ఉంది. ఈ వడ్డీ రేటు తగ్గిస్తే సొంతింటి కల నెరవేరుతుంది’అని ఉద్యోగులు అంటున్నారు. మరి వారి ఆశలను జైట్లీ నెరవేరుస్తారా?.. -
అరకొర సంస్కరణలు
రాజకీయ పార్టీలకు ఎన్నికలలో ఖర్చు నిమిత్తం విరాళాలు ఇచ్చే పద్ధతిలో మార్పు తేవలసిన అవసరం ఉన్నదని ప్రధాని నరేంద్రమోదీ, ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ పలు సందర్భాలలో ఉద్ఘాటించారు. నిరుడు కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనలను పార్లమెం టులో సమర్పించిన సందర్భంలో ఆర్థిక మంత్రి కొన్ని సూచనలు సైతం చేశారు. నగదు విరాళాలు రూ. 2,000 నుంచి రూ. 20,000లకు మించరాదనే నిబంధన విధించాలని ప్రతిపాదించారు. ఎలక్టొరల్ బాండ్లు జారీ చేసే విధానం ప్రవేశపెట్టా లని అనుకున్నట్టు కూడా చెప్పారు. ప్రస్తుతం రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారా నికి చేస్తున్న ఖర్చుపైన ఎటువంటి పరిమితి లేదు. ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్థి చేసే ఖర్చుపైన మాత్రం పరిమితి ఉంది. విరాళాలన్నీ నగదు రూపంలోనే రాజకీయ పార్టీలు స్వీకరిస్తున్నాయి. దాతల పేర్లు గుట్టుగానే ఉంచుతున్నాయి. పాలకులు రూపొందించే విధానాలను గమనిస్తే ఏ కార్పొరేట్ సంస్థ అధికార పార్టీకి అధికంగా విరాళం ఇచ్చిందో ఊహించుకోవడం కష్టం కాదు. కానీ ఆ విధానాన్ని చట్ట ప్రకారం ప్రశ్నించే అవకాశం లేదు. ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని సవరించడం ద్వారా కొన్ని సంస్కరణలను ప్రవేశపెట్టినట్లయితే విరాళాల విషయంలో పారదర్శకత ఎంతో కొంత పెరిగే అవకాశం ఉంటుందనడంలో సందేహం లేదు. ఏదైన వ్యవస్థను సంస్కరించే సమయంలో లోపాలు లేకుండా, తప్పుకునే అవకాశాలు లేకుండా పకడ్బందీగా చేయాలి. ఇప్పటి కంటే కొంత మెరుగైన విధానం ప్రవేశపెట్టాలని తలపోస్తున్నారే తప్ప ఆదర్శవంతమైన పక్కా విధానం రూపొందించే ప్రయత్నం జరగడం లేదు. జైట్లీ ప్రతిపాదిస్తున్న సంస్కరణల ప్రకారం 1934 నాటి రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్‌ను సవరించి ఎలక్టొర ల్బాండ్స్ జారీకి అవకాశం కల్పిస్తారు. కడచిన ఎన్నికలలో ఒక శాతం కంటే ఎక్కువ ఓట్లు సంపాదించిన పార్టీకి ఎలక్టొరల్బాండ్ ద్వారా విరాళాలు స్వీకరించే అర్హత ఉంటుంది. కొర్పొరేట్ సంస్థలు ఈ బాండ్లను ప్రతి సంవత్సరం జనవరి, ఏప్రిల్, జులై, అక్టోబర్ మాసాలలో ప్రతి మాసంలోనూ పది రోజుల పాటు కొను గోలు చేయవచ్చు. ప్రతి రాజకీయ పార్టీ ఒక బ్యాంకు అకౌంట్ వివరాలను ఎన్నికల కమిషన్‌కు తెలియజేయాలి. ఆ ఖాతాలో దాత ఇచ్చే ఎలక్టొరల్బాండ్ను సొమ్ము చేసుకోవచ్చు. ఇందుకు 15 రోజుల గడువు ఉంటుంది. స్వీకర్త పేరు బ్యాంకులో నమోదు అవుతుంది. దాత పేరు కూడా బ్యాంకుకు తెలుస్తుంది. ఇతరులకు మాత్రం తెలియదు. ఈ సంస్కరణలో ఉన్న ఇబ్బంది ఏమంటే ఎవరు ఎవరికి ఎంత విరాళం ఇస్తున్నారో బ్యాంకులకు, వాటి ద్వారా ప్రభుత్వానికి తెలిసే అవకాశం ఉంటుంది. మరో రకంగా చెప్పాలంటే ప్రతిపక్షాలకు ఏ కార్పొరేట్ సంస్థ ఎంత విరాళం ఇస్తున్నదో తెలుసుకునే అవకాశం అధికార పార్టీకి ఉంటుంది. అధికార పార్టీకి ఏ సంస్థ ఎంత విరాళం ఇస్తున్నదో తెలుసుకునే వీలు ప్రతిపక్షాలకు ఉండదు. అధికార పార్టీ తెలుసుకునే అవకాశం ఉన్నదనే ఎరుకే కార్పొరేట్ సంస్థలను ప్రతి పక్షాలకు దూరంగా ఉంచుతుంది. అధికార పార్టీకి వచ్చే విరాళాల కంటే ప్రతి పక్షాలకు చాలా తక్కువ వచ్చే అవకాశం ఉంది. మార్చి 9న పార్లమెంటు బడ్జెట్ సమావేశం ద్వితీయార్థం ఆరంభం అవుతుంది. అప్పుడు ఆర్థిక బిల్లుపైన చర్చ జరిగే క్రమంలో ఈ అంశాలు పరిశీలనకు వస్తాయి. అన్ని పక్షాలు అన్ని కోణాలనూ సాకల్యంగా పరిశీలించి ఎన్నికలలో ధన ప్రభావాన్ని తగ్గించేందుకు చర్యలు తీసు కుంటే ప్రజాస్వామ్యం బలపడుతుంది. సాధారణ పౌరులు సైతం ఎన్నికల బరిలో నిలబడి గెలిచే అవకాశం ఉంటుంది. ఎన్నికల సంస్కరణలపైన సుదీర్ఘమైన అధ్య యనం చేసిన దినేశ్ గోస్వామి కమిటీ, ఇంద్రజిత్‌గుప్తా కమిటీ సిఫార్సులను అమలు చేసే ప్రయత్నం ఎన్డీఏ సర్కార్ చేయడం లేదు. అభ్యర్థుల ఎన్నికల ఖర్చును ప్రభుత్వమే భరించాలని ఈ రెండు కమిటీలూ సిఫార్సు చేశాయి. అభ్యర్థులకు లేదా పార్టీలకూ ఉన్న ప్రజాదరణ ప్రకారం ఎన్నికల ఖర్చు కింద ఎంత మొత్తం ఇవ్వవచ్చునో నిర్ణయించేందుకు ఒక సూత్రాన్ని రూపొందించడం కష్టం కాదు. కార్పొరేట్ సంస్థలు సామాజిక బాధ్యత (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) కింద ఎన్నికల విరాళాలను ప్రభుత్వానికి అందజేయాలి. ఆ విధంగా జమ అయిన మొత్తానికి ప్రభుత్వ నిధులు జోడించి అభ్యర్థులకు ఎన్నికల ఖర్చుల కింద నిర్ణీత నిధిని అందించాలి. ఈ పద్ధతి జర్మనీలో అమలు చేస్తున్నారు. జైట్లీ ప్రతిపాదించినవి అరకొర సంస్కరణలు. అవి సైతం నిజాయితీగా అమలు జరుగుతాయన్న భరోసా ప్రజలకు లేదు. అధికార, ప్రతిపక్షాలకు ఈ విష యంలో చిత్తశుద్ధి లేదని అనేక సందర్భాలలో రుజువైంది. విదేశాల నుంచి విరాళాల సేకరణకు సంబంధించిన (ఫారిన్ కంట్రిబ్యూషన్స్ రెగ్యులేషన్)యాక్ట్‌ను ఉల్లం ఘించి బీజేపీ, కాంగ్రెస్‌లు బ్రిటన్‌కు చెందిన వేదాంత కార్పొరేషన్ నుంచి 2014 ఎన్నికలలో భారీ విరాళం అందుకున్నాయి. లోగడ కూడా రూ. 20,000కు మించి ఎన్నికల విరాళం ఇచ్చినట్లయితే ఎన్నికల కమిషన్‌కు తెలియజేయాలనే నిబంధన 1951 నాటి ప్రజాప్రాతినిధ్య చట్టంలోని 29 (సి) సెక్షన్లో ఉంది. ఎవరైనా లక్ష రూపాయల నగదు విరాళంగా ఇస్తే ఆ మొత్తానికి ఆరు రసీదులు ఇచ్చి ప్రతి రసీ దులోనూ రూ. 20 వేల కంటే తక్కువ మొత్తం ముట్టినట్టు బొంకుతారు. సంస్క రణలు చేయడం, చట్టాలను సవరించడం, కొత్త చట్టాలు చేయడంతో సరిపోదు. వాటిని మనస్ఫూర్తిగా అమలు జరపాలి. ఫిరాయింపుల నిరోధక చట్టం ఎంత దివ్యంగా అమలు జరుగుతోందో చూస్తూనే ఉన్నాం. అరుణాచల్‌ప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్ వరకూ ఈ చట్టాన్ని అన్ని పార్టీలూ కనికరం లేకుండా కుళ్ళ బొడు స్తుంటే అడిగే నాథుడు లేడు. చట్టాన్ని ఎవరు ఉల్లంఘించినా నిష్కర్షగా శిక్షించే వ్యవస్థ లేనంత వరకూ రాజకీయ పార్టీలు బుద్ధిగా వ్యవహరించవు. ‘మీ కంటే మేము పవిత్రులం’ అంటూ అతిశయానికి పోకుండా ఎన్నికలలో నల్లధనం పాత్రను అరికట్టేందుకు అన్ని పార్టీలూ, అందరు నాయకులూ కలసిరావాలంటూ నిరుడు ప్రధాని మోదీ పిలుపు ఇచ్చారు. ప్రధాని సహా రాజకీయ నేతలందరూ ఈ వాక్కును శిరసావహించి ఎన్నికలలో ధన ప్రభావాన్ని తగ్గించగలిగితే చరితార్థుల వుతారు. -
మీ ప్రసంగం ఒక ప్రహసనం
సాక్షి, న్యూఢిల్లీ : భారతీయ జనతాపార్టీపై కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తన ట్విటర్ వార్‌ను కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా.. ఆర్థిక వృద్ధిరేటుపై ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ చేసిన ప్రకటనపై రాహుల్ గాంధీ ట్విటర్లో స్పందించారు. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ.. చెప్పిన ఆర్థిక వృద్ధిరేటు ఒక ప్రహసనంలా ఉందని ఆయన ట్వీట్ చేశారు. ఆర్థిక వృద్ధిరేటుపై ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ చేసిన ప్రకటనను రాహుల్ గాంధీ కొట్టిపారేశారు. అంతేకాక గత మూడేళ్ల కాలంలో కేవలం జీడీపీ సగటు కేవలం 7.5గా ఉందని ఆయన చెప్పారు. అదేవిధంగా జీడీపీపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో రికార్డులను కలిపి ఆయన ట్వీట్ చేశారు. Dear Mr. Jaitley, May the Farce be with you. pic.twitter.com/Dxb5jFCaEa — Office of RG (@OfficeOfRG) October 25, 2017 -
నేటి నుంచే జీఎస్టీ సమావేశాలు
రేపు హైదరాబాద్‌కు జైట్లీ సాక్షి, హైదరాబాద్: వస్తుసేవల పన్ను (జీఎస్టీ) కౌన్సిల్ సమావేశాల్లో భాగంగా శుక్రవారం నుంచే హైదరాబాద్‌లో అధికారిక సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సమావేశ ఎజెండాపై చర్చించేందుకు గాను అన్ని రాష్ట్రాల వాణిజ్య పన్నుల శాఖ ముఖ్య కార్యదర్శులు శుక్రవారం మధ్యాహ్నం నోవాటెల్ హోటల్లో సమావేశం కానున్నారు. శనివారం కౌన్సిల్ సమావేశంలో చర్చించేందుకు నిర్ధారించిన ఎజెండాను మరోసారి పరిశీలించి అవసరమైన మార్పులు, చేర్పులు చేయనున్నారు. కాగా, కౌన్సిల్ చైర్మన్, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ పర్యటన కూడా ఖరారైంది. శనివారం ఉదయం జైట్లీ హైదరాబాద్‌కు రానున్నారు. సమావేశానంతరం ఆయన రాత్రి తాజ్ఫలక్నుమాలో ఏర్పాటు చేసిన విందులో పాల్గొని, అక్కడి నుంచి ఢిల్లీ తిరిగి వెళ్లనున్నట్టు సమాచారం. -
కుట్లు అల్లికలు చవక
► జౌళి రంగ జాబ్‌వర్క్‌పై జీఎస్టీ 5 శాతం ► ట్రాక్టర్ విడి భాగాలపై 18 శాతం న్యూఢిల్లీ: జౌళి రంగ జాబ్‌వర్క్(కుట్లు, అల్లికలు, నేత పని), ట్రాక్టర్ విడిభాగాలపై వస్తు, సేవల పన్ను(జీఎస్టీ)ని తగ్గించారు. రవాణాకు ముందు ఆన్లైన్లో వస్తువుల ముందస్తు నమోదుకు సంబంధించి ఈ–వే బిల్లు నిబంధనలను సరళీకరించారు. ఆర్థిక మంత్రి జైట్లీ నేతృత్వంలో శనివారం ఇక్కడ జరిగిన జీఎస్టీ మండలి సమావేశంలో ఈమేరకు నిర్ణయించారు. అన్ని జౌళి ఉత్పత్తులకు చెందిన జాబ్‌వర్క్‌పై పన్నును 5 శాతానికి కుదించారు. ఎంబ్రాయిడరీ నుంచి కుట్టుపని వరకు అన్నీ ఈ పన్ను పరిధిలోకి వస్తాయి .వస్త్రాలు, శాలువాలు, తివాచీలకు ఈ రేటునే అనువర్తింపచేస్తారు. వ్యవసాయ పరికరాల ధరలు తగ్గించేందుకు ట్రాక్టర్ విడి భాగాలు కొన్నింటిపై పన్ను రేటును 18 శాతానికి తగ్గించారు. జీఎస్టీ కింద ప్రభుత్వ పని కాంట్రాక్టులకు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను ఇస్తూ 12 శాతం పన్ను విధించారు. వస్తువులను అమ్మడానికి ముందు ఆన్లైన్లో నమోదుచేసుకోవడానికి ఉద్దేశించిన ఈ–వే బిల్లుకు జీఎస్టీ మండలి ఆమోద ముద్ర వేసింది. పన్ను మినహాయింపు పొందిన వస్తువులు ఈ–వే బిల్లుకు ఆవలే ఉంటాయి. ఈ విధానం అక్టోబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చే అవకాశముంది. హౌస్‌కీపింగ్ సేవలందించే సంస్థలు రివర్స్ చార్జ్ మెకానిజం కింద జీఎస్టీ చెల్లించాలి. క్యాబ్ సంస్థలు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్‌తో అయితే 12 శాతం , అది లేకుండా 5 శాతం పన్ను కట్టాలి. -
జైట్లీ ఉద్యోగాలెక్కడ?: కాంగ్రెస్
న్యూఢిల్లీ: జీఎస్టీ అమలుతో భారీగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నకేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీని ఉద్యోగాలెక్కడ? అని ప్రశ్నిస్తూ కాంగ్రెస్ ఓ బహిరంగ లేఖ రాసింది. నోట్లరద్దు వంటి సర్జికల్ దాడితో పేద ప్రజలను ఆర్థికంగా దెబ్బతీశారని విమర్శించింది. ఆర్థిక సంక్షోభాన్ని ప్రభుత్వం ఎలా గట్టెక్కిస్తుందో సమాధానం చెప్పాలని జైట్లీని ప్రశ్నించింది. నోట్ల రద్దుతో కార్మిక శాఖ లెక్కల ప్రకారం దేశంలో 1.6 కోట్ల మంది నిరుద్యోగులుగా మారారని లేఖలో ప్రస్తావించింది. 15 లక్షల మంది వరకు ప్రత్యక్షంగా ఉపాధి కోల్పోయారని పేర్కొంది. మీ ప్రభుత్వం అనాలోచితంగా తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం పేదరికాన్ని మరింత పెంచిందని దుయ్యబట్టింది. నిరుద్యోగులకు సంబంధించి సర్వేలు ఎందుకు చేయడంలేదని ప్రశ్నించింది. నోట్ల రద్దుతో ఉత్పాదక రంగంలో 9 ఏళ్లు వెనకబడ్డామని, ఎగుమతులు క్షీణించాయని , వడ్డీ రేట్లు బాగా పెరిగాయని తెలిపింది. కానీ పెట్టుబడులు మాత్రం పెరగడం లేదని ఎద్దేవ చేసింది. నిర్మాణ రంగంలో వృద్ధిలేక వేల ఉద్యోగాలు కోల్పోయామని పేర్కొంది. కరువుతో వ్యవసాయ రంగం కుదేలైందని, రైతులకు రుణాలివ్వడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించింది. నోట్ల రద్దు, జీఎస్టీ అమలుతో అసంఘటిత రంగంలో చాల మంది యువత ఉపాధి కోల్పోయారని వెల్లడించింది. దీంతో యువత గ్రామాలకు తిరిగి వెళ్లి పనుల్లేక నానా కష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. కార్మిక శక్తిలో మహిళల భాగస్వామ్యం కూడా తగ్గుతుందని పేర్కొంది. దేశ వ్యాప్తంగా అమలు చేయాలనుకున్న కనీస వేతం కూడా అమలు కావడం లేదని, వ్యాపార ఖర్చులు పెరగడంతో చాల ఉద్యోగాలు కోల్పోవల్సి వచ్చిందని విమర్శించింది. పేద రాష్ట్రాల్లో ఖర్చులు పెరిగి కార్మికులకు జీతాలు ఇవ్వలేక పరిశ్రమలు మూత బడుతున్నాయని ఆరోపించింది. -
రెండువేల నోట్లను రద్దుచేస్తారా?
► రాజ్యసభలో విపక్షాల ప్రశ్న ► స్పందించని ఆర్థిక మంత్రి జైట్లీ ► ఉభయసభల్లో ప్రతిపక్షాల ఆందోళన న్యూఢిల్లీ: పెద్దనోట్ల రద్దు తర్వాత కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన రూ.2వేల నోట్లను రద్దుచేస్తారా అని విపక్షం రాజ్యసభలో ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనిపై ప్రభుత్వం వెంటనే సమాధానమివ్వాలని డిమాండ్ చేసింది. రాజ్యసభలో జీరో అవర్ సందర్భంగా సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ నరేశ్ అగర్వాల్ ‘ప్రభుత్వం రూ.2వేల నోట్లను రద్దుచేయాలని నిర్ణయించింది. ఈ నోట్ల ముద్రణను ఆపేయాలని రిజర్వ్ బ్యాంకు ఆదేశించింది. దీనిపై విధానమైన నిర్ణయమేదైనా తీసుకుంటే ఈ పార్లమెంటు సమావేశాలు ముగిసే లోగా సభలో వెల్లడించాలి. రెండోసారి నోట్ల రద్దు చేపట్టాలన్న ఆలోచన ఉందా?’ అని ప్రశ్నించారు. దీనిపై కాంగ్రెస్ పక్షనేత ఆజాద్ జోక్యం చేసుకుని ప్రభుత్వం వెంటనే బదులివ్వాలని డిమాండ్ చేశారు. ‘రూ.వెయ్యి నాణేలను తెచ్చే ఆలోచన ఉందా?’ అని ప్రశ్నించారు. అయితే దీనిపై జైట్లీ స్పందించలేదు. మౌనంగానే ఉన్నారు. దీంతో మరో సారి నోట్లరద్దు జరగొచ్చని.. జైట్లీ మౌనం దీనికి నిదర్శనమని విపక్ష సభ్యులు అన్నారు. జైట్లీ వర్సెస్ విపక్షాలు బుధవారం రాజ్యసభ ప్రారంభం కాగానే.. బీజేపీ కావాలనే గాంధీ, నెహ్రూ, ఇందిరలను తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేస్తోందని, దీనిపై చర్చ జరగాలని కాంగ్రెస్ ఎంపీ ఆనంద్ శర్మ వాయిదా తీర్మానాన్నిచ్చారు. దీన్ని డిప్యూటీ చైర్మన్ కురియన్ ఆమోదించా రు. ఈ దశలో జోక్యం చేసుకున్న రాజ్యసభ నాయకుడు, కేంద్ర మంత్రి జైట్లీ.. ‘విపక్షాలు వాయిదా తీర్మానాలను దుర్వినియోగం చేస్తున్నాయి. టీవీ చానెళ్లలో ప్రచారం కోసమే వీటిని వాడుకుంటున్నాయి’ అని విమర్శించారు. సంఝౌతా ఎక్స్‌ప్రెస్ కేసుపై చర్చించాలంటూ బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి ఇచ్చిన పాయింట్ ఆఫ్ ఆర్డర్‌తోపాటుగా ఇతర సభ్యులిచ్చిన వాయిదా తీర్మానాలను చర్చించాలని జైట్లీ పట్టుబట్టారు. ‘ప్రచారం’ వ్యాఖ్యలపై భగ్గుమన్న విపక్షాలు జైట్లీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ వెల్‌లోకి దూసుకొచ్చాయి. దీంతో సభ పలుమార్లు వాయిదా పడింది. అటు, ఆరుగురు కాంగ్రెస్ సభ్యులపై సస్పెన్షన్ ఎత్తేయాలం టూ లోక్‌సభలో విపక్షాలు నిరసన వ్యక్తం చేశాయి. ఇది కొనసాగుతుండగానే.. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (సవరణ) బిల్లు– 2017 ఆమోదం పొందింది. -
అదృశ్య నిధులే నడిపిస్తున్నాయ్
♦ 70 ఏళ్లుగా వీటిని నియంత్రించడంలో విఫలమయ్యాం: జైట్లీ ♦ ఎలక్టోరల్ బాండ్ల యంత్రాంగం దిశగా చర్యలు న్యూఢిల్లీ: రాజకీయ పార్టీలకు అందే నిధులకు సంబంధించి ఎలక్టోరల్ బాండ్ ల అమలు కోసం ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని ఆర్థిక మంత్రి జైట్లీ చెప్పారు. పార్టీలకు అందే నిధులు పారదర్శకంగా ఉండటానికి ఉద్దేశించిన ఈ విధానానికి సంబంధించి రాజకీయ పార్టీల నుంచి ఒక్క ప్రతిపాదనా రాలేదన్నారు. గత 70 ఏళ్లుగా దేశ ప్రజాస్వా మ్యాన్ని అదృశ్య నిధులే నడిపిస్తు న్నాయని, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వా లు, రాజకీయ పార్టీలు, ఎన్నికల కమిషన్ వీటిని నియంత్రించడంలో విఫలమయ్యా యని అన్నారు. రాజకీయ పార్టీల కు వచ్చే విరాళాలకు సంబంధించి పారదర్శకతను తీసుకొచ్చేందుకు ఈ ఏడాది బడ్జెట్లో ప్రతిపాదనలు చేసిన జైట్లీ.. పార్టీలకు వచ్చే నగదు విరాళాలను రూ.2 వేలకు పరిమితం చేయడమే కాక ఎలక్టోరల్ బాండ్లను ప్రవేశపెట్టారు. ప్రస్తుత విధానమే నచ్చిందేమో.. శనివారం ఢిల్లీ ఎకనామిక్స్ కాంక్లేవ్‌లో జైట్లీ మాట్లాడుతూ..‘నిధులకు సంబంధించి మెరుగైన ప్రతిపాదనలు ఇవ్వాల్సిందిగా.. పార్టీలకు మౌఖికంగా.. రాతపూర్వకంగా కోరాను. ఇప్పటి వరకూ ఎవరూ ఒక్క ప్రతి పాదనతో ముందుకు రాలేదు. ఎందు కంటే ప్రస్తుతం ఉన్న వ్యవస్థతో వీరంతా సంతృ ప్తిగా ఉన్నట్టున్నారు’’అని అన్నారు. రాజకీ య వ్యవస్థలోకి వస్తున్న అదృశ్య నిధులకు అడ్డుకట్ట వేయలేకపోయామని, సంబంధించి ప్రతీ ప్రతిపాదనలో ఏదో లోపం ఉండటంతో ఈ రోజుకూ పరిష్కా రం దొరకలేదన్నారు. గత బడ్జెట్లో తాను ఒక పరిష్కారాన్ని ప్రతిపాదించానని, ఈ దిశగా ప్రస్తుతం చర్యలు తీసుకుంటు మన్నారు. ఏమిటీ ఎలక్టోరల్ బాండ్లు.. బడ్జెట్లో ప్రకటించిన ప్రకారం.. ప్రతిపాది త ఎలక్టోరల్ బాండ్లు వడ్డీ చెల్లించే రుణ పత్రాలుగా కాక.. ఒక ప్రామిసరీ నోటుగా ఉంటాయి. వీటిని అధీకృత బ్యాంకులు అమ్ముతాయి. వచ్చిన నిధులను సంబం ధిత రాజకీయ పార్టీలకు చెందిన ఖాతాల్లో నిర్దేశిత కాలానికి డిపాజిట్ చేస్తాయి. ఈ బాండ్లపై దాత పేరు ఉండదు. బ్యాంకుల ద్వారా నిధులు రావడం వల్ల పన్ను చెల్లిం చిన నగదు మాత్రమే రాజకీయ వ్యవస్థలోకి వస్తుంది. జీఎస్టీతో పన్ను పరిధి విస్తృతం పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ అమలులోకి రావ డంతో పన్నుల పరిధి విస్తృతమైందని, వీటి వల్ల నగదు లావాదేవీలు చేయడం కష్టంగా మారుతోందన్నారు. ఇది పన్నుల వ్యవస్థ పరిధిని పెంచడానికి.. పన్ను చెల్లిం పులను ప్రోత్సహించడానికి దోహదం చేస్తుందని చెప్పారు. విదేశీ బ్యాంకుల్లో ఉన్న నల్లధనంతో పాటు దేశంలోని వివిధ బ్యాంకుల్లోని నల్లధనాన్ని వెలికి తీసేం దుకు చట్టాల ను కఠినతరం చేశామని, డొల్ల కంపెనీలపైనా కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దేశంలో పన్ను చెల్లించవలసిన వారిలో అత్యధికులు ఆ పని చేయడం లేదని, వ్యవస్థకు బయటే భారీగా నగదు చలామణి అవుతోందని వివరించారు. ఆర్థిక బిల్లు ద్వారా కొన్ని మార్పులను ప్రకటిస్తున్నా.. వాటి ప్రభా వం స్వల్పంగా ఉంటోందన్నారు. -
కట్టేది వారైతే మీకెందుకు బాధ?
జీఎస్టీపై వర్తకుల ఆందోళన అర్థరహితం: జైట్లీ న్యూఢిల్లీ: జీఎస్టీ పన్నును అంతిమంగా వినియోగదారులు చెల్లిస్తుంటే కొందరు వర్తకులు ఎందుకు ఆందోళన చేస్తున్నారని ఆర్థిక మంత్రి జైట్లీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అందరికీ ఆమోదయోగ్యమైన పన్ను రేట్ల అమలు వల్లే జీఎస్టీపై వినియోగదారులు ఎలాంటి ఫిర్యాదు చేయడం లేదన్నారు. శనివారం ఒక కార్యక్రమంలో జైట్లీ ప్రసంగిస్తూ.. పన్ను చెల్లించకపోవడాన్ని ప్రాథమిక హక్కుగా ఈ దేశంలో ఎవరూ పేర్కొనలేరని చెప్పారు. ‘అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ నుంచి అభివృద్ధి చెందిన వ్యవస్థకు దేశం రూపాంతరం చెందాలంటే మన ఆలోచనా తీరు, విధానం మారాల’న్నారు. ప్రభుత్వం తీసుకున్న కొన్ని కఠిన నిర్ణయాలు ఆర్థిక వ్యవస్థపై నమ్మకాన్ని పెంచడంలో సాయపడ్డాయని పేర్కొన్నారు. ఒకటి లేదా రెండంచెల పన్ను విధానం అమలు చేయాలన్న విజ్ఞప్తుల్ని జైట్లీ తిరస్కరిస్తూ.. భవిష్యత్తులో చేసే అవకాశముందని, 12, 18 శాతం పన్నుల్ని ఒకే కేటగిరిలోకి తేవచ్చని చెప్పారు. జీఎస్టీ సమష్టి నిర్ణయమని, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు దానికి మద్దతిచ్చాయని చెప్పారు. ఎలక్టోరల్ బాండ్స్ వ్యవస్థ వల్లే రాజకీయాల్లో అవినీతి కొనసాగుతోందని జైట్లీ అభిప్రాయపడ్డారు. పార్టీలకు ఎన్నికల నిధుల విషయంలో పారదర్శక విధానం లేదని, ఆ దిశగా సంస్కరణలు చేపట్టడం దేశం ముందున్న పెద్ద సవాలన్నారు. ఎలక్టోరల్ బాండ్లపై స్పష్టమైన విధానం రూపొందిస్తామని, పన్ను చెల్లించిన డబ్బే రాజకీయ వ్యవస్థలోకి వచ్చేలా చర్యలు చేపడతామని జైట్లీ చెప్పారు. -
రుణాల జారీని వేగవంతం చేయాలి
ఆసియా అభివృద్ధి బ్యాంకును కోరిన జైట్లీ యోకోహమ: రుణాల ఆమోదం, జారీ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని ఆసియా అభివృద్ధి బ్యాంకు(ఏడీబీ)ను క్రేందం కోరింది. ఆసియా ప్రాంతంలోని వర్ధమాన దేశాలు మౌలిక సదుపాయాలు, సామాజిక రంగాలపై నిధులను వెచ్చించాల్సిన అవసరం దృష్ట్యా రుణాల ఆమోదానికి ప్రస్తుతం తీసుకుంటున్న సమయాన్ని కుదించాలని విజ్ఞప్తి చేసింది. జపాన్‌లోని యోకోహమ నగరంలో జరిగిన ఏడీబీ గవర్నర్ల బోర్డు సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ మాట్లాడుతూ... దక్షిణాసియా దేశాలకు ప్రాంతీయ కేంద్రాన్ని ఢిల్లీలో ఏర్పాటు చేయాలని కోరారు. దాంతో రుణాలకు సంబంధించిన ప్రతిపాదనల పరిశీలనను వేగంగా నిర్వహించవచ్చని సూచించారు. ఏడీబీ కార్యకలాపాలు, వనరుల ప్రణాళిక విషయంలో వర్ధమాన దేశాల అభిప్రాయాలకు ప్రాముఖ్యం ఇవ్వాలని కోరారు. ఏడీబీ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈ కార్యక్రమం ఇప్పటి వరకు సాధించిన విజయాలు, ఇంకా నెరవేర్చాల్సి ఉన్న మరిన్ని అవసరాలపై ఆలోచనకు అవకాశం కల్పించిందన్నారు. ‘‘ఆసియా పసిఫిక్ ప్రాంతం నుంచి పేదరికాన్ని పారదోలడమే ఏడీబీ ఎంచుకున్న లక్ష్యం. ఇంధనం, పట్టణాభివృద్ధి, రవాణా రంగాలతో పాటు అందుబాటు ధరలకే పునరుత్పాదక ఇంధనంపైనా మనం దృష్టి సారించాల్సి ఉంది’’ అని జైట్లీ సూచించారు. ఈ సమావేశంలో భాగంగా ఏడీబీ ప్రెసిడెంట్ టకెహికో నకావోతోనూ జైట్లీ పలు అంశాలపై చర్చలు జరిపారు. భారత్‌లో తయారీ కేంద్రాలకు పిలుపు జపాన్ పర్యటనలో ఉన్న జైట్లీ ఆ దేశ ఆర్థిక మంత్రి టారో అసోతో సమావేశమై పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కేంద్రం ప్రతిష్టాతక్మంగా భావిస్తున్న భారత్‌లో తయారీ కార్యక్రమం గురించి చేపడుతున్న చర్యల్ని వివరించారు. భారత్‌లో మెట్రో రైల్ ప్రాజెక్టుల కోసం రోలింగ్ స్టాక్ తయారీ కేంద్రాల ఏర్పాటుకు ముందుకు రావాలని జపాన్ కంపెనీలకు పిలుపునిచ్చారు. రెండు దేశాల మధ్య ఆర్థిక సహకారం విషయంలో మరింత కలసి పనిచేయాలని ఇరు దేశాలూ నిర్ణయించినట్టు సమావేశం అనంతరం విడుదలైన ప్రకటనలో పేర్కొన్నారు. -
హెచ్1బీపై చర్చ
అమెరికా వాణిజ్య మంత్రి వద్ద ప్రస్తావించిన జైట్లీ వాషింగ్టన్: భారత ఐటీ రంగానికి షాకిచ్చిన హెచ్1బీ వీసా అంశాన్ని అమెరికా వాణిజ్య మంత్రి విల్బర్ రోస్ వద్ద ఆర్థిక మంత్రి జైట్లీ ప్రస్తావించారు. వీసాల అంశానికి సంబంధించి భారతీయుల ఆందోళనల గురించి అమెరికా దృష్టికి తీసుకెళ్లారు. అమెరికా అర్థిక వ్యవస్థ దూసుకెళ్లడానికి భారత నిఫుణులు చేసిన సేవలు ఎంతగానో ఉపయోగపడ్డాయని జైట్లీ గుర్తుచేశారు. ట్రంప్ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత రెండు దేశాల మ«ధ్య కేబినెట్ స్థాయి చర్చల కోసం జైట్లీ అమెరికాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా అమెరికా వాణిజ్య మంత్రిని జైట్లీ కలిశారు. అమెరికా అభివృద్ధికి భారత నిపుణులు ఎంతగానో తోడ్పాటును అందించారని, ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని అమెరికా అధికార యంత్రాంగం తదుపరి నిర్ణయాలు తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దీనిపై రోజ్ స్పందిస్తూ.. హెచ్1బీ వీసాల విధానంపై సమీక్ష ప్రక్రియ మొదలైందని, వీటిపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. చర్చల సందర్భంగా దేశంలో చేపట్టిన ఆర్థిక సంస్కరణలపై రోస్కు జైట్లీ వివరించారు. -
‘చిన్న హోటళ్లకు జీఎస్టీ వద్దు’
సాక్షి, న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) అమలు వల్ల చిన్న హోటళ్లపై భారం పడకుండా చూడాలని ఆర్థిక మంత్రి జైట్లీని దక్షిణాది హోటళ్ల సమాఖ్య కోరింది. తెలంగాణలో 30 వేలు, ఏపీలో 40 వేలు వరకు చిన్న, మధ్యతరహా హోటళ్లు ఉన్నాయని, 80 శాతం మంది ప్రజలు వీటినే ఆశ్రయిస్తుంటారని పేర్కొంది. స్టార్ గుర్తింపు లేని హోటళ్లకు పన్ను ఐదు శాతం మించకుండా చూడాలని మంత్రికి విజ్ఞప్తి చేసినట్లు తెలంగాణ రాష్ట్ర హోటళ్ల సంఘం అధ్యక్షుడు వెంకట రెడ్డి చెప్పారు. -
నోట్లరద్దు నిర్ణయం దారుణం
రాజ్యసభలో ప్రభుత్వంపై చిదంబరం తీవ్ర విమర్శలు న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్ నిరాశపరిచిందని మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ ఎంపీ చిదంబరం రాజ్యసభలో ధ్వజమెత్తారు. 2017–18 బడ్జెట్‌పై మాట్లాడుతూ.. మోదీ నోట్లరద్దు నిర్ణయం అత్యంత దారుణమైనదని అభివర్ణించారు. ఈ నిర్ణయం వల్ల అవినీతి, నల్లధనం తగ్గకపోగా దేశ ప్రజలపై ప్రతికూల ప్రభావం చూపిందని మండిపడ్డారు. ‘తడబాటు, గందరగోళం, తలాతోకాలేని విధానం’తో ప్రభుత్వం నడుస్తోందని విమర్శించారు. ‘ఎన్ ఎస్ఎస్ఓ లెక్కల ప్రకారం దేశంలో 40 కోట్ల మంది రోజూవారీ కూలీలున్నారు. మీ నిర్ణయంతో వీరి జీవితాలు అగమ్యగోచరంగా మారాయి’ అని విమర్శించారు. అటు లోక్‌సభలో యూపీఏ ప్రభుత్వం తీసుకున్న విధానాల ద్వారా జరిగిన నష్టాలను జైట్లీ ఎండగట్టారు. -
అభ్యర్థులకు ప్రభుత్వ నిధులు అసాధ్యం
న్యూఢిల్లీ: ఎన్నికల్లో పోటీ చేసేవారికి ప్రభుత్వమే నిధులు సమకూర్చడం సాధ్యం కాదని ఆర్థిక మంత్రి జైట్లీ చెప్పారు. దేశంలో ఉన్న పరిస్థితులకు ఆ విధానం సాధ్యం కాదని గురువారం లోక్‌సభలో చర్చలో అన్నారు. ఎన్నికల సంఘం సూచనల మేరకే రాజకీయ పార్టీలకు నగదు రూపంలో ఇచ్చే విరాళాల పరిమితిని రూ. 20 వేల రూ. 2 వేలకు తగ్గించామని వెల్లడిం చారు. దీనిని మెరుగ్గా అమలు చేసేందుకు సూచనలు చేస్తే స్వాగతిస్తామన్నారు. ప్రజలు పార్టీలకు ఇచ్చే విరాళాలను చట్టబద్ధం చేయడానికి కృషి చేస్తున్నామన్నారు. చెక్కుల ద్వారా చెల్లింపులు చేస్తే విరాళాలు ఇచ్చిన వారు, తీసుకున్న వారు పన్నుతో వచ్చిన లాభాన్ని పొందుతారని అన్నారు. -
ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు: జైట్లీ
న్యూఢిల్లీ : విజయ్ మాల్యా వ్యవహారంలో ఎన్డీయే ప్రభుత్వం, ప్రతిపక్షం కాంగ్రెస్ తీవ్రస్థాయిల్లో ఆరోపణలు గుప్పించుకుంటున్నాయి. మాల్యాకు లబ్ది మీరు చేకూర్చారంటే, మీరే రుణాలు ఇచ్చారంటూ వాదించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం లోక్ సభలో జరిగిన చర్చా కార్యక్రమంలో మోదీ ప్రభుత్వం విజయమాల్యాకు ఒక్క రూపాయి లబ్ది కూడా చేకూర్చలేదని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ స్పష్టంచేశారు. యూపీఏ పాలనలోనే నార్త్ బ్లాక్ జోక్యంతో వ్యాపారస్తులకు భారీగా రుణాలు మంజూరు చేశారని ఆరోపించారు. లోక్‌సభలో జరిగిన చర్చ కార్యక్రమంలో రుణాల విషయాలపై అరుణ్ జైట్లీ ఘాటుగా సమాధానాలిచ్చారు. గత ప్రభుత్వమే బ్యాంకుల్లో స్థూల నిరర్థక ఆస్తులకు భారీగా మినహాయింపులు ఇచ్చిందని మండిపడ్డారు. అడ్డుఅదుపు లేకుండా విచక్షణా రహితంగా కొంతమంది వ్యక్తులకు, పారిశ్రామిక వేత్తలకు రుణాలు మంజూరు చేసిందని చెప్పారు. ఎన్పీఏలకు మూల కారణం గత యూపీఏ ప్రభుత్వమేనని ఆరోపించారు. వారి దుశ్చర్యలకు తాము భరించాల్సి వస్తుందని వాపోయారు. ప్రస్తుత ప్రభుత్వం విజయ్‌మాల్యాకు రూ.1,200 కోట్ల లబ్ది చేకూర్చిందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించిన సంగతి తెలిసిందే. రాహుల్ గాంధీ ఆరోపణలపై స్పందించిన జైట్లీ, 2016 మేలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మోదీ ప్రభుత్వం ఒక్క రూపాయి లబ్ది కూడా మాల్యాకు అందించలేదని స్పష్టీకరించారు. 2016 సెప్టెంబర్ నాటికి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఎన్పీఏలు రూ.6,30,323 కోట్లగా ఉన్నాయి. -
ఆర్బీఐ, సెబీలతో మంత్రి మంతనాలు
రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా, మార్కెట్ రెగ్యులేటరీ సెబీతో ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ భేటీ కాబోతున్నారు. ఫిబ్రవరి 11న ఇరు బోర్డులతో జైట్లీ భేటీ కాబోతున్నట్టు అధికార వర్గాలు చెప్పాయి. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన 2017-18 కేంద్ర బడ్జెట్లో తీసుకొచ్చిన వివిధ ఆర్థిక రంగ సంస్కరణలపై జైట్లీ వారితో చర్చించనున్నారు. అదేవిధంగా 2018 మార్చిలోపల ద్రవ్యలోటును జీడీపీలో 3.2 శాతానికి తగ్గించాలనే విషయంపై కూడా బోర్డు సభ్యుల ముందు చర్చకు రానుంది. స్టాక్ ఎక్స్చేంజ్లో ఆస్తి పునర్ నిర్మాణ కంపెనీలు జారీచేసిన సెక్యురిటీ రశీదులను లిస్టింగ్‌కు అనుమతివ్వాలనే ప్రతిపాదనపై కూడా బోర్డుల నిర్ణయం తీసుకోనున్నారు. వచ్చే ఏడాదిలో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోకి రూ.10వేల కోట్ల నగదును చొప్పించాలని ఆర్థికమంత్రి ప్రతిపాదించారు. అవసరమైతే మరింత పెంచుతామన్నారు. బ్రోకరేజ్ సంస్థలు, మ్యూచువల్ ఫండ్స్, పోర్ట్‌ఫోలియో మేనేజర్లు, ఇతర మార్కెట్ మధ్యవర్తిత్వల రిజిస్ట్రేషన్‌కు కాగితరహిత ఆన్లైన్ మెకానిజంను మంత్రి ప్రకటించారు. ఆధార్‌తో డీమ్యాట్ అకౌంట్ల లింక్‌ను కూడా తీసుకొచ్చారు. ఈ విషయాలన్నింటిపైన బోర్డులతో మంత్రి చర్చించనున్నారు. -
బడ్జెట్ కోసమే అలా చేశారు!
► ఎంపీ మృతిపై పార్లమెంటరీ కమిటీ విచారణకు విపక్షాల డిమాండ్ ► ముందే అహ్మద్ చనిపోయినట్లు సమాచారం ఉందన్న ఆజాద్ ► లోక్‌సభలో ‘పాతనోట్లుంటే శిక్ష–జరిమానా’ బిల్లు న్యూఢిల్లీ: లోక్‌సభ సమావేశాలు శుక్రవారం గందరగోళంగా మారాయి. గుండెపోటుతో మాజీ మంత్రి, ఐఎంయూఎల్ చీఫ్, ఎంపీ ఈ అహ్మద్ మృతిచెందిన విషయంలో ప్రభుత్వం తీరు సరిగా లేదని, బడ్జెట్ కొనసాగించేందుకే వైద్యులతో తప్పుడు ప్రకటనలు చెప్పించారంటూ విపక్షాలు మండిపడ్డాయి. అటు రోజ్‌వాలీ చిట్‌ఫండ్ స్కాంలో తమ ఎంపీలను అరెస్టు చేయటంతోపాటు సీబీఐని దుర్వినియోగం చేస్తున్నారని తృణమూల్ తీవ్రంగా విరుచుకుపడింది. దీంతో విపక్ష సభ్యుల ఆందోళనల మధ్య సభ వాయిదా పడింది. శుక్రవారం ఉదయం సభ ప్రారంభం కాగానే.. తృణమూల్ సభ్యులు వెల్‌లోకి దూసుకొచ్చారు. కేంద్రం తమ ఎంపీలపై సీబీఐ ద్వారా ఒత్తిడి పెంచుతోందని నినాదాలు చేశారు. ‘సీబీఐ ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మలా మారింది. రాజకీయ అవసరాల కోసం కేంద్రం సీబీఐని వినియోగించుకుంటోంది’ అని తృణమూల్ ఎంపీలు విమర్శించారు. దీంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. తిరిగి సభ ప్రారంభమైన వెంటనే ఎంపీ, ఐఎంయూఎల్ అధ్యక్షుడు అహ్మద్‌కు సరైన చికిత్స అందలేదని.. ఆయన మృతిపై కూడా ప్రభుత్వ స్పందన సరిగా లేదని కేరళ ఎంపీలు పార్టీలకు అతీతంగా డిమాండ్ చేశారు. వెల్‌లోకి వచ్చి నినాదాలు చేశారు. ఈ గొడవ మధ్యే.. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చకు స్పీకర్ ఆదేశించారు. కేంద్ర మంత్రి మహేశ్ శర్మ చర్చను ప్రారంభిస్తుండగానే మళ్లీ సభలో గందరగోళం నెలకొంది. రెండుసార్లు వాయిదా పడినా పరిస్థితిలో మార్పు లేకపోవటంతో.. స్పీకర్ సుమిత్ర మహాజన్ లోక్‌సభను సోమవారానికి వాయిదా వేశారు. లోక్‌సభ ముందు ‘పాతనోట్లుంటే శిక్ష’ బిల్లు నవంబర్8 నిర్ణయంతో రద్దుచేసిన పాతనోట్లను దాచుకున్నా, బదిలీ చేసినా, తీసుకున్నా క్రిమినల్ చర్యలతోపాటు రూ.10వేల జరిమానా విధించే బిల్లును ప్రభుత్వం శుక్రవారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. కాగా ఈ బిల్లు అనైతికం, దేశ వ్యతిరేకమని తృణమూల్ కాంగ్రెస్ నేత సుగత రాయ్ తీవ్రంగా విమర్శించారు. దీనిపై జైట్లీ కూడా ఘాటుగానే స్పందించారు. ఏ ప్రాతిపదికన తృణమూల్ దీన్ని వ్యతిరేకిస్తుందో చెప్పాలన్నారు. అయితే.. ఈ బిల్లు లోక్‌సభ నిబంధనలకు విరుద్ధమని జైట్లీ లోక్‌సభ సభ్యుడు కానందున ఆయనకు నిబంధనలేమీ తెలియవని సుగత రాయ్ అన్నారు. ఈ వ్యాఖ్యలపై అధికార పక్షం అభ్యంతరం వ్యక్తం చేసింది. 70వేల మంది చిన్నారులకు మధుమేహం 2015లో భారతదేశంలో 70వేలకు పైగా చిన్నారులు మధుమేహం బారిన పడ్డారని ప్రభుత్వం లోక్‌సభలో వెల్లడించింది. అటు, ఉగ్రవాదానికి సహకరించే దేశాలపై కఠినంగా వ్యవహరించాలని ఆ దేశాలతో వాణిజ్య, ఆర్థిక సంబంధాలు పూర్తిగా తెంచుకోవాలని రాజ్యసభ ఎంపీ ఒకరు ఓ ప్రైవేటు మెంబర్ బిల్లును ప్రవేశపెట్టారు. దీనికి కాంగ్రెస్ సభ్యుడు రాపోలు ఆనంద భాస్కర్ మద్దతు తెలిపారు. ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్‌గా పరిగణించాలంటూనే.. ‘56 అంగుళాల ఛాతీ ఎక్కడికెళ్లింది’ అని విమర్శించారు. ప్రభుత్వానికి ముందే తెలుసు! జనవరి 31న రాష్ట్రపతి ప్రసంగం జరుగుతుండగా సెంట్రల్ హాల్లోనే ఎంపీ అహ్మద్ కుప్పకూలిపోయారు. ఫిబ్రవరి 1న ఆయన కన్నుమూశారని ఆసుపత్రి వర్గాలు చెప్పాయి. ఫిబ్రవరి 1న బడ్జెట్ సమావేశాలున్నందున.. సమావేశాలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఆయన ముందురోజే చనిపోయినా ఇంకా బతికే ఉన్నాడనే సందేశాన్ని ఆసుపత్రి వర్గాలు విడుదల చేశాయని ఖర్గే ఆరోపించారు. అహ్మద్ కూతురు, అల్లుడికి ఆసుపత్రి లోపలకు అనుమతించలేదన్నారు. ఆసుపత్రికి తీసుకెళ్లేటప్పటికే అతను మృతిచెందినట్లు కొందరు డాక్టర్లు తనతో చెప్పారని ఆజాద్ అన్నారు. -
జైట్లీకి ఎఫ్ఆర్బీఎం నివేదిక
న్యూఢిల్లీ: మరికొద్ది రోజుల్లో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఆర్థిక క్రమశిక్షణ.. బడ్జెట్ నిర్వహణ (ఎఫ్ఆర్బీఎం) చట్ట సవరణలపై ఎన్కే సింగ్ కమిటీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి నివేదిక సమర్పించింది. దీన్ని పరిశీలించిన మీదట ప్రభుత్వం తగు చర్యలు తీసుకోగలదని ఆర్థిక శాఖ తెలిపింది. మొత్తం నాలుగు వాల్యూమ్స్‌గా నివేదికను అందించినట్లు సింగ్ తెలిపారు. మొదటిదానిలో ద్రవ్య విధానం, మార్గదర్శ ప్రణాళిక మొదలైనవి ఉన్నాయి. రెండో దానిలో అంతర్జాతీయ అనుభవాలు, మూడో వాల్యూమ్‌లో కేంద్రం–రాష్ట్రాల సంబంధిత ఆర్థిక అంశాలను ప్రస్తావించినట్లు సింగ్ పేర్కొన్నారు. నాలుగోదానిలో ద్రవ్య విధానంపై దేశ, విదేశ నిపుణుల అభిప్రాయాలు మొదలైన అంశాలు ఉన్నట్లు వివరించారు. ఎఫ్ఆర్బీఎం చట్టంలో సవరణలు సూచించేందుకు 2016 మేలో మాజీ రెవెన్యూ కార్యదర్శి సింగ్ సారథ్యంలో కేంద్రం అయిదుగురు సభ్యుల కమిటీని వేసింది. ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్, ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి సుమీత్ బోస్, ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యన్, ఎన్ఐపీఎఫ్పీ డైరెక్టర్ రథిన్ రాయ్ ఇందులో ఉన్నారు. తమ వంతుగా నివేదిక సమర్పించడం పూర్తయ్యిందని, దాన్ని బహిర్గతం చేయాలా లేదా అన్నది ప్రభుత్వం చేతుల్లో ఉందని సింగ్ పేర్కొన్నారు. -
మరిన్ని రూ. 500 నోట్లు వస్తున్నాయ్!
-
మరిన్ని రూ. 500 నోట్లు వస్తున్నాయ్!
న్యూఢిల్లీ: పెద్దనోట్ల రద్దు తర్వాత భారీ ప్రయోజనాలు ఇపుడు కనిపిస్తున్నామని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ గురువారం ప్రకటించారు. రీమానిటైజేషన్ ప్రక్రియం వేగం పుంజుకుందనీ రిజర్వ్ బ్యాంకు దగ్గర పెద్ద మొత్తంలో కరెన్సీ అందుబాటులో ఉందనీ పేర్కొన్నారు. ముఖ్యంగా రూ.500 నోట్ల చెలామణి పెరిగిందనీ, మరిన్ని నోట్లను అందుబాటులోకి తేనున్నామని ఆర్థికమంత్రి ప్రకటించారు. డిమానిటైజేషన్ తర్వాత దేశంలో అశాంతి అలజడికి సంబంధించి ఒక్క సంఘటన కూడా నమోదు కాలేదని జైట్లీ స్పష్టం చేశారు. విమర్శకుల అంచనాలను తలదన్ని అన్ని రంగాలు అభివృద్ధిని సాధించాయాటూ ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టారు. ఈ మేరకు బ్యాంకుల్లో గుర్తించదగిన ప్రభావం ఇప్పటికే కనిపిందని జైట్లీ చెప్పారు. అన్ని విభాగాలలో పరోక్ష పన్నుల వసూలు గణనీయంగా పెరిగిందన్నారు. డిసెంబర్ 19 నాటికి డైరెక్ట్ టాక్స్ 14.4 శాతం, కేంద్ర పరోక్ష పన్నులు వరకు 26.2 శాతం, కేంద్ర వాణిజ్య పన్ను 43.3 శాతం పెరుగుదలను నమోదు చేసినట్టు చెప్పారు. అలాగే గత సంవత్సరంతో పోలిస్తే రబీ విత్తనాలు 6.3 శాతం పెరిగినట్టు ఆర్థిక మంత్రి చెప్పారు. -
కరెన్సీ కొరత నిజమే..కానీ..
న్యూఢిల్లీ: పెద్దనోట్ల రద్దుతో దేశంలో నెలకొన్న నగుదు కొరత సంక్షోభంపై ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పందించారు. కరెన్సీ కొరత ఉందని ఒప్పుకున్నారు. కానీ పెద్దనోట్ల రద్దుపై ప్రభుత్వ నిర్ణయం సరైందేనని, పరివర్తన సమయంలో కొంత పెయిన్ తప్పదని చెప్పుకొచ్చారు. పెట్రోలియం మరియు సహజవాయువు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలో డిశెంబర్ 5-7 తేదీల్లో నిర్వహించిన పెట్రోటెక్ 2016 సమావేశంలోఆర్థిక మంత్రి ప్రసంగించారు. నవంబర్ 8న ప్రభుత్వం ప్రకటించిన డీమానిటైజేషన్ నిర్ణయాన్ని పూర్తిగా సమర్ధించారు. పెద్ద నోట్ల రద్దు లాంటి సంచలన నిర్ణయం తర్వాత కరెన్సీ నోట్ల కొరత నెలకొందని ఆయన అంగీకరించారు నగదు కొరత ఉన్నట్టుగా కొంతమంది భావిస్తున్నారు, కానీ డిజిటల్ వైపు అడుగులు వేస్తున్న క్రమంలో ఈ కొరత తప్పదన్నారు. దీన్ని అధిగమించేందుకు ప్రతి రోజు కేంద్ర బ్యాంకు ఆర్ బీఐ కొంత కరెన్సీ కొంత మొత్తాన్ని విడుదల చేస్తోందని వివరించారు. మీడియా సహా మిగతా అన్ని వర్గాల నుంచి తీవ్ర విమర్శలు ఉన్నప్పటికీ, చివరికి మంచి ఫలితాలు రానున్నాయని చెప్పారు. స్వల్పకాలికంగా కొన్ని ఇబ్బందులున్నప్పటికీ దీర్ఘకాల ప్రయోజనాలు సమకూరనున్నాయని జైట్లీ పేర్కొన్నారు. బ్యాంకుల్లో నగదు నిల్వలు పెరగడం ఆర్థిక వృద్దిగా దన్నుగా నిలుస్తుందన్నారు. లావాదేవీల్లో పారదర్శకత మూలంగా పన్నుల వ్యవస్థ బలోపేతమవుతుందన్నారు. తద్వారా తక్కువ వడ్డీకే రుణాలు అందుబాటులోకి రానున్నాయని ఆయన తెలిపారు. ఈ మొత్తం ప్రక్రియను ప్రభుత్వం క్రమంగా సమీక్షిస్తోందని తెలిపారు. ఈ విషయంలో బ్యాంకులు సక్రమమైన లావాదేవీల సులభతరం కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయని భరోసా ఇచ్చారు.అలాగే ఇటీవలి సంవత్సరాలలో డిజిటల్ చెల్లింపులకోసం బ్యాంకింగ్ టెక్నాలజీ అభివృద్ధి, మొబైల్ బ్యాంకింగ్ లాంటి వినూత్న సాంకేతిక సేవల ద్వారా ప్రతీ చిన్నలావాదేవీని సులభంగా నిర్వహిచడానికి వీలవుతోందని జైట్లీ చెప్పారు. -
మీరిస్తే ఫిఫ్టీ.. ఫిఫ్టీ, మేం పట్టుకుంటే..
-
మీరిస్తే ఫిఫ్టీ.. ఫిఫ్టీ
మేం పట్టుకుంటే..85% డిపాజిట్లలో లెక్కతేలని సొమ్ముపై సర్కారు కన్ను ♦ స్వచ్ఛందంగా వెల్లడిస్తే పన్ను 50 శాతమే ♦ మిగిలిన 50 శాతంలో 25 శాతం వెనక్కి తీసుకోవచ్చు ♦ మరో 25 శాతంపై నాలుగేళ్ల లాకిన్.. వడ్డీ ఉండదు ♦ దాన్ని పేదరిక నిర్మూలనకు ఉపయోగిస్తామన్న ప్రభుత్వం ♦ ప్రధానమంత్రి గరీబీ కల్యాణ్ యోజన పేరుతో కొత్త పథకం ♦ స్వచ్ఛంద వెల్లడికి గడువు డిసెంబర్ 30 ♦ వెల్లడించకుండా అధికారుల సోదాల్లో దొరికితే 85% పన్ను ♦ ఆదాయ పన్ను చట్టంలో సవరణలకు పార్లమెంటులో బిల్లు ♦ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ న్యూఢిల్లీ పెద్ద నోట్లను రద్దు చేసి దేశ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న మోదీ సర్కారు కన్ను ఇప్పుడు బ్యాంకు డిపాజిట్లపై పడింది. నోట్ల రద్దు తర్వాత బ్యాంకు ఖాతాల్లో వెల్లువలా వచ్చిపడుతున్న సొమ్ములో నల్లధనాన్ని బయటికి లాగేందుకు కఠిన చర్యలు ప్రకటించింది. స్వచ్ఛందంగా నల్లధనాన్ని వెల్లడించడానికంటూ మరో అవకాశమిచ్చింది. ఇందుకోసం ఆదాయ పన్ను(ఐటీ) చట్టంలో సవరణలు చేస్తూ సోమవారం ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంటులో బిల్లును ప్రవేశ పెట్టారు. దీని ప్రకారం పెద్దనోట్లు రద్దయిన తర్వాత నుంచి బ్యాంకుల్లో చేస్తున్న డిపాజిట్లలో.. ఆదాయ వివరాలను వెల్లడించని మొత్తాన్ని ప్రజలు డిసెంబర్ 30లోగా స్వచ్ఛందంగా ప్రకటిస్తే... దానిపై 50 శాతం వరకూ పన్ను (జరిమానా, సర్‌చార్జీతో కలిపి) చెల్లించి బయటపడొచ్చని కేంద్రం ప్రకటించింది. దీంతోపాటు ఈ లెక్కచెప్పని ఆదాయంలో 25 శాతాన్ని ప్రభుత్వం వద్ద డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. దీన్ని నాలుగేళ్లపాటు వెనక్కి తీసుకోవడానికి వీలుండదు (లాకిన్). ఈ వ్యవధికిగాను కేంద్రం ఎలాంటి వడ్డీ కూడా చెల్లించదు. మిగిలిన 25 శాతం మొత్తాన్ని వెనక్కి తీసుకోవచ్చు. ఇక వివరాలు వెల్లడించని మొత్తాలను ఐటీ శాఖ గనుక తన సోదాలు, పరిశీలనలో పట్టుకుంటే దానిపై ఏకంగా 85 శాతం వరకూ పన్ను(జరిమానా, సర్‌చార్జితో కలిపి) కట్టాల్సి ఉంటుంది. ఇప్పటిదాకా రూ.8 లక్షల కోట్ల జమ నల్లధనంపై యుద్ధాన్ని ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ.. రూ.500, 1,000 నోట్లను రద్దు చేస్తూ(డీమోనిటైజేషన్) ఈ నెల 8 రాత్రి నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రజలు తమ వద్దనున్న పాత పెద్ద నోట్లను బ్యాంకుల్లో రూ.4 వేల చొప్పున మార్చుకోవడానికి మొదట డిసెంబర్ 31 వరకు గడువిచ్చిన సర్కారు (ఆర్బీఐలో మార్చుకోవడానికి మార్చి చివరిదాకా) ఆ తర్వాత దాన్ని ఈ నెల 24తో నిలిపివేసింది. అయితే ప్రజలు తమ వద్దనున్న పెద్దనోట్లను బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేసుకోవడానికి మాత్రం డిసెంబర్ 31 వరకు గడువిచ్చింది. కాగా డీమోనిటైజేషన్ తర్వాత ఇప్పటివరకూ బ్యాంకుల్లో దాదాపు రూ.8 లక్షల కోట్లు జమైనట్లు అంచనా. పన్ను మీద పన్ను... జరిమానా! బ్యాంకుల్లో జమవుతున్న డిపాజిట్లలో (రూ.500; రూ.1,000 నోట్ల రూపంలో) నల్లధనాన్ని (ఆదాయ వివరాలు వెల్లడించని మొత్తం) స్వచ్ఛందగా వెల్లడించేలా ప్రభుత్వం ఐటీ చట్టాల సవరణ బిల్లులో ప్రతిపాదించింది. దీనికోసం ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన(పీఎంజీకేవై)–2016 పేరుతో ఒక కొత్త పథకాన్ని ప్రకటించింది. ఈ స్కీమ్ కింద డిపాజిట్లలో నల్లధనాన్ని ప్రకటించినవారికి ఆదాయ వివరాల లెక్కచెప్పని మొత్తంపై 30 శాతం పన్ను విధిస్తారు. ఈ 30 శాతం పన్నుపై 33 శాతాన్ని పీఎంజీకే సెస్సు రూపంలో వసూలు చేస్తారు. ఇది మరో 10 శాతం పన్ను కింద లెక్క. అదనంగా మరో 10 శాతాన్ని జరిమానాగా కూడా చెల్లించాల్సి వస్తుంది. అంటే లెక్కచూపని మొత్తంపై 50 శాతం పన్ను చెల్లించాల్సి వస్తుంది. పీఎంజీఎస్‌కే స్కీమ్ ఇదీ... డీమోనిటైజేషన్ తర్వాత డిపాజిట్ చేస్తున్న సొమ్ములో నల్లధనం ఉన్నవారు దాన్ని స్వచ్ఛందంగా వెల్లడించిన పక్షంలో అందులో 25 శాతాన్ని పీఎంజీఎస్‌కే స్కీమ్‌లో తప్పనిసరిగా జమ చేయాల్సి ఉంటుంది. ఈ సొమ్ముపై నాలుగేళ్ల లాకిన్ వ్యవధిని విధిస్తారు. అంటే నాలుగేళ్లపాటు వెనక్కి తీసుకునే వీలుండదు. అదేవిధంగా ఈ పథకంలో జమ చేసిన మొత్తంపై ఈ నాలుగేళ్లలో ప్రభుత్వం వడ్డీని కూడా చెల్లించదు. రిజర్వ్ బ్యాంక్‌తో సంప్రదింపుల అనంతరం ప్రభుత్వం ఈ స్కీమ్‌ను నోటిఫై చేయనుంది. ఈ స్కీమ్ ద్వారా వచ్చిన మొత్తాన్ని పేదరిక నిర్మూలన, మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టుల కోసం వెచ్చించనున్నట్లు బిల్లులో పేర్కొన్నారు. అంటే.. సాగునీరు, ఇళ్లు, మరుగుదొడ్ల నిర్మాణం, ప్రాథమిక విద్య, ప్రాథమిక ఆరోగ్యం ఇతరత్రా ప్రాజెక్టులపై ఖర్చు చేయనున్నట్లు తెలిపింది. సొమ్ము ఎక్కడ్నుంచి వచ్చిందో చెప్పక్కర్లేదు: అధియా పీఎంజీకేవై స్కీమ్ వర్తింపు ఈ నెల 10 నుంచి జమ అయిన డాపాజిట్లకే వర్తిస్తుందని కేంద్ర రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్ అధియా పేర్కొన్నారు. చివరి తేదీని బిల్లు ఆమోదం పొందిన తర్వాత నోటిఫై చేయనున్నామని... దాదాపు డిసెంబర్ 30 వరకూ అవకాశం ఉండొచ్చని ఆయన చెప్పారు. ఫైనాన్స్ చట్టం–2016లో కొత్తగా చాప్టర్ 9 కింద పీఎంజీఎస్కేను చేర్చినట్లు వివరించారు. ‘పీఎంజీకేవై స్కీమ్ కింద వెల్లడించిన ఆదాయ వివరాలకు సంబంధించి ఖాతాలో డిపాజిట్ అయిన సొమ్ము ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాల్సిన పనిలేదు. ఈ వివరాలు చెప్పాల్సిందిగా ఐటీ శాఖ ప్రశ్నించదు. సంపద పన్ను, సివిల్ చట్టాలు, ఇతరత్రా పన్ను చట్టాల నుంచి దీనికి రక్షణ ఉంటుంది. అయితే ఫెమా, పీఎంఎల్ఏ, నార్కోటిక్స్, బ్లాక్‌మనీ చట్టాల నుంచి మాత్రం దీనికి ఎలాంటి రక్షణ ఉండదు’ అని అధియా వివరించారు. ఐటీ శాఖ పట్టుకుంటే గుల్లే... డిపాజిట్లలో బ్లాక్ మనీ ఉండి.. దాన్ని గనక ఐటీ శాఖ పట్టుకుంటే పన్ను, జరిమానా భారీగా విధించేలా ఐటీ చట్టాల్లో సవరణలను కేంద్రం ప్రతిపాదించింది. దీనిప్రకారం పీఎంజీకేవై స్కీమ్ గడువు పూర్తయ్యాక ప్రజలు నల్లధనం వివరాలను వెల్లడించినా.. లేదంటే ఆ తర్వాత ఐటీ శాఖ బయటపెట్టినా.. సదరు నల్లధనంపై 60 శాతం పన్ను విధిస్తారు. ఈ పన్నుపై మరో 25 శాతం సర్‌చార్జి (అంటే 15 శాతం అదనపు పన్ను) ఉంటుంది. మొత్తం కలిపితే 75 శాతం పన్ను విధించనున్నారు. అంతేకాదు ఆదాయ పన్ను (ఐటీ) అసెసింగ్ అధికారి అవసరమైతే ఈ 75 శాతం పన్నుకు అదనంగా మరో 10 శాతం జరిమానాను కూడా విధించేలా చట్ట సవరణ బిల్లులో ప్రతిపాదించారు. అంటే పట్టుకున్న నల్లధనంలో 85 శాతం వరకూ ప్రభుత్వపరం అవుతుందన్నమాట. ప్రస్తుత నిబంధనలూ కొనసాగుతాయ్... ఆదాయాన్ని తక్కువ చేసి చూపించడం (అండర్ రిపోర్టింగ్), లెక్కలు తారుమారు చేయడం (మిస్‌రిపోర్టింగ్) వంటి సందర్భాల్లో ఐటీ శాఖ విధిస్తున్న ప్రస్తుత జరిమానా నిబంధనలు చట్టంలో యథాతథంగా కొనసాగుతాయని కేంద్రం వెల్లడించింది. వీటికి ఎలాంటి సవరణలు చేయడం లేదని తేల్చిచెప్పింది. అండర్ రిపోర్టింగ్‌కు సంబంధిత పన్నుపై 50 శాతం జరిమానా, మిస్ రిపోర్టింగ్‌కు పన్నుపై 200 శాతం జరిమానా ప్రస్తుతం అమల్లో ఉంది. ఇక ప్రస్తుతం కేంద్రం ప్రవేశపెట్టిన పన్ను చట్టాల (రెండో సవరణ) బిల్లు–2016లో ఐటీ చట్టంలోని 115బీబీఈ సెక్షన్‌ను సవరించేందుకు ప్రతిపాదించారు. దీనిప్రకారం వివరాలు వెల్లడించని డిపాజిట్లు, పెట్టుబడులు, నగదు, ఇతరత్రా ఆస్తులపై శిక్షాపూరిత పన్ను, సర్‌చార్జి, జరిమానా విధింపునకు ఈ సవరణలతో ప్రభుత్వానికి వీలవుతుంది. ఇక ఐటీ శాఖ సోదాలు–జప్తులకు సంబంధించిన కేసుల్లో పెనాల్టీ నిబంధనలను కూడా సవరించేందుకు తాజా బిల్లులో ప్రతిపాదనలు చేశారు. దీని ప్రకారం బయటపడిన ఆదాయాన్ని నల్లధనంగా అసెసీ అంగీకరించి.. పన్ను రిటర్నులు వేసి, పన్ను చెల్లించేందుకు ఒప్పుకుంటే ఆ మొత్తంపై జరిమానాను ఇప్పుడున్న 10 శాతం నుంచి 30 శాతానికి పెంచనున్నారు. ఇతర కేసుల విషయంలో ఇప్పుడున్నట్లుగానే 60 శాతం జరిమానా కొనసాగుతుంది. మరో ఐడీఎస్ లాంటిదే.. నల్లధనం వెల్లడికి కేంద్రం ప్రకటించిన స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పథకం(ఐడీఎస్) రెండు నెలల క్రితమే(సెప్టెంబర్ 30తో) ముగిసిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం నల్లధనం ఉన్నవాళ్లు తమ సొమ్మును ఐటీ శాఖకు వెల్లడించి 45 శాతాన్ని పన్ను రూపంలో కట్టేస్తే చట్టబద్ధ నగదుగా మార్చుకోవడానికి వీలు కల్పించింది. ఈ స్కీమ్ కింద దాదాపు దాదాపు రూ.65,250 కోట్ల నల్లధనం బయటికొచ్చినట్లు కేంద్రం ప్రకటించింది. ఇప్పుడు ప్రకటించిన పీఎంజీకేవై స్కీమ్ కూడా ఒకరకంగా ఇలాంటిదే. అయితే, ఇప్పుడు డిపాజిట్ చేసిన మొత్తంలో ఆదాయ వివరాలు లెక్కచెప్పని డబ్బుకు 50 శాతం పన్నును విధించనున్నారు. 25 శాతాన్ని ప్రభుత్వం వద్ద డిపాజిట్ చేయడం(నాలుగేళ్ల లాకిన్) దీనికి అదనం.