న్యూఢిల్లీ: మానిటరీ పాలసి రివ్యూ సమావేశం త్వరలో జరగనున్న నేపథ్యంలో ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తో భేటీ అయ్యారు. అక్టోబర్ 4 న ఆర్‌బీఐ ద్వైమాసిక పరపతి విధాన సమీక్ష జరగనున్న క్రమంలో గురువారం ఆర్థిక మంత్రిని కలిశారు. ఆర్బీఐ గవర్నర్ గా సెప్టెంబర్ 4న పదవీ బాధ్యతలు చేపట్టిన ఊర్జిత్ కు గవర్నర్ గా ఇదే తొలి ద్రవ్య విధాన సమీక్ష . దీంతో రాబోయే ద్రవ్య విధాన సమీక్షపై ఆసక్తి నెలకొంది. అయితే ఈ భేటీపై పటేల్ ఎలాంటి వ్యాఖ్య చేయలేదు.ఆర్ధికవృద్ధి, ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసే లక్ష్యంతో 2015 నుంచి ఇప్పటివరకూ 150 బేసిస్ పాయింట్ల మేర వడ్డీరేట్లను రిజర్వ్ బ్యాంక్ తగ్గించింది. ఈ సారి రివ్యూలో కూడా వడ్డీ రేట్ల కోత వుంటుందనే అంచనాలు నెలకొన్నాయి. కాగా కేంద్ర ప్రభుత్వం గత వారం మానిటరీ పాలసీ కమిటీ సభ్యులు నియామకాన్ని కూడా పూర్తిచేసింది. అయితే తాజా వడ్డీరేట్లను గవర్నర్ నిర్ణయిస్తారా..లేకఎంపీసీ కమిటీ నిర్ణయిస్తారా అనేది ఇంకా స్పష్టత రాలేదు.
మరోవైపు ప్రభుత్వం ఇటీవల కేంద్ర బ్యాంకు అధిపతిగా పదోన్నతి పొందిన ఉర్జిత్ పటేల్ స్థానంలో ఆర్ బీఐ కొత్త డిప్యూటీ గవర్నర్ ఎంపిక కోసం కసరత్తు మొదలు పెట్టింది. ఈ పదవి భర్తీకి ఆర్థిక శాఖ దరఖాస్తులు కోరుతోంది. కనీసం 25 సంవత్సరాలు , 60 సంవత్సరాల గరిష్ట వయస్సు ఉండాలని, ఆసక్తిగల అభ్యర్థులు అక్టోబర్ 21లోపు దరఖాస్తు చేయాలని ఒక ప్రకటనలో తెలిపింది. భారతదేశం ప్రభుత్వం కార్యదర్శి లేదా సమానమైన స్థాయిలో అనుభవం సహా, ప్రభుత్వ పరిపాలనలో పనిచేసిన అనుభవం కలిగి ఉండాలని తెలిపింది. ప్రస్తుతం నలుగురు డిప్యూటీ గవర్నర్లకు గాను , ఆర్. మహాత్మా గాంధీ, ఎస్ ఎస్ ముంద్రా,ఎన్ ఎస్ .విశ్వనాథన్ ముగ్గురు ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్లుగా ఉన్నారు.
జైట్లీ, ఉర్జిత్ పటేల్ భేటీ
Published Thu, Sep 29 2016 8:02 PM | Last Updated on Mon, Sep 4 2017 3:31 PM
Advertisement