వారణాసి: ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కౌన్సిల్ నుంచి కీలక నేతలుయోగేంద్ర యాదవ్, ప్రశాంత్,భూషణ్ తొలగింపు పై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పందించారు. రాజకీయ అపరిపక్వతతో ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయొద్దని ముఖ్యమంత్రి కేజ్రీవాల్కు సలహా ఇచ్చారు. ఎన్నో ఆశలతో ఢిల్లీ ప్రజలు ఆప్ కు అధికారాన్ని అప్పగించారని.. దాని నిలబెట్టుకోవాలన్నారు. ఇదో కొత్త రకం రాజకీయాలంటూ కేజ్రీవాల్ సంభాషణను రికార్డు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. ఇది ఆహ్వానించదగిన పరిణామం కాదన్నారు
ఆమ్ ఆద్మీ పార్టీలో ని కీలకనేతల మధ్య రగిలిన విభేదాలు, బహిరంగ విమర్శలతో పతాక స్థాయికి చేరుకున్నాయి. నేతల మధ్య సయోద్యకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చివరికి శనివారం జరిగిన ఆప్ జాతీయ కౌన్సిల్ సమావేశంలో యోగేంద్ర యాదవ్, ప్రశాంత్,భూషణ్ తదితరులను తొంలగించిన సంగతి తెలిసిందే.